SUB REGISTRAR
-
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం నిందితులకు సహకరించిన జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి 14 రోజులు పాటు రిమాండ్ విధించింది మేడ్చల్ కోర్టు.కాగా సుభాష్ నగర్లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మాజా రెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. అయితే అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన జ్యోతి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం పద్మజా రెడ్డికి సహకరించింది. ఇటీవల పోలీసులు పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని సైతం అరెస్ట్ చేశారు. -
డామిట్.. కబ్జా కుట్ర అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి, ఫోర్జరీ సంతకాలతో ఏకంగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి రూ.600 కోట్ల విలువైన సర్కారు భూమిని కొట్టేసేందుకు కబ్జాదారులు కుట్రపన్నారు. రంగారెడ్డి జిల్లా–2 జా యింట్ సబ్ రిజి్రస్టార్‌తో కుమ్మక్కై కబ్జాదారు లు ఈ కుట్రకు పాల్పడగా...శేరిలింగపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకుల వెంకారెడ్డి ఫిర్యాదుతో కబ్జాకుట్ర బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణాధికారి ఏసీపీ ఎస్.రవీందర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గ్ పైగా గ్రామంలోని సర్వే నంబర్లు 1, 4, 5, 20లలో 12.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ఎల్‌ఐపీసీవో) సంస్థకు యాజమాన్య హక్కులున్నాయి. ఈ స్థలంపై బోరబండకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా నలుగురు కన్నేశారు. రంగారెడ్డి జిల్లా–2 జాయింట్ సబ్ రిజి స్ట్రార్ జె.గురుసాయిరాజ్‌తో కలసి కుట్ర పన్నా రు. ఈ నలుగురు నిందితులు ఫైజుల్లా వారసులుగా నటిస్తూ...1978 నాటి ప్రభుత్వ రికార్డుల ను తారుమారు చేసేశారు. దీని సహాయంతో ఫోర్జరీ సంతకాలతో నకిలీ డాక్యుమెంట్లను కూ డా సృష్టించారు. ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా క్లెయిమ్ చేసేందుకు ఏకంగా గీక్ బిల్డర్ ఎల్ఎల్పీతో అభివృద్ధి ఒప్పందం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో భారీ భవనం... ఈ ప్రభుత్వ భూమిలో భారీ నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు కబ్జాదారులు గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నవీన్‌కుమార్ గోయెల్‌తో అక్రమంగా అభివృద్ధి ఒప్పందాలు సైతం చేసుకున్నారు. 39 అంతస్తుల్లో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ప్రణాళిక వేశారు. 30:70 నిష్పత్తిలో వాటాలతో ఒప్పందాలు చేసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కు.. రిజి్రస్టేషన్ చట్టంలోని సెక్షన్ 22–ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గురుసాయిరాజ్ నిందితులతో కుమ్మక్కయ్యారు. రిజిస్ట్రేషన్ రికార్డులను తారుమారు చేసి, చట్టవిరుద్ధంగా యాజమాన్య హక్కులను బదలాయించారు. ఈ నెల 11న నిందితులు, జాయింట్ సబ్ రిజిస్ట్రేషర్తో కలసి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కం జనరల్ పవరాఫ్ అటార్నీ (డీజీపీఏ) డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసేశారు. రూ.202 కోట్లతో మాల్ నిర్మాణం.. ఈ ప్రభుత్వ భూమిలోని కొంత భాగంలో 5.16 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్‌ను ని ర్మించాలని టీఎస్‌ఎల్‌ఐపీసీవో నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌టీపీసీ)తో లీజు ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.202 కోట్లను కేటాయించింది. టీఎస్‌టీపీసీ ఆర్కిటెక్చర్ డిజైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సేవల కోసం కన్సల్టెంట్లను సైతం ఖరా రు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 4న ఓఎన్సీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ప్రాజెక్ట్ తవ్వకాల పనుల కాంట్రాక్ట్‌ను సైతం ఇచి్చంది.కుట్ర బయటపడిందిలా...శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ కమ్ తహసీల్దార్ కుకల వెంకారెడ్డి సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం(ఈఓడబ్ల్యూ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కబ్జాకుట్ర బయటకొచి్చంది. దీంతో సాంకేతిక ఆధారాలను సేకరించిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు నిందితులు జే గురుసాయి రాజ్‌తో పాటు మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మొహ్మద్ అబ్దుల్ ఆదిల్, సయ్యద్ కౌసర్, అఫ్షా సారా, గీక్ బిల్డర్ ఎల్ఎల్పీ పార్టనర్ నవీన్ కుమార్ గోయెల్‌పై బీఎన్ఎస్ చట్టంలోని 318 (4), 316 (5), 338, 336 (3), 340 (2), 61 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
ఏసీబీకి చిక్కిన సబ్-రిజిస్ట్రార్
-
బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ (42).. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ వలలో చిక్కినందుకు అవమాన భారంతో కుంగిపోయిన నాయక్ చెన్నై చేరుకుని.. అక్కడి లాడ్జిలో ఉరి వేసుకుని మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లా గోనిపెంట తండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ ఈ నెల 22న సురేందర్‌రెడ్డి అనే రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మిగిలిన తతంగం పూర్తి చేస్తుండగా.. అదే రోజు రాత్రి గోడ చాటుకు వెళ్లిన శ్రీనివాస్ నాయక్ పారిపోయి చెన్నైలోని మాధవాపురంలో ఓ లాడ్జిలో దిగారు. అదే గదిలో ఉరి వేసుకోగా.. శనివారం లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. చదవండి: బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది -
AP: సబ్ రిజిస్ట్రార్లుగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు
సాక్షి, అమరావతి: గృహ రుణాల నుంచి పేదలను విముక్తి చేసేందుకు తీసుకువచ్చిన వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లోని వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించి పేదల ఇళ్ల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేస్తారని గృహ నిర్మాణ శాఖ వెల్లడించింది. సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు వీరికి సహకరిస్తారని తెలిపింది. ఈ పథకం ఒక్క దాని కోసమే వీరు సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తారని వెల్లడించింది. ఇందుకోసం 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 6లో పాక్షిక మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. -
ఏసీబీకి చిక్కిన రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్
సాక్షి, హైదరాబాద్: రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గురువారం రాత్రి డాక్యుమెంట్ రైటర్ నుంచి నగదు తీసుకుంటుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు ఇద్దర్నీ పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. లంగర్‌హౌస్‌కు చెందిన ఒక మహిళ గంధంగూడ ప్రాంతంలోని 300 గజాల స్థలంలో డెవలప్మెంట్కు బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే బిల్డర్ డెవలప్మెంట్ చేయకపోవడంతో సంబంధిత డాక్యుమెంట్ రద్దు కోసం తన సోదరుడి కుమారుడైన అరవింద్ మహేష్‌కుమార్‌ను సంప్రదించారు. అరవింద్ రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం డాక్యుమెంట్ రైటర్ వాసును సంప్రదించాడు. వాసు ఈ విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీకి తెలిపాడు. ఈ పని చేసేందుకు ఆయన మొదట రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన సంభాషణలను అరవింద్ వీడియో రికార్డు చేశాడు. చివరకు రూ.5 లక్షలు సబ్ రిజిస్ట్రార్, రూ.50 వేలు డాక్యుమెంట్ రైటర్ తీసుకునేందుకు ఒప్పుకున్నారు. అనంతరం అరవింద్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. సెల్ఫోన్లో కీలక సమాచారం... ముందస్తు పథకం ప్రకారం గురువారం డబ్బులు ఇస్తానని చెప్పిన అరవింద్.. సాయంత్రం 5 గంటలకు ఏసీబీ అధికారులతో పాటు రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. డాక్యుమెంట్ రైటర్ వాసు డబ్బు తీసుకున్నాడు. అయితే సబ్ రిజిస్ట్రార్ డబ్బు తీసుకునేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. ఆయన నేరుగా డబ్బు తీసు కుంటే పట్టుకునేందుకు వీలుగా ఏసీబీ అధికారులు రెండు గంటల పాటు వేచి చూశారు. చివరకు డాక్యుమెంట్ రైటర్ వాసు వద్ద డబ్బులు తీసుకుంటుండగా దాడి చేసి ఇద్దర్నీ పట్టుకున్నారు. హర్షద్ అలీ కార్యాలయంలో మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన పట్టుబడగానే ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరూ సబ్ రిజిస్ట్రార్ సెల్‌ఫోన్‌తో మాయమయ్యారు. ఏసీబీ అధికారులు సెల్‌ఫోన్‌కు సంబంధించి వివరాలు అడగడంతో ఇంటి వద్ద ఉందని ఒకసారి, అసలు లేదని మరొకసారి చెబుతూ హర్షద్ అలీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టారు. చివరకు సెల్‌ఫోన్‌ను అప్పగించారు. అందులో పలు లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్‌గా హర్షద్ అలీ గత సంవత్సర కాలంగా విధులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల క్రితం నార్సింగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అటవీ శాఖ భూములు రిజిస్ట్రేషన్ చేసిన కేసులో సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినా ఆయన తీరు మారలేదని, పలు వివాదాస్పద రిజిస్ట్రేషన్లు చేశారని తెలుస్తోంది. -
అనంతపురం జిల్లా కదిరి సబ్ రిజిస్టార్ నాసిర్‌పై సస్పెన్షన్ వేటు
-
బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ వెంకట నారాయణ సస్పెన్షన్
సాక్షి, అనంతపురం: కొత్తచెరువులో ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ వెంకటనారాయణను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ రిజిస్టర్ల అక్రమాలపై డీఐజీ సీరియస్ అయ్యారు. 1.92 లక్షల చలానా డబ్బులు ట్రెజరీకి చేరకుండానే వెంకట నారాయణ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే అనంతపురం రూరల్ సబ్ రిజిస్టర్ సురేష్ ఆచారి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. సబ్ రిజిస్టర్ల అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి సమగ్ర విచారణ చేపట్టారు. సురేష్ ఆచారి.. 9 నెలల్లో 1000 అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేలింది. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ హరివర్మ నేతృత్వంలోని బృందం సురేష్ ఆచారి అక్రమాలపై విచారణ చేపట్టింది. గత తొమ్మిది నెలల వ్యవధిలోనే 999 అక్రమ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించింది. ఇందులో 830 అసైన్డ్ భూములకు సంబంధించినవి కాగా, ప్రభుత్వ భూములకు సంబంధించి 165, దేవదాయ శాఖ భూములకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లు ఉన్నాయి. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసినందుకు గాను సదరు సబ్ రిజిస్ట్రార్ రూ.కోట్లలోనే ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవీ చదవండి: సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే.. -
సాక్షి ఎఫెక్ట్: సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారి సస్పెన్షన్
అనంతపురం టౌన్: ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారిని సస్పెండ్ చేస్తూ డీఐజీ మాధవి శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ రవివర్మ తెలిపారు. సురేష్ ఆచారి అనంతపురం రూరల్ సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసిన కాలంలో ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న వాటిని సైతం రిజిస్ట్రేషన్ చేసిన వైనంపై ‘సాక్షి’ ఈ నెల 1వ తేదీన ‘ప్రభుత్వ భూమిపై పచ్చమూక’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్ నిషాంత్ కుమార్ విచారణ కోసం ఓ కమిటీని నియమించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట రెవెన్యూ రికార్డుల్లోకి ఎలా ఎక్కించారు...? దాన్ని ఎలా రిజిస్టర్ చేశారు..? తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఆదేశించారు. దీంతో రాప్తాడు తహసీల్దార్ ఈరమ్మ రాప్తాడు పొలం సర్వే నంబర్ 123–2లోని భూమి వంక పోరంబోకు అని, పైగా నిషేధిత జాబితాలో ఉందని నివేదికను అందజేశారు. మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖ తరఫున విచారణ చేపట్టిన డీఐజీ మాధవి నిషేధిత జాబితాలోని భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సురేష్ ఆచారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సర్వే నంబర్ భూములను యాడికి రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ రిజిస్ట్రేషన్ చేయగా... ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ రవివర్మ తెలిపారు. చదవండి: ప్రభుత్వ భూమిపై పచ్చమూక.. ఆక్రమణ విలువ రూ.100 కోట్ల పైమాటే టీడీపీ బడాయి.. బిల్లుల కోసం లడాయి! -
రైటర్లు రాసిన స్కామ్.. 10 మంది సబ్ రిజిస్ట్రార్లపై వేటు
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు.. 2021 మే 31.. గుడివాడకు చెందిన దారం మాణిక్యాలరావు మండవల్లి మండలం పోలుకొండలో ఎకరం భూమి కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్‌ను కలిశాడు. ఆ భూమి విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.90,250 కట్టాలని చెప్పడంతో ఆ డబ్బులు మాణిక్యాలరావు ఇచ్చాడు. డాక్యుమెంట్ రైటర్ సీఎఫ్ఎంఎస్లో జమయ్యేలా ఆన్లైన్లో చలానా కట్టాడు. రూ.78,000, రూ.12,000, రూ.250 చొప్పున మూడు చలాన్ల ప్రింటవుట్లు తీసి డాక్యుమెంట్‌తో కలిపి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపాడు. సబ్ రిజిస్ట్రార్ ఆ చలాన్ల ప్రింట్లు చూసి మొత్తం సొమ్ము కట్టినట్లు నిర్థారించుకుని రిజిస్ట్రేషన్ చేసేశారు. పని పూర్తయిపోయింది. చదవండి: ‘సీమ’ నుంచి శాసన రాజధానికి రాచబాట కానీ అక్కడ వాస్తవానికేం జరిగిందో తెలుసా..? చలాన్లు కట్టేటపుడే ఆ డాక్యుమెంట్ రైటర్ అతిపెద్ద కుట్రకు తెరతీశాడు. రూ.78,000 జమ చేసినట్లు మాణిక్యాలరావుకు ప్రింటవుట్ ఇచ్చినా... నిజానికి తను ఆన్లైన్లో చెల్లించింది రూ.780 మాత్రమే. కానీ కంప్యూటర్లో ఆ చలాన్ పీడీఎఫ్ కాపీని మార్ఫింగ్ చేశాడు. 780 పక్కన రెండు సున్నాలు చుట్టి రూ.78,000 చేసేశాడు. అదే ప్రింటవుట్‌ను తీసిచ్చాడు. దాన్నే సబ్ రిజిష్ట్రార్‌కు పంపాడు. మరి సబ్ రిజిష్ట్రార్ ఎలా నమ్మారు? దాన్నెలా నిర్ధారించుకున్నారు? ఈ ప్రశ్నలు సహజం. అటు సీఎఫ్ఎంఎస్కు రకరకాల చెల్లింపులు వస్తుంటాయి కాబట్టి అక్కడెవరికీ వాస్తవంగా రావాల్సిందెంతో...ఎంత వచ్చిందో తెలిసే అవకాశం లేదు. సీఎఫ్ఎంఎస్కు నిజంగా ఎంత చెల్లించారో ఆన్లైన్లో చూసే అవకాశం ఈ సబ్ రిజిస్ట్రార్‌కు లేదు. ఇదిగో... ఈ వీక్పాయింట్నే డాక్యుమెంట్ రైటర్లు పట్టుకున్నారు. చలాన్లలో తాము చెల్లించిన సొమ్ము పక్కన సున్నాలు పెట్టేశారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారు. ఆ డబ్బులన్నీ మింగేశారు. ఇలా ఒక్కరు కాదు... ఒక చోట కూడా కాదు. డాక్యుమెంట్ రైటర్ల నెట్వర్క్ ఒకరి నుంచి మరొకరు ఈ మోసం ఎలా చేయాలో తెలుసుకున్నారు. అంతా గూడుపుఠానీ జరిపి కోట్లు కాజేశారు. తాజాగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు జరపటంతో ఈ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లూ ఎందుకు తెలుసుకోలేకపోయారంటూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయటంతో అధికారగణం కదిలింది. ఇకపై ఇలాంటి మోసాలు జరగక్కుండా ఆన్లైన్ వ్యవస్థను అందుబాటులోకి తేవటమే కాక... ఇప్పటివరకూ జరిగిన అక్రమ లావాదేవీలపై దృష్టిపెట్టింది. సబ్ రిజిస్ట్రార్లపైనా వేటు పడుతోంది. పోయిన సొమ్ము సైతం కొంత కొంతగా రికవరీ అవుతోంది. మున్ముందు మరింత భారీగా తనిఖీలు జరుపుతామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ కుంభకోణం పూర్వాపరాలివీ... రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేసిన ఈ కుంభకోణంలో ఇప్పటిదాకా రూ.5.85 కోట్లు పక్కదారి పట్టినట్లు తనిఖీల్లో వెల్లడయింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నకిలీ చలాన్ల బాగోతం వెలుగు చూసింది. ఒక్కొక్క కార్యాలయాన్నీ తనిఖీ చేస్తున్న కొద్దీ ఇది ఒక్కచోటికే పరిమితం కాలేదని, పలు ప్రాంతాలకు వ్యాపించిందని వెల్లడయింది. వ్యవహారం బయటపడ్డ వెంటనే అధికారులపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే లోపాలు సరిదిద్దాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి గండి పడిన ఆదాయాన్ని రికవరీ చేయాలని కూడాస్పష్టం చేశారాయన. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చురుగ్గా కదిలి డొంక మొత్తాన్ని కదిలించారు. రోజుల వ్యవధిలోనే కొన్ని లక్షల డాక్యుమెంట్లను పరిశీలించారు. చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు దారి మళ్లినట్లు కనుగొన్న మొత్తంలో ఇప్పటికే 2.86 కోట్లను రికవరీ చేశారు. ఇందులో కొందరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని తేలటంతో 10 మందిని సస్పెండ్ చేశారు. 12 క్రిమినల్ కేసులు పెట్టారు. అంతేకాదు! స్కామ్‌కు సూత్రధారులుగా ఉన్న పలువురు డాక్యుమెంట్ రైటర్లను అరెస్టు చేయించారు. మొదట ఈ వ్యవహారం కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బయటపడగా... అనుమానం వచ్చిన రిజిష్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగం పలుచోట్ల తనిఖీలు జరపడంతో మరిన్ని చోట్ల అక్రమాలు బయటపడ్డాయి. విజయనగరం జిల్లా గజపతినగరం, విశాఖ జిల్లా నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఆకివీడు, గునుపూడి, ఆచంట, పెనుగొండ, కృష్ణాజిల్లా గాంధీనగర్, నందిగామ, గుణదల, పటమట, మండవల్లి, గుంటూరు జిల్లా మంగళగిరి, వైఎస్సార్ కడప జిల్లా కడప, కడప రూరల్, కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ మార్ఫింగ్ వ్యవహారాలు బయటపడ్డాయి. అత్యధికంగా కృష్ణాజిల్లా మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.2.20 కోట్లు దారి మళ్లినట్లు వెల్లడయింది. చదవండి: సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు సీఎఫ్‌ఎంఎస్‌తో కార్డ్ వ్యవస్థ అనుసంధానం పూర్తి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థకి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోని కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్) వ్యవస్థను పూర్తిగా అనుసంధానం చేయకపోవటమే ఈ కుంభకోణానికి కారణమైంది. ఎందుకంటే సీఎఫ్ఎంఎస్కు చలాన్ల ద్వారా ఎంత చెల్లించారన్నది సబ్ రిజిస్ట్రార్లకు కనిపించదు. భౌతికంగా తమ చేతికి వచ్చిన ప్రింటవుట్‌ను చూసి వారు నిర్ధారించుకునేవారు. ఇక్కడే డాక్యుమెంట్ రైటర్లు బడా మోసానికి తెరతీశారు. తాజా కుంభకోణం నేపథ్యంలో ఈ తప్పు మళ్లీ జరక్కుండా వెంటనే సీఎఫ్‌ఎంఎస్‌కి చెల్లించే ఛలానాలు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోని కార్డ్ సిస్టమ్‌లో కనపడేలా నెట్వర్క్ని అనుసంధానించారు. తొలుత కార్వేటి నగరం, కుప్పం, చీరాల సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. విజయవంతం కావటంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 294 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లోనూ ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. దీంతో తమ చేతిలో ఉన్న చలానా నెంబరు ప్రకారం అందులో పేర్కొన్న సొమ్ము సీఎఫ్ఎంఎస్కు జమయిందో లేదో రియల్‌టైమ్‌లో నిర్ధారించుకునే అవకాశం సబ్ రిజిస్ట్రార్లకు వచ్చింది. తేడాలేమైనా ఉంటే అక్కడే పట్టేసుకోవచ్చు. డాక్యుమెంట్ రైటర్ల నెట్వర్కే మూలం!! ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు డాక్యుమెంట్ రైటర్లేనని స్పష్టంగా తెలుస్తోంది. కొన్నిచోట్ల వారికి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే ఆపరేటర్లు, సిబ్బంది తోడయ్యారు. అక్కడక్కడా సబ్ రిజిస్ట్రార్లు కూడా వారితో చేయి కలిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నిజానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొందరు డాక్యుమెంట్ రైటర్లదే హవా. ఎవరైనా వారి దగ్గరకే వెళ్లాలి. డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, చలానాలు తీయడం వంటి పనులు కష్టంగా ఉండడంతో రిజిస్ట్రేషన్ల కోసం వెళ్లే సాధారణ వ్యక్తులు వీరిపైనే ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అధికారులను కూడా కొందరు డాక్యుమెంట్ రైటర్లు తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. మెల్లగా వీళ్లంతా ఒక నెట్వర్క్లా కూడా తయారయ్యారు. అందుకే చలానాల మార్ఫింగ్ కుంభకోణం ఒక్కచోటకే పరిమితం కాకుండా... అన్ని కార్యాలయాలకూ విస్తరించింది. అధికారులు చురుగ్గా తనిఖీలు చేస్తుండటంతో ఇపుడు అక్రమార్కుల గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఈ తనిఖీలు అన్ని ప్రాంతాల్లోనూ చేపడతామని, రాండమ్‌గా భారీ ఎత్తున డాక్యుమెంట్లను తనిఖీ చేస్తామని, అవసరమైన చోట విస్తృత స్థాయి తనిఖీలకు దిగుతామని అధికారులు చెబుతున్నారు. ఇక అవకతవకలకు ఆస్కారం ఉండదు – ఎంవీ శేషగిరిబాబు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ ఛలానాల మార్ఫింగ్ వ్యవహారం బయటపడగానే అప్రమత్తమయ్యాం. అన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేసి అక్రమాలు గుర్తించాం. వెంటనే కార్డ్ సిస్టమ్‌లో ఛలానాలు కనపడేలా మార్పులు చేశాం. ఇకపై మార్ఫింగ్‌కు అవకాశం ఉండదు. వాస్తవానికి గతంలోనే ఈ మార్పులు చేయాలని పైలెట్ ప్రాజెక్టు చేపట్టాం. కానీ కరోనా వల్ల ఆలస్యమైంది. ఈలోపు ఈ వ్యవహారాలు బయటపడడంతో ఎన్ఐసీ ద్వారా వెంటనే సీఎఫ్ఎంఎస్ ఛలానాల సాఫ్ట్‌వేర్‌ని కార్డ్ సిస్టమ్‌కి అనుసంధానించాం. -
అరక పట్టిన సబ్ రిజిస్ట్రార్
ములుగు: జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సోమవారం కూలీగా మారారు. రైతు దినోత్సవం సందర్భంగా వ్యక్తిగత సెలవు తీసుకున్న ఆమె తన స్వగ్రామమైన ములుగు మండలం రామచంద్రాపురానికి వచ్చారు. గ్రామానికి చెందిన రైతు దొంతి రాంరెడ్డి జగనమ్మ పొలంలో వరి నాటు పనుల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం మిగతా కూలీలు తెచ్చుకున్న అన్నం, పచ్చడి మెతుకులు తిన్నారు. రోజంతా పనిచేసి సాయంత్రానికి కూలి డబ్బులు తీసుకుని స్థానిక నిరుపేద కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, వారి కష్టం తెలుసని అన్నారు. -
ఆ రోజే.. అడ్డంగా బుక్కయ్యారు!
సాక్షి, కర్నూలు: ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం రోజే కర్నూలు సబ్ రిజిస్ట్రార్ షేక్ మహబూబ్ అలీ అడ్డంగా బుక్కయ్యారు. ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకుని చేస్తున్న దందాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బట్టబయలు చేశారు. సబ్ రిజిస్ట్రార్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటర్‌ను అరెస్టు చేశారు. అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 14400కు బాధితుడి ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ ఈ దాడి చేయడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ పి.నాగభూషణం తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు నగరానికి చెందిన పి.జగన్మోహన్రెడ్డి స్థానిక పాతబస్టాండ్‌లో హిమాలయ మెడికల్ షాపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. షాపు లీజు డీడ్‌కు సంబంధించి అన్ని దరఖాస్తులను సబ్ రిజిస్ట్రార్ మహబూబ్ అలీకి సమర్పించారు. లీజు డీడ్ కావాలంటే రూ.8 వేలు లంచం ఇవ్వాలని మొదట ఆయన డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేక బాధితుడు అవినీతి నిరోధక టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును నమోదు చేసుకున్న కాల్ సెంటర్ సిబ్బంది ఈ విషయాన్ని కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణానికి తెలియజేశారు. ఆయన ఫిర్యాదుదారుడిని ఆదివారం పిలిపించుకుని వివరాలు తెలుసుకున్నారు. తర్వాత జగన్మోహన్రెడ్డి సబ్ రిజిస్ట్రార్‌తో రూ.8 వేలు ఇచ్చుకోలేనని, రూ.5 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ మొత్తాన్ని సోమవారం సబ్ రిజిస్ట్రార్ నియమించుకున్న ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ సమీర్బాషాకు అందజేశాడు. అతను సబ్ రిజిస్ట్రార్‌కు అందజేస్తుండగా.. మధ్యాహ్నం 2.10 గంటలకు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్‌తో పాటు ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్‌ను మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఎం.నాగభూషణం తెలిపారు. రోజుకు రూ.200 ప్రకారం చెల్లిస్తూ సమీర్‌బాషాను ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించుకుని సబ్‌రిజిస్ట్రార్ దందా నడుపుతున్నట్లు ఆయన వివరించారు. ప్రైవేటు వ్యక్తుల హవా జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల హవా నడుస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తమ చేతికి మట్టి అంటకుండా కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ మహబూబ్ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా దందా నడుపుతున్నట్లు ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఉదంతాలను బట్టి స్పష్టమవుతోంది. ఏసీబీ అధికారులు ఈ ఏడాది అక్టోబర్ 20న కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేసి.. 17 మంది డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ.1.58 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేట్ కంప్యూటర్‌గా పనిచేస్తూ సమీర్ బాషా అనే వ్యక్తి ఏసీబీకి పట్టుబడ్డారు. కల్లూరు, కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేకున్నా ప్రైవేట్ వ్యక్తులను నియమించుకోవడం గమనార్హం. గతంలో కల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా రమణరావు పనిచేసిన సమయంలోనూ ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకున్నారు. అప్పట్లో ఆయన తప్పుడు డాక్యుమెంట్లు చేశారన్న అభియోగాలపై ఇటీవల సస్పెండ్ అయ్యారు. అలాగే ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్‌ను తొలగించారు. ప్రస్తుతం కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమీర్ బాషాను ప్రైవేట్‌గా రోజుకు రూ.200 ఇచ్చి కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించుకోవడం దందా చేయడానికి తప్పా మరొకటి కాదని కార్యాలయ సిబ్బందే అంటున్నారు. గతంలోనే ఏసీబీకి చిక్కిన మహబూబ్అలీ మహబూబ్ అలీ గతంలోనూ కర్నూలు సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. క్రైస్తవ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. తరువాత లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అంతేకాక గతంలో కర్నూలు జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేసిన మాధవీలత, ఆమెతో పాటు సీనియర్ అసిస్టెంటుగా పనిచేసిన సర్వేశ్వరనాథ్ కూడా ఏసీబీకి చిక్కారు. అధికారుల అవినీతిలో పాలు పంచుకుంటే ప్రైవేట్ వ్యక్తులపైనా కేసు అవినీతి అధికారులకు అండగా నిలిచినా, వారి అవినీతిలో పాలుపంచుకున్నా ప్రైవేట్ వ్యక్తులపై కూడా కేసు నమోదు చేస్తామని, ఈ విషయం ఏసీబీ చట్టంలోనూ స్పష్టంగా ఉందని ఏసీబీ డీఎస్పీ పి.నాగభూషణం తెలిపారు. అవినీతి పరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ సహకరించరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు గానీ, సిబ్బంది గానీ లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫోన్ చేసి తెలపాలని, అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన వెల్లడించారు. -
'కూలి'న బతుకుకు సాయం
ములుగు: భూపాలపల్లి, ములుగు ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ శనివారం దినసరి కూలీ అవతారం ఎత్తారు. సెలవు రోజు కావడంతో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రాపురం వెళ్లారు. కౌలు రైతు రాఘవరెడ్డి–నీలమ్మ దంపతులకు చెందిన పొలంలో ఉదయం నుంచి కూలీలతో కలసి వరినాట్లు వేశారు. అనంతరం పొలం గట్లపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. కూలీలు భోజనంలో తీసుకవచ్చే ఆవకాయ పచ్చడితో తిన్నారు. సాయంత్రానికి మధ్య మధ్యలో బురద జంబు తోలారు. పని ముగించుకున్న అనంతరం రైతు రాఘవరెడ్డి నుంచి రూ.250 కూలిగా తీసుకున్నారు. కూలీ డబ్బుకు మరింత కలిపి ఆర్థిక సాయం గ్రామానికి చెందిన చాకలి సారమ్మ వృద్ధాప్యంలోనూ మరుగుజ్జుగా ఉన్న తన ముగ్గురు పిల్లలను కష్టపడి పోషిస్తోంది. విషయం తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా తనకు వచ్చిన కూలీ డబ్బులకు మరికొంత కలిపి ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా తస్లీమా మాట్లాడుతూ తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, గడిచిన ఐదేళ్లలో ఏడాదిలో ఒకరోజు గ్రామాలకు వెళ్లిన సందర్భంగా రైతులతో కలసి వరి నాటు పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తస్లీమా తనలో ఉన్న మరో కోణంతో ఆదర్శంగా నిలిచారు. -
అవినీతి రిజిస్ట్రేషన్
నగదు.. బంగారం.. ఇళ్లు.. స్థలాలు.. తోటలు.. వాహనాలు.. కళ్లు చెదిరే అవినీతి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనంతపురం సబ్ రిజిస్ట్రార్–1 లక్ష్మీనారాయణ ఇళ్లపై ఏసీబీ అధికారులు మూకుమ్మడి దాడులు చేశారు. అనంతపురం, ధర్మవరంలోని ఐదు చోట్ల చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదు, ఆస్తులను గుర్తించారు. అనంతపురం సెంట్రల్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టిన అనంతపురం అర్బన్ సబ్‌రిజిస్ట్రార్ –1 లక్ష్మీనారాయణ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం మెరుపుదాడులు నిర్వహించారు. అనంతపురం, ధర్మవరంలో ఐదు చోట్ల ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఏసీబీ అనంతపురం డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖలో తొలి నుంచి వివాదాలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణపై అక్రమాస్తులు కూడబెట్టినట్లు అభి యోగాలు వచ్చాయి. ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించారు. కర్నూలు డీఎస్పీ జయరామరాజు, సిబ్బంది సహకారంతో జిల్లాలో ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బినామీ పేర్లతో ఆస్తులు కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన లక్ష్మీనారాయణ 1994లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో టైపిస్టుగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2001లో సీనియర్ అసిస్టెంట్‌గా, 2005లో సబ్‌రిజిస్ట్రార్ గ్రేడ్–2గా పదోన్నతి పొందారు. 2005 నుంచి 2007 వరకు మళ్లీ సీనియర్ అసిస్టెంట్‌గా డిమోషన్ పొందారు. 2007 అక్టోబర్‌లో సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1గా పదోన్నతి పొందారు. గుత్తి, ధర్మవరం, ఆడిట్ శాఖలో పనిచేశారు. ప్రస్తుతం ఈయన అనంతపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్–1గా మూడేళ్లుగా పనిచేస్తున్నారు. తొలినుంచి ఈయనపై అవినీతి ఆరోపణలున్నాయి. గతంలో అక్రమంగా డబ్బు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. తాజాగా అక్రమ ఆస్తులు కూడబెట్టిన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అనంతపురం రూరల్ పరిధిలోని పాపంపేటలో గల ఆయన ఇంటిపై తొలుత దాడి చేశారు. అనంతరం బృందాలుగా విడిపోయిన అధికారులు నగరంలో ఆయన బినామీ ఆస్తులపై, వారి బంధువుల ఇళ్లలో సైతం తనిఖీ నిర్వహించారు. వీటిలో దాదాపు రూ.12 లక్షల నగదు, రూ.5 లక్షలు విలువజేసే 17.4 తులాల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అక్రమ ఆస్తుల వివరాలు లభ్యం సబ్ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు.. అనంతపురం రూరల్ ఎ.నారాయణపురం పంచాయతీ పాపంపేటలో మాత్రమే జీ ప్లస్ 1 ఇళ్లు మూడు ఉన్నాయి. 2010, 2012, 2016లో వీటిని నిర్మించుకున్నారు. విద్యారణ్యనగర్‌లో మరో ఇంటిని 2018లో నిర్మించారు. వీటితో పాటు పాపంపేట గ్రామ పరిధిలో నాలుగు ఇంటి స్థలాలు ఉన్నాయి. ఆత్మకూరు మండలం తలుపూరులో రెండు ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అలాగే అనంతపురం రూరల్ మండలం కామారుపల్లిలో ఓ వ్యవసాయ తోట ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు ఒక మహింద్రా బొలెరో వాహనం, హీరో హోండా స్లె్పండర్, హోండా స్కూటీ ద్విచక్రవాహనాలు ఉన్నాయి. నిందితున్ని విచారించిన అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు ప్రతాప్‌రెడ్డి, చక్రవర్తి, మోహన్‌రెడ్డి, ఖాదర్, బాషా, తేజేశ్వరరావు, ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో మేడ్చల్ సబ్‌రిజిస్టార్
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో మేడ్చల్ సబ్‌రిజిస్టార్ కిషన్‌ప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు కిషన్‌ప్రసాద్‌కు చెందిన నాలుగు ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలో కిషన్ ప్రసాద్ చెందని రెండు ఇళ్లలో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న అధికారులు పలు విలువైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు రెండు కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కనుగొన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అల్మాస్గూడ ప్రాంతంలో రెండు ఇళ్లు, రెండు ఎకరాల నాలుగున్నర గుంటల వ్యవసాయ భూమి, హస్తినాపురంలో ఇంటి స్థలంతో పాటు పది తులాల బంగారం, బ్యాంకు పాస్‌పుస్తకాలు గుర్తించారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
నారీమణీ నీకు వందనం!
అనకాపల్లి: అంగవైకల్యం ఆమె ముందు తలవంచింది. పుట్టుకతోనే మరుగుజ్జుగా ఉన్నా ఏనాడూ అధైర్యపడలేదు. మిగిలినవారికి స్ఫూర్తిగా, మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నారు అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ జిలానీబేగం గౌసియా. మదీన్షా, కాదూన్బేబీ దంపతులకు ఐదుగురు సంతానం. వారికి కలిగిన పిల్లల్లో నాలుగో సంతానమైన గౌష్య చిన్నప్పటి నుంచి మరుగుజ్జు. అయినా మొక్కవోనిదీక్ష ఆమెను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. మరుగుజ్జునని బాధపడకుండా బాగా చదువులో రాణించి ఉన్నతస్థాయికి వెళ్లడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోయారు. విశాఖ శివాజీపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో చదివిన ఆమె ఆంధ్రాయూనివర్సిటీ హైస్కూల్లో ఉన్నత తరగతులు, కృష్ణా కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివారు. తర్వాత ఎకనమిక్స్‌లో పీహెచ్డీ చేసిన ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2009లో గ్రూప్–2లో సబ్‌రిజిస్ట్రార్‌గా ఎంపికై టెక్కలి, కొత్తవలస, ప్రస్తుతం అనకాపల్లిలో సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈమెను నర్సీపట్నానికి డిప్యుటేషన్‌పై పంపారు. ఆరోగ్యంగా బాగా ఉండి జీవనోపాధి లేదని ఆలోచించకుండా కష్టించేతత్వం ఉంటే ఉన్నతస్థానాలకు వెళ్లవచ్చని గౌష్య చెబుతున్నారు. లక్ష్యంతో కృషి చేస్తే విజయం తమ దరి చేరుతుందని ఆమె పేర్కొన్నారు. -
తహశీల్దార్లకే భూముల రిజిస్ట్రేషన్ అధికారం
-
రెవె‘న్యూ’పాలన
రిజిస్ట్రేషన్ల శాఖ అధికారాలకు త్వరలోనే కత్తెర పడనుంది. పాలనా సంస్కరణల్లో భాగంగా ఈ శాఖ పరిధి, అధికారాలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విభాగం నిర్వహిస్తున్న విధుల్లో ఎక్కువ భాగం పనులను రెవెన్యూశాఖకు బదలాయించాలని సంకల్పించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ ముగియడంతో త్వరలోనే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. మార్చి 11న జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో పాస్ పుస్తకాలను జారీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే అదే రోజు నుంచి రెవె‘న్యూ’ పాలనకు తెరలేవనుంది. ఇప్పటి వరకు ప్రత్యేక విభాగంగా వ్యవహరించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆ రోజు నుంచి కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి తగ్గనుంది. ఇకపై ఎక్కడైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉందో దాని పరిధి ఆ మండలానికే పరిమితం కానుంది. మిగతా చోట్ల తహసీల్దార్లే రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు. భూముల క్రయ విక్రయాల బాధ్యతలను వారే చూస్తారు. సగం చోట్ల ఖాళీ! ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని సగం మండలాల్లో రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను తహసీల్దార్లే పర్యవేక్షించే పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుత రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 45 మండలాలకుగాను కేవలం 22 మంది సబ్రిజిస్ట్రార్లు మాత్రమే ఉన్నారు. దీంతో వీరు మినహా మిగతా మండలాల బాధ్యతలు తహసీల్లార్ద నెత్తిన పడనున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరులో మాత్రమే రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి. దీంతో ఇవి ప్రతి రోజూ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడుతాయి. ఇకపై ఇవి కేవలం ఆయా నియోజకవర్గ కేంద్రాలకే పరిమితం కానున్నాయి. అయితే, అదే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ప్రభుత్వ ఆదాయంలో సగం ఇక్కడి నుంచే వస్తోంది. ప్రధాన ఆదాయార్జన శాఖగా చెప్పుకునే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భూములు, స్థలాలు, ఇతర దస్తావేజుల నమోదుతో జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా రాబడి లభిస్తోంది. రాజధాని పరిసరాల్లోనే ఉండడం, నగరీకరణ నేపథ్యంలో జిల్లాలో స్థిరాస్తిరంగం బలంగా ఉంది. దీంతో ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు, అగ్రిమెంట్లు సహా ఇతరత్రా డాక్యుమెంట్ల నమోదులోనూ తెలంగాణలోనే ప్రథమ స్థానంలో ఉంది. తాజా నిర్ణయంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిని సంబంధిత మండలానికే పరిమితం చేసినా మిగతా మండలాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ల భారం తహసీల్దార్లను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు యాచారం, మంచాల, కందుకూరు, ఆమనగల్లు, కొత్తూరు, నందిగామ, మొయినాబాద్, కడ్తాల, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో తహసీల్దార్ల ఇతర పనులపై ప్రభావం పడనుంది. అదే సమయంలో భూ వివాదాలు కూడా ఎక్కువే కావడంతో ఈ కొత్త విధులు తమ మెడకు ఎక్కడ చిక్కుకుంటాయోననే ఆ మండలాల తహసీల్దార్లు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు పట్టణ నియోజకవర్గాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అధికంగా ఉన్నందున వీటిని పునర్విభజించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ల విధులను దాదాపుగా రెవెన్యూశాఖకు బదలాయిస్తుండడంతో జిల్లా రిజిస్ట్రార్ బాధ్యతలేమిటనేది చర్చనీయాంశంగా మారింది. -
తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ల అధికారంపై తీర్పు రద్దు
సాక్షి, హైదరాబాద్: ఏదైనా భూమిని ప్రభుత్వానిదిగా పేర్కొంటూ ఆ భూమికి సంబంధించిన సేల్ డీడ్‌ను రద్దు చేయాలని కోరే అధికారం తహసీల్దార్‌కు, అలా కోరినప్పుడు సేల్ డీడ్‌ను రద్దు చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు ఉందంటూ ఇటీవల సింగిల్ జడ్జి జస్టిస్ పి.నవీన్‌రావు ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి తీర్పునివ్వాలంటూ తమ ముందున్న వ్యాజ్యాలను సింగిల్ జడ్జి వద్దకే పంపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా కంది తహసీల్దార్ అభ్యర్థన మేరకు సబ్ రిజిస్ట్రార్ ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే తమ భూమికి చెందిన సేల్ డీడ్‌ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీప్రసన్న, శ్రీనివాసరావు, రంగారావు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ అధికారం ఉందన్న జస్టిస్ నవీన్‌రావు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్ నవీన్‌రావు ఫలానా భూమి ప్రభుత్వానిదని, దానిని ప్రైవేటు వ్యక్తులు రిజిస్టర్ చేయించుకున్నారని, అందువల్ల ఆ సేల్ డీడ్‌ను రద్దు చేయాలని తహసీల్దార్/ఎమ్మార్వో కోరినప్పుడు ఆ డీడ్‌ను రద్దు చేసే అధికారం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఉందని సెప్టెంబర్ 21న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ లక్ష్మీప్రసన్న తదితరులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కాగా, కంది మండలం, కంది చిమ్నాపూర్ గ్రామంలో స్థానిక తహసీల్దార్ అభ్యర్థన మేరకు సబ్ రిజిస్ట్రార్ తమ రెండు సేల్ డీడ్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సతీష్‌యాదవ్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారణ జరిపారు. ఇలా సేల్ డీడ్లను రద్దు చేసే విషయంలో తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్లకు అధికారం ఉందంటూ అంతకు ముందు జస్టిస్ నవీన్‌రావు ఇచ్చిన తీర్పుతో తాను ఏకీభవించడం లేదని జస్టిస్ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఓ భూమిపై యాజమాన్య హక్కులు ఎవరివో తేల్చాల్సింది కోర్టులే తప్ప, తహసీల్దార్/ఎమ్మార్వోలు ఎంత మాత్రం కాదని వ్యాఖ్యానించారు. యాజమాన్య హక్కులు తేల్చడంతో పాటు సేల్డీడ్ల రద్దు కోరే అధికారం వారికి ఇస్తే పలు అనర్థాలు తలెత్తుతాయని అభిప్రాయపడిన విషయం తెలిసిందే. లోతుగా విచారణ జరపాలి.. బుధవారం తమ ముందున్న అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఏళ్ల తరబడి తమ స్వాధీనంలో ఉన్న భూముల విషయంలో అధికారుల జోక్యం తగదని, ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా సేల్ డీడ్లు రద్దు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు చెబుతున్న భూములు ప్రభుత్వ భూములని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సేల్ డీడ్ల రద్దు విషయంలో తహసీల్దార్ చర్యలు చట్టవిరుద్ధమని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఆ భూములు ప్రభుత్వానివని ఏజీ చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందువల్ల ఈ వ్యాజ్యాలపై మళ్లీ సింగిల్ జడ్జే విచారణ జరిపి, అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని తీర్పునివ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తమ ముందున్న అప్పీళ్లను సింగిల్ జడ్జికి పంపింది. ఇప్పుడున్న రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారణ జరపనున్నారు. -
గ్రేటర్ హైదరాబాద్‌లో చేతులు తడిపితేనే..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్ల కాసుల కక్కుర్తి సాధారణ స్థిరాస్తుల దస్త్రావేజులను సైతం పెండింగ్‌లో పడవేసింది. దస్తావేజుల నమోదులో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. మియాపూర్ భూ కుంభకోణం నేపథ్యంలో తవ్విన కొద్ది సబ్ రిజిస్ట్రార్ల అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. నిషేధిత ప్రభుత్వ భూములకు యథేచ్చగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లు... సాధారణ దస్త్రావేజులకు మాత్రం అడిగినంత నజరానాలను ముట్ట చెప్పలేదని పెండింగ్‌లో పడేశారు. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక బృందాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించగా భారీగా పెండింగ్ దస్తావేజులు వెలుగు చూశాయి. హైదరాబాద్ మహా నగర పరిధిలోని 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించగా సుమారు 2.517 దస్తావేజులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలింది. వాటిని పరిశీలించిన అధికారులు కొన్ని దస్తావేజులపై సరైన కారణాలు పేర్కొనకుండానే పెండింగ్‌లో ఉంచినట్లు గుర్తించారు. ఎన్కంబరెన్స్ (ఈసీ) స్టేటస్ కూడా కనిపించకుండా సాంకేతిక తప్పిదాలు చేసినట్లు అధికారులు పసిగట్టారు. కనీసం పెండింగ్ కారణాలను రికార్డు చేసే మినిట్స్ బుక్ నిర్వహణ కూడా లేకపోవడం గమనార్హం. పెండింగ్‌లోనూ టాప్: పెండింగ్ డాక్యుమెంట్ల జాబితాలో కూడా కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్రస్థానంలో నిలిచింది. కూకట్‌పల్లిలో 156, ఎల్బీనగర్లో 150, బాలనగర్లో 78 దస్తావేజులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దస్తావేజులకు స్టాంప్ డ్యూటీ వసూలు చేయకపోవడమే కాకుండా కనీసం మినిట్ బుక్ నిర్వహించకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 71 కింద రిజిస్ట్రేషన్ వచ్చిన ప్రతి డాక్యుమెంట్‌ను అడ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాలు ఉంటే పెండింగ్‌లో పెట్టి తమ వద్దగల రికార్డులు పరిశీలించి ప్రభుత్వ స్ధలమా? కాదా నిర్థారించుకోవాలి. జిల్లారిజిస్ట్రార్ అనుమతితో 30 రోజుల్లో తగిన వివరణతో నమోదు కానీ, తిరస్కరణ కానీ చేయాల్సి ఉంటుంది. దస్తావేజుల నమోదుకు నిర్ధేశిత కారణాలపై అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్ పెండింగ్‌లో పెట్టాలి. లేదా తిరస్కరించాలి. దరఖాస్తుదారుడు పేర్కొన్న కారణం సరైనదేనని భావిస్తే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో పెట్టి నాలుగు నెలలు గడువిచ్చే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు ఉంది. గడువు దాటిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయలంటే జిల్లా రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు సెక్షన్ 47 కింద మార్కెట్ విలువల్లో వ్యత్యాసం ఉంటే 50 శాతం స్టాంప్ డ్యూటీతో డాక్యుమెంట్‌ను పెండింగ్‌లో పెట్టి తదుపరి చర్యలకు జిల్లా రిజిస్ట్రార్లకు రెఫర్ చేయాల్సి ఉంటుంది. గ్రేటర్ పరిధిలో పెండింగ్ రిజిస్ట్రేషన్లు.. రిజిస్ట్రేషన్ జిల్లా పెండింగ్ దస్తావేజులు హైదరాబాద్ 210 హైదరాబాద్ సౌత్ 496 రంగారెడ్డి 1254 మేడ్చల్–మల్కాజిగిరి 557 -
మరో సబ్‌రిజిస్టార్ ఇంటిపై ఏసీబీ దాడులు
-
మరో సబ్‌రిజిస్టార్ ఇంటిపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణల మధ్య మరో సబ్ రిజిస్టార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బాలానగర్ సబ్‌రిజిస్టార్‌గా పని చేస్తున్న యూసుఫ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేటలతో పాటు నగరంలోని మరో 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సబ్ రిజిస్టార్‌ను బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ తనిఖీల్లో రూ. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
మరోసారి చిక్కాడు
కామవరపుకోట: అవినీతి కేసు విచారణలో ఉండగానే మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కామవరపుకోట సబ్ రిజి స్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు. 2013లో వట్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ఆయన పనిచేస్తుండగా కార్యాలయంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు రూ.98 వేలు లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరలా రెడ్ హ్యాండెడ్‌గా ఆయన ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెంకు చెందిన కిరాణా వ్యాపారి పీతల కృష్ణమూర్తి టి.నరసాపురం మండలం అల్లంచర్ల రాజుపాలెంలో రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌కోసం కామవరపుకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాగా సబ్ రిజిస్ట్రార్ ఆళ్ల మధుసూదనరావు రూ.10 వేలు డిమాండ్ చేసినట్టు తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు సోమవారం కృష్ణమూర్తికి రసాయనా లు పూసిన ఐదు రూ.2 వేల నోట్లను ఇచ్చి సబ్ రిజి స్ట్రార్ ఆఫీసుకు పంపామని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం కృష్ణమూర్తి నుం చి సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు రూ.10 వేలు తీసుకుంటుండగా తాము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. ఫిర్యాదుదారు గతంలో ఓ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రాగా రూ.లక్ష డిమాండ్ చేశారని, దీంతో ఫిర్యాదుదారు రిజిస్ట్రేషన్ మానేశారని చెప్పారు. ఇదే సబ్ రిజిస్ట్రార్ 2013లో వట్లూరులో పనిచేస్తుండగా దాడులు చేశామని లెక్కల్లో చూపని రూ.98 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై విచారణ ఇంకా సాగుతోందని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. ఏసీబీ సీఐ విల్సన్, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. కక్షిదారు రిజిస్ట్రేషన్ చేయమన్న స్థలంపై వివాదం చింతలపూడి కోర్టులో నడుస్తుండటం తో వివాదం పరిష్కారమైనట్టు లేఖ తీసుకురావాలని సూచించానని సబ్ రిజిస్ట్రార్ మధుసూదనరావు చెప్పారు. అయితే సోమవారం 1బి కాగితాలు తీసుకువచ్చి చూపిస్తుండగా, ఇవి అవసరం లేదని చెబుతుండగానే కృష్ణమూర్తి కాగితం చుట్ట తన ముఖం మీదకు విసిరేశాడన్నారు. ఇంతలోనే ఏసీబీ అధికారులు వచ్చారని మధుసూదనరావు అంటున్నారు. -
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
ఐ.పోలవరం (ముమ్మిడివరం) : లంచం తీసుకుంటూ ఐ.పోలవరం సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు దొరికి పోయారు. రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం టి.కొత్తపలి్లకి చెందిన మట్లా ఏసుబాబు కుటుంబసభ్యులకు ఉన్న 3.10 ఎకరాలు 9మంది పార్టిష¯ŒS డీడ్ ఈనెల 27న ఐ.పోలవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేష¯ŒS చేయించారు. ఆ డాక్యుమెంట్లు ఇవ్వడానికి రూ.24 వేలు లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ ఎ.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చివరకు రూ.13వేలకు అంగీకరించారు. సబ్ రిజిస్ట్రార్ తీరుతో విసుగెత్తిన రైతు ఏసుబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించి, సబ్ రిజిస్ట్రార్ లంచం అడిగిన ఆడియోను అందజేశారు. దాంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం సాయంత్రం రూ.13వేలకు పౌడర్, రంగు వేసి ఏసుబాబుతో సబ్ రిజిస్ట్రార్‌కు ఇప్పించారు. లంచం తీసుకొంటూ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు చిక్కారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏలూరు ఏసీబీ అధికారి విల్సన్, ఎస్సై నరేష్ సోదాలు చేశారు. సబ్ రిజిస్ట్రార్‌ను విచారించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వారు తెలిపారు. -
ఏసీబీ వలలో అవినీతి చీడ