సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సోమవారం(జనవరి6) సాయంత్రం ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల తొమ్మిదో తేదిన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. అంతకు ముందు ఏసీబీ కేటీఆర్ ఇంట్లో తనిఖీలు చేసింది. సోమవారం ఉదయమే కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణకు తనతో పాటు న్యాయవాదులను అనుమతించకపోవడంతో బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయం బయట నుంచే కేటీఆర్ విచారణకు వెనుదిరిగారు.
తాను చెప్పాలనుకున్నది రాతపూర్వకంగా పోలీసులకు సమర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తాను లేనప్పుడు తన ఇంట్లో సోదాలు చేయాలని చూస్తోందని, సీఎం రేవంత్ ఆదేశాలతో కావాలని ఏదైనా పెట్టి నా ఇంట్లో దొరికినట్లు చూపించాలనుకుంటున్నారని చెప్పడం గమనార్హం. క్వాష్ పిటిషన్‌పై కోర్టు తీర్పు రిజర్వ్ అయిందని అయినా ఏసీబీ కావాలని తనను విచారణకు పిలుస్తోందని మండిపడ్డారు.
కాగా, ఫార్ములా-ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు హైకోర్టులో ఇప్పటికే ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. క్వాష్ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది.
ఇదీ చదవండి: రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా
Comments
Please login to add a commentAdd a comment