First Look
-
ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ . మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటివారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.కాగా ‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించినట్లు వెల్లడించి, ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు’ అని ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై ఉంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. -
మురారి వినోదం
శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 37వ సినిమా ఫస్ట్‌లుక్‌ను సంక్రాంతి శుభాకాంక్షలతో హీరోలు బాలకృష్ణ, రామ్‌చరణ్ కలిసి విడుదల చేశారు. ‘‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రీకరణ జరుగుతోంది. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియన్స్ ను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సహ–నిర్మాత: అజయ్ సుంకర. -
గూస్ బంప్స్ తెప్పించేలా ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ఫస్ట్ లుక్
అభినయ చతుర సతీష్ నీనాసం నటించిన ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. కన్నడ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ మూవీని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్స్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ నరహరి, జైష్ణవి, సతీష్ నీనాసం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దొండలే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయింది.ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. బ్యాక్ గ్రౌండ్లో వినిపించే ఆ పాట, బీజీఎం, హీరోని చూపించిన విధానం, ఆ రక్తపాతం చూస్తుంటే నెవ్వర్ బిఫోర్ అనే ఎక్స్ పీరియెన్స్ను ఇవ్వబోతోన్నట్టుగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టాకీ సీక్వెన్స్‌లు, పాటల్ని త్వరితగతిన షూట్ చేసేందుకు టీం రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లో సతీష్ నీనాసం బోల్డ్ అండ్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. కత్తులు పట్టుకుని ఊచకోత కోస్తున్న హీరో లుక్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.ఫిబ్రవరి 15న షూటింగ్‌ని పునఃప్రారంభించడానికి షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ది రైజ్ ఆఫ్ అశోక మూవీ సతీష్ నీనాసం కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవబోతోందని టీం ఎంతో నమ్మకంగా ఉంది. సతీష్ కెరీర్లో ఇదొక డిఫరెంట్ ప్రయోగం అని చెబుతున్నారు. ఈ సినిమాలో బి. సురేష్, అచ్యుత్ కుమార్, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే, సంపత్ మైత్రేయ, యశ్ శెట్టి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా లవిత్, ఆర్ట్ డైరెక్టర్‌గా వరదరాజ్ కామత్, సంగీత దర్శకుడిగా పూర్చంద్ర తేజస్వి SV పని చేస్తున్నారు. డా. రవివర్మ, విక్రమ్ మోర్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను మను షెడ్గర్ నిర్వర్తిస్తున్నారు. -
తెలుగు తెరపై మరో బోల్డ్ ‘ప్రేమికుడు’
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత టాలీవుడ్లో బోల్డ్ ప్రేమ కథలు ఎక్కువగా వస్తున్నాయి. హీరో పాత్రను బోల్డ్‌గా చూపిస్తూనే ఓ మంచి ప్రేమ కథను ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఆడియన్స్ కూడా అలాంటి కథలనే ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో రా అండ్ బోల్డ్ రొమాంటిక్ స్టోరీస్ ఎక్కువగా వస్తున్నాయి. యువతను టార్గెట్ చేసుకొని.. నేటి తరానికి, ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. (చదవండి: తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. ఆ భాషలో బాక్సాఫీస్ షేక్!)తాజాగా మరో బోల్డ్ లవ్‌స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే ‘ప్రేమికుడు’(Premikudu). రామ్ వెలుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పండు చిరుమామిళ్ల ప్రధాన పాత్రలో నటించారు. గురుదేవ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పండు చిరుమామిళ్ల(Pandu Chirumamilla) బోల్డ్ అండ్ ఇంటెన్స్ పాత్రను పోషించినట్టుగా ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమవుతుంది. "అన్ఫిల్టర్డ్" అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. పోస్టర్లో హీరో నేలపై నగ్నంగా పడుకుని ఉండటం, ఆ సిగరెట్, చేతికి సంకెళ్ళు, శరీరంపై రక్తపు మరకలు చూస్తోంటే అందరినీ మెస్మరైజ్ చేసేట్టుగా ఉన్నాయి.ఈ మూవీకి ఆదిత్య లొల్ల సినిమాటోగ్రాఫర్ కాగా, చీదెళ్ల నాగార్జున రచయితగా పని చేస్తున్నారు. ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. -
ఇట్స్ ఓకే గురు ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
చరణ్ సాయి, ఉషశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ఇట్స్ ఓకే గురు. సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటిస్తున్నాడు. మణికంఠ దర్శకత్వంలో వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ గురువారం నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్స్, కొన్ని విజువల్స్ చూశాక.. ఇట్స్ ఓకె గురు కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని అనిపిస్తోందన్నారు.దామోదర్ ప్రసాద్ గారు ఇచ్చిన కితాబు... తమ చిత్రంపై తమకు గల నమ్మకాన్ని రెట్టింపు చేసిందని నిర్మాత సురేష్ అనపురపు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో చరణ్ సాయి, హీరోయిన్ ఉష శ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానియాక్ పాల్గొన్నారు!! -
కొత్త సినిమాతో అనుష్క.. భయపెట్టేలా ఫస్ట్ లుక్
'బాహుబలి' తర్వాత అనుష్క సినిమాలు చేయడంలో పూర్తిగా నెమ్మదించింది. ఒకటి అరా మూవీస్ చేస్తూ వస్తోంది. గతేడాది సెప్టెంబరులో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఏమైపోయిందో, ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఈమె పుట్టినరోజు సందర్భంగా కొత్త మూవీ డీటైల్స్ బయటకొచ్చాయి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)'హరిహర వీరమల్లు' లేట్ అవుతూ వచ్చేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసిన డైరెక్టర్ క్రిష్.. అనుష్కని లీడ్ రోల్‌గా పెట్టి సినిమా తీస్తున్నాడు. దీనికే ఇప్పుడు 'ఘాటీ' టైటిల్ నిర్ణయించారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాధితురాలే క్రిమినల్ అయితే? అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.తల, చేతికి రక్తంతో చుట్ట తాగుతూ.. భయపెట్టేలా అనుష్క ఫస్ట్ లుక్ ఉంది. సాయంత్రం 4:05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఇది పాన్ ఇండియా మూవీనే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దీన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. బహుశా ఫిబ్రవరి లేదా మార్చిలో థియేట్రికల్ రిలీజ్ ఉండొచ్చేమో?(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
నిహారిక టాలీవుడ్ బంగారం..: డైరెక్టర్
వర్ధన్ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ట్రెండింగ్ లవ్. దొరకునా ఇటువంటి ప్రేమ అన్నది ట్యాగ్‌లైన్. హరీశ్ నాగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తన్వీ ప్రొడక్షన్స్, ఆర్‌డిజి ప్రొడక్షన్స్ పతాకాలపై సోనుగుప్తా, రూపేశ్ డి గోయల్ నిర్మిస్తున్నారు.‘ట్రెండింగ్ లవ్’ సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నటి, నిర్మాత కొణిదెల నిహారిక విడుదల చేసింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ‘ట్రెండింగ్ లవ్ దర్శకుడు హరీశ్‌తో నేను గతంలో యూట్యూబ్ కోసం చేసిన షార్ట్‌ఫిలింలో పనిచేశాను. ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుడు. మూవీలోని కొన్ని కట్స్ చూశాను. చాలా బాగున్నాయి. ఈ టీమ్ అందరికి చక్కని విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు హరీశ్ నాగరాజు మాట్లాడుతూ–‘‘ మా సినిమా ఫస్ట్‌లుక్‌ను మీరే రిలీజ్ చేయాలని ఒక్క మెసేజ్ పెట్టాను.. సరే అని మా టీమ్‌ని ఎంకరేజ్ చేయటానికి నిహారిక ముందుకొచ్చారు. నిహారిక వారి పింక్ ఎలిఫెంట్ సంస్థ టాలెంట్ ఉన్న ఎంతోమందికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అందుకే ఆమెను నేను టాలీవుడ్ బంగారం అంటుంటాను. మా సినిమాలో నటించిన నటులందరికి ఎంతో మంచి పేరు వస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.చదవండి: మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక.. -
'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్
సడన్ సర్ప్రైజ్ అన్నట్లు 'జై హనుమాన్' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆంజనేయుడు నడిచి వెళ్తుండటాన్ని వెనక వైపు నుంచి చూపించారు. 30న అంటే బుధవారం లుక్ బయటపెడతారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మరో క్రేజీ మూవీ.. ఇది 69 ఏళ్ల వృద్ధుడి కథ)ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్'.. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. చివర్లో సీక్వెల్ 'జై హనుమాన్' ఉంటుందని ప్రకటించారు. కానీ దానికి సంబంధించిన పనులేం జరిగినట్లు కనిపించలేదు. కానీ ఇప్పుడేమో ఫస్ట్ లుక్ అని చెప్పి షాకిచ్చారు.తొలి భాగంలో హనుమంతుడు పాత్రధారి ఎవరనేది రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా చూపిస్తారు. అయితే 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి.. హనుమంతుడిగా కనిపిస్తాడని అంటున్నారు. తొలి భాగాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించగా.. 'జై హనుమాన్'ని మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. పూర్తి వివరాలు రేపు తెలుస్తాయేమో?(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
పవర్ఫుల్ యాక్షన్
బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జాత్’ అనే టైటిల్ ఖరారైంది. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం (అక్టోబరు 19) సన్నీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘జాత్’ టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఇందు రెబెక్కా వర్గీస్‌గా...
ఇందు రెబెక్కా వర్గీస్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారు హీరోయిన్ సాయిపల్లవి. అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ ‘అమరన్’. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ బహు బాషా చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని హీరోయిన్ ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రను సాయిపల్లవి పోషిస్తున్నారు. శుక్రవారం సాయిపల్లవి పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా ‘అమరన్’ సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ప్రోడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ‘అమరన్’ అక్టోబరు 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. -
పవర్ఫుల్ విశ్వంభర
హీరో చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు ‘విశ్వంభర’ మూవీ మేకర్స్. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు. కునాల్ కపూర్ ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఫస్ట్ లుక్ చూస్తే చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని చేత పట్టుకుని పవర్‌ఫుల్‌గా కనిపించారు. చిరంజీవి లుక్, కొండ నుంచి ఉద్భవించిన ప్రకాశవంతమైన దైవిక శక్తి, ఉరుములు మెరుపులతో కూడిన ఈ ఫస్ట్ లుక్ అదుర్స్ అంటున్నారు మెగా అభిమానులు. ‘‘క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. తన అభిమాన హీరో చిరంజీవితో ‘విశ్వంభర’ను ప్రతిష్టాత్మక ్రపాజెక్ట్గా తీర్చిదిద్దుతున్నారు వశిష్ఠ. ఈ సినిమా కోసం ఓ ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించాం. అద్భుతమైన వీఎఫ్ఎక్స్, హై యాక్షన్, చక్కని డ్రామాతో విజువల్ వండర్‌గా ఈ మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. 2025 జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
రా అండ్ రస్టిక్‌గా 'జాతర' ఫస్ట్ లుక్
సతీష్ బాబు లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'జాతర'. రాధా కృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీయా రాజ్ హీరోయిన్. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్ని రిలీజ్ చేసి ప్రమోషన్ మొదలుపెట్టారు. ఈ పోస్టర్ చూస్తుంటే సతీష్ బాబు రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించారు. కత్తి పట్టుకుని ఉన్నారు.(ఇదీ చదవండి: చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?)ఇక అమ్మవారి ఫోటో, జాతరలో పూనకాలు వచ్చినట్టుగా గెటప్, లుక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. 'దేవుడు ఆడే జగన్నాటకంలో ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం' అని పోస్టర్ మీదున్న డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిత్తూరు జిల్లాలోని పాలేటి గంగమ్మ దేవత జాతర బ్యాక్ డ్రాప్‌తో సినిమా తీశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్.. ట్విస్టులు, క్లైమాక్స్ మాత్రం) -
ఆసక్తి రేపుతున్న ‘కళింగ’ ఫస్ట్ లుక్
‘కిరోసిన్’ ఫేమ్ ధృవ వాయు మరో కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళింగ’. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లెజెండరీ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.కళింగ అనే టైటిల్, ఫస్ట్ లుక్ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది. పోస్టర్లో హీరో, అతని వెనకాల లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్ర రూపంలో ఉన్న విగ్రహం, హీరో చేతిలోని ఆ కాగడ.. మొత్తం ఆ సెటప్‌ను చూస్తుంటే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండగా, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. -
'ప్రణయ గోదారి' మూవీ.. సాయి కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగులోని భిన్నమైన నటుల్లో సాయి కుమార్ ఒకరు. ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేశారు. ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రలో నటించారు. ఈయన లేటెస్ట్ మూవీ 'ప్రణయ గోదారి'. ఇందులో పెదకాపు అనే పవర్ఫుల్ పాత్ర పోషించారు. తాజాగా సాయికుమార్ ఫస్ట్ లుక్‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)ఈ సినిమాకు పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ మూవీతో అలీ కుటుంబానికి చెందిన సదన్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్. 'చూడగానే గంభీరంగా కనిపించే లుక్, మీసకట్టు, తెల్లని పంచె, లాల్చీతో, మెడలో రుద్రాక్షమాల, చేయికి కంకణం, చేతిలో సిగార్‌తో చాలా డిఫరెంట్‌గా సాయికుమార్ కనిపించారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) -
రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?
కన్నడ బ్యూటీ రష్మిక మరో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే కమర్షియల్ హీరోయిన్గా స్టార్ హోదా దక్కించుకుంది. 'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. గతేడాది వచ్చిన 'యానిమల్'తో నటిగా తానేంటో నిరూపించింది. ఇప్పుడు 'కుబేర'తో మరోసారి సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అయిపోయింది.(ఇదీ చదవండి: హీరో రాజ్ తరుణ్‌పై ప్రియురాలు సంచలన ఆరోపణలు..)శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైథలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీస్తున్నట్లు తెలుస్తోంది. ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లుగా కాగా నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు. ఇదివరకే ధనుష్, నాగ్ ఫస్ట్ లుక్ వీడియోస్ రిలీజ్ చేశారు. తాజాగా రష్మిక ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేశారు. ఇప్పటివరకు చేయని పాత్ర ఏదో రష్మిక చేసినట్లు అనిపిస్తుంది.ఈ వీడియోలో రష్మిక.. ఓ గునపం తీసుకుని పాతిపెట్టిన సూట్ కేసుని బయటకు తీస్తుంది. అందులో కోట్లాది రూపాయల డబ్బు చూసి మురిసిపోతుంది. దాన్ని తీసుకుని వెళ్లిపోతుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ) -
Marco First Look: టెర్రిఫిక్ లుక్ లో ఉన్ని ముకుందన్
‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మార్కో . మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ జానర్లో రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.2024లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్టైనర్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండగా.. ప్రేమమ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభిస్తోంది. రక్తపు మరకలతో సీరియస్ లుక్ లో కత్తి ని పట్టుకొని ఉన్ని ముకుందన్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో ఒక అంచనా కు వస్తున్నారు ప్రేక్షకులు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్ -
తుఫాను హెచ్చరిక.. ఫస్ట్‌లుక్ చూశారా?
అల్లు రామకృష్ణ, సుహానా ముద్వారి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తుఫాను హెచ్చరిక. జగదీష్ కె కె దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీ పాద క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కిషన్ అనాపు, రజనీకాంత్ ఎస్, సన్నీ బాన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ కె.కె. మాట్లాడుతూ, "ఈరోజు మా 'తుఫాను హెచ్చరిక' మొదటి పోస్టర్ విడుదల చేశాం. ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఒక అందమైన హిల్ స్టేషన్లో ఆహ్లాదంగా జీవించే అబ్బాయి జీవితంలో ఒక తుఫాను లాంటి విధ్వంసం జరిగితే, ఆ పరిస్థితులని ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా విజయం సాధించాడు? అనేదే కథ.ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాటిక్ విజన్‌కు మా నటీనటులు, టెక్నీషియన్స్ ప్రాణం పోశారు. ఆ ఆర్టిస్ట్స్ అందరు అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అద్భుతంగా నటించారు. లంబసింగి, చింతపల్లి వంటి ప్రదేశాల్లో సరైన విజువల్ కోసం ఏడాది కాలం ఓపికగా వేచి ఉండి సరైన అందాలను చిత్రీకరించాము. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. -
థ్రిల్లర్ మూవీలో హాట్ బ్యూటీ పాయల్.. ఫస్ట్ లుక్ చూశారా?
ఆర్ఎక్స్100, మంగళవారం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్.. సరికొత్తగా అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పోలీస్‌గా సందడి చేయనుంది. ఈ మేరకు పాయల్ నటిస్తున్న కొత్త మూవీకి 'రక్షణ' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ సినిమాలో పాయల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నాడు. త్వరలో విడుదల తేదీతో పాటు ఇతర వివరాల్ని వెల్లడించబోతున్నారు.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్) -
నోటు కథేంటి?
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. వర్షం కురుస్తుండగా గొడుగు పట్టుకుని నిల్చున్నారు నాగార్జున. ఆయన వెనకవైపు డబ్బు నోట్ల కట్టలు ఉన్న కంటైనర్ కనిపిస్తోంది. కాగా.. ఓ ఐదువందల రూపాయల నోటు కింద పడి ఉండటాన్ని చూసిన నాగార్జున తన పర్సులోంచి ఓ నోటుని తీసి, ఆ కంటైనర్‌లో పెడతారు. మరి.. ఆ నోటు వెనక కథేంటి అనేది సినిమాలో చూడాల్సిందే. ‘‘వైవిధ్యమైన కథాంశంతో ‘కుబేర’ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం బ్యాంకాక్‌లో నాగార్జున, ఇతర నటీనటులపై కొంత టాకీ, యాక్షన్ పార్ట్ చిత్రీకరించాం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. -
మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్.. అలాంటి కథతో!
సన్నీ లియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. తర్వాత తర్వాత నటిగా మారిపోయింది. ప్రత్యేక గీతాలు, పలు పాత్రల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈమె.. ఇప్పుడు తెలుగులో ఓ హారర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. (ఇదీ చదవండి: మెగాకోడలు క్యూట్‌నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!) సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతోన్న మూవీ 'మందిర'. సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాత. ఆర్.యువన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సన్నీ ఈ పోస్టర్లో భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగిలిన వివరాలు ప్రకటించనున్నారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) -
భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ.. క్రేజీ అప్డేట్!
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందించారు. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ పార్వతీ తిరువోతు బర్త్ డే సందర్భంగా తంగలాన్‌లో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే మహిళా రైతు క్యారెక్టర్లో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. తంగలాన్ సినిమాను త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చియాన్ విక్రమ్‌ను విభిన్నమైన క్యారెక్టర్లో దర్శకుడు పా.రంజిత్ చూపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా..తంగలాన్' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నాప్పటికీ కుదరలేదు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. Happy birthday # Gangamma, @parvatweets stay happy n blessed 💥💥💥#HBDParvathyThiruvothu#Thangalaan pic.twitter.com/nNWvFpihfv — pa.ranjith (@beemji) April 7, 2024 -
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. నేడు రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రష్మిక సింపుల్ మేకోవర్‌లో బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. "ది గర్ల్ ఫ్రెండ్" లో ఆమె కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉంది. ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే పుష్ప 2 చిత్రం నుంచి కూడా రష్మిక ఫస్ట్ లుక్ పోస్ట్ విడుదలైంది. అందులో ఆమె లుక్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండటంతో టీజర్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో రష్మిక నుంచి దాదాపు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. -
స్వీయ దర్శకత్వంలో మరో స్టార్ హీరో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్!
ఇటీవలే కెప్టెన్ మిల్లర్‌తో సూపర్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ధనుశ్ మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ధనుశ్-50 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ధనుశ్ కెరీర్లో 50వ సినిమాగా నిలవనుంది. తాజాగా రిలీజైన ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా కథను తానే రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు ధనుశ్. ఈ చిత్రంలో కెప్టెన్ మిల్లర్‌లో కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ఇదే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్లో 51వ చిత్రం. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. #D50 is #Raayan 🔥 🎬 Written & Directed by @dhanushkraja 🎵 Music by @arrahman Releasing in Tamil | Telugu | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/vfemOIRKIX — Sun Pictures (@sunpictures) February 19, 2024 -
రూత్‌లెస్...పవర్ఫుల్
రూత్‌లెస్..పవర్ఫుల్..అన్ఫర్గెటబుల్... ఇవన్నీ ఒకరి గురించే. అతనే ఉధిరన్. ‘కంగువ’ సినిమాలో బాబీ డియోల్ పాత్ర పేరు ‘ఉధిరన్’. జనవరి 27 బాబీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కంగువ’ సినిమాలో ఆయన పోషిస్తున్న ఉధిరన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్ ఇది. ఇందులో దిశా పటానీ హీరోయిన్గా, ఓ కీలక పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పదికి పైగా భాషల్లో, త్రీడీలోనూ విడుదల కానుంది. ‘‘ఉధిరన్‌గా యునిక్ మేకోవర్‌లో కనిపిస్తారు బాబీ డియోల్. యుద్ధానికి సిద్ధం అవుతున్న ఉధిరన్కు ఆయన ప్రజలు మద్దుతు తెలుపుతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాబీ డియోల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. -
గుర్తుపట్టలేనట్లుగా 'యానిమల్' విలన్.. ఆ సినిమా కోసమే ఇలా!
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమా 'కంగువ'. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ పీరియాడికల్ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. చారిత్రక నేపథ్య కథతో డైరెక్టర్ శివ తీస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో 'కంగువ' చిత్రాన్ని త్రీడీలోనూ రిలీజ్ చేయనున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) ఇకపోతే ఈ సినిమాలో ఉధిరన్ అనే శక్తివంతమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటిస్తున్నారు. శనివారం ఈ నటుడి పుట్టినరోజు సందర్భంగా 'కంగువ' నుంచి ఆయన క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'రూత్ లెస్, పవర్ ఫుల్, అన్ ఫర్ గెటబుల్' అనే క్యాప్షన్‌తో ఉధిరన్ పాత్రని పరిచయం చేశారు. ఈ పోస్టర్లో బాబీ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. యుద్ధానికి సిద్ధమవుతున్న ఉధిరన్కు ఆయన వర్గమంతా తమ మద్ధతు తెలుపుతున్నట్లు ఈ పోస్టర్లో చూపించారు. విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సీపీరియెన్స్ ఇచ్చేందుకు 'కంగువ' త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతోంది. రీసెంట్గా 'యానిమల్' మూవీలో క్లైమాక్స్‌లో కనిపించే విలన్‌గా చేసిన బాబీ.. ఇప్పుడు 'కంగువ'లో ఉధిరన్‌గా చేస్తున్నాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) Happy birthday #BobbyDeol brother.. Thank you for the warm friendship. It was awesome to see you transform in full glory as the mighty #Udhiran in our #Kanguva Guys watch out for him! @directorsiva @ThisIsDSP @vetrivisuals @StudioGreen2 pic.twitter.com/e3cPBkdMcS — Suriya Sivakumar (@Suriya_offl) January 27, 2024