Anirudh
-
ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులు
-
ఎమ్మెల్యేల రహస్య భేటీ.. అనిరుథ్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల రహస్య భేటీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్‌రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే భేటీ.. రహస్య భేటీ కాదంటూ వ్యాఖ్యానించారు. ‘‘కోహినూర్ హోటల్లో లంచ్ చేశాం. తాను ఏ ఫైల్ కూడా మంత్రుల దగ్గరకు తీసుకెళ్లలేదని అనిరుథ్ స్పష్టం చేశారు. ‘‘నా నియోజకవర్గ సమస్యలపై సమావేశంలో మాట్లాడా. బీఆర్ఎస్ హయాంలో భూముల ఆక్రమణకు గురయ్యాయి. భూముల అన్యాకాంతంపై విచారణ చేయాలని కోరా. భూముల అన్యాక్రాంతం ఎవరూ చేశారో విచారణలో తేలుతుంది’’ అని అనిరుథ్ వ్యాఖ్యానించారు.తెలంగాణలో ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సీరియస్ అయ్యారు. సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని.. మ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందంటూ మున్షీ వ్యాఖ్యానించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటూ మున్షీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కులగణన, ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో చేసినా, అనుకున్న స్థాయిలో ప్రచారం చేయడం లేదన్న మున్షీ.. పార్టీ అంతర్గత విషయాలు బహిరంగ వేదికలపై మాట్లాడితే చర్యలు తప్పవన్నారు.ఇదీ చదవండి: దీపాదాస్ మున్షీ సీరియస్.. ఎమ్మెల్యేలకు వార్నింగ్ -
విడాముయర్చి పై చాలా ఆశలే పెట్టుకున్న కోలీవుడ్
-
క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–చార్లెస్ బ్రూమ్ (బ్రిటన్) ద్వయం 6–4, 6–3తో హేడెన్ జోన్స్–పావ్లె మారిన్‌కోవ్ (ఆ్రస్టేలియా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు ఫ్రాన్స్‌లో జరుగుతున్న మాంట్పెలియర్ ఏటీపీ–250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి జంట 7–5, 3–6, 10–8తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ) ద్వయంపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ (భారత్) జోడీ 1–6, 5–7తో ఫ్లావియో కొ»ొల్లి (ఇటలీ)–జొనాథన్ ఎసెరిక్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. సహజ, రషి్మక ఓటమి పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి, భారతమూడో ర్యాంకర్, తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రషి్మక పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో సహజ 4–6, 3–6తో టాప్ సీడ్ లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్) చేతిలో... రషి్మక 6–7 (2/7), 2/6)తో మూడో సీడ్ పన్నా ఉడ్వార్డి (హంగేరి) చేతిలో ఓడిపోయారు. -
పెళ్లికి వేళాయె
హీరోయిన్ కీర్తీ సురేష్ పెళ్లి పీటలు ఎక్కే సమయం ఆసన్నమైందట. తన స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తటిల్‌ను ఆమె పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కీర్తీ సురేష్ తండ్రి, నిర్మాత జి. సురేష్ కుమార్ ఓ మలయాళ మీడియాతో మాట్లాడుతూ– ‘‘కీర్తీకి 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఆంటోని తటిల్తోనే వివాహం జరగబోతోంది.గోవాలో ఈ పెళ్లి జరుగుతుంది’’ అని పేర్కొన్నారాయన. కాగా ఆంటోని తటిల్–కీర్తీలది డెస్టినేషన్ వెడ్డింగ్ అట. గోవాలోని ఓ రిసార్ట్‌లో డిసెంబరు 11 లేదా 12న వీరి వివాహం జరగనుందని టాక్. వివాహ వేడుకలను గోవాతో పాటు కేరళలోనూ జరిపేలా ΄్లాన్ చేశారనే వార్త కూడా వినిపిస్తోంది. ఇక ఆంటోని తటిల్ విషయానికొస్తే... ఆయన కేరళకు చెందిన వ్యాపారవేత్త. -
సాకేత్ జంట సంచలనం
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సంచలన విజయంతో బోణీ చేసింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.తొలి రౌండ్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ క్రిస్టియన్ రోడ్రిగెజ్ (కొలంబియా)– రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీని కంగుతినిపించింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జంట ఐదు ఏస్‌లు సంధించింది. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.అనిరుధ్ జోడీ ముందంజ ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచాతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో మూడో సీడ్ అనిరుధ్–నిక్కీ ద్వయం 6–3, 7–5తో ఎస్కోఫియర్–బెనోట్ పెయిర్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో దివిజ్ శరణ్ (భారత్)–ఇసారో (థాయ్‌లాండ్) జంట 3–6, 5–7తో మొరెనో (అమెరికా)–రూబిన్ స్థాతమ్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది.రిత్విక్ ద్వయం ముందంజసాక్షి, హైదరాబాద్: స్లొవాక్ ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ ముందంజ వేసింది. స్లొవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–4, 6–4తో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ ఈ మ్యాచ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచింది. తొలి సెట్లో ఒకసారి, రెండో సెట్లో ఒకసారి ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీ కూడా డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–గిడో ఆండ్రెజి (అర్జెంటీనా) ద్వయం 6–3, 6–7 (2/7), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–మాట్వీ మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది.క్వార్టర్ ఫైనల్లో రష్మిక జోడీసాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రష్మిక... డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.ప్రపంచ 422వ ర్యాంకర్ గాబ్రియేలా డ సిల్వా ఫిక్ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 300వ ర్యాంకర్ రష్మిక 5–7, 3–6తో ఓడిపోయింది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జోడీ 7–6 (7/3), 6–4తో మూడో సీడ్ లీ యు యున్ (చైనీస్ తైపీ)–నీనా వర్గోవా (స్లొవేకియా) జంటపై సంచలన విజయం సాధించింది. -
'దేవర' ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం
'దేవర' మూవీ ఇంకా థియేటర్లలో ధనాధన్ లాడిస్తూనే ఉంది. ఇప్పటికే రూ.450 కోట్ల మార్క్ దాటేసింది. దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి రూ.500 కోట్లు సులభంగా దాటేస్తుంది. ఇదంతా పక్కనబెడితే తారక్ ఫ్యాన్స్ ఇప్పుడు మరోసారి తెగ బాధపడిపోతున్నారు. దీనికి అనిరుధ్ కారణం. ఎందుకంటే?(ఇదీ చదవండి: సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక)లెక్క ప్రకారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి. కానీ ఊహించిన దాని కంటే ఎక్కువమంది వచ్చేసరికి విధ్వంసం జరిగింది. కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు. సరే అదలా పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం రజినీకాంత్ 'వేట్టయన్' ఆడియో లాంచ్ జరిగింది. ఇప్పటికే సూపర్ అయిపోయిన 'మనసిలాయో' పాటకు అనిరుధ్ అదిరిపోయే లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.గతంలో 'హుకుం' సాంగ్‌కి స్టేడియంలో జనాలు ఎలా ఊగిపోయారో.. ఇప్పుడు 'మనసిలాయో'కి కూడా అదే సీన్ రిపీటైంది. తాజాగా ఈ ఫెర్ఫార్మెన్స్ వీడియోని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. అయ్యో ఇలాంటి ఫెర్ఫార్మెన్స్ మిస్ అయిపోయామే అని అనుకుంటున్నారు. ఈవెంట్ సంగతి ఏమైనా సరే 'ఫియర్' సాంగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దెబ్బకు థియేటర్లలో ఆల్రెడీ టాప్ లేచిపోయిందిగా అని సంతృప్తి పడుతున్నారు.(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా) -
అనిరుధ్‌కు రెండో టైటిల్
విలేనా (స్పెయిన్): హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఈ ఏడాది తన ఖాతాలో రెండో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. స్పెయిన్‌లో జరిగిన విలేనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోరీ్నలో భారత్‌కే చెందిన నిక్కీ కలియంద పునాచాతో కలిసి అనిరుధ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అనిరు«ద్–నిక్కీ ద్వయం 7–6 (7/2), 6–4తో రొమైన్ అర్నియోదో (మొనాకో)–ఇనిగో సెర్వాంటెస్ (స్పెయిన్) జోడీపై గెలిచింది. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరు«ద్–నిక్కీ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. టైటిల్ గెలిచే క్రమంలో భారత జంట ఈ టోర్నీలో ఒక్క సెట్ మాత్రమే కోల్పోయింది. అనిరుధ్–నిక్కీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 26 ఏళ్ల అనిరుధ్ ఈ ఏడాది మనాకోర్ ఓపెన్, ఓల్‌రాస్ ఓపెన్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి... ఓల్‌రాస్ ఓపెన్, విలేనా ఓపెన్లలో టైటిల్స్ సాధించాడు. -
టైటిల్ పోరుకు అనిరుధ్ జోడీ
విలేనా (స్పెయిన్): హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఈ ఏడాది నాలుగో ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన విలేనా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీ సెమీఫైనల్లో అనిరుద్–నిక్కీ కలియంద పునాచా (భారత్) ద్వయం 6–3, 7–6 (7/5)తో సెజార్ క్రెటు (రొమేనియా)–వాలెంటిన్ రోయర్ (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరు«ద్–నిక్కీ ఐదు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సరీ్వస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశారు. 26 ఏళ్ల అనిరుధ్ ఈ ఏడాది మనాకోర్ ఓపెన్, ఓల్‌రాస్ ఓపెన్, క్వింపెర్ ఓపెన్ టోరీ్నలలో ఫైనల్‌కు చేరాడు. ఓల్‌రాస్ ఓపెన్‌లో టైటిల్ సాధించి, మిగితా రెండు టోరీ్నల్లో రన్నరప్‌గా నిలిచాడు. -
సెమీస్‌లో అనిరుధ్ జోడీ
రఫా నాదల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్ర శేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. స్పెయిన్‌లోని మనాకోర్ పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ (భారత్)–డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) ద్వయం 6–4, 6–7 (4/7), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రుడాల్ఫ్ మొలెకర్ (జర్మనీ)–జెరోమ్ కిమ్ (స్విట్జర్లాండ్) జోడీపై గెలిచింది. -
Hyderabad: ధూమ్ ధామ్ దోస్తాన్..!
సాక్షి, సిటీబ్యూరో: మల్లారెడ్డి మహిళా కళాశాల వేదికగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్లు సందడి చేశారు. ఈ నెల ఫ్రెండ్షిప్ డే నేపథ్యంలో బుధవారం నిర్వహించిన వేడుకల్లో యువగాయకులు తమ స్వరాలతో అలరించారు. ధూమ్ ధామ్ దోస్తాన్ విత్ యువర్ ఐడల్స్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సింగర్లు అనిరుధ్, కేశవ్, కీర్తన–కీర్తి, నజీర్ పాటలతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ కన్సర్ట్ను తలపించిన ఈ కార్యక్రమం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్లతో సెల్ఫీలతో ఆహ్లాదంగా సాగింది. -
సెమీస్‌లో అనిరుద్–అర్జున్ ద్వయం
న్యూపోర్ట్ (అమెరికా): హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో అనిరు«ద్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–4, 1–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో క్రిస్టియన్ హారిసన్–వాసిల్ కిర్కోవ్ (అమెరికా) జంటపై గెలిచింది. -
టాప్ సీడ్ జోడీని ఓడించిన అనిరుధ్–అర్జున్ ద్వయం
హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో అనిరుద్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 3–6, 10–7తో టాప్ సీడ్, 28వ ర్యాంక్ జోడీ లామోన్స్ –విత్రో (అమెరికా)ను బోల్తా కొట్టించింది. ప్రస్తుతం అనిరుధ్ 128వ ర్యాంక్‌లో, అర్జున్ 111వ ర్యాంక్‌లో ఉన్నారు. -
సెమీస్‌లో అనిరుధ్, రిత్విక్ జోడీలు
అకాపుల్కో (మెక్సికో): జీఎన్‌పీ సెగురోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్లు అనిరుధ్ చంద్రశేఖర్, బొల్లిపల్లి రి త్విక్ చౌదరీ సంచలనం సృష్టించారు. అనిరుధ్ (భారత్)–హాన్స్ హచ్ వెర్డొగో (మెక్సికో)... రిత్విక్–నిక్కీ పునాచా (భారత్) జోడీలు సీడెడ్ జంటలను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో రి త్విక్–నిక్కీ జంట 6–4, 6–1తో రెండో సీడ్ పీటర్ మటుస్‌జెవ్‌స్కీ (పోలాండ్)–మాథ్యూ క్రిస్టోఫర్ రొమియోస్ (ఆ్రస్టేలియా) జోడీని ఓడించగా... అనిరుధ్–వెర్డొగో ద్వయం 3–6, 6–4, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ రింకీ హిజికాటా (ఆ్రస్టేలియా)–మ్యాక్ కిగెర్ (అమెరికా) జంటకు షాక్ ఇచ్చింది. -
క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ జోడీ
జీఎన్‌పీ సెగురోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ శుభారంభం చేశాడు. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి రౌండ్లో అనిరుధ్ (భారత్)–హాన్స్ హచ్ వెర్డొగో (మెక్సికో) ద్వయం 4–6, 6–4, 11–9తో చార్లెస్ బ్రూమ్ (బ్రిటన్)–ఆడమ్ వాల్టన్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జంట తమ సర్విస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో అనిరుధ్ జోడీ పైచేయి సాధించింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జీవన్ నెడున్‌జెళియన్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 3–6, 6–3, 7–10తో ఆంటోని బెలిర్ (స్విట్జర్లాండ్)–లుకా సాంచెజ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్ ఫైనల్లో అనిరుద్–విజయ్ జోడీ
యూఎస్ క్లే కోర్టు చాంపియన్íÙప్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్ డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. హ్యూస్టన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) ద్వయం 6–3, 6–4తో మైకేల్ మో–ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా) జంటను ఓడించింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్ జోడీ మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. -
అనిరుద్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక లాస్ వేగస్ షూట్ అంతర్జాతీయ ఆర్చరీ టోర్నమెంట్లో భారత సంతతి కుర్రాడు పింజల అనిరుధ్ కల్యాణ్ రజత పతకంతో మెరిశాడు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ ప్రాంతానికి చెందిన అనిరుధ్ కుటుంబం అమెరికాలో నివసిస్తోంది. లాస్ వేగస్‌లో రెండు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన అనిరుధ్ రికర్వ్ కబ్ కేటగిరీ లో పోటీపడి రెండో స్థానంలో నిలిచాడు. అనిరుధ్ మొత్తం 547 పాయింట్లు స్కోరు చేసి రజతం నెగ్గాడు. ఇదే టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్టార్ వెన్నం జ్యోతి సురేఖ 898 పాయింట్లతో పదో ర్యాంక్‌లో నిలిచింది. -
స్పీడ్ పెంచిన దేవీశ్రీ..దేనికో తెలుసా.!
-
అనిరుధ్ ని లాక్ చేసిన బన్నీ..
-
అనిరుధ్ సంగీతంపై బాలీవుడ్ కంప్లైంట్
-
ఈయన జీతం రోజుకు రూ. 72 లక్షలు కంటే ఎక్కువ!
ఇప్పటివరకు మనం గతంలో చాలా మంది సక్సెస్ పీపుల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ కథనంలో కంప్యూటర్ సైన్స్ రంగంలో విశిష్టమైన పేరు, తన అద్భుతమైన విజయాల కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'అనిరుధ్ దేవగన్' (Anirudh Devgan) గురించి తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, అనిరుధ్ దేవగన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ పూర్వ విద్యార్ధి. ఈయన ప్రస్తుతం ప్రముఖ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ ప్రెసిడెంట్, సీఈఓ అండ్ బోర్డు మెంబర్‌గా పనిచేస్తున్నారు. స్ఫూర్తిదాయకమైన అనిరుధ్ అసాధారణ విజయాలు అతని దూరదృష్టి గల నాయకత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి. ప్రఖ్యాత సంస్థను నడిపిస్తూ.. తన రంగంలో అసమానమైన విజయాలతో చెరగని ముద్ర వేసి, అతని అనుభవం, గొప్ప నైపుణ్యంతో పాటు కంపెనీ పథాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. ఇదే అతని వ్యక్తిగత వృద్ధిని ప్రోత్సహించింది. చివరికి అతని డొమైన్లో అతనిని ప్రముఖ వ్యక్తిగా మార్చింది. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. ఆ రంగాల్లో 50వేల కొత్త ఉద్యోగాలు! నిజానికి 2012లో అనిరుధ్ దేవగన్ కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్‌లో చేరి అనేక స్థానాల్లో పనిచేశాడు. కాగా 2017లో చివరకు కంపెనీ ప్రెసిడెంట్ అయ్యాడు. 2021లో అతనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో స్థానం లభించింది. ఆ తరువాత సీఈఓ అయ్యాడు. అనిరుధ్ ఢిల్లీలో పుట్టి పెరిగినప్పటికీ అమెరికాలోని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో MS & PhD పూర్తి చేశాడు. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! కొన్ని నివేదికల ప్రకారం, 2022లో కాడెన్స్ సీఈఓ అయిన అనిరుధ్ దేవగన్ వార్షిక వేతనం రూ. 2,201 కోట్లు (సుమారు $264 మిలియన్లు) అని తెలుస్తోంది. ఈయన జీతం రోజుకి రూ.72 లక్షల కంటే ఎక్కువ అని చెబుతారు. దీంతో ఎక్కువ వేతనం తీసుకుంటున్న అమెరికన్ సీఈఓల జాబితాలో ఈయన కూడా ఒకరుగా ఉండటం గమనార్హం. -
'జవాన్' మొదటి పాట రిలీజ్.. దీనికి పెట్టిన ఖర్చుతో సినిమానే తీయవచ్చు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'జవాన్'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ 'జిందా బందా' తెలుగులో 'దుమ్ము దులిపేలా'ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పాటకోసం హైదరాబాద్,చెన్నై, బెంగళూరు, ముంబయి నుంచి వెయ్యికి మందికి పైగా మహిళ డ్యాన్సర్లన రప్పించి షూట్ చేశారు. వీరందరితో పాటు సన్యా మల్హోత్రా, ప్రియమణిలతో షారుఖ్ వేసిన స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవుతారు. ఇందులో ఆయన చాలా యంగ్ లుక్‌లో కనిపించారు. (ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?) ఈ పాటను ఐదు రోజుల పాటు చిత్రీకరించగా అందుకు అయిన ఖర్చు సుమారుగా రూ.15 కోట్లు అని సమాచారం. ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ పాడితే.. నృత్య దర్శకుడు శోభి వారందరితో అదిరిపోయే స్టెప్పులు వేయించారు. ఈ పాటకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. -
టాప్–100లోకి అనిరుధ్
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో అనిరుధ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి సరిగ్గా 100వ ర్యాంక్‌లో నిలిచాడు. గతవారం అమెరికాలో జరిగిన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)తో కలిసి ఆడిన అనిరుధ్ డబుల్స్‌లో సెమీఫైనల్ చేరుకోవడంతో అతని ర్యాంక్ మెరుగైంది. వెటరన్ రోహన్ బోపన్న ఒక స్థానం పడిపోయి ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా... యూకీ బాంబ్రీ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 60వ ర్యాంక్‌లో, సాకేత్ మైనేని నాలుగు స్థానాలు పురోగతి సాధించి 77వ ర్యాంక్‌లో నిలిచారు. జీవన్ నెడుంజెళియన్ 91వ ర్యాంక్‌లో, శ్రీరామ్ బాలాజీ 94వ ర్యాంక్‌లో ఉన్నారు. మరోవైపు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సుమిత్ నగాల్ ఏకంగా 53 స్థానాలు ఎగబాకి 178వ ర్యాంక్‌లో నిలిచాడు. -
తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ స్వీప్
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలో బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆ రాష్ట్ర ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ములేపారు. అటు ఇంజనీరింగ్ విభాగంలోనూ, ఇటు మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగంలోనూ టాప్ ర్యాంకులు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో సనపల అనిరుధ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్ తెలంగాణ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులతో భళా అనిపించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2, 3, 5, 6, 8, 9, 10 ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలోనూ 2, 4, 5, 7, 8 ర్యాంకులు ఎగరేసుకుపోయారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా ఇంజనీరింగ్ ర్యాంకర్లందరూ ఐఐటీల్లో చేరతామని, మెడికల్ విభాగం ర్యాంకర్లంతా వైద్య వృత్తిలో స్థిరపడతామని వెల్లడించారు. విజేతల అభిప్రాయాలు వైద్య రంగంలో ఉన్నతవిద్యనభ్యసిస్తా.. మాది చీరాల. నాన్న నాసిక సుధాకర్‌బాబు, అమ్మ శ్రీదేవి మగ్గం నేస్తారు. విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మిడియెట్ చదివాను. వైద్య రంగంలో ఉన్నత విద్యనభ్యసించడమే నా లక్ష్యం. – నాసిక వెంకటతేజ, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కార్డియాలజిస్ట్ లేదా న్యూరాలజిస్టునవుతా.. మాది తెనాలి. నాకు ఇంటర్ బైపీసీలో 983 మార్కులు వచ్చాయి. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికే నీట్ రాశాను. ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా స్థిరపడాలనేదే నా కోరిక. – దుర్గెంపూడి కార్తికేయరెడ్డి, నాలుగో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) వైద్య రంగంలో స్థిరపడతా.. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాకు నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా కోరిక. – బోర వరుణ్ చక్రవర్తి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) మంచి వైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తా.. మాది నెల్లూరు. అమ్మానాన్న హారతి, శంకర్ వైద్యులుగా పనిచేస్తున్నారు. మంచి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదవడమే నా లక్ష్యం. – హర్షల్సాయి, ఏడో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కష్టపడి చదివా.. మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో ఎనిమిదో ర్యాంక్ సాధించాను. – సాయి చిది్వలాస్రెడ్డి, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కంప్యూటర్స్ సైన్స్ చదువుతా.. మాది గుంటూరు. నాన్న శ్రీనివాసరెడ్డి రైతు. ఇంటర్ ఎంపీసీలో 971 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం. – యక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యం మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఇంటర్మిడియెట్ ఎంపీసీలో 983 మార్కులు సాధించాను. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఓపెన్ కేటగిరీలో 263వ ర్యాంక్ వచ్చింది. వచ్చే నెలలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఇందులో మంచి ర్యాంక్ సాధించడమే నా లక్ష్యం. – చల్లా ఉమేష్ వరుణ్, థర్డ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) సివిల్స్ సాధించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 97వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. తర్వాత సివిల్స్ రాసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. – పొన్నతోట ప్రమోద్ కుమార్‌రెడ్డి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో చేరతా.. మాది విశాఖపట్నం జిల్లా గాజువాక. నాన్న బిజినెస్‌లో ఉండగా అమ్మ ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 110వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. – మరడాన ధీరజ్ కుమార్, ఆరో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా.. మాది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. నాన్న గణేష్ వ్యాపారి, అమ్మ జ్యోతి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 729వ ర్యాంక్ సాధించాను. వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌లో చేరాలనేదే నా లక్ష్యం. – బోయిన సంజన, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) కంప్యూటర్ ఇంజనీర్‌నవుతా.. మాది నంద్యాల. ఇంటర్ ఎంపీసీలో 956 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంకు సాధించి మంచి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. కంప్యూటర్ ఇంజనీర్‌ను కావడమే లక్ష్యం. – ప్రిన్స్ బ్రన్హంరెడ్డి, తొమ్మిదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) అడ్వాన్స్‌లోనూ ర్యాంక్ సాధిస్తా.. మాది విజయనగరం జిల్లా గుర్ల. నాన్న అప్పలనాయుడు రైల్వే కానిస్టేబుల్, అమ్మ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్‌లో 99 శాతం పర్సంటైల్ సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. – మీసాల ప్రణతి శ్రీజ, పదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) -
ఎన్టీఆర్ తర్వాత విజయ్ దేవరకొండ..!
-
వాస్తవ ఘటనలతో...
అనిరుధ్, యశస్విని జంటగా భిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో చంద్రకళ పందిరి నిర్మించిన చిత్రం ‘యాద్గిరి అండ్ సన్స్’. మే 5న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ‘భీమ్లా నాయక్’ చిత్రదర్శకుడు సాగర్ కె. చంద్ర ట్రైలర్‌ని ఆవిష్కరించారు. అనంతరం సాగర్ కె. చంద్ర మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ కొత్తగా ఉండటంతో దర్శకుడిని కథ అడిగాను. వాస్తవ ఘటనలతో మంచి ప్రయత్నం చేశారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి’’ అన్నారు. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా’’ అన్నారు అనిరుధ్. ‘‘యాద్గిరి అండ్ సన్స్’ ఇంటెలిజెంట్ మూవీ. చాలా సిన్సియర్‌గా మ్యూజిక్ చేశాను’’ అన్నారు విజయ్ కురాకుల. ‘‘ప్రేక్షకులకు మంచి సినిమా ఇస్తున్నాం. చూసి, నచ్చితే మరో పది మందికి చెప్పి, సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు భిక్షపతి రాజు. -
కాంగ్రెస్‌లో ముసలం: ‘కోమటిరెడ్డి’ బాటలోనే అనిరుధ్‌రెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కాంగ్రెస్‌లో ముసలం మొదలైనట్లు తెలుస్తోంది. ‘నేర చరిత్ర కలిగిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌తో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేను.. ఆయనతో కలిసి వేదికను పంచుకోలేను’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు గురువారం జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ రాయడం కలకలం సృష్టించింది. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సొంత పార్టీ నాయకులు విమర్శలు గుప్పించడం.. దీటుగా ఆయన స్పందించడం.. ఆ తర్వాత పార్టీలో క్రమక్రమంగా అసమ్మతి సెగలు రాజుకోవడం వంటి తదితర పరిణామాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీ దూకుడు పెంచడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి విధేయుడిగా ఉన్న అనిరుధ్‌రెడ్డి లేఖ సంధించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఏడాదికిపైగా అనిశ్చితి.. మాజీ ఎమ్మెల్యే మరాఠి చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ గతేడాది జూలైలో బీజేపీని వీడారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన క్రమంలో ఆయనను కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జడ్చర్ల కాంగ్రెస్‌లో విభేదాలు గుప్పుమన్నాయి. నేరచరిత్ర కలిగిన ఎర్రశేఖర్‌ను పార్టీకి ఎలా చేర్చుకుంటారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధిష్టానానికి అప్పట్లో లేఖ రాయడంతో దుమారం చెలరేగింది. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో గతేడాది అక్టోబర్ 12న జరిగిన బహిరంగసభలో రేవంత్ సమక్షంలో చేరాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది. చదవండి: (మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్) అనంతర కాలంలో శేఖర్‌పై ఉన్న కేసును కోర్టు కొట్టివేయడంతో కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైంది. ఈ ఏడాది జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో రేవంత్‌రెడ్డి తదితర నేతల సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత అటు అనిరుధ్‌రెడ్డి, ఇటు ఎర్రశేఖర్ వేర్వేరుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపట్టిన దీక్షలో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క గత నెల 22న మహబూబ్‌నగర్‌కు వచ్చినప్పుడు ఆ ఇద్దరు వేర్వేరుగానే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా సుమారు ఏడాదికి పైగా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. సయోధ్య కుదిరినట్లేనని భావించినా.. తొలి నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు కోమటిరెడ్డి ద్వారా ఎర్రశేఖర్ రాకను అనిరుధ్‌రెడ్డి అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత కాలంలో రెండు నెలల క్రితం అమెరికాలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) సభలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో పాటు అనిరుధ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య చర్చలు జరిగాయని.. సయోధ్య కుదిరినట్లేనని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో తాజాగా అనిరుధ్‌రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాయడంతో మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. చదవండి: (కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు?) టీడీపీ వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నారంటూ.. ‘పార్టీకి ఎవరూ అండగా లేని రోజుల్లో తాను శ్రమించానని.. కాంగ్రెస్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీలోకి దించి గెలిపించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించానని.. కానీ తన అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎర్రశేఖర్‌ను పార్టీలోకి తీసుకున్నారు.’ అని లేఖలో అనిరుధ్‌రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చే వాళ్లకు ప్రాభవం లేకున్నా ప్రాధాన్యం ఇస్తున్నారని.. సీత దయాకర్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరుతున్నారని.. మొదటి నుంచి ఉన్న మాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సమంజసం కాదని.. తాను స్థానికుడిని అని ఏదిఏమైనా కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడుతానని, పార్టీ టికెట్ రాకున్నా పోటీలో ఉంటానని’ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘కోమటిరెడ్డి’ బాటలోనే అనిరుధ్‌రెడ్డి నడుస్తారా అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అనిరుధ్‌రెడ్డి లేఖపై కాంగ్రెస్‌లోని పలువురు నేతలు మండిపడుతున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి బంగ్ల రవి, ఎంపీటీసీల సంఘం నాయకుడు రాంచంద్రయ్య, నాయకులు రాజేశ్ తదితరులు నవాబ్‌పేటలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన తీరును ఖండించారు. అనతి కాలంలోనే ప్రజలకు చేరువ కావడంతోనే జీర్ణించుకోక ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరింతగా భగ్గుమనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మరో హుజురాబాద్ అవుతుంది.. రేవంత్‌కు హస్తం నేత స్వీట్ వార్నింగ్
సాక్షి, జడ్చర్ల: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జిల్లాలో నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. జడ్చర్ల ఇంచార్జ్ అనిరుధ్.. మాణిక్యం ఠాగూర్‌కు ఘాటుగా లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని అనిరుధ్ రెడ్డి వ్యతిరేకించారు. ఆయన చేరికపై అనిరుధ్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సొంత తమ్ముడినే హత్య చేసిన వ్యక్తి ఎర్ర శేఖర్ అనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. 9 మర్డర్ కేసుల్లో సంబంధం ఉన్న ఎర్రశేఖర్‌తో స్టేజ్ పంచుకోలేను. కోమటిరెడ్డి అనుచరుడిని కాబట్టే నన్ను డిస్టర్జ్ చేస్తున్నారు. నేను ఇక్కడ పోటీలో ఉంటే అది కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుంది. లేదంటే మరో హుజురాబాద్ అవుతుందని ఘాటుగా స్పందించారు. టీడీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు నన్ను పనులు చేసుకోకుండా అడ్డుకుంటున్నారు. నా కేడర్ వారికి తగిన బుద్ది చెబుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. కాగా, బుధవారం జరిగిన సమీక్షా సమావేశం మధ్యలోనే మహేశ్వర్ రెడ్డి వెళ్లిపోయారు. దీంతో ఏఐసీసీ సెక్రటరీ జావిద్.. మహేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో, మహేశ్వర్ రెడ్డి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: మర్రి శశిధర్ రెడ్డికి కౌంటర్ -
బాబాయ్, అబ్బాయ్ సినిమాలకు అనిరుథ్ సంగీతం
అనిరుథ్.. పదేళ్ల కెరీర్ లో 25 చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. వీటిల్లో మూడు తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి. అజ్ఞాతవాసి ,జెర్సీ,గ్యాంగ్ లీడర్ ఈ మూడు తెలుగు చిత్రాలకు అనిరుథ్ వర్క్ చేశాడు. ఆ తర్వాత మాత్రం పూర్తిగా కోలీవుడ్ కు షిప్ట్ అయ్యాడు. అయితే అనిరుథ్ అక్కడ ట్యూన్ కడితే ఇక్కడ ఫ్యాన్స్ కాలు కదుపుతున్నారు. అతని బీట్స్ టాలీవుడ్ గల్లీలో సైతం రీసౌండ్ చేస్తున్నాయి.అందుకే టీటౌన్ నుంచి అనిరుథ్ కు ఆఫర్స్ వెళ్తున్నాయి. టాలీవుడ్ కు తిరిగి తీసుకువచ్చేందుకు మన దర్శకులు అతనితో చర్చలు జరుపుతున్నారు. కొరటాల శివ మేకింగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించే చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడని టాలీవుడ్ లో కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అది నిజం కావాలని టాలీవుడ్ అనిరుథ్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించే చిత్రానికి కూడా అనినే మ్యూజిక్ అందించబోతున్నాడట.మొత్తంగా బాబాయ్, అబ్బాయ్ సినిమాలకు అనిరుథ్ సంగీతం అందిస్తే నందమూరి అభిమానులకు అంతకంటే ఏంకావాలి. -
తమన్ వర్సెస్ అనిరుథ్
-
అడగ్గానే అనిరుధ్ పాడేందుకు ఒప్పుకున్నాడు
ప్రైవేట్ వీడియో ఆల్బమ్స్‌కు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి మంచి హుషారైన ఐత్తలక్కా అనే పల్లవితో సాగే వీడియో ఆల్బమ్ సంగీత ప్రియులను అలరించడానికి సిద్ధం అవుతోంది. గణేశ్ చంద్రశేఖరన్ సంగీతాన్ని అందించిన ఈ ఆల్బమ్ కోసం యువ సంగీత దర్శకుడు అనిరుధ్ పాడటం విశేషం. ఈ వీడియో ఫస్ట్‌లుక్ పోస్టర్ యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు గణేశ్ చంద్రశేఖరన్ పేర్కొంటూ ఐత్తలక్కా వీడియో ఆల్బమ్ హుషారుగా సాగే పార్టీ ఐటమ్ సాంగ్‌గా ఉంటుందని చెప్పారు. తాను అడగ్గానే అంగీకరించిన అనిరుధ్ తానే తన స్టూడియోలో పాడిన డెమోను తనకు పంపి ఆశ్చర్యపరిచారన్నారు. రాజా గురుస్వామి రాశారని, దీనికి మాయోన్ ఛాయాగ్రహణం అందించారు. బిగ్‌బాస్ ఫేమ్ దర్శన్‌తో పాటు తానూ నటించిన ఈ ఆల్బమ్‌కు శ్రీధర్ నృత్య దర్శకత్వం వహించారని, దర్శకుడు యోగేశ్వరన్ సన్నివేశాలను మెరుగు పరిచారని తెలిపారు. -
ఆరేళ్లకే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్టు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనిరుధ్
-
‘ఆర్ఆర్ఆర్’లో ప్రభాస్, రానా?
RRR Movie: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్) చిత్రం కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట కోసం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్ వేశారట. ఈ పాటలో ప్రభాస్, రానా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆగస్ట్ 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ పాటను విడుదల చేయాలనుకుంటున్నారని టాక్. ఇదిలావుంటే ప్రభాస్ ఇటలీ వెళ్లొచ్చాడు. ఎందుకు? హాలిడే ట్రిప్పా? ‘రాధేశ్యామ్’ షూటింగ్ కోసమా? ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న చర్చల్లో ఇదో హాట్ టాపిక్. కొన్ని రోజులుగా ఇటలీలో ఉన్న ప్రభాస్ ఇండియా చేరుకున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బయటకు వస్తున్నప్పుడు కొన్ని కెమెరాలు క్లిక్‌మన్నాయి. ఇక ప్రభాస్ ఇటలీ ఎందుకు వెళ్లారనే విషయాన్ని పక్కనపెడితే, ఈ 23 నుంచి ‘రాధేశ్యామ్’తో బిజీ అవుతారని తెలిసింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 23న హైదరాబాద్‌లో ఆరంభమై, ఆగస్టు 5 వరకు జరుగుతుందని తెలిసింది. -
నాలుగు రోజుల్లోనే మారిన కోచ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్వాన్న పనితీరుకు మరో నిదర్శనం! దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం హెచ్‌సీఏ శనివారం 20 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే గత మంగళవారమే జట్టు కోచ్‌గా రంజీ మాజీ ప్లేయర్ అనిరుధ్ సింగ్‌ను ఎంపిక చేసిన హెచ్‌సీఏ ఇంతలోనే అతడిని తొలగించింది. అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న జాకీర్ హుస్సేన్‌ను కొత్త కోచ్‌గా ప్రకటించింది. టీమ్‌ను ఎంపిక చేసే క్రమంలో హెచ్‌సీఏ నిర్వహిస్తున్న అంతర్గత టోర్నీ మ్యాచ్‌లకు అనిరుధ్ హాజరయ్యాడు కూడా. కానీ హెచ్‌సీఏ పెద్దల ప్రాధాన్యాలు మారిపోయాయి. అనిరుధ్ కోచ్‌గా పనికి రాడంటూ అతడిని పక్కన పెట్టేశారు. జట్టు ఎంపికలో తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయడమే కోచ్‌గా అనిరుధ్ చేసిన తప్పని తెలుస్తోంది! గత సీజన్లో కూడా అండర్–19 కోచ్‌గా వ్యవహరించిన అనిరుధ్‌ను సీజన్ మధ్యలోనే తప్పించింది. మరోవైపు కెప్టెన్‌గా మళ్లీ తన్మయ్ అగర్వాల్‌నే హెచ్‌సీఏ నియమించింది. గత రంజీ ట్రోఫీ సీజన్లో అతని సారథ్యంలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లు చిత్తుగా ఓడినా ‘తమవాడు’ కాబట్టి మరోసారి కెప్టెన్సీని అప్పగించింది. జట్టు వివరాలు: తన్మయ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అభిరథ్ రెడ్డి, హిమాలయ్, సందీప్, రాహుల్ బుద్ధి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, సుమంత్, మిలింద్, టి.రవితేజ, అజయ్‌దేవ్ గౌడ్, యుధ్వీర్ సింగ్, తనయ్ త్యాగరాజన్, మికిల్ జైస్వాల్, హితేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్, ప్రతీక్ రెడ్డి, రక్షణ్, కార్తికేయ, ఎంఎస్ఆర్ చరణ్. -
ప్రేమను పంచుదాం
ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ కరోనా వైరస్ పోరాటంపై ‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు కమల్ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్ చేశారు. ‘‘ఈ పాటను కమల్ హాసన్ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్ మాత్రమే కాదు 37 మంది కోరస్ వాయిస్‌లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్ లైన్ ఆడిషన్ చేసి సెలక్ట్ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. -
కరోనా పై కమల్ పాట
కరోనాపై పోరాటంలో పాటల ద్వారా స్ఫూర్తి నింపుతున్నారు స్టార్స్. చిరంజీవి, నాగార్జున, సల్మాన్ ఖాన్, మంచు మనోజ్, ఎస్పీబీ, చిత్ర, కీరవాణి, కోటి వంటి వాళ్లు ఆల్రెడీ పాటలను విడుదల చేశారు. తాజాగా కమల్ హాసన్ కూడా కరోనాపై ఓ పాటను ఆలపించారని సమాచారం. సంగీత దర్శకుడు జిబ్రాన్ కంపోజ్ చేసిన ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కలసి పాడారట కమల్ హాసన్. ఈ పాట త్వరలోనే విడుదల కానుందని సమాచారం. -
డాడీ
‘‘ఇంక నావల్ల కాదు.. భరించలేను’’అంటూ పొత్తి కడుపు పట్టుకొని లుంగలు చుట్టుకుపోతోంది చందన.‘‘ఓర్చుకో చందూ.. ప్లీజ్.. చూడు ఈ మంత్ తప్పకుండా పీరియడ్స్ మిస్ అవుతావ్’’ ఆమె పక్కన కూర్చోని తల నిమురుతూ అన్నాడు అనిరుద్.ఆ మాటకు అతని కళ్లల్లోకి చూసింది చందన. ‘‘నిజం.. ఈసారి కన్సీవ్ అవడం ఖాయం...’’భరోసా ఇస్తున్నట్టుగా ఆమె చేయిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేయి విడిపించుకుంటూ దిండు ఆసరాగా గోడకు ఒరిగి కూర్చుంది చందన. కిటికీలోంచి గార్డెన్‌లోకి చూస్తూ.. ‘‘ఈ ట్రీట్మెంట్... ఈ పెయిన్ నా వల్ల కాదు అనిర్.. ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం...’’అంది. ఆ మాట అతనికి కొత్త కాదు కాని.. ఆ స్వరం కొత్తగా వినిపించింది. స్థిరమైన అభిప్రాయం మోస్తున్నట్టు. ఆమెకు ఇంకాస్త దగ్గరగా జరిగి చందన తలను తన వైపు తిప్పుకుంటూ ‘‘ఒక్క చాన్స్ చూ..ద్...’’ అని అతను మాట పూర్తి చేసేలోపలే.. ‘‘నీడ్ టు టేక్ రెస్ట్’’ అంటూ అటువైపు తిరిగింది చందన. ఇంకో మాట మాట్లాడకుండా ఆ గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు అనిరు«ద్. పెళ్లయి ఆరేళ్లవుతున్నా పిల్లల్లేరు. ఆస్తి, అంతస్తు.. మంచి ఉద్యోగం.. పెద్ద ఇల్లు.. అన్నీ ఉన్నాయి. ఆ ఇంటికి కళ తెచ్చే పిల్లలే లేరు. ఇద్దరూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అనిరు«ద్ లోపం సరిచేయరానిది. ఆ విషయం తెలిసినా.. చందన మీదే ప్రెషర్. నరకం అనుభవిస్తోంది ఆమె. అర్థమైనా కృత్రిమ గర్భధారణ కోసం పదేపదే ప్రయత్నిస్తున్నాడు అనిరు«ద్. రక్తం పంచుకుపుట్టిన బిడ్డ కావాలని. ఆ చాదస్తం చందన ప్రాణం తీస్తోంది. దిండులో తల దూర్చి పొగిలి పొగిలి ఏడుస్తోంది ఆమె. గది బయటకు వచ్చేసిన అనిరు«ద్కూ తెలుసు చందన ఏడుస్తోందని. నిట్టూరుస్తూ.. ‘‘ఏమైనా ఇంకో చాన్స్ చూడాల్సిందే’’ అనుకున్నాడు. ఆఫీస్‌కు వెళ్లడానికి సిద్ధమవుతుంటే ఫోన్.. బీప్.. మెస్సేజ్‌ను ఇండికేట్ చేస్తూ!చూసుకున్నాడు.. ‘‘డాడీ.. వాంట్ రిమోట్ కంట్రోల్ కార్’’ అని ఉంది. రెడిక్యులస్.. చిరాగ్గా అనుకుంటూ మెస్సేజ్ డిలీట్ చేశాడు. ఆఫీస్‌కు కార్ డ్రైవ్ చేశాడు. గుయ్.. గుయ్.. ..... ..... .... .... గుయ్.. గుయ్‘‘అబ్బా.. ఆ ఫోన్ చూడు అనిర్..’’ మధ్య రాత్రి ఫోన్ వైబ్రేషన్ సౌండ్‌కి ఇరిటేట్ అవుతూ చందన. ‘‘ఊ.. పోనిద్దూ.. పడుకో’’ అంటూ అటు తిరిగి ముసుగేసుకున్నాడు అనిరు«ద్.గుయ్.. గుయ్... ..... .... .... గుయ్.. గుయ్ ‘‘అబ్బా...’’ అని విసుక్కుంటూ అనిరు«ద్ ఫోన్ తీసింది. కళ్లునులుముకుంటూ చూసింది.. మెస్సేజెస్.. స్క్రీన్ మీద నోటిఫికేషన్స్‌లో.. ‘‘డాడీ...’’ అని కనిపించింది. ‘‘అనిర్.. ఏవో మెస్సేజెస్ ..’’ భర్తను తట్టి లేపుతూ.‘‘పొద్దున చూసుకుంటాలే.. ’’ నిద్ర మత్తుతోనే అనిరు«ద్. పక్కన పెట్టబోతుంటే మళ్లీ ఓ మెస్సేజ్ వచ్చింది. చూసింది. ‘‘డాడీ...’’ అని ఒక మెస్సేజ్... ‘‘డాడీ... వై డింట్ యు గివ్ రిప్లయ్?’’ అని ఒకటి.. ‘‘డాడీ.. రిమోట్ కంట్రోల్ కార్ తేలేదూ?’’ అని ఓ మెస్సేజ్, ‘‘డాడీ.. గిమ్మీ రిప్లయ్.. ’’, ‘‘డాడీ.. ప్లీజ్.. ప్లీజ్..’’ అంటూ ఓ అయిదారు మెస్సేజ్లున్నాయి. అన్నీ చదివింది. నిద్ర ఎగిరిపోయింది ఆమెకు. వెంటనే అనిరు«ద్‌ను లేపి.. ఏంటిది? అని అడిగాలన్నంత ఆవేశం వచ్చింది. కాని ఆలోచనలో పడింది. అనిరు«ద్‌కు పిల్లలా? మరి మెడికల్ రిపోర్ట్? అతనిలో కౌంట్ తక్కువనే కదా చెప్పారు డాక్టర్! అబద్ధమా? నాకు పిల్లలు పుట్టట్లేదని ఇంకో... ఛ.. ఇలా ఆలోచిస్తుందేంటి తను? మరో అమ్మాయి, ఆమెతో పిల్లలు ఉంటే తననెందుకు ఇబ్బంది పెడ్తాడు ట్రీట్మెంట్స్తో? ఏమో.. తనకు అనిరు«ద్ పట్ల అలాంటి థాట్ రాకుంటా ఉండడానికి ట్రీట్మెంట్ అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతున్నాడేమో? ఆ డాక్టర్ అనిరుద్ ఫ్రెండే కదా.. ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతున్నారా? ఆ చాన్స్ ఉందా? అందుకే అడాప్షన్ వద్దంటున్నాడా? లాంటి ఆలోచనలతో.. అనుమానాలతో తెలీకుండానే నిద్రలోకి జారుకుంది చందన. ‘‘డాడీ.... డాడీ...’’ అయిదేళ్ల అమ్మాయి గుసగుసగా పిలుస్తున్నట్టు.ఒకేసారి ఇద్దరికీ మెలకువ వచ్చింది. ‘‘డాడీ... డాడీ..’’ మళ్లీ పిలుపు. గాబరాగా అనిరు«ద్ లైట్ వేయబోయాడు. వెలగలేదు. అప్పటిదాకా వెలిగిన బెడ్‌లైట్ కూడా ఆరిపోయింది. పక్కనే ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని టార్చ్ ఆన్చేసింది చందన. అనిరు«ద్ వంక చూసింది. మొహం నిండా చెమటలతో వణుకుతున్నాడు. ఉన్నట్టుండి గాలి.. వెర్రెత్తినట్టు బెడ్రూమ్ కిటికీలను.. కర్టెన్లూ ఊపేస్తోంది.. కిటికీ తలుపులు ఊడిపడిపోతాయేమోనన్నంతగా! ‘‘పిల్లలు కావాలా డాడీ?’’ మళ్లీ ఆ పిల్ల గొంతే! ‘‘ఏయ్.. ఎవరు నువ్వు?’’కంపిస్తున్న స్వరంతో అనిరు«ద్. ‘‘నీ కూతురిని డాడీ.. పొద్దున ... మధ్యాహ్నం మెస్సేజెస్ పెట్టా కదా.. చూసుకొనీ డిలీట్ చేశావ్. ఇందాక కూడా పెట్టా. నువ్వు పట్టించుకోలేదు.. అందుకే వచ్చా డాడీ..’’ పలుకుతోంది పిల్ల గొంతు. ‘‘ఏయ్.. ఏంటా ముదురు మాటలు? డాడీ ఎవరు ? డాడీ అట డాడీ?’’ భయం ప్లేస్‌లో చిరాకు, కోపం వచ్చాయి అనిరు«ద్‌కి. మళ్లీ గాలి విసురుగా.. ఒక్కసారి ఆ ఇంటినే ఊపేసింది. ‘‘అనిర్...’’ భయంతో గట్టిగా అరిచింది చందన. ‘‘చందూ..’’ అంటూ ఆమెను పొదివి పట్టుకున్నాడు అతను. ‘‘అనిర్.. ఏంటిదంతా? ఎవరా పాపా? కనిపించదేంటి?’’ అంత భయంలోనూ భర్త మీదఅనుమానంతో ఆమె. ‘‘తెలీదు.. నాకూ కన్ఫ్యూజన్గానే ఉంది’’చెమటలు తుడుచుకుంటూ అతను. ‘‘అబద్ధం..’’ అరిచింది ఆ పిల్ల గొంతు. ఒక్కసారిగా వణికారు ఇద్దరూ. ‘‘డాడీ.. అబద్ధం చెప్పకు డాడీ.. ’’ అంతలోకే మార్దవంగా ఆ పిల్ల. మెల్లగా బెడ్ దిగి.. ‘‘ఏయ్ ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా వెంటాడుతున్నావ్?’’ ‘‘అదేంటి డాడీ.. నన్ను మర్చిపోయావా?’’ అని వినిపించగానే ఒక్కసారిగా గదిలో లైట్ వెలిగింది. గదంతా చూశారిద్దరూ .. ఎవరూ లేరు.చందనకు కోపం వస్తోంది. అనిరు«ద్ తనను మోసం చేశాడని. ఆ ఆగ్రహంతోనే భర్త టీషర్ట్ కాలర్ పట్టుకుంది.. ‘‘అనిర్.. నన్నెందుకు చీట్ చేస్తున్నావ్? ఆ పాపఎవరు?’’అంటూ!‘‘వ్వాట్..?’’ఖంగుతిన్నఅనిరు«ద్ షర్ట్ కాలర్ విడిపించుకుంటూ ‘‘గాన్ మ్యాడ్?’’ అరిచాడు. బిత్తరపోయింది చందన. ‘‘ఏం జరుగుతుందో చూసే ఆ మాట అంటున్నావా చందూ?’’ బాధగాఅతను.‘‘రాత్రి నీ సెల్‌కు వచ్చిన మెస్సేజెస్ చూశా.. ఈ అమ్మాయే కాబోలు’’ అంటూ సెల్ ఫోన్ తీసి అతని చేతికి ఇచ్చింది. చదవబోతూంటే బయట కార్ హార్న్ మోగింది గట్టిగా.. ఉలిక్కిపడ్డారిద్దరూ.మోగుతూనే ఉంది.. గబగబా పోర్టికోలోకి పరిగెత్తారు. హెడ్లైట్లు వెలుగుతూ... ఆరుతూ.. ఆరుతూ వెలుగుతూ.....!కార్ దగ్గరకు వెళ్లారు.. విండో గ్లాసెస్ మీద ‘‘డాడీ.. నన్ను ఇంటికి తెచ్చుకోండి... ప్లీజ్’’అని రాసుంది. అది చూసి ఆవేశంతో తుడిచేయబోయాడు అనిరు«ద్.. మళ్లీ హార్న్ మోగింది! అనిరు«ద్ చేయి పట్టి ఆపింది చందన.. తుడిచేయొద్దు అన్నట్టుగా! మళ్లీ మాటలు వినిపించాయి.. ‘‘డాడీ.. ప్లీజ్ మమ్మీ మాట వినండి.. అనా«థను దత్తత తీసుకోండి.. నాలా చెత్తకుప్పలో చనిపోనివ్వకండి.. డాడీ.. ప్లీజ్.. మమ్మీని అలా హాస్పిటల్‌కి తిప్పకండి. అడాప్ట్ చేసుకోండి.. నన్నూ.. మమ్మీని కాపాడండీ.. ప్లీజ్ డాడీ.. ప్లీజ్ డాడీ...’’ అంటూ ఆ పాప స్వరం ఏడుస్తోంది.. చందనాకూ దుఃఖం ఆగలేదు! - సరస్వతి రమ -
సాకేత్–అర్జున్ జంట ఓటమి
చెన్నై: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో రెండో రోజు భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల డబుల్స్‌లో సాకేత్ మైనేని–అర్జున్ ఖడే... అనిరుధ్ చంద్రశేఖర్–అభినవ్ జోడీలు తొలి రౌండ్లోనే నిష్క్రమించాయి. మూడో సీడ్ సాకేత్–అర్జున్ ద్వయం 6–7 (4/7), 3–6తో గియా న్లుకా మాగెర్–ఆండ్రీ పెలెగ్రిని (ఇటలీ) జోడీ చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. మరో మ్యాచ్‌లో అనిరుధ్–అభినవ్ జంట 7–6 (7/5), 2–6, 5–10తో సిద్ధార్థ్ రావత్–మనీశ్ (భారత్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో శశికుమార్ ముకుంద్ (భారత్) 6–3, 6–1తో సెబాస్టియన్ ఫాన్సెలు (జర్మనీ)పై గెలుపొందగా... సుమీత్ నాగల్ (భారత్) 3–6, 4–6తో డకీ లీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. -
అది అందరి బాధ్యత
శ్రనిత్ రాజ్, కల్యాణి పటేల్, అనిరుధ్, నేహా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గేమర్’. బి.జి.వెంచర్స్ పతాకంపై రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘గేమర్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. తడకల రాజేష్ నూతన నటీనటులను ప్రోత్సహిస్తూ ఈ సినిమా తీశారు. ఇలాంటి చిన్న సినిమాల దర్శక, నిర్మాతలను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపైనా, సమాజంపైనా ఉంది. వీళ్లందరికీ థియేటర్లు దొరకడం కష్టంగా ఉంది. కొత్త టాలెంట్ రావాలంటే చిన్న దర్శక–నిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. అప్పుడే గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు దక్కుతాయి’’ అన్నారు. తడకల రాజేష్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే ఆరు చిత్రాలు చేసిన నాకు ‘గేమర్’ ఏడో సినిమా. బి.జి.యాక్టింగ్ అకాడమీ ద్వారా నటీనటులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవకాశం ఇస్తున్నాను. ఈ చిత్రంలోని ప్రతి సీన్ డిఫరెంట్‌గా ఉంటూ ఆసక్తి రేపుతుంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 1న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. హీరో శ్రనిత్, హీరోయిన్ కల్యాణి, అనిరు«ద్, నరేందర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
తలైవరిజమ్తో నింపాం
సరికొత్త ట్యూన్స్‌తో తమిళ ఇండస్ట్రీని డ్యాన్స్ చేయిస్తున్న సంగీత దర్శకుడు అనిరుద్. సినిమాలోని పాటలను తనదైన మేనరిజమ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లే హీరో రజనీకాంత్. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘పేట్టా’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 9న విడుదల కానుంది. డిసెంబర్ 3న ఫస్ట్ సాంగ్, 7న రెండో సాంగ్, 9న మొత్తం ఆల్బమ్‌ను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. ‘‘పేట్టా ఆల్బమ్‌తో తలైవరిజమ్ చూపిస్తాం. సిద్ధంగా ఉండండి’’ అని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ఆరోగ్యం బాగాలేక చెన్నెలోని హాస్పిటల్లో జాయిన్ అయ్యారని కోలీవుడ్‌లో ఓ వార్త షికారు చేసింది. అయితే రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. -
పాడేందుకు అనిరుద్ నో.. దర్శకుడు ఆత్మహత్యాయత్నం
పెరంబూరు: యువ సంగీత దర్శకుడు అనిరుద్ పాడడానికి నో అనడంతో దర్శకుడు ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టింది. వివరాలు చూస్తే పయ్యా, పచ్చాంకై చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించిన పొన్ముడి దర్శకుడిగా మారి సోమపాన రూప సుందరన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెర్లిన్ చిత్రం ఫేమ్ విష్ణుప్రియన్ హీరోగా నటిస్తున్న ఇందులో బిగ్‌బాస్ గేమ్ షో ఫేమ్ ఐశ్వర్యదత్తా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్లో ఉండగానే నటి ఐశ్వర్యదత్ బిగ్‌బాస్ గేమ్ షోకి వెళ్లడంతో షూటింగ్‌కు సమస్యలు ఎదురయ్యాయి. ఇలాంటి తరుణంలో చిత్రంలో ఒక పాటను సంగీత దర్శకుడు అనిరుద్‌తో పాడించే ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా పాడలేనని చెప్పారు. దీంతో సోమపాన రూప సుందరన్ చిత్ర దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తమ చిత్రంలో అనిరుద్ పాడనన్నందుకు మనస్తాపం చెందిన దర్శకుడు పొన్ముడి అధిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన సహాయ దర్శకులు వెంటనే ఆస్పత్రిలో చేర్చడంతో పొన్ముడి ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్న ఆయన ఈ సంఘటన గురించి తెలుపుతూ అనిరుద్‌ను తమ చిత్రంలో పాడిస్తానని సంగీత దర్శకుడు అబ్బాస్ రఫీ మాట ఇవ్వడంతో తాము చిత్ర షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆయన కుదరదు అనడంతో చిత్ర నిర్మాణ పనులు నిలిచిపోయాయని చెప్పారు. దీంతో మనస్తాపానికి చెందిన తాను ఆత్మహత్నానికి పాల్పడినట్లు తెలిపారు. అయితే తన అసిస్టెంట్స్ తనను కాపాడారని చెప్పారు. అయినా ఇప్పుటికీ తన పరిస్థితి సీరియస్‌గానే ఉందని, ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో తెలియడం లేదనే ఆవేదనను దర్శకుడు పొన్ముడి వ్యక్తం చేశారు. -
విజేతలు తానియా, అనిరుధ్
సాక్షి, హైదరాబాద్: స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో జి. తానియా సరయ్, బి. అనిరుధ్ చాంపియన్లుగా నిలిచారు. బేగంపేట్‌లోని ఏస్ టెన్నిస్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో అండర్–14 బాలబాలికల విభాగాల్లో వీరిద్దరు టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలుర సింగిల్స్ ఫైనల్లో అనిరుధ్ 6–3తో వి. ప్రణవ్‌పై గెలుపొందగా... హోరాహోరీగా సాగిన బాలికల సింగిల్స్ తుదిపోరులో తానియా 6–5 (7/1)తో ఎం. భారతిని ఓడించింది. అండర్–12 కేటగిరీలోనూ తానియా విజేతగా నిలిచింది. ఫైనల్లో తానియా 6–4తో రిషితా రెడ్డిపై గెలుపొందింది. బాలుర ఫైనల్లో శౌర్య 6–4తో డి. నిఖిల్‌పై నెగ్గాడు. అండర్–10 కేటగిరీలో తేజస్ సింగ్, మరియా వైజ్ టైటిళ్లను దక్కించుకున్నారు. బాలుర సింగిల్స్ టైటిల్ పోరులో తేజస్ 6–3తో శశాంక్‌పై, బాలికల తుదిపోరులో మరియా 6–4తో సాయి అనన్యపై విజయం సాధించారు. -
ఇక ఆ సన్నివేశాలు చెయ్యను
తమిళసినిమా: సంచలన తారల్లో నటి అండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చిన పనిచేయడానికి ఏమాత్రం వెనుకాడని నటి ఈమె. ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రోమాన్స్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినా, డోంట్‌కేర్, వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు బదులివ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చింది. నటిగానే కాకుండా మంచి గాయని కూడా అయిన ఆండ్రియా ఏ తరహా పాత్రనైనా చాలెంజ్‌గా తీసుకుని నటించేది. అలా వేశ్య పాత్రలో నటించడానికీ వెనుకాడలేదు. ఇక ఇటీవల విడుదలైన విశ్వరూపం–2 చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించి శభాష్ అనిపించుకుంది. ఇంతకుముందు గ్లామరస్ పాత్రల్లోనూ నటించిన ఆండ్రియా తరమణి లాంటి చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ధనుష్‌తో నటిస్తున్న వడ చెన్నై చిత్రంలోనూ చాలా వైవిధ్యభరతమైన పాత్రలో కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉంది. దీంతో తన పంథాను మార్చుకుందట. చాలా సెలెక్టెడ్ చిత్రాలే చేస్తున్న ఈ భామ ఇకపై గ్లామర్ పాత్రల్లో నటించరాదన్న నిర్ణయం తీసుకుందట. నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలనే అంగీకరించనున్నట్లు పేర్కొంది. ఇకపై ఇమేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నట్లు చెప్పింది. కాబట్టి దానికి భంగం కలిగించే లిప్‌లాక్, హీరోలతో సన్నిహితంగా నటించడం, హద్దులు మీరిన గ్లామర్ పాత్రల్లో నటించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కథ వినే ముందే దర్శక నిర్మాతలకు చెప్పేస్తోందట. ఇప్పటి వరకూ అండ్రియా వేరు ఇకపై వేరు అని ఈ సంచలన నటి అంటోంది. చూద్దాం ఈ అమ్మడు తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుందో. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో వడచెన్నై, కా అనే రెండు చిత్రాలే ఉన్నాయన్నది గమనార్హం. -
తమిళంలో మహేష్ సినిమా
తమిళసినిమా: అనిరుధ్‌కు టైమ్ వచ్చింది. అనిరుధ్ అనగానే సంగీత దర్శకుడు అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. అనిరుధ్ పేరుతో చిత్రం రూపొందింది. ఈ చిత్ర విడుదలకు టైమ్ వచ్చింది. తెలుగులో సూపర్‌స్టార్ మహేష్‌బాబు కథానాయకుడుగా నటించిన కలర్‌ఫుల్ భారీ చిత్రం బ్రహ్మోత్సవం. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత కథానాయికలుగా నటించిన ఇందులో సత్యరాజ్, జయసుధ, రేవతి భారీ తారాగణం నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనర్ సంస్థ సమర్పణలో స్వాతి, వర్షిణి భద్రకాళి ఫిలింస్ పతాకంపై భద్రకాళి ప్రసాద్ తమిళంలోకి అనిరుధ్ పేరుతో అనువదించారు. ఈయన ఇంతకుముందు సెల్వందన్, ప్రభాస్ బాహుబలి, ఇదుదాండా పోలీసు, మగధీర, బ్రూస్లీ, ఎవండు వంటి భారీ చిత్రాలను తమిళంలోకి అనువదించారు. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనిరుధ్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 3న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబం, అనుబంధాల విలువలను ఆవిష్కరించే చిత్రంగా అనిరుధ్ ఉంటుందని తెలిపారు. చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందాయని, చిత్రం కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. ఏఆర్కే రాజా అనువాద రచన చేసిన ఈ చిత్రానికి అడ్డాల వెంకటాద్రి, సత్యసీతలన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
సూపర్ సింగర్ ఫైనల్స్‌కు కర్నూలు కుర్రాడు
కర్నూలు(హాస్పిటల్): తమిళనాడులోని స్టార్ విజయ్‌టీవీ నిర్వహిస్తున్న సూపర్‌సింగర్ ఫైనల్స్‌కు కర్నూలుకు చెందిన అనిరుద్ ఎంపికయ్యాడు. జన్మతః అబ్బిన గాత్రంతో బాల్యం నుంచే అతను మంచి గాయకునిగా రాణించసాగాడు. కర్ణాటక సంగీతంతోపాటు సినీగీతాలను అలవోకగా పాడేస్తున్నాడు. ఐఐటీ చదివి చెన్నైలో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు సూపర్‌సింగర్ పోటీల్లో ఫైనల్స్‌కు చేరాడు. కర్నూలుకు చెందిన మెడికల్ రెప్ సుస్వరం వాసుదేవమూర్తి, సుస్వరం రజనీ వాసుదేవ్ దంపతులకు 1994 నవంబర్ 24న అనిరుద్ జన్మించాడు. బాల్యం నుంచే పాటలు పాడటంలో అతని ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు మ్యూజిక్ టీచర్ విజయలక్ష్మి వద్ద శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రతి శని, ఆదివారం హైదరాబాద్ వెళ్లి బాలసుబ్రమణ్యం, రామాచారి వద్ద సంగీతం అభ్యసించాడు. 8వ ఏట ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యాతగా వ్యవహరించిన మాటీవీలో ‘పాడాలని ఉంది’ మ్యూజిక్ కాంపిటీషన్లో పాల్గొని సెమిఫైనల్ వరకు వచ్చాడు. ఆ తర్వాత 12వ ఏటా ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈటీవీ కన్నడ ఛానల్లో పాల్గొని సెమిఫైనల్‌కు అర్హత సాధించాడు. 13వ ఏట జీ తెలుగు నిర్వహించిన జీ లిటిల్ ఛాంప్స్‌లో సంగీత దర్శకులు కోటి, రమణ గోరంట్ల, గాయని శైలజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన పోటీలో టాప్ 4లో నిలిచాడు. జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా పలు సంగీత పోటీల్లో పాల్గొని అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు మ్యూజిక్కు దూరంగా ఉండి చదువుపై దృష్టి నిలిపాడు. ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాడు. బీటెక్ ఫైనలియర్లో ఉన్నప్పుడే మాటీవీ వారు నిర్వహించిన సూపర్‌సింగర్ 8లో పాల్గొని ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం పేపాల్ చెన్నై బ్రాంచ్‌లో సర్టిఫైడ్ రిస్క్ అనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తూ తమిళ్ ఛానల్ స్టార్ విజయ్ టీవీలో సూపర్‌సింగర్ పోటీలో పాల్గొని ఫైనల్ వరకు వచ్చాడు. ఈ పోటీకి దేశవ్యాప్తంగా 6వేల మందిని పరిశీలించగా చివరకు ఆరుగురు ఎంపికయ్యారు. అనిరుద్‌కు ఓటేయండి సూపర్ సింగర్ ఫైనల్ పోటీల్లో తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక, కేరళ నుంచి ఒక్కొక్కరు, తెలుగు రాష్ట్రాల నుంచి అనిరుద్ ఎంపికయ్యారు. ఈ పోటీ ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నారు. టైటిల్ విన్నర్ అవ్వాలంటే ఓటింగ్ తప్పనిసరి కావడంతో ఈ నెల 15వతేదీలోగా గూగుల్ ద్వారా అనిరుద్‌కు ఓటేసి గెలిపించాలని తండ్రి వాసుదేవరావు కోరుతున్నాడు. గూగుల్ వెబ్సైట్ తెరిచి ‘సూపర్ సింగర్ ఓట్’ అని టైప్ చేసి, అందులో అనిరుద్ ఇమేజ్ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత స్కేల్‌ను 50 వరకు డ్రాగ్ చేసి మీ ఓటును అందించాలని కోరారు. -
టీఎస్సార్ వారి పెళ్లి సందడి
ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత సుబ్బరామి రెడ్డి మనవడు అనిరుద్ వివాహం నేహాతో ఆదివారం హైదరా బాద్‌లో ఘనంగా జరిగింది. సుబ్బరామిరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి, సరిత దంపతుల కుమారుడు అనిరుద్. హితా, నవీన్ రెడ్డి దంపతుల కుమార్తె నేహా. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవి, మోహన్‌బాబులతో సుబ్బరామిరెడ్డి సంగీత్‌లో టీఎస్సార్, రెహమాన్, అనిరుద్ వధూవరులను అభినందిస్తున్న కృష్ణ రామ్‌చరణ్, ఉపాసన -
అనిరుధ్, రతన్ విజృంభణ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో జెమిని ఫ్రెండ్స్ బౌలర్లు ఎన్. అనిరుధ్ (5/58), రతన్ తేజ (4/57) చెలరేగారు. వీరిద్దరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి హైదరాబాద్ బాట్లింగ్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. బుధవారం 71/2 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ బాట్లింగ్ అనిరుధ్, రతన్‌ల ధాటికి 77.5 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. జయరామ్ రెడ్డి (42), వినయ్ గౌడ్ (79) రాణించారు. దీంతో హైదరాబాద్‌కు 28 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జెమిని ఫ్రెండ్స్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులతో నిలిచింది. ఎం. అభిరత్ రెడ్డి (62 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుమందు తొలి ఇన్నింగ్స్‌లో జెమిని ఫ్రెండ్స్ జట్టు 64.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో ఆంధ్రా బ్యాంకు, ఎస్సీఆర్ఎస్; ఇన్‌కంట్యాక్స్, జై హనుమాన్ జట్ల మధ్య జరగాల్సిన రెండోరోజు ఆట రద్దయింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు స్పోర్టింగ్ ఎలెవన్: 476 (హిమాలయ్ అగర్వాల్ 156, మీర్ జావీద్ అలీ 89, సన్నీ 58, యుధ్వీర్ సింగ్ 92; ముదస్సర్ హుస్సేన్ 3/16, ఆకాశ్ 3/67), బీడీఎల్: 40/1 (15 ఓవర్లలో). -
క్వార్టర్స్‌లో అనిరుధ్, నగేశ్
సాక్షి, హైదరాబాద్: వాంటేజ్ స్పోర్ట్స్ అండర్–13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో నిజాంపేట్‌కు చెందిన అనిరుధ్, ఎస్ఈసీకి చెందిన నగేశ్ క్వార్టర్స్‌కు చేరారు. హయత్‌నగర్‌లోని వాంటేజ్ స్పోర్ట్స్ అకాడమీలో శనివారం జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అనిరుధ్ 10–15, 15–7, 15–9తో శుభ్ కుమార్ (అత్తాపూర్)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నగేశ్ 15–2, 15–12తో రిషభ్ (గచ్చిబౌలి)పై, రిష్వంత్ సాయి (అత్తాపూర్) 15–5, 15–8తో అజయ్ నిహాల్ (అత్తాపూర్)పై, సాయి ప్రసాద్ (హైదరాబాద్) 15–7, 15–12తో సాయి కేదార్ (నిజాంపేట్)పై, పి. హిమ హర్ష (సరూర్‌నగర్) 15–10, 15–7తో అబ్దుల్ రజాక్ (సరూర్‌నగర్)పై, ఎన్. ప్రణవ్ రామ్ (పీజీబీఏ) 15–2, 15–5తో షేక్ అమన్ (హైదరాబాద్)పై, జై ఆదిత్య (అత్తాపూర్) 15–7, 15–5తో జ్ఞాన దత్ (నిజాంపేట్)పై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ అనంత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మూడో రౌండ్ ఫలితాలు టి. సాయి ప్రసాద్ (పీజీబీఏ) 15–4, 15–3తో శ్రీ హర్షంత్పై, సాయి (పీజీబీఏ) 15–5, 15–5తో శ్రీ కార్తికేయ (బాలాపూర్)పై, కె. సాయి కేదార్ (నిజాంపేట్) 15–10, 15–12తో కౌషిక్ రెడ్డి (పీజీబీఏ)పై, అజయ్ నిహాల్ (అత్తాపూర్) 15–6, 14–15, 15–10తో ఎన్. నిశాంక్ (హైదరాబాద్)పై, అబ్దుల్ రజాక్ (ఎస్ఆర్ఎన్ఆర్) 15–9, 15–8తో వై. ప్రయూశ్ రెడ్డి (హైదరాబాద్)పై, రిషిత్ 15–6, 15–10తో పి. హార్దిక్‌పై, టి. జ్ఞానదత్ (నిజాంపేట్) 15–2, 15–1తో ఎ. ఛత్రపతి రాథోడ్ (ఏఎంపీటీ)పై, కె. జై ఆదిత్య 15–1, 15–3తో జి. అదిత్ (ఎస్ఆర్ఎన్ఆర్)పై, ఎన్. ప్రణవ్ రామ్ (పీజీబీఏ) 15–1, 15–2తో ఆయూశ్ సింగ్ (బాలాపూర్)ఫై, అమన్ షేక్ (నిజాంపేట్) 15–12, 15–6తో మెహతా (అత్తాపూర్)పై, అనిరుధ్ 15–1, 15–0తో సుశాంక్ రెడ్డి (హయత్‌నగర్)పై, హర్షిత్ 15–3, 15–2తో జి. అక్షయ్ రెడ్డి (సరూర్‌నగర్)పై, ధీమంత్ (పీజీబీఏ) 15–7, 15–4తో కౌశిక్ (హైదరాబాద్)పై, శుభ్‌కుమార్ (అత్తాపూర్) 14–15, 15–11, 15–13తో ధ్రువ్ సేత్ (సరూర్‌నగర్)పై నెగ్గారు. -
ఫైనల్లో ఓడిన అనిరుధ్–విఘ్నేశ్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జింబాబ్వే ఎఫ్–1 ఫ్యూచర్స్ పురుషుల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు అనిరుధ్ చంద్రశేఖర్– విఘ్నేశ్ పెరణమల్లూర్ జంటకు నిరాశ ఎదురైంది. జింబాబ్వేలో జరిగిన ఈ టోర్నీలో ఈ జోడీ ఫైనల్లో పరాజయం పాలై టైటిల్‌ను కోల్పోయింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో అనిరుధ్–విఘ్నేశ్ (భారత్) జంట 3–6, 0–6తో టాప్ సీడ్ బెంజమిన్ లాక్–కాట్నీ జాన్ లాక్ (జింబాబ్వే) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు సింగిల్స్ విభాగంలో అనిరుధ్ రెండోరౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో అనిరుధ్ (భారత్) 4–6, 2–6తో ఆరోన్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓటమి చవిచూశాడు. అంతకుముందు తొలిరౌండ్లో అనిరుధ్ 6–0, 7–6 (7/5)తో వాసిలియోస్ కారిపి (రష్యా)పై గెలుపొందాడు. -
ఆ దిగ్గజాలతో అనిరుద్
తమిళసినిమా: యువ తరంగం అనిరుద్ సంగీతదర్శకుడిగా దూసుకుపోతున్నారు. తొలి చిత్రం 3తోనే వై దిస్ కొలైవెరి డీ.. అంటూ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ యువ సంగీత దర్శకుడు ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. తమిళంతో పాటు తెలుగులోనూ చిత్రాలు చేస్తూ మంచి పాపులారిటీని తెచ్చుకున్న అనిరుద్ వ్యక్తిగతంగా పలు విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే అవేవి ఆయన వృత్తికి ఆటంకాలు కాలేదు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. అంతే కాదు అగ్ర నటీనటుల చిత్రాలకు సంగీతబాణీలు కడుతున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం కొలమావు కోకిల చిత్రానికి అనిరుద్ అందించిన సంగీతం చర్చనీయాంశంగా మారింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ కుటుంబ బంధువు అయిన ఈయనకిప్పుడు ఆయన చిత్రానికే సంగీతాన్ని అందించే అవకాశం వరించింది. ఎస్. రజనీకాంత్ తాజాగా కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించనున్న చిత్రానికి అనిరుద్ సంగీతబాణీలను కడుతున్నారు. ఇది ఒక విశేషం అయితే తాజాగా విశ్వనటుడు కమలహాసన్ తాజా చిత్రానికి ఆ సంచలన సంగీతదర్శకుడికే సంగీతాన్ని అందించే అవకాశం వచ్చిందన్నది తాజా సమాచారం. కమల్ త్వరలో శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేస్తూనే మరో పక్క కమలహాసన్ ఇండియన్–2 చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం జెంటిల్మెన్ నుంచి ఐ చిత్రం వరకూ ఏఆర్.రెహ్మాన్‌నే సంగీతాన్ని అందించారు. మధ్యలో అనియన్, నన్భన్ చిత్రాలకు మాత్రం హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఇండియన్ 2 చిత్రంతో కలిపి మూడో చిత్రానికి ఇతర సంగీత దర్శకుడు పనిచేస్తున్నారన్న మాట. ఇండియన్–2 చిత్రానికి కమిట్ అయిన అనిరుద్‌ను దర్శకుడు శంకర్ ఒకే ఒక్క విషయం చెప్పారట. కొలమావు కోకిల చిత్ర సంగీత చర్చనీయాంశంగా మారిన తరుణంలో తన చిత్రానికి సంగీతాన్ని అందించే విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలని సూచించారట. అంటే తన చిత్రానికి ఒరిజనల్ సంగీతం కావాలన్న భావాన్ని వ్యక్తం చేశారట. మరి ఈ రెండు దిగ్గజాల చిత్రాలతో అనిరుద్ తన సత్తాను ఎలా చాటుకుంటారో చూడాలి. ఏదేమైనా అనిరుద్ ఇప్పుడు స్టార్ సంగీతదర్శకుల పట్టికలో చేరిపోయారన్న మాట. -
నేను మీకు వీరాభిమానిని..
తమిళసినిమా: మనిషి ఎంత సంపాదించినా రుచికరమైన ఆహారం బుజించకుంటే ఫలితం ఏముంటుంది. అదీ తన కిష్టమైన వారి విందు అయితే మహా పసందుగా ఉందనిపిస్తుంది. యువ సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ అలాంటి ఇష్టమైన వారి పసందయిన విందును ఆరగించి మైమరచి ఆ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆయన చెబుతున్నదెవరి గురించో అయితే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అగ్రనటి నయనతార తనకు పసందైన భోజనాన్ని పంపిస్తారని అనిరుధ్ చెబుతున్నారు. ఆ సంగతేంటో చూద్దాం రండీ. లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రాలలో కొలమావు కోకిల ఒకటి. నయనతార చుట్టూ తిరిగే ఈ చిత్రంలో హస్య నటుడు యోగిబాబు ప్రేమ అంటూ ఆమె చూట్టూ తిరుగుతాడు. ఇదే మంచి వినోదాన్నిచ్చే అంశం కాగా ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత భాణీలను అందించడం మరో అస్సెట్. ఈ చిత్రంలోని రెండు పాటలు విడుదలై విశేష ఆదరణను పొందుతున్నాయట. దీంతో నయనతార అనిరుధ్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ప్రతిగా అనిరుధ్ ఆమె మంచితనాన్ని, గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆయనేమన్నారో చూద్దాం. నయనతారది చాలా మంచి వ్యక్తిత్వం. అందరితోనూ చాలా ప్రేమగా వ్యవహరిస్తారు. ఆమెకు నా సంగీతం అంటే చాలా ఇష్టం. నా పాటలు విని పరవశించిపోతారు. పలుమార్లు నాకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతుంటారు. నేను మీకు వీరాభిమానిని అని మెసేజ్‌లు పంపిస్తుంటారు. కొన్ని సార్లు మంచి మంచి వంటకాలతో పసందైన విందును నాకు పంపిస్తుంటారు. అలాంటి ఆమె ప్రేమాభిమానాలు నాకు చాలా ఇష్టం అంటూ అనిరుధ్ నయనతారను ప్రశంసలతో ముంచెత్తారు. -
అగడ్త
‘‘డాడ్! వాట్ ఇస్ దిస్? రమేష్ అంకుల్ కొడుకు యూరోప్ టూర్ మన కంపనీ స్పాన్సర్ చెయ్యడమేంటి?’’ తలుపు తోసుకొచ్చిన అనిరుధ్, చేతిలోని ఫైలును టేబుల్ మీద విసిరాడు. ఆ ఫైలును తీసి, అందులోని కాగితాలను ఒక్కోటీ తిరిగి పేరుస్తూ, ‘‘ఆ అబ్బాయి పేరు తెలుసా?’’ అడిగాడు పెద్దాయన. సమాధానం లేదు. ‘‘ఏం చదివాడో తెలుసా ?’’ – ‘‘మాస్టర్స్ కంప్లీట్ అయ్యిందట’’. ‘‘ఎక్కడ చదివాడో తెలుసా?’’ – ‘‘ఏదో లోకల్ కాలేజీలో’’. ‘‘అతను చేసిన ప్రాజెక్టు ఏంటో తెలుసా?’’ ఇక తప్పదన్నట్టుగా ఫైలు తెరిచి చూసి పైకి చదివాడు, ‘‘ఆటోమేషన్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ’’. ‘‘అంటే తెలుసా? ఈ రోజు నీ కంపనీలో నలుగురు ఉద్యోగులు చేస్తున్న పనిని మన ఖాతాదారుడు ఒక్క కంప్యూటర్‌తో నడిచే ఆటోమేటెడ్ మెషిన్ కొనుక్కొని తనంతట తాను తనకి కావాల్సిన విధంగా చేసుకో వచ్చన్నమాట. రేపు ఆ నలుగురికీ పని ఉండదు – ఎళ్లుండి నీ కంపనీ అవసరం ఉండదు.’’ గట్టిగా చెప్పాడు పెద్దాయన. స్థానువయ్యి వింటున్నాడు కొడుకు. ‘‘ఆ కుర్రాడు ఈ ప్రాజెక్టు ఎక్కడ చేసాడో తెలుసా నీకు?’’ తల అడ్డంగా ఊపాడు అనిరుధ్. వెంటనే తండ్రి ఒక పుస్తకం బయటకు తీసి ముందుకు విసిరాడు. గబగబా పేజీలు తిప్పిన కొడుకు ఖంగు తిన్నాడు. ‘‘అదీ.... నాన్నా.... రోజూ ఎన్నో సంతకాలు తీసుకొంటూ ఉంటుంది... అన్నీ చూసుకోవడం కష్టం కదా!’’ ‘‘ఆ నిర్లక్ష్యమే ఎన్నో వ్యాపార సామ్రాజ్యాల్ని ముంచింది నాన్నా. నీ చేతులతో నువ్వే కూర్చున్న కొమ్మను నరుక్కునే పని చేసావు. ఆ కళాశాల ఏఈ నాకు స్నేహితుడు కాబట్టి ఫోన్ చేసి మీరే ఈ రిపోర్టు కొనుక్కోండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు తెలిసింది నీ నిర్వాకం. ప్రాజెక్టు వర్కుకు వచ్చే వాళ్ళకి ఏదో ఒక డిపార్టుమెంటులోని ఒక అంశం మీద అవగాహన కల్పించాలి అంతేగానీ మన వ్యాపారానికి అన్ని విషయాలూ వాళ్ళ ముందు తెరిచి పెట్టకూడదు. అప్పుడు ఇలాంటి అనర్థాలే జరుగుతాయి’’ పెద్దాయన స్వరం హెచ్చింది. ‘‘ఏ మాత్రం చూసుకోకుండా నీ కంపనీ మూతపడే ప్రమాదం కలిగి ఉన్న ప్రాజెక్టును ఇక్కడే చేసుకోనిచ్చి, దానికి నువ్వే ప్రశంసలు కురిపిస్తూ ముందుమాట రాసి మరీ సంతకం పెట్టావు’’ తల వంచుకున్నాడు అనిరు«ద్. ‘‘ఆ రిపోర్టు సరయిన వాడి చేతిలో పడితే ఏమవుతుందో నీకు అర్థమయిందా ఇప్పటికైనా?’’ గద్దించాడు పెద్దాయన. తల నిలువుగా ఆడించాడు కుర్రాడు. మెల్లగా లేచి తానింతవరకూ కూర్చున్న కుర్చీ మీద చేతులేసి నిల్చొని సావధానంగా మళ్లీ చెప్పుకుపోయాడు పెద్దాయన – ‘‘జీవితంలో పైకి రావడం ఏముందిరా, మహా అయితే కాస్త కష్టపడితే కాలం ఖర్మం కలిసొచ్చి అందలం ఎక్కేస్తాము. కానీ ఒక్కసారి ఈ స్థాయికి చేరాక, దీనిని నిలుపుకోడానికి మాత్రం నానా గడ్డీ కరవాల్సి ఉంటుంది. ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందో అని నిరంతరం చుట్టూ పరికిస్తూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. మన ప్రస్తుత స్థానాన్ని నిలుపుకోడానికి ఎందరినో అణగదొక్కాల్సి ఉంటుంది’’ చేతితో కుర్చీని గిర్రున తిప్పాడు. తన మనసులో కూడా రకరకాల ఆలోచనలు ఆ కుర్చీలాగా సుడులు తిరుగుతుండగా తండ్రిలో ఇదివరకెప్పుడూ చూడని వికృత పార్శా్వన్ని ఆసక్తిగా చూస్తున్నాడు ఆ తనయుడు. ‘‘క్యాంపస్ ఇంటర్వ్యూ లో అతనికి ఉద్యోగం రాకుండా ఆ కళాశాల ప్రిన్సిపల్ చూస్తాడు. కానీ వాడు ఆ ఫైలు పట్టుకొని బయటకు వస్తే ఎవరో ఒకరు అతనికి మార్గం చూపి అతన్ని ఒక వ్యాపారవేత్తగా మారుస్తారు. అది జరగకూడదు అంటే మనం అతని దృష్టిని మరల్చాలి. అందుకే ఈ టూరు. ముందు వాడ్ని ఓ మూడు నెలలు బయటకు పంపు. అక్కడ ఏ లోటూ రాకుండా ప్రతీ క్షణం మందు విందు వంటి సకల సౌకర్యాలన్నీ ఏర్పాటు చెయ్యి. వాడి తెలివి తేటల్ని మనం తగ్గించలేము కానీ మన పట్ల వాడి మనసులో కృతజ్ఞతను మాత్రం పెంపొందించుకోవచ్చు. వెంటనే ఆ ఏర్పాట్లు చూడు. అటు తరవాత ఆ ప్రాజెక్టు రిపోర్టును జాగ్రత్తగా అధ్యయనం చేసి వాడు తిరిగి వచ్చేటప్పటికి వాడ్ని కట్టడి చెయ్యడానికి అవసరమైన ప్లాన్‌తో నా దగ్గరకు రా’’ సరేనని లేచాడు కొడుకు. ∙∙ ‘అమర్ ఆటోమొబైల్స్’ దక్షిణాదిలో పేరెన్నికగన్న స్పేర్ పార్ట్స్ తయారీ సంస్థ. దాన్ని స్థాపించి ముప్ఫై ఏళ్ళు నడిపించిన అమర్నాథ్ ఇప్పుడు తన ఒక్కగానొక్క కొడుకు అనిరుధ్‌ని వ్యాపారంలోకి దింపి మెళకువలన్నీ నేర్పుతున్నాడు. తనయుడి జీవితానికి సరైన పాఠం నేర్పే అవకాశం ఈ ప్రాజెక్టు రూపంలో దొరికింది ఆ తండ్రికి. తరువాత వారం రోజులకి అనిరుధ్ నాన్నని కలవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ౖచైర్మన్ ఎప్పుడూ బిజీగా ఉండటంతో 15 రోజుల వరకూ వీలు పడలేదు. ఒకరోజు ఇంటికి వెళ్లిపోయే సమయంలో తనే స్వయంగా కాల్ చేసి కొడుకుని రమ్మన్నాడు. రోజంతటి పని భారం కనపడకుండా ఉత్సాహంగా వచ్చిన అనిరుధ్, తను ఆ ప్రాజెక్టు రిపోర్టు తండ్రికి ఇచ్చాడు. ‘‘ఒకటి సార్, ఈ ప్రాజెక్టు రిపోర్టు పేపర్ మీద కనపడినంత తేలికగా అమలు సాధ్యమ య్యింది కాదు. ఎంతో సమయం, పెట్టుబడులతో కూడిన ఎన్నో విషయం. ఈ రిపోర్టును అధ్యయనం చేసి మీకు రెండు నిర్ధారణలు మరో మూడు తీసుకోవాల్సిన చర్యలతో కూడిన ఈ నివేదిక ఇస్తున్నాను’’ చెప్పుకుపోతున్నాడు కుర్రాడు. ఆసక్తిగా వింటున్నాడు పెద్దాయన. ‘‘రమేష్ అంకుల్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఒక సంస్థను ప్రారంభించే అంతలేదు. కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా వాళ్ళకు తోడయ్యి వెనుకవుండి నడిపిస్తే మాత్రం మనకు ముప్పే. రెండోది ఉన్నపళంగా మనకు వచ్చే నష్టమేమీ లేదు. అంటే వెంటనే మన కంపనీకి తాళాలు వేసుకోవాల్సిన అవసరం రాదు. మనకూ వాళ్ళు మార్కెట్లోకి వచ్చి నిలదొక్కుకొనే వరకూ టైం ఉంటుంది. ఇక నేను ప్రపోస్ చేస్తున్న చర్యలు : 1. ఈ రిపోర్టును మనం కొనుక్కొని, మన సంస్థలో అమలు చెయ్యడం. తద్వారా కాలంతో పాటు నడిస్తున్నామనే ఇమేజ్ చేంజ్ ఓవర్‌తో కూడిన సానుకూలత మార్కెట్లో మనకు వస్తుంది. 2. ఆ అబ్బాయిని మన కంపెనీలోకి తీసుకొని – దీని అమలు భాధ్యతను అతనికే అప్పచెప్పడం. 3. ఇక చివరిది, ఎలాగూ ఈ రిపోర్టు మన చేతిలో ఉంది కనుక కామ్‌గా మనకు నమ్మక స్తులయిన వాళ్ళ ద్వారా దీనిని అమలు పరచడం, మన ప్రస్తుత సంస్థలో కానీ మరో కంపనీ పెట్టి అయినా కానీ..’’ ముగించి పెద్దాయన వైపు చూసాడు అనిరుధ్. ‘‘బాగానే ఉంది. దేశ విదేశాల్లో ఎన్నో ఏళ్ళ చదువు నీకు నేర్పలేని పాఠాన్ని ఇప్పుడు భవిష్యత్తు మీది భయం నేర్పింది’’ కుర్చీలో వెనక్కువాలి సాలోచనగా చెప్పాడు పెద్దాయన. ‘‘నేను కంపనీ పెట్టిన కొత్తలో కార్మికోద్యమం జోరుగా సాగుతూ ఉండేది. అప్పట్లో నాకో అప్లికేషను వచ్చింది. తాను స్థానిక కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్నట్టు, పక్షవాతానికి గురయిన తండ్రి సంపాదన లేక ఇబ్బందులు పడుతున్నట్లు, ఇంగ్లీషు, టైపు లోయర్ పాస్ అయిన తనకు సరైన అవకాశం కల్పిస్తే సాయంత్రం వచ్చి 3 – 4 గంటలు పని చేస్తానని అందులో చెప్పాడు. మన ఆఫీసు అప్పుడు ఆటో నగర్లో ఒక చివర ఉండేది. సాయంత్రం 5.45కి సిటీ బస్సు సెంటర్లో బయలుదేరేది. ఉద్యోగులందరూ 5.30కే ఎక్కడి పనులక్కడ వదిలి బయలుదేరి వెళ్లిపోయే వాళ్ళు. అప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఇతన్ని పిలిచి ముందుగా ఉద్యోగులు అటూ ఇటూ పారేసిన ఫైల్స్, వాటిలోని కాగితాలు ఏరించి ఎవరి టేబుల్ మీద వారికి సర్ది పెట్టించే వాడిని. అలా రెండో రోజు వాళ్ళకి వెదుక్కోకుండా పని సులువయ్యేది. ఇంకా అప్పట్లో వచ్చే టెలిగ్రామ్‌లు తీసుకొని, చదివి అందులోని విషయాన్ని రిజిస్టర్లో నమోదు చెయ్యడం వంటి చిన్న చిన్న పనులు అప్పజెప్పాను. టైపు వచ్చు కాబట్టి కొన్ని అవసరమైన లెటర్స్ డిక్టేటు చేస్తే డ్రాఫ్ట్ చేసి పెట్టేవాడు. నెలకు యాభై ఇచ్చిన గుర్తు. కానీ నాతో బాటు రాత్రి 8 – 9 గంటల వరకూ ఉండేవాడు. కొన్నాళ్ళకి అతని తండ్రి చనిపోయాడు. వాడు నాల్రోజులు పనిలోకి రాలేదు. అప్పుడు ఆఫీసులో వాడు లేని లోటు తెలిసింది. వాడి పనితనం చూసిన నేను రెండొందల రూపాయలు ఖర్చులకని వాళ్ళింటికి పంపాను. ఆనాడు నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగా, వాడు చదువు పూర్తి చేసిన దగ్గరనుంచీ ఈ నాటివరకు నా దగ్గరే పని చేస్తున్నాడు. వాడే రమేష్! ఇక్కడి చిత్తు కాగితాల నుంచి నా వ్యాపార రహస్యాలన్నీ తెలుసు వాడికి. అయితే ఆనాడు నేను చూపించిన దయకి కృతజ్ఞతాబద్దుడయి ఇక్కడే ఉండిపోయాడు. అందుకే వాడికి కొడుకు పుట్టాడని తెలియగానే బంగారపు గొలుసొకటి పంపాను. వాడు పది పాసయ్యాడంటే పదివేలు ఇచ్చాను. ఇంజనీరింగ్ చదువుతున్నాడంటే కంప్యూటర్ కొనిచ్చాను. మొన్న పీజీ అయ్యిందంటే ఫారిన్ పంపాము కదా. ఇల్లు కట్టుకుంటున్నాడంటే అప్పు ఇచ్చాను. ఇదంతా వాడిమీద అభిమానం అనుకోకు. వాడి సామర్థ్యానికి నేను ఇచ్చే విలువ’’ అయ్య చెప్పేదంతా అబ్బాయి జాగ్రత్తగా వింటున్నాడు. ‘‘ఇప్పుడు వాడి కొడుకు కూడా తయారయ్యాడు. వసంత్..! నువ్విందాక అన్నావు చూడూ రమేష్ వాళ్ళకి ఒక సంస్థను ప్రారంభించే స్థోమత లేదని. నిజమే! కానీ ఇద్దరూ కలసి పెట్టుబడిని సముపార్జించే సామర్థ్యం ఉన్న వాళ్ళు’’ ఊహ తెలిసినప్పటి నుంచీ రమేష్ అంకుల్‌గా తెలిసిన వ్యక్తిని వాడు అనడం మొదలు, తండ్రి కళ్ళలో కసిని ఆసక్తిగా గమనిస్తున్నాడు అనిరుధ్. ‘‘నువ్వు చెప్పిన మార్గాలలో మొదటిది – చివరిది పనికిమాలినవి. కానీ మధ్యనున్నది భేషయినది. అదే వాడి కొడుకుని మన కంపనీలోకి తీసుకొని ఈ రిపోర్టు అమలు భాద్యతను అప్పచెప్పడం. వాడు అక్కడ ఉండగానే మాట్లాడు. కొత్త పం«థాలో సంస్థను నడిపించడానికి నీ సహకారం కావాలని అడుగు. వాడి అంతట వాడు ఈ రిపోర్టు గురించి ప్రస్తావించే వరకూ అసలు ఆ ఊసు ఎత్తకు. తను చెప్పినప్పుడు ఇందులో కొత్త విషయాలేమీ లేవు, అవన్నీ నీకెప్పుడో తెలుస న్నట్టుగా చెప్పు. వాడి తండ్రి నెల జీతంకన్నా కనీసం ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఆఫర్ చెయ్యి. కావాలంటే ఒక ఫోను, కారూ కూడా పడెయ్యి’’ దిశానిర్దేశం గావించాడు చైర్మన్. చెప్పినవన్నీ రాసుకున్న తనయుడు లేచాడు. యేడాది తరువాత. ‘‘వసంత్గాడిని ఈమధ్య బెంగళూరు పంపావా?’’ వైస్ చైర్మన్ ఛాంబర్ తలుపును వేగంగా తోసుకొని వచ్చి ఆవేశంగా అడిగాడు పెద్దాయన. లేచి నిల్చున్న కుమారుడు కంగారుగా ‘‘అవున్సార్! ఏదో కాన్ఫరన్స్ ఉంటే....’’ అని నీళ్లు నమిలాడు. ‘‘భారత వాణిజ్య మండలీ, ఇఐఐ సంయుక్తంగా ఏడాదికి ఒక్కసారి నిర్వహించే కాన్ఫరెన్సురా అది. ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. నీకు కుదరక పోతే నాకు చెప్తే నేను వెళ్ళేవాడిని కదా. అనవసరంగా వాడిని పంపి తప్పు చేశావు’’ వెంటనే ఆలోచనలో పడ్డాడు అనిరుధ్. ‘‘రైల్లోనో, ఎకానమీలోనో కాక బిజినెస్ క్లాసులో పంపావు. తిరుగు ప్రయాణంలో వాడికి అమిత్ మిశ్రాతో పరిచయం అయ్యింది. తెలుసు కదా ఇంతకు ముందు ఉత్తరాన ఉండేవాడు, ఇప్పుడు దక్షిణాదిన మనకు పోటీగా విస్తరిస్తున్నాడు. కాసేపటి పరిచయంలోనే వీడి సామర్థ్యం గ్రహించి వెంటనే ఉద్యోగం ఆఫర్ చేశాడు. రేపు వీడు వాడిని కలవడానికి ఢిల్లీ వెళ్తున్నాడు’’ అమితాశ్చర్యంతో కళ్ళు విప్పార్చి చూస్తుండిపోయాడు అనిరుధ్. ఇంతలో తలుపు తట్టిన చప్పుడయి ఇద్దరూ ఆ వైపు చూసారు. ‘‘మే ఐ కమిన్ సార్’’ టై సరి చేసుకుంటూ తల లోపలికి పెట్టాడు వసంత్. ‘‘అదేంటయ్యా, నువ్వు లోనికి రావడానికి అనుమతడగాలా? ఇంకెప్పుడూ అలా చెయ్యకు, ఎప్పుడైనా సరే తలుపు తోసుకొని రా అంతే. ఏరా అనిరుధ్ నువ్వు చెప్పలా?’’ అని కొడుకు వైపు చూసాడు. ఏమి చెప్పాలో తెలీక తలాడించాడు బిడ్డ. ఆ అభిమానానికి ఉబ్బితబ్బిబ్బయిన వసంత్ మొహమాటంగా ‘‘అదీ..రేపు కొంచెం సెలవు కావాల్సార్’’ అన్నాడు. ‘‘కొంచెం చాలా, ఏం ఎక్కడికి వెళ్ళుతున్నా?’’ చనువుగా అడిగాడు పెద్ద బాసు. ‘‘ఫ్రెండ్ పెళ్లుంది సార్’’ ‘‘మరి నీ పెళ్లెప్పుడోయ్?’’ ‘‘అప్పుడే కాద్సార్. ఇంకా సెటిల్ అవ్వాలి’’ ‘‘గుడ్. అలా ఉండాలి కుర్రాళ్ళు. రేపు ఇంపార్టెంట్ పనులేమీ లేకపొతే సరే. ఏరా!’’‘ఆ! అంత అర్జెంటు పనులేమీ లేవు సార్. ఓకే వసంత్ – యూ కాన్ గో!’’ అన్నాడు చిన్న బాసు. ఇరువురికీ ధన్యవాదములు చెప్పి వెళ్ళిపోయాడు వసంత్. ‘‘చూసావా ఎంత నేర్పుగా వ్యవహరిస్తున్నాడో’’ ‘‘అసలు ఇవన్నీ మీకెలా తెలిసాయి డాడ్... సారీ.. సార్!’’‘‘మనం మార్కెట్లో కొనసాగాలంటే మన పోటీదారులకన్నా వేగంగా ఆలోచించాలిరా! లేక పోతే కనీసం వాళ్ళ ఎత్తులు తెలుసుకొనే ప్రయత్న మన్నా చెయ్యాలి. అందుకే అక్కడ పని చేసేవాడి నొకడిని మన కోసం కొనేసా. వాడే ఇలాంటి విషయాలన్నీ మనకోసం మోస్తుంటాడు. వీడు రెస్యూమే పంపించాడట, ఇంటర్వ్యూకి పిలవమని అమిత్ హెచ్ఆర్ వాళ్ళకిచ్చాడట – అలా తెల్సింది. చూద్దాంలే ఏం జరుగుద్దో’’ అన్నాడు. తర్వాతి రోజు సాయంత్రం ఆలస్యంగా వచ్చిన కొడుకు భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన తండ్రి అతనికి వినపడేలా ఫోనులో ‘‘ఆ చెప్పు ఏమి ఇచ్చారు – సీదా జనరల్ మేనేజరా లేక వైస్ ప్రెసిడెంటా?’’ అని అడిగి అటు నుంచొచ్చిన సమాధానానికి ‘‘వాట్?’’ అని ఆశ్చర్యపోయాడు. కొడుకు కూడా ఆసక్తిగా తలెత్తి చూసాడు. ఫోను పక్కన పడేసి, ‘‘అమిత్ వాడి గురించి తెలుసుకోమని ఒక ప్రయివేట్ డిటెక్టివ్‌ని పురమాయించాడట’’‘‘అంతే కదా, మనమూ సీనియర్ పొజిషన్లో తీసుకునేటప్పుడు వెరిఫై చేయిస్తాంగా’’ తేలికగా చెప్పాడు కొడుకు. పెద్దాయన శూన్యంలోకి చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు. ‘‘వీడికి బయట తిరుగుళ్ళు బాగా ఎక్కువయ్యాయి. మీ చెల్లెలు కూడా గోల చేస్తుంది, త్వరగా ఆ మూడు ముళ్ళు వేయించేస్తే నా మేనకోడలు ఖృషిత నాకు తోడుగా ఇంట్లో ఉంటది. మీ బాబూ కొడుకులిద్దరూ వ్యాపారం అని ఊళ్ళు తిరగొచ్చు’’ కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ చెప్పింది తల్లి. ‘‘పెళ్ళేగా.. చేయించేద్దాం’’ అని మళ్ళీ ఫోనందుకొన్నాడు వ్యాపారి. దేశ రాజధానిలోని ఖరీదైన హోటల్లో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఉత్తర దక్షిణ సాంప్రదాయాల కలబోత కొట్టొచ్చినట్టుగా అగుపిస్తోంది. పీటల మీద అనిరుధ్ కూర్చొని ఉన్నాడు. తండ్రి హడావుడిగా అటూ ఇటూ తిరిగేస్తూ అందరినీ పలకరిస్తున్నాడు. ఇరు రాష్ట్ర ప్రముఖులతో పాటు ఉత్తర దేశ గొప్పోళ్ళు కూడా విచ్చేస్తున్నారు. చక్కగా అలంకరించుకొచ్చిన ఖృషిత మెల్లగా వేదికనెక్కి, పెళ్ళికొడుకు వద్దకెళ్లి నవ్వుతూ మాట్లాడుతోంది. ఇది గమనించిన వరుని తల్లితండ్రులిరువురూ వెంటనే అక్కడికి చేరుకొన్నారు. మేన కోడలు పెద్ద వాళ్ళ కాళ్ళకు మొక్కింది. తనను పైకి లేపి మోటికాలిరుస్తూ, ‘‘నా ఇంటికి కోడలిగా వస్తావనుకొన్నానే. అబ్బాయి ఏడీ?’’ అని అడిగింది మేనత్త. ‘‘ఇప్పుడు మాత్రం ఏమే. వాడూ పరాయి వాడా ఏంటి, మన రమేష్ కొడుకే కదా. ఇద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు. మన సంస్థను ముందుకు తీసుకెళ్ళతారు. ఏమ్మా?’’ తల నిమురుతూ చెప్పాడు మేనమామ. ఇంతలో పైకి వచ్చిన వసంత్ అనిరుద్‌తో చేయి కలిపి, ముందుకొచ్చాడు. ‘‘రావయ్యా... ఖృషీ మా ఇంటి కోడలు కాలేదని వాళ్ళ అత్త బాధ పడుతోంది. నేనేమో అబ్బాయి మాత్రం మనకు పరాయివాడా అంటున్నా. అసలు నువ్వు ఉన్నావనే ధైర్యంతోనేనయ్యా నేను ఈ విలీనానికి ఒప్పుకున్నది. నా నమ్మకాన్ని వమ్ము కానియ్యవు కదూ?’’ అన్నాడు పెద్దాయన. ‘‘ఎంత మాట అంకుల్, మీరేమీ వర్రీ కాకండి. అన్నీ నేను చూస్కుంటా’’ భరోసా ఇచ్చాడు వసంత్. ‘‘ఆ మాటన్నావ్ చాలు బాబూ. వాళ్ళ కంపెనీ పెద్దదని, వాటా ఎక్కువని మన వాడిని చిన్న చూపు చూస్తారేమో. మీ నాన్న ఎలా వెనకుండి నన్ను ఇన్నాళ్లూ నడిపించాడో ఇకపై నువ్వూ అలాగే మన చైర్మన్‌కి తోడుండి ముందుకు తీసుకెళ్లాలి,’’ ‘‘తప్పకుండా సార్. చైర్మన్ గారికి ఏ లోటూ రాకుండా చూస్కుంటా’’ కృతజ్ఞత నిండిన గొంతుతో కాస్త ముందుకు వంగి మరీ చెప్పాడు వసంత్. ఒద్దికగా చీర సర్దుకుంటూ భర్త వసంత్‌తో కలసి వేదిక దిగుతున్న అమ్మాయిని చూస్తుంటే, ఆరునెళ్ళ క్రితం నాటి రాత్రి జరిగిన సంగతి కళ్ళముందుకొచ్చింది ఆ ఇల్లాలికి. ‘‘పెళ్ళేగా – చేయించేద్దాం’’ అని మళ్ళీ ఫోనందుకొన్నాడు వ్యాపారి. ‘‘హలో రమేష్ గారూ. మీతో కొంచెం మాట్లాడాలి. అరే ఇప్పుడు నేను నీ యజమానిగా ఫోన్ చేయలేదయ్యా, ఆడ పెళ్ళివాళ్ళ తరపున చేసాను. చెప్పండి మాట్లాడొచ్చా?.. అదీ నా చెల్లెలు నాదగ్గరకొచ్చి ‘అన్నా నా కూతురుకొక మంచి సంబంధం చూసి పెట్టమం’దయ్యా. నాకు వెంటనే మీ తనయుడు గుర్తుకొచ్చాడయ్యా. అదే నా చెల్లి ‘అన్నా నీ కొడుక్కి నా కూతుర్ని చేసుకో’ అనుంటే మా వాడితోనే ఈ పెళ్లి జరిపించేవాడిని – కానీ అది మంచి వాడిని వెదికి తన కూతురికి పెళ్లి చెయ్య మందయ్యా. మా సుపుత్రుడి సంగతి నీకూ తెల్సుగా, బొత్తిగా నిలకడలేదు వెధవకి. అందుకే నిన్ను అడుగుతున్నా, నువైతే నా మాట నిలబెడతా వని నమ్మకం. నేనేదో నిన్ను అడిగానని మొహ మాటానికి ఒప్పేసుకోకు. మీ ఇంట్లో అందరూ ఆలోచించుకోండి, నా నమ్మకాన్ని వమ్ము కానివ్వ కుండా తీపి కబురుతో తిరిగి ఫోను చెయ్యి.’’అవతలి వాళ్ళకి మాటాడే అవకాశం ఇవ్వకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పేసి ఫోను పెట్టేసాడు పెద్దాయన. ‘‘నేనన్నది మన మేనకోడలు ఖృషితతో మనవాడి పెళ్లి గురించి. మధ్యలో రమేష్ కొడుకెందుకొచ్చాడు?’’ కొంచెం షాక్‌కు గురైన అనిరుధ్ తల్లి మెల్లగా మాటలు కూడదీసుకుని అడిగింది. అర్ధాంగికి బదులు చెప్పక, కొడుకుని చూస్తూ, ‘‘ఇందాక సీనియర్ పొజిషన్‌కి బ్యాక్ ఎండ్ వెరిఫై చేయిస్తారన్నావు కదూ, కానీ ఇండస్ట్రీలో రమేష్‌ని ఎరగని వారు లేరు, అదీ కాక వసంత్ ఇప్పటికే మన దగ్గర పని చేస్తున్నాడు కదా, ఇంకా ఎందుకు వివరాలు కనుక్కోమని డిటెక్టీవ్ని పురమాయించి ఉంటాడు అని ఆలోచిస్తుంటే మీ అమ్మ అప్పుడే పెళ్లి అన్నది. వెంటనే నాకు తట్టింది, అమిత్కో కూతురుందని. ఇప్పటికే అప్పుడప్పుడు కంపెనీ వ్యవహారాల్లో తననూ నిమగ్నం చేస్తున్నాడు, ఇప్పుడు సరైన జోడీని వెదికి ఆమెకి తోడుగా తనకు అండగా తెచ్చుకోవాలని తండ్రిగా అనుకొని ఉంటాడు. వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే మనం వ్యూహాలు పన్నడమే కాదు – ఎదుటివారి బలాలు, బలహీనతలు తెలుసుకొని, వాళ్ళ ఎత్తులు కూడా ముందే ఊహించి వాటిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం చాలా కాలం మనగల్గుతాం. అందుకే వెంటనే ఈ మంత్రం వేసాను. లేకపోతే రేపు ఆ వసంత్ గాడు నీ ముందే నీకన్నా పెద్ద సంస్థకి యజమాని అవ్వుతాడు.’’ తండ్రిలోని లోపలి మనిషిని విస్మయంతో చూస్తున్నాడు తనయుడు. ‘‘రేయ్ నాన్నా! తెలివితేటలు భగవంతుడు అందరికీ సమానంగానే ఇస్తాడురా – కొందరే వాటిని పూర్తిగా వినియోగించుకుంటారు. మిగతా వాళ్లందరూ చిన్న చిన్న ప్రలోభాలకి లొంగిపోయి తమ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని గుర్తెరగక మనబోటి వాళ్ళ తెలివికి దాసోహమవుతారు. వాళ్ళ కష్టాన్నే సోపానంగా చేసుకొని మనం పైకెదగాలి. పెట్టుబడి కోసం ఏమైనా తనఖా పెట్టు, పనితనం చూసి ఎవరికైనా మొక్కు – ఈ నేర్పే నీ భవిష్యత్తుకి పునాది’’ సూటిగా తన సుతుని కళ్ళలోకి చూస్తూ ఉపదేశం గావించాడు జనకుడు. ‘‘నా చెల్లిని నేను ఒప్పిస్తాను. ఆ అమ్మాయి బాధ్యత నీదే’’ అంటూ ఫోను అందుకొని, ‘హా సీఎఫ్ఓ గారూ, మీ పరిచయస్తులతో మనం మన సంస్థని అమ్మకానికి పెడుతున్నామని మార్కెట్లో ప్రచారం చేయించు. చైర్మన్‌గారి కొడుకు కొత్తగా వ్యాపారం మొదలుపెడతానికి పెట్టుబడి కోసం ఈ కంపెనీ అమ్మెయ్యాలని చూస్తున్నట్టు చెప్పు. ఇదంతా నా కొడుకు తెలివనీ – వాడికి భవిష్యత్తులో చాలా మంచి, పెద్ద ప్రణాళికలు ఉన్నాయని ఊదరగొట్టు. అలాగే అమిత్ మిశ్రా ఏమైనా ఆసక్తి చూపిస్తే – పనిలో పనిగా తన కూతురుని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే బావుంటదని చూచాయిగా హింట్ ఇవ్వు. అర్థమయ్యిందా? నేననుకొన్నది అనుకొన్నట్టు జరిగితే నిన్ను మా జాయింట్ కంపెనీకి సీఈఓని చేస్తాను. కానీ గుర్తుంచుకో ఇదంతా త్వరగా జరిగిపోవాలి’’ దిమ్మ తిరిగి దిక్కులు చూస్తూ ఉండిపోయారు తల్లీ కొడుకులిద్దరూ. రెండు సాంప్రదాయాల మేళవింపుతో పెళ్లి వైభవంగా జరిగింది. పెద్దలు ఒక్కొక్కరే వచ్చి ఆశీర్వదించి వెళ్ళుతున్నారు. ఇంతలో వేదిక మీదినుంచి అమర్నాథ్ చెయ్యెత్తి వసంత్‌ని పిలిచాడు. పరిగెత్తుకుంటూ వెళ్లిన వాడితో, ‘‘మన ఎంపీగారు. తీసికెళ్ళి భోజనం పెట్టించు. మొత్తం దగ్గరుండి చూసుకో ఆయన తిని వెళ్లే వరకూ అక్కడే ఉండు’’ అని పురమాయించాడు. తనకే ఆ పని చెప్పడం గౌరవంగా భావించి అతిథిని తోడ్కొని వేదిక దిగి ముందుకు కదిలాడు వసంత్. నిరంతరమైన, అగమ్యగోచరమైన, అంతులేని ఆర్థిక ఆవృతాంలోకి దిగి కొట్టుకుపోతున్న తన తరవాతి తరాన్ని ఎందుకో తెలీని నవ్వును మొహానికి పులుముకొని కోడలితో సహా చూస్తుండిపోయాడు హాళ్ళో వెనుక వరసలోనున్న రమేష్. - అనిల్ ప్రసాద్ లింగం -
నయన్ చిత్రంలో అనిరుధ్
తమిళసినిమా: లేడీ సూపర్‌స్టార్ నయనతారకు సంబంధించిన న్యూస్ అంటేనే సినీ ప్రేక్షకులకు సమ్‌థింగ్ స్పెషల్‌గా మారిపోయింది. దశాబ్దం దాటినా అగ్రనటిగా రాణిస్తున్న అరుదైన నటి ఈ కేరళా బ్యూటీ. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో బిజీబిజీగా నటించేస్తున్న నయనతారను చూసి సహ నటీమణులు ఈర్ష్య పడుతున్నారు. మాయ, అరమ్ వంటి చిత్రాలు ఈ నటి స్థాయిని మరింత పెంచేశాయి. తాజాగా నయనతార నటిస్తున్న అలాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం కొలమావు కోకిల (కొకో). నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంలో పలు ప్రత్యేకతలు చోటు చేసుకుంటాయంటున్నారు చిత్ర వర్గాలు. నానుమ్ రౌడీదాన్ చిత్రం ఆమెకు సినీకేరీర్ పరంగానూ, వ్యక్తిగత జీవితం పరంగానూ పెద్ద ప్లస్ అయ్యింది. అందులో నటనకు ప్రశంసలు, అవార్డులు అందుకున్న నయనతార జీవితంలోకి ఆ చిత్రం దర్శకుడు విఘ్నేశ్‌శివ ప్రేమికుడిగా వచ్చారు. ఇక కొలమావు కోకిల చిత్రానికి వస్తే ఇందులో నయనతార మూగ యువతి పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఇందులో నటి శరణ్య పొన్వన్నన్, జాక్విలిన్, అరంతంగి నిషా, యోగిబాబు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇక మంచి రైజింగ్‌లో ఉన్న యువ సంగీతదర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీత బాణీలను కడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ట్విట్ చేశారు. కొలమావు కోకిల చిత్రంలో ఐదు పాటలు ఉంటాయని తెలిపారు. నవ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈయన అనిరుధ్‌కు బాల్యమిత్రుడట. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇందులో ఈ సంచలన సంగీతదర్శకుడు ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. వడకర్రి లాంటి కొన్ని చిత్రాల్లో పాటల్లో తళుక్కున మెరిసి వెళ్లిపోయిన అనిరుధ్ నయనతార చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు చాలా మంది నటించమని కోరినా నిరాకరించిన అనిరుధ్‌ను దర్శకుడు ఈ చిత్రంలో నటించడానికి ఒప్పించినట్లు టాక్. సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కూడా ఇలా అప్పుడప్పుడూ పాటల్లో మెరిసి ఈ తరువాత ఫుల్‌టైమ్ హీరోగా మారిపోయారు. మరి అనిరుధ్ కెరీర్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. -
త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడా..?
అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి రిలీజ్‌కు ముందే ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించారు. అదే సమయంలో ఈ సినిమాను అనిరుధ్ సంగీతమందిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అజ్ఞాతవాసి రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. సినిమా ఫెయిల్యూర్‌కు ఆడియో ఆకట్టుకునేలా లేకపోవటం కూడా ఓ కారణం అన్న టాక్ వినిపించింది. దీంతో త్రివిక్రమ్ అండ్ టీం ఆలోచనలో పడ్డారు. ఎన్టీఆర్ సినిమాకు మరో సంగీత దర్శకుడిని తీసుకోవాలని భావిస్తున్నారట. అనిరుధ్‌ను పక్కన పెట్టి తెలుగులో వరుస మ్యూజికల్ హిట్స్ సాధిస్తున్న తమన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అదే సమయంలో సంగీత దర్శకుడి విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
అజిత్ చిత్రానికి అనిరుద్ సంగీతం
తమిళసినిమా: చిత్రానికి సంగీతం సగం బలం. సన్నివేశాల మూడ్‌ను ఎలివేట్ చేసేది సంగీతమే. హీరోహీరోయిన్లు, దర్శకుడి తరువాత ఎవరైనా అడిగేది సంగీత దర్శకుడెవరనే. ఒకే హీరోకు కంటిన్యూగా పనిచేసే సంగీత దర్శకులు అరుదనే చెప్పాలి. వివేగం చిత్రం తరువాత అజిత్ కాస్త విరామం తీసుకుని రీచార్జ్ అయ్యి విశ్వాసంతో రావడానికి రెడీ అవుతున్నారు.ఆయనతో ఇంతకు ముందు వీరమ్, వేదాళం, వివేగం చిత్రాలను చేసిన దర్శకుడు శివ మరోసారి ఈ చిత్రంతో రెండో హ్యాట్రిక్‌కు ప్రయత్నిస్తున్నారు.గత చిత్రాల్లో అజిత్‌ను సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో చూపించి సక్సెస్ అయిన శివ ఈ సారి స్మార్ట్ అజిత్‌ను తెరపైకి తీసుకురానున్నారనే ప్రచారం జోరందుకుంది. వివే గం నిర్మాత టి.త్యాగరాజనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిత్రాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ముమ్మరంగా సాగుతోంది. వారి వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ, సంగీత దర్శకుడెవరన్న విషయమై నిర్ణయం జరిగిపోయిందని సమాచారం. ఈ చిత్రానికి ముందుగా యువన్‌శంకర్‌రాజా పేరు తెరపైకి వచ్చింది. మంగాత్తా చిత్రం తరువాత అజిత్ నటించే విశ్వాసం చిత్రానికి ఆయన సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత ఇరుదుచుట్రు చిత్ర ఫేమ్ శ్యామ్.సీఎస్ పేరు ప్రచారంలోకి వచ్చింది. తాజాగా అనిరుద్‌నే సెట్ అయినట్లు సమాచారం. ఈ వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
దుమ్ములేపుతున్న పవన్ కొత్త సినిమా పాట
-
అనిరుధ్–విఘ్నేశ్ జంట ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారుల పోరాటం ముగిసింది. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విఘ్నేశ్ పెరణమల్లూర్ జంట సెమీస్‌లో ఓటమి పాలైంది. గురువారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో అనిరుధ్ – విఘ్నేశ్ (భారత్) జంట 4–6, 6–7 (2/7)తో అర్జున్–శశి కుమార్ ముకుంద్ (భారత్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మరో సెమీస్ మ్యాచ్‌లో కాజా వినాయక్ శర్మ (ఏపీ)–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) ద్వయం 2–6, 2–6తో టాప్ సీడ్ చంద్రిల్ సూద్–లక్షిత్ సూద్ (భారత్) జంట చేతిలో ఓడిపోయింది. -
అనిరుధ్ విజృంభణ
సాక్షి, హైదరాబాద్: ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో రాకేశ్ ఎలెవన్ బౌలర్ ఎన్. అనిరుధ్ (4–1–10–5) విజృంభించాడు. దీంతో కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాకేశ్ ఎలెవన్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ అనిరుధ్ ధాటికి 18.1 ఓవర్లలో 44 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ రోహన్ అలీ (11) మినహా ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. అనిరుధ్ 10 పరుగులిచ్చి 5 వికెట్లతో చెలరేగగా, మరో బౌలర్ జి. రిత్విక్ 9 పరుగులిచ్చి 3 వికెట్లను పడగొట్టాడు. అనంతరం స్వల్పలక్ష్యం కోసం బరిలోకి దిగిన రాకేశ్ ఎలెవన్ జట్టు 10.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు: జై భగవతి: 125 (బి. సారంగ్ 30, శివ కుమార్ 31; ఎఫ్‌కే ముజ్తబా 6/31, అభిషేక్ 2/16), పాషాబీడీ: 126/5 (విశేష్ 39, కార్తీక్‌రెడ్డి 34 నాటౌట్; మహ్మదుల్లా ఖాన్ 2/27). u రోహిత్ ఎలెవన్: 95 (సర్తాజ్ 36; ప్రేమ్ కుమార్ 4/9), ఖల్సా: 35 (పవన్ శర్మ 5/7). u విజయ్ హనుమాన్: 117 (పి. సాయినాథ్ 43, తౌసీఫ్ 3/64, అజ్మత్ ఖాన్ 5/22), న్యూ బ్లూస్: 120/5 (అకేందర్ కుమార్ 30, అజిత్ సింగ్ 39). u నిజాం కాలేజ్: 301, ఎలిగెంట్ సీసీ: 149 (అద్నాన్ అహ్మద్ 33, విపిన్ చౌదరి 50 నాటౌట్; అక్షయ్ 6/27, డి. శ్రీనివాస్ 3/50). u ఆక్స్ఫర్డ్ బ్లూస్: 87, గ్రీన్‌టర్ఫ్: 88/2 (వాహెద్ 36 నాటౌట్). -
ఎన్టీఆర్ కోసం కొలవెరి కుర్రాడు..!
ఇంత వరకు అధికారిక ప్రకటన రాకపోయినా.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందంటూ ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల పేర్లు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ ను హీరోయిన్ గా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతుండగా.. తాజాగా సంగీత దర్శకుడు కూడా ఫైనల్ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంగీతమందిస్తున్న అనిరుధ్, ఎన్టీఆర్ సినిమాకు కూడా పనిచేయనున్నాడట. ప్రస్తుతం జై లవ కుశ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, నవంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. -
క్వార్టర్స్‌లో అనిరుధ్–విఘ్నేశ్ జంట
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) పురుషుల ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు ముందంజ వేశారు. డబుల్స్ విభాగంలో అనిరుధ్ బ్రదర్స్ జోడీ, విష్ణువర్ధన్ జోడీ క్వార్టర్స్‌కు చేరుకోగా... సింగిల్స్ విభాగంలో రిషబ్ అగర్వాల్ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో అనిరుధ్ చంద్రశేఖర్– విఘ్నేశ్ ద్వయం 6–4, 0–6, 10–7తో అన్విత్ బెంద్రె–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ జంట 6–1, 6–3తో నిక్షేప్ రవికుమార్– సూరజ్ ప్రబోధ్ జోడీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో తేజస్ చౌకుల్కర్–నికి కలియండ పూనచ (భారత్) జంట 6–4, 7–6 (5)తో విజయంత్ మలిక్–సిద్ధార్థ్ రావత్ జోడీపై, వశిష్ట్ చెరుకు–ప్రజ్వల్ దేవ్ (భారత్) జంట 7–6 (4), 6–3తో అర్జున్ మరియప్ప–దక్షిణేశ్వర్ సురేశ్ జోడీపై గెలుపొందాయి. రిషబ్ ముందంజ మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రిషబ్ అగర్వాల్ 6–0, 6–3తో ఆదిత్య హరి ససోంగ్కో (ఇండోనేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మోహిత్ మయూర్ జయప్రకాశ్ 3–6, 6–4, 6–4తో నికి కలియండ పూనచపై, విజయ్ సుందర్ ప్రశాంత్ 6–4, 7–5తో జతిన్ దహియాపై, సిద్ధార్థ్ రావత్ 6–3, 7–5తో అభినవ్ సంజీవ్ షణ్ముగమ్పై, శశికుమార్ ముకుంద్ 6–3, 6–1తో జేసన్ పాట్రోంబోన్ (ఫిలిప్పీన్స్)పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. -
నా భార్య మానసిక రోగి!
‘‘నా భార్య మానసిక రోగి’’ అని గాయని సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్ పేర్కొన్నారు. పలువురు సినీప్రముఖుల ఆంతరంగిక విషయాలను సోషల్ మీడియా ద్వారా బయట పెడుతూ గాయని సుచిత్ర కోలీవుడ్‌లో అలజడి రేపుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య హీరో ధనుష్ తనతో తప్పుగా ప్రవర్తించారని, ఈ విషయాన్ని ఎప్పుడు.. ఎవరితో చెప్పడానికైనా సిద్ధమేనని తన ట్విట్టర్లో పేర్కొన్నారామె. ఆ వెంటనే ఆ వ్యాఖ్యలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్ చేశారని ప్లేటు ఫిరాయించారు. ఆ తర్వాత హీరో ధనుష్– హీరోయిన్ త్రిష, సంగీతదర్శకుడు అనిరుద్– హీరోయిన్ ఆండ్రియా, హీరో రానా–హీరోయిన్ త్రిష, బుల్లితెర నటి డీడీ (దివ్యదర్శిని) ఒక యువకునితో క్లోజ్‌గా ఉన్న దృశ్యాలను సుచిత్ర ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఇవి వారి రాసలీలలు’ అంటూ ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు. అలాగే వేరే వ్యక్తుల నీలి చిత్రాలను పోస్ట్ చేసి, రాయలేని వ్యాఖ్యలను పొందుపరిచారు. అదే విధంగా ‘వేచి చూడండి.. మరికొందరి తారల రాసలీలలను బయట పెడతా’ అంటూ పోస్ట్ చేయడం చిత్రపరిశ్రమలో మరింత కలకలం సృష్టించింది. ఈసారి గాయని సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్ స్పందిస్తూ.. ఆ ఫొటోలకు, తన భార్య సుచిత్రకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్ చేశారని, సంబంధించిన వారికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నానని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గాయని సుచిత్ర తన భర్త నుంచి విడిపోవడానికి సిద్ధమైందనే ప్రచారం జోరందుకుంది. అయితే అది వదంతి మాత్రమేనని కార్తీక్‌కుమార్ కొట్టిపారేశారు. అదే విధంగా తన భార్య మానసిక రుగ్మతతో బాధపడుతోందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తాజాగా సుచిత్ర ట్విట్టర్లో మరో సంచలన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ధనుష్, అనిరుద్‌తో పార్టీలో పాల్గొన్నానని, అప్పుడు తాను సేవించిన పానీయంలో మద్యం కలిపారని, ఆ తరువాత జరిగిన ఘోర అనుభవం గురించి చెప్పలేనని సుచిత్ర పేర్కొనడం దుమారం రేపింది. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు చేసింది ‘నేను కాదు, నా ట్విట్టర్‌ను హ్యాక్ చేసి ఎవరో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయమై చర్చిస్తున్నామ’ని సుచిత్ర పేర్కొన్నారు. మొత్తం మీద సుచిత్ర ప్రవర్తన కోలీవుడ్‌ని ఒక కుదుపు కుదిపేస్తోందనే చెప్పాలి. ధనుష్, అనిరుద్, త్రిష, ఆండ్రియా తదితరులు సుచిత్ర చేసిన వ్యాఖ్యలకు, పెట్టిన ఫొటోలకు స్పందించలేదు. కాగా.. సుచిత్ర ట్విట్టర్‌ను ఎవరూ హ్యాక్ చేయలేరని, ఆ విధంగా ఆమె పాస్వర్డ్ పెట్టుకున్నారని నెటిజన్లు పేర్కొనడం గమనార్హం. మరి.. సుచిత్ర ట్విట్టర్ హ్యాక్ అయ్యిందా? ఏది నిజం? ఏది అబద్ధం? ఇదిలా ఉంటే.. తన అనుమతి లేకుండా ట్విట్టర్ ఎకౌంట్‌ను ఇతరులు అనుసరించలేని విధంగా సుచిత్ర సెట్ చేసుకున్నారు. – ‘సాక్షి’ చెన్నై -
నయన కోసం అనిరుద్ పాట
లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి దోరా. హారర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దాస్ రామస్వామి దర్శకత్వంలో నేమిచంద్ జపక్ పతాకంపై హిందేశ్ జపక్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి వివేక్–మెర్విన్ ల ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు.ఇందులోని ఎంగే పోరా దోరా, వాళ విడు పాటలు ఇప్పటికే విడుదలై సంగీత ప్రియుల మధ్య మంచి స్పందనను పొందుతున్నాయి. తాజాగా చిత్ర నాయకి నయనతార అతీంద్రియ శక్తులతో పోరాడి గెలిచే ఇతి వృత్తంగా సాగే రా రా రా అనే ఆక్రోశంగా సాగే పాటను ఇటీవల యువ సంగీత తరంగం, గాయకుడు అనిరుద్ పాడగా రికార్డ్ చేసినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ పాట మధ్యమధ్యలో నయనతార సంభాషణలు చోటు చేసుకుంటాయని చెప్పారు. ఇలా మంచి జనరంజకమైన పాటలతో కూడిన ఈ చిత్ర ఆడియో హక్కుల్ని సోనీ మ్యూజిక్ సంస్థ పొందిందని, త్వరలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
బ్రేకప్ కాదు చిన్న బ్రేక్!
మాది బ్రేకప్ కాదు చిన్న బ్రేక్ మాత్రమే అంటున్నారు యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ఆ కథేందో చూద్దామా ‘నటుడు ధనుష్, అనిరుధ్ల మధ్య స్నేహబంధం మాత్రమే కాదు, కుటుంబ బంధమూ ఉంది. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది ధనుష్ అని తెలిసిందే. ధనుష్ కథానాయకుడిగా నటించి నిర్మించిన, ఆయన భార్య ఐశ్వర్య దర్శకత్వం వహించిన 3 చిత్రం ద్వారా అనిరుధ్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కాక పోయినా అనిరుధ్‌ను మాత్రం బాగా పాపులర్ చేసింది. ఆ తరువాత కూడా ధనుష్ నటించిన వేలై ఇల్లా పట్టాదారి, ఆయన నిర్మించిన ఎదిర్‌నీశ్చల్, నానుమ్ రౌడీదాన్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాంటిది ఆ తరువాత ధనుష్, అనిరుద్ కాంబినేషన్ లో చిత్రాలు రాలేదు. దీంతో వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయనే రకరకాల వదంతులు హల్చల్ చేశాయి. ధనుష్‌నే కాదు ఆయన కుటుంబం అంతా అనిరుధ్‌ను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. ధనుష్‌కు దూరం అయిన అనిరుధ్ ఆయనకు పోటీ నటుడిగా భావించే శింబుతో దోస్తానా చేస్తున్నట్లు మీడియాలో కథలు ప్రచారం అయ్యా యి. అందుకు కారణం లేకపోలేదు. శింబు రాసిన కలకలం సృష్టించిన బీప్ సాంగ్‌లో అనిరుధ్‌కు భాగం ఉందనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ధనుష్, అనిరుధ్ల మధ్య దూరానికి ఇదీ ఒక కారణం అన్నారొక వర్గం. ఇన్ని రకాలుగా వదంతులు మార్మోగుతున్నా ఇటు ధనుష్ గానీ, అటు అనిరుద్ గానీ నోరు మెదపకుండా మౌనం పాటిస్తూ వచ్చారు. చాలా కాలం తరువాత అనిరుధ్ ఈ వ్యవహారంపై స్పం దించారు. ఆయన మాట్లాడుతూ ధనుష్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అసలు బ్రేకప్ అన్న మాటేకే తావు లేదని, చిన్న బ్రేక్ మాత్రమేనని అన్నారు. తామిద్దరం కలిసి వరుసగా చిత్రాలకు పనిచేయడం వల్ల ప్రేక్షకులకూ బోర్ కొడుతుందని, చిన్న గ్యాప్ తీసుకుని కలిసి పనిచేస్తే వారికి సంతోషంగా ఉంటుందని అన్నారు. అభిమానుల అభిరుచిని గౌరవించే విధంగా తాను, ధనుష్ కలిసి పని చేయడానికి చిన్న బ్రేక్ తీసుకున్నామని, త్వరలోనే మళ్లీ కలిసి పని చేస్తామని అనురుధ్ చెప్పారు. -
ఎన్టీఆర్ మనసు మార్చుకున్నాడు..?
జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత నెక్ట్స్ సినిమా ఎంపిక కోసం చాలా రోజుల పాటు ఎదురుచూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫైనల్‌గా కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌ను తీసుకోవాలని భావించారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం అనిరుద్ కన్నా దేవీ శ్రీ ప్రసాద్ అయితేనే బెటర్ అని భావిస్తున్నారట. అనిరుద్ వర్క్ విషయంలో కాస్త స్లోగా ఉండటం అందులోనూ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో అనిరుద్‌ను పక్కన పెట్టి దేవీని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా ముగ్గురు ముద్దుగుమ్మలు అలరించనున్నారు. కాజల్ అగర్వాల్ తో పాటు నివేదా థామస్, అనుపమా పరమేశ్వరన్ లను హీరోయిన్లుగా తీసుకోవాలని భావిస్తున్నారు. -
సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్
అనిరుద్‌ను స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజా సూపర్‌స్టార్ సంగీత దర్శకుడిగా పేర్కొన్నారు. ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై టీ.విజయరాఘవేంద్ర నిర్మించిన చిత్రం రమ్. హృషీకేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సంచితాశెట్టి, మియాజార్జ్ నాయికలుగా నటించారు. వివేక్, నరేన్, అమ్జాద్‌ఖాన్, అర్జున్ చిదంబరం తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయి భరత్ దర్శకత్వం, అనిరుద్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. కార్యక్రమంలో అనిరుద్ మాట్లాడుతూ ఇది తన 13వ చిత్రం అని తెలిపారు. 13 సంఖ్యను చాలా మంది హారర్ సంఖ్యగా బావిస్తారన్నారు. అదే విధంగా తాను చిన్నతనంలో మైడియర్ కుట్టిసాత్తాన్ చిత్రం చూశానన్నారు. అప్పట్లో అది హారర్ కథా చిత్రం అని కూడా తెలియదన్నారు. ఆ తరువాత హారర్ చిత్రాన్నే తాను చూడలేదన్నారు. అలాంటి చిత్రాలంటే తనకు భయం అని అన్నారు. అలాంటిది తొలిసారిగా హారర్ ఇతి వృత్తంతో కూడిన రమ్ చిత్రానికి సంగీతాన్ని అందించినట్లు తెలిపారు. దర్శకుడు కథను నెరేట్ చేయగానే ఆసక్తి సినిమాపై కలిగిందన్నారు. చిత్రంలో ఏడు పాటలు ఉన్నాయని తెలిపారు. ప్రేక్షకులు తమపై పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయమని అనిరుద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత తనను కలిసి రమ్ చిత్ర వ్యాపారం పూర్తయిందని చెప్పారన్నారు. సూపర్‌స్టార్ సంగీత దర్శకుడు అనిరుద్ ఉంటే చిత్రం వ్యాపారం జరగకుండా ఉంటుందా? నిర్మాత తన వద్దకు వచ్చినా తానీ చిత్ర వ్యాపారాన్ని ఏక్ దమ్గా చేసి ఉండేవాడినని పేర్కొన్నారు. -
కోలుకున్న హిమాచల్
గువహటి: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ కోలుకుంది. తొలి ఇన్నింగ్సలో కేవలం 36 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు రెండో ఇన్నింగ్సలో మాత్రం బాగానే ఆడింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ రెండో ఇన్నింగ్సలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. పారస్ డోగ్రా (101 బంతుల్లో 57; 7 ఫోర్లు), రాబిన్ బిస్త్ (113 బంతుల్లో 50 బ్యాటింగ్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. సిరాజ్, రవికిరణ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్సలో 126 పరుగులకై ఆలౌటై 90 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. బాలచందర్ అనిరుధ్ (162 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించగా, రిషి ధావన్‌కు 7 వికెట్లు దక్కారుు. ప్రస్తుతం హిమాచల్ ఓవరాల్‌గా 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. హరియాణా లక్ష్యం 371 ముంబై: ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో హరియాణా విజయానికి 371 పరుగులు చేయాల్సి ఉంది. మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 47 ఓవర్లలో మూడు వికెట్లకు 138 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఆ జట్టు మరో 233 పరుగులు చేయాలి. రోహిల్లా (75 బ్యాటింగ్), చాహల్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్సలో 70.1 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటరుుంది. విహారి (50) అర్ధసెంచరీ చేయగా.. శివకుమార్ (42) రాణించాడు. హరియాణా బౌలర్లలో మోహిత్ శర్మ, చాహల్ మూడేసి వికెట్లు తీశారు. -
అనిరుధ్‌కు స్వర్ణం
షూటింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అనిరుధ్ స్వర్ణంతో మెరిశాడు. గచ్చిబౌలీలోని శాట్స్ షూటింగ్ రేంజ్లో జరిగిన ఈ పోటీల్లో జెడ్79- క్లే పీజియన్ స్కీట్ విభాగంలో అనిరుధ్ 35 పాయింట్లు సాధించి పసిడి పతకాన్ని దక్కించుకోగా... అభినవ్, రిజ్వాన్‌లు రజత కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఇతర విభాగాల్లో విరాజ్ (జెడ్-81), సొనాలి రాజు (జెడ్82), రాజేంద్ర ప్రసాద్ (జెడ్ 84), ఆయూష్ (ఎన్79), సుభాష్ (ఎన్80)లు పసిడి పతకాలను గెలుచుకున్నారు. -
ఊహించని దారిలో...
పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ‘వై దిస్ కొలవెరి డీ..’ ఫేమ్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ‘జల్సా’తో ప్రేక్షకుల్ని ఫుల్ ఖుషీ చేసిన పవన్, త్రివిక్రమ్‌లు.. ‘అత్తారింటికి దారేది’తో భారీ విజయంతో పాటు భారీ వసూళ్లు సాధించారు. ఈ రెండూ సగటు తెలుగు చిత్రాల తరహాలోనే ఉంటాయి. ఈసారి మాత్రం సరికొత్త దారిలో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారట. రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా ప్రేక్షకులకు కొత్త చిత్రం అందించాలనుకుంటున్నారట. అటు పవన్.. ఇటు త్రివిక్రమ్.. ఈ చిత్రం గురించి మాట్లడడం లేదు. సంగీత దర్శకుడు అనిరుధ్ మాత్రం కన్ఫర్మ్ చేసేశారు. ‘‘త్రివిక్రమ్ ‘అఆ’కి సంగీతం అందించే చాన్స్ నాకే వచ్చింది. మిస్ చేసుకున్నా. పవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందబోయే తాజా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతున్నా. ఎవరూ ఊహించనంత కొత్తగా ఉంటుందీ సినిమా’’ అని అనిరుధ్ చెప్పారు. ఈ చిత్రానికి ‘దేవుడే దిగి వచ్చినా’ టైటిల్ పరిశీలనలో ఉందట. -
మూడో ప్రయత్నం అయినా ఫలిస్తుందా..?
ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్ సంగీత దర్శకుల లిస్ట్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అనిరుధ్ రవిచంద్రన్. కొలవర్రీ పాటతో నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ కోలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అనిరుధ్ చాలా కాలంగా టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్లీ సినిమాతోనే అనిరుధ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా.., కుదరలేదు. తరువాత త్రివిక్రమ్, నితిన్‌ల కాంబినేషన్లో రూపొందిన 'అ..ఆ..' సినిమాతో అనిరుధ్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది. అనిరుధ్ పేరుతో పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ సగం షూటింగ్ అయిన తరువాత అనిరుధ్ స్థానంలో మిక్కీ జే మేయర్‌ను తీసుకున్నారు. అయితే తాజాగా మరోసారి టాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు అనిరుధ్. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే కొత్త సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ కాంబినేషన్ అయినా సెట్స్ మీదకు వస్తుందేమో చూడాలి. -
రమ్ కోసం శింబు పాట
సంచలన నటుడు శింబు రమ్ కోసం గొంతు విప్పారు. ఏమిటీ ఏదేదో ఊహించుకుంటున్నారా? అలాంటిదేమీలేదుగానీ, రమ్ అనే చిత్రం కోసం ఆయన ఒక పెప్పీ పాటను పాడారన్నమాట. శింబుకు పాడడం కొత్తేమీకాదు. అయితే కొన్ని పాటలను రెగ్యులర్ గాయకులు పాడడం కంటే శింబు లాంటి నటులు పాడితే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇక ఆయనకు మరో సంచలన సంగీత దర్శకుడు తోడైతే చె ప్పే అవసరం లేదు. ఎస్.శింబు, అనిరుద్‌ల కలయికలో రూపొందిన పాటను త్వరలో వినబోతున్నాం మనం. రమ్ చిత్రం కోసం అనిరుద్ బాణీలు కట్టిన జిబ్బిరిష్ అనబడే పూర్తిగా భావంలేని పేయోఫోబిలియా అనే పల్లవితో కూడిన పాటను శింబు పాడితేనే బాగుంటుందని ఆయన భావించారట. దెయ్యాలకు మనం భయపడాలో కూడదో.. దెయ్యాల కంటే భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం అనే పదజాలాలతో కూడిన గీత రచయిత వివేక్ రాసిన ఈ పాటను శింబు పర్ఫెక్ట్గా పాడారని అనిరుద్ తెలిపారు. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న రమ్ చిత్రాన్ని ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత విజయరాఘవేంద్ర నిర్మిస్తున్నారు. నవ దర్శకుడు సాయిభరత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హ్రిహికేష్, సంచితాశెట్టి, మియాజార్జ్, వివేక్, నరేన్, అజ్మద్, అర్జున్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక ఇంటిలోని అమానుష శక్తుల నేపథ్యంలో జరిగే చిత్రమే రమ్ అని చిత్ర వర్గాలు తెలిపారు.శింబు పాడిన ఈ పాట కచ్చితంగా విశేష ఆదరణను పొందుతుందన్న నమ్మకాన్ని సంగీతదర్శకుడు అనిరుద్ వ్యక్తం చేస్తున్నారు. -
హడలెత్తించిన అనిరుధ్
సాక్షి, హైదరాబాద్: గౌడ్స్ ఎలెవన్ బౌలర్ అనిరుధ్ శ్రీవాస్తవ (5/71) విజృంభించడంతో ఎవర్గ్రీన్ బ్యాట్స్‌మెన్ విలవిల లాడారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో రెండో రోజు ఆటలో ఎవర్గ్రీన్ జట్టు 225 పరుగుల వద్ద ఆలౌటైంది. జితేందర్ త్యాగి 44, చందన్ సహాని 47 పరుగులు చేశారు. భౌమిక్ (33 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. గౌడ్స్ ఎలెవన్ జట్టుకు 62 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మొదటి రోజు ఆటలో గౌడ్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో కాంటినెంటల్ బౌలర్ మనీష్ (5/73) చెలరేగడంతో గుజరాతీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన గుజరాతీ జట్టు 67.3 ఓవర్లలో 220 పరుగులు చేసి ఆలౌటైంది. రోహిత్ రెడ్డి (59), ఆదిత్య (65) అర్ధసెంచరీలతో రాణిం చగా... శ్రవణ్ కుమార్ 34 పరుగులు చేశాడు. తొలిరోజు ఆటలో కాంటినెంటల్ జట్టు 94.3 ఓవర్లలో 236 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు ఏఓసీ: తొలి ఇన్నింగ్స్ 481/9 (విష్ణు తివారి 80; సతీశ్ 3/89, యశ్‌పురి 3/114), జెమినీ ఫ్రెండ్స్: 99 (కోటేశ్వర్ రావు 3/26), ఫాలో ఆన్: 5/1 (1.5 ఓవర్లు). స్పోర్టింగ్ ఎలెవన్: 395/9 డిక్లేర్డ్ (సూర్యప్రసాద్ 37; రవితేజ 4/86), ఎంపీ కోల్ట్స్: 218/6 (హర్ష జున్‌జున్‌వాలా 51, నిఖిల్ యాదవ్ 30, రవితేజ 77 బ్యాటింగ్, ప్రణీత్ 38; సాత్విక్ రెడ్డి 3/72). -
బన్నీకైనా బాణీలు కడతాడా..?
కొలవరి పాటతో నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది సంగీత దర్శకుడు అనిరుధ్. కోలీవుడ్‌లో స్టార్ మ్యూజిషియన్‌గా పేరున్న అనిరుధ్‌తో కొద్ది రోజులుగా టాలీవుడ్లో మ్యూజిక్ చేయించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనిరుధ్ కూడా స్టార్ హీరోల సినిమాలైతే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నా.. ఆ ప్లాన్స్ వర్క్ అవుట్ కావటం లేదు. ఇప్పటికే రెండు సినిమాలను ఓకె చేసి కూడా తరువాత వదులుకున్నాడు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్ టైనర్ బ్రూస్లీకి, అనిరుధ్ మ్యూజిక్ చేయాల్సి ఉంది. అయితే అదే సమయంలో అజిత్ హీరోగా వేదాలం సినిమా ఆఫర్ రావడం చరణ్ సినిమాను పక్కన పెట్టేశాడు. ఆ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో నితిన్ హీరోగా తెరకెక్కతున్న అ.. ఆ.. సినిమాకు అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ప్రకటించారు. కానీ సగం సినిమా షూటింగ్ కూడా పూర్తయిన తరువాత అనిరుధ్, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించడానికి అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి, బన్నీ హీరోగా ఓ మాస్ యాక్షన్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాకు అనిరుధ్‌తో మ్యూజిక్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి బన్నీ సినిమాకైన ఈ యువ సంగీత దర్శకుడు బాణీలు కడతాడేమో చూడాలి. -
అజిత్‌తో సత్యజ్యోతి ఫిలింస్ చిత్రం
వేదాళం చిత్రం తరువాత అజిత్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారన్న విషయం తెలిసిందే. దానికి అజిత్ హీరోగా వీరం, వేదాళం చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శివనే దర్శకత్వం వహించనున్నారన్న విషయం ప్రచారంలో ఉంది. అయితే ఆ చిత్రాన్ని ఏ సంస్థ నిర్మించనుందన్న అంశమే సస్పెన్స్‌గా ఉంది. అయితే ఆ విషయం ఇప్పుడు బయటపడింది. ఈ భారీ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనుంది. ఈ సంస్థ ప్రస్తుతం ధనుష్ హీరోగా ప్రభుసాలోమన్ దర్శకత్వంలో ఒక చిత్రం, విక్రమ్ ప్రభు హీరోగా ప్రభాకరన్ దర్శకత్వంలో మరో చిత్రం నిర్మిస్తోంది. తాజాగా అజిత్ కథానాయకుడిగా భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీని షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సహా విదేశీయానంలో ఉన్న అజిత్ మే నెలలో చెన్నైకి తిరిగి రానున్నారు. అయితే ఆయన తాజా చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. చిత్రాన్ని 2017 జనవరికి విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇందులో వీరం చిత్రం ఫేమ్ తమన్న మరోసారి అజిత్‌తో జత కట్టే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల భోగట్టా. చిత్ర వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదన్నది గమనార్హం. అయితే ఆ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. -
త్రివిక్రమ్ సినిమా నుంచి అనిరుధ్ ఔట్
సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం నితిన్ హీరోగా అ.. ఆ.. సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.., ప్రస్తుతం మార్చి లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సమయంలో త్రివిక్రమ్‌కు అనుకోని షాక్ తగిలింది. చాలా రోజులుగా త్రివిక్రమ్ సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. అయితే అ.. ఆ.. సినిమాకు తమిళ యువ సంచలనం అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఈ యువ సంగీత దర్శకుడు త్రివిక్రమ్ సినిమా నుంచి తప్పుకున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం ఇప్పుడు హడావిడిగా మరో సంగీత దర్శకుడి కోసం వేట ప్రారంభించాడు త్రివిక్రమ్. దేవీ శ్రీ ప్రసాద్‌తో పాటు, మిక్కీ జే మేయర్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్న త్రివిక్రమ్, త్వరలోనే కొత్త సంగీత దర్శకుణ్ని ప్రకటించనున్నాడు. -
శింబు పాటలో మంచి పదాలూ ఉన్నాయి
శింబు పాటలో మంచి పదాలు ఉన్నాయనీ, వాటిని పక్కన పెట్టి మాటలు లేని బీప్ అంశాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని ఆయన తండ్రి టీ రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వాట్స్‌యాప్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ శింబుపై కావాలనే కొందరు కుట్ర పన్ని దుష్ర్పచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను మహిళలను ఉన్నతంగా చూపిస్తూ పలు చిత్రాలు రూపొందించాననీ, తనకు మహిళలపై చాలా గౌరవం ఉందని, అదే మర్యాద శింబుకు ఉందని అన్నారు. తను స్త్రీలను ఏనాడు అగౌరవ పరచలేదని అన్నారు. మహిళా సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే తాను వారికి క్షమాపణలు చెప్పుకుంటున్నానన్నారు. చట్ట నిబంధనలు తెలియవు నటుడు శింబు ఒక టీవీ ఛానల్‌కు బేటీ ఇస్తూ తాను 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నానన్నారు. సినిమా మినహా తనకేమీ తెలియదనీ అదేవిధంగా చట్ట నిబంధనలు తనకు తె లియవని అ న్నారు. ఆ కష్ట కాలంలో తన కు అండగా నిలబడిన తన తల్లిదండ్రుల కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తాను పాటను కావాలని వాట్స్‌యాప్‌లో పోస్ట్ చేయలేదని అందువల్ల తనను విమర్శించడం సబబు కాదని అన్నారు. తప్పుగా భావిస్తే క్షమించమని కోరుకుంటున్నానని అన్నారు. రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ శింబు సోమవారం చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.అయితే ఆ పిటీషన్‌పై ఈ నెల 23న విచారణ జగపనున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. శింబుపై ఫిర్యాదులను, ఆర దోళనలను భరించలేక ఆయన ఇంటి ముందు సోమవారం నలుగురు ఆయన అభిమానులు ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నడిగర్‌సంఘం ఖండన శింబు చర్యల్ని నడిగర్ సంఘం ఖండించింది. దీని గురించి ఒక ప్రకటన విడుదల చేస్తూ సినిమా అన్నది కళకు, కోట్లాది రూపాయల వ్యాపారానికి చిరునామా అన్నారు. అలాంటి సినీ రంగంలో తప్పు చేస్తే చింతించడం, క్షమాపణ కోరడం చేయాలని పేర్కొన్నారు. శింబుపై సోమవారం మరో రెండు కేసులు నమోదు కావడం విశేషం. -
ప్రాచుర్యానికి మనమే కారణం
ఏ విషయమైనా ప్రాచుర్యంలోకి రావడానికి మనమే కారణం అన్నారు సీనియర్ నటి స్నేహ. బీప్ సాంగ్‌గా చెప్పబడుతున్న నటుడు శింబు రాసి, పాడగా సంగీత దర్శకుడు అనిరుద్ బాణీలు కట్టినట్లు ప్రచారంలో కలకలం సృష్టిస్తున్న పాటపై మహిళా సంఘాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. శింబు ,అనిరుద్‌లపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పలు కేసులు నమోదవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలు రావడంతో బీప్ పాట తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తోంది.దీంతో ఆ పాటను వినని వారికి కూడా ఇప్పుడు వినాలనే ఆకాంక్ష అధికం అవుతోంది. ఆ బీప్ సాంగ్ ఇంతకు ముందుకన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా వాట్స్‌యాప్‌లో హల్చల్ చేయడం గమనార్హం. మనమే కారణం ఈ విషయంపై నటి స్నేహ స్పందించారు. ఒక పాట ప్రాచుర్యం పొందడానికి మనమే కారణం అన్నారు. ఇంతకు ముందు స్త్రీలను గౌరవించే వారి ఘనతను చాటే పాటలు చాలా వచ్చాయి. అదే విధంగా ఆ మధ్య అడిడా అవళ్(కొట్టరా ఆమెను) లాంటి మహిళలను కించపరచే స్థాయికి మన పాటలు పడిపోయాయి. వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఒక పాట గురించి పదే పదే చర్చించడం వల్ల దానికి కచ్చితంగా ప్రాచుర్యం లభించడానికి మనమే కారణం అవుతున్నాం అన్నారు. దాని విజయానికి దోహదపడుతున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన బీప్ పాట గురించి తనను చాలా మంది అడిగారని, నిజానికి తానా పాటను వినలేదని చెప్పారు. ఇప్పుడా పాట వినాలనే ఆసక్తి తనకూ కలుగుతోందన్నారు. అయితే ఆ పాట అసభ్యపదజాలాలతో కూడిన పాట అని తెలిసిందన్నారు. అది మంచి పాట కాదని తెలిసిన తరువాత అసలు దాని గురించి చర్చించకుండా ఉండడమే ఉత్తమం అన్నారు. అదే విధంగా దానికింత ప్రాచుర్యం వచ్చేది కాదు కూడా అన్నారు. ఒక మహిళగా చెప్పాలంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పాటలు వింటున్నారు. కాబట్టి పాటల్లో అసభ్య పదాలు లేకుండా ఉంటే బాగుంటుంది అని స్నేహ అన్నారు. -
టీఆర్నూ వదలని బీప్ సాంగ్
సరదాగా అనుకున్న విషయాలు ఒక్కోసారి తీవ్ర పరిణామాలను చూపుతాయి. కాలక్షేపం కోసం చేసిన పనులు అనూహ్యంగా కాళ్లకు చుట్టుకుంటాయి. చెరపకురా చెడేవు అన్న నానుడి తరహాలోనే నవ్వకురా నలుగురిలో నానేవు అనేలా తయారయ్యింది నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌ల పరిస్థితి. శింబు,అనిరుద్ ఊసుపోక రూపొందించిన ఒక్క పాట వారి కెరీర్‌కే పెద్ద మచ్చగా మారిం ది. ఆడ వారిని అవమానించే విధంగా అసభ్య పదజాలాలతో కూడిన ఆ పాటను మహిళా లోకమే కాకుండా సభ్య సమాజమే అసహ్యహించుకుంటోంది. పలువురు శింబు,అనిరుద్ చర్యల్ని ఖండిస్తున్నారు. ఫిర్యాదుల పర్యంతం మేరకు చట్టం తన పని తాను చేయడానికి సన్నద్ధం అవుతోంది. ఇక శింబు, అనిరుద్ రూపొందించిన పాటగా చెప్పబడే ఆ బీప్ సాంగ్ ఇప్పటికీ సోషల్ నెట్ వర్క్స్‌లో హల్ చల్ చేస్తూనే ఉంది. అవకాశాలు వెనక్కి శింబు నటించిన ఇదు నమ్మ ఆళు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ఉండి పోయింది. తాజాగా నటిస్తున్న అచ్చం ఎంబదు మడమయడా చిత్రం చాలా కాలంగా నిర్మాణంలోనే ఉంది. తాజాగా చేయాల్సిన ఒక చిత్రం సందిగ్ధంలో పడింది. త్రిష ఇల్లన్నా నయనతార చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తన తదుపరి చిత్రాన్ని శింబు హీరోగా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో శింబు బీప్ సాంగ్ ప్రకంపనలు సృష్టించడంతో ఆ చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఆలోచనల్లో పడ్డట్టు సమాచారం. ఇక అనిరుద్ పరిస్థితి అంతకంటే దారణంగా మారింది. ఈ యువ సంగీత దర్శకుడి సూర్య చిత్రం సింగం-3 కి సంగీతాన్ని అందించే అవకావం వచ్చింది. అయితే తన బీప్ సాంగ్ రగడ కారణంగా ఆయన్ని ఆ చిత్రం నుంచి తొలగించారు. ఇదే విధంగా అనిరుద్‌కు మరో రెండు చిత్రాలు పోయినట్లు తెలిసింది. తండ్రిని వదలని బీప్ సాంగ్ పాట రాసి పాడిన శింబును బాణీలు కట్టిన అనిరుద్‌ను కష్టాల్లోకి నెట్టిన బీప్ సాంగ్ శింబు తండ్రి టీ.రాజేందర్‌ను వదలలేదు. 10 ఎండ్రదుకుళ్ చిత్రం తరువాత ఆ చిత్ర దర్శకుడు విజయ్ మిల్టన్ టీ.రాజేందర్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాలతో విజయ్ మిల్టన్ తన చిత్రం నుంచి టీఆర్ను తొలగించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఒక్కపాట ఎందరి కెరీర్లకు ఎఫెక్ట్ ఇచ్చిందో చూశారా? ఇది శింబు,అనిరుద్‌లకు అవసరమా! -
శింబు కోసం పోలీసుల వేట
చెన్నై : నటుడు శింబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయన మహిళలను అగౌర పరచే విధంగా అసభ్య పదజాలాలతో కూడిన పాటను రాసి, పాడి దాన్ని వాట్స్ యాప్‌లో పోస్ట్ చేశారని మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. కోవైకి చెందిన అఖిల భారత మాదర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాధిక నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌లపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోవై పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆయన ఆదేశాల మేరకు కోవై రేస్ కోర్స్ పోలీసులు శింబు, అనిరుద్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి రెండు రోజుల క్రితమే చెన్నై వచ్చారు. అయితే శింబు అజ్ఞాతంలోకి వెళ్లడం. అనిరుద్ కెనడాలో ఉండడంతో వారి ఇళ్లకు సమన్లు అంటించారు. కాగా శింబును అరెస్ట్ చేసే తిరిగి రావాలని పోలీస్ కమిషనర్ గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో కోవై రేస్ కోర్స్ పోలీసులు చెన్నైలోనే మకాం వేసి శింబు ఆచూకీ తెలియక నగరంలోని వీధులన్నీ తిరుగుతూ తీవ్రంగా జల్లెడేసి గాలిస్తున్నారు. మరో పక్క మాదర్ సంఘానికి చెందిన వారు శింబు ఇంటిని చుట్టు ముట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఉరి తీయాలి: కాగా సీనియర్ నటుడు వైజీమహేంద్రన్ మహిళల్ని కించపరచే విధంగా అశ్లీల పదజాలాలతో కూడిన పాటను రాసిన వారెవరైనా వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలని తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం.ఇక పోతే మంగళవారం కెనడా నుంచి చెన్నైకి తిరిగి రానున్న అనిరుద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం. కాగా శింబు తనకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తునట్లు తెలిసంది. మొత్తం మీద ఒక్క పాట కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోందని చెప్పవచ్చు. -
ప్రేమమ్ హీరోయిన్లు ఎవరు?
ప్రేమమ్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో మారుమోగుతున్న పేరు ఇది. ఈ పేరుతో మలయాళంలో రూపొందించిన చిత్రం అనూహ్య విజయం సాధించింది. దీనికి సృష్టికర్త పుత్రన్. నవీన్ కథానాయకుడు. మడోనా సెబాస్టియన్, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వర్ ముగ్గురు నాయికలు. ఈ ముగ్గురే ప్రేమమ్ చిత్ర కథకు మూలం, ప్రాణం. దీన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయడానికి గట్టి పోటీనే నెలకొంది. ఇప్పటికే టాలీవుడ్లో పునర్ నిర్మాణానికి ప్రేమమ్ చిత్రం సిద్ధమైంది. నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ఇక ఒక హీరోయిన్గా క్రేజీ నటి శ్రుతిహాసన్ ఎంపికయ్యారు. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ప్రేమమ్ చిత్రం రీమేక్ కానుందన్నది తాజా సమాచారం. దీన్ని తమిళంలో చిత్రంగా మలిచే బాధ్యతల్ని ఐశ్వర్య ధనుష్ చేపట్టనున్నారు. ఈమె ఇంతకు ముందు 3, వై రాజా వై చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. మూడవ చిత్రంగా ప్రేమమ్ రీమేక్‌కు సిద్ధమవుతున్నారు. ఇందులో హీరోగా విజయ్ సేతుపతి నటించే అవకాశం రాగా హీరోయిున్ల అన్వేషణలో చిత్ర యూనిట్ నిమగ్నమైంది. మలయాళంలో నటి సాయి పల్లవి చేసిన పాత్రను తమిళంలో నటి హన్సిక గాని, శ్రుతిహాసన్ గాని పోషించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో ఇద్దరు హీరోయిన్ల ఎంపిక జరగాల్సింది. అదే విధంగా ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, బాల సుబ్రమణ్యం చాయాగ్రహణం అందించనున్నారు. -
సూర్య సినిమాకు నో చెప్పాడు
కోలవరి పాటతో ఒక్కసారిగా నేషనల్ లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ఈ యంగ్ మ్యూజిషియన్ ప్రస్తుతం సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అందుకే సౌత్ ఇండియన్ టాప్ హీరోలు కూడా అనిరుధ్ పాటలకు స్టెప్పులేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే ఎంత బిజీగా ఉన్న మ్యూజిషియన్ అయినా సూర్య లాంటి టాప్ హీరో సినిమాకు ఛాన్స్ వస్తే కాదనరు. కానీ అనిరుధ్ మాత్రం ఆ సాహసం చేశాడు. సూర్య, హరి కాంబినేషన్లో తెరకెక్కిన సింగం, సింగం 2 సినిమాలకు సీక్వెల్‌గా సింగం-3 సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తొలి రెండు భాగాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మూడో భాగానికి మాత్రం అనిరుధ్‌తో మ్యూజిక్ చేయించాలని భావించారట చిత్రయూనిట్. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్, సింగం 3 సినిమాకు మ్యూజిక్ ఇవ్వలేనంటూ రిజెక్ట్ చేసేశాడు. దీంతో మరోసారి దేవీ శ్రీ నే సింగంకు సంగీతం అందించే ఛాన్స్ ఉందంటున్నారు. సూర్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్లో '24' సినిమాలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత నవంబర్ 15 నుంచి సింగం 3 షూటింగ్ ప్రారంభించనున్నారు.