నంద కిశోర్, శ్రీకాంత్, సిరి
‘‘నరసింహపురం’ టైటిల్, మోషన్ పోస్టర్ బాగున్నాయి. నేపథ్య సంగీతం అదిరిపోయింది. నా మిత్రుడు నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు శ్రీకాంత్. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నంద కిశోర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నరసింహపురం’. సిరి హనుమంతు హీరోయిన్‌గా నటిస్తుండగా, వర్థమాన నటి ఉష హీరో చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.
శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాల నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ని శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు శ్రీరాజ్ బళ్ళా. ‘‘వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది’’ అన్నారు నందకిశోర్. ఈ కార్యక్రమంలో సిరి హనుమంతు, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్, విజువల్ ఎఫెక్ట్స్ చందు ఆది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment