Part
-
దేవర సీక్వెల్.. ఆ పాత్ర కోసం కసరత్తులు: దేవర నటుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం దేవర పార్ట్-1. సముద్రపు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సెప్టెంబర్ 27న విడుదలైన దేవర ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే దేవర పార్ట్-2 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దేవర నటుడు తారక్ పొన్నప్ప. ఆయన దేవర మూవీలో కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం వికటకవి అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవర-2లో యతి పాత్రకు సంబంధించిన ఆసక్తకర విషయాన్ని పంచుకున్నారు.తారక్ పొన్నప్ప మాట్లాడుతూ..' ప్రస్తుతం స్క్రిప్ట్ పనులైతే జరుగుతున్నాయి. దేవర-2 2026లో జనవరిలో ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్‌నీల్‌తో సినిమా చేయాల్సి ఉంది. దేవర-2లో కీలకమైన యతి పాత్రపై వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. ఆ పాత్రకు ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ పాత్రకు బెస్ట్ పర్సన్ కోసం చూస్తున్నారు. దానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది' అని అన్నారు. కాగా.. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన వికటకవి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను జీ5 ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. ఈ వెబ్‌సిరీస్‌లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనౌన్స్‌చేసింది. డిటెక్టివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. -
పాక్ సంక్షోభం: లక్షల ఉద్యోగాల కోత.. మంత్రిత్వశాఖల రద్దు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కొత్తగా మరో రుణం అందకపోతే ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి చేరుకుంది. దేశంలో ఆర్థిక వ్యయాలను తగ్గించేందుకు 1.5 లక్షల ఉద్యోగాలను తగ్గించింది. అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేసింది. దీంతో పాటు మరో రెండు మంత్రిత్వ శాఖల విలీనాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది.పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుండి రుణం తీసుకున్న అనంతరం దేశంలో ఆర్థిక నియంత్రణ చర్యలు చేపట్టింది. ప్రపంచానికి దేశ పరిస్థితిని చూపించేందుకు పాకిస్తాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి ఏడు బిలియన్ యూఎస్ డాలర్ల రుణం తీసుకుంది.అమెరికా నుంచి తిరిగి వచ్చిన పాక్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ మీడియాతో మాట్లాడుతూ ఐఎంఎఫ్‌తో రుణ ఒప్పందం ఖరారయ్యిదని, ఇందుకోసం తాము కొన్ని విధానాలు అమలు చేయాల్సివుంటుందన్నారు. అలాగే జీ 20లో చేరాలంటే దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చేయాల్సివస్తుందన్నారు. మంత్రిత్వ శాఖల పరిధిలో రైట్ సైజింగ్ పనులు జరుగుతున్నాయని, ఆరు మంత్రిత్వ శాఖలను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం త్వరలో అమలులోకి వస్తుందని, రెండు మంత్రిత్వ శాఖలను విలీనం చేస్తామని మంత్రి తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖలలో 1,50,000 పోస్టులు రద్దు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.పెరుగుతున్న పన్నుల రాబడి గురించి ఆయన మాట్లాడుతూ గత ఏడాది మూడు లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు జత చేరరని, ఈ ఏడాది ఇప్పటివరకు 7,32,000 మంది కొత్త పన్ను చెల్లింపుదారులు నమోదు చేసుకున్నారని ముహమ్మద్ ఔరంగజేబ్ పేర్కొన్నారు. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1.6 మిలియన్ల నుండి 3.2 మిలియన్లకు చేరుకుందన్నారు.ఇది కూడా చదవండి: రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయి -
కమ్యూనిస్టులతో కలిసుంటే బాగుండేది
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టులు మిత్ర పక్షంగా ఉంటే బాగుండేదని, ఎన్నికలకు ముందు వామపక్షాలు దూరం కావడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ‘ఇండియా’, ‘ఎన్డీఏ’కూటములకు సమదూరం పాటిస్తున్నందునే కమ్యూనిస్టులతో మైత్రి సాధ్యం కాలేద ని తాను భావిస్తున్నానన్నారు. మండలిలోని తన చాంబర్లో శుక్రవారం మీడియా ప్రతినిధులతో గుత్తా మాట్లాడారు. వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై బి. వినోద్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి సంప్రదింపులు జరిపారని, వారికి నామినేటెడ్ పోస్టు లు కూడా ఇస్తామన్నారని గుత్తా తెలిపారు. కాగా, తాను ఉన్న పదవిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్టు పార్టీ నేతల వ్యాఖ్యలపై మాట్లాడబోనన్నారు. అవకాశమిస్తేనే గుత్తా అమిత్ పోటీ నల్లగొండ ఎంపీగా 2019లో తాను పోటీ చేస్తే విజయం సాధించేవాడినని, అయితే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్ష రాజకీయాల నుంచి నామినేటెడ్ పదవులవైపు వచ్చానని గుత్తా వెల్లడించారు. తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం కేసీఆర్ వెంటే ఉంటానని, భవిష్యత్తులో ఆయనకు నచ్చకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గుత్తా ప్రకటించారు. తనకు శాసన మండలి చైర్మన్‌గా పదవీ కాలం చాలా ఉందని, సీఎం, తాను అనుకున్నంత కాలం ఆ పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పార్టీ టికెట్ ఆశించిన మాట వాస్తమేనని, కానీ అవకాశం లేకుంటే పార్టీ మాత్రం ఏం చేస్తుందని అన్నారు. బట్టకాల్చి మీదేయడమే రేవంత్ పని బట్టకాల్చి ఎదుటి వారిపై వేయడమే పనిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని గుత్తా అన్నారు. రెడ్లకు భయపడి బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచి్చందనేది అవాస్తవమని, ప్రస్తుత రాజకీయాల్లో క్వాలిటీ ఆఫ్ లీడర్ షిప్ పడిపోతోందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో సీనియర్లు కాకుండా జూనియర్ల రాజ్యం నడుస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే..
సాక్షి, హైదరాబాద్: ముందు నుంచీ చెప్తున్నట్టుగానే సిట్టింగ్‌లకే పార్టీ టికెట్లు కేటాయించామని.. పార్టీ ధిక్కార చర్యలకు ఎవరు పాల్పడినా వేటు తప్పదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ధిక్కారానికి పాల్పడేవారు ఏ స్థాయిలో ఉన్నా క్రమశిక్షణ చర్యలు సాదాసీదాగా ఉండవని, పార్టీ నుంచి పంపించేస్తామని స్పష్టం చేశారు. ఒకట్రెండు చోట్ల అసంతృప్తులుంటే.. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమిస్తామని, ఆ కమిటీ సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకెవరూ పోటీయే కాదని.. 95 నుంచి 105 సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్ లో 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులతో జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్టీలో పూర్తి స్థాయి అవగాహన, సర్దు బాట్లతోనే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయం మేరకు తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నట్టు తెలిపారు. శ్రావణమాసం మంచి ముహుర్తం ధనుర్లగ్నంలో అభ్యర్థులను ప్రకటించామని.. వీరిని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా ఆశీర్వదించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 16న వరంగల్‌లో సింహ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తామని, అదే రోజున బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మార్పులు తప్పనిసరి పరిస్థితుల్లో ఏడుగురు సిట్టింగ్‌లను మార్చామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎవరినైనా వదులుకోవాలంటే తమకు కూడా బాధగానే ఉంటుందన్నారు. అవకాశం రానివారు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని.. ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్లుగా పార్టీ అవకాశాలు కలి్పస్తుందని హామీ ఇచ్చారు. పార్టీలోనే ఉండి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. మిగిలిపోయిన 4 సీట్లలో అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ఖరారు చేస్తామని చెప్పారు. వేములవాడ అభ్యర్థి మంచివాడే అయినా ఆయన పౌరసత్వం సమస్య కోర్టుల్లో ఉందని చెప్పారు. భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డికి పోటీచేసే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినందున మధుసూదనాచారి సహకారంతో టికెట్ కేటాయించామన్నారు. తాండూరు నుంచి మహేందర్‌రెడ్డి కూడా యువకుడికి అవకాశం ఇవ్వడానికి పూర్తిగా సహకరించి ఆశీర్వదించారని చెప్పారు. వామపక్షాలతో పొత్తు మాటే రాదు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశాక వామపక్షాలతో పొత్తు మాటే ఉత్పన్నం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 34 సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, బీఆర్ఎస్ బీసీలకు తక్కువ సీట్లు కేటాయించిందేమని మీడియా ప్రశ్నించగా.. ‘చూద్దాం.. ఎవరెన్ని సీట్లు కేటాయిస్తారో?’అని బదులిచ్చారు. మహిళలకు తక్కువ సీట్లపై స్పందిస్తూ.. పార్లమెంటు చట్టం చేస్తే ప్రతీపార్టీ కూడా మహిళలకే అవకాశాలు ఇస్తాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ ఆలోచించి టికెట్లు కేటాయించామని వివరించారు. కర్ణాటకకు, తెలంగాణకు పోలికే లేదు ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఫలితాలకు, తెలంగాణకు పోలికే లేదని కేసీఆర్ పేర్కొన్నారు. అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తోందని విమర్శించారు. బెంగళూరుకు విద్యుత్ సరఫరా చేయలేక లోడ్ షెడ్డింగ్ చేస్తున్నారన్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నా.. బీఆర్ఎస్ లక్ష రూపాయలే, అదీ విడతల వారీగా మాఫీ చేస్తామని, ప్రజలు తమనే నమ్మి గెలిపించారని చెప్పారు. జవదేకర్ ఓ పాగల్..! సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ చేసిన విమర్శలను ప్రస్తావించగా.. ‘‘జవదేకర్ మాట్లాడేది ఏంది? కాళేశ్వరం గురించి తొండం తెల్వదు.. తోక తెల్వదు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తారు. ఆయనో ఓ పాగల్. బీఆర్ఎస్ను ఒకరికొకరు ఏ టీమ్, బీ టీమ్ అంటున్న కాంగ్రెస్, బీజేపీలు కూడా పాగల్ పార్టీలు..’’అని కేసీఆర్ మండిపడ్డారు. వ్యతిరేకులకు ఇళ్ల స్థలాలివ్వం: కేసీఆర్ ‘‘రాష్ట్రానికి వ్యతిరేకంగా, అభివృద్ధికి విఘాతం కలిగించేలా కథనాలు ప్రచురించే పత్రికల్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వం. వాళ్లను పాలు పోసి పోషించాల్సిన అవసరమేముంది? ఎవరికి ఇవ్వా లన్నది ప్రభుత్వ విచక్షణ. కీలుబోమ్మలాంటి వారు జర్నలిస్టులు ఎలా అవుతారు? వాళ్లకు ఐడియా ఉండాలి కదా.. దేశంలో ఎవరూ మాతో పోల్చుకోవడానికి కూడా సాహసం చేయని పరిస్థితులు ఉంటే.. ఇక్కడ వేతనాలు ఇవ్వడానికి డబ్బుల్లేవంటూ కథనాలు రాస్తున్నారు. ఒకే దెబ్బకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఆ పత్రిక తల ఎక్కడ పెట్టుకుంటుంది? ఆర్బీఐ రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్ అంటోంది. కేంద్రం, కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధిని చెబుతూ అవార్డులిస్తుంటే.. అవేవీ పట్టించుకోకుండా పనికి మాలిన రాతలు రాస్తున్నారు. ఇదేం జర్నలిజం? ఉద్యమ సమయంలోనే చెప్పా.. కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయని.. న్యూస్‌పేపర్ కాదు వ్యూస్ పేపర్, చానెల్స్ ఉన్నాయి..’’అని సీఎం ఘాటుగా స్పందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంపై మీడియా ప్రశ్నించగా ఇలా స్పందించారు. -
జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో ఉండొద్దా?
సాక్షి, హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్టు ఏ డాదిన్నరగా కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మండిపడ్డారు. తాను బీఆర్ఎస్లోకి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు. తనకు రాజకీయ శీల పరీక్షలు అవసరం లేదని.. తన రాజకీయ ప్రయాణం రాహుల్గాందీతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్లో జగ్గారెడ్డి మీడి యాతో మాట్లాడారు. ‘నేను పార్టీ మారుతున్నానని ప్రచారం చేయడం కొందరికి ఆనందం కలిగిస్తోంది. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దా? నా వ్యక్తిత్వంపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు? సోషల్ మీడియాలో ప్రచారానికి ఎవరు, ఎన్ని డబ్బులు ఇస్తున్నారు? నేను కన్నెర్ర చేస్తే ఈ దుష్ప్రచారం చేస్తున్న వారు ఉంటారా?’అని పేర్కొన్నారు. దుష్ప్రచారం టీడీపీ కల్చర్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నడిరోడ్డుపై బట్టలు విప్పి నిలబెడతానని జగ్గారెడ్డి హె చ్చరించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచా రం చేయడం తెలుగుదే శం పార్టీ సంస్కృతి అ ని, అక్కడి నుంచే ఇది కాంగ్రెస్‌లోకి వచ్చిదని వ్యాఖ్యానించారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం, సమావేశంలో పాల్గొంటున్నానని.. అయినా అబద్ధపు ప్రచారం చేస్తుండటం బాధ కలిగిస్తుందన్నారు. ఇప్పటికైనా ఆ మూర్ఖులు, దద్దమ్మలు తప్పుడు ప్రచారం మానేయాలన్నారు. రాహుల్‌ను సంగారెడ్డికి రమ్మంటా.. సంగారెడ్డి మీదుగా రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర వెళితే సంతోషపడ్డానని, ఆర్థిక ఇబ్బందులు న్నా యాత్రను విజయవంతం చేశానని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌పై తిరగబడిన మొదటి నాయకుడిని తానేనని.. 2018 ఎన్నికల సమయంలో తనపై కేసులు పెట్టి, జైలుకు పంపారని, అయినా కొట్లాడి గెలిచానని వివరించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు తనకు రాహుల్‌గాంధీ 20నిమిషాల పాటు ప్రత్యేకంగా సమయం ఇచ్చారని, పార్టీ విషయాలన్నింటినీ ఆయనకు వివరించానని, దీనికి త్వరలో ఫలితం ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్‌తో సంగారెడ్డిలో త్వరలోనే ఓ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. -
కమలదళం.. కదన వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కదనరంగానికి కమలదళం సమాయత్తమైంది. ఒకవైపు పార్టీ సంస్థాగత పటిష్టత, పార్టీ గెలుపుకోసం అంకితభావంతో పనిచేసే నేతల ఎంపిక, వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీల నియామకం.. మరోవైపు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, ప్రజాసమస్యలపై ఉద్యమ కార్యాచరణ.. ఇంకోవైపు నెలాఖరులో విజయ సంకల్ప యాత్రల పేరిట రథయాత్రల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర బీజేపీలో గత సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే 30–35 మంది అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేస్తోంది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో నియోజకవర్గాల వారీగా పార్టీకి ఉన్న బలాబలాలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి.. బలహీనంగా ఉన్న సీ, డీ స్థానాల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా క్షేత్రస్థాయి నుంచి పట్టుపెంచుకోవడానికి, గెలిచే అవకాశాలు ఎక్కువగా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అవకాశం ఏర్పడిందని పార్టీనేతలు చెప్తున్నారు. అదే తరహా వ్యూహాన్ని ఇక్కడా అమలు చేసే యోచన ఉన్నట్టు వివరిస్తున్నారు. నేడు రాష్ట్రానికి 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీకున్న 1,200 మంది ఎమ్మెల్యేల్లో 560 మందిని ఎంపికచేశారు. వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 119 మంది వారంపాటు తెలంగాణలో ఒక్కో నియోజకవర్గంలో ఒకరు చొప్పున పర్యటించి పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులను పరిశీలించి జాతీయ పార్టీకి నివేదిక ఇస్తారు. వారి పర్యటన ముగియగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోరు యాత్రలను చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. అలంపూర్ జోగులాంబ ఆలయం, భద్రాచలంలోని సీతారామ ఆలయం, బాసరలోని సరస్వతి ఆలయం నుంచి వీటిని ప్రారంభించే అవకాశముంది. ఓవైపు ఈ యాత్రలను కొనసాగిస్తూనే.. పార్టీపరంగా ఎన్నికల వ్యూహాలను, కార్యాచరణను సిద్ధం చేయడం, అమలు కోసం మేనిఫెస్టో, ప్రచార, ఇతర కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కీలకంగా అమిత్‌షా పర్యటన ఈ నెల 27న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఖమ్మం పర్యటనను పార్టీ నాయకత్వం సవాల్‌గా తీసుకుంది. ఈ పర్యటన సందర్భంగా కోర్‌కమిటీ, ముఖ్య నేతలతో అమిత్‌షా భేటీ అయి ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణకు తుదిరూపు ఇస్తారని.. రాష్ట్ర పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్‌షా రాష్ట్ర పర్యటన తర్వాత పార్టీపరంగా కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని అంటున్నాయి. 23 నుంచి మళ్లీ ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ప్రజా సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టిన బీజేపీ.. తిరిగి ఈ నెల 23, 24, 25 తేదీల్లో తదుపరి దశ పోరాటాలను కొనసాగించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు వినతిపత్రాలు సమర్పించనున్నారు. తర్వాత జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఈ ఉద్యమాన్ని చేపడతారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. తొలిదశలో ఆందోళనలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై చర్చించారు. 20న మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించారు. -
ఆటో విడిభాగాల లాభాలు వీక్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా ఆటో విడిభాగాల కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. కరోనా కేసుల కట్టడికి ఆంక్షలు, లాక్డౌన్ల నేపథ్యంలో నిర్వహణ లాభాలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ లాభాల్లో 70 శాతం కోత పడేవీలున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఇందుకు మరోవైపు వేగంగా పెరిగిన కమోడిటీల ధరలు కారణంకానున్నట్లు తెలియజేసింది. అయితే వీటిని వాహన తయారీ(ఓఈఎం) సంస్థలకు బదిలీ చేసే వీలున్నప్పటికీ ఇందుకు 3–6 నెలల సమయం పడుతుందని వివరించింది. ఆంక్షల ఎఫెక్ట్ ఈ ఏడాది క్యూ1లో ఆటో విడిభాగాల కంపెనీల మొత్తం ఆదాయాలూ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోనున్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. త్రైమాసికవారీగా చూస్తే 30–40 శాతం స్థాయిలో టర్నోవర్ తగ్గవచ్చని అంచనా వేసింది. ఫలితంగా నిర్వహణ లాభం (ఇబిటా) గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంతో పోలిస్తే 70 శాతం స్థాయిలో క్షీణించవచ్చని అభిప్రాయపడింది. కాగా.. కరోనా ప్రతికూలతల నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ గత కొద్ది నెలలుగా ఆటో విడిభాగాల పరిశ్రమను ఎగుమతులు ఆదుకుంటున్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. దీంతో దేశీ డిమాండుపైనే అధికంగా ఆధారపడే కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు తెలియజేసింది. నిల్వలు పెరుగుతున్నాయ్ స్వల్ప కాలంలో ఆటో విడిభాగాల పరిశ్రమ సవాళ్లను ఎదుర్కోనున్నప్పటికీ పూర్తి ఏడాదిలో పటిష్ట పనితీరు చూపే వీలున్నట్లు పేర్కొంది. ఆదాయంలో సగటున 20–23% పురోగతి నమోదుకాగలదని అంచనా వేసింది. ఆటోమొబైల్ రంగంలో పలు విభాగాలలోనూ రెండంకెల వృద్ధికి వీలుండటంతో ఆదాయాలు పుంజుకోగలవని వివరించింది. ఏప్రిల్‌లో ఉత్పత్తిలో నిలకడ కొనసాగినప్పటికీ గత రెండు నెలల్లో రిటైల్ విక్రయాలు పడిపోయినట్లు తెలియజేసింది. దీంతో ఆటో రంగ పరిశ్రమలో నిల్వలకు అవకాశం ఏర్పడినట్లు ప్రస్తావించింది. పలు ఓఈఎంలు జూన్ నెలలో ఒకే షిఫ్ట్‌కు పరిమితంకావడంతో ఉత్పత్తి పరిమాణం మందగించనున్నట్లు తెలియజేసింది. కమోడిటీ ధరలు సైతం ఒత్తిడిని పెంచనున్నట్లు ఇక్రా వివరించింది. ప్రస్తుత ఏడాది తొలి అర్ధభాగంలో ఈ ప్రభావం అధికంగా కనిపించనుందని, అక్టోబర్–మార్చి నుంచి ధరలు కొంతమేర బలహీనపడవచ్చని విశ్లేషించింది. ఎలక్ట్రానిక్ పరికరాల కొరత, సెమీకండక్టర్ ధరల పెరుగుదల సైతం ఆటో పరిశ్రమకు సమస్యలు సృష్టించనున్నట్లు ఇక్రా అభిప్రాయపడింది. చదవండి: అదిరిపోయిన బీఎండబ్ల్యూ ‘మినీ’ కార్లు..! హ్యుందాయ్ కెట్రాలో కొత్త మోడల్... తగ్గిన ధర -
ఈ వార్త నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. కథా, సినిమా బడ్జెట్ దృష్ట్యా ‘సలార్’ ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ విషయమై అతను ప్రభాస్‌తో చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమలో ప్రస్తుతం రెండు భాగాల ట్రెండ్‌కు ఆదరణ ఉండటంతో ఆ దిశగా చిత్రబృందం కథలో మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో భారీ బడ్జెట్‌గా రూపొంది రెండు భాగాలుగా విడుదలైన ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే దారిలో ‘కేజీఎఫ్’ కూడా రెండు భాగాలుగా చిత్రీకరించారు. ఇక ‘సలార్’కు ఇదే తరహా ఫార్ములాను పాటించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథ, క్యాస్టింగ్ డిమాండ్ బట్టి బడ్జెట్‌ను ఎంతైనా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు వెనకాడటం లేదు. అందులో భాగంగానే ప్రస్తుతం హై బడ్జెట్ చిత్రాల్ని రెండు భాగాలుగా తెరకెక్కించడం నిర్మాతను కొంత సేఫ్ జోన్లో పెడుతుందని ఇలా చేస్తున్నాట్లు తెలుస్తోంది. జనవరిలో లాంఛనంగా ప్రారంభమైన ‘సలార్’ చిత్రం ఇటీవల గోదావరిఖని బొగ్గు గనుల్లో ప్రభాస్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకుంది. ఆ తర్వాత మహమమ్మారి వ్యాప్తి కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైరస్ కాస్త అదుపులోకి రావడంతో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తి వేయగా, త్వరలోనే చిత్రీకరణను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: రూ. 150 కోట్ల ఆఫర్లు వదులుకున్న ప్రభాస్, ఎందుకో తెలుసా? -
అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన పలు పార్టీల నేతలు
-
టీఆర్ఎస్ గాలి పార్టీ
పోలీసులు గులాబీ కండువాలు కప్పుకున్నట్లున్న ఉంది.. కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జ్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు వైరా : రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గాలి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు విమర్శించారు. శనివారం వైరాలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని, 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమన్నారు. టీఆర్ఎస్ అధికారాన్ని ఎదిరించిన ఒక్క కాంగ్రెస్సేనని నొక్కివక్కాణించారు. రాష్ట్రంలో పోలీసులు గులాబీ కండువాలు కప్పుకున్నట్లుగా ఉందని, అధికార పార్టీకి పోలీసులు పని చేస్తున్నారన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. అధికారులు మాత్రం ఒకే పార్టీకి కొమ్ము కాస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు పడతారన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో దోపిడీ .. ప్రాజెక్ట్‌ల పేరుతో టీఆర్ఎస్ దోపిడి చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మంత్రి తుమ్మలకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ఒక చెడ్డవాడు ఉంటేనే మంచివాడి విలువ తెలుస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్‌లాల్ మనవాడేనని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆయనకు ఓట్లు వేశారన్నారు. త్వరలో పది వేల మందితో నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం, జిల్లా అ«ధికార ప్రతినిది పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ల రంగారావు, మహిళా అధ్యక్షురాలు మణి, జిల్లా నాయకులు ఎన్.రాంబాబు, వీరయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామస్వామి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలాజీ, మండల అధ్యక్షుడు పసుపులేటి మోహనరావు, నాయకులు వెంకటనర్సిరెడ్డి, దానియేలు, హరినాథ్, గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సంవత్సర పార్టీలకు ట్యాక్స్ కట్టాల్సిందే!
-
విరితేనియలు! విషవాయువులు!
నాలుగు వందల ఏళ్ల క్రితం ప్రపంచ నగరాల్లో నవ వధువుగా ఆవిర్భవించిన ‘భాగమతి’ ఒక అద్భుత నిర్మాణం. అదే నేటి హైదరాబాద్. సమస్త ఉత్పత్తులూ దొరుకుతున్నప్పటికీ మనిషి స్వయంకృతాల వల్ల ఈ నగరం మన జీవితాన్ని బాగుపరచే లక్షణాన్ని కోల్పోయింది. నివాసయోగ్యంగా నగరం పునరుజ్జీవనం పొందాలి! ‘నగరాలు అందరికీ’ అనే ఆశయంతో ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ హైదరాబాద్ వేది కగా ‘11వ మెట్రోపాలిస్ వరల్డ్ కాంగ్రెస్’ నిర్వహిస్తు న్నారు. ఈ నేపథ్యంలో ‘హైదరాబాద్: జీవిత చరిత్ర’ రచయిత, విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేం ద్ర లూథర్‌తో ఇంటర్వ్యూ. ఆయన మాటల్లోనే: ‘అమృత’ ధారలు! ‘జీవితాన్ని ఆనందపరచినంతవరకూ నగరాలు జీవించాలి. ఆ లక్షణం కోల్పోతే మరణించడం సహ జమూ, హర్షణీయమూ’ అంటాడు అరిస్టాటిల్! అరి స్టాటిల్ ప్రామాణికత ప్రకారం జన్మించింది గోల్కొం డ! కొండ. కొండపై కోట (ఖిలా). చుట్టూ నివాసా లు. 16వ శతాబ్దం నాటికి గోల్కొండ నగరం చిన్న దైంది. ఖిలా పక్కన మూసీకి దగ్గరగా కొత్త నగరాన్ని నిర్మించాలనుకున్నాడు 5వ కుతుబ్‌షాహీ వంశస్తుడు మహమ్మద్ కులీ! ఫరిస్తా రాతల ప్రకారం కులీ స్వర్గం లాంటి నగరం నిర్మించాలని భావించాడు. ఇస్లామిక్ స్వర్గం తోటలతో నిండినది. జాన్ పీపర్ అనే జర్మన్ ఆర్కిటెక్,్ట ఇస్లామిక్ హెవెన్కు నమూనా లాంటిది కులీకి చూపుతాడు! నిర్మించబోయే నగరం గురించి జాన్ పీపర్ వర్ణిస్తాడు. అరబిక్‌లో స్వర్గం అంటే జన్నత్. అంటే ఉద్యానవనం! నగరానికి ఉద్యానవనం ప్రతీక! విశాలమైన ఉద్యానవనంలో నాలుగు రహదారులు. నడిబొడ్డులో నాలుగు మినా ర్లు. చార్మినార్ కేంద్రంలో ఫౌంటెన్! ఈ నమూ నా క్రీ.శ. 1596లో అక్షరాలా నిజమైంది. ప్రపంచ దేశాల పర్యాటకులు నగరాన్ని సందర్శించి అద్భుత నిర్మాణం అన్నారు. ప్రపంచ నగరాల్లో ‘వధువు’గా అభివర్ణించారు! నగర నిర్మాత కులీ, తన ప్రేయసి పేరుతో నగరానికి భాగమతి పేరు పెట్టాడు. తర్వాత హైదరాబాద్‌గా ‘మార్పు’ చెందింది! హైదరాబాద్‌లో నివాసప్రాంతాలకు 8 రెట్లు విస్తీర్ణంలో ఉద్యానవనాలుండేవి. గోల్కొండ కోట సైనిక స్థావరంగా కొనసాగేది! 1687లో ఔరంగజేబ్ గోల్కొండపై దాడి చేశాడు. 8 నెలలు పోరాడాడు. లంచం ఇచ్చి ఖిల్లాలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి మొఘల్ సామ్రాజ్యంలో దక్కన్ భాగమైంది. జనాభా వలస పోయింది. కాంతి క్షీణించింది. ‘రాజ్యం’ హోదా కోల్పోయి, రాజధాని హోదా కోల్పోయి ఔరంగాబాద్ రాజధానిగా గల దేశంలో భాగమైంది! 2వ నిజాం మొఘల్ సామ్రాజ్యపు ఔరంగాబాద్ గవర్నర్! ఆయన 1762లో దక్కన్ ప్రాంతపు రాజధానిగా హైదరాబాద్‌ను మార్చారు. దాంతో హైదరాబాద్ కొత్త చివుర్లు వేసింది! నవ వధువు 1908 సెప్టెంబర్ 28న నగరం కనీవినీ ఎరుగని వరద ముంపునకు గురైంది. మూసీ 3 గంటల్లో మూడు నిలువుల ఎత్తు పెరిగింది. 15 వేలమంది ప్రజలు మరణించారు. 9 వేల ఇళ్లు కొట్టుకుపోయా యి. గంగమ్మ-భవానీ ఆగ్రహం ఫలితం ఈ వరద అని ఒక హిందూ పూజారి 6వ నిజాంతో అన్నారు. నిజాం నది వద్దకు నడచి వెళాడు, వెండి తాంబాళం నెత్తిన పెట్టుకుని, పూలు-కుంకుమ-చీరె తీసుకుని వెళ్లాడు. హారతి ఇచ్చాడు! ప్రజల విశ్వాసాలను గౌర వించిన నిజాం, పాలకుడిగా భవిష్యత్‌లో వరద నష్టం సంభవించకుండా ఏమి చేయాలో యోచిం చాడు! ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వర య్యను మైసూర్‌నుంచి పిలిచారు. ఆయన రూపొం దించిన మాస్టర్ ప్లాన్ మేరకు మూసీపై డ్యాం, ఉస్మాన్‌సాగర్-హిమాయత్‌నగర్ రిజర్వాయర్లు నిర్మించారు. భారత్‌లో నగరాభివృద్ధి మండలి ఏర్పడిన తొలి నగరం హైదరాబాదే! హైకోర్ట్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా హాస్పిటల్, జాగిర్దార్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్లు మంచి రోడ్లతో నిర్మించారు. నగరం నవ వధువు! 7వ నిజాం హయాంలో పోలీస్ యాక్షన్ నేప థ్యంలో 13 సెప్టెంబర్ 1948న నగరం తల వంచు కుని లొంగిపోయింది. 1956 నవంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యింది. అప్పట్లో ఇళ్లకు అప్స్ట యిర్స్, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లూ లేవు! రుతువులు చక్రం లోని సువ్వల్లా ఒక రుతువునుంచి మరో రుతువు లోకి సున్నితంగా మారేవి. సాయంత్రపు సమా గాలు, ముషాయిరాలూ! విషవాయువులు! గల్ఫ్‌లో నూనెను కనుక్కోవడంతో హైదరాబాదీయు లకు ఉద్యోగ లేదా పని అవకాశాలు పెరిగాయి. అంకుల్‌శామ్ అతని కజిన్స్ ఇచ్చే డాలర్లకోసం ప్రతి కుటుంబమూ ఎవరో ఒకరిని గల్ఫ్‌కు పంపింది. ఈ దశ తర్వాత గ్లోబలైజేషన్-లిబరలైజేషన్లు నగరం పై ప్రభావం చూపిస్తున్నాయి. లోకంలో ఉత్పత్తి అయ్యే అన్నీ దొరుకుతున్నాయి. బైక్స్, కార్స్, మాల్స్, అపార్ట్మెంట్ హౌసెస్ పెరిగాయి. ప్రతి నెలా రోడ్లపై నాలుగువేల కొత్తకార్లు మృత్యువాయు వులను ప్రసరిస్తున్నాయి. విద్యుత్ అవసరాలు పెరు గుతూ కోతలు వచ్చాయి. నగరం మన జీవితాన్ని బాగుపరచే లక్షణాన్ని కోల్పోయింది. నగరాలు ఎందువల్ల మరణిస్తాయి? కొన్ని భగవద్ నిర్ణయం వలన మరికొన్ని మనిషి స్వయంకృతాల వల్ల! కొం డవీడు, హంపీ- విజయనగరం తదితర నగరాలు స్వయంకృత మరణాలకు ఉదాహరణలు! అరి స్టాటిల్ ప్రమాణాల ప్రకారం వర్తమాన దశ హైదరా బాద్ నగరపు శవయాత్ర! ఫ్యునరల్ మార్చ్! నా భావన తప్పు కావాలి! వాసయోగ్యంగా నగరం పునరుజ్జీవనం పొందాలి! పున్నా కృష్ణమూర్తి