సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ (42).. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ వలలో చిక్కినందుకు అవమాన భారంతో కుంగిపోయిన నాయక్ చెన్నై చేరుకుని.. అక్కడి లాడ్జిలో ఉరి వేసుకుని మృతి చెందారు.
శ్రీసత్యసాయి జిల్లా గోనిపెంట తండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ ఈ నెల 22న సురేందర్‌రెడ్డి అనే రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మిగిలిన తతంగం పూర్తి చేస్తుండగా.. అదే రోజు రాత్రి గోడ చాటుకు వెళ్లిన శ్రీనివాస్ నాయక్ పారిపోయి చెన్నైలోని మాధవాపురంలో ఓ లాడ్జిలో దిగారు. అదే గదిలో ఉరి వేసుకోగా.. శనివారం లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం.
చదవండి: బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది
Comments
Please login to add a commentAdd a comment