రామ్చరణ్ చిత్రానికి డీఎస్పీ సంగీతం
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంగీత దర్శకుడు మారాడా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఆ చిత్ర సంగీత దర్శకుడిగా ముందుగా అనుకున్న అనిరుధ్ను తప్పించి ఆ స్థానంలో దేవి శ్రీ ప్రసాద్ను తీసుకున్నట్లు సమాచారం. సదరు చిత్రం కోసం తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రూపొందించిన ట్యూన్లు దర్శకుడు శ్రీను వైట్లను అంతగా ఆకట్టుకోలేదంటా.
ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడిని మార్చాలని శ్రీనువైట్లు భావించారు. ఆ క్రమంలో దేవిశ్రీప్రసాద్ను ఎంపిక చేసినట్లు తెలిసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ వేగంగా జరుపుకుటుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. డీవీవీ దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు.