ఎన్టీఆర్ 'దేవర'.. చలో గోవా | Devara Movie Shooting In Goa: NTR | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ 'దేవర'.. చలో గోవా

Published Mon, Mar 18 2024 12:55 AM | Last Updated on Mon, Mar 18 2024 8:13 AM

Devara Movie Shooting In Goa: NTR - Sakshi

గోవాకు వెళ్లనున్నారట దేవర. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ‘దేవర’. ఇందులో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్‌రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలకానుంది.

తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. కాగా ‘దేవర’ సినిమా యూనిట్‌ పాటల చిత్రీకరణ కోసం గోవా వెళ్లనున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అతి త్వరలో ఈ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది తెలిసింది. గోవా షెడ్యూల్‌లో ఎన్టీఆర్, జాన్వీలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరిస్తారట మేకర్స్‌. ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement