శ్రీనువైట‍్ల సినిమాలో సునీల్ | Sunil Key Role in Srinu Vaitla Raviteja Film | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 24 2017 12:42 PM | Last Updated on Sun, Dec 24 2017 12:42 PM

Sunil Key Role in Srinu Vaitla Raviteja Film - Sakshi

కమెడియన్ గా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్ అయిన సునీల్.. హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాడు. ఒకటి రెండు సినిమాలు మంచి విజయాలు సాధించినా.. స్టార్ ఇమేజ్ అందుకునే స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తిరిగి క్యారెక్టర్ రోల్స్ పై దృష్టి పెట్టాడు కామెడీ స్టార్. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు శ్రీనువైట్ల, రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించనున్నారట. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ శుక్రవారం సునీల్ హీరోగా తెరకెక్కిన 2 కంట్రీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement