Vicky The Rockstar Movie First Look And Motion Poster Out, Check Inside - Sakshi
Sakshi News home page

Vicky The Rockstar Movie First Look: ఆకట్టుకుంటున్న 'విక్కీ ది రాక్ స్టార్' ఫస్ట్ లుక్

Published Fri, Apr 22 2022 3:10 PM | Last Updated on Fri, Apr 22 2022 5:02 PM

Vicky The Rockstar Movie First Look And Motion Poster Out - Sakshi

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కితున్న చిత్రం ‘విక్కీ ది రాక్‌ స్టార్‌’. శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సీఎస్‌ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది.
చదవండి 👉: యశ్‌ నుంచి ప్రకాశ్‌ రాజ్‌ దాకా.. కేజీఎఫ్‌ 2 నటీనటుల పారితోషికం ఎంతంటే?

నేల పై సాగు చేసే రైతు ఆకాశం వైపుకి , ఆకాశమే హద్దు గా భావించే యువత నేల వైపుకి , ఒక వైపు నాగలితో రైతన్న, మరో వైపు గిటార్ తో విక్కి ది రాక్ స్టార్ , రైతు కాలికి ముద్దు పెడుతూ ఉన్న ఈ పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ‘నీ కాళ్ళకే ముద్దులె పెట్టనా ఫార్మర్ ’ అంటూ బాక్ గ్రాండ్ లో వస్తున్న లిరిక్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది.ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement