'దేవర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. బ్లాక్‌బస్టర్ అనడం లేదు. అలా అని తీసిపారేయదగ్గ మూవీ అయితే కాదు. ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ బీజీఎం టమెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే సగటు ప్రేక్షకుడు ఎంటర్‌టైన్ అయితే అవుతాడు. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ 'బాహుబలి'ని గుర‍్తు చేస్తుందని చాలామంది అంటున్నారు. మూవీలోని సీన్లు కూడా గతంలో వచ్చిన పలు చిత్రాల్లోని సన్నివేశాలని పోలినట్లు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)
ఏదేమైనా 'దేవర' సినిమా చూడగానే స్టోరీ అంతా ఇప్పుడు చెప్పేశారు. ఇక సీక్వెల్ కోసం ఏం దాచి ఉంచారా అనే సందేహం వస్తుంది. సరిగా గమనిస్తే బోలెడన్ని ప్రశ్నలు వస్తాయి. ఒకటి రెండు కాదు దాదాపు అరడజను ప్రశ్నలు ఉండనే ఉంటాయి. ఇంతకీ అవేంటి? సీక్వెల్ స్టోరీ ఏమై ఉండొచ్చు. ఈ సినిమాని చూసి ఉంటేనే దిగువన పాయింట్స్ చదవండి. లేదంటే మళ్లీ ట్విస్టులన్నీ చెప్పేశామని అంటారు.
'దేవర' చూసిన తర్వాత సందేహాలు
సినిమా ప్రారంభంలో ప్రభుత్వ పెద్దలు చెప్పే యతి, దయ ఎవరు?
ఎర్రసముద్రం వాళ్లతో స్మగ్లింగ్ చేయించుకున్న మురుగన్ ఎలా చనిపోయాడు?
మురుగన్‌తో పాటు ఉండే డీఎస్పీ తులసికి ముఖం, ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి?
నీటి లోపలున్న అస్థి పంజరాలు ఎవరివి?
అంత మత్తులో ఉన్నాసరే తనని చంపడానికి వచ్చిన వాళ్లని అందరినీ 'దేవర' మట్టుబెడతాడు. అలాంటి 'దేవర'ని చంపింది ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చింది?
'దేవర' ఊరు వదలి వెళ్లిపోయాడని ఇంటర్వెల్‌లో చెబుతారు. అప్పటికే చనిపోయి ఉంటాడు. ఇక సెకండాఫ్‌లో సముద్రంలోకి వెళ్లిన భైర మనుషులు చనిపోతారు. అప్పటికీ వర ఇంకా చిన్న పిల్లాడే. మరి ఇక్కడ భైర మనుషుల్ని చంపింది ఎవరు?
'దేవర' స్టోరీ అంతా చెప్పిన ప్రకాశ్ రాజ్ ఎవరు? ఇంతకీ ప్రకాశ్ రాజ్ చెప్పిన స్టోరీ అంతా నిజమేనా?
జాన్వీని వర పెళ్లి చేసుకుంటాడా? సీక్వెల్ లో ఆమె పాత్ర తీరు ఇంతేనా?
పైన చెప్పిన ప్రశ్నలన్నింటికి సమాధానాలనే రెండో పార్ట్‌లో స్టోరీగా చూపిస్తారేమో అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ లైనప్ చూస్తే ప్రస్తుతం 'వార్-2', ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత 'దేవర 2' ఉంటుందా? లేదంటే వీటితో సమాంతరంగా ఏమైనా చేస్తాడా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?)
Comments
Please login to add a commentAdd a comment