nanda kishore
-
ప్రజా సేవలో..
నంద కిశోర్, రోజా హీరో హీరోయిన్లుగా దుర్గా దేవ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రవీణ్ ఐపీఎస్’. ‘ఇక ప్రజా సేవలో..’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు, నిర్మాత వివేక్ కూచిభొట్ల రిలీజ్ చేశారు. ‘‘విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రవీణ్గారిలా వెండితెరపై కనిపించేందుకు ప్రయత్నం చేశాను’’ అన్నారు నంద కిశోర్. ‘‘ఇది నా తొలి చిత్రం’’ అన్నారు దుర్గా దేవ్. -
ఐపీఎస్ అధికారి బయోపిక్.. ఆ రోజే రిలీజ్!
నంద కిషోర్ హీరోగా నటించిన చిత్రం ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో). ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఐరా ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై మామిడాల నీల నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న రిలీజ్ కానుంది. శనివారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల ప్రవీణ్ IPS ట్రైలర్ విడుదల చేశారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. అలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలిస్తుందన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని, ఆదర్శం (ఐడియలిజం) అనేది జన హృదయాలను తాకుతుందన్నారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా అనేక విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారని అన్నారు. పూర్ణ మలావతి, ఆనంద్ లతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహింపజేశారని గుర్తు చేశారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది నా తొలి చిత్రం డైరెక్టర్ దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ... ఇది నా తొలి చిత్రం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవితాన్ని మూడు పార్టులుగా తీయాలి. కానీ సెలెక్టివ్ అంశాలను తీసుకొని ప్రవీణ్ IPS మూవీ తీశాం. ఆయన నాకు ఇన్స్పిరేషన్. వివేక్ కూచిభోట్ల గారు లేకపోతే నాకు ఈ సినిమా అవకాశం వచ్చేది కాదని చెప్పారు. తనకు అన్ని విషయాల్లో అండగా నిలిచినందుకు వివేక్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కష్టాలు పడ్డారు ASKES ఫౌండేషన్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో కష్టాలను భరించి ఐపీఎస్ అధికారిగా ఎన్నో సేవలు చేశారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా పేద పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ IPS మూవీ హిట్ కావాలని ఆకాంక్షించారు. చదవండి: రెండేళ్లుగా అదే తెలుసుకున్నా.. ఒంటరితనమే బాగుంది! -
ఆ సినిమా డిజాస్టర్.. ఇప్పటికీ వడ్డీలు కడుతున్నా: టాలీవుడ్ నటుడు
టాలీవుడ్లో బుల్లితెర అభిమానులకు గుర్తుండిపోయే పేరు నందకిశోర్. 2001లో మా టీవీలో ప్రసారమైన అత్తగారు కొత్త కోడలు అనే సీరియల్లో కానిస్టేబుల్‌గా నటించే బుల్లితెరపై తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత వెలుగు నీడలు అనే సీరియల్లో విలన్‌గా నటించారు. ఆ తర్వాత బుల్లితెరపై సూర్యవంశం సీరియల్లో ఆఫర్ వచ్చింది. అంతే కాకుండా జెమినీ టీవీలో ప్రసారమైన స్రవంతి సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ ద్వారా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నంద కిశోర్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. స్రవంతి నుంచి శుభలేఖ, మంచుపల్లకి, శ్రీమతి కళ్యాణం, రామాసీత, రామసక్కని సీత.. ఇలా వరుస సీరియల్స్‌లో నటించారు. టీవీలో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ చేశారు. నితిన్ మూవీ ద్రోణలోనూ మంచి రోల్ చేశారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అయితే ప్రేమ వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఉప్పెన సీరియల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా స్రవంతి పార్ట్-2 స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. నంద కిశోర్ సీరియల్స్‌లో పాటు సినిమాల్లోనూ చేస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన నంద కిశోర్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సొంతంగా సినిమా తీశాక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా యాంకర్ సిరి హనుమంతుతో గొడవపై కూడా స్పందించారు. ఇంతకీ ఆ వివరాలేంటో చూద్దాం. బుల్లితెరపై పలు సీరియల్స్‌లో సందడి చేసిన ఈ నటుడు 'నరసింహపురం' సినిమా చేశాడు. 2021 జూలైలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో సిరి హనుమంతు హీరోయిన్గా నటించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే సినిమా కొవిడ్ టైంలో రిలీజ్ కావడంతో ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కలేదని నందకిశోర్ అన్నారు. అయితే ఈ మూవీ ఓ అనుభవాన్ని మిగిల్చిందని తెలిపారు. దాదాపు రూ.కోటి రూపాయల వరకు అప్పులైనట్లు పేర్కొన్నారు. ఆ సినిమా డిజాస్టర్.. ఎందుకంటే? నందకిశోర్ మాట్లాడుతూ.. 'టీవీ ఇండస్ట్రీలో సక్సెస్‌పుల్ అంటే యాంకర్స్ మాత్రమే. టెలివిజన్‌లో చేయాలంటే మనం కొన్ని రోజులు కేటాయించాలి. నరసింహపురం సినిమా విషయంలో పొరపాటు జరిగింది. అయితే నేను సినిమా విషయంలో ఫుల్‌గా ప్రిపేర్ అవ్వలేదు. అందువల్లే కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే. ఎవరీ సపోర్ట్ లేకుండా మేము సినిమా తీశాం. మాకు మూడేళ్లు పట్టింది. కరోనా సెకండ్‌వేవ్ కావడంతో ప్రేక్షకులు పెద్దగా చూడలేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. నా సొంత సంపాదన, అప్పులు తెచ్చి సినిమా తీశా. నాకున్న ప్యాషన్‌తో ఏదో చేయాలనిపించింది. ఆ సినిమా కోసం ఒరిజినల్‌గా గుండు కూడా కొట్టించుకున్నా. కానీ అది డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ సినిమా అప్పులకు వడ్డీలు కడుతున్నా.' అని తెలిపారు. సిరి హనుమంతుతో గొడవ.. సిరితో గొడవపై మాట్లాడుతూ.. 'నేను సిరిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ కొన్ని ఛానెల్స్ వేరేగా రాసి ఉండొచ్చు, తాను చాలా బాగా చేసింది. సిరికి మంచి టాలెంట్ ఉంది. అయితే మేము ఆమె అనుకున్నంత డబ్బులు ఇవ్వలేకపోయాం. సిరి అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది. చాలా మంచి అమ్మాయి.. మంచి యాక్టర్ కూడా' అని అన్నారు. కాగా.. నరసింహపురం సినిమాలో యాంకర్, వైజాగ్ అమ్మాయి సిరి హనుమంతు హీరోయిన్గా నటించింది. అయితే ఆమె మూవీ ప్రమోషన్స్‌కు పిలిచినప్పుడు తాను రాలేదు.. అంతే తప్ప ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవని అని నందకిశోర్ తెలిపారు. -
నాన్నా.. నేనేం పాపం చేశాను!
అయిజ: భార్యపై అనుమానంతో రెండేళ్ల కుమా రుడిని పొట్టనపెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. వివరా లిలా.. అయిజ పట్టణంలో నివాసముంటున్న భార్గవకు నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన శ్రావణితో 2019లో వివాహమైంది. వీరికి కుమార్తె నయనిక, కుమారుడు నందకిశోర్(2) ఉన్నారు. కొంతకాలంగా భార్యను అనుమా నిస్తూ భార్గవ తరుచూ గొడవ పడుతున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో పదిరోజుల క్రితం కుమార్తె, కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లేందుకు శ్రావణి ప్రయత్నించగా.. అడ్డు కున్న భార్గవ.. కుమారుడు నందకిషోర్‌ను లాక్కున్నాడు. దీంతో ఆమె కూతురు నయనికను తీసుకొని వెళ్లిపోయింది. నందకిషోర్ ప్రతిరోజూ అమ్మ కావాలని ఏడుస్తుండడంతో.. భరించలేక పసివాడికి నిద్రమాత్రలు వేసి పడుకోబెట్టాడు. పదిరోజులుగా భార్య లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన భార్గవ వారం క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన అతని తల్లి వడ్లకుమారి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. దీంతో కోలుకున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి తర్వాత మరోసారి భార్గవ రెండేళ్ల తన కుమా రుడు నందకిషోర్‌కు ఎలుకల మందు తాగించి, తానూ తాగాడు. గురువారం ఉదయం తల్లి కుమారి నిద్ర లేచేసరికే కొడుకు, మనవడు అపస్మారక స్థితిలో ఉండడం గమనించి.. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం భార్గవ గద్వాల జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నా.. పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. శాంతినగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’
సింగరాయకొండ/ఆత్మకూరు రూరల్(నంద్యాల) : జగనన్న సురక్ష క్యాంపులు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. ఇటీవల ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ ప్రాణాలు కాపాడగా, తాజాగా ఓ మహిళ గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు గుర్తించి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒంగోలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ వైకే నందకిషోర్ రోజూ నెల్లూరు నుంచి ఒంగోలుకు ఉద్యోగం నిమిత్తం వస్తుంటారు. ఈ నెల 5న రైల్లో వస్తుండగా కావలి దాటగానే స్వల్పంగా గుండెనొప్పి వచ్చింది. మొదట గ్యాస్ సమస్య అని మందులు వేసుకున్నా.. నొప్పి తగ్గకపోవడంతో వెంటనే తనకు రైల్లో పరిచయం ఉన్న సింగరాయకొండ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఉజ్వలకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఉజ్వల.. సింగరాయకొండ గ్రామ సచివాలయం–2 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం మెడికల్ క్యాంపు జరుగుతోందని, కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేశ్వరరావు క్యాంపులో ఉన్నారని.. సింగరాయకొండలో దిగాలంటూ స్టేషన్‌కు 108ను పంపించి సురక్ష క్యాంపునకు తీసుకొచ్చారు. అనంతరం డాక్టర్ ఉజ్వల, డాక్టర్ వంశీధర్‌లు ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించి.. రిపోర్టును పరిశీలించిన డాక్టర్ వెంకటేశ్వరరావు.. రిజిస్ట్రార్ కు గుండె నొప్పి వచ్చిందని నిర్ధారించి వెంటనే ప్రథమ చికిత్స చేయించి తర్వాత ఒంగోలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కిమ్స్‌లోని డాక్టర్లు రిజిస్ట్రార్ నందకిషోర్‌కు యాంజియోగ్రామ్ పరీక్ష చేసి రెండు వాల్వస్ దెబ్బతిన్నాయని గుర్తించి.. వెంటనే స్టంట్ వేసి చికిత్స చేశారు. సకాలంలో అక్కడకు రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయని కిమ్స్ డాక్టర్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందించి తన భర్త ప్రాణాలు కాపాడారని అతని భార్య విజయలక్ష్మి.. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ఉన్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీధర్ మాట్లాడుతూ సోమవారం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జగనన్న సురక్ష కా>్యంపులో 35 మందికి ఈసీజీ పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి గుండె సమస్యలున్నట్టు తేలిందని చెప్పారు. ఓ మహిళను కాపాడిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా ఆత్మకూరు శ్రీపతిరావుపేటలో సోమవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ మహిళను కాపాడింది. జయలక్ష్మీదేవి కొద్దిగా ఆయాసం ఉందంటూ గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చింది. వైద్యులు ఆమెకు గుండె పరీక్షలు చేసి గుండె సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. అప్పటికప్పుడు ప్రాథమిక వైద్యం చేసి హుటాహుటిన అక్కడే ఉన్న అంబులెన్స్‌లో కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. -
రాష్ట్రంలో మరో 54 రైతు బజార్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో కొత్తగా మరిన్ని రైతు బజార్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రూ.41.09 కోట్ల వ్యయంతో ఒకేసారి 54 కొత్త రైతు బజార్లను నెలకొల్పుతోంది. వీటిలో ఇప్పటికే 15 రైతు బజార్లు అందుబాటులోకి రాగా.. మరో 3 రైతు బజార్లు ఈ నెల 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులతో పాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రైతుబజార్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన సమయానికి ఏపీలో 87 రైతు బజార్లు ఉండేవి. కొత్త రైతు బజార్ల ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ స్థలాల కొరత, నిధుల లేమి సాకుతో గత టీడీపీ ప్రభుత్వం వాటి జోలికి పోలేదు. ఉన్న రైతు బజార్లలోనూ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఫలితంగా రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుబజార్ల ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. కాకినాడ జిల్లాలో 10, తూర్పు గోదావరి జిల్లాలో 4, విజయనగరం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో 3 చొప్పున, విశాఖపట్నం, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో 2 చొప్పున, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, బాపట్ల, తిరుపతి, నంద్యాల, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మిస్తారు. వీటిలో 11 టెండర్ల దశలో ఉండగా, 7 బేస్మెంట్ దÔèæ, 8 రూఫ్‌స్థాయి, 5 సీలింగ్ స్థాయిల్లో ఉండగా, మరో ఐదుచోట్ల టెండర్లు పిలవాల్సి ఉంది. నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన నాడు–నేడు కింద రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, వైఎస్సార్ జిల్లాల్లోని మొత్తం రైతుబజార్లను ఆధునికీకరిస్తున్నారు. శిథిలమైన షెడ్ల పునర్నిర్మాణంతో పాటు ఆర్వో ప్లాంట్స్, విద్యుత్, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పార్కింగ్, హోర్డింగ్స్, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో స్వయం సంవృద్ధి సాధించే దిశగా రైతుబజార్లను తీర్చిదిద్దుతున్నారు. ఒకేసారి 54 రైతు బజార్ల నిర్మాణం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 54 కొత్త రైతుబజార్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిలో 15 రైతుబజార్ల సేవలు అందుబాటులోకి రాగా.. మరో 3 రైతుబజార్లను ఈ నెల 15న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాం. మిగిలిన వాటిని దశల వారీగా ప్రారంభిస్తాం. – ముల్లంగి నందకిషోర్, సీఈవో, రైతుబజార్లు -
సిరి హన్మంత్‌కు హీరోయిన్ ఛాన్స్ ఇస్తే అంత పని చేసింది!
Bigg Boss 5 Telugu, Siri Hanmanth: టాలీవుడ్ దర్శకనిర్మాతలు తెలుగమ్మాయిలకు అవకాశాలివ్వరు, పొరుగు రాష్ట్రాల నుంచే హీరోయిన్లను దిగుమతి చేసుకుంటారని ఇప్పటికీ విమర్శలు వినబడుతూనే ఉంటాయి. అయితే తెలుగు అమ్మాయిలను హీరోయిన్గా తీసుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయట! తన సినిమా విషయంలో ఇదే జరిగిందంటున్నాడు నటుడు నంద కిషోర్. బుల్లితెరపై పలు సీరియల్స్‌లో సందడి చేసిన ఈ నటుడు 'నరసింహపురం' సినిమా చేశాడు. ఈ ఏడాది జూలైలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇందులో హీరోయిన్గా నటించిన సిరి హన్మంత్‌పై ఆ మధ్య షాకింగ్ కామెంట్స్ చేశాడు నంద కిషోర్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 'తెలుగమ్మాయిలకు హీరోయిన్ అవకాశాలు ఇవ్వడం అరుదనే చెప్పాలి. అలాంటి సమయంలో వైజాగ్ అమ్మాయి సిరి హన్మంత్‌కు కథానాయికగా ఛాన్స్ ఇచ్చారు. మిగతా సినిమాల్లాగా కాకుండా హీరోయిన్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. ఇంత మంచి పాత్రలు తెలుగువాళ్లకు రావు. ఆమెను ప్రమోషన్స్‌కు పిలిచినప్పుడు నేను రాలేను అని చెప్పింది. ట్రైలర్లో తన పాత్ర అసభ్యంగా ఉందని, అది చూసినవాళ్లకు తన మీద నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని తనకు తానే ఊహించుకుంది. దానికి, ప్రమోషన్స్‌కు రాకపోవడానికి సంబంధం ఏంటో నాకర్థం కాలేదు. ఏదేమైనా హీరోయిన్గా సినిమా ప్రమోషన్స్‌కు రావడం తన బాధ్యత. తన పాత్ర గురించి ముందు ఒకలా చెప్పారు కానీ తర్వాత వేరేలా చూపించారని ఆమె ఫీలైంది. కానీ ఒకసారి సిరి సినిమా చూస్తే దర్శకుడు తనను ఎంత బాగా చూపించాడో అర్థం అయ్యేది. నాకు తెలిసి ఆమె ఇప్పటికీ సినిమా చూసి ఉండదు, చూస్తే మాత్రం తన అభిప్రాయం మారొచ్చు' అని నంద కిషోర్ చెప్పుకొచ్చాడు. -
పరిశ్రమ బాగుండాలంటే ఇలాంటివి హిట్టవ్వాలి
‘‘కరోనా ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి ‘నరసింహపురం‘ చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్న చిత్రబృందాన్ని అభినందించాలి. పరిశ్రమ బాగుండాలంటే ‘నరసింహపురం’ వంటి మీడియమ్ బడ్జెట్ చిత్రాలు భారీ విజయాలు సాధించాలి’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నరసింహపురం’. టి.ఫణిరాజ్ గౌడ్–నందకిశోర్ ధూళిపాలతో కలిసి శ్రీరాజ్ బళ్లా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసిన ప్రకాశ్‌రాజ్ చిత్రబృందాన్ని అభినందించారు. -
అన్నాచెల్లెళ్ల అనుబంధం
‘‘నరసింహపురం’ టైటిల్, మోషన్ పోస్టర్ బాగున్నాయి. నేపథ్య సంగీతం అదిరిపోయింది. నా మిత్రుడు నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు శ్రీకాంత్. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నంద కిశోర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నరసింహపురం’. సిరి హనుమంతు హీరోయిన్గా నటిస్తుండగా, వర్థమాన నటి ఉష హీరో చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు. శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాల నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ని శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు శ్రీరాజ్ బళ్ళా. ‘‘వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది’’ అన్నారు నందకిశోర్. ఈ కార్యక్రమంలో సిరి హనుమంతు, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్, విజువల్ ఎఫెక్ట్స్ చందు ఆది పాల్గొన్నారు. -
అన్నాచెల్లెళ్ల అనుబంధం
పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో పి.ఆర్. క్రియేషన్స్ సమర్పణలో శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణికుమార్ గౌడ్, నందకిశోర్ ధూళిపాల నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘‘వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యం లో ఈ సినిమా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ‘‘ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నందకిశోర్. -
ధ్రువ సర్జా, రష్మికా ‘పొగరు’
నటుడు అర్జున్ మేనల్లుడు, కన్నడ హీరో ధ్రువ సర్జా హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘పొగరు’. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. ‘విక్టరీ, అధ్యక్షా, రన్న, ముకుంద మురారి’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన నంద కిశోర్ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కిస్తున్నారు. 100కు పైగా చిత్రాలను పంపిణీ చేసి, ‘అధ్యక్షా’ వంటి హిట్ మూవీని నిర్మించిన బి.కె. గంగాధర్ ‘పొగరు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడతో పాటు పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలోని మొదటి పాట ‘కరాబు..’ ని ఆగస్ట్ 6న రిలీజ్ చేయనున్నారు. సంపత్ రాజ్, ధనుంజయ్, రవిశంకర్, పవిత్రా లోకేష్, గిరిజా లోకేష్‌లతో పాటు ‘డబ్లు్యడబ్లు్యఈ’ సూపర్స్టార్లు కై గ్రీన్ , మోర్గాన్ ఆస్టే, జో లిండ్నర్, జాన్ లూకాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చందన్ శెట్టి, కెమెరా: ఎస్.డి. విజయ్ మిల్టన్ , బ్యానర్: శ్రీ జగద్గురు మూవీస్. -
రూ.52,700 కోట్లు కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకాలు, భగీరథకు వచ్చే ఐదేళ్ల పాటు నిర్వహణ వ్యయం కోసం రూ.52,700 కోట్ల మేర ప్రత్యేక గ్రాంట్లు కేటాయించేలా సిఫారసు చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు. మంగళవారం 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, సంఘం కార్యదర్శి అరవింద్ మెహతాతో మంత్రి హరీశ్, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సమావేశమయ్యారు. తెలంగాణకు నిధుల ఆవశ్యకతపై సీఎం కేసీఆర్ రాసిన లేఖను ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్‌కు అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం, భగీరథలపై ప్రశంసలు.. సీఎం కేసీఆర్ రాసిన లేఖను 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌కు అందజేశామని హరీశ్ చెప్పారు. ‘రాష్ట్ర ‡అభివృద్ధి పనులను 15వ ఆర్థిక సంఘం చైర్మన్ కొనియాడారు. కాళేశ్వరం, భగీరథ అద్భుత ప్రాజెక్టులని ప్రశంసిం చారు. కేసీఆర్‌కు అభినందనలు తెలపమని చైర్మన్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎత్తిపోతల పథకాల నిర్వహణకు, అలాగే మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వాలని కేసీఆర్ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని 83 మీటర్ల నుంచి దాదాపు 670 మీటర్ల వరకు ఎత్తాల్సి వస్తోంది. దీనికి నిర్వహణ వ్యయం ముఖ్యమైంది. గత ఐదేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు పూర్తిచేశాం. వాటికి వచ్చే ఐదేళ్లపాటు నిర్వహణ వ్యయంగా రూ.42 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా సీఎం లేఖ రాశారు. భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. దానినీ పూర్తిచేసి ప్రజలందరికీ నీళ్లు ఇస్తున్నాం. దీని నిర్వహణకు కూడా వచ్చే ఐదేళ్లలో రూ.11 వేల కోట్ల మేర నిధులు గ్రాంటు రూపంలో ప్రత్యేకంగా మంజూరు చేయాలని కోరాం.’అని చెప్పారు. తెలంగాణ, గుజరాత్ నష్టపోవద్దు.. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇంటింటికీ తాగునీరు పథకానికి ప్రస్తుతం నిధులు ఇస్తోందని హరీశ్ అన్నారు. ‘తెలంగాణ, గుజరాత్ ముందే ఈ పథకం అమలుచేసినందున ఈ రాష్ట్రాలు నష్టపోవడం సమంజసం కాదు. దీంతో నిర్వహణ వ్యయం గ్రాంటుగా ఇవ్వాలని కోరాం. ఇందుకు 15వ ఆర్థిక సంఘం తగిన రీతిలో సిఫారసు చేయాలని కోరాం. ఈ రెండు అంశాలకు వారు సానుకూలంగా స్పందించారు. కొత్త రాష్ట్రమైనా సీఎం కేసీఆర్ బాగా పనిచేశారని వారు ప్రశంసించారు. మీ వినతిని సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు. కమిషన్ కాలపరిమితి ఏడాది పొడిగించినందున ప్రాంతీయ సదస్సులు పెట్టాలనుకుంటున్నామని కమిషన్ చెప్పింది. దక్షిణ భారత ప్రాంతీయ సదస్సును హైదరాబాద్ లో పెట్టేలా ఆలోచన చేస్తున్నామని వారు అన్నారు. హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలనుకుంటున్నామని చెప్పారు. మేం కూడా వారిని ప్రాజెక్టు చూసేందుకు ఆహ్వానించాం. సదస్సు హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే మేం ఆతిథ్యం ఇస్తామని కూడా చెప్పాం..’అని వివరించారు. -
ఆమెన్!
‘ఉన్నవి రెండు కాలాలు. ఆమెని ప్రేమించిన కాలం. ప్రేమించకుండా ఉండలేని కాలం’ అనే నందకిశోర్ రెండో కవితాసంపుటి ‘యథేచ్ఛ’ డిసెంబర్ 2017లో వచ్చింది (మొదటి సంపుటి ‘నీలాగే ఒకడుండేవాడు!’). ప్రచురణ: వాకిలి. అందులోంచి ఒక కవిత: భూమి దప్పిక తీర్చేందుకు ఆకాశం గొంతుకోసినవాడు దేవుడు చిక్కటి రాత్రి మొహమ్మీద చుక్కల దిష్టి పెట్టినవాడు దేవుడు కళ్లు తెరవని పసికందుని చంపి నిద్రపోగలవాడు దేవుడు అస్సలు స్పృహ తెలియకుండా అడవి చుట్టూ పంజరమల్లినవాడు దేవుడు -నందకిశోర్ -
అదృష్టాన్ని నిలబెట్టుకోవడమే విజయం
చిన్నప్పుడు సరదాగా ఆడిన ఆటైనా, ఇష్టంతో నేర్చుకున్న పనైనా.. ప్రతీది జీవితంలో ఉపయోగపడటం అనేది ఒక అదృష్టం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మాత్రం మన ప్రయత్నమే. ఆ రెండింటినీ సిన్సియర్‌గా అందిపుచ్చుకున్న సీరియల్ నటుడు నందకిశోర్. ‘జీ తెలుగు’లో వచ్చే ‘రామసక్కని సీత’ సీరియల్లో రామరాజుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న నందకిశోర్ చెబుతున్న ముచ్చట్లివి. ‘మా అమ్మానాన్నలు శారద, వెంకటరమణ. నాన్న రైల్వేలో జాబ్ చేసేవారు. ముగ్గురు అన్నదమ్ములలో నేను చివరి వాడిని. మా నాన్నగారే నా మొదటి గురువు. చిన్నప్పుడు ఆయనే నా ముఖానికి మేకప్ వేశారు. భూమికా థియేటర్ గ్రూప్‌ను నిర్వహించే గరికపాటి ఉదయభాను గారి దగ్గర పదవతరగతి నుంచి నాటకరంగంలో పాల్గొనేవాడిని. కెరియర్ దీర్ఘకాలం కొనసాగాలంటే నాటక రంగం బాగా ఉపయోగపడుతుంది. అదృష్టవశాత్తు అలా నా మూలాలు నాటకరంగంలో పడ్డాయి. అన్నదమ్ముల అనుబంధం ఇంట్లో చిన్నవాyì ని అయినా మా అన్నయ్యల సపోర్ట్ నాకు బాగా ఉండేది. అన్నదమ్ములం అయినా మంచి స్నేహితులుగా ఉంటాం. ఒకమ్మాయిని ప్రేమించాను అని చెప్పినప్పుడు ఇంట్లో చిన్నవాడినైనా మా అన్నయ్యలిద్దరూ నాకు ముందు పెళ్లి జరిపించారు. ఇప్పటికీ నాకు వారు అండగా ఉంటారు. నా సతీమణి పేరు లక్ష్మి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక అదృష్టం అయితే ఈ ఫీల్డ్‌లో ఉన్న నన్ను అర్థం చేసుకోవడం నిజంగా అదృష్టం. మాకు ముగ్గురు కూతుళ్లు. విలన్ నుంచి హీరోగా! 2005 సంవత్సరం నుంచి నా కెరియర్ మొదలైంది అని చెప్పవచ్చు. అంతకుముందు నాలుగైదేళ్లు ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ టైమ్‌లో ఈ రంగంలో పోటీ ఎక్కువ ఉంది. ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడు అవకాశాలు తక్కువ. పదిహేనేళ్ల క్రితం దూరదర్శన్‌లో వచ్చిన ‘వెలుగు నీడలు’ సీరియల్లో విలన్‌గా చేశాను. అక్కణ్ణుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ చెన్నై ఇండస్ట్రీకి వెళ్లాను. అక్కడ అంకురం సీరియల్లో సైడ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ర్యాడాన్ ప్రొడక్షన్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు ఇక్కడ ‘స్రవంతి’ సీరియల్లో అవకాశం వచ్చింది. ఐదేళ్ల పాటు వచ్చిన ఆ సీరియల్ వల్ల నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. ఈ సీరియల్ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. స్రవంతి నుంచి శుభలేక, మంచుపల్లకి, శ్రీమతి కళ్యాణం, రామాసీత, రామసక్కని సీత.. ఇలా వరుస సీరియల్స్ చేసుకుంటూ వస్తున్నాను. టీవీలో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ చేశాను. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ రాణించాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడొక సినిమా కూడా చేస్తున్నాను. సీరియల్ వల్ల నటనలోనూ, ప్రొడక్షన్లోనూ మంచి ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది. రామసక్కని సీత రియల్ లైఫ్‌లో మా ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడిని. ‘రామసక్కని సీత’ సీరియల్లో నలుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడిని. ఇది పూర్తిగా కుటుంబ నేపథ్యం ఉన్న కథనం. నాది రామరాజు పాత్ర. అన్నదమ్ముల సఖ్యత, భార్యా–భర్తల అనురాగం, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి.. ఇలా ఏ దశలో ఎలా ఉండాలో బంధాల ద్వారా చూపుతుంది ఈ సీరియల్. అనుకోని పరిస్థితుల్లో సీత రామరాజు భార్యగా ఆ ఇంట అడుగుపెడుతుంది. అమ్మలా చూసే సీత ప్రవర్తనతో తమ్ముళ్లు మారుతారు. మంచి ప్రేక్షకాదరణతో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నటనే జీవితం నటన మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే నా జీవితమైంది. దీంట్లోనే కొనసాగుతాను. నటుడిగా కొనసాగాలంటే ఆరోగ్యం, ఫిట్నెస్, ముఖకాంతి.. ఇవన్నీ తప్పనిసరి. అందుకే ఎన్ని పనులున్నా రోజూ ఉదయం 5:30గంటలకు లేస్తాను. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తాను. షూటింగ్ లేకపోతే సినిమాలు చూడ్డం, స్టోరీ డిస్కషన్స్, కాన్సెప్ట్స్ డెవలప్ చేయడం వంటి వాటిల్లో పాల్గొంటుంటాను. మిగతా టైమ్ నా కుటుంబంతో గడుపుతాను. పూర్తి శాకాహారిని. వంట వచ్చు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో కొత్త వంటకాలను ట్రై చేస్తుంటాను. వాటి టేస్ట్‌ను ఇంట్లో వారికి దగ్గరుండి మరీ వడ్డిస్తాను.’ – నిర్మలారెడ్డి ఆల్‌రౌండర్‌గా! చిన్నప్పటి నుంచి ఆటలు, పాటలు, చదువు.. అన్నింటిలోనూ చురుకుగా ఉండేవాడిని. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఆటల్లో క్రి కెట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ క్రికెట్ లీగ్ జరిగినప్పుడు సినిమా వాళ్లతో కలిసి పాల్గొన్నాను. టీవీ కేటగిరీ నుంచి నా క్రికెట్ స్కిల్స్ చూసి వాళ్ల టీమ్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. చిన్నప్పుడు ఏదైతే ఇష్టంతో నేర్చుకున్నానో అవన్నీ నా జీవితంలో ఉపయోగపడుతూ వచ్చాయి. సింగర్, డ్యాన్సర్, యాక్టర్, ప్లేయర్‌గా.. ఇలా అన్నింటా ఉన్నాను. డ్యాన్సర్‌గా జల్సా, నర్తనశాల, రగడ.. వంటి టీవీ డ్యాన్స్ షోలో పాల్గొన్నాను. స్టేజ్ షోలోనూ ప్రదర్శనలు ఇచ్చాను. అయితే, అప్పటి కష్టానికి ఇప్పటిలా మార్కెట్లేదు. ఇప్పుడు ప్రతీది అప్డేటెడ్గా ఉండాలి. -
యువకుడి ప్రాణం తీసిన కులాంతర వివాహం
-
వైఎస్ జగన్ ఏదైతే చెప్పారో అక్షరాలా అదే నిజమైంది
-
కావాలనే హోదా ఎగ్గొట్టారు
-
ప్రత్యేక హోదా మా పరిధి కాదు
సాక్షి, అమరావతి: రాష్ట్రాల ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలోది కాదని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు కమిషన్‌కు ఎటువంటి సంబంధంలేదని.. అది జాతీయ అభివృద్ధి మండలి పరిధిలోనిదని ఆయన తెలిపారు. హోదాను అమలుచేసే బాధ్యత ప్లానింగ్ కమిషన్ తీసుకుంటుందన్నారు. అలాగే, ఏపీ హోదాను 14వ ఆర్థిక సంఘం అడ్డుకుందని చెప్పడం అవాస్తవమన్నారు. సచివాలయంలోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక సంఘం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు తాను అనుకోవడం లేదన్నారు. ఇది రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు. రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి, విశ్లేషించడమే కమిషన్ పని అని సింగ్ తెలిపారు. తాము 29 రాష్ట్రాలలో పర్యటించి ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తామన్నారు. ఇప్పటివరకు 12 రాష్ట్రాలలో పర్యటించామని, మిగిలిన రాష్ట్రాల పర్యటనలు కూడా ఈ ఏడాది చివరికి పూర్తి చేస్తామన్నారు. జనాభా లెక్కల విషయంలో రాష్ట్రపతి నోటిఫికేషన్‌కు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో తాను రాజ్యసభలో ఏపీకి మద్దతుగా మాట్లాడానని ఆయన గుర్తుచేస్తూ.. కమిషన్ పరిధికి లోబడి మాత్రమే తాము పనిచేయవలసి ఉంటుందన్నారు. సానుకూలంగా 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర విభజన ఏ పరిస్థితుల్లో జరిగింది, ఎటువంటి సమస్యలను రాష్ట్రం ఎదుర్కొంటోంది, తదితర అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని 15వ ఆర్థిక సంఘం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని నందకిశోర్ సింగ్ చెప్పారు. రాజకీయ పార్టీలతో చర్చలు కూడా సానుకూల వాతావరణంలో జరిగినట్లు ఆయన తెలిపారు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటిస్తోందని.. అందులో భాగంగానే తాము గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో, సాయంత్రం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను, సమస్యల తీవ్రతను సీఎం వివరించారని ఆయన చెప్పారు. సీఎం డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని అవకాశం ఉన్నంత వరకు రాష్ట్రానికి న్యాయం చేస్తామని.. అందుకు కమిషన్ సిద్ధంగా ఉన్నట్లు సింగ్ తెలిపారు. కాగా, తమ పర్యటనలో భాగంగా బుధవారం కొన్ని పంచాయతీలను, ఆరోగ్య కేంద్రాలను సందర్శించినట్లు చైర్మన్ చెప్పారు. సమావేశంలో 15వ ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్ అశోక్ లహిరి, డాక్టర్ అనూప్ సింగ్, శక్తికాంత్ దాస్, ప్రొఫెసర్ రమేష్ చంద్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. రవిచంద్ర, కార్యదర్శి పీయూష్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పాక్‌కు వెళ్లనంటే వెళ్లను!
జననీ, జన్మభూమి స్వర్గం కంటే గొప్పవంటారు. ఇంకా చెప్పాలంటే కన్నతల్లి కంటే కూడా ఆ తల్లిని కన్నభూమి ఎంతో గొప్పదంటారు. అందుకేనేమో.. పరాయిదేశంలో పెరిగినా, చివరికి ఈ మట్టిలోనే కలిసిపోవాలనకుంటారు. 80 ఏళ్ల నందకిశోర్ కూడా ఇదే చెబుతున్నాడు. భారతీయుడిగానే మరణించాలని ఉందంటున్నాడు. 1946 సంవత్సరం... భారత్, పాక్ అప్పటికింకా విడిపోలేదు. యూపీలోని దేవరియా ప్రాంతంలో, ఓ నిరు పేద కుటుంబంలో నందకిశోర్ జన్మించారు. కుటుంబం గడవడం కష్టమవుతుండగటంతో నందకిశోర్‌ను అతని తల్లి ఓ ఇంట్లో పని కోసం కరాచీ (కరాచీ అప్పటికి భారత్‌లోనే ఉంది) పంపించారు. అప్పుడు అతని వయసు 8 ఏళ్లు. వెళ్లిన ఏడాదికే భారత్, పాక్ విడిపోయాయి. కాగా నందకిశోర్‌ను పనికి కుదుర్చుకున్న యజమాని..అతని పేరును హస్మత్ అలీగా మార్చాడు. ఆ తర్వాత హస్మత్ అలీగా అక్కడే పౌరసత్వం పొందాడు. 19 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్థానీ పాస్పోర్టుతో, హస్మత్ పేరుతో నందకిశోర్ భారత్ కు తిరిగొచ్చాడు. అయితే వీసా గడువు ముగియడంతో 1974 నుంచి 1998 మధ్య హస్మత్ అలీ వీసా గడువును సంవత్సరానికొకసారి పొడిగించుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే పెళ్లి కూడా చేసుకున్నాడు. 1998 తర్వాత అతని వీసా గడువు పొడిగించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఇక వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఓసారి అధికారులు అత్తారీ సరిహద్దు వరకూ తీసుకెళ్లారు. అయితే అప్పటి విదేశాంగ మంత్రి జోక్యంతో తిరిగి మళ్లీ వెనక్కివచ్చాడు. భారతీయుడిగానే చనిపోతా.. ఇంత జరుగుతున్నా నందకిశోర్ మాత్రం ఇండియాను వదిలిపెట్టేందుకు మాత్రం ససేమిరా అంటున్నాడు. 2008లో నందకిశోర్ కేసును ప్రభుత్వానికి బదిలీచేశారు. కేసుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం గతంలో ఇప్పటికే పలుసార్లు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ తనకు మాత్రం పాక్ వెళ్లడం ఇష్టం లేదని.. ఓ భారతీయుడిగానే చనిపోవాలని కోరుకుంటున్నట్లు తెగేసి చెబుతున్నాడు. -
తెలిసింది సైన్స్ తెలియనిది మేజిక్
పంచభూతాలను నియంత్రించే శక్తి సంపాదించిన ఓ మనిషి, తనలో మానవత్వాన్ని కోల్పోయాడా? సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాడా? అనే కథతో రూపొందిన చిత్రం ‘వశం’. శ్రీకాంత్ చల్లా దర్శకత్వంలో వాసుదేవ్ రావు, కృష్ణేశ్వరరావు, శ్వేతావర్మ, నంద కిశోర్, అక్షయ్ ముఖ్యతారలుగా శుకా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ప్రచార చిత్రాలు విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ, రాజ్ కందుకూరిలు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మనకు తెలిసింది సైన్స్, తెలియనిది మేజిక్. సైన్స్ అనేది స్పిరిచ్యువాలిటీలో ఓ భాగం మాత్రమే. ఈ చిత్రంలో సైన్స్, సూపర్ న్యాచురల్ పవర్స్ కలిపి తీసుకున్నాం. మనిషి వాటిని నియంత్రించగలడా? అనే అంశాలను ప్రస్తావించాం. నవంబర్‌లో విడుదల చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: దుర్గాకిశోర్, రవికిరణ్, పాటలు: చక్రవర్తుల, సంగీతం: జోస్యభట్ల. -
నందకిశోర్ నివాసంపై ఏసీబీ దాడులు
నెల్లూరు : నెల్లూరులోని స్టోన్‌హౌస్‌పేట సబ్‌రిజిస్ట్రార్ నందకిశోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు. అలాగే జిల్లాలోని కావలిలోని అతడి మరో నివాసంపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో భారీ మొత్తంలో నగదుతోపాటు విలువైన సంపద వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నందకిశోర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు శుక్రరవారం దాడి చేశారు.