నెల్లూరు : నెల్లూరులోని స్టోన్హౌస్పేట సబ్రిజిస్ట్రార్ నందకిశోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడి చేశారు. అలాగే జిల్లాలోని కావలిలోని అతడి మరో నివాసంపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో భారీ మొత్తంలో నగదుతోపాటు విలువైన సంపద వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నందకిశోర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు శుక్రరవారం దాడి చేశారు.