
యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు.
విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ చేతులు మీదుగా ఈ సినిమా తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్.. అంటూ హీరో చెబుతున్న డైలాగ్స్ ఈ మోషన్ పోస్టర్ లో హైలైట్ అయ్యాయి.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది.ఈ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment