
విరితేనియలు! విషవాయువులు!
నాలుగు వందల ఏళ్ల క్రితం ప్రపంచ నగరాల్లో నవ వధువుగా ఆవిర్భవించిన ‘భాగమతి’ ఒక అద్భుత నిర్మాణం. అదే నేటి హైదరాబాద్. సమస్త ఉత్పత్తులూ దొరుకుతున్నప్పటికీ మనిషి స్వయంకృతాల వల్ల ఈ నగరం మన జీవితాన్ని బాగుపరచే లక్షణాన్ని కోల్పోయింది. నివాసయోగ్యంగా నగరం పునరుజ్జీవనం పొందాలి!
‘నగరాలు అందరికీ’ అనే ఆశయంతో ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ హైదరాబాద్ వేది కగా ‘11వ మెట్రోపాలిస్ వరల్డ్ కాంగ్రెస్’ నిర్వహిస్తు న్నారు. ఈ నేపథ్యంలో ‘హైదరాబాద్: జీవిత చరిత్ర’ రచయిత, విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేం ద్ర లూథర్‌తో ఇంటర్వ్యూ. ఆయన మాటల్లోనే:
‘అమృత’ ధారలు!
‘జీవితాన్ని ఆనందపరచినంతవరకూ నగరాలు జీవించాలి. ఆ లక్షణం కోల్పోతే మరణించడం సహ జమూ, హర్షణీయమూ’ అంటాడు అరిస్టాటిల్! అరి స్టాటిల్ ప్రామాణికత ప్రకారం జన్మించింది గోల్కొం డ! కొండ. కొండపై కోట (ఖిలా). చుట్టూ నివాసా లు. 16వ శతాబ్దం నాటికి గోల్కొండ నగరం చిన్న దైంది. ఖిలా పక్కన మూసీకి దగ్గరగా కొత్త నగరాన్ని నిర్మించాలనుకున్నాడు 5వ కుతుబ్‌షాహీ వంశస్తుడు మహమ్మద్ కులీ! ఫరిస్తా రాతల ప్రకారం కులీ స్వర్గం లాంటి నగరం నిర్మించాలని భావించాడు. ఇస్లామిక్ స్వర్గం తోటలతో నిండినది. జాన్ పీపర్ అనే జర్మన్ ఆర్కిటెక్,్ట ఇస్లామిక్ హెవెన్‌కు నమూనా లాంటిది కులీకి చూపుతాడు! నిర్మించబోయే నగరం గురించి జాన్ పీపర్ వర్ణిస్తాడు. అరబిక్‌లో స్వర్గం అంటే జన్నత్. అంటే ఉద్యానవనం! నగరానికి ఉద్యానవనం ప్రతీక! విశాలమైన ఉద్యానవనంలో నాలుగు రహదారులు. నడిబొడ్డులో నాలుగు మినా ర్‌లు. చార్‌మినార్ కేంద్రంలో ఫౌంటెన్! ఈ నమూ నా క్రీ.శ. 1596లో అక్షరాలా నిజమైంది. ప్రపంచ దేశాల పర్యాటకులు నగరాన్ని సందర్శించి అద్భుత నిర్మాణం అన్నారు. ప్రపంచ నగరాల్లో ‘వధువు’గా అభివర్ణించారు! నగర నిర్మాత కులీ, తన ప్రేయసి పేరుతో నగరానికి భాగమతి పేరు పెట్టాడు. తర్వాత హైదరాబాద్‌గా ‘మార్పు’ చెందింది!
హైదరాబాద్‌లో నివాసప్రాంతాలకు 8 రెట్లు విస్తీర్ణంలో ఉద్యానవనాలుండేవి. గోల్కొండ కోట సైనిక స్థావరంగా కొనసాగేది! 1687లో ఔరంగజేబ్ గోల్కొండపై దాడి చేశాడు. 8 నెలలు పోరాడాడు. లంచం ఇచ్చి ఖిల్లాలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి మొఘల్ సామ్రాజ్యంలో దక్కన్ భాగమైంది. జనాభా వలస పోయింది. కాంతి క్షీణించింది. ‘రాజ్యం’ హోదా కోల్పోయి, రాజధాని హోదా కోల్పోయి ఔరంగాబాద్ రాజధానిగా గల దేశంలో భాగమైంది! 2వ నిజాం మొఘల్ సామ్రాజ్యపు ఔరంగాబాద్ గవర్నర్! ఆయన 1762లో దక్కన్ ప్రాంతపు రాజధానిగా హైదరాబాద్‌ను మార్చారు. దాంతో హైదరాబాద్ కొత్త చివుర్లు వేసింది!
నవ వధువు
1908 సెప్టెంబర్ 28న నగరం కనీవినీ ఎరుగని వరద ముంపునకు గురైంది. మూసీ 3 గంటల్లో మూడు నిలువుల ఎత్తు పెరిగింది. 15 వేలమంది ప్రజలు మరణించారు. 9 వేల ఇళ్లు కొట్టుకుపోయా యి. గంగమ్మ-భవానీ ఆగ్రహం ఫలితం ఈ వరద అని ఒక హిందూ పూజారి 6వ నిజాంతో అన్నారు. నిజాం నది వద్దకు నడచి వెళాడు, వెండి తాంబాళం నెత్తిన పెట్టుకుని, పూలు-కుంకుమ-చీరె తీసుకుని వెళ్లాడు. హారతి ఇచ్చాడు! ప్రజల విశ్వాసాలను గౌర వించిన నిజాం, పాలకుడిగా భవిష్యత్‌లో వరద నష్టం సంభవించకుండా ఏమి చేయాలో యోచిం చాడు! ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వర య్యను మైసూర్‌నుంచి పిలిచారు. ఆయన రూపొం దించిన మాస్టర్ ప్లాన్ మేరకు మూసీపై డ్యాం, ఉస్మాన్‌సాగర్-హిమాయత్‌నగర్ రిజర్వాయర్లు నిర్మించారు. భారత్‌లో నగరాభివృద్ధి మండలి ఏర్పడిన తొలి నగరం హైదరాబాదే! హైకోర్ట్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా హాస్పిటల్, జాగిర్దార్ కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్‌లు మంచి రోడ్లతో నిర్మించారు. నగరం నవ వధువు!
7వ నిజాం హయాంలో పోలీస్ యాక్షన్ నేప థ్యంలో 13 సెప్టెంబర్ 1948న నగరం తల వంచు కుని లొంగిపోయింది. 1956 నవంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యింది. అప్పట్లో ఇళ్లకు అప్‌స్ట యిర్స్, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లూ లేవు! రుతువులు చక్రం లోని సువ్వల్లా ఒక రుతువునుంచి మరో రుతువు లోకి సున్నితంగా మారేవి. సాయంత్రపు సమా గాలు, ముషాయిరాలూ!
విషవాయువులు!
గల్ఫ్‌లో నూనెను కనుక్కోవడంతో హైదరాబాదీయు లకు ఉద్యోగ లేదా పని అవకాశాలు పెరిగాయి. అంకుల్‌శామ్ అతని కజిన్స్ ఇచ్చే డాలర్లకోసం ప్రతి కుటుంబమూ ఎవరో ఒకరిని గల్ఫ్‌కు పంపింది. ఈ దశ తర్వాత గ్లోబలైజేషన్-లిబరలైజేషన్‌లు నగరం పై ప్రభావం చూపిస్తున్నాయి. లోకంలో ఉత్పత్తి అయ్యే అన్నీ దొరుకుతున్నాయి. బైక్స్, కార్స్, మాల్స్, అపార్ట్‌మెంట్ హౌసెస్ పెరిగాయి. ప్రతి నెలా రోడ్లపై నాలుగువేల కొత్తకార్లు మృత్యువాయు వులను ప్రసరిస్తున్నాయి. విద్యుత్ అవసరాలు పెరు గుతూ కోతలు వచ్చాయి. నగరం మన జీవితాన్ని బాగుపరచే లక్షణాన్ని కోల్పోయింది. నగరాలు ఎందువల్ల మరణిస్తాయి? కొన్ని భగవద్ నిర్ణయం వలన మరికొన్ని మనిషి స్వయంకృతాల వల్ల! కొం డవీడు, హంపీ- విజయనగరం తదితర నగరాలు స్వయంకృత మరణాలకు ఉదాహరణలు! అరి స్టాటిల్ ప్రమాణాల ప్రకారం వర్తమాన దశ హైదరా బాద్ నగరపు శవయాత్ర! ఫ్యునరల్ మార్చ్! నా భావన తప్పు కావాలి! వాసయోగ్యంగా నగరం పునరుజ్జీవనం పొందాలి!
పున్నా కృష్ణమూర్తి