నంద కిషోర్ హీరోగా నటించిన చిత్రం ప్రవీణ్ IPS (ఇక ప్రజా సేవలో). ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఐరా ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై మామిడాల నీల నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న రిలీజ్ కానుంది. శనివారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల ప్రవీణ్ IPS ట్రైలర్ విడుదల చేశారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు.
అలాంటి సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి
సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలిస్తుందన్నారు. చాలామంది ఆదర్శాల కోసం సినిమాలు తీస్తే వాటిని జనం ఆదరించరని ఒక తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. ‘మాల పిల్ల’, ‘రైతుబిడ్డ’ వంటి సినిమాల్లో ఆదర్శమే చూపించారని, ఆదర్శం (ఐడియలిజం) అనేది జన హృదయాలను తాకుతుందన్నారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా అనేక విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో తీసుకొచ్చారని అన్నారు. పూర్ణ మలావతి, ఆనంద్ లతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహింపజేశారని గుర్తు చేశారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది నా తొలి చిత్రం
డైరెక్టర్ దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ... ఇది నా తొలి చిత్రం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవితాన్ని మూడు పార్టులుగా తీయాలి. కానీ సెలెక్టివ్ అంశాలను తీసుకొని ప్రవీణ్ IPS మూవీ తీశాం. ఆయన నాకు ఇన్‌స్పిరేషన్. వివేక్ కూచిభోట్ల గారు లేకపోతే నాకు ఈ సినిమా అవకాశం వచ్చేది కాదని చెప్పారు. తనకు అన్ని విషయాల్లో అండగా నిలిచినందుకు వివేక్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నో కష్టాలు పడ్డారు
ASKES ఫౌండేషన్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో కష్టాలను భరించి ఐపీఎస్ అధికారిగా ఎన్నో సేవలు చేశారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా పేద పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ IPS మూవీ హిట్ కావాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment