Motion Poster
-
‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!
‘ది రాజాసాబ్’ అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘ది రాజాసాబ్’. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని చేతిలో సిగార్ పటుకొని మహారాజులా కూర్చున్నాడు. మొత్తంగా ఈ సినిమాలో ప్రభాస్‌ని ఓ డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నట్లు మోషన్ పోస్టర్‌తో చెప్పేశాడు డైరెక్టర్ మారుతి. (చదవండి: ఒకే ఒక మాటతో ట్రెండింగ్‌లోకి వచ్చేసిన ‘స్పిరిట్’)ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
ఈశ్వర్ సినిమాలొ ప్రభాస్ ఫ్రెండ్, మూగవాడిగా నటించి తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు హను కోట్ల. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తగిన పాత్ర కోసం ఎదురుచూశారు.. ఇప్పుడు ‘ది డీల్’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం కాబోతున్నాడు. సిటడెల్ క్రెయేషన్, డిజిక్విస్ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరో, దర్శకుడు డాక్టర్ హను కోట్ల పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండు బాగాలు గా రాబోతున్న ఈ మూవీ మొదటి భాగం మొత్తం హైదరాబాద్ లో.. కొంత మలేషియాలో చిత్రికరించామని, మలి భాగాన్ని మొత్తం మలేషియలో షూటింగ్ చేసి చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నట్లు యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ చిత్రం మొదటి భాగం దసరాకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ లుగా చందన, ధరణి ప్రియా నటించగా రఘు కుంచె, రవి ప్రకాష్, మహేష్ పవన్, గిరి, వెంకట్ గోవాడ, శ్రీవాణి, సుజాత దిక్షిత్, సురభి లలిత ముఖ్య పాత్రలు పోషించారు. -
మంచి కంటెంట్ ఉంటే చాలు..ఇండస్ట్రీలో నిలబడొచ్చు: శివాజీ
విశ్వంత్, శిల్ప మంజునాథ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్. సహస్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బసిరెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ని సీనియర్ హీరో శివాజీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలు మరో ఫెంటాస్టిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని బలంగా నమ్మున్ననని అన్నారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఈమధ్య ఎక్కువగా వస్తుంది అని, ఇది చాలా మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒకప్పటిలా కాదు ఇప్పుడు అవకాశం అందుకోవడం చాలా సులభతరం అయిందని.. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీలో నిలబడొచ్చని నటుడు శివాజీ పేర్కొన్నారు. ‘ ఈ చిత్రం నుంచి ఎలాంటి కంటెంట్ వచ్చిన అది కచ్చితంగా బ్లాస్ట్ అయ్యేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరిని రంజింప చేస్తుందని ప్రామిస్ చేస్తున్నాను’అని డైరెక్టర్ బసిరెడ్డి రానా అన్నారు. -
'యావరేజ్ స్టూడెంట్ నాని' మోషన్ పోస్టర్ రిలీజ్
దర్శకులు హీరోలుగా, హీరోలు దర్శకులుగా మారి సక్సెస్ అందుకొంటున్నారు. 'మెరిసే మెరిసే' మూవీతో పవన్ కుమార్ కొత్తూరి దర్శకుడిగా మెప్పించాడు. ఇప్పుడు ఇతడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు. 'యావరేజ్ స్టూడెంట్ నాని' అనే చిత్రంతో హీరో, దర్శకుడు, నిర్మాతగా పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గ్రాండ్ ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)యూత్‌ఫుల్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదివరకే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. శక్తి శ్రీ గోపాలన్ పాడిన పాట బ్యాక్ గ్రౌండ్లో వినిపిస్తుంటే, హీరోహీరోయిన్ల జోడి ఎంతో చూడముచ్చటగా అనిపించింది. ఈ సినిమాలో సాహిబా భాసిన్, స్నేహ మాల్వియ, వివియా సంత్లు హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ బి కొడకండ్ల సంగీతమందించారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: మిడిల్ క్లాస్ కష్టాలతో 'మ్యూజిక్ షాప్ మూర్తి' ట్రైలర్) View this post on Instagram A post shared by Sri Neelakanta Mahadeva Entertainments LLP (@snmmovies) -
‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేస్తోంది!
‘డీజే టిల్లు’ వంటి హిట్ మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. బుధవారం (ఫిబ్రవరి 7) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సిద్ధు నటిస్తున్న రెండు చిత్రాల (టిల్లు స్క్వేర్, జాక్) అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాక్’ అనే టైటిల్ ఖరారు చేసి, మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్‌లైన్. ‘‘ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. త్వరలో ట్రైలర్: ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది యూనిట్. ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ కానుంది. మార్చి 29న సినిమా రిలీజవుతోంది. -
ఆ కిక్కే వేరు రా!
‘‘నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నానంటే, దానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ అక్కర్లేదు రా..! నేను చాలు..! ట్వంటీఫోర్ హవర్స్ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది.. నాది అని చెప్పుకోవడానికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే.. ప్చ్.. ఆ కిక్కే వేరు రా..!’’ అనే డైలాగ్స్‌తో కూడిన వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా మోషన్ పోస్టర్. హీరోయిన్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మించనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ ప్రపంచం ప్రేమకథలతో నిండిపోయి ఉంది. కానీ ఈ ప్రేమ కథల్లో ఇప్పటివరకు ఎవరూ వినని, చూడనవి కూడా ఉన్నాయి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం అలాంటిదే’’ అని ట్వీట్ చేశారు రష్మికా మందన్నా. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
'షరతులు వర్తిస్తాయి' లాంటి సినిమాలను ఆదరించాలి: త్రివిక్రమ్
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ...మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయని.. కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయని.. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి తెలిపారు. కుటుంబ విలువలను తెలియజేసే ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని కోరారు. మంచి కథతో ముందుకు వచ్చిన దర్శకుడు కుమార స్వామి (అక్షర) అలాగే చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలలో ఉంటున్న సమస్యను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు’అని అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ. ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా తీశాం. ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు కుమార స్వామి అన్నారు. -
ఆదిపురుష్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మోషన్ పోస్టర్ రిలీజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు మేకర్స్. అక్షయ తృతీయ సందర్భంగా ఆదిపురుష్ టీమ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. జై శ్రీరామ్ అంటూ సాగే లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'మా బలమేదంటే మీ పై నమ్మకమే.. తలపున నువ్వుంటే సకలం మంగళమే... మహిమాన్విత మంత్రం నీ నామమే.' అంటూ సాగింది. చివర్లో జై శ్రీరామ్ నామస్మరణతో హోరెత్తించింది. హిందీ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ మోషన్ పోస్టర్లను ప్రభాస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మీరు ఛార్ ధామ్ దర్శించుకోలేదా.. అయితే జై శ్రీరామ్ నామాన్ని జపించండి చాలు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. గతంలో ఈ సినిమా టీజర్‌ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. -
వినోదం.. సందేశం
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వంలో ఎమ్. నాగ మునెయ్య నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘‘ఓ బర్నింగ్ ప్రాబ్లమ్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ఇది. వినోదంతో పాటు సందేశం కూడా ఉంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, సహనిర్మాతలు: కొండ్రాసి ఉపేందర్ – నందిపాటి శ్రీధర్ రెడ్డి. -
‘మెకానిక్’ మంచి విజయం సాధించాలి: దిల్ రాజు
‘మెకానిక్’ చిత్రం మంచి విజయం సాధించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. మణిసాయితేజ, రేఖనిరోషా హీరోహీరోయిన్ల్‌గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్‌లైన్. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగ మునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ని దిల్ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా ‘మెకానిక్’ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేసిన దిల్ రాజుకు దర్శకనిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంకంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది.తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. -
దిల్ రాజు చేతుల మీదుగా ‘మెకానిక్’ మోషన్ పోస్టర్!
మణిసాయితేజ, రేఖనిరోషా హీరోహీరోయిన్ల్‌గా నటిస్తున్న చిత్రం ‘మెకానిక్’. ట్రబుల్ షూటర్ అన్నది ట్యాగ్‌లైన్. టీనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగమునెయ్య) - కొండ్రాసి ఉపేందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుపుకుంటున్న ఈచిత్రం మోషన్ పోస్టర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు. -
కృష్ణగాడి లవ్‌స్టోరీ
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. రాజేష్ దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమాను పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్ కే శ్రీలత నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేసి, ఆసక్తికరంగా ఉందన్నారు. ‘‘ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సాబు వర్గీస్ సంగీతం, ఎస్కే రఫి కెమెరా వర్క్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: చుంచు భాను ప్రకాష్, హరిహర ప్రసాద్ పెట్లా. -
విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఓ సాథియా మోషన్ పోస్టర్
ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ తెలుగు మూవీ ఓ సాథియా. ఈ సినిమా నిర్మాత, డైరెక్టర్ మహిళలు కావటం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్‌పై చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. జి జాంబీ అనే చిత్రంతో ఇప్పటికే హీరో పరిచయం అయిన ఆర్యన్ గౌర్‌కు ఇది రెండవ సినిమా. ఇటీవల ఈ మూవీ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ లెజెండరి రైటర్, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు యూట్యూబ్‌లో మంచి స్పందన అభిస్తోంది. మోషన్ పోస్టర్ వన్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ప్యూర్ లవ్‌స్టోరీగా రాబోతున్న ఈ సినిమాకు విన్ను సంగీతం అందించారు. ఈ మోషన్ పోస్టర్‌కు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ నుంచి రెండోపోస్టర్ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. It's 1Million + Views for our First look Motion poster..Thanks for the immense response #osaathiya #motionposter@AryanGowra @IMishtii pic.twitter.com/uVahXwzYCK — Thanvika Jashwika Creations (@tjcreations123) January 9, 2023 -
హెబ్బా పటేల్ 'అలా నిన్ను చేరి' మోషన్ పోస్టర్ వచ్చేసింది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అలా నిన్ను చేరి. హుషారు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో దినేష్ తేజ్ మరోసారి ఈ విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా షురూ చేసి నూతన సంవత్సర కానుకగా అలా నిన్ను చేరి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టైటిల్ లోగో పోస్టర్ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఓ పక్క పల్లెటూరు, మరోపక్క మెట్రో సిటీ.. ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ హీరోని బ్యాక్ నుంచి చూపించారు. పోస్టర్ చూస్తుంటే పల్లెటూరు నుంచి కెరీర్ కోసం సిటీకి చేరిన కుర్రాడు.. అమ్మాయి ప్రేమలో పడి తన జర్నీ ఎలా సాగించాడనేదే సినిమా కథ అని తెలుస్తోంది. ‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనంద్ అందిస్తుండగా.. ఆండ్రూ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా విఠల్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు. చదవండి: ఎయిట్ ప్యాక్‌తో దర్శనమిచ్చిన హృతిక్ రోషన్, ఫోటోలు వైరల్ సంపూర్ణేశ్‌కు రూ.25 లక్షలు ఫైన్, తారక్ ఏం చేశారంటే? -
బిగ్‌బాస్ ఫేం సన్ని, సప్తగిరి హీరోలుగా ‘అన్‌స్టాపబుల్’
బిగ్‌బాస్ సీజన్ 5 విజేత వీజే సన్నీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం అన్‌స్టాపబుల్. ‘అన్ లిమిటెడ్ ఫన్’ అనేది ఉపశీర్షిక. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కమెడియన్ సప్తగిరి మరో హీరోగా నటిస్తుండగా.. నక్షత్ర, అక్సా ఖాన్ హీరోయిన్ల. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను శనివారం నిర్మాత దిల్‌రాజు విడుదలచేశాడు. రజిత్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్ బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కుటుంబంతో సహా నవ్వుకునే చిత్రమిది’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘సినిమాలపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను’’ అన్నారు రజిత్ రావు. ఈ సినిమాకు షేక్ రఫీ, బిట్టు(నర్సయ్య న్యవనంది) సహా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. -
ప్రియమణి 'డాక్టర్ 56' మోషన్ పోస్టర్ రిలీజ్
ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం డాక్టర్ 56. రాజేష్ ఆనందలీల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇక తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వదిలారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీని డిసెంబర్ 9న విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. చదవండి: హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి ఈ సందర్భంగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ అలా సస్పెన్స్‌గా వదిలేశారు. మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. చిత్రానికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు. -
'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?'.. ఆసక్తికరంగా కొరమీను టైటిల్ పోస్టర్
ఆనంద్ రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కొరమీను'. ఈ సినిమాకు శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో హీరో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టైటిల్ కూడా వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' అంటూ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఆ పోస్టర్ విడుదల చేశారు. ఆనంద్ రవి ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా ఓ బోట్ మీద ఆ లైన్స్ కనిపించాయి. 'కోరమీను' ఫస్ట్ లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తే సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథగా తెలుస్తోంది. సముద్ర తీరంలో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ ఆసక్తి కలిగించేలా ఉంది. ఒక బోట్ పై 'మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?' క్యాప్షన్ కూడా రాసి ఉంది. దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. 'ఈ మూవీలో జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో కథ సాగుతుంది. ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది' అని అన్నారు. కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
జ్వాలాబాయిగా మమతా మోహన్ దాస్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
ఎం.ఎల్.ఏ, రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా 'రుద్రంగి'. రాజన్న, బాహుబలి, బాహుబలి2, ఆర్. ఆర్.ఆర్, అఖండ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు లుక్ కు మంచి స్పందన వస్తోంది. ఆయన ఈ చిత్రంలో 'భీమ్ రావ్ దొర' గా కనిపించనున్నారు. ఇక తాజాగా 'రుద్రంగి' సినిమా నుంచి మమతా మోహన్ దాస్ నటిస్తున్న జ్వాలాబాయి దొరసాని పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు.ఈ మోషన్ పోస్టర్ లో జ్వాలాబాయి దొరసాని పాత్రలో మమతా మోహన్ దాస్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'నువ్వు దొర అయితే నేను దొరసానిని తగలబెడతా, ఛల్ హట్' అంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ మాస్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులు కీలకపాత్రల్లో కనిపించన్నునారు. సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. -
నందమూరి తారకరత్న 'సారథి' మోషన్ పోస్టర్ విడుదల
నందమూరి తారకరత్న హీరోగా నటించిన తాజా చిత్రం సారథి. జాకట రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైశాలి హీరోయిన్గా నటించారు. పంచభూత క్రియేషన్స్‌పై పి. నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి. సిద్ధేశ్వర్ రావు నిర్మించిన ఈ మూవీ మోషనల్ పోస్టర్ని విడుదల చేశారు. దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఖోఖో గేమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఆలోచన అందరిలో రేకెత్తించేలా మా సినిమా ఉంటుంది. కరోనా మహమ్మారిలో ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమాను పూర్తి చేసినందుకు తారకరత్నికి ధన్యవాదాలు. సిద్ధార్థ్ వాటికన్ సంగీతం అలరిస్తుంది' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మనోహర్ కొల్లి. -
‘రుద్రంగి’ ఫస్ట్‌లుక్, భీమ్రావ్ దొరగా జగపతిబాబు
జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్‌గా చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మించారు. ‘రుద్రంగి’ ఫస్ట్‌లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘రుద్రంగి నాది.. రుద్రంగి బిలాంగ్స్ టు మీ’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ వినిపిస్తుంది. జాలి, దయ లేని భీమ్ రావ్ దొరగా జగపతిబాబుని పరిచయం చేశారు. ‘‘త్వరలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి నాఫల్ రాజా సంగీతం అందిస్తున్నారు. first innings chusaru, second innings chusaru, third innnings chudabothunaru.. mee #BheemRaoDhora from #Rudrangi movie. pic.twitter.com/NWdYfmbWjR — Jaggu Bhai (@IamJagguBhai) October 3, 2022 -
సమంత 'శాకుంతలం' నుంచి క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ అప్పుడే
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో డిఆర్పి, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పౌరణిక నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శాకుంతలగా సమంతగా నటిస్తుండగా, దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. నవంబర్4న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. -
టీజర్ చూస్తే బ్లాస్టింగ్
‘‘వేద’ చిత్రం మోషన్ పోస్టర్ చాలా బాగుంది. టీజర్ చూస్తే బ్లాస్టింగ్. ఆ ఏడు కొండలులాగా ఈ సినిమాకు ఏడుగురు నిర్మాతలు ఉన్నారు.. ఇక్కడే వీరు సక్సెస్ అయ్యారు. ఈ సినిమా హిట్ కావాలి’’ అని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వేద’. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, శ్రీనివాస్ లావూరి, రాజేంద్రకనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని(అమెరికా) నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని సుకుమార్ విడుదల చేయగా, రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ‘‘సైకో రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి. ‘‘సమాజానికి ఉపయోగపడే ప్రయోగాత్మక చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. -
ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ ఫస్ట్‌లుక్, 3D మోషన్ పోస్టర్ విడుదల
యంగ్ హరో ఆది సాయికుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాప్ గేర్. ఇటీవలె విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి మరో అప్డేట్ను అందించి చిత్ర బృందం. ఈ చిత్రంలో ఆది సరికొత్త పాయింట్‌తో అలరించబోతున్నాడని తెలుస్తోంది ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే. ఇకపోతే ఈ మోషన్ పోస్టర్ సరికొత్తగా 3డీలో రిలీజ్ చేశారు మేకర్స్. కాగా శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పొందుతోంది. ఇందులో ఆది సరసన రియా సుమన్ నటిస్తోంది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
రవితేజ చేతుల మీదుగా 'అధర్వ' మోషన్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ చేతులు మీదుగా ఈ సినిమా తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్.. అంటూ హీరో చెబుతున్న డైలాగ్స్ ఈ మోషన్ పోస్టర్ లో హైలైట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది.ఈ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. -
1770: రాజమౌళి శిష్యుడి డైరెక్షన్లో పాన్ ఇండియా చిత్రం
ఇండియన్ సినిమా వైవిధ్య కథా చిత్రాల కోసం తపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా చారిత్రక, జానపద, పౌరాణిక, ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుందా అని అనిపిస్తుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు ఘన విజయాలు దీనికి కారణం కావచ్చు. అలాంటి చారిత్రక ఇతివృత్తంతో 1770 అనే పాన్ ఇండియా చిత్రానికి బీజం పడింది. దీనికి రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించబోతున్నారు. ప్రఖ్యాత రచయిత బకించంద్ర చటర్జీ రాసిన అనందమత్ నవల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రానికి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, కథనాలను అందిస్తున్నారు. దీనిని నిర్మాతలు శైలేంద్ర కువర్, సుజాయ్ కుట్టి, పి.కృష్ణకుమార్, సరజ్ శర్మ కలిసి ఎస్ఎస్ 1 ఎంటర్టైన్మెంట్, పీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. కాగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి 150 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ధ్వనిస్తున్న వందేమాతరం గీతంతో కూడిన టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ మొదలగు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. నవరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర దర్శకుడు అశ్విన్, గంగరాజు తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రవన ముఖ్య ప్రకటనను వెల్లడించనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ చిత్రంలో నటించే తారాగణం, సాంకేతిక వర్గం దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర దర్శకుడు అశ్విన్, గంగరాజు తన యూనిట్ సభ్యులతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.