Ntr Koratala Siva Movie: Shooting Will Starts From Next Month - Sakshi
Sakshi News home page

Jr NTR: ఎన్టీఆర్‌ నెక్స్ట్‌ మూవీ షూటింగ్‌ వచ్చే నెలలోనే!

Published Mon, Jan 24 2022 12:45 AM | Last Updated on Mon, Jan 24 2022 9:28 AM

NTR, Koratala Siva movie Speed Up for pre-production works - Sakshi

ఎన్టీఆర్‌ ఓ హీరోగా చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో హీరో) చిత్రం విడుదల ఈ వేసవికి వాయిదా పడింది. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ అయ్యేలోపు తన తదుపరి చిత్రంపై ఎన్టీఆర్‌ దృష్టి పెట్టాలనుకుంటున్నారని తెలిసింది. ‘జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులను స్పీడప్‌ చేశారు దర్శకుడు కొరటాల శివ. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, ఇతర కీలక పాత్రల్లో నటించనున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement