మార్చి నుంచి హస్తినకు? | Jr NTR next film titled Ayinanu Poyi Ravale Hastinaku | Sakshi
Sakshi News home page

మార్చి నుంచి హస్తినకు?

Published Tue, Nov 17 2020 3:45 AM | Last Updated on Tue, Nov 17 2020 3:45 AM

Jr NTR next film titled Ayinanu Poyi Ravale Hastinaku - Sakshi

ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా మార్చి నెలలో సెట్స్‌ మీదకు వెళ్తుందని సమాచారం. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత రెండో సినిమా కోసం ఈ కాంబినేషన్‌ కుదిరింది. హారికా హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై యస్‌.రాధాకృష్ణ, కల్యాణ్‌ రామ్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందనే టాక్‌ కూడా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించి చిత్రీకరణ ఫిబ్రవరికి పూర్తవుతుందట. అది పూర్తి కాగానే మార్చి నుంచి త్రివిక్రమ్‌ సినిమా సెట్లో అడుగుపెట్టనున్నారు ఎన్టీఆర్‌. ఇది ఎన్టీఆర్‌ కెరీర్‌లో 30వ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement