
జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు విలన్ లుక్ బయటపెట్టారు.
(ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?)
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. దీంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలానే 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల కసితో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అలానే సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఇలా చాలా అంశాలు దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. తాజాగా సైఫ్ అలీ పుట్టినరోజు సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ చూస్తే సైఫ్ అలీ ఖాన్.. 'భైరా' అనే పాత్రలో కనిపించబోతున్నాడు. లుక్ అది చూస్తుంటే పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకొస్తామని ప్రకటించారు.
BHAIRA
— Jr NTR (@tarak9999) August 16, 2023
Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781
(ఇదీ చదవండి: 'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!)
Comments
Please login to add a commentAdd a comment