గోవాలో ఆటా పాటా | Jr NTR Devara Movie Montage Song Shooting In Goa, Deets Inside - Sakshi
Sakshi News home page

Devara Shooting: గోవాలో ఆటా పాటా

Published Sat, Mar 23 2024 12:08 AM

Jr NTR Devara Movie Montage Song Shooting in Goa - Sakshi

గోవాలో ఆట పాటలతో సందడి చేస్తున్నాడు ‘దేవర’. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ‘జనతా గ్యారేజ్‌’ (2016) వంటి హిట్‌ మూవీ తర్వాత ఎన్టీఆర్, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ మూవీతో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తెలుగుకి పరిచయమవుతున్నారు. నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఓ మాంటేజ్‌ సాంగ్‌ చిత్రీకరణ కోసం గోవా చేరుకుంది ‘దేవర’ యూనిట్‌. గోవాలో మొదలైన కొత్త షెడ్యూల్‌లో రాజు సుందరం మాస్టర్‌ నేతృత్వంలో ఓ మాంటేజ్‌ సాంగ్‌ తెరకెక్కిస్తున్నారు కొరటాల. ఈ సందర్భంగా ‘దేవర’ నుంచి ఓ వర్కింగ్‌ స్టిల్‌ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్‌ కనిపిస్తున్నారు. ‘‘యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘దేవర’.

ఇప్పటికే గోవాలో కొంత టాకీ పార్ట్‌ చిత్రీకరించాం. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరికొత్త  మాస్‌ పాత్రలో కనిపిస్తారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు మేకర్స్‌. సైఫ్‌ అలీఖాన్, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement