దేవర సీక్వెల్‌.. ఆ పాత్ర కోసం కసరత్తులు: దేవర నటుడు | Devara Sequel Actor Tarak Ponnappa Interesting Comments About Yathi Role, Deets Inside | Sakshi
Sakshi News home page

Tarak Ponnappa: దేవర సీక్వెల్‌.. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్‌ : తారక్ పొన్నప్ప

Published Sun, Nov 10 2024 7:28 PM | Last Updated on Mon, Nov 11 2024 11:38 AM

Devara sequel Actor Tarak Ponnappa interesting Comments About Yathi Role

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం దేవర పార్ట్-1. సముద్రపు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సెప్టెంబర్‌ 27న విడుదలైన దేవర ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్‌ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్‌ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే దేవర పార్ట్-2 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దేవర నటుడు తారక్ పొన్నప్ప. ఆయన దేవర మూవీలో కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం వికటకవి అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్‌ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవర-2లో యతి పాత్రకు సంబంధించిన ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు.

తారక్ పొన్నప్ప మాట్లాడుతూ..' ప్రస్తుతం స్క్రిప్ట్ పనులైతే జరుగుతున్నాయి. దేవర-2 2026లో జనవరిలో ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్‌నీల్‌తో సినిమా చేయాల్సి ఉంది. దేవర-2లో కీలకమైన యతి పాత్రపై వ‍ర్క్ షాప్స్ జరుగుతున్నాయి. ఆ పాత్రకు ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ పాత్రకు బెస్ట్ పర్సన్‌ కోసం చూస్తున్నారు. దానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది' అని అన్నారు. 

కాగా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన విక‌ట‌క‌వి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను జీ5 ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. ఈ  వెబ్‌సిరీస్‌లో న‌రేష్ అగ‌స్త్య‌, మేఘా ఆకాష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అనౌన్స్‌చేసింది. డిటెక్టివ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సిరీస్ న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement