అమలాపాల్‌తో పాడిస్తా
అమలాపాల్ స్వరం చాలా మధురంగా ఉంటుంది. ఆమెలో మంచి గాయని ఉన్నట్లు కనుగొన్నాను. త్వరలోనే అమలాపాల్‌తో పాడిస్తాను’’ అంటున్నారు సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్. హీరోయిన్లు గాయనీమణులుగా మారడం అన్నది ఈ మధ్య పరిపాటి అయిపోయింది. శతిహాసన్, రమ్యానంబీశన్ వంటి హీరోయిన్లు తాము మంచి గాయనీమణులమేనని నిరూపించుకున్నారు. తాజాగా నటి అమలాపాల్ ఈ కోవకు చేరనున్నారు. ఈ మాటను సంగీత దర్శకుడు అనిరుధ్ చెప్పడం విశేషం. దీనిపై ఆయన మాట్లాడుతూ, అమలాపాల్ స్వరంలో చక్కని లయ ఉందన్నారు. ఆమె చక్కగా పాడగలదని చెప్పారు. త్వరలో ఆమెకు గాయని అవకాశం ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న వేలై ఇల్లాద పట్టాదారి చిత్రంలో ఒక్క గాయని వాయిస్ ఉండడంతో ఆమెకు పాడే అవకాశం లేదని త్వరలోనే మరో చిత్రంలో అమలపాల్‌తో తప్పకుండా పాడిస్తానని అనిరుధ్ అంటున్నారు.