
‘దేవర: పార్ట్ 1’ బ్లాక్‌బస్టర్ కావడంతో హీరో ఎన్టీఆర్ చాలా హ్యాపీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత నెల 27న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 500 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ పోస్టర్స్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఓ థ్యాంక్స్ నోట్ షేర్ చేశారు.
ఆ నోట్ సారాంశం ఏంటంటే....
‘‘దేవర పార్ట్ 1’కి అందుతున్న అద్భుతమైన స్పందనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా దర్శకుడు కొరటాల శివగారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశా నిర్దేశంతోనే ఈప్రాజెక్ట్ విజయవంతమైంది. తమ పాత్రలకు జీవం పోసిన నా సహ నటీ నటులు జాన్వీ, సైఫ్ అలీఖాన్ సార్, ప్రకాశ్‌రాజ్‌గారు, శ్రీకాంత్‌గార్లకు, ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు సంగీతదర్శకుడు అనిరుధ్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సార్,ప్రోడక్షన్ డిజైనర్ సాబు సార్, వీఎఫ్‌ఎక్స్ యుగంధర్‌గారు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌గార్లకు ధన్యవాదాలు.
మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు, థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా రూపొందించినందుకు మా నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా ‘దేవర పార్ట్ 1’ చిత్రాన్ని ఒక పండగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’’ అని ఆ నోట్‌లో ఎన్టీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment