Srinu Vaitla
-
టాలీవుడ్‌కి ఏఐ, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ చాలా అవసరం : హరీశ్ రావు
‘మన తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్‌తో పోటీ పడుతుంది. రాబోయే కాలంలో హాలీవుడ్‌తో మరింత పోటీని ఎదుర్కొవాలంటే.. ఇలాంటి వీఎఫ్ఎక్స్, ఏఐ(AI) టెక్నాలజీ చాలా అవసరం. సినిమా బడ్జెట్‌ను తగ్గిస్తూ.. విజువల్ ఎఫెక్ట్స్‌ను పెంచుతూ ప్రేక్షకులు అట్రాక్ట్ చేయాలంటే ఈ టెక్నాలజీ అవసరం ఉంది’ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తాజాజా హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) , దర్శకులు శ్రీనువైట్ల , కరుణ కుమార్, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన , నటులు విక్రాంత్ రెడ్డి, రఘు కుంచె హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ వెంట పరుగెడుతుంది. అమెరికా నుంచి ఇండియా వచ్చి ఇది స్థాపించిన మల్లీశ్వర్ గారు ఇంకా ఎదగాలని, చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తనవంతు కృషి చేయాలని కోరుతున్నా. ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రానికి ఆస్కార్ వచ్చిందంటే తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వ కారణం. ఇలాంటి టెక్నాలజీని తెలుగు పరిశ్రమకు రావడం అభినందనీయం’ అని అన్నారు. దర్శకులు శ్రీనువైట్ల(Srinu Vaitla) మాట్లాడుతూ ‘మల్లీశ్వర్ గారు మంచి ఆలోచనతో వీఎఫ్ఎక్స్తో పాటు ఏఐ బ్రాంచ్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ వంతుగా పాలుపంచుకోవడంతో పాటు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన గారు కల్పర వీఎఫ్ఎక్స్ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.దర్శకులు కరుణ కుమార్ మాట్లాడుతూ ‘తెలుగు సినీ ఇండస్ట్రీలో వీఎఫ్ఎక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది. టెక్నికల్‌గా మంచి వారిని గుర్తించడం సమస్యగా మారిన ఈ తరుణంలో మల్లీశ్వర్ గారు ఈ కంపెనీ పెట్టడం హ్యాపీ. సరైన క్వాలిటీతో అనుకున్న టైమ్‌కి అవుట్‌పుట్ ఇవ్వగలగితే వారికి కాంపిటీషన్ ఉండదు. ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. రఘు కుంచె మాట్లాడుతూ ‘కల్పర వీఎఫ్ఎక్స్ సంస్థ ద్వారా మల్లీశ్వర్ గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.హీరో విక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘గత పదేళ్ల కాలంలో చిత్ర పరిశ్రమకు వీఎఫ్ఎక్స్ అవసరం బాగా పెరిగింది. వీఎఫ్ఎక్స్ లేని మూవీ అంటూ ఉండదు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ సహా ప్రతి సినీ పరిశ్రమకు మేజర్ సర్వీస్ అందిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ సర్వీసెస్ సీఈవో డాక్టర్ మల్లీశ్వర్ గారు మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ వెరీ మచ్. యూఎస్‌లో నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఏఐ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ డెవలెప్ చేశాం. సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాలని అనుకున్నాం. వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఇక్కడ బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. హాలీవుడ్లో వాడే టెక్నాలజీని ఇక్కడ కూడా పరిచయం చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో దర్శకులు రాజమౌళి గారు, నాగ్ అశ్విన్ గారికి తెలుసు. తక్కువ బడ్జెట్ సినిమాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడాలని మేం అనుకున్నాం. టాలీవుడ్‌తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమవంతు పాత్ర పోషిస్తాం. నా ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ’ అని అన్నారు. -
ఊహించని అద్భుతాలు జరిగాయి: శ్రీను వైట్ల
‘‘డైరెక్టర్ కావాలని నా చిన్నప్పటి నుంచే కోరుకున్నాను. ఇందు కోసం చిన్న వయసులోనే చెన్నై వెళ్లాను. ఇండస్ట్రీలో నిలబడాలనే తపన, సినిమా క్రాఫ్ట్స్‌పై ఆసక్తి ఉండేవి. కానీ, ఓ దర్శకుడిగా ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాలు ఉంటానని నిజంగా ఆ రోజు ఊహించలేదు. నా కెరీర్లో ఇలా ఊహించని ఎన్నో అద్భుతాలు జరిగాయి. నా ప్రయాణం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రయాణంలో భాగమైన హీరోలు, నిర్మాతలు, టెక్నీషియన్స్, నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు’’ అని దర్శకుడు శ్రీనువైట్ల అన్నారు. రవితేజ, మహేశ్వరి జంటగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన చిత్రం ‘నీ కోసం (1999)’. గంటా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంతో శ్రీనువైట్ల దర్శకుడిగా పరిచయమయ్యారు.ఈ సినిమా విడుదలై నేటితో 25 ఏళ్లు పూర్తవుతాయి. అలాగే ఇండస్ట్రీలో పాతిక సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు శ్రీనువైట్ల. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ–‘‘నీ కోసం’ కి ముందు మరో సినిమా చేయాల్సింది. కానీ, ఆ సినిమా ఆగిపోవడంతో నిరుత్సాహంగా అనిపించింది. ఆ తర్వాత తక్కువ బడ్జెట్లో ఓ సినిమా చేయాలనుకుని ‘నీ కోసం’ కథ రాసుకుని, సినిమా స్టార్ట్ చేశాం. కానీ, ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రవితేజగారి సహాయంతో పూర్తి చేశాం. ఫస్ట్ కాపీ చూసి నాగార్జునగారు నన్ను మెచ్చుకుని, డైరెక్షన్ చాన్స్ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేను.అలాగే ‘నీ కోసం’ రిలీజ్‌కు రామోజీరావుగారు అండగా నిలబడ్డారు. అలాగే ఆయన బ్యానర్లోనే ‘ఆనందం’ సినిమా అవకాశం ఇచ్చారు. ‘నీ కోసం’ సినిమాకి ఏడు నంది అవార్డు వచ్చాయి. ఇక ‘ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు, ఢీ’ సినిమాలు నా కెరీర్‌లోని టాఫ్ ఫైవ్ మూవీస్‌గా చెప్పుకుంటాను. ‘దూకుడు’ సినిమాను తమిళంలో అజిత్‌గారితో రీమేక్ చేసే అవకాశం వచ్చింది. కానీ, అప్పటికే నేను ‘బాద్షా’కు కమిటై ఉండటంతో కుదర్లేదు. ‘బాద్షా’ హిట్ అయింది.సో.. అజిత్‌గారితో నేను ఆ సినిమా చేయలేదనే బాధ లేదు. మహేశ్‌బాబుగారితో నేను చేసిన ‘ఆగడు’ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై, ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ విషయంలో కాస్త బాధగా అనిపించింది. అయితే ఆ సినిమా తర్వాత మహేశ్‌గారు నాకు మంచి మోరల్ సపోర్ట్ ఇచ్చారు.. ఆ విషయాన్ని మర్చిపోలేను. ‘వెంకీ’ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉంది. ఇటీవల నా దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వం’ సినిమా హిట్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉంది. నా తర్వాతి సినిమాని త్వరలోనే చెబుతాను’’ అని చెప్పారు. -
రెడీలా బ్లాక్ బస్టర్ కావాలి: శ్రీనువైట్ల
‘‘ధూం ధాం’ సినిమా పాటలు బాగున్నాయి. ఈ చిత్రం ఫస్టాఫ్ ప్లెజంట్‌గా ఉండి సెకండాఫ్ హిలేరియస్‌గా ఉందని ఈ మూవీకి పని చేసిన నా స్నేహితులు చెప్పారు. మా ‘రెడీ’ సినిమాకి కూడా సెకండాఫ్ హిలేరియస్‌గా ఉందనే టాక్ విడుదలకి ముందే వచ్చింది. అదే తరహాలో రూపొందిన ’ధూం ధాం’ చిత్రం ‘రెడీ’లా బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ కావాలి’’ అని డైరెక్టర్ శ్రీను వైట్ల ఆకాంక్షించారు. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన సినిమా ‘ధూం ధాం’. ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ‘ధూం ధాం’ ప్రీ రిలీజ్‌కి అతిథిగా హాజరైన దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ– ‘‘సాయికిషోర్ మచ్చ నాకు మంచి మిత్రుడు. ‘ధూం ధాం’తో తనకి, యూనిట్‌కి మంచి విజయం దక్కాలి’’అన్నారు. ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు సాయి రాజేశ్ అన్నారు. ‘‘మా అబ్బాయి చేతన్‌ను ఈ సినిమా హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుంది’’ అన్నారు రామ్ కుమార్.‘‘శ్రీను వైట్లగారి కామెడీని, వైవీఎస్ గారి సాంగ్స్ స్టైల్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ చేశాను. ప్రేక్షకుల టికెట్ ధరకు సరిపడా నవ్వులు అందిస్తాం’’ అని సాయికిషోర్ మచ్చా తెలిపారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమలో గీత రచయితగా రెండు దశాబ్దాల ప్రయాణం పూర్తి చేసుకున్న రామజోగయ్య శాస్త్రిని ఈ వేదికపై సన్మానించారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దామోదర ప్రసాద్ మాట్లాడారు. -
మరో ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ 'విశ్వం'
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో గోపీచంద్ ఒకడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'విశ్వం'. అప్పట్లో కామెడీ చిత్రాలతో తనదైన ట్రెండ్ చేసిన శ్రీనువైట్ల.. దాదాపు ఆరేళ్ల తర్వాత చేసిన సినిమా ఇది. థియేటర్లలో రిలీజైన ఇరవై రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది.(ఇదీ చదవండి: సూర్య 'కంగువ'.. తెలుగులోనే ముందు!)గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ఈ సినిమాని ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్గా తీశారు. చెప్పడం అయితే కామెడీ అన్నారు గానీ రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీ అయ్యేసరికి జనాలు రిజెక్ట్ చేశారు. దీపావళి సందర్భంగా తొలుత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.'లౌక్యం' సినిమా వచ్చి పదేళ్లు దాటిపోయింది. ఈ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్.. ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు. కాకపోతే అవి వచ్చి వెళ్తున్నాయి తప్పితే ఒక్కటి గుర్తుంచుకోదగ్గ స్థాయిలో లేదు. మరోవైపు శ్రీనువైట్ల కూడా ఎంతో నమ్మకంతో ఈ సినిమా తీశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం వీళ్లిద్దరి చేతిలోనూ మరో ప్రాజెక్ట్ లేదు. (ఇదీ చదవండి: OTT Review: ఊహకందని థ్రిల్లింగ్ వెకేషన్)Feel every emotion in one film! Viswam is the perfect blend for your weekend watchlist.Watch #Gopichand and #kavyathapar starrer #viswam now on #aha@YoursGopichand @SreenuVaitla @KavyaThapar @vishwaprasadtg @peoplemediafcy @VenuDonepudi pic.twitter.com/Xyk9PPLV7y— ahavideoin (@ahavideoIN) November 2, 2024 -
‘విశ్వం’ మూవీ రివ్యూ
టైటిల్: విశ్వంనటీనటులు: గోపీచంద్, కావ్యథాపర్, నరేశ్, సునీల్, వెన్నెల కిశోర్, సుమన్, ప్రగతి తదితరులునిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడిదర్శకత్వం: శ్రీనువైట్లసంగీతం: చైతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్విడుదల తేది: అక్టోబర్ 11, 2024శ్రీనివైట్లకు ఈ మధ్యకాలంలో సరైన హిట్ సినిమాలే లేదు. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ(2018)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ‘విశ్వం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బారిగా చేయడంతో ‘విశ్వం’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? విజయదశమి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం శ్రీను వైట్లకు విజయం దక్కిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేటంటే..కేంద్ర మంత్రి సీతారామరాజు(సుమన్)కు హత్యకు గురవుతాడు. ఈ హత్యను దర్శన అనే బాలిక కళ్లారా చూస్తుంది. హంతకులు ఆ బాలికను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఓ రోజు దర్శన ప్యామిలి మొత్తం కొండగట్టుకు వెళ్ళ్తుండగా కొంతమది వారిపై అటాక్ చేస్తారు. గోపిరెడ్డి(గోపీచంద్) వచ్చి వారిని రక్షిస్తాడు. అనంతరం తాను బిల్డర్ బుల్ రెడ్డి కొడుకునని పరిచయం చేసుకొని దర్శన ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అసలు గోపిరెడ్డి ఎవరు? దర్శనను ఎందుకు కాపాడుతున్నాడు? కేంద్రమంత్రిని చంపిందెవరు? ఈ హత్యకు ఇండియాలో జరగబోయే ఉగ్రవాద చర్యలకు గల సంబంధం ఏంటి? ఇండియాలో సెటిలైన పాకిస్తాన్ ఉగ్రవాది ఖురేషి(జిష్షుసేన్ గుప్తా) చేస్తున్న కుట్ర ఏంటి? ఈ కథలో బాచిరాజు(సునీల్) పాత్ర ఏంటి? కాస్ట్యూమ్ డిజైనర్ సమైరా (కావ్యథాపర్)తో గోపిరెడ్డి ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి హిట్ కొట్టిన చరిత్ర శ్రీనువైట్లది. ఆయన సినిమాలో కామెడీతో పాటు కావాల్సినన్ని కమర్శియల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. అయితే గత కొన్నాళ్లుగా శ్రీనువైట్ల మ్యాజిక్ తెరపై పని చేయడం లేదు. అందుకే ఈ సారి తన పంథా మార్చుకొని ‘విశ్వం’ తెరకెక్కించానని ఓ ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల చెప్పారు. సినిమాలో కామెడీ కొత్తగా ఉంటుందని బలంగా చెప్పారు. మరి సినిమాలో నిజంగా కొత్త కామెడీ ఉందా? కొత్తకథను చెప్పాడా? అంటే లేదనే చెప్పాలి.శ్రీనువైట్ల గత సినిమాల మాదిరే విశ్వం కథనం సాగుతుంది. టెర్రరిస్ట్ బ్యాగ్డ్రాప్ స్టోరీకి చైల్డ్ సెంటిమెంట్ జోడించి, తనకు అచ్చొచ్చిన కామెడీ పంథాలోనే కథనం నడిపించాడు. పాయింట్ బాగున్నా.. తెరపై చూస్తే మాత్రం పాత సినిమాలే గుర్తొస్తుంటాయి. ఫస్టాఫ్‌లో జాలిరెడ్డి(పృథ్వి), మ్యాంగో శ్యామ్(నరేశ్) కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. హీరోయిన్లో ప్రేమాయణం, యాక్షన్ సీక్వెన్స్ రొటీన్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరో ప్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. ట్రైన్ ఎపిసోడ్ కూడా ప్రమోషన్స్‌లో చెప్పినంత గొప్పగా ఏమీ ఉండదు కానీ..కొన్ని చోట్ల మాత్రం నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్ కామెడీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. విలనిజం బలంగా లేకపోవడం కూడా సినిమాకు మైనస్సే. క్లైమాక్స్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. గోపిరెడ్డి పాత్రకి గోపిచంద్ పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటి మాదిరే యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. స్టెప్పులు కూడా బాగానే వేశాడు. ప్లాష్‌బ్యాక్ స్టోరీలో గోపీచంద్ నటన బాగుంటుంది. కావ్యథాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. నరేశ్, పృథ్వీల కాంబోలో వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్లస్ అయింది. సునీల్ పాత్ర ఇంపాక్ట్ సినిమాపై అంతగా ఏమి ఉండదనే చెప్పాలి. సుమన్, ప్రగతి, వెన్నెల కిశోర్‌తో పాటు మిలిగిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. భీమ్స్ కంపోజ్ చేసిన 'గుంగురూ గుంగురూ' పాట థియేటర్లో ఈళలు వేయిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో తొలగించాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. -రేటింగ్: 2.25/5 -
గోపీచంద్ ‘విశ్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విశ్వంలో చాలా రహస్యాలున్నాయి: దర్శకుడు శ్రీను వైట్ల
‘‘దర్శకుడిగా నాకు గ్యాప్ వచ్చి ఉండొచ్చు. కానీ నా గత సినిమాల సన్నివేశాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఆడియన్స్ సినిమాలను చూసే తీరు మారిపోయింది. నా కామెడీ, యాక్షన్ సన్నివేశాలను ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. కానీ నా థీమ్ వారిని అలరించడం లేదని తెలుసుకున్నాను. ఆ దిశగా మార్పులు చేసుకుని, కొత్త థీమ్‌తో నా స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాను. ‘విశ్వం’లో నా మార్క్ యాక్షన్, ఎమోషన్, ఆడియన్స్‌కు నచ్చే కొత్త థీమ్‌ను మేళవించేందుకు స్ట్రగుల్ అయ్యాను. కానీ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనెపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘విశ్వం’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన విశేషాలు.∙విశ్వం అనే ఓ క్యారెక్టర్ చేసే జర్నీయే ఈ సినిమా కథ. ఈ విశ్వంలో ఎన్నో సీక్రెట్స్ ఉంటాయంటారు. అలానే మా సినిమాలోని విశ్వం క్యారెక్టర్లోనూ ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. అవి థియేటర్స్‌లో చూడండి. నా గత చిత్రాల్లో కామెడీ, యాక్షన్ బలంగా ఉంటాయి. ఈ అంశాలతోపాటు మంచి ఎమోషనల్ డెప్త్ కూడా ఈ చిత్రంలో ఉంది. ఇలాంటి ఎమోషనల్ డెప్త్ ఉన్న సినిమా నేను చేయడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలోనిపాప సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాగే ఓ అంతర్జాతీయ సమస్యని ఈ సినిమాలో ప్రస్తావించడం జరిగింది. ∙‘విశ్వం’లో గోపీచంద్ అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్‌గా ఉంటుంది. నా గత చిత్రం ‘వెంకీ’లోని ట్రైన్ ఎపిసోడ్ సక్సెస్ అయ్యింది.ఇప్పటికీ ఆ ఎపిసోడ్‌ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ‘విశ్వం’లో కథ ప్రకారమే ట్రైన్ ఎపిసోడ్ పెట్టాం. ఈ చిత్రంలో ఆర్గానిక్ కామెడీ మాత్రమే ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ రియలిస్ట్‌గా ఉంటాయి. డిఫరెంట్ లేయర్స్, వేరియేషన్స్ ఉన్న ‘విశ్వం’ తరహా సినిమాకు మ్యూజిక్ చేయడం కష్టం. చేతన్ భరద్వాజ్ మంచి సంగీతం ఇచ్చారు. ఆర్ఆర్ ఇంకా బాగా చేశారు. అలాగే నా పని తీరు తెలిసిన గోపీ మోహన్‌తో మళ్లీ ఈ సినిమాకు పని చేశాను. ∙‘అమర్ అక్బర్ ఆంటోని’ (2018) సినిమా వల్ల నిర్మాతలకు నష్టం లేదు. కానీ ఈ సినిమా థియేటర్స్‌లో సరిగా ఆడకపోవడంతో ఆ ఎఫెక్ట్ నాపై పడింది. సినిమా అంటే ఆడియన్స్‌కు నచ్చేలా కూడా తీయాలని నాకు మరింత అర్థమైంది. వీటన్నింటినీ సదిదిద్దుకుని ‘విశ్వం’ చేశానని నేను నమ్ముతున్నాను. మా టీమ్ కూడా నమ్ము తోంది. ప్రేక్షకులు కూడా నమ్మి, ‘విశ్వం’ను హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ‘ఢీ’ సీక్వెల్‌గా ‘ఢీ2’ ప్రకటించాం. కానీ శ్రీహరిగారిపాత్రకు రీప్లేస్మెంట్ కుదరడం లేదు. నా తర్వాతి సినిమా గురించి త్వరలోనే చెబుతాను. -
'ఆగడు' సినిమా చేయకుండా ఉండాల్సింది: శ్రీనువైట్ల
డైరెక్టర్ శ్రీనువైట్ల పేరు చెప్పగానే ఢీ, రెడీ, దూకుడు లాంటి అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. కామెడీ విషయంలో సరికొత్త ట్రెండ్ చేసిన ఈయన.. ఆ తర్వాత సరైన మూవీస్ చేయక పూర్తిగా వెనకబడిపోయారు. రవితేజతో తీసిన 'అమర్ అక్బర్ ఆంటోని' ఘోరమైన డిజాస్టర్ కావడంతో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'విశ్వం' చిత్రంతో రాబోతున్నారు.(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు)గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబరు 11న దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో కాస్త బిజీగా ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అలా ఓ దానిలో మాట్లాడుతూ.. మహేశ్ బాబు 'ఆగడు' ఫ్లాప్‌పై స్పందించారు. ఆ మూవీ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని అన్నారు.''ఆగడు' తీసినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటా. దానికి ఓ కారణం ఉంది. 'దూకుడు' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మహేశ్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకున్నా. అప్పుడు 'ఆగడు' మూవీ చేయాలనే ఆలోచనే లేదు. భారీ యాక్షన్ స్టోరీ కూడా మహేశ్‌కి చెప్పాను. సూపర్ చేసేద్దామని అన్నారు. 14 రీల్స్ సంస్థ నిర్మాతలకు కూడా కథ నచ్చింది. కానీ వాళ్లంత బడ్జెట్ పెట్టలేమన్నారు. అప్పట్లో వాళ్లకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. దీంతో ఆ కథని పక్కనబెట్టి 'ఆగడు' చేశాం. అయితే అది చేయకుండా ఉండాల్సిందని ఇప్పటికీ బాధపడుతుంటా' అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!) -
Viswam Movie: హార్ట్ టచ్చింగ్‌గా ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్
గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వం. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ను దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా బ్యానర్స్‌పై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువా' కూడా మంచి హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్ ని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసే హార్ట్ టచ్చింగ్ నంబర్ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.(చదవండి: ఓటీటీలో 'దేవర'.. అన్ని రోజుల తర్వాతేనా?)'అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు. మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపిచంద్ కు వున్న బాండింగ్ ని రివిల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. -
గోపిచంద్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వం'. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో గోపిచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్డూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: 'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ)ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ మొరాకన్ మగువా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇప్పటికే విశ్వం టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని కామెడీతో పాటు ఫుల్ యాక్షన్, ఎమోషన్స్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దసరాకు విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ వేట్టైయాన్తో పోటీపడనుంది. అయితే తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోవడం గోపిచంద్‌కు కలిసొచ్చే అవకాశముంది. అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కాగా.. ఈ చిత్రంలో జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. -
'విశ్వం' టీజర్ రిలీజ్.. శ్రీనువైట్ల మార్క్ కామెడీ
గోపీచంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వం'. శ్రీనువైట్ల దర్శకుడు. అప్పట్లో 'వెంకీ', 'దుబాయ్ శీను', 'ఢీ' తదితర సినిమాలతో తెలుగులో తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శ్రీనువైట్ల.. ఆ తర్వాత రొటీన్ మూస తరహా స్టోరీలతో మూవీస్ తీశాడు. అవి ఘోరంగా ఫెయిలయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని చేసిన సినిమా 'విశ్వం'.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?)దసరా కానుకగా అక్టోబరు 11న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టీజర్ చూస్తే శ్రీనువైట్ల మార్క్ కామెడీ కనిపించింది. అలానే తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే 'విశ్వం' కోసం మరోసారి నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. ఓవైపు కామెడీ చేస్తూనే మరోవైపు యాక్షన్, నాన్న అనే ఎమోషన్ కూడా చూపించారు.టీజర్ చూస్తే పర్వాలేదనిపిస్తోంది గానీ స్టోరీ ఏ మాత్రం రొటీన్‌గా ఉన్నాసరే ప్రేక్షకులు తిరస్కరించే ఛాన్స్ ఉంది. మరి 'విశ్వం' సినిమాతో గోపీచంద్-శ్రీనువైట్ల కాంబో ఏం చేస్తుందో చూడాలి? తెలుగులో దసరాకి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేం లేవు. తమిళ నుంచి రజినీకాంత్ 'వేట్టాయాన్' ఉంది. మరి రజనీ మూవీని తట్టుకుని 'విశ్వం' ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం) -
కమ్‌బ్యాక్ కోసం ట్రైన్ కామెడీనే నమ్ముకున్న శ్రీనువైట్ల!
తెలుగులో కొన్ని క్లాసిక్ సినిమాలు తీస్తే 'వెంకీ' ఇందులో కచ్చితంగా ఉంటుంది. ఈ మూవీలోని కామెడీ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ట్రైన్లో వెంకీ తన గ్యాంగ్‌తో చేసే కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. ఎవరికైనా బోర్ కొడితే ఇప్పటికీ యూట్యూబ్‌లో ఎక్కువగా చూసే కామెడీ సీన్ ఏదైనా ఉందా అంటే అది 'వెంకీ ట్రైన్ కామెడీ'నే. ఇప్పుడు హిట్ కొట్టడం కోసం శ్రీనువైట్ల మళ్లీ దీన్ని నమ్ముకున్నారా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో అజిత్.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!)'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు' లాంటి సినిమాల్లో కామెడీతో తనకంటూ సెపరేట్ ట్రేడ్ మార్క్ సృష్టించిన శ్రీనువైట్ల.. ఆ తర్వాత వరస ప్లాఫులతో డౌన్ అయిపోయారు. ఓ దశలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయాడా అనుకున్నారు. కానీ ప్రస్తుతం గోపీచంద్‌తో 'విశ్వం' సినిమా తీస్తున్నాడు. తాజాగా 'జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో నిమిషం నిడివి ఉన్న వీడియోని రిలీజ్ చేశారు.వీడియో చూస్తుంటే ఫారెన్ లొకేషన్స్, ఫైట్స్ లాంటి కమర్షియల్ అంశాలు కనిపించాయి. కానీ ట్రైన్ కామెడీ సీన్స్ కూడా కనిపించాయి. టీటీఈతో హీరో అండ్ గ్యాంగ్ చేసే కామెడీ తరహా విజువల్స్ చూపించారు. అయితే హిట్ కోసం తహతహలాడుతున్న శ్రీనువైట్ల.. మళ్లీ తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే నమ్ముకున్నాడా అనిపిస్తుంది. 'వెంకీ' వచ్చినప్పటితో పోలిస్తే జనాల మైండ్ సెట్ మారిపోయింది. మరి వింటేజ్ శ్రీనువైట్ల తరహాలో ఈ ట్రైన్ కామెడీ బిట్ ఉంటుందా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
గోపీచంద్ 'విశ్వం' టీజర్ రిలీజ్.. కామెడీ కాదు ఈసారి యాక్షనే!
శ్రీనువైట్ల.. ఈ పేరు చెప్పగానే ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మీమ్స్ లో ఉండే సగం సినిమాలు ఈయన తీసినవే. కానీ తర్వాత తర్వత ట్రెండ్ కి తగ్గ మూవీస్ చేయలేక సైడ్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత సినిమా చేశాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. (ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!) అప్పుడెప్పుడో 'బాద్ షా'తో ఓ మాదిరి హిట్ కొట్టిన శ్రీనువైట్ల.. ఆగడు, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి చిత్రాలతో వరస ఫ్లాప్స్ దెబ్బకు సైడ్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు ఇక సినిమాలు చేయడేమో అని అందరూ అనుకున్నారు. కానీ గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకి 'విశ్వం' అని టైటిల్ ఫిక్స్ చేసి, టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే శ్రీనువైట్ల ఈసారి కామెడీని కాకుండాయాక్షన్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు శ్రీనువైట్లతో పాటు గోపీచంద్ కి కూడా చాలా అవసరం. మరి ఏం చేస్తారో చూడాలి? బహుశా ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
కొత్త పాయింట్‌తో...
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి చిత్రాలయం స్టూడియోస్‌పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్‌బస్టర్స్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
మిలన్కు బై బై
మిలన్కు బై బై చెప్పారు గోపీచంద్. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటలీలో మొదలైన విషయం గుర్తుండే ఉంటుంది. అక్కడి మిలన్ నగరంలో ప్లాన్ చేసిన షెడ్యూల్ ముగిసింది. గోపీచంద్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటతో ఈ విదేశీ షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్. -
'మా లక్ష్మీ చనిపోయింది'.. దూకుడు డైరెక్టర్ ట్వీట్ వైరల్
టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల ఇంట బాధాకర సంఘటన చోటు చేసుకుంది. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఆవు చనిపోయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'నేను మొదటిసారి ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది. చాలా బాధగా ఉంది. మేము దాన్ని మా ఇంటి సభ్యురాలిగా చూసుకున్నాం. 13 ఏళ్లుగా దానికి ప్రేమను పంచాము. నా కూతురైతే ఆ ఆవును ఎంతో ప్రేమగా లక్ష్మీ అని పిలిచేది. ఆ ఆవు చనిపోయింది' అంటూ ట్విటర్లో దాని ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా శ్రీనువైట్ల 'నీకోసం' సినిమాతో దర్శకరచయితగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించాడు. అయితే పది సంవత్సరాల నుంచి అతడికి అస్సలు కలిసి రావడం లేదు. 2014 నుంచి అతడు నాలుగు సినిమాలే చేయగా అవేవీ బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోయాయి. 2018లో 'అమర్ అక్బర్ ఆంటోని' తీసిన అతడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చాలాకాలం గ్యాప్ తర్వాత ప్రస్తుతం మ్యాచో హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరికీ ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. ఈ సినిమా ఫలితం ఏమాత్రం తేడాగా ఉన్నా వీరిద్దరి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. Feeling very sad to lose the first cow in my farm.. We all loved her and treated like a family member for 13 years!! My daughters affectionately called her "Lakshmi". Bidding farewell with all rituals.. pic.twitter.com/736pzfJmSJ — Sreenu Vaitla (@SreenuVaitla) September 14, 2023 చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన కట్టప్ప తనయుడి సినిమా, స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
కొత్త చిత్రం షురూ
గోపీచంద్ హీరోగా నటించనున్న తాజా చిత్రం శనివారం ఆరంభమైంది. సూపర్‌స్టార్ కృష్ణ ఆశీస్సులతో ప్రారంభమైన చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తుండగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సన్నివేశానికి నిర్మాత నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ‘‘ప్రధాన భాగాన్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్‌గారిని విభిన్న పాత్రలో చూపిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
శ్రీను వైట్ల, గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభోత్సవం
-
భార్య లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను : దర్శకుడు శ్రీను వైట్ల
-
ఫ్లాప్ డైరెక్టర్ అని కామెంట్ చేశారు..!
-
దర్శకుడు శ్రీను వైట్ల తన హిట్ సినిమా గురించి..!
-
ఇంత కష్టపడినా సక్సెస్ రావడం లేదు..!
-
నా కూతుర్లు..నా ప్రాణం అంటున్న దర్శకుడు శ్రీను వైట్ల
-
క్రేజీ కాంబినేషన్స్... పదేళ్ల తర్వాత మళ్లీ ఇలా..
ఓ సినిమా సూపర్‌హిట్ అయితే ఆ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ కావాలని ఆడియన్స్ కోరుకుంటుంటారు. కానీ సరైన కథ కుదిరితేనే ఆ కాంబో రిపీట్ అవుతుంది. అలా మంచి కథ కుదరడంతో పదేళ్ల తర్వాత టాలీవుడ్లో రిపీట్ అవుతున్న కొన్ని కాంబినేషన్స్‌పై (హీరో–డైరెక్టర్) ఓ లుక్కేద్దాం. ♦ హీరో మహేశ్ బాబు ముచ్చటగా మూడోసారి దర్శకుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. 2005లో వచ్చిన ‘అతడు’ సినిమా కోసం మహేశ్, త్రివిక్రమ్ తొలిసారి చేతులు కలిపారు. ఆ మూవీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో 2010లో ‘ఖలేజా’ చిత్రం వచ్చింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో రూ΄పొందుతున్న సినిమా సెట్స్‌పైన ఉంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ వారంలోనే హైదరాబాద్‌లోప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుతో పాటు పూజాహెగ్డే, శ్రీలీల పాల్గొంటారని తెలిసింది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటోంది చిత్రయూనిట్. ♦ హీరో అల్లు అర్జున్‌తో ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) వంటి ప్రేమకథా చిత్రాలు తీశారు దర్శకుడు సుకుమార్. పది సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ రూ΄పొందుతోంది. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకువస్తోంది. ‘పుష్ప’ తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై అద్భుత విజయం సాధించింది. దీంతో మలిపార్టు ‘పుష్ప: ది రూల్’పై మరింత ఫోకస్ పెట్టారు అల్లు అర్జున్ అండ్ సుకుమార్. ఆల్రెడీ ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ మార్చి మొదటివారంలోప్రారంభం కానున్నట్లు తెలిసింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2024లో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ♦ పదిహేను సంత్సరాల క్రితం వచ్చిన ‘ఢీ: కొట్టిచూడు’(2007) సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లోని మరో సినిమా ప్రకటన రావడానికి దాదాపు పుష్కరకాలం పట్టింది. ‘ఢీ: కొట్టిచూడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఢీ2: డబుల్ డోస్’ సినిమా రూ΄పొందనున్నట్లు 2020 నవంబరులో ప్రకటించారు మంచు విష్ణు. అయితే ఈ సినిమాపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. మరోవైపు గోపీచంద్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు దర్శకుడు శ్రీనువైట్ల. మరి.. ఆయన దర్శకత్వంలో ఏ హీరో సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి. ♦ ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రాల్లో 2009లో వచ్చిన హారర్ ఫిల్మ్ ‘ఈరమ్’ మంచి హిట్ సాధించింది. అరివళగన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం తెలుగులో ‘వైశాలి’గా 2011లో విడుదలై సక్సెస్ సాధించింది. పద్నాలుగేళ్ల తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో ‘శబ్ధం’ అనే చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. లక్ష్మీమీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 7జీ శివ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా పదేళ్ల గ్యాప్ తర్వాత రిపీట్ అవుతున్న హీరో, డైరెక్టర్ కాంబినేషన్ జాబితాలో మరికొన్ని తెలుగు చిత్రాలు ఉన్నాయి. -
బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్ అయ్యారేంటి?
ఓ సినిమా సెట్స్‌పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్ నెక్ట్స్?’ అనే చర్చ జరగడం కామన్ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ్ కుమార్ కొండా, సంతోష్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్ తేజ్‌తో తీసిన ‘మిస్టర్’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఢీ అండ్ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్ యాడ్ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్‌కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్‌బాబులతో మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. సేమ్ ఇలానే దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్ తరుణ్‌తో తీసిన ‘పవర్ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు. శ్రీకాంత్ అడ్డాల, విజయ్‌కుమార్‌లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు భాస్కర్. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు. అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమాపై భాస్కర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కెమెరామేన్ నుంచి దర్శకునిగా మారిన సంతోష్ శ్రీనివాస్ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్ రాజా రన్(2014)’ తో మంచి హిట్ అందుకున్నారు సుజిత్. ఆ సినిమా ఇచ్చిన హిట్‌తో స్టార్ హీరో ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్. అయితే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్‌కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు. వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్ వంటి దర్శకుల తర్వాతి మూవీస్పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్ హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాక్. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. -
మీరు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను: శ్రీను వైట్ల
నీకోసం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఆనందం, సొంతం, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా చిత్రాలతో వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడీ డైరెక్టర్. అటు వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులకు లోనవుతున్నాడు. ఆయన భార్య రూప శ్రీనువైట్లతో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే! ఈ వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాప్తించింది. ఈ క్రమంలో శ్రీనువైట్ల రీసెంట్గా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. 'జీవితం చాలా అందమైంది. నచ్చిన వాళ్లతో ఉంటే అది మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం అసాధ్యం' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఇంతకీ ఆ ముగ్గురు మరెవరో కాదు.. తన ముగ్గురు కూతుళ్లు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఏం బాధపడకండి సర్, తప్పకుండా మీరు కోల్పోయినవి తిరిగి మీకు దక్కుతాయి. ఒక్క హిట్ పడితే మిమ్మల్ని కాదని వెళ్లినవాళ్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీను వైట్ల ప్రస్తుతం ఢీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. Life is beautiful but with your loved ones it’s more than beautiful. Can’t imagine life without my three musketeers!! pic.twitter.com/kqbNAu79CU — Sreenu Vaitla (@SreenuVaitla) July 21, 2022 చదవండి: నేను మారిపోయా, నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా.. నటుడు అర్జున్ ఇంట తీవ్ర విషాదం -
విడాకులు కావాలి!.. కోర్టు మెట్లెక్కిన డైరెక్టర్ భార్య
టాలీవుడ్లో ఈ మధ్యకాలంలో విడాకుల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకుల విషయం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ జంట తమ పెళ్లి బంధానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఢీ,దూకుడు, బాద్షా వంటి ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన శ్రీనువైట్ల భార్య రూపాతో విడిపోతున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ ఈ మేరకు ఆయన భార్య రూపా నాంపల్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం.చాలాకాలం క్రితమే వీరిద్దరు విడాకులు తీసుకోవాలని భావించినా రూపా పేరెంట్స్ నచ్చజెప్పడంతో కొన్నాళ్లు కలిసి ఉన్నారని, అయితే తాజాగా విడాకులు తీసుకునేందుకే సిద్దపడినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు సమాచారం. కాగా 2003 ఆగస్టులో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు. శ్రీనువైట్ల తెరకెక్కించిన పలు చిత్రాలకు రూపా కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పనిచేసింది. దీంతో పాటు ఆమె స్వయంగా వేదిక్ అనే ఫ్యాషన్ బ్రాండ్‌ను కూడా నిర్వహిస్తుంటుంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు చూశారా? వీడియో వైరల్ -
టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట విషాదం
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు(83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్ని రోజులుగా వయోరిత్యా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. -
మ్యాజిక్ రిపీట్ చేస్తాడా !
-
శ్రీను వైట్ల మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
సాక్షి, హైదరాబాద్: దూకుడు, కింగ్, వెంకీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల తన సినిమాలో కామెడీకి ప్రాధాన్యతనిస్తూ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఒకడుగా ఎదిగాడు. ఈ మధ్య కాలంలో కాస్త వెనుకబడినా శ్రీను వైట్ల మళ్లీ తన దూకుడును పెంచేందుకు రడీ అవుతున్నాడు. జయాపజయాలు ఉన్నప్పటికీ కెరీర్ తృప్తిగా ఉందంటున్న శ్రీను వైట్ల త్వరలోనే మూడు సినిమాల కథలు తన వద్ద సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాడు. వినోదాత్మక కథలకే నా ప్రయారిటీ అంటున్నాడు శ్రీను వైట్ల. రానున్న మూడు సినిమాల్లో భాగంగా డీ అంటే డీ తోపాటు మరో మల్టీ స్టారర్‌ని తీసుకురానున్నాడట. అలాగే కొత్తవారిని పరిచయం చేస్తూ, మరో చిన్న బడ్జెట్ చిత్రం చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడట..ఈ రోజు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్బంగా స్పెషల్ స్టోరీ. -
Srinu Vaitla Birth Day: నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావుగారూ..!
శ్రీను వైట్ల... ట్వంటీటూ ఇయర్స్ ఇండస్ట్రీ. డైరెక్టర్‌గా పదిహేడు సినిమాలు. జయాపజయాలు ఉన్నప్పటికీ కెరీర్ తృప్తిగా ఉందంటున్నారు. ఒక్క ప్రశ్నకు మాత్రం ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ అనేశారు. మహేశ్‌బాబుతో శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘దూకుడు’కి నేటితో పదేళ్లు. శుక్రవారం శ్రీను వైట్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీను వైట్లతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ.. ► ‘దూకుడు’ సినిమాకి పదేళ్లయిన సందర్భంగా కొన్ని విశేషాలు? మహేశ్‌బాబుతో సినిమా అనుకున్నాక ఒక స్టోరీ లైన్ అనుకోవడం.. దాన్ని మహేశ్ ఒప్పుకోవడం జరిగాయి. ఆ తర్వాత ఆ లైన్‌ని ఎనభై శాతం డెవలప్ చేశాక నాకు అసంతృప్తిగా అనిపించింది. డ్రాప్ చేసేశాను. ఏ కథతో సినిమా చేస్తే బాగుంటుందా అని ఆలోచించుకుంటున్న సమయంలో ‘మహేశ్‌ని ఎమ్మెల్యే గెటప్‌లో చూపిస్తే ఎలా ఉంటుంది?’ అనిపించింది. అలా పుట్టినదే ‘దూకుడు’. మహేశ్‌కి చెబితే ఎగ్జయిట్ అయ్యారు. పగ, ప్రతీకారాల నేపథ్యంలో వినోద ప్రధానంగా గోపీమోహన్‌తో కలసి, ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశా. బాగా వచ్చింది. సెన్సేషనల్ హిట్టయింది. ► 22 ఏళ్ల క్రితం సినిమా కష్టాల్లాంటి కష్టాలు ఫేస్ చేసే ఉంటారు. ఫైనల్లీ ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ మీరు కూల్‌గా ఉండేంత పొజిషన్లో ఉన్నారు... ఎగ్జాట్లీ.. ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడ్డాను. ఈ కరోనా టైమ్‌లో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చినా.. షూటింగ్లకి దూరమవుతున్నామనే బాధ తప్ప వేరే కష్టాలు లేవు. అయితే ఇంట్లో ఎవర్నీ కాలు బయటపెట్టనివ్వకుండా కొంచెం స్ట్రిక్ట్‌గా ఉన్నాను. ఆ విషయంలో నా పిల్లలు (ముగ్గురు కుమార్తెలు) కొంచెం కోపం ప్రదర్శించినా.. ఎందుకింత ప్రొటెక్టివ్‌గా ఉన్నానో తర్వాత అర్థం చేసుకున్నారు. ► స్త్రీల విషయంలో సమాజంలో పరిస్థితులు అంత బాగాలేవు. మరి.. ముగ్గురు ఆడపిల్లల తండ్రిగా చాలా జాగ్రత్తగా ఉంటారా? ఉంటున్నాను.. ఒక్కోసారి పిల్లల విషయంలో ‘ఓవర్ ప్రొటెక్టివ్’గా ఉంటాను. వాళ్లు ఇబ్బందిపడుతున్నారని అర్థం అవుతుంది. కానీ, జరుగుతున్న ఘోరాలు విన్నప్పుడు పిల్లల విషయంలో ఎక్స్ట్రా కేర్‌గా ఉండటం తప్పులేదనిపిస్తుంది. పెద్దమ్మాయి ప్లస్ టు, రెండో పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, మూడో పాప సెవెన్త్ చదువుతోంది. మెచ్యూర్టీ వచ్చాక నేనెందుకు అంత ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉన్నానో వాళ్లకు అర్థమవుతుంది. ► ‘అమర్ అక్బర్ ఆంటోని’ 2018 చివర్లో రిలీజైంది. 2020లో లాక్డౌన్. ఆ ఏడాదిన్నర గ్యాప్‌లో ఏం చేశారు? 2019లో ఒక స్క్రి‹ప్ట్ రెడీ చేశాను. 2020లో అది స్టార్ట్ అవ్వాలి. ఈలోపు లాక్డౌన్ వచ్చింది. ఆ తర్వాత మరో కథ, ఆ తర్వాత ఇంకో ఆలోచన వస్తే.. నా రైటర్స్ టీమ్‌కి నచ్చడంతో అది కూడా తయారు చేశాం. మొత్తం మూడు కథలు రెడీగా ఉన్నాయి. అందులో ‘ఢీ అండ్ ఢీ’ ఒకటి. ► ‘ఢీ’లో కథ, దానితో పాటు సాగే కామెడీ అన్నీ చక్కగా కుదిరాయి. మరి.. ‘ఢీ అండ్ ఢీ’లోనూ ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ వంటి డైలాగ్స్.. అంత కామెడీ ఉంటుందా? రెట్టింపు ఉంటుంది. అందుకే ‘ఢీ అండ్ ఢీ’కి ‘డబుల్ డోస్’ అని క్యాప్షన్ పెట్టాం. డబుల్ డోస్ ఆఫ్ కామెడీ అని అర్థం. ఇది ‘ఢీ’కి సీక్వెల్ కాదు. వేరే కథ. రావుగారూ.. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దులా పాపులర్ అయ్యే ౖడైలాగ్ ఇందులోనూ ఉంది. మిగతా అన్ని డైలాగ్స్ కూడా బాగుంటాయి. ► ‘ఢీ’లో విష్ణు కాస్త బొద్దుగా కనిపించారు. ఇప్పుడు మేకోవర్‌తో స్లిమ్ అయ్యారు. ఇది ప్లస్సవుతుందా? కచ్చితంగా ప్లస్.. మేకోవర్ విషయంలో విష్ణు వండర్ఫుల్. ఎంతో కష్టపడి, ఫిట్‌గా తయారయ్యారు. ‘ఢీ’లో విష్ణు బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా మెచ్యూర్టీ వచ్చింది కాబట్టి మ్యాగ్జిమమ్ పర్ఫార్మెన్స్ రాబట్టగలుగుతాననే నమ్మకం ఉంది. ‘ఢీ’ కంటే కూడా ఈ సినిమాలో విష్ణు క్యారెక్టర్లో ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ► గౌతమ్ మీనన్ వంటి దర్శకులు ఇటు సినిమాల్లో అటు ఓటీటీ ప్లాట్ఫామ్లో నటులుగా కనిపిస్తున్నారు.. మీకా ఉద్దేశం లేదా? నాకు ఫొటోలు దిగడమంటేనే ఇబ్బంది. కెమెరా వెనకాల ఆర్టిస్టులకు ఎంతైనా చేసి చూపిస్తాను. కానీ, యాక్ట్ చేయాలనుకోలేదు. నాకా క్వాలిటీ లేదు. గౌతమ్ మీనన్ గురించి చెప్పాలంటే.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇష్టం. ► దర్శకుడిగా ఓటీటీ ప్రాజెక్ట్ ఏదైనా? ఇప్పుడు నా దగ్గరున్న మూడు కథలు థియేటర్ మీటర్‌ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినవే. ఓటీటీ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. ► మీతో ఎన్నో సినిమాలు చేసిన ప్రకాశ్‌రాజ్, రెండో సినిమా చేయనున్న విష్ణు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు.. గెలుపు ఎవరిదని ఊహిస్తున్నారు? ‘ఢీ’లో డైలాగే చెబుతాను. ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావుగారూ... (నవ్వేస్తూ). ఇప్పుడు నా దృష్టంతా త్వరలో మొదలుపెట్టబోయే ‘ఢీ అండ్ ఢీ’ మీదే ఉంది. ఎంత బాగా తీయాలా అనే ప్లానింగ్‌లో ఉన్నాను. అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటి వారంలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నాం. ► కొన్ని హిట్స్‌తో పాటు ఫ్లాప్స్ చూశారు కదా.. ఫ్లాప్స్కి కారణం తెలుసుకున్నారా? నా నుంచి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటున్నారని గ్రహించాను. దానికి దూరంగా వెళ్లినప్పుడు వేరేగా ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే కథలో ఎంటర్టైన్మెంట్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నాను. -
శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ కొత్త మూవీ..ఈ సారైనా హిట్ కొట్టేనా?
Akhil And Srinu Vaitla Movie: అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. తొలి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వినాయక్ తో చేశాడు. అయితే ఆ మూవీ అశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత విక్రమ్ కుమార్‌తో ‘హలో’ చేశాడు. అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘మిస్టర్ మజ్ను’గా వచ్చినా.. ప్రేక్షకుల మన్ననలు పొందలేకపోయాడు. దీంతో డైలమాలో పడిన అఖిల్.. తదుపరి సినిమాలను ఆచుతూచి ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’అనే సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలను అందించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ ఓ మూవీ చేయబోతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తుంది. శ్రీను వైట్ల చెప్పిన కథ మైత్రీవారికి నచ్చిందని , త్వరలోనే అఖిల్ కు కథను వినిపించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల మంచు విష్ణుతో ‘ఢీ-2’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా విడుదల అనంతరం అఖిల్ మూవీని పట్టాలెక్కించనున్నాడు. -
ఆ సీక్వెల్‌కు చిట్టి ఓకే చెప్పిందా?
హీరో మంచు విష్ణు కెరీర్లో 'ఢీ' చిత్రానిది ప్రత్యేక స్థానం. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో జెనీలియా కథానాయికగా ఆకట్టుకుంది. శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 2007లో విడుదలైన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని శ్రీనువైట్ల ప్రకటించిన విషయం తెలిసిందే. ఢీలో ఉన్న కామెడీ, యాక్షన్ ఈ సీక్వెల్లో రెట్టింపు ఉంటాయనే ఉద్దేశంతో 'డబుల్ డోస్' అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ఈ సినిమాలో నటించబోయే ముద్దుగుమ్మ గురించి ఫిల్మీదునియాలో ఆసక్తికర వార్త గింగిరాలు తిరుగుతోంది. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాను 'ఢీ అండ్ ఢీ' కోసం సంప్రదించారట. చిట్టి కూడా ఈ సీక్వెల్లో నటించేందుకు ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. ఇక ఢీ సినిమా గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ.. 'ఢీ' కథ, ఈ సీక్వెల్ కథ రెండూ వేర్వేరని తెలిపాడు. కాకపోతే 'ఢీ'లో ఉండే కొన్ని క్యారెక్టర్లను మాత్రం సీక్వెల్లో వాడుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. గత సినిమాల్లోని తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడతానన్నాడు. 'ఢీ అండ్ ఢీ'ని 24 ఫ్యాక్టరీ ఫిలింస్ పతాకంపై హీరో మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. గోపీమోహన్, కిషోర్ గోపులు రచయితలుగా చేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అవ్రామ్ భక్త మంచు, సంగీతం: మహతి స్వరసాగర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్. చదవండి: సెట్టుకి వెళదాం.. షూటింగు చేద్దాం... ఛలో ఛలో -
డోస్ రెండింతలు
మంచు విష్ణు కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఢీ’. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. సోమవారం విష్ణు పుట్టినరోజు సందర్భంగా ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘డి–డి’ని ప్రకటించారు చిత్రనిర్మాత, హీరో మంచు విష్ణు, దర్శకుడు శ్రీను వైట్ల. 24 ఫ్యాక్టరీ ఫిలింస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. సంకెళ్ల మధ్య రెండు ‘డి’ అక్షరాలను డిజైన్ చేశారు. ‘ఢీ’లో ఉన్న కామెడీ, యాక్షన్ ఈ సీక్వెల్లో రెట్టింపు ఉంటాయనే ఉద్దేశంతో ‘డబుల్ డోస్’ అని ట్యాగ్‌లైన్ పెట్టారు. గోపీమోహన్, కిషోర్ గోపులు రచయితలుగా చేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: అవ్రామ్ భక్త మంచు, సంగీతం: మహతి స్వరసాగర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్. -
డేరింగ్ అండ్ డ్యాషింగ్
మంచు విష్ణుని డేరింగ్ అండ్ డ్యాషింగ్‌గా చూపించడానికి రెడీ అవుతున్నారట శ్రీను వైట్ల. 13 ఏళ్ల క్రితం విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ మూవీ ‘ఢీ’ గుర్తుండే ఉంటుంది. అందులో ఉన్న ‘నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు’ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ‘ఢీ’కి సీక్వెల్ చేయడానికి విష్ణు–శ్రీను వైట్ల రెడీ అవుతున్నారని టాక్. కథ కూడా రెడీ అయిందట. ‘ఢీ2’ (డేరింగ్ అండ్ డ్యాషింగ్) టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో ఫస్ట్ పార్ట్ కన్నా మరింత కామెడీతో పాటు ఫుల్ యాక్షన్ కూడా ఉంటుందని తెలిసింది. ఇందులో విష్ణు హీరోగా నటించడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారట. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలుపెట్టాలను కుంటున్నారని తెలిసింది. -
శ్రీను వైట్లకు మరో చాన్స్!
కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లతో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల తరువాత వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు. ఆగడు నుంచి మొదలైన శ్రీనువైట్ల ఫ్లాప్‌ల పరంపర అమర్ అక్బర్ ఆంటొని వరకు సాగింది. దీంతో శ్రీనువైట్లకు చాన్స్ ఇచ్చే హీరోలే కరువయ్యారు. ఇంకా ఈ దర్శకుడి కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో మరో చాన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు మంచు విష్ణు. శ్రీనువైట్ల, మంచు విష్ణు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. తాజాగా విష్ణు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. 12 ఏళ్ల తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించబోతున్నట్టుగా వెల్లడించారు. అయితే ఈ సినిమా వీరి కాంబినేషన్లో సూపర్ హిట్ అయిన ఢీ మూవీకి సీక్వల్ అన్న ప్రచారం జరుగుతున్నా విష్ణు మాత్రం సీక్వల్ అన్న విషయం ప్రకటించలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
శ్రీనువైట్లకు హీరో దొరికాడా!
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీనువైట్ల ఇటీవల ఆ ఫాం కోల్పోయాడు. ఆగడు సినిమా నుంచి వరుస ఫ్లాప్‌లు ఎదురు కావటంతో శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు హీరోలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. తాజాగా అమర్ అక్బర్ ఆంటొనితో మరో ఫ్లాన్ ఎదురుకావటంతో శ్రీనువైట్లకు నెక్ట్స్ ఏ హీరో చాన్స్ ఇస్తాడన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యంగ్ హీరో శ్రీనువైట్లతో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడట. మంచు ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు కామెడీ సినిమాలతో సూపర్హిట్లు సాధించాడు. ఇటీవల కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో.. తనకు ఢీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీనువైట్లతో మరో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా ఢీకి సీక్వల్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ సినిమాతో అయిన శ్రీనువైట్ల హిట్ ట్రాక్‌లోకి వస్తాడేమో చూడాలి. -
‘అమర్ అక్బర్ ఆంటొని’ మూవీ రివ్యూ
టైటిల్ : అమర్ అక్బర్ ఆంటొని జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : రవితేజ, ఇలియానా, తరుణ్ అరోరా, షాయాజీ షిండే, విక్రమ్‌జిత్ విర్క్, సునీల్ సంగీతం : ఎస్. తమన్ దర్శకత్వం : శ్రీను వైట్ల నిర్మాత : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, మోహన్ చెరుకూరి రాజా ది గ్రేట్ సినిమా తరువాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, చాలా కాలంగా సక్సెస్ లేక కష్టాల్లో ఉన్న శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అమర్ అక్బర్ ఆంటొని. ఈ సినిమాతో చాలా కాలం తరువాత గోవా బ్యూటి ఇలియానా టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది. మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై హీరో, హీరోయిన్, దర్శకుడు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి అమర్ అక్బర్ ఆంటొని.. ఆ అంచనాలను అందుకుందా..? రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసిందా..? ఇలియానా రీ ఎంట్రీలో ఎంత మేరకు ఆకట్టుకుంది.? కథ ; ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రా ఇద్దరు ప్రాణ స్నేహితులు. న్యూయార్క్‌లో ఫిడో ఫార్మా పేరుతో కంపెనీని స్థాపించి మిలియనీర్స్‌గా ఎదుగుతారు. ఆనంద్ ప్రసాద్ తన కొడుకు అమర్ (రవితేజ)ను, సంజయ్ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్న అరోరా(తరుణ్ అరోరా), సబూ మీనన్ (ఆదిత్య మీనన్), విక్రమ్ తల్వార్ (విక్రమ్‌జీత్) , రాజ్ వీర్ల నిజస్వరూపం తెలియని ఆనంద్, సంజయ్‌లు కంపెనీలో 20 శాతం షేర్స్ ఇచ్చి వారిని భాగస్వాములుగా చేసుకుంటారు. పార్టనర్స్ అయిన వెంటనే ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రాల కుటుంబాలను పూర్తిగా అంతం చేయడానికి ప్లాన్ చేస్తారు ఆ నలుగురు. కానీ వారి కుటుంబానికి నమ్మకస్తుడైన జలాల్ అక్బర్(షాయాజీ షిండే) సాయంతో అమర్, ఐశ్వర్యలు తప్పించుకుంటారు. తప్పించుకున్న అమర్ 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి ఎలా పగ తీర్చుకున్నాడు.? తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అమర్, ఐశ్వర్యల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? ఈ కథలో అక్బర్, ఆంటొనిలు ఎవరు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రవితేజ మరోసారి ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అమర్ పాత్రలో రవితేజ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. అక్బర్, ఆంటొనీల పాత్రల్లో కామెడీ కొంతమేరకు వర్క్ అవుట్ అయినా సహజంగా అనిపించదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇలియాన నటన అలరిస్తుంది. కాస్త బొద్దుగా కనిపించినా పర్ఫామెన్స్తో పాటు గ్లామర్‌తోనూ మెప్పిస్తుంది. తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, విక్రమ్‌జీత్ విర్క్ స్టైలిష్ విలన్లుగా కనిపించారు. విలక్షణ నటుడు షాయాజీ షిండేకు చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర దక్కింది. జలాల్ అక్బర్ పాత్రలో ఆయన నటన బాగుంది. ఇక తెలుగులో టాప్ కామెడియన్స్‌గా కొనసాగుతున్న వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు తిరిగి కామెడీ పాత్రలు చేస్తున్న సునీల్‌లు కొంత మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. సత్య, రఘుబాబు, గిరి, అభిమన్యు సింగ్, జయప్రకాష్ రెడ్డి అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలు శ్రీను వైట్ల ఏ మాత్రం అందుకోలేకపోయాడు. ఓ మామూలు రివేంజ్ డ్రామా కథకు న్యూయార్క్ బ్యాక్ డ్రాప్ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఆసక్తికరంగా అనిపించదు. అక్కడక్కడా కామెడీ పరవాలేదనిపించినా పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా లేదు. తెర నిండా కమెడియన్లు కనిపిస్తున్నా చాలా సన్నివేశంలో కామెడీ కావాలని ఇరికించారన్న భావన కలుగుతుంది. తమన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్ కలర్ఫుల్గా, అందంగా, లావిష్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడుకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ ; రవితేజ నటన ప్రొడక్షన్ వాల్యూస్ మైనస్ పాయింట్స్ ; పాత కథ ఫోర్స్డ్ కామెడీ స్క్రీన్ ప్లే సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఏ హీరోను, నిర్మాతనూ ఇబ్బంది పెట్టలేదు!
‘‘నా కెరీర్లో ఏం జరిగినా అది నా బాధ్యతే. మంచైనా.. చెడైనా. నాది సింపుల్ లివింగ్ స్టైల్. సినిమా అంటే నాకు పిచ్చి ఉంది కానీ కీర్తి కాంక్ష లేదు. సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లేరే అని బాధపడే మనస్తత్వం కాదు నాది. ఇప్పటివరకు నాతో సినిమా చేయమని ఏ హీరోను, ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టలేదు’’ అన్నారు శ్రీను వైట్ల. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఇలియానా కథానాయికగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన విశేషాలు. ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఒక పాయింట్ బేస్డ్ సినిమా. అందుకే ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. రవితేజతో నేను చేసిన ‘నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను’ సినిమాల్లో లేనటువంటి బలమైన కథ ఈ సినిమాలో బోనస్‌గా ఉంటుంది. మేజర్ షూటింగ్ న్యూయార్క్‌లో చేశాం. నన్ను, కథను అర్థం చేసుకుని ప్రొడ్యూసర్స్ బాగా సపోర్ట్ చేశారు. మూవీ జర్నీ బాగుంటే ఫలితం బాగుంటుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాను చాలా లగ్జరీగా తీశాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఏ సినిమాకు బడ్జెట్ హద్దులు దాటలేదు. నిర్మాతలు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని బడ్జెట్‌ను పెంచే మనస్తత్వం నాది కాదు. రవితేజ మంచి పొటెన్షియల్ అండ్ ఇంటెన్స్ యాక్టర్. ఆయనకు సినిమాలంటే పిచ్చి. నాలోని డైరెక్టర్ని రవితేజ బాగా నమ్ముతారు. ఇంతకుముందు ఉన్న కమిట్స్‌మెంట్స్ కారణంగానే రవితో మళ్లీ సినిమా చేయడానికి ఇంత టైమ్ పట్టింది. ఇలియానాను కథానాయికగా తీసుకోవాలనుకునే ఆలోచన నాదే. సునీల్ మంచి క్యారెక్టర్ చేశారు. రవితేజ చిన్నప్పటి పాత్రకు ముందుగా ఆయన కుమారుడు మహాధన్‌ను అనుకున్నాం కానీ వర్క్ పర్మిట్ లేట్ అవ్వడం వల్ల కుదర్లేదు. అలాగే లయగారు, అభిరామిగారు బాగా చేశారు. కథకు కరెక్ట్‌గా సరిపోతుందనే ‘అమర్ అక్బర్ ఆంటొని’ టైటిల్ పెట్టాం. సినిమాలో రివెంజ్ బ్యాక్‌డ్రాప్ ఒక పార్ట్ మాత్రమే. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఆలస్యం అవడం వల్ల సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ‘తానా’ మీద ఈ సినిమాలో సెటైర్స్ వేయలేదు. తప్పుల నుంచి ఎక్కువ నేర్చుకుంటాం అనే మాట నిజం. నేర్చుకోకపోతే అక్కడే ఉండిపోతాం. ఎక్కడ తప్పు జరుగుతుందనే విషయంపై రియలైజ్ అయ్యాను. నేను సక్సెస్‌లో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కోసం అంతకు మించి పని చేశాను. నేను ‘డౌన్’లో ఉన్నప్పుడు కూడా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కోసం ఐదుగురు ప్రొడ్యూసర్స్ పోటీ పడ్డారు. మైత్రీని చూజ్ చేసుకున్నాం. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేదు. చిన్న సినిమాల నుంచే పెద్ద డైరెక్టర్‌గా ఎదిగాను. నా తొలి సినిమా బడ్జెట్ 38 లక్షలు. కెరీర్లో ఎవరికైనా ఎత్తుపల్లాలు ఉంటాయి. నాకు కానీ, కొంతమంది డైరెక్టర్స్ కానీ ఒక బ్రాండ్ వచ్చింది. అదే శాపం, వరం కూడా. కొత్త కథను చెప్పడం కష్టం కాదు. అందులో నా మార్క్ మిస్ అవ్వకుండా ఎంటర్టైనింగ్గా చెప్పడం చాలా కష్టమైన విషయం. ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మహేశ్, నేను సినిమా చేయాలనుకుంటే చేస్తాం. నెక్ట్స్ ఇంకా ఏమీ అనుకోలేదు. స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాను. బాలీవుడ్లో సినిమాలు చేయాలని నాకూ ఉంది. ‘ఢీ, దూకుడు’ సినిమాలను బాలీవుడ్లో చేయాల్సింది. కుదర్లేదు. ఈ సినిమాతో కుదురుతుందేమో చూడాలి. -
ఇలియానా తొలిసారిగా..!
చాలా రోజులుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న గోవా బ్యూటి ఇలియానా అమర్ అక్బర్ ఆంటొని సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకు ఇలియానా స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇటీవల పరభాషా హీరోయిన్లందరు తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవటం కామన్ అయిపోయింది. ఇప్పటికే కీర్తి సురేష్, తమన్నా, పూజ హెగ్డే లాంటి హీరోయిన్స్ ఓన్ వాయిస్‌తో ఆకట్టుకోగా తాజాగా ఈ లిస్ట్‌లో ఇలియానా కూడా చేరనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటొని నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అవాయ్ సువాయ్ ఆంటొని
-
‘అఅఆ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!
మాస్ మహరాజా రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు అంచనాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి కామెడీ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే చాలా ఏళ్ల తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి చేస్తోన్న మూవీ ‘అమర్ అక్బర్ ఆంటొని’ . రీసెంట్గా విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు పెరిగాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. రెండవ పాటను దీపావళి సందర్భంగా మంగళవారం విడుదల చేయనున్నారు. రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
రవితేజ అపరిచితుడా..?
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లో రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు. టైటిల్‌కు తగ్గట్టుగా అమర్ అక్బర్ ఆంటోని మూడు మతాలకు సంబంధించిన వ్యక్తులుగా కనిపించారు మాస్ హీరో. అయితే ఈ సినిమాలో రవితేజ ట్రిపుల్ రోల్ చేయటం లేదట. అపరిచితుడు సినిమాలో విక్రమ్ తరహాలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో ఇబ్బందిపడే వ్యక్తిగా కనిపించనున్నాడట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రవితేజ సరసన ఇలియానా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. -
‘అమర్ అక్బర్ ఆంటొని’ ఫస్ట్‌లుక్ చూశారా?
హీరో రవితేజ తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో రవితేజ కనిపించనున్నారని సమాచారం. అంతకుముందు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు విజయం సాధించడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఇలియానా ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం, విజయ్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దసరా పండుగ నేపథ్యంలో అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. -
రవితేజ సినిమా ఆగిపోయిందా..?
రాజా ది గ్రేట్ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మాస్ మహరాజ్ రవితేజ తరువాత ఆ ఫాంను కొనసాగించటంలో ఫెయిల్ అవుతున్నాడు. వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు ప్లాప్ కావటంతో ఈ సీనియర్ హీరో ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం రవితేజ, శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్నాడు. శ్రీనువైట్ల గత చిత్రాలన్ని నిరాశపరచటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలేమి లేవు. ఈ పరిస్థితుల్లో మరో వార్త మాస్ మహరాజ్ అభిమానులకు షాక్ ఇస్తోంది. అమర్ అక్బర్ ఆంటోని తరువాత రవితేజ, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. విజయ్ హీరోగా తమిళ్లో సూపర్ హిట్ అయిన తేరి సినిమా తెలుగు రీమేక్‌లో నటించేందుకు ఓకె చెప్పాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్‌ను పూర్తిగా పక్కన పెట్టిసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
‘వెన్నెల’కిశోర్ షూటింగ్ కష్టాలు.. వైరల్!
హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు వచ్చిన ఆఫర్లు వెనక్కి తీసుకోవడం, లేక షూటింగ్స్ వాయిదా పడటం గురించి తరచుగా వింటుంటాం. అయితే కొన్నిసార్లు షూటింగ్ వాయిదాకు బదులుగా షెడ్యూల్ అనుకోకుండా ముందుకు జరిగిపితే (ప్రీ పోన్ చేస్తే) ఎలా ఉంటుందో తెలియాలంటే హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ పోస్ట్ చేసిన వీడియో చూడాలి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ కమెడియన్ పోస్ట్ చేసిన వెంటనే వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’,. మాస్ మహారాజా రవితేజ, ఇలియానా జోడీగా కనిపించనున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే షూటింగ్ షెడ్యూలు 15 నిమిషాలు ముందుకు ప్లాన్ చేయగా మేకప్ టైమ్ చాలా టైట్‌గా ఉంటుందని’ ట్రిమ్మింగ్ ఓ వీడియోను వెన్నెల కిశోర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. One of those days where ur shoot call time has been preponed by 15 mins and u hav planned the makeup time xtremely tight🙈😂 #AmarAkbarAnthony pic.twitter.com/5a75N6I4Id — vennela kishore (@vennelakishore) 9 July 2018 -
అందర్నీ మెప్పించడం అసాధ్యం!
మన చేతికి ఉన్న ఐదు వేళ్లు సమానంగా ఉండవు. అలాగే క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒకేలా ఉండరు. అలాంటప్పుడు మన గురించి అందరి అభిప్రాయాలు ఒకేలా ఎందుకు ఉంటాయి? మనల్ని అభిమానించే వాళ్లు ఉన్నట్లే, ఇష్టపడనివాళ్లూ ఉంటారు. అందుకే ప్రతి విషయంలోనూ అందరి మెప్పు పొందాలనుకోవడం తెలివితక్కువ పనే అవుతుంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కథానాయిక ఇలియానా. ‘‘ కెరీర్లో స్టార్టింగ్‌లో అందర్నీ ఇంప్రెస్ చేయాలని ఎంతో ఆరాటపడేదాన్ని. లుక్స్ విషయంలో బాగా కేర్ తీసుకునేదాన్ని. ఆ తర్వాత నాకు అర్థం అయ్యింది.. అందర్నీ ఇంప్రెస్ చేయడం ఇంపాజిబుల్ అని. ముఖ్యంగా మనపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను అన్ని వేళలా రీచ్ అయ్యేలా ప్రవర్తించడం ఇంకా కష్టం. అందుకే నన్ను నేను ఒక సెలబ్రిటీగా ఊహించుకోను. యాక్టర్‌ని అని మాత్రమే అనుకుంటాను’’అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆరేళ్ల తర్వాత సౌత్‌లో ఇలియానా కాలుపెడుతున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు ఇలియానా. -
సరికొత్త టెక్నాలజీతో శ్రీనువైట్ల
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాస్త గ్యాప్ తీసుకొని రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమర్ అక్బర్ ఆంటోని పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎక్కువగా ఫారిన్ లోకేషన్స్‌లో షూటింగ్ చేయనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం శ్రీనువైట్ల సరికొత్త టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. అమెరికాలోని విభిన్న వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్ చేసేందుకు ఈ టెక్నాలజీ వాడుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు అమర్ అక్బర్ ఆంటోని సినిమాను 8కె క్వాలిటీతో రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఇలియానా టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల నేలటిక్కెట్టు సినిమాతో రవితేజ కూడా నిరాశపరచటంతో సెట్స్‌మీద ఉన్న అమర్ అక్బర్ ఆంటోని హీరో హీరోయిన్లు రవితేజ, ఇలియానా దర్శకుడు శ్రీనువైట్ల కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
రవితేజ సినిమా నుంచి తప్పుకున్న హీరోయిన్
ఈ శుక్రవారం నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాను ప్రారంభించారు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. మరో హీరోయిన్గా శృతిహాసన్ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇతర చిత్రాలతో పాటు కుటుంబ సమస్యల కారణంగా అను ఇమ్మాన్యూల్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు కూడా ధృవికరించారు. దాదాపు 50 రోజుల పాటు అమెరికాలో షూటింగ్ చేయాల్సి ఉండటంతో డేట్లు సర్ధుబాటు చేయలేకే అను తప్పుకుంటున్నట్టుగా చిత్రయూనిట్ తెలిపారు. దీంతో అను స్థానంలో గోవాబ్యూటీ ఇలియానాను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. Due to non availability of dates for our long USA schedule of 50 days, Anu Emmanuel will not be working in our film #AmarAkbarAnthony. — Mythri Movie Makers (@MythriOfficial) 19 May 2018 Unfortunately I won’t be a part of #AmarAkbarAnthony due to date clash between #SailajaReddyAlludu I wish the team of #AmarAkbarAnthony all the best 🙏🏼😊 https://t.co/knQr32bZaw — Anu Emmanuel (@ItsAnuEmmanuel) 19 May 2018 -
గోవా బ్యూటీ రీ ఎంట్రీ..!
టాలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించి తరువాత బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పిన బ్యూటీ ఇలియానా. తెలుగులో మంచి ఫాంలో ఉండగానే హిందీ సినిమాల వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు సాధించలేకపోయారు. తరువాత దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో చేజారిపోయాయి. తాజాగా ఈ గోవా బ్యూటీ ఓ టాలీవుడ్ సినిమాకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలియానా హీరోయిన్గా నటించనున్నారు. అల్లు అర్జున్ సరసన నటించిన జులాయి తరువాత ఇలియానా చేస్తున్న తెలుగు సినిమా ఇదే. -
వ్యాపార రంగంలోకి దర్శకుడి భార్య
సినీ రంగంలో ఉన్న వారు ఇప్పుడు ఇతర వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు పబ్‌లు, రెస్టారెంట్ ల లాంటి వ్యాపారాల్లో అడుగుపెట్టారు. తాజాగా దర్శకుడు శ్రీనువైట్ల భార్య రూపా వైట్ల కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వేదిక్ పేరుతో వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బ్రాండ్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించిన హీరోయిన్ కాజల్, వేదిక్ బ్రాండ్ ను లాంచ్ చేయటం ఆనందంగా ఉందన్నారు. గతంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆగడు సినిమాకు రూపావైట్ల కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. తాజాగా ఆమె వేదిక్ ఉత్పత్తులను లాంచ్ చేపినందుకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. Happy to launch @Vedic_Way by @roopavaitla pure, organic and pristine! Thank you for my wholesomeness 😊🤗 pic.twitter.com/qHDFAupnuV — Kajal Aggarwal (@MsKajalAggarwal) 23 March 2018 -
రవితేజ కొత్త సినిమా ప్రారంభం
-
సెట్స్ మీదకు ‘అమర్ అక్బర్ ఆంటోని’
కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కొత్త సినిమాను ప్రారంభించాడు. మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాను ఈ రోజు (గురువారం) పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. గతంలో శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సినిమాలు మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రవితేజ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత మందిస్తుండగా కామెడీ స్టార్ సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
అమెరికాలో రవితేజ, శ్రీను వైట్ల కొత్త చిత్రం
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా అంటే చాలు సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు నీకోసం, వెంకీ, దుబాయ్ శీను చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఆ సక్సెస్ ఫార్ములాను కొనసాగిస్తూ రవితేజ, శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో చిత్రం నటించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 19 నుండి ప్రారంభంకానుంది. తొలి షెడ్యూల్‌ను అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే క్రేజీ టైటిల్ పెట్టే ఆలోచనలో శ్రీను వైట్ల ఉన్నట్లు సమాచారం. సినిమాలో రవితేజ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నారట. ఈ మూడు భిన్న పాత్రల్లో రవితేజ అలరిస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉండనున్నారు. రవితేజ ఏప్రిల్ నుంచి షూటింగ్లో పాల్గొంటారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిర్మించనుంది. ప్రస్తుతం రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ అనే సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఆయన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటిస్తారు. తాజాగా ఆయన నటించిన ‘టచ్ చేసి చూడు’ ప్రేక్షకుల్ని నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. -
రవితేజ సినిమాలో కాజల్ కూడా..!
ఈ శుక్రవారం ‘టచ్ చేసి చూడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ, వరుస సినిమాలతో బిజీగా అవుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేల టికట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఈ మాస్ హీరో తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో తన తదుపరి చిత్రం తెరకెక్కనుందని ప్రకటించారు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోని అనే క్లాసిక్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నివేథ థామస్‌ను ఫైనల్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ పేరును పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా విశేషాలు తర్వలో దర్శకుడు శ్రీనువైట్ల వెల్లడించనున్నారు. -
రవితేజ.. శ్రీను వైట్ల.. మైత్రి!
మైత్రీ కుదిరింది. అవును రవితేజ, శ్రీను వైట్లకు మైత్రీ కుదిరింది. ఇప్పుడేంటి? ఎప్పటి నుంచో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది కదా. ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’.. ఇలా వీళ్ల కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి కదా అనుకుంటున్నారా! విషయం ఏంటంటే.. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మించనుంది. వై. రవిశంకర్, ఎర్నేని నవీన్, చెరుకూరి మోహన్ నిర్మాతలు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. కథానుగుణంగా ఎక్కువ శాతం షూటింగ్‌ను అమెరికాలో జరపడానికి ప్లాన్ చేశారని భోగట్టా. ఇదిలా ఉంటే.. రవితేజ–శ్రీను వైట్ల చివరి సినిమా ‘దుబాయ్ శీను’ విడుదలైంది 2007లో. వీళ్ల కాంబినేషన్లో రూపొందిన మూడు సినిమాలూ హిట్టే. సో.. పదేళ్ల తర్వాత మరో హిట్ కోసం ఈ కాంబినేషన్ రెడీ అయిందన్న మాట. -
శ్రీనువైట్ల సినిమాలో సునీల్
కమెడియన్ గా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్ అయిన సునీల్.. హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. ఒకటి రెండు సినిమాలు మంచి విజయాలు సాధించినా.. స్టార్ ఇమేజ్ అందుకునే స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తిరిగి క్యారెక్టర్ రోల్స్ పై దృష్టి పెట్టాడు కామెడీ స్టార్. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు శ్రీనువైట్ల, రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించనున్నారట. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ శుక్రవారం సునీల్ హీరోగా తెరకెక్కిన 2 కంట్రీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జనవరి నుంచి మాస్ మహరాజ్ కొత్త సినిమా
రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద కనిపించిన మాస్ మహరాజ్ రవితేజ సూపర్ హిట్ తో అలరించాడు. రాజా ది గ్రేట్ సినిమాలో అంధుడిగా నటించిన రవితేజ గ్రాండ్ విక్టరీతో అభిమానులను ఖుషీ చేశాడు. అదే జోరులో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టచ్ చేసి చూడు సెట్స్ మీద ఉండగా మరో రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ మాస్ హీరో. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను లాంటి చిత్రాలు ఘనవిజయం ఆసాధించిన నేపథ్యంలో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పాటు తమిళ సూపర్ హిట్ భోగన్ రీమేక్ కూడా అదే సమయంలో ప్రారంభ కానుందట. ఈ రెండు సినిమాల్లో ఒకేసారి నటించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు రవితేజ. -
క్లాసిక్ టైటిల్.. ఎవరి కోసమో..!
తాజాగా ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయిన ఓ టైటిల్ ఆసక్తికరంగా మారింది. భారీ చిత్రాలను నిర్మిస్తూ వరుస విజయాలు సాధిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అమర్ అక్బర్ ఆంటోని అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్లాసిక్ మూవీ టైటిల్ ను ఇప్పుడు తెలుగులో ఎవరితో తెరకెక్కిస్తారో అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. టైటిల్ ను బట్టి ఇది మల్టీ స్టారర్ సినిమా అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇప్పటికే కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వీటితో పాటు పవన్ కళ్యాణ్, సంతోష్ శ్రీనివాస్ లతో పాటు శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా, అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా చర్చల దశలో ఉన్నాయి. అయితే రవితేజ సినిమాకే అమర్ అక్బర్ ఆంటోని అనే క్లాసిక్ టైటిల్ నిర్ణయించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
శ్రీనువైట్లకు హీరో దొరికాడా..?
ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు శ్రీనువైట్ల, వరుసగా మూడు ఫ్లాప్ లు వచ్చే సరికి పూర్తిగా డీలా పడిపోయాడు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ సినిమాలతో నిరాశపరిచిన శ్రీనువైట్ల కొంత కాలంగా నెక్ట్స్ సినిమా కోసం కథా కథనాలు సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీనువైట్ల తో సినిమా చేసే హీరో ఎవరన్న చర్చ జరుగుతోంది. అయితే శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేసేందుకు రవితేజ ముందుక వచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. నీ కోసం సినిమాతో తనకు హీరోగా తొలి అవకాశం ఇచ్చిన శ్రీనువైట్ల కోసం రవితేజ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సినిమాను మంచి సక్సెస్ సాధించటంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
మిస్టర్కు కత్తెర..!
వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్టర్. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్ సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించాయని భావిస్తున్న చిత్రయూనిట్, ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగింది. అనవసరమైన కామెడీ సీన్స్‌తో పాటు కొన్ని బోరింగ్ సన్నివేశాలను ట్రిమ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో రిచ్ విజువల్స్‌తో పాటు కామెడీ కూడా బాగానే వర్క్ అవుట్ కావటంతో సెకండ్‌హాఫ్‌లో పది నిమిషాల మేర ట్రిమ్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం యూనిట్ సభ్యులు ఇదే పనిలో ఉన్నారు. ఈ సినిమాతో కమర్షియల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొవచ్చని భావించిన వరుణ్ మిస్టర్ టాక్‌పై అసంతృప్తిగా ఉన్నాడు. తన కెరీర్‌కు ఎంతో కీలకమైన సినిమా అయినా.. శ్రీనువైట్ల కూడా రొటీన్ ఫార్ములాలో ఫాలో అవ్వటం అభిమానులను నిరాశపరిచింది. -
'మిస్టర్' మూవీ రివ్యూ
టైటిల్ : మిస్టర్ జానర్ : కామెడీ ఫ్యామిలీ డ్రామా తారాగణం : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్,నికితిన్ థీర్, నాజర్, తనికెళ్ల భరణి, రాజేష్.... సంగీతం : మిక్కీ జె మేయర్ దర్శకత్వం : శ్రీను వైట్ల నిర్మాత : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు వరుసగా స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన శ్రీనువైట్ల రెండు ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డాడు. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ నటుడిగా ఫుల్ మార్క్స్ సాధిస్తున్నా, కమర్షియల్ హీరోగా మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ ఫార్ములా సినిమా మిస్టర్. మరి ఈ మిస్టర్.. వరుణ్, శ్రీనుల కెరీర్ ను గాడిలో పెట్టిందా..? మరోసారి శ్రీనువైట్ల కామెడీ టైమింగ్ వర్క్ అవుట్ అయ్యిందా..? తొలి సారిగా పక్కా కమర్షియల్ ఫార్ములా కామెడీ ఎంటర్టైనర్ లో నటించిన వరుణ్ తేజ్ ఎంత వరకు ఆకట్టుకున్నాడు..? కథ : పిచ్చయ్య నాయుడు( నాజర్) ఆంధ్రా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పది గ్రామాలకు పెద్ద, ఆ ఊరి కట్టుబాటు ప్రకారం పదేళ్లకొకసారి సంక్రాంతి సందర్భంగా జరిగే కర్రసాము పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికే ఆ గ్రామాల మీద పెత్తనం చేసే అధికారం ఉంటుంది. నలబై ఏళ్లుగా పిచ్చయ్యనాయుడు చేతుల్లోనే ఆ అధికారం ఉంటుంది. పది ఊళ్లను శాసించే స్థాయి ఉన్నా.. తనకు ఉన్న ఒక్కగానొక్క మనవడి(వరుణ్ తేజ్) ప్రేమకు దూరమై బాధపడుతుంటాడు. అయితే ఆ గ్రామాల చుట్టూ ఉన్న అడవుల్లో ఎర్ర చందనంతో పాటు రంగురాళ్లు కూడా ఉండటంతో బిజినెస్ మేన్ రాహుల్ వడయార్(నికితిన్ ధీర్) ఆ గ్రామాల మీద కన్నేస్తాడు. పిచ్చయ్యనాయుడు ప్రత్యర్థి గుండప్ప(తనికెళ్లభరణి)తో కలిసి పిచ్చయ్యానాయుడును సంక్రాంతి పోటిల్లో ఒడించి ఆ గ్రామాల మీద పెత్తనం సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. చై అలియాస్ పిచ్చయ్య నాయుడు (వరుణ్ తేజ్) తన కుటుంబంతో కలిసి స్పెయిన్‌లో ఉండే తెలుగు కుర్రాడు. తను ప్రేమించిన వారికోసం ఎంత రిస్క్ అయినా చేయటం చైకి అలవాటు. అలాంటి చైకి ఒకసారి అనుకోకుండా మీరా వెల్లంకి(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తొలిచూపులోనే మీరాతో ప్రేమలో పడిన చై ఎలాగైన ఆ ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆమెను ఇంప్రెస్ చేస్తాడు.. కానీ అదే సమయంలో మీరా మరో అబ్బాయి ప్రేమిస్తున్నానని చెప్పి ఇండియా వెళ్లిపోతుంది. ఎన్ని రోజులు గడిచినా చై, మీరాను మర్చిపోలేకపోతాడు. ఆ సమయంలో మీరా, చైకి ఫోన్ చేసి తన ప్రేమ ఇబ్బందుల్లో ఉందని సాయం చేయమని అడుగుతుంది. మీరా కోసం ఇండియా వచ్చిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) ప్రవేశిస్తుంది. అసలు మీరా ప్రేమకథలో సమస్య ఏంటి..? చై జీవితంలోకి వచ్చిన చంద్రముఖి ఎవరు..? తన తాతకు చై ఎందుకు దూరమయ్యాడు..? రాహుల్ వడయార్ ఆట ఎలా కట్టించాడు..? చివరకు చై మీరా.. చంద్రముఖిలలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు..? అన్నదే మిగతా కథ నటీనటులు : తొలి సినిమా నుంచే నటుడిగా మంచి మార్కులు సాధిస్తూ వస్తున్న వరుణ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా మెగా హీరోల ఛాయలు కనిపించినా.. తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించే ప్రయత్నం చేశాడు. లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంటుంది. అమాకత్వం, ప్రేమ, బాధ, భయం ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హెబ్బా పటేల్ కూడా అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. ప్రతినాయక పాత్రలో నికితిన్ ధీర్ సినిమాకు కావల్సినంత విలనిజం పండించాడు. డీసెంట్ లుక్స్‌లో కనిపిస్తూనే క్రూయల్ విలన్‌గా మెప్పించాడు. ఇతర పాత్రలో నాజర్, తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, చంద్రమోహన్, హరీష్ ఉత్తమన్, రాజేష్, 30 ఇయర్స్ పృధ్వీ ఇలా తెర నిండా కనిపించిన నటులు పరవాలేదనిపించారు. సాంకేతిక నిపుణులు : లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కించిన ఈ సినిమాతో శ్రీను వైట్ల ఎక్కువగా రిస్క్ చేయకుండా తన రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. విదేశాల్లో కామెడీ ఎపిసోడ్స్, పేరడీ సీన్స్, సినిమా వాళ్ల మీద పంచ్ డైలాగ్స్, పదుల సంఖ్యలో విలన్స్ ఇలా శ్రీను గత సినిమాల్లో కనిపించిన మాసాలా ఎలిమెంట్స్ అన్నీ మిస్టర్ లోనూ కనిపించాయి. ఫస్ట్ హాఫ్‌లో స్పెయిన్ అందాలతో పాటు కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుల ఊపిరి పేరడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో అసలు కథలోకి వెళ్లకుండా కామెడీ, రొమాంటిక్ సీన్స్‌తో కథ లాగించేసిన దర్శకుడు సెకండాఫ్‌ను హడావిడిగా నడిపించాడు. వరుసగా తెరమీదకు వచ్చే కొత్త పాత్రలు, మలుపులు ఆడియన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తాయి. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు కొంత పరవాలేదనిపించినా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కెవి గుహన్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ అయ్యింది. స్పెయిన్ లోకెషన్స్ ను మరింత అందంగా చూపించిన గుహన్, చేజ్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన యాక్షన్ సీన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ : లెక్కలేనన్ని మలుపులు పాటలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
'మిస్టర్' క్లీన్
లోఫర్ సినిమాతో నిరాశపరిచిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీతో తెరకెక్కిన మిస్టర్ సినిమాకు సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికేట్‌ను అందించారు. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మించిన మిస్టర్, వరుణ్ తేజ్‌కు కమర్షియల్ హీరో ఇమేజ్ను తీసుకువస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మెగా ఫ్యాన్స్. -
నిజం ఏంటో మాకు తెలుసు!
‘‘ప్రతి హీరో అభిమాని సినీ ప్రేమికుడే. ఓ పర్టిక్యులర్ హీరోని అభిమానించడానికి ముందు సినిమాని ప్రేమిస్తాడు. తమ హీరో సినిమాలు తప్ప మిగతా వాళ్లవి అభిమానులు చూడరని అనుకుంటారు. ఎవరి అభిమానులైనా సినిమాలన్నీ చూస్తారు. అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ చూస్తేనే ఏ సినిమాకైనా వంద కోట్లు వస్తాయి. హీరోలకు ఫ్యాన్స్ బిగ్గెస్ట్ సపోర్ట్. అది కాదనడంలేదు. కానీ, వాళ్లతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ముఖ్యమే’’ అన్నారు వరుణ్ తేజ్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘మిస్టర్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. వరుణ్ చెప్పిన విశేషాలు.... ♦ ఈ ‘మిస్టర్’ అందరికీ ప్రేమను పంచుతాడు. ప్రేమే కాదు... ఎవరైనా సహాయం కావాలన్నా మిస్టర్ ముందడుగు వేస్తాడు. అలాంటి ఓ అబ్బాయికి సమస్యలు వస్తే.. అతను ప్రేమ వెతుక్కుంటూ వెళితే.. ఏం జరిగిందనేది కథ. నాకూ, హీరోయిన్లు లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌లకు వేర్వేరు కథలు (ఫ్లాష్‌బ్యాక్స్) ఉంటాయి. అవి కాకుండా మా ముగ్గురి మధ్య జరిగే కథే సినిమాకు కీలకం. ♦ శ్రీను వైట్లగారు ‘ఆనందం’, ‘నీ కోసం’... ఇలా అందమైన ప్రేమకథా చిత్రాలు చేశారు. తర్వాత స్టార్ హీరోలతో కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు చేశారు. మళ్లీ ఓ అందమైన ప్రేమకథా చిత్రం చేయాలనీ, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని ‘మిస్టర్’ తీశారు. ‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్’... మూడింటిలో ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న పాత్రలు చేశాను. ఇందులో నా వయసుకు తగ్గ లైవ్లీ క్యారెక్టర్ చేశా. ♦ శ్రీను వైట్లగారు అనే కాదు... ఏ దర్శకుడితో చేసినా వాళ్ల గత సినిమా హిట్టయ్యిందా? లేదా? అనేది చూడను. అలా ఆలోచిస్తే... నా మొదటి సినిమా, మూడో సినిమా వర్కౌట్ అవ్వలేదు. నాతో చేయాల్సిన అవసరం వాళ్లకూ లేదు. ఇంకా సక్సెస్ఫుల్ హీరోలు ఉన్నారు కదా. నాకు కథ నచ్చితే మిగతా అంశాలు ఆలోచించను. ♦ కథల ఎంపికలో నాన్నగారు జోక్యం చేసుకోరు. ‘నీకు కథ నచ్చకపోతే నువ్వు చేయలేవు. కథలో నీకు నువ్వు కనిపించాలి’ అని చెప్పారాయన. ఆయనకు నచ్చి, నాకు నచ్చని కథలు ఉన్నాయి. నాన్నగారు కాకుండా... ఫ్యామిలీలో పెదనాన్నతో ఎక్కువ క్లోజ్. యంగ్ జనరేషన్లో చరణ్ అన్నతో క్లోజ్. తేజూ (సాయిధరమ్ తేజ్) కూడా క్లోజే. తనదీ నా వయసే. మా ఫ్యామిలీ హీరోలంతా కలిస్తే సినిమాల గురించి 20 శాతం, వ్యక్తిగత విషయాల గురించి 80 శాతం డిస్కస్ చేసుకుంటాం. ‘చిరంజీవికీ, పవన్‌కల్యాణ్‌కీ పడడం లేదు’ వంటి వార్తలు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అనడిగితే... ♦ ఫ్యామిలీ మెంబర్‌గా నెగిటివ్ వార్తలు చూసినప్పుడు బిగినింగ్‌లో బాధ ఉండేది. అందులో నిజమెంత అనేది వ్యక్తిగతంగా మాకు తెలుసు. కానీ, బయటకు వచ్చి జనాలకు వివరణ ఇచ్చే పరిస్థితులు ఎదురైనప్పుడు అసౌకర్యంగా ఉంటుంది. ♦ అభిమానులపై ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకోమని పెదనాన్న, బాబాయ్‌లు చెబుతుంటారు. ‘మన ఫ్యామిలీ నుంచి ఇంతమంది (8) నటులు వచ్చారు. ఒక్కొక్కరూ ఏదో కొత్తదనం చూపకపోతే, మీ సినిమాలు చూడాల్సిన అవసరం ప్రేక్షకులకు లేదు. బయట ఆల్రెడీ చాలామంది హీరోలున్నారు. మీరు కొత్తగా ఏం చేయగలరనేది మీరు ఆలోచించుకోండి’ అని ఎప్పుడూ అంటుంటారు. మా బెస్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మంచి కథలు దొరికితే మా అంజనా బేనర్, కొణిదెల ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్‌లోనూ సినిమాలు చేయాలని ఉంది. ♦ స్టార్ దర్శకులతోనే చేయాలనే రూల్ పెట్టుకోలేదు. ‘మిస్టర్’ షూటింగ్ మధ్యలో గాయమైనప్పుడు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నా. అప్పుడు ఓ 20 కథల వరకూ విన్నాను. ‘ఫిదా’ తర్వాత కొత్త దర్శకుడు వెంకీ అట్లూరితో బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి నిర్మాణంలో సినిమా చేయబోతున్నా. -
నేను భయపడే టైప్ కాదు!
‘‘నేను ఎలాంటి చిత్రం చేసినా... ప్రేక్షకులు నా నుంచి ఆశించే వినోదం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయను. అలాగే, ఇక నుంచి ఓ చిత్రానికీ, మరో చిత్రానికీ సంబంధం లేకుండా... పూర్తి భిన్నమైన కొత్త తరహా చిత్రాలు చేయాలనే ఆలోచనతో ఉన్నా’’ అన్నారు శ్రీను వైట్ల. వరుణ్‌తేజ్ హీరోగా ఆయన దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘మిస్టర్’ ఈ నెల 14న రిలీజవుతోంది. శ్రీను వైట్ల మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు వరుణ్‌ను చూసి ‘బాగున్నాడీ అబ్బాయి’ అంటే... నాగబాబు అన్నయ్య ‘నువ్వు సినిమా తీయొచ్చుగా’ అనేవారు. తప్పకుండా అనేవాణ్ణి. ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కిన ట్రావెల్ ఫిల్మ్, ఈ ‘మిస్టర్’తో కుదిరింది. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ, డ్యాన్స్... అన్నిటిలో వరుణ్ని బాగా చూపించే ప్రయత్నం చేశా. నిర్మాతలు బుజ్జి, మధుగార్లు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. టీమ్ సపోర్ట్‌తో అనుకున్నది తీశాననే సంతృప్తి ఉంది. మంచి సినిమా తీసి ఫెయిల్ అయితే బాధ ఉంటుంది. నేను అనుకున్నట్టు చేయలేని పరిస్థితులు ‘బ్రూస్ లీ’కి వచ్చాయి. మంచి సినిమా తీయలేదు కాబట్టి ప్రేక్షకులు రిజెక్ట్ చేశారని గట్టిగా నమ్మాను. ఆ సినిమాతో ప్రేక్షకుల్ని నవ్వించలేకపోయా. ‘మిస్టర్’తో నవ్విస్తా. సక్సెస్ కోసం ఈ సినిమా తీయలేదు. ప్రేక్షకులపై ప్రేమతో తీశా. నేను ఫెయిల్యూర్స్‌కి భయపడే టైప్ కాదు. నా కెరీర్ చూస్తే... ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నేను మరింత స్ట్రాంగ్‌గా పనిచేస్తా. ‘మిస్టర్’కు అలాగే పనిచేశా. కథను చెడగొట్టకుండా అందులో కామెడీ చేయడం చాలా కష్టం. కానీ, నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులు వినోదం ఆశిస్తారు. అందుకే, నేను ఎక్కువ స్ట్రగుల్ అవుతా’’ అన్నారు. -
అసలు ప్రయాణం ఇప్పుడే...
సినిమాయే ఒక జర్నీ...పాత్రలకు, ప్రేక్షకులకు! దీంట్లో కొత్త విషయం చెప్పేది ఏముంది? కానీ, నిజానికి ఈ సినిమా డైరెక్టర్‌కి, హీరో హీరోయిన్లకు ఒక జర్నీగా మారింది. గుమ్మడికాయ కొట్టేశారు. సినిమా రిలీజ్‌కి రెడీ. కానీ, అసలు జర్నీ ఇప్పుడు మొదలవుతుంది. రిలీజ్‌కి ముందుండే ఆనందాన్ని, ఉత్కంఠనీ మీకోసం ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌గా క్యాప్చర్ చేసింది. శ్రీను వైట్లగారూ.... ‘మిస్టర్’ ఎలా, ఎప్పుడు మొదలైంది? శ్రీను వైట్ల: ఎప్పట్నుంచో అన్ని ఎమోషన్స్ ఉన్న ఓ ట్రావెల్ మూవీ చేయాలనుకుంటున్నా. 2015 డిసెంబర్లో రచయిత గోపీమోహన్ ఒక లైన్ చెప్పాడు. ఎగై్జట్‌మెంట్‌తో వెంటనే ఈ సినిమా చేద్దామన్నా. ఈ కథకు వరుణ్‌తేజ్ కరెక్ట్ అని గోపీతో అంటే, తనూ అదే అన్నాడు. అదే టైమ్‌లో నల్లమలుపు బుజ్జి, ‘ఠాగూర్’ మధుగార్లు వరుణ్‌తో సినిమా చేద్దామని వచ్చారు. అలా సెట్ అయింది. వైట్లగారు కథ వినగానే ఎగ్జయిట్ అయ్యారు. మరి మీరు? వరుణ్ తేజ్: శ్రీను వైట్లగారు గంటన్నరసేపు కథ చెప్పారు. బాగా నచ్చింది. చివరి అరగంట అయితే సూపర్. నేనూ ఎగ్జయిట్ అయ్యా. నాకు కథ నచ్చినా, నచ్చకపోయినా వెంటనే చెప్పేస్తా. దాచడం, గట్రా ఏం ఉండవు. ఒక్క డౌట్ ఉండేది. ఆయన సినిమాల్లో కామెడీ ఎక్కువుంటుంది. నేనెలా చేయగలను? అనుకున్నా. కానీ, శ్రీనూగారి హెల్ప్‌తో ఈజీగా చేసేశా. ‘మిస్టర్’ అంటే? శ్రీను: నా దృష్టిలో ‘మిస్టర్’ అంటే మంచి మనసున్నోడు. గౌరవంతో ‘మిస్టర్’ అని పిలుస్తారు కదా. ఆ పిలుపుకు 100 శాతం అర్హత వరుణ్ క్యారెక్టర్‌కు ఉంటుంది. పదిమందికి హెల్ప్ చేయాలనుకునే మనస్తత్వం ఉన్న కుర్రాడు. అందరి సంతోషం కోసం స్ట్రగుల్ అయ్యే పాత్ర. ఇంతకీ మిస్టర్‌తో ఈ ఇద్దరమ్మాయిల కనెక్షన్ ఏంటి? శ్రీను: వాళ్లిద్దరూ ఏం చేస్తారనేదే కథ. ట్రావెల్ ఫిల్మ్ కదా! హీరో (వరుణ్), మీరా (హెబ్బా) పాత్రల మధ్య కనెక్షన్ చాలా డ్రమటిక్‌గా ఉంటుంది. అలాగే, చంద్రముఖి (లావణ్యా త్రిపాఠి)తో హీరో కనెక్షన్ కూడా. వీళ్ల మధ్య ట్రావెల్ ఆసక్తిగా ఉంటుంది. వీళ్లు ఒకరికొకరు ఎలా పరిచయమయ్యారు? చివరికి, ఏ గమ్యం చేరారు? అనేది కథ. హీరోయిన్లవి నటనకు స్కోప్ ఉన్న పాత్రలే. శ్రీనూగారు! స్టార్స్‌తో సినిమాలు చేసిన మీరు యంగ్‌స్టర్స్‌తో సినిమా చేయడం ఎలా ఉంది? శ్రీను: ఎంజాయ్ చేశా. వరుణ్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యాను. అమ్మాయిలతో నేను చాలా తక్కువ మాట్లాడతా. వర్క్ వరకూ మాత్రమే డిస్కస్ చేస్తా. (‘అందుకే ఈ ఇంటర్వూ్యకి ఆయన్ను అమ్మాయిల మధ్య కూర్చోబెట్టా’ – వరుణ్) ఈ జనరేషన్ కుర్రాళ్లు ఎలా ఉంటారు? ఎలా ఆలోచిస్తారు? అనేవి వరుణ్‌తో ఎక్కువ ట్రావెల్ కావడం వల్ల అర్థం అయ్యాయి. ‘మిస్టర్’ మేకింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా. పెద్ద హిట్స్ అందుకున్న మీపై మధ్యలో వచ్చిన ఒక్క ఫ్లాప్ ప్రభావం చూపినట్టుంది? శ్రీను: అది మంచి కోసమే జరిగినట్టుంది. మనం అర్థం చేసుకోవాలి. నా సై్టల్ ఏంటి? ఒక ‘ఆనందం’ లాంటి ప్రేమకథ (సినిమా) తీశా. తర్వాత ‘వెంకీ’ చేశా. ఆ తర్వాత ‘ఢీ’ నుంచి ఓ సై్టల్‌లోకి వెళ్లా. నాతో పాటు అందరూ అటువంటి సినిమాలు చేసేశారు. సక్సెస్ కావడంతో ఎక్కువ సినిమాలు వచ్చాయి. నేను కొంచెం ఎర్లీగా ఆ ఫార్ములాను ఆపేసి ఉండాల్సింది. కానీ, ఓ దెబ్బ తగిలిన తర్వాత స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఈ సినిమా చేశా. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్. నిజాయితీగా చెప్పాలంటే... కంపేర్ చేయకూడదు కానీ, ‘దూకుడు’ తర్వాత నాకంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన స్క్రిప్ట్ ‘మిస్టర్’. వరుణ్... స్టార్స్‌తో, మీ పెదనాన్న (చిరంజీవి)తో చేసిన దర్శకుడితో సినిమా అనగానే మీకు ఎలా అనిపించింది? వరుణ్: ఒక్కో దర్శకుడికి ఒక్కో సై్టల్ ఉంటుంది. పూరి జగన్నాథ్గారిది ఓ సై్టల్. వీవీ వినాయక్గారిది ఓ సై్టల్. శ్రీను వైట్లగారిది ఓ సై్టల్. దర్శకుల సై్టల్‌కి తగ్గట్టు అడాప్ట్ కావడమే మా పని. శ్రీనుగారు, ఆయన టీమ్‌తో నేను బాగా కంఫర్టబుల్‌గా ఫీలయ్యా. నాకు కష్టం అనేది తెలియలేదు. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లగానే ముందు ఆయన (శ్రీను వైట్ల) నా కేర్వాన్లోకి వచ్చి కూర్చునేవారు. ఏదో మంచి విషయం చెబుతారు. లేదంటే... మా అమ్మాయి ఇలా చేసిందనో, ఇంట్లో చెట్లు కొట్టేశారనో, మరొకటో వ్యక్తిగత విషయాలు చెబుతారు. నేను మేకప్ వేసుకునే టైమ్‌లో స్లోగా నా మైండ్‌ను రీఫ్రెష్ చేస్తారు. సీన్లోకి వెళ్లిన తర్వాత మరో ఆలోచన ఉండదు. బాగా నటించా. శ్రీను వైట్లగారు ప్రతిదీ చేసి చూపిస్తారు. ‘మీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. చాలా బాగా యాక్ట్ చేసి చూపిస్తున్నారు’ అని ఆయనతో చాలాసార్లు చెప్పాను. నేను ఆయన్ను ఇమిటేట్ చేశానంతే. మీరు బాగా యాక్ట్ చేసి, చూపిస్తారని వరుణ్ చెబుతున్నారు. మీరు హ్యాండ్సమ్గా ఉంటారు కదా. ఎవరూ నటించమని, హీరోగా చేయమని అడగలేదా? శ్రీను: అబ్బెబ్బెబ్బే... నేను ఫొటో తీయించుకోవడమే కష్టం. నాకు హీరోలంటే ఇష్టం. కానీ, హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మొదట్నుంచీ దర్శకత్వమే నా లక్ష్యం. ఎవరో జూనియర్ ఆర్టిస్టు లేకపోతే.. ‘ఆనందం’ సినిమాలోని ఓ సీన్లో నేను పరిగెత్తాల్సి వచ్చింది. ఆ సినిమా హిట్టయ్యింది. ఆ సెంటిమెంట్‌తో అప్పుడప్పుడూ ప్రేక్షకులకు తెలిసీ తెలీకుండా కనిపిస్తుంటాను. శ్రీనూగారు! వరుణ్‌లోని మంచి లక్షణాలు చెబుతారా? శ్రీను: వరుణ్‌లో నిజాయితీ కనిపిస్తుంది. సేమ్ టైమ్... బాగా తెలివైనోడు.ఇలాంటి కాంబినేషన్ చాలా తక్కువ. వరుణ్‌లో నాకా క్వాలిటీ ఇష్టం. మనుషులను బాగా అంచానా వేయగలుగుతాడు. హి ఈజ్ వెరీ కూల్. నేను తన నుంచి కూల్‌గా ఉండడం నేర్చుకున్నాను. వరుణ్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. శ్రీను వైట్లగారిలోని మంచి లక్షణాల గురించి? వరుణ్: షూటింగ్ చేసే టైమ్‌లో ఎంతసేపూ సినిమా గురించి తప్ప... మరో విషయం గురించి ఆలోచించరు. ఫ్యామిలీ లవింగ్ మ్యాన్. ‘మిస్టర్’ షూటింగు ఎక్కువ విదేశాల్లో చేశాం. అప్పుడు ‘మా అమ్మాయిలతో కబుర్లు చెబుతూ నిద్రపోయేవాణ్ణి. ఇక్కడ ఉండలేకపోతున్నాను’ అనేవారు. సక్సెస్‌ను ఆయనెప్పుడో చూశారు. కానీ, ఇప్పటికీ సినిమా ఎలా వస్తుందోననే టెన్షన్ కనిపిస్తుంది. ఒక్కరోజు కూడా ఈజీగా తీసుకోరు. బహుశా... ఆ టెన్షన్, భయమే ఆయన్నింకా డ్రైవ్ చేస్తున్నాయనిపిస్తోంది. స్పెయిన్‌లో మంచి లొకేషన్స్ కోసం పదివేల మైళ్లు రెక్కీ నిర్వహించారు. సినిమా అంటే ఆయనకు అంత ప్రేమ. అమ్మాయిలూ... వరుణ్‌లో మంచి లక్షణాలు చెప్పండి! హెబ్బా: హి ఈజ్ వెరీ కూల్. అందరితో బాగా కలసిపోతాడు. వరుణ్‌తో మాట్లాడడానికి పెద్దగా బెరుకు అనిపించదు. చాలా వినయంగా ఉంటాడు. మనం ఏం చెప్పినా వింటాడు. సంతోషం, బాధ... ఇలా మనసులో ఫీలింగ్స్‌ని అతనితో పంచుకోవచ్చు. లావణ్య: వరుణ్ మంచి యాక్టర్. (మధ్యలో హెబ్బా ‘ఓహ్.. నేనది చెప్పలేదు’ అంటే... లావణ్య ‘ఏం ఫర్వాలేదు’ నేను చెబితే నువ్వు చెప్పినట్లే) మంచి ఆర్టిస్టులతో చేసినప్పుడు మన నటన మెరుగవుతుంది. వరుణ్‌లో గుడ్ లుక్స్, ఇంటెలిజెన్స్... రెండూ ఉన్నాయి. డౌన్ టు ఎర్త్. సెట్లో అందరికీ హెల్ప్ చేస్తుంటాడు. మనకు ఏదైనా సమస్య ఎదురైందని చెబితే... అతని దగ్గర పరిష్కారం ఉంటుంది. వరుణ్.. లావణ్య, హెబ్బాల్లో మీకు నచ్చే లక్షణాలు ఏంటి? వరుణ్: హార్డ్ వర్కింగ్, టాలెంట్ ఇటువంటివన్నీ పక్కన పెడితే... ఇద్దరిలో కామన్‌గా కనిపించే మంచి లక్షణం – ‘బేసిక్‌గా వాళ్లు ఎలా కనిపిస్తారో అలాగే ఉంటారు’. మన ముందు ఓ మాట, వెనక ఓ మాట మాట్లాడడం వంటివి ఉండవు. జోకులు వేసినా ఈజీగా తీసుకుంటారు. శ్రీనుగారు ఫస్ట్ హీరోయిన్ల గురించి చెప్పినప్పుడు పొట్టిగా ఉంటారేమో అనుకున్నా. వాళ్లు హైట్ బాగానే ఉంటారు. కానీ, నేను మరీ పొడుగు కదా! ఫస్ట్ హెబ్బాతో స్పెయిన్‌లో షూటింగ్ చేశా. హైట్ ప్రాబ్లెమ్ అనిపించలేదు. హమ్మయ్య... ఓ అమ్మాయి ఫర్వాలేదు. ఇంకో అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నా. లావణ్యతో ఫస్ట్ షాట్ చేశాక.. ఇద్దరం పరిగెత్తుకుని వెళ్లి, మానిటర్లో చూసుకున్నాం. బాగానే ఉన్నాం. హైట్ డిఫరెన్స్ లేదు. వరుణ్ పక్కన పొట్టిగా కనిపిస్తామేమోననే భయం మీ ఇద్దరికీ ఉండేదా? హెబ్బా: నేను శ్రీనుగారిని మొదటిసారి కలసినప్పుడు ఆయన నన్ను అడిగిన ప్రశ్న... ‘నీ ఎత్తు ఎంత?’ అని. ఇప్పుడు హైట్ గురించి నాకెలాంటి భయాలూ లేవు. వరుణ్‌తో పనిచేసిన తర్వాత ఇతర హీరోల హైట్ గురించి వర్రీ అవసరం లేదు. ఎవరితో అయినా చేసేయొచ్చు. లావణ్య: వరుణ్ మంచి హైట్. మీడియమ్ రేంజ్ హైట్ ఉన్నవాళ్లు కూడా తన పక్కన పొట్టిగానే కనిపిస్తారు. మేం వరుణ్ పక్కన మరీ అంత పొట్టిగా కనిపించకుండా కేర్ తీసుకోవడానికి డైరెక్టర్‌గారు ఉన్నారు కదా (నవ్వేస్తూ). శ్రీనూగారు! వరుణ్‌తో కాంబినేషన్ సీన్స్ అప్పుడు లావణ్య, హెబ్బాని ఎన్ని పెట్టెల మీద నిలబెట్టాల్సి వచ్చింది? శ్రీను: (నవ్వేస్తూ)... యాక్చువల్‌గా హైట్ బ్యాలెన్స్ చేయడానికనే కాదు... ఒక్కోసారి మామూలుగా కూడా బాక్సులు వాడతాం. ఈ సినిమాలో విలన్‌గా చేసిన నికితన్ ధీర్ హైట్ 6 అడుగుల మూడంగుళాలు. మంచి ఎత్తే. అయినప్పటికీ ఒక యాంగిల్ కోసం బాక్స్ మీద నిలబెట్టాల్సి వచ్చింది. అలా లావణ్య, హెబ్బాలు కూడా కొన్నిసార్లు బాక్సుల మీద నిలబడ్డారు. మీ నలుగురిలో కామన్‌గా కలిసే విషయం ఏదైనా ఉందా? శ్రీను: నలుగురికీ సినిమాలంటే పిచ్చి. ఆఫ్ సెట్స్‌లో సరదాగా ఉంటాం. ఆన్ సెట్స్‌లో సీరియస్‌గా ఉంటాం. మీరంతా ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు కదా! మరి సినిమా పూర్తయిన చివరి రోజున ఏమనిపించింది? వరుణ్: నిజం చెప్పాలంటే.. ఇంతకు ముందు చేసిన మూడు సినిమాలçకు చివరి రోజున చాలా ఎమోషన్ అయ్యాను. కానీ, ఈ సినిమాకి అలా అనిపించలేదు. హ్యాపీగా అనిపించింది. తెలియని శాటిస్ఫేక్షన్ ఏదో కలిగింది. సినిమా అయిపోతేనేం? ఎప్పుడైనా కలవొచ్చు కదా అనిపించింది. మళ్లీ శ్రీనుగారితో సినిమా చేయొచ్చు. లావణ్యా, హెబ్బాలతో కూడా కలసి సినిమా చేస్తానేమో. అందుకే వీళ్లను మిస్సవుతున్న ఫీలింగ్ కలగలేదు. లావణ్య: నాక్కూడా సేమ్ ఫీలింగ్. దూరమైపోతున్నాం అనిపించలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. హెబ్బా: నాకైతే ఒక్క లాస్ట్ డే కాదు.. మూడు, నాలుగు చివరి రోజులన్నమాట. వరుణ్: అవునండీ! ఈ అమ్మాయికి యాక్షన్ సీన్స్ ఉండేవి. ఒకసారి తీసిన తర్వాత, ‘ఇక నీ పార్ట్ అయిపోయింది’ అని పంపించేసేవాళ్లు. ఆ తర్వాత ఏదో చిన్న సీన్ తీయాలంటూ మళ్లీ పిలిచేవాళ్లు. హెబ్బా: అందుకే ‘ఇక నువ్వు రావాల్సిన అవసరంలేదు. నీ పార్ట్ మొత్తం పూర్తయింది’ అని ఫైనల్ కన్ఫర్మేషన్ ఇచ్చాక, యూనిట్‌ని మిస్సవుతున్నాం అని ఆలోచించకుండా హ్యాపీగా వెళ్లిపోయా. బట్... వండర్ఫుల్ టీమ్. ఫైనల్లీ ‘మిస్టర్’ షూటింగ్లో స్వీట్ మెమరీ? వరుణ్: చిక్మగళూర్ షెడ్యూల్‌ని మరచి పోలేను. ఎంజాయ్ చేస్తూ, భయపడుతూ చేసిన షెడ్యూల్ అది. చిక్మగళూర్లో జలగలు ఎక్కువ. అవి ఒంటి మీద పాకేది కూడా తెలియదు. నాకు తెలిసి ఎక్కువ జలగలు పాకింది నా ఒంటి మీదేనేమో. ఒకసారి కాలు చూసుకుంటే ఆల్రెడీ ఒకటి పాకుతూ, రక్తం పీల్చుతోంది. అదిరిపోయాను. మందు రాసుకోవడం వల్ల ప్రమాదాలేం జరగలేదు. శ్రీను: ఆ షెడ్యూల్ అప్పుడు వీళ్లకు ముందు చెప్పకుండా ఓ విషయం దాచాను.అదేంటంటే... అక్కడే ఓ లొకేషన్లో సీన్ తీయాలి. అక్కడ కొండ చిలవలు ఎక్కువ. ఆ విషయం తెలిస్తే కంగారుపడతారని చెప్పలేదు. తర్వాత చెప్పాను. భయపడుతూనే అక్కడ షూటింగ్ స్టార్ట్ చేశాం. అందరూ చుట్టుపక్కల చూస్తూ షూటింగ్ చేయడమే (నవ్వుతూ). కెమెరామ్యాన్ గుహన్గారైతే భయం భయంగా దిక్కులు చూసేవారు. ఆ షెడ్యూల్ బాగా గుర్తు. లావణ్య: రన్నింగ్ బస్ మీద నేను డ్యాన్స్ చేసే సీన్స్ ఉన్నాయి. నేను ఇన్వాల్వ్ అయి డ్యాన్స్ చేస్తుంటే, గుహన్ గారు సిన్సియర్‌గా షూట్ చేశారు. ఆ సమయంలో ఒక పెద్ద కొమ్మ ఆయనకు తగిలి ఉండేది. తృటిలో తప్పింది. హెబ్బా: నాకు యాక్షన్ సీన్స్ చేయడం ఇష్టం. ఈ మూవీలో ఆ స్కోప్ దొరికింది. అది నాకు స్వీట్ మెమరీ. లక్కీగా నాకు చిక్‌మగళూరు లొకేషన్లో ఆ సీన్స్ లేవు. ‘మిస్టర్’ ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ కదా.. రియల్ లైఫ్‌లో ఒకేసారి మీరు ఇద్దరమ్మాయిలకు ప్రపోజ్ చేసిన సందర్భాలున్నాయా? వరుణ్: అబ్బే. ఒక్క అమ్మాయితో మాట్లాడటమే కష్టమండి బాబు. ఇక ఇద్దరా? నో.. నో.. తప్పు కూడా. మీ ఇద్దరికీ ఇద్దరబ్బాయిలు ఒకేసారి ప్రపోజ్ చేసే ఉంటారేమో? లావణ్య: ఇద్దరేంటి? స్కూల్, కాలేజ్ డేస్‌లో చాలామంది ప్రపోజ్ చేసేవారు. లవ్ లెటర్స్, రోజ్ ఫ్లవర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేవి. హెబ్బా: అమ్మాయిలకెప్పుడూ అంతే. వాళ్ల చుట్టూ తిరగడానికి చాలామంది అబ్బాయిలు రెడీ అయిపోతారు. ప్రపోజల్స్ మీద ప్రపోజల్స్ వస్తుంటాయి. శ్రీనూగారు... ఈ మిస్టర్, మిస్లలో ఎవరు మంచోళ్లు? శ్రీను: ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అడిగేస్తే ఎలా అండి? ముగ్గురూ మంచోళ్లే. నేనిప్పటివరకూ ఛానెల్స్‌కి తప్ప ఇలా ముగ్గురు నలుగురితో కలసి ప్రింట్ మీడియాకి ఇంటర్వూ్యలు ఇచ్చింది లేదు. ఇదిగో ఇప్పుడిలా హాయిగా నలుగురం కలసి ఇంటర్వూ్య ఇస్తున్నామంటే... ఒకరి పట్ల మరొకరికి మంచి అభిప్రాయం ఉండడమే. అది లేకపోతే అవాయిడ్ చేసేవాళ్లం. ఎవరికి వారు సెపరేట్ ఇంటర్వూ్యలు ఇస్తామనేవాళ్ళం. – డి.జి. భవాని -
మనసు మార్చుకున్న 'మిస్టర్'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్టర్. ఈ సినిమాతో వరుణ్‌ను తొలిసారిగా ఓ కమర్షియల్ హీరోగా చూపించబోతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిలీజ్ డేట్ విషయంలో చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే రోజు బాబు బాగా బిజీ కూడా రిలీజ్ అవుతుండటంతో ఒక రోజు ముందుగానే ఏప్రిల్ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా బాబు బాగా బిజీ మే 5కు వాయిదా పడటంతో మిస్టర్ టీం మళ్లీ మనసు మార్చుకుంది. ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 14నే సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఏప్రిల్ 7న అభిమానుల సమక్షంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌కు కూడా వేడుకకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. -
మార్చి 30న 'మిస్టర్' ఆడియో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్నరొమాంటిక్ ఎంటర్టైనర్ మిస్టర్. కొద్దిరోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమాకు డైరెక్టర్. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని రెండు పాటలను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయగా పూర్తి ఆడియోను మార్చి 30న, మెగా ఈవెంట్లో రిలీజ్ చేయనున్నారు. నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న మిస్టర్, వరుణ్ తేజ్‌ను కమర్షియల్ హీరోగా నిలబెట్టడంతో పాటు శ్రీనువైట్ల కెరీర్‌ను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. -
లవ్ జర్నీలో మిస్టర్!
మాంచి హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు కదా ఈ ‘మిస్టర్’. వయసు కూడా ఎక్కువేం కాదు. జస్ట్ 27 ఏళ్లే. కానీ, ‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళితే... ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’ అనే పెద్ద ఫిలాసఫీ స్టేట్మెంట్ ఇస్తాడు. దీనికి ఓ కారణం ఉంది. ఇతడికి ఇద్దరమ్మాయిలు పరిచయమవుతారు. ఓ అమ్మాయి విదేశాల్లో.. ఇంకో అమ్మాయి తెలుగు పల్లెలో! ఈ మిస్టర్ ఎవరి ప్రేమను వెతుక్కుంటూ వెళ్లాడు? ఎవరి ప్రేమ మనోడ్ని వెతుక్కుంటూ వచ్చిందనేది ఏప్రిల్ 14న తెలుస్తుంది. వరుణ్‌తేజ్ హీరోగా శ్రీనుౖ వెట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్’. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లు. ఏప్రిల్ 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘మంచి ఎమోషన్స్, హిలేరియస్ కామెడీ, మ్యూజిక్, బ్యూటిఫుల్ విజువల్స్‌కి స్కోప్ ఉన్న కథ. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నేను ఏదైతే అనుకున్నానో... దాన్ని వంద శాతం రాజీ పడకుండా తీయగలిగాను. అందుకు కారణమైన నా నిర్మాతలు, చిత్రబృందానికి థ్యాంక్స్. నిన్ననే ఫస్ట్ హాఫ్ రీ–రికార్డింగ్‌తో చూశా. మిక్కి జె. మేయర్ అన్ బిలీవబుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. ఆరు అద్భుతమైన పాటలు అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: గోపీమోహన్, మాటలు: శ్రీధర్ సీపాన, కెమేరా: కేవీ గుహన్, సై్టలింగ్: రూపా వైట్ల. -
మిస్టర్ డేట్ చెప్పేశాడు..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా మిస్టర్. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న శ్రీనువైట్ల దర్శకత్వంలో లోఫర్ సినిమాతో నిరాశపరిచిన వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఈ ఇద్దరి కెరీర్లకు కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ రిలీజ్ తరువాత పెద్దగా వార్తల్లో వినిపించని మిస్టర్ పేరు ఇప్పుడు సడన్‌గా తెర మీదకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ చాలా ఆలస్యం కావటంతో వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ మధ్యలో వరుణ్ కాలికి గాయం కావటంతో దాదాపు రెండు నెలల పాటు షూటింగ్ వాయిదా వేశారు. దీంతో సినిమా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవటంతో ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి భారీ చిత్రాలు క్యూ కడుతుండటంతో చిన్న మీడియం రేంజ్ సినిమాల రిలీజ్‌కు డేట్ దొరకటం కష్టమే. ఏప్రిల్ మొదటి వారంలో గురు, చెలియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అవుతోంది. దీంతో ఈ గ్యాప్ ఏప్రిల్ 14న మిస్టర్ రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారట. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
రిచ్ & రొమాంటిక్ 'మిస్టర్'
-
రిచ్ & రొమాంటిక్ 'మిస్టర్'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మిస్టర్. స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేశారు. వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. చాలా కాలం క్రితమే ఈ సినిమా ప్రారంభమైనా.. షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్ గాయపడటంతో ఆలస్యమైంది. త్వరలోనే ఆడియో మూవీ రిలీజ్ డేట్స్‌ను ఎనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Here it is #MisterTeaser https://t.co/liskboBMz7#HappyNewYear guys -
కొత్త దర్శకుడితో వరుణ్ తేజ్
మెగా వారసుడు వరుణ్ తేజ్ స్పీడు పెంచాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న వరుణ్ ఆ సినిమా తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగాను మరో సినిమాను ఫైనల్ చేశాడు. క్లాస్ మాస్ అనే ఇమేజ్‌లకు దూరంగా అన్ని రకాల సినిమాలు చేస్తున్న వరుణ్ త్వరలో కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఇటీవల కాలిగాయంతో చాలా కాలం పాటు ఇంటికే పరిమితమైన మెగా ప్రిన్స్ ఇప్పుడు త్వరగా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందుకే మిస్టర్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి అదే స్పీడు ఫిదా సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమా షూటింగ్లో పాల్గొంటాడు వరుణ్. -
50 రోజుల తరువాత సెట్లో మెగా హీరో
దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన మెగా హీరో వరుణ్ తేజ్ తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నాడు. మిస్టర్ సినిమా షూటింగ్లో ప్రమాదానికి గురైన వరుణ్, కాలికి తీవ్ర గాయం కావటంతో షూటింగ్‌లకు దూరమయ్యాడు. దీంతో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్‌తో పాటు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రారంభించిన ఫిదా సినిమాలు కూడా ఆగిపోయాయి. దాదాపు 50 రోజుల విరామం తరువాత సోమవారం వరుణ్ తిరిగి షూటింగ్లో పాల్గొన్నాడు. కాలి గాయం నుంచి కాస్త ఉపశమనం కలగటంతో మిస్టర్ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. ప్రస్తుతానికి ఫిదా సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి మిస్టర్ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు వరుణ్. ఇప్పటికే సినిమా ఆలస్యం కావటంతో మిస్టర్ సినిమా పూర్తి చేసిన తరువాతే ఫిదాకు డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మిస్టర్‌ను నల్లమలపు బుజ్జి నిర్మిస్టుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. కొద్ది రోజులు వరుస ఫ్లాప్ లతో ఇబ్బందులో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమా తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. Back on my feet and onto the sets after 50 long days!!..Excited to shoot!!..soo damn happy!! #shootresumes#mister#hyderabad pic.twitter.com/YbQcpJcqDO — Varun Tej (@IAmVarunTej) November 21, 2016 -
హిట్ హీరోతో శ్రీనువైట్ల
ఆగడు, బ్రూస్ లీ సినిమాల రిజల్ట్ తో కష్టాల్లో పడ్డ శ్రీనువైట్ల, తిరిగి ఫాంలోకి రావడానికి అన్నిరకాలుగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు బిజీగా ఉండటంతో యంగ్ హీరోతో వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా మిస్టర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీను. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. ఓ సూపర్ హిట్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు శ్రీనువైట్ల. ఇప్పటికే నాగచైతన్య, నాగార్జునలకు కథ వినిపించి ఓకె కూడా చేయించుకున్నాడు. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న చైతూ త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నాడు. -
కర్ణాటకలో 'మిస్టర్'
శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్'. ఇంతకుముందే మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. సోమవారం నుంచి రెండవ షెడ్యూల్ ప్రారంభించింది. ఊటీ, కర్ణాటకలోని కొన్ని లొకేషన్లలో చిత్రీకరణ జరుపనున్నారు. ఇదే షెడ్యూల్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాల్గొంటారు. ఆగడు, బ్రూస్ లీ పరాజయాల తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్‌కు కీలకం కానుంది. శ్రీనువైట్ల మార్క్ యాక్షన్ కామెడీగా 'మిస్టర్' రూపొందుతోందని సమాచారం. ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
ఫిదా మొదలైంది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పీడు పెంచాడు. కెరీర్ స్టార్టింగ్‌లో సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ డిఫరెంట్ అనిపించుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం, కమర్షియల్ ట్యాగ్ కోసం ఊవ్విళ్లూరుతున్నాడు. అందుకే పూరి జగన్నాథ్ లాంటి మాస్ స్సెషలిస్ట్తో లోఫర్ సినిమా చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఒకేసారి క్లాస్, మాస్ బ్యాలెన్స్ చేస్తూ రెండు సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఒక సినిమా పూర్తయితే గాని మరో సినిమా గురించి ఆలోచించని ఈ జనరేషన్లో, ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నాడు వరుణ్. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా షూటింగ్ ప్రారంభించిన ఈ టాల్ హీరో మొదటి షెడ్యూల్ పూర్తి చేసేశాడు. ఇక శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న మరో సినిమా ఫిదా షూటింగ్‌ను కూడా మొదలెట్టేశాడు. ఒకే సమయంలో శ్రీనువైట్ల లాంటి మాస్ డైరెక్టర్‌తో, శేఖర్ కమ్ముల లాంటి క్లాస్ డైరెక్టర్‌తో సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలతో మంచి విజయాలు సాధించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు వరుణ్ తేజ్. -
స్పెయిన్ టు తెలంగాణ వయా స్విట్జర్లాండ్!
‘లోఫర్’ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజైంది. ఆ తర్వాత ఓ ఆర్నెల్లు స్టోరీ డిస్కషన్స్‌కి పరిమితమైన వరుణ్‌తేజ్ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకువెళ్లారు. విశ్రాంతి లేకుండా స్పెయిన్ టు తెలంగాణ వయా స్విట్జర్లాండ్ ట్రావెల్ చేశారు. వరుణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ చిత్ర షూటింగ్ జూన్‌లో మొదలైంది. స్పెయిన్‌లో ఓ నెల రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కణ్ణుంచి స్విట్జర్లాండ్ వెళ్లారు. స్విస్‌లోని ఫేమస్ లేక్ ‘తున్’ వద్ద సాంగ్స్ షూటింగ్ ముగించుకుని మూడు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. ఇలా రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారో లేదో... మళ్లీ ‘ఫిదా’ షూటింగ్‌కి హాజరవుతున్నారు వరుణ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని బాన్సువాడలో జరుగుతోంది. అమెరికా ఎన్నారై కుర్రాడు తెలంగాణలోని బాన్సువాడకి వెళతాడు. ఎందుకంటే.. అక్కడమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇదే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఫిదా’ స్టోరీలైన్. విచిత్రంగా ఈ సినిమా కథలానే వరుణ్ కూడా విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘ఫిదా’ షూటింగ్ చేస్తున్నారు. కానీ, ఎవరితోనూ ప్రేమలో పడలేదు సుమా! -
మెగా హీరోతో కాఫీలాంటి సినిమా
ఆనంద్, హ్యాపిడేస్, గోదావరి, లీడర్ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల, కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. కహానీ రీమేక్‌గా నయనతార లీడ్ రోల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అనామిక, డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో నెక్ట్స్ సినిమా విషయంలో ఆలోచనలో పడ్డాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఫర్ఫెక్ట్ కథతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్‌తో శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకుంటున్న వరుణ్, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరోసారి కొత్త కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. శేఖర్, ఈ కథను ముందు రామ్ చరణ్‌కు చెప్పినా అతడు ఇంట్రస్ట్ చూపించకపోవటంతో వరుణ్‌తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. వరుణ్ తొలిసారిగా మాస్ జానర్లో ట్రై చేసిన లోఫర్, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపొవటంతో ఈ సారి ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ శ్రీనువైట్లతో కలిసి మిస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా పూర్తయిన తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మరో మెగా హీరోతో రెజీనా
మంచి యాక్టింగ్ టాలెంట్‌తో పాటు వరుసగా అవకాశాలు కూడా వస్తున్నా.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది రెజీనా. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా.., స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్స్ సాధించలేకపోతుంది. అయితే మెగా హీరోలు మాత్రం ఈ అమ్మడికి బాగానే ఛాన్సులిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో జతకట్టిన ఈ బ్యూటీ తాజాగా మరో మెగా హీరోతో నటించడానికి రెడీ అవుతోంది. పిల్లానువ్వులేనీ జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించింది రెజీనా. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించటంతో మెగా హీరోల దృష్టిలో పడింది. అదే సమయంలో మరో మెగా హీరో శిరీష్ సరసన కొత్తజంట సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాకు రెడీ అవుతోంది. ముకుంద, కంచె, లోఫర్ లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'మిస్టర్' సినిమాలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఉంది. అయితే ముందుగా ఈ పాత్రకు హేబా పటేల్‌ను తీసుకోవాలని భావించినా, వరుణ్ సరసన సూట్ అవ్వదన్న ఆలోచనతో రెజీనాను ఫైనల్ చేశారు. మరి వరుణ్ అయినా రెజీనాకు స్టార్ ఇమేజ్ తీసుకువస్తాడేమో చూడాలి. -
వరుణ్ తేజ్ 'మిస్టర్' ప్రారంభం
-
మిస్టర్ తేజ్
ఆరడుగులకు పైగా ఎత్తు....మ్యాన్లీ లుక్స్, నేచురల్ యాక్టింగ్‌తో వరుణ్‌తేజ్ మూడు సినిమాలతోనే ప్రామిసింగ్ స్టార్ అనిపించుకున్నారు. ఆయన నటించిన ‘కంచె’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించడంతో ఒక్కసారిగా క్రేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. దాంతో ఆయన తదుపరి చిత్రంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మిస్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ మే 15 నుంచి స్పెయిన్‌లో జరగనుంది. ఇందులో లావణ్యా త్రిపాఠీ, హెబ్బా పటేల్ కథానాయికలు. నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, నల్ల మలుపు శ్రీనివాస్(బుజ్జి) మాట్లాడుతూ-‘‘ఈ చిత్రానికి స్క్రిప్టు చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ సిద్ధమవుతోంది. ఊటీలో దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు గోపీమోహన్, శ్రీధర్ సీపానలు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నెలాఖరున లాంచనంగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: యువరాజ్, సమర్పణ: బేబీ భవ్య. -
ఒకసారి మైండ్‌లో ఫిక్స్ అయితే... బ్లైండ్‌గా వెళ్లిపోతా!
సినిమా వెనుక స్టోరీ - 37 శ్రీను వైట్ల ఫుల్ ఎగ్జయిటింగ్‌గా ఉన్నాడు. మహేశ్‌బాబుతో ఫస్ట్ మీటింగ్. చాలా చెప్పాలనుకున్నాడు. కానీ ఏమీ చెప్పలేక పోతున్నాడు. ఫైనల్‌గా ఒకటే అన్నాడు... ‘‘మీతో బ్లాక్ బస్టర్ తీస్తాను!’’ ‘‘అయితే ఆ పనిలో ఉండండి’’ అని చిలిపిగా నవ్వేశాడు మహేశ్. బయటకు రాగానే మంజులకు వందసార్లు థ్యాంక్స్ చెప్పాడు శ్రీను వైట్ల. ఆ మీటింగ్ అరేంజ్ చేసిందీ... ఈ కాంబినేషన్లో సినిమా చేస్తున్నదీ... ఆవిడే మరి! 2009... డిసెంబరు నెల. చాలా చలిగా ఉంది. శ్రీను వైట్ల మాత్రం చాలా వేడి మీద ఉన్నాడు. మహేశ్కో కథ దొరి కితే తప్ప ఈ మనసు వేడి చల్లారదు. ఆస్థాన రచయిత గోపీ మోహన్‌తో కూర్చుని రకరకాల స్కెచ్‌లు వేస్తున్నాడు. కాన్సెప్ట్‌లు ఆలోచిస్తున్నాడు. ‘‘మహేశ్‌తో పీరియాడికల్ మూవీ చేద్దామా?’’ సడన్‌గా అడిగాడు శ్రీనువైట్ల. ‘‘చాలా బావుంటుంది. మొన్నీ మధ్యనే తమిళంలో కార్తీ ‘యుగానికి ఒక్కడు’ చేశాడు. ఆ ప్యాట్రన్ బాగుంటుంది. కానీ అది టైమ్ టేకింగ్ ప్రాసెస్’’ చెప్పాడు గోపీమోహన్. ‘‘ఒక్కసారి ట్రై చేస్తే తప్పేముంది?’’ అన్నాడు శ్రీను వైట్ల. ఆయనలా అన్నా డంటే, ఇక పని మొదలు కావాలన్నట్టే! పని మొదలైంది. ఒకటి, రెండు లైన్లు అనుకున్నారు. బాలీవుడ్ సూపర్‌హిట్ ‘రంగ్‌దే బసంతి’ తరహాలో ఏమైనా చేద్దామా? నో యూజ్. ఇంకా కొత్తగా ఏదో ఆలోచించాలి. ఆ రోజు కె.రాఘవేంద్రరావు ఆఫీసు నుంచి డెరైక్ట్‌గా శ్రీను ఆఫీసుకు వచ్చాడు గోపీమోహన్. అతనో ట్రాన్స్‌లో ఉన్నాడు. ‘‘శ్రీనుగారూ! రచయిత జేకే భారవి గారు ఈ రోజు రాఘవేంద్రరావు గారికి ‘రావణబ్రహ్మ’ కథ చెబుతుంటే వండర్ అయిపోయా. మీరొకసారి కలవాలి’’ చెప్పాడు గోపీమోహన్. నెక్స్ట్ డే- శ్రీనువైట్ల, భారవి మీటింగ్. గంట కూర్చుందామనుకున్న వాళ్లు, ఐదు గంటలు అలానే ఉండిపోయారు. మైథలాజి కల్, హిస్టారికల్ థీమ్స్ గురించి డిస్కషన్. వీటిలో మహేశ్‌కి ఏది పనిచేస్తుంది? శ్రీను వైట్లకు ఇదే ఆలోచన. మహేశ్ ‘ఖలేజా’ షూటింగ్లో ఉన్నాడు. శ్రీను వైట్ల రెగ్యులర్‌గా కలుస్తూనే ఉన్నాడు. అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ‘‘శ్రీనుగారూ! మీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నా. ఏదైనా నేను చేయడానికి రెడీ’’చెప్పేశాడు మహేశ్. ఇది ఇంకా బర్డెన్. మహేశ్‌తో సినిమా అంటేనే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్. అన్నీ రీచ్ కావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. శ్రీను వైట్ల ఓ డెసిషన్‌కు వచ్చాడు. రైటర్స్ టీమ్‌ను పిలిచాడు. ‘ఖలేజా’ బాగా డిలే అవుతోంది. ఈ టైమ్‌లో మనం ఎపిక్ మూవీ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా మహేశ్‌తో హిలేరియస్ ఎంటర్టైనర్ చేయమంటు న్నారు. ఇక నుంచి ఆ పనిలో ఉందాం.’’ ఇక్కడో చిన్న చేంజ్! కాదు...పెద్ద చేంజే!! ఇప్పుడు ప్రొడ్యూసర్ మంజుల కాదు... 14 రీల్స్ వాళ్లు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర... ఈ ముగ్గురూ శ్రీను వైట్లకు క్లోజ్‌ఫ్రెండ్స్. వెంకటేశ్ ‘నమో వెంకటేశ’ సినిమాతో ప్రొడక్షన్లోకి ఎంటరయ్యారు. కూతురి చదువు కోసం మంజుల కొన్నాళ్లు ప్రొడక్షన్‌కు దూరంగా ఉందామనుకోవడంతో 14 రీల్స్ వాళ్లకు గోల్డెన్ చాన్స్. మళ్లీ అసలు కథలోకి వద్దాం. ఇక్కడ కథల వేటల కొనసాగు తోంది. శ్రీను బయట కథలు కూడా వింటున్నాడు. తెలుగు, తమిళం... ఇలా ఏ లాంగ్వేజ్ రైటర్నీ వదలడం లేదు. ఏదీ వర్కవుట్ కావడం లేదు. శ్రీను లేటెస్ట్ సినిమా ‘నమో వెంకటేశ’ రిలీజై 75 రోజులై పోయింది. ఇక్కడేమో ఒక్క ఇంచ్ కూడా డెవలప్మెంట్ లేదు. శ్రీనులో విపరీతమైన కసి. అలాంటి టైమ్‌లో గోపీ మోహన్ ఓ కాన్సెప్ట్ చెప్పాడు. శ్రీనువైట్లకు విపరీతంగా నచ్చేసింది. మహేశ్ కూడా ఓకే. ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలి. చలో మహాబలేశ్వర్! నియరెస్ట్ ప్లేస్ టుపుణే. శ్రీను వైట్ల... రైటర్స్ గోపీ మోహన్, శ్రీధర్ సీపాన, కో-డెరైక్టర్ సూర్య....ఇంకో ఇద్దరు. పంచగని ఏరియాలో పెద్ద గెస్ట్ హౌస్. టూవీక్స్ పగలూ రాత్రీ డిస్కషన్స్ మీద డిస్కషన్స్... 80 శాతం సూపర్‌గా వచ్చింది. లాస్ట్ ట్వంటీ పర్సెంట్ ఎపిసోడ్ ఎంతకూ తెగడం లేదు. అదే బాగా రావా లని శ్రీనువైట్ల పట్టు. . విందు భోజనం పెట్టాలనుకున్నప్పుడు పప్పూ కూరలూ పచ్చడి, సాంబారే కాదు... పెరుగూ పాన్ కూడా అదిరిపోవాలి. శ్రీను వైట్లకు ఏం పాలుపోవడం లేదు, ఏదో ఒక చోట డెసిషన్ తీసుకోవాల్సిందే. మహాబలేశ్వర్ లోకి శివాలయానికెళ్లాడు. ఆ గుళ్లోనే చాలా సేపు ఒంటరిగా కూర్చున్నాడు. బయటకు రాగానే డేరింగ్ డెసిషన్. ఈ కథ డ్రాప్. అందరూ షాక్. ఇదేమో మే నెల. జూలై కల్లా ‘ఖలేజా’ అయిపోతే, ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ కావాలి. అంటే 2,3 నెలల మించి టైమ్ లేదు. ఇప్పటి కిప్పుడు మళ్లీ కొత్త కథ చేసుకోవాలి. అందరిలోనూ టెన్షన్. కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తున్నాడు శ్రీను. బాడీ కన్నా మైండ్ ఎక్కువ వాక్ చేస్తోంది. ఫ్లాష్‌లా ఓ ఐడియా. మహేశ్‌ని వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఎమ్మెల్యేలా చూపిస్తే? ఆఫీసులో మీటింగ్. ‘‘ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డి తెలుసుగా! ఆయనో మంచి మాస్ లీడర్. ఆయన అంతిమయాత్రకు లక్షల్లో జనాలు వచ్చారు....’’ అని చెప్పుకుంటూ పోతు న్నాడు శ్రీను. ఏదైనా కాన్సెప్ట్ చెబుతాడను కుంటే పీజేఆర్ గురించి లెక్చర్ ఇస్తున్నా డేంటని టీమ్ మెంబర్స్‌లో కన్ ఫ్యూజన్. ‘‘ఇదే మన కథ. హీరో తండ్రి పీజేఆర్ లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి. హీరో కూడా ఎమ్మెల్యేనే... కానీ కాదు. రియాల్టీ షోలాగా సినిమా నడవాలి’’ అని కన్‌క్లూజన్ ఇచ్చేశాడు శ్రీను. ఆ టీమ్‌లో ఒకతను హుషారుగా విజిలేశాడు. శ్రీనుకు ఆ కథ స్టామినా అర్థమైపోయింది. స్క్రిప్ట్‌వర్క్ స్టార్ట్స్. రాత్రి ఎనిమిదిన్నరకూ కూర్చొని తెల్లారేలోగా స్టోరీ కాన్సెప్ట్ రెడీ చేసేశారు శ్రీను వైట్ల, గోపీమోహన్. తర్వాత ఊటీ వెళ్లి ఫుల్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసేశారు. ‘‘ఫెంటాస్టిక్... మైండ్‌బ్లోయింగ్... అన్బిలీవబుల్...’’ కథ విన్నాక మహేశ్ ఇమ్మీడియేట్ రియాక్షన్. డైలాగులు బాంబుల్లాగా ఉండాలి. శ్రీను రాయడం మొదలుపెట్టాడు. అలాంటి టైమ్‌లోనే కోన వెంకట్ ఎంటరయ్యాడు. అగ్నికి ఆజ్యం తోడయ్యింది. డైలాగ్ వెర్షన్ కూడా మైండ్ బ్లోయింగ్. ఇక్కడో చిన్న సర్ప్రైజ్. కథ కూడా రెడీ కాకుండానే హీరోయిన్ రెడీ. ‘ఏ మాయ చేశావె’తో హీరోయిన్గా ఎంటరైన సమంతా ఫస్ట్‌లుక్‌లోనే నచ్చేసింది. మహేశ్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్. మంజుల సపోర్ట్‌తో సమంత సెకండ్ సినిమా అగ్రి మెంట్ తీసేసుకున్నారు. ఆమెకు కూడా ఇది గోల్డెన్ ఛాన్స్. కాస్టింగ్ అంతా ఫైనల్. హీరో ఫాదర్ క్యారెక్టర్ ఒకటే బ్యాలెన్స్. నెంబరాఫ్ ఆప్షన్స్. ఏదీ సెట్ కావడం లేదు. ‘ప్రకాశ్‌రాజ్‌గారిని పెట్టుకోండి....’ - ఇది మహేశ్ సజెషన్. కథకెంత టెన్షన్ పడ్డారో, టైటిల్‌కే అంతే టెన్షన్. ‘పవర్’ అని పెడితే బాగుం టుంది. ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తుంటే వచ్చిందో టైటిల్... ‘దూకుడు’. ఫెంటా స్టిక్... మైండ్‌బ్లోయింగ్... అన్బిలీవబుల్. శ్రీను సినిమాలో మ్యూజిక్ అదిరిపో తుంది. దేవిశ్రీప్రసాద్‌తో హిట్ కాంబి నేషన్. ఇద్దరూ కలిసి ఏడు సినిమాలు చేశారు. ఇప్పుడేమో దేవీ బిజీ. ఎవరిని తీసుకోవాలి? శ్రీనుకు తమన్ రెగ్యులర్ టచ్‌లో ఉంటున్నాడు. ‘‘ఒక్క చాన్స్... ఒక్క చాన్స్’’ అంటూ వెంటాడుతున్నాడు. అతనికో చాన్స్ ఇద్దామా? రెండు సిట్యు యేషన్స్ చెప్పి ‘‘టూ, త్రీ డేస్‌లో కలువ్’’ అన్నాడు శ్రీను. ఆ సాయంత్రానికే తమన్ రెడీ. రెండు పాటలు చేసుకొచ్చాడు. ‘నీ దూకుడు...’, ‘గురువారం మార్చి 1’. తమన్ కొట్టావురా గోల్డెన్ చాన్స్. హైదరాబాద్... ముంబయ్... బ్యాంకాక్... దుబాయ్ - ఇలా చాలా ప్లేసుల్లో షూటింగ్. ఓ ఇంపార్టెంట్ ఎపిసోడ్‌కి మాత్రం ఎవరూ వెళ్లని ఫారిన్ లొకేషన్‌కు వెళ్లాలని ప్లానింగ్. ఇస్తాంబుల్ బ్యూటిఫుల్ సిటీ. కానీ ట్రాఫిక్ ఎక్కువ. షూటింగ్ చేయడం కొంచెం కష్టమే! అయినా ప్రొసీడైపోయారు. ఫస్ట్ షెడ్యూల్ అక్కడే చేశారు. మహేశ్‌కి ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ డే షూటింగ్‌లోనే ప్రాజెక్ట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్. ఓ రోజు సడన్‌గా మహేశ్ అడిగాడు... ‘‘మీ సినిమాల్లో తాగుడు సీన్లు ఫేమస్ అటగా. ఇందులో ఏమైనా పెట్టారా?’’ ‘‘అబ్బే లేదండీ!’’ ‘‘మీ సెంటిమెంట్‌ను ఎందుకు బ్రేక్ చేసుకోవడం. హ్యాపీగా పెట్టుకోండి!’’ మహేశ్ ఈజీగానే చెప్పేశాడు. కానీ మహేశ్ మందు కొట్టే సీన్ ఎలా ఇరికిం చడం? జస్ట్ అలా మందు స్మెల్ చేయిస్తే, వెరీ గుడ్ ఐడియా. ‘దూకుడు’తో పాటూనే మహేశ్ ఇంకో సినిమా చేయాలి. తమిళ్ డెరైక్టర్ శంకర్ మూవీ. ‘త్రీ ఇడియట్స్’ హిందీ మూవీకి రీమేక్. అక్కడా, ఇక్కడా - రెండు పక్కలా చేస్తూ ఉంటే క్యారెక్టర్ ఫ్లేవర్‌ని ఫీల్ కాలేడు. అందుకే మహేశ్ వదిలేసుకున్నాడు. ఇప్పుడు కాన్సన్ ట్రేషన్ మొత్తం ‘దూకుడు’ మీదే! 150 రోజుల షూటింగ్. టాకీ పార్ట్ తీసింది 50 రోజులే. మిగతా 100 రోజులూ పాటలూ, ఫైట్లకే పట్టేసింది. మధ్యలో సినీవర్కర్స్ స్ట్రయిక్. దాంతో రిలీజ్... టు మంత్స్ డిలే! లెన్త్ కూడా ఎక్కువైపోయింది. ట్వంటీ మినిట్స్ సినిమా ఎడిట్ చేసి పక్కన పడేశారు. అయినా మూడు గంటలుంది. శ్రీను వైట్ల మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. రిజల్ట్ విషయంలో నో డౌట్. నో డైలమా. ఇది పక్కా బ్లాక్ బస్టర్. ‘కళ్ళున్నవాడు ముందు మాత్రమే చూస్తాడు! దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’... ఇక్కడ శ్రీను వైట్లకు దిమాక్ ఉంది. ఇక్కడ దిమాక్ అంటే... తెలివైన మంచి కథ అనుకోవచ్చు. అలాంటి కథకు మహేశ్ లాంటి సూపర్‌హీరో దొరికాడు. ఇంకేం... రిజల్ట్ అలా ఇలా ఉండదు. 2011 సెప్టెంబరు 23న ‘దూకుడు’ రిలీజైంది. మార్నింగ్ షో చూసి సూపర్‌స్టార్ కృష్ణ ‘‘ఇది 80 కోట్ల సినిమా’’ అన్నారు. ఆయన చెప్పింది జోస్యం కాదు... పచ్చి నిజం. మహేశ్‌తో బ్లాక్‌బస్టర్ తీయాలని శ్రీనువైట్ల మైండ్‌లో ఫిక్సయ్యాడు. అందుకే- ‘దూకుడు’ బాక్సాఫీస్ దగ్గర బ్లైండ్‌గా దూసుకుపోయింది. - పులగం చిన్నారాయణ వెరీ ఇంట్రస్టింగ్ * ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో ఎమ్మెస్ నారాయణ క్యారెక్టర్ లేదు. అది లాస్ట్ మినిట్ యాడింగ్. చాలామంది అబ్జెక్ట్ చేసినా, శ్రీను మొండిగా ఈ క్యారెక్టర్ పెట్టారు. తీరా సినిమా రిలీజయ్యాక, ఆ క్యారెక్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ * ‘రోబో’లోని ‘కిలీమంజారో...’ పాట ఇన్స్పిరేషన్తో ఇందులో ‘చిల్బులీ...’ పాట డిజైన్ చేశారు * హీరోయిన్ పార్వతీ మెల్టన్‌తో ఐటెమ్‌సాంగ్ చేయించారు హిందీలో సల్మాన్‌ఖాన్‌తో రీమేక్ ప్రపోజల్ వచ్చింది. ఎందుకనో కుదర్లేదు * కన్నడలో ‘పవర్’ పేరుతో 14 రీల్స్ వాళ్లే రీమేక్ చేశారు. -
సీక్వల్కే ఫిక్స్ అయిన శ్రీనువైట్ల
వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయిన స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల తిరిగి ఫాంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'ఆగడు' సినిమాతో భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్న శ్రీనువైట్ల. ఆ తరువాత 'బ్రూస్ లీ' సినిమాతో మరోసారి ఫ్లాప్ టాక్ మూటకట్టుకున్నాడు. దీంతో కాస్త బ్రేక్ తీసుకొని గ్యారెంటీ హిట్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో యంగ్ హీరోలతో మంచి సక్సెస్‌లు సాధించిన శ్రీను మరోసారి అదే ఫార్ములాను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ కామెడీ డ్రామాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే తన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా రెడీకి సీక్వల్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. మరోసారి రామ్ హీరోగా 'రెడీ'కి సీక్వల్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
మహేష్ నిర్మాణంలో సుధీర్ హీరోగా..!
శ్రీమంతుడు సినిమాతో తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్న మహేష్ బాబు, ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. తను హీరోగా తెరకెక్కే సినిమాలకు మాత్రమే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా తన బావ సుధీర్ బాబు హీరోగా ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్. మహేష్ బాబుకు 'దూకుడు' లాంటి బ్లాక్ బస్టర్‌తో పాటు 'ఆగడు' లాంటి డిజాస్టర్ సినిమాను ఇచ్చిన శ్రీనువైట్ల ఆ తరువాత బ్రూస్ లీ ఫెయిల్యూర్‌తో మరింత డీలాపడిపోయాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఆలోచనతో ఓ పక్కా కమర్షియల్ కథతో మహేష్‌ను సంప్రదించాడు. అయితే తన బావను కమర్షియల్‌గా నిలబెట్టడం కోసం ఆ సినిమాను సుధీర్ బాబు హీరోగా తెరకెక్కించాలని సూచించాడు మహేష్. శ్రీను వైట్ల కూడా ఆ ప్రాజెక్ట్‌కు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
సుకుమార్ డైరెక్షన్లో అఖిల్..?
తొలి సినిమా డిజాస్టర్‌గా నిలిచినా యంగ్ హీరో అక్కినేని అఖిల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా ఆకట్టుకోలేకపోయినా, వ్యక్తిగతంగా డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో మంచి మార్కులే కొట్టేశాడు. అందుకే అఖిల్‌తో రెండోసినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు కూడా సై అంటున్నారు. ఇప్పటికే కొంతమంది దర్శకులు కథ రెడీ చేసే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. తొలి సినిమా రిజల్ట్‌తో రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అఖిల్. ఎలాంటి కథను ఎంచుకోవాలో ఇంతవరకు ఫైనల్ చేయకపోయినా అఖిల్ సినిమా కోసం ఎదురుచూసే దర్శకులు సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతోంది. త్రివిక్రమ్, విక్రమ్ కె కుమార్, శ్రీనువైట్ల, వంశీ పైడిపల్లి లాంటి టాప్ మేకర్స్ పేర్లు ఇప్పటికే క్యూలో ఉండగా తాజాగా మరో స్టార్ డైరెక్టర్, ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. నాన్నకు ప్రేమతో సినిమాతో సంక్రాంతి బరిలో ఘనవిజయం సాధించిన సుకుమార్, అఖిల్ హీరోగా ఓ ప్రేమకథను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అయితే ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన సుకుమార్.. అఖిల్ సినిమాను ఎప్పుడు మొదలు పెడుతాడన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా సుకుమార్ సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సినిమా అయినా పట్టాలెక్కుతుందో లేక మిగతా దర్శకుల్లాగా సుకుమార్ కూడా క్యూలో ఉండిపోతాడో చూడాలి. -
ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా..
తెలుగు సినీరంగంలో రచయితలుగా సక్సెస్ సాధించి చాలామంది ఆ తర్వాత మెగాఫోన్ పట్టి విజయాలనందుకున్నారు. ఇప్పుడు అదే బాటలో నడవడానికి మరో స్టార్ రైటర్ రెడీ అవుతున్నాడు. శ్రీను వైట్ల, వినాయక్ లాంటి దర్శకుల సినిమాలకు రచయితగా పనిచేసిన గోపి మోహన్ త్వరలోనే దర్శకత్వం వహించనున్నాడు. రెండేళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించాడు గోపి మోహన్. సునీల్ హీరోగా, అనీల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కే సినిమాతో గోపిమోహన్ దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సునీల్‌తో చేయాల్సి సినిమా ఆలస్యం కావటం, ఈలోగా సునీల్ కూడా వీరు పోట్లతో మరో సినిమా అంగీకరించటంతో, ఇప్పుడు మరో సినిమాకు దర్శకత్వం వహించే ప్రయత్నాల్లో ఉన్నాడు గోపిమోహన్. ఈ సినిమాకు 'ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా' అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫైనల్ చేశాడు. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రచయితగా భారీ విజయాలను అందించిన గోపిమోహన్ దర్శకుడిగా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
ఫ్లాప్ డైరెక్టర్‌తో వరుణ్..?
తొలి సినిమా నుంచే కథల ఎంపికలో కొత్తగా ఆలోచిస్తున్న వరుణ్ తేజ్, మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో డీలా పడ్డ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయినా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన రెండో సినిమా కంచెతో అందరి దృష్టిని ఆకర్షించాడు వరుణ్. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ హీరోగా లోఫర్ సినిమాను నిర్మించిన సి కళ్యాణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. వీటిలో ఒక సినిమాలో వరుణ్ హీరోగా నటించే అవకాశం ఉందంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కామెడీ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వరుణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేసే అవకాశం ఉంది. -
దర్శకుడు శ్రీను వైట్లపై కేసు నమోదు
-
దర్శకుడు శ్రీను వైట్లపై కేసు నమోదు
బ్రూస్లీ, ఆగడు లాంటి సినిమాలతో ఇటీవలి కాలంలో పరాజయాల బాటలో నడుస్తున్న దర్శకుడు శ్రీను వైట్లకు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య సంతోషి రూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. శ్రీను వైట్లపై సెక్షన్ 488ఏ, 323ఐపీసీ ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పెళ్లయిన 12 ఏళ్ల నుంచి తనను శ్రీను వైట్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని సంతోషిరూప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. తన భర్త తనతో పాటు తన బంధువులు, స్నేహితులను సైతం వేధిస్తున్నారని శ్రీనువైట్ల భార్య పోలీసులకు తెలిపారు. అక్టోబర్ 12వ తేదీన పిల్లలు, పనిమనుషుల ఎదుటనే తనను దర్శకుడు శ్రీనువైట్ల కొట్టాడని ఆన భార్య చెబుతోంది. 13వ తేదీన కూడా మరోసారి ఇలాగే ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్లు పగలగొట్టడంతో పాటు తన తల్లిదండ్రులను సైతం అసభ్య పదజాలంతో దూషించారని సంతోషి రూప ఫిర్యాదు తెలిపింది. దీంతో ఉద్దేశపూర్వకంగా కొట్టడం అనే నేరం కింద కేసు నమోదు చేశారు. -
నూటయాభై పూలతో..!
‘‘చాలా విరామం తర్వాత అన్నయ్య మళ్లీ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. పొలిటికల్ జర్నీ మొదలయ్యాక మేం చాలా అరుదుగా కలుసుకున్నాం. రాజకీయాల పరంగా మా ఇద్దరి విధానాలు వేరైనా వ్యక్తిగతంగా అన్నయ్య అంటే నాకు ఇష్టం, గౌరవం. నా సినీ జీవితానికీ, ఇంత మంచి జీవితానికి కారకుడైన అన్నయ్య మళ్లీ నటించినందుకు ఆనందం అనిపించి, అభినందించాలనుకున్నాను’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రూస్లీ’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి మూడు నిముషాల పాటు సాగే అతిథి పాత్ర చేశారు. చిరంజీవిని అభిమానించే అందరి తరపున ఆయన రీ-ఎంట్రీని ప్రత్యేకంగా అభినందించాలనుకున్న పవన్ కల్యాణ్ 150 పువ్వులతో అందమైన పుష్పగుచ్ఛం తయారు చేయించారు. ఆదివారం సాయంత్రం చిరంజీవి ఇంటికి స్వయంగా వెళ్లి, కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘నేనింకా ‘బ్రూస్లీ’ చూడలేదు. చూసినవాళ్లు అన్నయ్య ఎంట్రీ సీన్ అప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయని అంటుంటే సంతోషం అనిపించింది. అన్నయ్య నటించబోయే 150వ చిత్రం కూడా విజయం సాధించాలి’’ అన్నారు. రామ్‌చరణ్‌తో తీయబోయే సినిమాకు సంబంధించి రెండు, మూడు కథలు సిద్ధంగా ఉన్నాయని పవన్ అన్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ను సంక్రాంతికి విడుదల చేయడానికి ట్రై చేస్తున్నామని తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలనే ఉందనీ, షూటింగ్ షెడ్యూల్స్ అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని పవన్ స్పష్టం చేశారు. -
బ్రూస్ లీ దర్శక, నిర్మాతలపై ఐటీ ఎటాక్
-
బ్రూస్ లీ దర్శక, నిర్మాతలపై ఐటీ ఎటాక్
హైదరాబాద్ : నిన్న కోలివుడ్ ...తాజాగా టాలీవుడ్‌పై ఐటీ శాఖ కన్నేసింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన బ్రూస్ లీ చిత్రమే ప్రధాన లక్ష్యంగా సినిమా రంగంపై ఆదాయపు పన్నుశాఖ గురువారం పంజా విసిరింది. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత డీవీవీ దానయ్య, సంగీత దర్శకుడు థమన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కాగా రామ్ చరణ్ హీరోగా రూ. 50కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిన బ్రూస్ లీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి, సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనువైట్ల, దానయ్య నివాసాలతో పాటు, వారి కార్యాలయాలు, వారి సమీప బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కొద్దిరోజుల క్రితం పులి చిత్ర హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై దాడులు నిర్వహించింది. నిర్మాతలు కలైపులి ఎస్ థాను, మదురై అన్బు ఇళ్లలో సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటీ సోదాల్లో పెద్ద ఎత్తున నగదుతో పాటు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. -
నవ్వుల దూకుడు
-
’బ్రూస్లీ’ సాంగ్ టీజర్ విడుదల
-
నా స్టయిల్ మార్చుకున్నా!
‘‘కెరీర్ ప్రారంభంలో ‘నీ కోసం’, ‘ఆనందం’ లాంటి ప్రేమకథలు తీశాను. ఆ తర్వాత తీసినవన్నీ కమర్షియల్ ఎంటర్టైనర్స్. ఎక్కువగా ఆ తరహా చిత్రాల మీదే దృష్టి పెట్టాను. అయితే, ఆ కథలను తెర మీద ఆవిష్కరించే విషయంలో ఒకే ప్యాట్రన్ ఫాలో అయ్యాను. ఒకే పంథాలో తీయడం వల్ల ప్రేక్షకులు కూడా బోర్ ఫీలయ్యారు. అందుకే, ‘బ్రూస్లీ’ చిత్రానికి నా స్టయిల్ మార్చుకున్నాను. ఎలాంటి కథలు ఎంచు కున్నా, ఏ పంథాలో తీసినా నాదైన శైలి వినోదం ఉంటుంది’’ అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం చేస్తున్న ‘బ్రూస్లీ’ నాకు స్పెషల్. రామ్‌చరణ్‌ను, చిరంజీవిగారిని ఒకేసారి ఈ సినిమాలో డెరైక్ట్ చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం. చిరంజీవిగారు చేసిన పాత్ర కథలో భాగంగానే ఉంటుంది. ఆయన కనిపించే సన్నివేశాలు అభిమానులకు కన్నులపండగే. ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అభిమా నులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అది సస్పెన్స్. ఈ చిత్రంలో బ్రూస్లీ అభిమానిగా, స్టంట్‌మాస్టర్‌గా రామ్‌చరణ్ విభిన్న పాత్రలో కనిపిస్తారు. కొంత విరామం తర్వాత కోన వెంకట్, గోపీ మోహన్లతో పని చేయడం ఆనందంగా ఉంది. నా గత చిత్రాల్లా కాకుండా ఇందులో బ్రహ్మా నందం పాత్ర చిత్రణ కాస్త వైవిధ్యంగా ఉంటుంది’’ అని చెప్పారు. -
వినాయక చవితిని టార్గెట్ చేసిన 'బ్రూస్లీ'
ఇటీవల లాంగ్ గ్యాప్ తీసుకున్న రామ్‌చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్లీ సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్ని రకాల ఎమోషన్స్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకొని సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి విషయంలో రాజమౌళి రిలీజ్ చేసినట్టుగానే పోస్టర్లు, ట్రైలర్ లతో సందడి చేస్తూ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచేస్తున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సీన్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్ చరణ్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది. ఆ తరువాత పవన్ పుట్టిన రోజు సందర్భంగా కూడా మరోసారి అదే ప్లాన్‌ను వర్క్ అవుట్ చేశారు బ్రూస్లీ యూనిట్. అయితే చిరు పుట్టిన రోజు సందర్భంగా యాక్షన్ ట్రైలర్ తో అలరించిన చెర్రీ, పవన్ పుట్టిన రోజు నాడు ఫ్యామిలీ డ్రామాను పరిచయం చేశాడు. ఇప్పుడు వినాయకచవితిని టార్గెట్ చేస్తున్నారు బ్రూస్లీ టీం. డైరెక్టర్ శ్రీనువైట్ల మార్క్ కామెడీ పంచ్‌లతో కట్ చేసిన ట్రైలర్‌ను వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉండటంతో మరిన్న ట్రైలర్స్ వస్తాయన్న ఆనందంలో ఉన్నారు మెగా అభిమానులు. -
రొమాంటిక్ హీరోగా చెర్రీ
మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రామ్‌చరణ్ రొమాంటిక్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గతంలో ఇదే ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ కాకపోవటంతో లాంగ్ గ్యాప్ తీసుకొని మరోసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు రెడీ అవుతున్నాడు. ఫీల్ గుడ్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న టాప్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 'బ్రూస్లీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ గా నటిస్తున్న చెర్రీ ఆ క్యారెక్టర్ కోసం రిస్కీ స్టంట్స్ కూడా చేస్తున్నాడు. చరణ్ కెరీర్లో ఒక్క 'ఆరెంజ్' తప్ప మిగతా సినిమాలన్నీ మాస్ యాక్షన్ జానర్ లో రూపొందినవే. కొత్తగా ప్రయత్నించిన ఆరెంజ్ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవటంతో, తరువాత అలాంటి ప్రయత్నం చేయటమే మానేశాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఇప్పుడు మరోసారి రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఆ జానర్ సినిమాలు చేయటంలో స్పెషలిస్ట్ గా పేరున్న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడు. గౌతమ్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా పూర్తవ్వగానే చరణ్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టనున్నాడు. ఈ లోగా చరణ్ కూడా 'బ్రూస్లీ' షూటింగ్ పూర్తి చేసి నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే సురేందర్ రెడ్డి తో సినిమా అంగీకరించిన చరణ్ ఏ సినిమాను స్టార్ట్ చేయనున్నాడో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
బ్రూస్లీ ఫైటింగ్!
అదో పెద్ద గది. గదిలో మొత్తం అద్దాలు. ఆ గదిలోకి ఎంటరయ్యేవాళ్లు అన్ని అద్దాల్లోనూ కనిపిస్తారు. ఏది రియల్ ఇమేజ్.. ఏది మిర్రర్ ఇమేజో కనుక్కోలేం. నాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఆ గదిలో ఫైట్ సీన్ ఉంటే, ఏది అసలు ఇమేజ్.. ఏది నకిలీ అని తికమకపడిపోతారు. హాలీవుడ్ చిత్రాలను బాగా ఫాలో అయ్యేవారికి ‘ఎంటర్ ది డ్రాగన్’లోని ఈ సీన్ వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఆ వెంటనే అద్భుతంగా ఫైట్స్ చేసే ఆ చిత్రకథానాయకుడు బ్రూస్లీ గుర్తు రాకుండా ఉండరు. మార్షల్ ఆర్ట్స్ పేరు చెప్పగానే ఇప్పటికీ అందరూ తలుచుకొనేది బ్రూస్లీనే. ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం చని పోయిన బ్రూస్లీని ఇప్పుడు గుర్తు చేసుకోవ డానికి కారణం ఉంది. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘బ్రూస్లీ... ది ఫైటర్’ పేరు ఖరారు చేశారు. దీన్ని బట్టి చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమాలో ఆయన స్టంట్‌మ్యాన్‌గా నటిస్తు న్నారు. దీని కోసం చరణ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని భోగట్టా. సో... థ్రిల్‌కి గురి చేసే కొత్త రకం ఫైట్స్‌తో విలన్లను రఫ్ఫాడిస్తారని చెప్పొచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం విజయ దశమికి విడుదల కానుంది. -
చిరంజీవి గెస్ట్‌రోల్ చేస్తున్నారా?
చిరంజీవి 150వ చిత్రం గురించి చర్చ జరుగుతూ ఉండగానే, శనివారం ఫిలిమ్నగర్లో మరో వార్త హల్చల్ చేసింది. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో చిరంజీవి అతిథి పాత్ర చేయనున్నారని చెప్పుకుంటున్నారు. మరోపక్క ఈ స్పెషల్ క్యారె క్టర్‌ను నాగార్జున చేయనున్నారని వినిపి స్తోంది. నిజానిజాలు కొద్దిరోజుల్లో తేలతాయి. -
మహేశ్ - శ్రీను వైట్ల నిర్మాతలు!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకుడు శ్రీను వైట్ల కలిసి ఓ చిత్రం నిర్మించనున్నారా? ఔనంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే జి. మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. సంస్థను స్థాపించి, ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు మహేశ్‌బాబు. ఇప్పుడు దర్శకుడు శ్రీనువైట్ల కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నారట. మహేశ్, ఆయన కలిసి ఓ సినిమా నిర్మించనున్నారని సమాచారం. -
బ్రూస్లీగా మారుతున్న రామ్ చరణ్
-
రామ్‌చరణ్‌కు సోదరిగా...
ఢిల్లీలో పుట్టి, బెంగళూరులో పెరిగి, మోడల్‌గా మొదలై, సినిమాల్లో పేరు తెచ్చుకున్న పంజాబీ అమ్మాయి - కృతీ కర్బందా. తెలుగు చిత్రం ‘బోణీ’ (2009)తో సినీ రంగంలోకి వచ్చినా, తెలుగులో కన్నా కన్నడంలోనే ఆమె ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. గతంలో పవన్‌కల్యాణ్ ‘తీన్మార్’, రామ్ ‘ఒంగోలు గిత్త’, కల్యాణ్‌రామ్ ‘ఓం - 3డి’లో నటించిన ఈ బెంగళూరు యువతి కొంత విరామం తరువాత ఇప్పుడు మళ్ళీ ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో, హీరోకు సోదరి పాత్రను ఆమె పోషిస్తున్నారు. హీరోయిన్గా చేస్తూ, సోదరి పాత్ర ఒప్పుకోవడం కెరీర్‌కు దెబ్బ కాదా? ‘‘నిజం చెప్పాలంటే, ఈ పాత్ర నా కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆలోచించలేదు. నా కన్నా నా చుట్టూ ఉన్నవాళ్ళే ఎక్కువ ఆలోచిస్తున్నట్లున్నారు’’ అని కృతి నవ్వేశారు. ‘‘ఆ పాత్ర స్వరూప స్వభావాలు నచ్చడంతో ఒప్పుకున్నా’’ అని పేర్కొన్నారామె. ‘‘ఈ ఆఫర్ గురించి కన్నడంలో పెద్ద స్టార్ అయిన ఉపేంద్ర గారికి చెప్పాను. ఈ మధ్యే ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో క్యారెక్టర్ రోల్‌కు ఒప్పుకున్న ఆయన ఏమని చెబుతారా అని చూశాను. ‘నీ మీద నీకు నమ్మకం ఉంచుకో. పాత్ర నచ్చితే చేసేయ్!’ అన్నారు. అంత పెద్ద నటుడే మరో భాషా చిత్రంలో నటిస్తుంటే, నేనెందుకు వెనక్కి తగ్గాలని ఈ పాత్ర చేస్తున్నా’’ అని కృతీ కర్బందా వివరించారు. ఆ మధ్య ‘గూగ్లీ’ చిత్రంతో కన్నడంలో ఒక ఊపు ఊపేసిన కృతి ప్రస్తుతం అయిదు భారీ కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘‘రామ్‌చరణ్ - శ్రీను వైట్ల సినిమాలో బోలెడంత బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉంది. సినిమాలోని ఈ ప్రధాన ఉపకథ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నా. నిజజీవితంలో నేనున్నట్లే, పక్కింటి అమ్మాయిలా, వాగుడుకాయలా ఉండే పాత్ర నాది. ప్రస్తుతానికి అంతకు మించి వివరాలు వెల్లడించలేను’’ అన్నారీ అమ్మాయి. మునుపటి తెలుగు సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో, నాలుగు నెలల పాటు ఏ సినిమానూ ఒప్పుకోని కృతి మొత్తానికి ఇప్పుడు ఆచితూచి చక్కటి సినిమా, పాత్ర ఎంచుకున్నట్లున్నారు. ఇంకేం! శుభం!! -
దోపిడీకి గురైన ప్రముఖ సినీ రచయిత
ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ దారి దోపిడీకి గురయ్యారు. అచ్చంగా సినిమా ఫక్కిలో చోరీ జరిగింది. సినిమాల్లో చూపించినట్లే దుండగులు రోడ్డుకు అడ్డంగా చెట్టు పడవేసి మరీ దోపిడీకి పాల్పడ్డారు. నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ కోన వెంకట్‌తో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా దొంగల బారిన పడగా, దర్శకుడు శ్రీను వైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తృటిలో తప్పించుకున్నారు. నగర శివార్లలో జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఈనెల 26న షాద్ నగర్లో ప్రకాష్ రాజ్ ఫాంహౌస్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. పార్టీ అనంతరం రాత్రి 2 గంటల సమయంలో కోన వెంకట్, దానయ్య ..సిటీకి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు దారికాచి దోపిడీకి పాల్పడ్డారు. గొడ్డళ్లతో కారు అద్దాలు పగులగొట్టి వారి వద్ద నుంచి బంగారు గొలుసులు, ఉంగరాలు, డబ్బులు దోచుకు వెళ్లారు. దుండగులు దోచుకు వెళ్లిన సొత్తు మొత్తం రూ.3లక్షల ఉంటుందని అంచనా. కాగా వీరి వెనుకనే వస్తున్న శ్రీనువైట్ల, థమన్, గోపీ మోహన్.... దోపిడీ వ్యవహారాన్ని గమనించి తమ వాహనాలను వెనక్కి తిప్పి వెళ్లిపోయారు. అనంతరం కోన వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు దారిదోపిడీ విషయాన్ని షాద్ నగర్ పోలీసులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాద్ నగర్ సీఐ శంకరయ్య తెలిపారు. ఇక ఈ సంఘటనపై కోన వెంకట్ మాట్లాడుతూ తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని, దుండగుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడినందుకు హ్యాపీగా ఉందన్నారు. మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇవ్వాలని దొంగలు బెదిరించినట్లు ఆయన తెలిపారు. కాగా.. డబ్బు పోతే పోయింది కానీ, తన తదుపరి చిత్రానికి మంచి కథ దొరికిందని కోన వెంకట్ వ్యాఖ్యానించటం కొసమెరుపు. ఈ దారిదోపిడీకి సంబంధించిన సన్నివేశాలు క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'శంకరాభరణం' చిత్రంలో ప్రేక్షకుల్ని అలరించవచ్చు. -
రామ్‌చరణ్ చిత్రానికి డీఎస్పీ సంగీతం
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంగీత దర్శకుడు మారాడా అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఆ చిత్ర సంగీత దర్శకుడిగా ముందుగా అనుకున్న అనిరుధ్‌ను తప్పించి ఆ స్థానంలో దేవి శ్రీ ప్రసాద్‌ను తీసుకున్నట్లు సమాచారం. సదరు చిత్రం కోసం తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రూపొందించిన ట్యూన్లు దర్శకుడు శ్రీను వైట్లను అంతగా ఆకట్టుకోలేదంటా. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడిని మార్చాలని శ్రీనువైట్లు భావించారు. ఆ క్రమంలో దేవిశ్రీప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ వేగంగా జరుపుకుటుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. డీవీవీ దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
చరణ్ సినిమా షురూ!
‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత కొంత విరామం తీసుకున్న రామ్‌చరణ్ మళ్లీ షూటింగ్‌లతో బిజీ అవుతున్నారు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా షూటింగ్ లాంఛనంగా గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన మహూర్తపు దృశ్యానికి వినాయక్ కెమేరా స్విచాన్ చేయగా, చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ ఇచ్చారు. సినిమా స్క్రిప్ట్‌ను చిరంజీవి దర్శక -నిర్మాతలకు అందించారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ - ‘‘రామ్‌చరణ్‌తో పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ నేను, గోపీమోహన్, కోన వెంకట్ కలిసి మంచి కథ తయారుచేశాం. మా కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాలన్నిటి లానే ఈ సినిమా కూడా హిట్టవుతుంది’’ అని చెప్పారు. సినిమా మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటుందని కోన వెంకట్ పేర్కొన్నారు. నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ- ‘‘రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఫైట్స్: అనల్ అరసు, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై ప్రవీణ్ కుమార్. -
చరణ్, శ్రీను వైట్ల మూవీ ప్రారంభం..!
-
కాలం వెంట కరిగిపోని విషాద ప్రేమకథ
అందుకే... అంత బాగుంది : శ్రీను వైట్ల టైటానిక్ (1997) తారాగణం - లియొనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్, బిల్లీ జేన్; ఛాయాగ్రహణం - రస్సెల్ కార్పెంటర్; రచన, నిర్మాణం, దర్శకత్వం - జేమ్స్ కామెరూన్; నిడివి - 194 నిమిషాలు; విడుదల - 1997 డిసెంబర్ 19; నిర్మాణ వ్యయం - 20 కోట్ల డాలర్లు (ఇప్పటి లెక్కలో దాదాపు రూ. 1200 కోట్లు); బాక్సాఫీస్ వసూళ్ళు - 218. 7 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 13,122 కోట్లు) అప్పటికి నేను డెరైక్టర్ని కాలేదు. డెరైక్షన్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాను. ఆ రోజు - సికింద్రాబాద్‌లోని సంగీత్ థియేటర్లో ఫస్ట్ షో సినిమాకెళ్లా. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం. ఓ ఇంగ్లీషు సినిమాకి అంత మంది జనాన్ని చూడడం అదే మొదటిసారి. సినిమా స్టార్ట్ అయ్యింది. ఇక అక్కణ్ణుంచీ నాలో నేను లేను. మనసు టైటానిక్ షిప్ ఎక్కేసింది. ఆ షిప్లో ఉన్న వందల మంది జనంలో నేనూ ఒకణ్ణి అన్నట్టుగా ఉంది. ఆ 194 నిమిషాలూ ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయాన్నేను. ‘టైటానిక్’... ఈ పేరు తలుచు కుంటేనే ఏదో పులకింత. ఇప్పటి వరకూ బోలెడన్ని హాలీవుడ్ సినిమాలు చూసి ఉంటా. కానీ, నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏదంటే తడుముకోకుండా చెప్పే పేరు.. ‘టైటానిక్’ (1997). మామూలుగా హాలీవుడ్ సినిమాలకు సంబంధించి హీరో హీరోయిన్లూ, డెరైక్టర్ పేర్లు మాత్రమే గుర్తుంటాయి. కానీ, ఈ సినిమాకు పనిచేసిన అందరు టెక్నీషియన్ల పేర్లు దాదాపుగా నాకు గుర్తున్నాయి. ముఖ్యంగా హీరో లియోనార్డో డికాప్రియో, హీరోయిన్ కేట్ విన్స్లెట్, డెరైక్టర్ జేమ్స్ కామరూన్ పేర్లు అయితే మనం ఎప్పటికీ మరిచిపోలేం. అంతలా వాళ్లు మనతో కనెక్ట్ అయిపోయారు. ఇవాళ్టికీ ఎప్పుడైనా రీచార్జ్ కావాలనుకున్నప్పుడు నేను చూసే సినిమా ఇదే. నేను ఎక్కువసార్లు చూసిన సినిమా ఇదే. టైటానిక్ అనగానే మనకు చరిత్ర పరంగా షిప్ సముద్రంలో మునిగి పోయి, వందల మంది చనిపోయిన ఉదంతం గుర్తుకొస్తుంది. ఆ విషాద దుర్ఘటనకు ఒక అందమైన ప్రేమకథను జోడించడం దర్శకుడి సృజనకు పరాకాష్ఠ. ఆ కథ అందరి హృదయాలను హత్తుకుంది. జాక్ ఒక పేదింటి అబ్బాయి. లాటరీలో రెండు టికెట్లు గెల్చుకుని టైటానిక్ షిప్లో థర్డ్ క్లాస్‌లో ప్రయాణం చేసే అవకాశం దక్కించు కుంటాడు. స్నేహితు నితో సహా ఎంతో హుషారుగా ఆ భారీ ఓడలోకి అడుగు పెడతాడు. అదే ఓడలో ప్రయాణం చేస్తున్న అందాల సుందరి రోజ్ అతని కంటపడుతుంది. ఇద్దరి మనసులూ కలుస్తాయి. రోజ్కి కాబోయే భర్త ఇది గ్రహించేసి జాక్‌ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతని కళ్లుగప్పి జాక్, రోజ్ ప్రేమించుకుంటుంటారు. కానీ, విధి విచిత్రమైనది. ఆ ఓడ ఓ బలమైన రాయిని ఢీ కొంటుంది. ఓడ మునిగిపోవడం ఖాయం. వీలైనంతమందిని కాపాడే ప్రయత్నంలో సిబ్బంది ఉంటారు. ఈ ఓడ ప్రమాదంలో జాక్ మునిగిపోతాడు. రోజ్ బతుకుతుంది. ఇదీ కథ. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదమైన టైటానిక్ ప్రమాదానికి, ఇలా ఇద్దరు యువ ప్రేమికుల గాఢమైన ప్రేమను ముడిపెట్టి, మునుపెన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్‌లతో సినిమాను ఉద్విగ్నభరితంగా తీయడం కామెరూన్‌కే చెల్లింది. ఈ సినిమా సాంకేతికంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, ప్రేక్షకుల్ని ఆ పాత్రలు, సన్నివేశాల్లో లీనం చేసి, భావోద్విగ్నభరిత అనుభవంలో ముంచెత్తడంలో అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. ఒక క్యారెక్టర్ పాయింటాఫ్ వ్యూలో సినిమాను చూపించడం గొప్ప థాట్. సర్వసాధారణంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టే సినిమాల్లోనూ విమర్శకులు ఏవో తప్పులు చెబుతుంటారు. కానీ, ఈ సినిమాను విమర్శకులు కూడా మెచ్చారు. ఆస్కార్ పురస్కారాల్లో 14 నామినేషన్స్ సాధించిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది. 1950లో ‘ఆల్ ఎబౌట్ ఈవ్’ సినిమాకు కూడా 14 నామినేషన్లు వచ్చాయి. మొత్తానికి ‘టైటానిక్’ చిత్రం ఏకంగా 11 ఆస్కార్లు గెలుచుకుంది. ఒక హాలీవుడ్ సినిమాకు ఇన్ని ఆస్కార్లు రావడమనేది అంతకు ముందు ‘బెన్హర్’ (1959) విషయంలో జరిగింది. వసూళ్ల పరంగా బిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి సినిమా కూడా ఇదే. దర్శకుడు జేమ్స్ కామెరూన్‌కు ఈ సినిమాపై మక్కువ తీరక, ఓడ ప్రమాదం జరిగి వందేళ్ళవుతున్న వేళ ‘టైటానిక్ -3డి’ వెర్షన్‌ను 2012 ఏప్రిల్ 4న విడుదల చేశారు. అది కూడా పెద్ద హిట్టే. అదనంగా 343.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఈ త్రీడీ వెర్షన్. అనేక సినిమాలు వాణిజ్య విజయం సాధిస్తాయి. కానీ, కొన్ని సినిమాలే బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో పాటు చిరకాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన హాలీవుడ్ ఆణిముత్యం - ‘టైటానిక్’. ఈ సినిమా చూస్తుంటే, అప్రయత్నంగా మీకు కన్నీళ్ళొస్తాయి. దూరమైన ఆ ప్రేమ జంటను చూస్తుంటే, గుండె పిండేసినట్లవుతుంది. వెరసి, సినిమా చూసిన అనుభవం నుంచి తొందరగా తేరుకోలేరు. పెపైచ్చు, వీలున్నప్పుడల్లా ఆ కథను మళ్ళీ మళ్ళీ మీకు కావాల్సినవాళ్ళతో కలసి తెరపై చూడాలనిపిస్తుంది. అందుకే, ‘టైటానిక్’ నాకు ఇష్టమైన ఆధునిక హాలీవుడ్ కళాఖండం. సెల్యులాయిడ్ సైంటిస్ట్ ఇవాళ్టి తరానికి జేమ్స్ కామెరూన్ పేరు చెప్పగానే సంచలనాత్మక సైన్స్-ఫిక్షన్ చిత్రం ‘అవతార్’ (2009) గుర్తుకొస్తుంది. కానీ, సినీ రచయిత, దర్శకుడు, నిర్మాత జేమ్స్ ఫ్రాన్సిస్ కామెరూన్ గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో హాలీవుడ్ తెరపై సృష్టించిన అద్భుతం అదొక్కటే కాదు. బాక్సాఫీస్ చరిత్రలో అతి పెద్ద హిట్లుగా ఇప్పటికీ చెప్పుకొనే - సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘టెర్మినేటర్ (1984), విషాదాంత ప్రేమకథ ‘టైటానిక్’ (’97) ఆయన సృష్టే. ‘ఎలియెన్స్’ (’86), ‘ది ఎబిస్’ (’89), ‘ట్రూ లైస్’ (’94) ఆయన అందించినవే. సినిమాలతో పాటు డాక్యుమెంటరీల రూపకల్పనలోనూ కామెరూన్‌ది ప్రత్యేక ముద్ర. నీటి లోపల దృశ్యాలను చిత్రీకరించడం లాంటి విషయాల్లో ఎంతో నైపుణ్యం సంపాదించిన ఆయనకు ‘డిజిటల్ 3డి ఫ్యూజన్ కెమేరా సిస్టమ్’ రూపకల్పనలోనూ భాగం ఉంది. ఇవన్నీ చూసే ఆయనను కొందరు ‘సగం సైంటిస్ట్, సగం ఆర్టిస్ట్’గా పేర్కొంటూ ఉంటారు. కామెరూన్ దర్శకత్వ శైలి హాలీవుడ్‌తో సహా పలువురు చిత్ర దర్శకులపై గణనీయమైన ప్రభావం చూపింది. టైటానిక్ అణువణువూ ఆసక్తికరమే! ఈ చిత్రానికి ముందుగా ‘ప్లానెట్ ఐస్’ అని పేరు పెడదామను కున్నారట! కానీ, చివరకు ‘టైటానిక్’ ఓడ పేరునే సినిమాకూ పెట్టారు వాస్తవికతకు ఎంత ప్రాధాన్యమిచ్చారంటే... టైటానిక్ ఓడను నిజంగా నిర్మించిన ‘వైట్ స్టార్ లైన్’ కంపెనీ మీద పరిశోధనలు చేసిన వారి పర్యవేక్షణలోనే ఈ సినిమా కోసం ఓడనూ, దాని లోపలి హంగూ ఆర్భాటాలనూ తీర్చిదిద్దారు సినిమాలో కథానాయక పాత్ర జాక్ (నటుడు లియొనార్డో డికాప్రియో), కథానాయిక రోజ్ (నటి కేట్ విన్స్లెట్) రేఖాచిత్రాలను గీస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ, ఆ బొమ్మలు గీస్తున్నట్లు సినిమాలో కనిపించేవి హీరోవి కావు - దర్శకుడు కామెరూన్వి. ఆయనే ఆ స్కెచ్బుక్లోని బొమ్మలన్నీ గీశారు ఈ సినిమా కోసం అత్యంత భారీ ఓడ సెట్‌ను వేశారు. ఆ సెట్ మొత్తాన్నీ హైడ్రాలిక్ జాక్స్ మీద ఉంచారు. ఓడ మునిగిపోతూ, ఒరిగిపోతున్న దృశ్యాలు తీసేందుకు వీలుగా దాదాపు 6 డిగ్రీల మేర సెట్టింగ్ మొత్తం పక్కకు ఒరిగేలా అలా సౌకర్యం ఉంచుకున్నారు గ్రాండ్ స్టెయిర్‌కేస్ రూమ్‌లోకి నీళ్ళు చొచ్చుకువచ్చే సీన్‌ను పక్కాగా ప్లాన్ చేశారు. ఎందుకంటే, ఆ నీళ్ళలో మొత్తం సెట్, ఫర్నిషింగ్‌లు పాడైపోతాయి కాబట్టి, ఒకే ఒక్క షాట్లో అనుకొన్న ఎఫెక్ట్ వచ్చేలా చిత్రీకరించాల్సి వచ్చింది డిజిటల్ ప్రదర్శన ఇంకా రాని ఆ రోజుల్లో ఈ సినిమా ఎంత బ్రహ్మాండంగా, ఎన్నేసి రోజులు, ఎన్నేసి ప్రదర్శనలు ఆడిందంటే, ప్రొజెక్టర్‌లో వేసీ వేసీ, రీళ్ళు గీతలు పడిపోవడంతో సినిమా పంపిణీదారులైన ‘పారామౌంట్’ వాళ్ళు కొత్త కాపీలను పంపాల్సి వచ్చిందట! ఒక పక్కన థియేటర్లలో బ్రహ్మాండంగా ఆడుతున్న రోజుల్లోనే జనం డిమాండ్ మేరకు ‘టైటానిక్’ చిత్రం వీడియోగా కూడా విడుదలైపోయింది. అప్పట్లో అలా జరిగిన తొలి చిత్రం అదే! -
ఆయన సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ - శ్రీను వైట్ల
సాగర్‌గారి దగ్గర నేను సహాయ దర్శకునిగా చేస్తున్నప్పుడు నారాయణగారు రచయితగా చేసేవారు. అప్పట్నుంచే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ‘నువ్వు పెద్ద డెరైక్టర్ అవుతావు’ అని ప్రోత్సహించేవారు. ఆయనకు విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. మేం ఇద్దరం మంచి మిత్రులు కావడానికి ఒక రకంగా అదే కారణం. నా తొలి చిత్రం ‘ఆనందం’ నుంచి ఇప్పటివరకు ఒకటీ, రెండు సినిమాల్లో మినహా మిగతా అన్ని చిత్రాల్లోనూ ఆయన నటించారు. ఆ ఒకటి, రెండు చిత్రాలు కూడా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నటించలేకపోయారు. ఆయన మంచి టైమింగ్ ఉన్న నటుడు. ఏ పాత్ర ఇచ్చినా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లగలిగిన ప్రతిభావంతుడు. హార్డ్ వర్కర్ కూడా. అందుకు నిదర్శనం ‘దూకుడు’ సినిమా. అందులో ఇతర చిత్రాల హీరోలను ఎమ్మెస్‌గారు పేరడీ చేసే సన్నివేశాలున్నాయి కదా. వాటిని ఒకే రోజులో చేసేశారాయన. అన్ని గెటప్స్ మార్చుకుని ఒకే రోజులో చేయడం సులువు కాదు. సూపర్బ్ ఎనర్జీ ఉన్న నటుడు. ఆయన్ని కోల్పోవడం బాధాకరం. -
రాంచరణ్ కు జోడీగా సమంత?
చెన్నై: హీరో రాంచరణ్ తదుపరి మూవీలో సమంతను హీరోయిన్ గా ఎంపికచేసినట్లు తెలుస్తోంది. రాంచరణ్ గోవిందుడు అందరివాడేలా చిత్రం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్నఈ చిత్రానికి సంబంధించి పేపర్ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలోనే నటీ నటుల కాస్టింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా రాంచరణ్ కు జోడీగా సమంతను పెడితే ఎలా ఉంటుందనేది చర్చకు వచ్చింది. నటి సమంత పేరును దాదాపు ఖరారు చేసినా.. అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సి ఉంది. రాంచరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్నతొలి చిత్రంలో రెండో హీరోయిన్ కోసం కూడా ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాంచరణ్ ప్రక్కన సమంత జోడీ కడితే మాత్రం.. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చే తొలి మూవీ కూడా ఇదే అవుతుంది. -
శ్రీను వైట్ల సినిమాకు.. చెర్రీ ఓకే..!
-
శ్రీనువైట్ల కథలకు కాలం చెల్లిందా ?!
-
'శ్రీను, ప్రకాశ్‌రాజ్ వివాదం సమసిపోతుంది'
-
'శ్రీను, ప్రకాశ్‌రాజ్ వివాదం సమసిపోతుంది'
రాజమండ్రి: నటుడు ప్రకాశ్‌రాజ్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య వివాదం త్వరలో సమసిపోతుందని మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మురళీమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తుల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తడం సహజమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి విషయాలను నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలని, మీడియాకెక్కడం మంచిదికాదన్న అభిప్రాయాన్ని మురళీమోహన్ వ్యక్తం చేశారు. 'ఆగడు' సినిమా నుంచి ప్రకాశ్‌రాజ్ ను తొలగించడంతో వివాదం చెలరేగింది. శ్రీను వైట్ల అహంకారి అని ప్రకాశ్ రాజ్ ఘాటుగా విమర్శించారు. తన మాటలను సిగ్గులేకుండా ఆగడు సినిమాలో వాడుకున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశ్‌రాజ్ కే సిగ్గులేదని శ్రీనువైట్ల ఎదురుదాడి చేశారు. -
అది అహంకారం కాదు.. ఆత్మాభిమానం!
-
శ్రీనువైట్లా.. అహంకారం పనికిరాదు!!
-
అతడికి సిగ్గుంటే నా అనుమతి తీసుకోవాలి: ప్రకాష్ రాజ్
‘‘నన్ను రాళ్ళతో కొట్టకు... పట్టుకొని ఇళ్ళు కట్టేస్తా! నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు... ఇంటికి దీపం చేసుకుంటా! నన్ను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలనుకోకు... నేను చేరాల్సిన చోటుకు త్వరగా చేరిపోతా! దయచేసి చెబుతున్నా... నన్ను చంపాలని విషం పెట్టకు... మింగి, నీలకంఠుణ్ణి అయిపోతా!’’ మహేశ్‌బాబు ‘ఆగడు’ సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు శ్రీనువైట్లకు, ప్రకాశ్‌రాజ్‌కి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి, ఆ చిత్రం నుంచి ప్రకాశ్‌రాజ్‌ను తొలగించిన విషయం తెలిసిందే. దర్శకుల సంఘానికి చెందిన వారితో అనుచితంగా ప్రవర్తించారంటూ, వ్యవహారం ఫిల్మ్‌చాంబర్ దాకా వెళ్ళడంతో, గడచిన ఏప్రిల్ చివరలో ప్రకాశ్‌రాజ్ విలేకరుల సమావేశం పెట్టి, ఆవేదనతో కవితాత్మకంగా పై మాటలు అన్నారు. అయితే... ‘ఆగడు’ సినిమాలో ప్రకాశ్‌రాజ్ స్థానంలో తీసుకున్న నటుడు సోనూసూద్‌తో ఇదే కవితను చెప్పించారు శ్రీను వైట్ల. ఈ విషయమై శనివారం హైదరాబాద్‌లో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో తీవ్రంగా ధ్వజమెత్తారు ప్రకాశ్‌రాజ్. ‘‘అది పద్యం కాదు. నా ఆవేదన, ఆక్రోశం. ఎవరి వల్ల నేను ఆవేదనకు గురయ్యానో... అతడే, నా స్థానంలో తీసుకున్న వేరొక నటుడితో ఆ మాటలు చెప్పించడం దారుణం. అదేమంటే.. ‘ఆ కవిత నచ్చింది. అందుకే డైలాగ్‌గా వాడుకున్నా’ అంటున్నాడట. శ్రీను వైట్లకు ఏ మాత్రం సిగ్గు, సంస్కారం ఉన్నా... నాకు ఫోన్ చేసి ‘మీ మాటల్ని నేను నా సినిమాలో ఉపయోగించుకుంటాను’ అని అడిగేవాడు. కనీసం వాడుకున్న తరువాతైనా ఆ మాట చెప్పేవాడు’’ అంటూ శ్రీను వైట్లపై ప్రకాశ్‌రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను దర్శకుణ్ణి అనుకోవాలి తప్ప నేనే దర్శకుణ్ణి అనుకోకూడదు. హీరో పవన్‌కల్యాణ్ నుంచి రచయిత కోన వెంకట్ వరకూ అందరిపైనా సెటైర్లు వేశావ్. వాళ్లు నిన్నేం చేశారు! మహేశ్‌లాంటి స్టార్‌ని, డబ్బులు పెట్టే నిర్మాతలను, ప్రేక్షకుల సమయాన్ని వాడుకోవడమే కాక, చివరకు కళామతల్లిని కూడా వాడుకోవాలని చూడటానికి సిగ్గులేదూ’’ అంటూ శ్రీను వైట్లపై ప్రకాశ్‌రాజ్ మండిపడ్డారు. ‘‘మహేశ్‌లాంటి స్టార్ సినిమా అంటే... అభిమానుల్లో అంచనాలు ఉంటాయి. పెద్ద సినిమాల్లో నటిస్తున్నప్పుడు తమ పాత్రకు పేరు రావాలని నటీనటులు తపిస్తుంటారు. తాము పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు రావాలని నిర్మాతలు ఆకాంక్షిస్తుంటారు. వీటన్నింటినీ నెరవేర్చే బాధ్యత దర్శకుడిదే. అందుకే కసితో పనిచేయాలి. అంతేకానీ కక్షతో కాదు. వ్యక్తిగతంగా శ్రీనుపై నాకెలాంటి కోపమూ లేదు. అతని అహంకారం నాకు నచ్చలేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి వచ్చాడు. అహంకారాన్ని తగ్గించుకుంటే ఇంకా మంచి స్థాయికి వెళతాడు. నేను నటుణ్ణి. పిలిచి ‘మంచి పాత్ర ఉంది చేయం’డంటే చేయడానికి నాకభ్యంతరం లేదు’’ అని చెప్పారు ప్రకాశ్‌రాజ్. చిరు సుగుణాలన్నీ చరణ్‌లో!... ‘గోవిందుడు అందరివాడేలే’ గురించి ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ ‘‘ఇది దర్శకుని సినిమా. బాలరాజు పాత్ర నటునిగా నాకు మరింత గుర్తింపు తెచ్చింది. చాలా కాలం తర్వాత దర్శకుడు కృష్ణవంశీతో పనిచేశాను. ఈ గ్యాప్‌లో నేను కోల్పోయిన ఆనందం మళ్లీ నాకు దక్కింది. చరణ్ నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. నటునిగా నాకు అతను పోటీ కాదు. అయితే, అన్నయ్య చిరంజీవిలోని సుగుణాలన్నీ అతనిలో ఉన్నాయి. ఎనిమిది సినిమాలకే పరిణతిని సంపాదించాడు. హీరో అతనే అయినా బాలరాజు పాత్రకి అతనిచ్చిన గౌరవం చూస్తే ఆశ్చర్యమేసింది’’ అని చెప్పారు. కాగా, ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలపై శ్రీను వైట్లను ‘సాక్షి’ టి.వి. వివరణ కోరినప్పుడు స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఇలాంటి వివాదాలపై గతంలోనూ తాను స్పందించలేదని గుర్తు చేశారు. -
'లౌక్యం' టీంతో సాక్షి చిట్‌చాట్
-
ఎవ్వరూ ఎవ్వరికీ బ్రేకివ్వలేదు!
-
అలా చేస్తే.. వాళ్ళకే ప్రమాదం!
-
శ్రీను వైట్లతో విభేదాలపై స్పందించిన కోన వెంకట్!
సినిమా పరిశ్రమలో విభేదాలు సర్వ సాధారణమే. అయితే తాజాగా మాటల రచయిత కోన వెంకట్, దర్శకుడు శ్రీను వైట్ల మధ్య విభేదాలు చిత్రపరిశ్రమలో చర్చకు దారి తీశాయి. ఈ చర్చకు కారణం వీరద్దరూ సుమారు 10 సంవత్సరాలు కలిసి పనిచేసి టాలీవుడ్ కు విజయవంతమైన చిత్రాలను ఆందించారు. అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన 'ఆగడు' చిత్రానికి కోన వెంకట్ మాటలు అందించలేదు. ప్రస్తుతం కోన వెంకట్ 'లౌక్యం' చిత్రానికి మాటలు రాశారు. లౌక్యం చిత్ర ప్రమోషన్ సందర్బంగా సాక్షి టెలివిజన్ లో చిట్ చాట్ చేస్తూ శ్రీను వైట్లతో విభేదాలపై స్పందించారు. శ్రీను వైట్లతో నా ట్రావెల్ పది సంవత్సరాలు. మేమిద్దరం కలిసి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించాం. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఫ్రెండ్లీగా విడిపోయాం. నాకు శ్రీను లైఫ్ ఇవ్వలేదు. నేను శ్రీనుకి లైఫ్ ఇవ్వలేదు. సత్య చిత్రంతో నేను హిట్ సొంతం చేసుకున్నారు. 'ఆనందం' లాంటి మంచి చిత్రాన్ని అందించారు. మా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని కోన వెంకట్ తెలిపారు. -
ఆ విలువ తెలుసు కాబట్టే గుర్తింపిచ్చారు!
-
ఆ వివాదం గురించి మాట్లాడటం నాకిష్టం లేదు : శ్రీను వైట్ల
‘ఆనందం’ సినిమా తరహాలో త్వరలో మంచి ప్రేమకథ చేయాలని ఉందంటున్నారు శ్రీను వైట్ల. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శ్రీను విలేకరులతో ముచ్చటించారు. ఇటీవల విడుదలైన ‘ఆగడు’లో హీరో మొదలుకొని అందరితోనూ అంత వేగంగా డైలాగులు చెప్పించారేం? డైలాగుల విషయంలో కొత్తగా వెళ్లాలనిపించింది. అందుకే... రిథమిక్‌గా డైలాగులు చెప్పించాను. ఇది యూనిట్ మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం. ముఖ్యంగా మహేశ్ డైలాగులు, విలన్లను బురిడీ కొట్టించడానికి ఆయన చెప్పే చిన్న చిన్న పిట్టకథలు ప్రేక్షకులకు నచ్చాయి. ‘ఆగడు’ నుంచి తానెందుకు తప్పుకోవాల్సి వచ్చిందో నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. మీకూ, ఆయనకు వచ్చిన అభిప్రాయ భేదాల గురించి కూడా ఆ ప్రెస్మీట్లో చర్చించారు. మరి మీరెందుకు ఈ విషయంపై సెలైంట్‌గా ఉన్నారు? నాకు, ఆయనకూ మధ్య అభిప్రాయా బేధాలు తలెత్తాయి. దానికి ఆయన ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. నేను ప్రెస్‌మీట్ పెట్టలేదు. పెట్టను కూడా. అసలు ఆ వివాదం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు... దట్సాల్. ఆ ప్రెస్మీట్లో ప్రకాశ్‌రాజ్ చెప్పిన కవితను, సినిమాలో సోనూసూద్‌తో చెప్పించినట్లున్నారు? నాకు ఆ కవిత నచ్చిందండీ... అందుకే సోనూసూద్‌తో చెప్పించాను. ఆ పాత్రను సోనూసూద్‌తోనే చేయించడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? అలాంటిదేం లేదు. ఆ పాత్రను ఎవరైనా బాగానే చేస్తారు. సోనూసూద్ చేస్తే పెర్ఫార్మెన్స్తో పాటు స్టార్ వేల్యూ కూడా ఉంటుందని చేయించాను. క్లైమాక్స్‌లో బ్రహ్మానందం చేత కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి మరీ డాన్సులు చేయించారు. అంత అవసరమా? సినిమా ఒక వ్యాపారం. ఇక్కడ ఏది వర్కవుట్ అయితే అటే వెళతారు. దానికి ప్రేక్షకుల అప్లాజ్ బాగుంది. కోన వెంకట్, గోపీ మోహన్ మీ టీమ్ నుంచి తప్పుకోగానే...డైలాగులు మీద ఇంతకు ముందుకంటే మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపించిందని పలువురి అభిప్రాయం? మాటల రచయితగా నేను కొత్తగా నిరూపించుకోవాల్సిందేం లేదు. ‘దూకుడు’ సినిమా కథ, కథనం, సంభాషణలు నావే. ఎవరో రాసిన మాటల్ని నావి అని వేసుకుంటే ఊరుకోరు కదా. కోన వెంకట్ కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు వారి క్రెడిట్వారిదే. నా క్రెడిట్ నాదే. నెక్ట్స్ రామ్‌చరణ్‌తో సినిమా అంటున్నారు నిజమేనా? ఒక వారంలో నా తర్వాత ప్రాజెక్ట్ గురించి చెబుతాను. హీరో గురించి కూడా అప్పుడే చెబుతా. -
”ఆగడు” దూకుడెంత?
-
'ఆగడు'ను ప్రత్యేక ఆస్కార్ కు పంపాలి: వర్మ
దర్శకుడు శ్రీనువైట్ల, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆగడు' చిత్రంపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆగడు చిత్రంలోని డైలాగ్స్ , డైలాగ్ మాడ్యులేషన్ ని ప్రత్యేక ఆస్కార్ అవార్డుకు పంపాలని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో రాంగోపాల్ వర్మ సూచించారు. The dialogue and dialogue modulations of "Aagadu" should be sent to Oscars on a special award...They will truly stand out in world cinema — Ram Gopal Varma (@RGVzoomin) September 19, 2014 అప్పుడు ప్రపంచ సినిమాను ఆస్కార్ తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. అంతేకాకుండా తన కెరీర్ లో ఓ ఉత్తమ పాత్రను ఆగడు చిత్రంలో పోషించే అవకాశాన్ని ప్రకాశ్ రాజ్ కోల్పోయాడని మరో ట్విట్ చేశారు. కోన వెంకట్ అంత అద్బుతమైన డైలాగ్స్ రాస్తారంటే తనకు నమ్మబుద్ది కావడం లేదు. సినిమా టైటిల్స్ తాను చూడలేదు. టైటిల్స్ ను కూడా కోన వెంకట్ రాశారా అంటూ చమత్కరించారు. తాజా ట్విట్స్ తో శ్రీనువైట్లపై వర్మ ఎన్ కౌంటర్ ప్రారంభించారని స్పష్టంగా అర్ధమవుతోంది. ఎందుకంటే ఆగడు చిత్రంలో వర్మపై ఎక్కువ మోతాదులోనే సెటైర్లు సంధించిన సంగతి తెలిసిందే. I can't believe Kona venket can write such gems of dialogues. ..by the way i missed the titles ..did Kona write? — Ram Gopal Varma (@RGVzoomin) September 19, 2014 -
సినిమా రివ్యూ: ఆగడు
పాజిటివ్ పాయింట్స్: మహేశ్ బాబు ఫెర్మార్మెన్స్ తొలి భాగం మైనస్ పాయింట్స్: బ్రహ్మానందం కామెడీ కథ, కథనం రెండవ భాగం చిత్ర నిడివి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా జి.రమేశ్‌బాబు సమర్పణలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు, తమన్నాలు జంటగా రూపొందిన 'ఆగడు' చిత్రం 19 సెప్టెంబర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రమశిక్షణ గల పోలీసాఫీసర్ గా అభిమానులను కనువిందు చేయడానికి మహేశ్ మరోసారి సిద్ధమయ్యాడు. డైలాగ్స్ మాడ్యులేషన్, డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకుంటున్న మహేశ్... అభిమానుల్లో నెలకొన్న భారీ అంచనాలను చేరుకున్నాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం.. శంకర్ (మహేశ్ బాబు) ఓ అనాధ. రాజారావు (రాజేంద్ర ప్రసాద్) అనే ఇన్స్ పెక్టర్ శంకర్ ను చేరదీస్తాడు. అయితే చేయని నేరం తన మీద వేసుకుని జైలు కెళ్లడమే కాకుండా, పెంపుడు తండ్రి ఆగ్రహానికి గురవుతాడు. చిన్నతనంలోనే జైలు కెళ్లిన శంకర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు అవుతాడు. దామూ అలియాస్ దామోదర్ (సోను సూద్) అక్రమాలను అరికట్టేందుకు శంకర్ ను ఓ గ్రామానికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. దామూ అక్రమాలను శంకర్ ఎలా అరికట్టాడు? కుటుంబానికి మళ్లీ ఎలా దగ్గరయ్యాడనేది క్లుప్తంగా ఈ చిత్ర కథ. కొత్తదనం, లాజిక్ లేకుండా రెగ్యులర్ ఫార్మాట్ తో ఉన్న ఎన్ కౌంటర్ స్పెషలిస్టు శంకర్ పాత్రను మహేశ్ బాబు పోషించారు. ఈ పాత్రలో కొత్తగా కనిపించేది డైలాగ్ మాడ్యులేషన్ తప్ప మరేమీ లేదు. వినడానికి హెవీ డైలాగ్స్ బాగున్నా.. మహేశ్ ఫెర్మార్మెన్స్ ను డామినేట్ చేశాయి. యధావిధిగా ఫైట్స్, డాన్స్, లుక్ తో మహేశ్ అభిమానులను ఆలరించాడు. మహేశ్ బాబు ప్రియురాలు సరోజగా తమన్నా కనిపించింది. సరోజ పాత్రలో నటనకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో తమన్నా గ్లామర్ కే పరిమితమైంది. శృతిహసన్ ఐటమ్ సాంగ్ అనే కన్నా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఢిల్లీ సూరిగా బ్రహ్మనందం రెగ్యులర్ కామెడీకే పరిమితమయ్యారు. మూస పాత్రలో కనిపించిన బ్రహ్మానందం ఆకట్టుకోలేకపోయాడు. సోను సూద్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. తనికెళ్ల భరణి, ఎంఎస్ నారాయణ, ఇతర పాత్రలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. టెక్నికల్ ఫెర్మార్మెన్స్: తమన్ సారధ్యంలో రూపొందిన సంగీతం అభిమానులను మెప్పించేలా ఉంది 'ఆజా సరోజా', 'నారీ నారీ', భేల్ పూరి పాటలు మెలోడి, 'జంక్షన్ లో' సాంగ్ మాస్ బీట్ తో సాగాయి. రెగ్యులర్ గా అనిపించే బాణీలు తెరమీద కూడా అంతంత మాత్రమే అనిపించాయి. ఫోటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు కూడా ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి. బలమైన కథకు తోడు ఎప్పటిలాగే వినోదానికి పెద్ద పీట వేసే దర్శకుడు శ్రీను వైట్ల ఈసారి కూడా ఎలాంటి సంకోచం లేకుండా మూస ధోరణితో ఆగడు చిత్రాన్ని తెరకెక్కించాడు. తొలి భాగంలో మహేశ్ బాబు తో ఎంటర్ టైన్ మెంట్ చేయించి ఆకట్టుకోవడంలో దర్శకుడు కొంత సఫలమయ్యాడు. సెకండాఫ్ లో కథలో విషయం లేకపోవడంతో పూర్తిగా తడబడ్డారనే చెప్పవచ్చు. రెగ్యులర్ ఫార్మాట్ నమ్ముకున్న శ్రీను వైట్ల ప్రిన్స్ అభిమానులకు కొంత నిరాశనే పంచారనే చెప్పవచ్చు. సమీక్ష: గతంలో విజయం సాధించిన దూకుడు, గబ్బర్ సింగ్ చిత్రాల ప్రభావం 'ఆగడు'పై స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. గత పోలీసు కథా చిత్రాల్లో బలమైన కథ, సెంటిమెంట్ అంశాలు ఆగడు చిత్రంలో కనిపించకపోవడం ప్రధాన లోపంగా మారింది. తొలి భాగంలో మహేశ్ నమ్ముకున్న శ్రీనువైట్ల రెండవ భాగంలో బ్రహ్మనందంతో మేనేజ్ చేద్దామనే ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు. ఫస్టాఫ్ లో మహేశ్ ఫెర్ఫార్మెన్స్, వినోదంతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టిన దర్శకుడు సెంకడాఫ్ లో మాత్ర పూర్తి స్థాయిలో ఆలరించలేకపోయారనే స్పష్టం కనిపించింది. ఈ చిత్రంలో ప్రారంభం నుంచి.. ముగింపు దాకా మహేశ్ తో చెప్పించిన డైలాగ్స్ బుల్లెట్స్ లా పేలినా.. ఓవరాల్ గా డోస్ శృతిమించిందనే చెప్పవచ్చు. మహేశ్ తో భారీ, పొడవైన డైలాగ్స్, పిట్ట కథలు కొంత వరకు సంతృప్తి కలిగించాయి. అయితే పిట్ట కథల డోస్ ఎక్కువ కావడం అభిమానులు ఉక్కిరి బిక్కిరి చేసిందనడంలో సందేహం అక్కర్లేదు. ఇక క్లైమాక్స్ లో బ్రహ్మనందంతో చేయించిన డాన్స్ ఎపిసోడ్ లో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా కనిపించాయి. ముందే దసరా పండుగ జరుపుకోవాలనుకునే ప్రిన్స్ అభిమానుల్లో పూర్తి స్థాయి సంతృప్తిని కలిగించలేకపోయారనేది స్పష్టంగా కనిపిస్తుంది. భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉన్నా.. అభిమానులకు పూర్తి స్థాయి సంతృప్తిని పంచిన చిత్రంగా 'ఆగడు' నిలువడం కష్టమే. కథ, కథనం గాలికి వదిలి.. కేవలం మహేశ్ ను నమ్ముకుని నేల విడిచి సాము చేసిన చిత్రం 'ఆగడు' అని చెప్పవచ్చు. ట్యాగ్ లైన్: గబ్బర్ సింగ్ + దూకుడు = ఆగడు నటీనటులు: మహేశ్ బాబు, తమన్నా, రాజేంద్ర ప్రసాద్, సోను సూద్, బ్రహ్మనందం దర్శకుడు: శ్రీను వైట్ల నిర్మాతలు: రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సంగీతం: ఎస్ఎస్ తమన్ ఫోటోగ్రఫి: కేవీ గుహన్ ఎడిటింగ్: ఎంఆర్ వర్మ రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ -రాజబాబు అనుముల -
రామ్‌చరణ్‌తో తదుపరి చిత్రం : శ్రీను వైట్ల
సింహాచలం సెంటిమెంట్ కలిసొస్తుంది రామ్‌చరణ్‌తో తదుపరి చిత్రం స్వామిని దర్శించుకున్న సినీ దర్శకుడు శ్రీను వైట్ల సింహాచలం: ‘నా ప్రతి సినిమా విడుదలకు ముందు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి సింహాచ లం వస్తాను... ఆయన ఆశీస్సులతో ఆగడు సినిమా ఘన విజయం సాధిస్తుంది’ అని ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. మహేష్‌బాబు హీరోగా ఆయ న తెరకెక్కించిన ఆగడు సినిమా శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా శ్రీను వైట్ల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతారాలయంలో అష్టోత్తర పూజ ను నిర్వహించారు. గోదాదేవికి కుంకుమార్చ న చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తాను దర్శకత్వం వహించే ప్రతి సినిమా విడుదలకు ముందు సింహాచలేశుని దర్శించుకోవడం జరుగుతోం దన్నారు. ఆగడు సినిమాకి కూడా స్వామి ఆశీస్సులు ఉంటాయన్నారు. సింహగిరికి వచ్చినప్పుడల్లా కొత్త ఎనర్జీ వస్తుందన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తనకు ఇష్టదైవమని, సెంటిమెంట్, పవర్ఫుల్ దేవుడని అభివర్ణించారు. ఆగడు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. కృతజ్ఞతను చూపించే కాన్సెప్ట్‌తో ఆగడు ఉంటుందన్నా రు. అలాగే ఎంటర్టైన్మెంట్, ఎనర్జిటిక్‌గా ఉంటుందన్నారు. రామ్‌చరణ్‌తో తదుపరి చిత్రం రూపొందుతుందన్నారు. పలువురు భక్తులు, దేవస్థానం సిబ్బంది శ్రీను వైట్లతో ఫొటోలు దిగి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. ఆయన వెంట ఆగడు చిత్ర నిర్మాతల్లో ఒకరైన పరుచూరి కోటి ఉన్నారు. -
ఆగడు మూవీ న్యూ పోస్టర్స్
-
ఆగడు మూవీ న్యూ స్టిల్స్
-
ఆగడు మూవీ ఆడియో అవిష్కరణ
-
'కచ్చితంగా బ్లాక్ బ్లస్టర్ అవుతుంది'
హైదరాబాద్: 'ఆగడు' సినిమాలో పిన్స్ మహేష్ బాబు చాలా బాగా చేశాడని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. అభిమానులు ఆశ్చర్యలను ఆశ్చర్యానికి గురిచేసేలా ఇరగదీశాడని వెల్లడించారు. 'ఆగడు' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 'దూకుడు'లో మహేష్ ను పదిశాతమే చూశారని, 'ఆగడు'లో వందశాతం చూస్తారని చెప్పారు. ఈ సినిమాకు మహేష్ అందించిన సహకారం మరవలేనని అన్నారు. ఆయన ఎంతో కష్టపడ్డారని, ఇది ప్రతి ఫ్రేమ్ లో కనిసిస్తుందన్నారు. విడుదల కోసం వేచి చేయండి. కచ్చితంగా బ్లాక్ బ్లస్టర్ అవుతుందని శ్రీను వైట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా పనిచేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి -
ఆగడు మూవీ పోస్టర్స్
-
సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఆగడు' మూవీ న్యూ స్టిల్స్
-
మహేష్ బాబు కూడా లుంగీ డాన్స్ ...
డాన్సుల్లో 'లుంగీ డాన్స్' ప్రస్తుతం ట్రెండ్ సెట్టర్‌గా చెప్పుకోవచ్చు. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రంతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తెర లేపిన లుంగీ డాన్స్ దేశమంతా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దాంతో ఈ డాన్స్‌కు పిచ్చి క్రేజ్ రావటంతో మన హీరోలూ ఫాలో అవుతున్నారు. అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్, ఇద్దరమ్మాయిలు సినిమాలో అమలాపాల్ లుంగీ డాన్స్ చేసి ఆకట్టుకుంటే... తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'ఆగడు' చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా లుంగీ డాన్స్ చేశాడట. ఫిల్మ్ నగర్లో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేష్ బాబు, శ్రుతిహాసన్లపై ఐటం సాంగ్ చిత్రీకరించారు. ఆ పాటలో.. మహేష్ లుంగీ డాన్స్ చేశాడట. లుంగీ డాన్స్ అదిరిపోయే రీతిలో వచ్చిందని టాక్ వస్తోంది. మహేష్ బాబుతో పాటు విలన్ సోనూ సూద్ కూడా చిందులు వేశాడట. ఈ లుంగీ డాన్స్ పాటలో శ్రుతిహాసన్ గొంతు కలిపిందట. గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన పోకిరి చిత్రంలో ఓ పాటలో మహేష్ లుంగీలో కనిపించాడు. ఈ సినిమాకు ఈ పాట హైలెట్ అని చిత్ర యూనిట్ చెప్పటం విశేషం. ఆగడు ఆడియోను మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టినరోజుకు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సంగీత దర్శకత్వం వహిస్తున్న తమన్‌కు ఈ చిత్రం 50వది కావటం విశేషం. మహేష్ బాబు సరసన తొలిసారి మిల్కీ బ్యూటీ తమన్న నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తెగ పాపులర్ అయిన ‘లుంగీ’ వెనుక ఒక కథ ఉంది. అటు అభిమానుల్నీ... ఇటు విమర్శకుల నోళ్లలోనూ తెగ పాపులర్ అయిన ఈ డాన్స్‌ని రూపొందించింది ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్. షారుఖ్ ఖాన్ - దీపికా పదుకొనె హాట్‌హాట్‌గా డాన్స్ చేసిన ఆ పాట చిత్రీకరణకు సుమారు 30 గంటలు పట్టిందట. -
తెరపై తొలి పంచ్
‘ప్రతివోడు... పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్స్. ఎలపరమొచ్చేస్తంది’... సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శనివారం విడుదలైన ‘ఆగడు’ టీజర్లో మహేశ్‌బాబు చెప్పిన పంచ్ డైలాగ్ ఇది. ఈ టీజర్‌ని తిలకించిన కృష్ణ... ఈ చిత్రం కచ్చితంగా ‘దూకుడు’ని మించిన విజయం సాధిస్తుందన్నారు. దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ -‘‘ఇందులో మహేశ్ కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. మహేశ్ సినిమాల్లో నంబర్‌వన్ సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. శనివారం విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వస్తోందని, సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు. ఈ నెల 5 నుంచి 21 వరకూ ముంబయ్ షెడ్యూల్ ఉంటుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత కోటి పరుచూరి చెప్పారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, సంగీతం: తమన్, కెమెరా: కె.వి.గుహన్. -
ప్రిన్స్ మహేష్ బాబు 'ఆగడు' స్టిల్స్
-
ఆగడు ట్రయలర్ విడుదల
ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు 'ఆగడు' సినిమా ట్రయలర్ ఎట్టకేలకు విడుదలైంది. మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రయలర్‌ను విడుదల చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, తనదైన శైలిలో ఉన్న యాక్షన్ సన్నివేశాలతో మహేష్ ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ట్రిమ్ చేసిన గెడ్డంతో.. మాస్ పోలీస్ అధికారిగా దుమ్ము దులిపేస్తున్నాడు. ట్రయలర్ చూస్తుంటేనే అభిమానులు ఈలలు, కేకలు పెడుతున్నారు. రివాల్వర్ నుంచి షాట్‌గన్ వరకు అన్ని రకాల ఆయుధాలను మహేష్ ఈ సినిమాలో వాడినట్లు కనిపిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
లడక్‌లో బిజీగా...
దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్దిమంది ప్రాంతీయ భాషా నటుల్లో మహేశ్ ఒకరు. ఒక్కసారి మహేశ్‌బాబు ట్రాక్ రికార్డ్ చూస్తే అది నిజమని ఎవరైనా అంగీకరిస్తారు. సినిమా సినిమాకూ మహేశ్ ఇమేజ్ పెరుగుతూనే ఉంది. ఇటీవలి చిత్రం ‘1-నేనొక్కడినే’లో హాలీవుడ్ లుక్‌తో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు మహేశ్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘ఆగడు’. కచ్చితంగా విజయం సాధించాలనే కసితో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడక్‌లో జరుగుతోంది. మహేశ్, తమన్నాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు శ్రీనువైట్ల. అలాగే మహేశ్ తదితరులపై శక్తిమంతమైన యాక్షన్ సీన్లు కూడా తీయనున్నారు. ఈ సినిమాను దసరాకి గానీ, దీపావళికి గానీ విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఇది ఇలావుంటే... ఈ సినిమా తర్వాత ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ నటించనున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి ‘పరాక్రమ’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
లడక్‌లో బిజీగా...
దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అతి కొద్దిమంది ప్రాంతీయ భాషా నటుల్లో మహేశ్ ఒకరు. ఒక్కసారి మహేశ్‌బాబు ట్రాక్ రికార్డ్ చూస్తే అది నిజమని ఎవరైనా అంగీకరిస్తారు. సినిమా సినిమాకూ మహేశ్ ఇమేజ్ పెరుగుతూనే ఉంది. ఇటీవలి చిత్రం ‘1-నేనొక్కడినే’లో హాలీవుడ్ లుక్‌తో కనిపించి అభిమానులకు కనువిందు చేశారు మహేశ్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘ఆగడు’. కచ్చితంగా విజయం సాధించాలనే కసితో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడక్‌లో జరుగుతోంది. మహేశ్, తమన్నాలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు శ్రీనువైట్ల. అలాగే మహేశ్ తదితరులపై శక్తిమంతమైన యాక్షన్ సీన్లు కూడా తీయనున్నారు. ఈ సినిమాను దసరాకి గానీ, దీపావళికి గానీ విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఇది ఇలావుంటే... ఈ సినిమా తర్వాత ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ నటించనున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి ‘పరాక్రమ’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
విలక్షణం + వివాదం = ప్రకాష్ రాజ్
-
దూకుడుకి ఆగడు సీక్వెలా..?
-
కాంబినేషన్ కుదిరింది
రామ్‌చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా ఖరారైంది. వీరిద్దరి కలయికలో ఓ భారీ చిత్రానికి నిర్మాత డీవీవీ దానయ్య సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టులో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ప్రముఖ తారాగణం, అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేస్తారని దానయ్య తెలిపారు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో నటిస్తున్నారు. మరోపక్క మహేశ్‌బాబు ‘ఆగడు' సినిమాకి శ్రీను వైట్ల పని చేస్తున్నారు. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్లు రూపొందించడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్న శ్రీను వైట్ల చరణ్ కోసం శక్తిమంతమైన కథను సిద్ధం చేశారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
భాగ్యనగరంలో బిజీ బిజీగా...
క్లాసు, మాసు తేడా లేకుండా, చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరూ మెచ్చిన సినిమా ‘దూకుడు'. ఆ సినిమాతో మహేశ్-శ్రీను వైట్ల కాంబినేషన్‌కి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ‘ఆగడు' పై అంచనాలకు కారణం అదే. పైగా మహేశ్‌తో తమన్నా జతకట్టడం ఇందులో మరో విశేషం. ప్రస్తుతం ‘ఆగడు' షూటింగ్ ఎక్కడా ఆగకుండా... శరవేగంతో జరుగుతోంది. ఈ సినిమాలో మహేశ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. పోకిరి, దూకుడు... మహేశ్ పోలీస్‌గా నటించిన సినిమాలు. ఆయన్ను సూపర్‌స్టార్‌ని చేసిన సినిమాలు కూడా అవే. దాన్ని ‘ఆగడు' కూడా కొనసాగిస్తుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ మార్చి 28 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్, తమన్నా, రాజేంద్రప్రసాద్, సోనూసూద్ తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు శ్రీనువైట్ల. ఈ నెల 10 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుందని యూనిట్ వర్గాల సమాచారం. తర్వాత బళ్లారిలో 5 రోజులు, గుజరాత్లో 10 రోజులు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపనున్నట్లు తెలిసింది. అలాగే జమ్మూ-కాశ్మీర్లో పాటలను చిత్రీకరించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు వినికిడి. కృష్ణ పుట్టినరోజైన మే 31న ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను జూన్‌లో విడుదల చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నెపోలియన్, సాయికుమార్, బ్రహ్మానందం, నదియా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, నిర్మాణం: 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్. -
'ఆగడు'లో పాట పాడనున్న మహేష్ బాబు!
హీరో అంటే కేవలం డాన్సులు చేయడం, నటించడమే కాదు.. పాటలు కూడా పాడతామని అంటున్నారు మన బాలీవుడ్ హీరోలు. ఇంతకుముందు చాలామంది హీరోలు పాటలకు తమ గళాలు విప్పారు. ఇప్పుడు అదే బాటలో మహేష్ బాబు కూడా పయనిస్తున్నారు. తాజాగా తాను నటిస్తున్న 'ఆగడు' సినిమా కోసం ఒక పాట పాడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఆగడు చిత్రం షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. తమన్, శ్రీనువైట్ల ఇద్దరూ కూడా మహేష్‌ను ఈ సినిమాలో ఓ పాట పాడాల్సిందిగా అడిగారని, అయితే ఇంకా ఆయన పాడేదీ లేనిదీ నిర్ధారించాల్సి ఉందని సినిమా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆగడు సినిమాలో సమంత, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. -
శ్రీను వైట్ల దర్శకత్వంలో..?
రామ్‌చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందా? ఫిలింనగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు చరణ్. ఇక మహేశ్ ‘ఆగడు’తో శ్రీను వైట్ల క్షణం తీరిక లేకుండా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక రామ్‌చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా మొదలవుతుందని విశ్వసనీయ సమాచారం. ‘వెంకీ’ సినిమా చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యి... తనకు తానుగా శ్రీనువైట్లకు అవకాశం ఇచ్చారు చిరంజీవి. అదే ‘అందరివాడు’. కానీ... ఆ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందుకే... చరణ్‌తో ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చి, మెగా అభిమానులకు కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారట శ్రీనువైట్ల. ఆగస్ట్ కల్లా ‘ఆగడు’ చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ చిత్రం ఉంటుందట. ఓ ప్రముఖ నిర్మాత నిర్మించే ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. -
నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ!
మహేశ్‌బాబు ఓకే అనాలే కానీ... రోజుకు ఇరవై నాలుగ్గంటలూ పనిచేసినా చాలనన్ని సినిమా అవకాశాలు ఆయన ముంగిట్లో ఉంటాయి. ఆయనకు నిర్మాతల తాకిడి ఆ స్థాయిలో ఉంది. కానీ ఆయనే... ఆచితూచి అడుగులేస్తున్నారు. గతంలో మాదిరిగా ప్రయోగాల జోలికి పోకుండా... ఓ పక్క నటునిగా తనను తాను నిరూపించుకుంటూ, మరో వైపు వాణిజ్యపరంగా కూడా విజయాన్ని అందుకునే కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు మహేశ్.ఇంత జాగ్రత్త తీసుకుంటున్నా... మిగిలిన హీరోలతో పోలిస్తే... మహేశ్ చేతిలోనేఎక్కువ ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘ఆగడు’తో కలిపి ఆయన నాలుగు సినిమాలకు పచ్చజెండా ఊపారు. పోలీసాఫీసర్‌గా: ‘దూకుడు’తో సంచలన విజయాన్ని అందుకున్న కాంబినేషన్... మహేశ్, శ్రీనువైట్ల. మళ్లీ వీరిద్దరి కలయికలో సినిమా అంటే... అంచనాలకు హద్దుండదు. దానికి తగ్గట్టే ‘ఆగడు’ తెరకెక్కుతోందని యూనిట్ సభ్యుల సమాచారం. ‘దూకుడు’లో లాగానే... ‘ఆగడు’లో కూడా మహేశ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు ఇందులో మహేశ్ కామెడీ... ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా ఉంటుందట. రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆర్ఎఫ్సీలో ఓ సెట్ వేశారు. ప్రస్తుతం అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుందని సమాచారం. మిర్చిఘాటుతో: తొలి సినిమాతోనే ‘మిర్చి’ ఘాటుని ప్రేక్షకులకు రుచి చూపించిన దర్శకుడు కొరటాల శివ. ఆయన సినిమాక్కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మహేశ్. జూలైలో వీరిద్దరి సినిమా మొదలుకానుందని సమాచారం. యూటీవీ మోషన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘మిర్చి’ని మించే పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని తయారు చేసే పనిలో ప్రస్తుతం కొరటాల శివ బిజీగా ఉన్నారు. అపూర్వ అవకాశం!: నాగార్జున తర్వాత ఏ తెలుగు హీరోకీ దక్కని అపూర్వ అవకాశం మహేశ్నే వరించింది. పాతికేళ్ల తర్వాత మణిరత్నం తెలుగులో చేస్తున్న సినిమాలో నాగార్జునతో కలిసి నటించడానికి మహేశ్ పచ్చజెండా ఊపేశారు. ఈ మల్టీస్టారర్ ఎప్పుడు మొదలవుతుందో... ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. మళ్లీ పూరీతో: పోకిరి, బిజినెస్‌మేన్... పూరీజగన్నాథ్ కాంబినేషన్లో మహేశ్ చేసిన రెండూ సినిమాలూ సూపర్‌హిట్సే. వీరి కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి కూడా రెడీ అవుతోంది. ‘హార్ట్ ఎటాక్’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా పూరీ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా తర్వాత పూరీ చేయబోయేది మహేశ్ తోనే. -
ఆగడులో కొత్తగా కనిపించబోతున్న మహేష్
-
టాప్ హీరోల ఛాయిస్ డైరెక్టర్ శ్రీనువైట్ల
-
మహేశ్... దుమ్మురేపాడు!
సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అంశాలన్నీ శ్రీనువైట్ల తీసే సినిమాల హీరోల్లో ఉంటాయి. నవ్వించడం, కవ్వించడం, సాహసాలు చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, ఎదుటివారిని చిత్తు చేయడం, రకరకాల మాండలికాల్లో మాట్లాడటం... ఇలా ఒకటి కాదు. సాధారణంగా కనిపిస్తూనే అసాధారణ చర్యలు చేయడం శ్రీనువైట్లహీరోల స్టైల్. ‘దూకుడు’లో మహేశ్‌ని ఆయన ఎంత ఎనర్జిటిక్‌గా చూపించారో తెలిసిందేగా! ‘భయానికి మీనింగే తెలీని బ్లడ్‌రా నాది’ అంటూ.. పోలీస్‌లోని కొత్తకోణాన్ని ఆవిష్కరించారాయన. ఇప్పుడు మళ్లీ మహేశ్‌తోనే ఆయన చేస్తున్న మరో ప్రయత్నం ‘ఆగడు’. ‘దూకుడు’ని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని యూనిట్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవలే బళ్లారిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి శ్రీనువైట్ల చెబుతూ -‘‘ఒక పాట, కొన్ని సన్నివేశాలు ఈ షెడ్యూల్లో పూర్తి చేశాం. కథ రీత్యా దుమ్ములో కొన్ని సన్నివేశాలు తీశాం. అంత కాలుష్యాన్ని కూడా పట్టించుకోకుండా మహేశ్ దుమ్మ రేపాడు. ఒక్క మహేశే కాదు... యూనిట్ సభ్యులందరూ ఈ సీన్స్ విషయంలో ఎంతో సహకరించారు. నిజంగా తెరపై ఆ సన్నివేశాలు కన్నుల పండువగా ఉంటాయి’’ అని చెప్పారు. రేపటి నుంచి హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామని, శ్రీనువైట్ల ఎంతో ప్రతిభావంతంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, తమన్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర చెప్పారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో 40 మంది ప్రముఖ తారలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి. -
బళ్లారిలో 'ఆగడు' షూటింగ్ వీడియో లీక్!
శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ హీరోగా రాబోతున్న 'ఆగడు' చిత్రం షూటింగ్‌కు సంబంధించిన సన్నివేశం ఒకటి లీకైంది. బ్యాక్గ్రౌండులో ఓ గనికి సంబంధించిన బ్లాస్టింగ్ జరుగుతుండగా ఫుల్‌హ్యాండ్స్ షర్టు మడత పెట్టుకుంటూ మహేష్ నడుచుకుంటూ వస్తున్న సన్నివేశం ఆ వీడియోలో ఉంది. '1.. నేనొక్కడినే' చిత్రం తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఆగడు. 'దూకుడు' సినిమాతో మహేష్‌కు మంచి విజయాన్ని అందించిన శ్రీను వైట్ల మరోసారి ప్రిన్స్‌కు భారీ విజయం ఇవ్వడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ కూడా ఇంతవరకు విడుదల కాలేదు. ఈ చిత్రంలో మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఆయన ఇందులో కనపడతాడని అంటున్నారు. అలాగే, మహేష్- మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ కూడా తొలిసారి వెండితెరపై ఈ చిత్రం ద్వారానే కనపడబోతోంది.