
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో దేవర టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్విహంచారు.
ఈ సందర్భంగా దేవర నటుడు సైఫ్ అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవరలో ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. మైథలాజికల్ సెంటిమెంట్, దేవతలకు రక్త అర్పించడం లాంటి వయొలెన్స్ సీక్వెన్సెస్ ఉన్నాయని సైఫ్ అన్నారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ నాలుగు గ్రామాల మధ్య జరిగే యుద్ధమని తెలిపారు. దేవరలో ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా పది రోజులు షూటింగ్ చేశామని సైఫ్ అలీ ఖాన్ వెల్లడించారు.
(ఇది చదవండి: దేవర మూవీ క్రేజ్.. రిలీజ్‌కు ముందే రికార్డులు!)
కాగా.. ఇప్పటికే దేవర ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఓవర్‌సీస్‌లోనూ టికెట్ ప్రీ బుకింగ్స్‌లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
A fight between the heads of 4 different villages.
⁰Ancestral weapons.
⁰So much blood. Sacrifices to the gods. Prayers.
And so much more… #Devara 💥💥💥#DevaraOnSep27th pic.twitter.com/AZR03wYW8P— Devara (@DevaraMovie) September 15, 2024