
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయిన ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇలాంటి టైంలో క్రేజీ అప్డేట్‌తో దర్శకుడు ఓ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారిపోయింది.
(ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!)
బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి పెరిగింది. భారీ బడ్జెట్ చిత్రాలు, సీక్వెల్స్ వస్తున్నాయి. అలా బాహుబలి రెండు భాగాలుగా వచ్చి వేల కోట్ల వసూళ్లు చూపించింది. 'పుష్ప' కూడా అలానే సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు 'దేవర' కూడా రెండు భాగాలుగానే రానుందని స్వయంగా దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు.
సముద్రం బ్యాక్‌డ్రాప్‌తో తీస్తున్న 'దేవర' తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు కొరటాల మరోసారి స్పషం చేశారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీఖాన్ విలన్, అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. అయితే ఇలా ఓ సినిమాకు సీక్వెల్‌తో రావడం ఎన్టీఆర్‌కి ఇదే తొలిసారి. మరి 'దేవర'తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి?
(ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్!)
#Devara will be released in two parts, with the first part scheduled for release on April 5, 2024. @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @anirudhofficial @sabucyril @sreekar_prasad @Yugandhart_ @YuvasudhaArts @DevaraMovie pic.twitter.com/SpOBSnx0pL
— NTR Arts (@NTRArtsOfficial) October 4, 2023