bukkapatnam
-
బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్య
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ (42).. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏసీబీ వలలో చిక్కినందుకు అవమాన భారంతో కుంగిపోయిన నాయక్ చెన్నై చేరుకుని.. అక్కడి లాడ్జిలో ఉరి వేసుకుని మృతి చెందారు. శ్రీసత్యసాయి జిల్లా గోనిపెంట తండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ ఈ నెల 22న సురేందర్‌రెడ్డి అనే రైతు నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మిగిలిన తతంగం పూర్తి చేస్తుండగా.. అదే రోజు రాత్రి గోడ చాటుకు వెళ్లిన శ్రీనివాస్ నాయక్ పారిపోయి చెన్నైలోని మాధవాపురంలో ఓ లాడ్జిలో దిగారు. అదే గదిలో ఉరి వేసుకోగా.. శనివారం లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. చదవండి: బర్త్‌డేకు దుబాయ్ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది -
ఫేస్బుక్ ప్రేమ.. ఇంటి నుంచి వెళ్లిపోయి..
సాక్షి, అనంతపురం: ఫేస్బుక్ ద్వారా అయిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, వారి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో పోలీసుస్టేషన్‌కు చేరిన వ్యవహారం.. చివరికి తహసీల్దార్ కార్యాలయంలో సుఖాంతమైంది. త్రీటౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక మరువకొమ్మ కాలనీకి చెందిన రామకృష్ణ కుమార్తె మంజుల ధరణికి రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో బుక్కపట్నంకు చెందిన విజయ్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ఈ నెల 14న ఇంటి నుంచి వచ్చిన మంజులను విజయ్ బుక్కపట్నం తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకున్నాడు. కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి రామకృష్ణ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంజుల కాల్ డేటా లొకేషన్ ఆధారంగా బుక్కపట్నంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గురువారం ఇద్దరినీ అనంతపురం తీసుకొచ్చారు. ఇద్దరూ మేజర్లని, అడ్డు చెప్పే హక్కు ఎవరికీ ఉండదని కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. రూరల్ తహసీల్దార్ ముందు యువజంటను హాజరుపరిచి ఇంటికి పంపారు. చదవండి: (కన్నతల్లి నిద్రపోతుండగా ప్రియుడితో కలిసి..) -
బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ వెంకట నారాయణ సస్పెన్షన్
సాక్షి, అనంతపురం: కొత్తచెరువులో ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ వెంకటనారాయణను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ రిజిస్టర్ల అక్రమాలపై డీఐజీ సీరియస్ అయ్యారు. 1.92 లక్షల చలానా డబ్బులు ట్రెజరీకి చేరకుండానే వెంకట నారాయణ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే అనంతపురం రూరల్ సబ్ రిజిస్టర్ సురేష్ ఆచారి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. సబ్ రిజిస్టర్ల అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి సమగ్ర విచారణ చేపట్టారు. సురేష్ ఆచారి.. 9 నెలల్లో 1000 అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేలింది. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ హరివర్మ నేతృత్వంలోని బృందం సురేష్ ఆచారి అక్రమాలపై విచారణ చేపట్టింది. గత తొమ్మిది నెలల వ్యవధిలోనే 999 అక్రమ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించింది. ఇందులో 830 అసైన్డ్ భూములకు సంబంధించినవి కాగా, ప్రభుత్వ భూములకు సంబంధించి 165, దేవదాయ శాఖ భూములకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లు ఉన్నాయి. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసినందుకు గాను సదరు సబ్ రిజిస్ట్రార్ రూ.కోట్లలోనే ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవీ చదవండి: సబ్ రిజిస్ట్రార్ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే.. -
ఆధ్యాత్మిక పరిమళం..పుట్టపర్తి
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం.. చిత్రావతి నది ప్రవహించే పుణ్యభూమి.. చదువుల తల్లి(డీమ్డ్ యూనియవర్సిటీ)కి నెలవు. అద్భుత దృశ్యాల(నక్షత్రశాల)కు కొలువు.అతి పెద్దచెరువు(బుక్కపట్నం) ఉన్న ప్రాంతం... లక్షలాది మందికి ప్రాణం పోస్తున్న వైద్యాలయం (సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి) కలిగి ఉన్న దివ్యభూమి.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న నియోజకవర్గం. ప్రశాంతతకు మారుపేరుగా.. మంచితనానికి నిలువెత్తు రూపంగా నిలుస్తోంది. భగవాన్ సత్యసాయి బోధనలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. మొత్తం ఓటర్లు 1,90,930 పురుషులు 95,877 మహిళలు 95,046 బుక్కపట్నం: పుట్టపర్తి నియోజకవర్గం 2009లో ఏర్పడింది. 2004కు ముందు పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, గోరంట్ల మండలాలతో పాటు చిలమత్తూరు మండలంలోని పలు గ్రామాలు, ముదిగుబ్బ మండలం మంగళమడక, గరుగుతండా కొంత భాగం, ధర్మవరం మండలం నేలకోట, ఏలుకుంట్ల, బుడ్డారెడ్డిపల్లి గోరంట్ల నియోజకవర్గంలో ఉండేవి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువులు మండలాలు కలిపి పుట్టపర్తి నియోజకవర్గంగా ఏర్పడ్డాయి. 1983లో టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983, 1985, 1995, 1999 మినహా ఎక్కువ సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. 1978లో మాత్రం పాముదుర్తి రవీంద్రారెడ్డి తన వదిన కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి అయిన పద్మాభాస్కర్రెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన 1978, 1989, 2004లో మూడుసార్లు గెలుపొందగా 1983, 1985లో టీడీపీ నుంచి డాక్టర్ కేశన్న విజయం సాధించారు. 1995, 1999లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గెలిచారు. ఇక 2004లో నిమ్మల కిష్టప్పపై కాంగ్రెస్ అభ్యర్థి పాముదుర్తి రవీంద్రారెడ్డి కేవలం 184 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత 2009 ఎన్నికల్లో పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె రఘునాథరెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కడపల మోహన్‌రెడ్డిపై 1058 ఓట్ల స్వల్ప మెజారిటీతో పల్లె గట్టెక్కారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తకోట సోమశేఖర్‌రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి గెలుపొందారు. ప్రధాన సమస్యలు మారాల రిజర్వాయర్ ఉన్నా పిల్లకాలువలు ఏర్పాటు చేయకపోవడంతో దాదాపు 18 వేల ఎకరాల ఆయకట్టు బీడుగా ఉంది. కృష్ణా జలాలు కళ్ల ముందే పారుతున్నా చెరువులు నింపకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికితోడు సాగునీరు లేక వేలాది ఎకరాలు బీడుగా మారాయి. అమడగూరు మండలంలో సైన్స్ సిటీ భూములు దాదాపు 10 వేల ఎకరాలు వృథాగా ఉన్నాయి. పరిశ్రమలు లేకపోవడంతో వేలాది మంది నిరుద్యోగులు పొట్టకూటి కోసం కర్ణాటక, చైన్నై లాంటి ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. పుట్టపర్తి విమానాశ్రయ విస్తరణ ఆచరణకు నోచుకోవడం లేదు. పుట్టపర్తిని జిల్లాగా చేయాలన్న ఇక్కడి ప్రజలు ఆశలు నెరవేరడం లేదు. గోరంట్లలో పాముదుర్తి వంశీయులదే హవా గోరంట్ల నియోజకవర్గంలో 11 సార్లు ఎన్నికలు జరుగగా ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థులు 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ అభ్యర్థులు గెలిశారు. గోరంట్ల నియోజకవర్గంలో బుక్కపట్నం మండలం పాముదుర్తి వంశీయులదే హవా సాగింది. పాముదుర్తి పెద్ద బయపరెడ్డి హిందూపురం పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించగా ఆయన సోదరుడు పాముదుర్తి రవీంద్రారెడ్డి 1978, 89, 2004లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో ఈయన తిరులేని నేతగా ఉన్నారు. బుక్కపట్నం మండలంలో నేటికీ అనేక గ్రామాలలో రవీంద్రారెడ్డి కుటుంబీకుల ప్రభావం ఉంది. రెండ్లు సారి గెలిచినా ‘పల్లె’ చేసింది శూన్యం పల్లె రఘునాథరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని నియోజకవర్గ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఎన్నికల బరిలో నిలవడంతో అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పుట్టపర్తిలో విమానాల విడిభాగాల పరిశ్రమ ఏర్పాటు, సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు, కృష్ణా జలాలతో నియోజకవర్గంలో అన్ని చెరువులను నింపుతామన్న హామీలు ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. ఇక ఒకటి, రెండు చెరువులను అరకొరగా నింపినా ఒక ఎకరా కూడా సాగులోకి తేలేకపోయారు. దీంతో ఎమ్మెల్యేపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుక్కపట్నం చెరువు ముంపు భూముల రైతులకు ఒక్క పైసా పరిహారం ఇప్పించలేకపోయారు. సుమారు రూ.30 కోట్ల మేర నిధులు మాంజూరైనా పనులు చేయకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డారని, దీంతో ఆ నిధులు వెనక్కు వెళ్లి పోయాయని అసమ్మతి నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ పీసీ గంగన్న బహిరంగంగా ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉండగా పల్లె సొంత పార్టీ నుంచే సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పీసీ గంగన్న ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించగా నియోజకవర్గంలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ రెస్కో చైర్మన్ న్యాయవాది రాజశేఖర్ తన అనుచరులతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఇటీవల పార్టీలో చేరారు. అటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఇటు సొంత పార్టీ నుంచి అసమ్మతి పెరిగిపోవడంతో ‘పల్లె’ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సేవా కార్యక్రమాలతో ‘దుద్దుకుంట’ ప్రజలకు చేరువ 2014వ నుంచి పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని నియమించారు. ఆయన నాటి నుంచి నేటి దాకా తన ట్రస్టు ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. గ్రామాల్లో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా, నియోజకవర్గంలో 40 వేల మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందించటంతో పాటు చదువులో ప్రతిభ కనపరచిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. రావాలి జగన్..కావాలి జగన్, నిన్ను నమ్మం బాబు కార్యక్రమాల ద్వారా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ఇంటింటా వివరించారు. నవరత్నాల పథకాలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. దుద్దు్దకుంట సేవకార్యక్రమాలు, నవరత్నాలతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత వైఎస్సార్సీపీ కలిసివచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
డీఎడ్ ప్రాక్టికల్స్ వాయిదా
బుక్కపట్నం: డైట్, డీఎడ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 31 నుంచి ఆగస్టు 5 వరకు, రెండో విడత ఆగస్టు 7 నుంచి 12 వరకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడినట్లు డైట్ ప్రిన్సిపల్ జనార్దన్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన డైట్లో పరీక్షల నిర్వహణపై జిల్లాలో ఉన్న ప్రయివేట్ డీఎడ్ కళాశాల ప్రిన్సిపాళ్లతో ప్రాక్టికల్స్ పరీక్షలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసే లోగానే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఉన్నాతాధికారుల నుంచి సమాచారం వచ్చిందని, తదుపరి తేదీ ప్రకటించాల్సి ఉందని ప్రిన్సిపల్ తెలిపారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
బుక్కపట్నం: ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి మార్కెట్ ధరలు భారీగా పెరగనున్న నేపథ్యంలో బుధవారం బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం క్రయవిక్రయదారులతో రద్దీగా ఉంది. ఇదే సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇన్స్పెక్టర్లు ఖాదర్‌బాషా, ప్రతాప్‌రెడ్డి, చక్రవర్తి ఆకస్మిక దాడులు నిర్వహించారు. తొమ్మిదిమంది డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి రూ.1,65,995 నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ వెంకటరమణ వద్ద తనిఖీ చేయగా ప్రభుత్వానికి సంబంధించిన రూ.840 ఉందని, ఈ మొత్తం ప్రభుత్వానికి జమ చేయాలని సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు అక్రమమా, సక్రమమా అనే విషయం విచారణలో తేలాల్సి ఉందన్నారు. -
బుక్కపట్నంలో అమెరికా ప్రతినిధి బృందం
- కుండపద్ధతిలో మామిడి సాగు పరిశీలన బుక్కపట్నం : మండలంలో కుండలతో సాగవుతున్న మామిడి తోటలను సోమవారం అమెరికా ప్రతినిధి బృందం పరిశీలించింది. బుక్కపట్నం, బుచ్చయ్యగారిపల్లి రైతులు ఇండో–జర్మన్ ప్రాజెక్టులో భాగంగా కుండల పద్ధతిలో మామిడి తోటలు సాగు చేశారు. అమెరికా ప్రతినిధి బృంద సభ్యులు నటాలియా, నటాలి, శాలినోశర్మ, గోపాల్ ఆధ్వర్యంలో కుండ పద్ధతిని క్షేత్రస్థాయిలో అధ్యనయం చేయడానికి వచ్చారని ఏపీఓ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వారు రైతులతో నేరుగా మాట్లాడి పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కార్యక్రమంలో టీఏ శేఖర్, రైతులు పాల్గొన్నారు. -
ఎంపీటీసీ భర్త దౌర్జన్యాలు చేస్తున్నాడు
ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు అనంతపురం ఎడ్యుకేషన్ : బుక్కపట్నం మండలం కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ ఈశ్వరమ్మ భర్త రామకృష్ణ దౌర్జన్యాలు చేస్తున్నాడని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కె.గోపి వాపోయారు. ఈ మేరకు సోమవారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బుక్కపట్నం శివాలయం వీధిలో నివాసం ఉంటున్న తన మేనకోడలు కె. భార్గవి, మేనల్లుడు కె.లోకేష్‌ను అదే గ్రామానికి చెందిన డి.హరిత, డి.సాయికరణ్, డి.లక్ష్మీదేవి చెప్పులతో దాడిచేసి, బట్టలు చించి అవమాన పరిచారని అతడు వాపోయారు. లోకేష్ తలపై రాయితో దాడి చేశారన్నారు. ఈ విషయమై అదేరోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. దాడికి పాల్పడిన వారి మేనమామ అయిన రామకృష్ణ, అత్త ఎంపీటీసీ ఈశ్వరమ్మ పలుకుబడితో తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ టీచరును కేసులో ఇరికిస్తే రాజీకి వస్తారనే దురుద్దేశంతో తనపై తప్పుడు కేసు పెట్టించారన్నారు. వాస్తవానికి ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని వివరించారు. రామకృష్ణ గతంలోనూ తన మాట వినని పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై తçప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
మరో ముగ్గురికి గాయాలు బుక్కపట్నం (అనంతపురం) : బుక్కపట్నం మండలం కొత్తకోటలో మంగళవారం పిడుగుపాటుకు ఓ యువకుడు దుర్మరణం చెందగా, అతడి తల్లితో పాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... కొత్తకోట గ్రామానికి చెందిన చిత్ర కేశప్ప భార్య ఆదిలక్ష్మమ్మ, కుమారుడు జయచంద్ర గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి చింతచెట్టు కాయలు దులిపేందుకు సమీపంలోని కొండకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో చెట్టుపై పిడుగుపడింది. దీంతో చెట్టు కింద ఉన్న జయచంద్ర (21) అక్కడిక్కడే మృతి చెందగా, అతని తల్లి ఆదిలక్ష్మమ్మతో పాటు గ్రామానికి చెందిన నారాయణ, నరసమ్మలు గాయపడ్డారు. పిడుగుపడిన గంట తర్వాత సమీపంలోని గొర్రెల కాపర్లు వారిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ ఉషారాణి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను ఆర్డీటీ బత్తలపల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడు జయచంద్ర బుక్కపట్నంలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. -
ఆస్తి కోసమే హత్య?
పోలీసుల అదుపులో నిందితుడు – పరారీలో మరో ఇద్దరు కొత్తచెరువు : బుక్కపట్నం చెరువుకట్ట సమీపంలోని నడిమిగుట్ట వద్ద బుధవారం జరిగిన సంకేపల్లికి చెందిన గోపాల్‌నాయుడు హత్యకు ప్రధాన కారణం ఆస్తి కోసమేనని తెలుస్తోంది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. గోపాల్‌నాయుడు ఎనిమిది నెలల కిందట రెండో పెళ్లి చేసుకుని బుక్కపట్నంలో కాపురం పెట్టాడు. అప్పటి నుంచి మొదటి భార్యకు ఆయన దూరంగా ఉంటున్నాడు. రెండో భార్యకు పిల్లలు పుడితే నాయుడు భూమిని పంచాల్సి ఉంటుందని మొదటి భార్య భావించినట్లు భావిస్తున్నారు. ఆస్తంతా తమకే దక్కాలని ఆమె గట్టిగా నిర్ణయించుకున్నట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో నార్పల మండలం పప్పురుకు చెందిన తన సమీప బంధువుతో ఆమె మంతనాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. పథకం అమలులో భాగంగా తనకు దక్కే ఆస్తిలో సగభాగం ఇస్తానని ఆమె చెప్పడంతో అ వ్యక్తి అదే గ్రామానికి చెందిన మరొకరితో పాటు అనంతపురానికి చెందిన ఇంకో వ్యక్తి సహకారంతో హత్యకు అనంతపురంలో పథకం రచించిన సమాచారాన్ని పోలీసులు సేకరించగలిగారు. ఈ కేసులో ఇప్పటికే ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
ఓవరాల్ చాంపియన్ విజేత బుక్కపట్నం
అట్టహాసంగా ముగిసిన డీఎడ్ క్రీడా పోటీలు బుక్కపట్నం : ప్రభుత్వ డైట్, ప్రయివేట్ డీఎడ్ కళాశాలల ఆధ్యర్యంలో స్థానిక చౌడేశ్వరీ ఆలయం వద్ద డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రీడా పోటీలు సోమవారం అట్టహాసంగా ముగిశాయి. బుక్కపట్నం డైట్ కళాశాలతోపాటు జిల్లాలోని 30 డీఎడ్ కళాశాలల్లో శిక్షణ పొందుతున్న ఛాత్రోపా«ధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థినీవిద్యార్థులు ఒవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. విజేత జట్ల వివరాలు : కబడ్డీ బాల,బాలికల విభాగాల్లో బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థులు ఫైనల్లో విజేతలుగా నిలిచారు. రన్నర్స్‌గా జ్ఞాన భారతి (కళ్యాణద్గుం), ఎస్వీ డీఎడ్ కళాశాల (ఓడీసీ) విద్యార్థులు నిలిచారు. వాలీబాల్‌లోనూ బుక్కపట్నం డైట్ క్రీడాకారులు విజేతలుగా నిలిచి సత్తాచాటారు. బాలాజీ కళాశాల (నల్లమాడ) క్రీడాకారులు రన్నర్స్‌గా నిలిచారు. చెస్ పోటీలో : ధర్మవరం హైందవి కళాశాల విద్యార్థులు విజేతలుగా, బుక్కపట్నం డైట్ కళాశాల క్రీడా కారులు రన్నర్స్‌గా నిలిచారు. టెన్నిస్‌లో ఎస్వీ డీఎడ్ కళాశాల జట్టు విజయం సాధించగా, టెన్నికాయిట్‌లో సెయింట్ జోషఫ్ (అనంతపురం) క్రీడాకారులు విజయం సాధించారు. జిల్లా అథ్లెటిక్స్‌లో : 400 మీటర్ల పరుగు పందెం బాలుర విభాగంలో ధర్మవరం హైందవి కళాశాల విద్యార్థి అనిల్‌కుమార్ మొదటి స్థానం, నల్లమాడ బాలాజీ కళాశాల విద్యార్థి మన్సూర్ ద్వితీయ స్థానం, సెయింట్ జోసఫ్ (అనంతపుం) కళాశాల విద్యార్థి మారుతీ తృతీయ స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో : బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థిని శివమ్మ ప్రథమ స్థానం, పెనుకొండ రాణా కళాశాల విద్యార్థిని గీత ద్వితీయ, అనంతపురం బాలాజీ కళాశాల విద్యార్థిని వనజాక్షి తృతీయ స్థానంలో నిలిచారు. లాంగ్ జంప్‌లో బాలికల విభాగం : బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థిని మేఘన మొదటి స్థానం, అనంతపురం జెయింట్ జోసఫ్ కళాశాల విద్యార్థిని ఉమాదేవి ద్వితీయ, అనంతపురం లిటిల్ ఫ్లవర్ కళాశాల విద్యార్థిని మౌనిక తృతీయ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో : ధర్మవరం హైందవి కళాశాలకు చెందిన అశోక్ ప్రథమ స్థానం, ఓడీసీ విజ్ఞాన్ కళాశాల విద్యార్థి గౌస్ ద్వితీయ స్థానం, పెనుకొండ రాణా కళాశాల విద్యార్థి అశోక్‌కుమార్ తృతీయ స్థానంలో నిలిచారు. 800 మీటర్ల పరుగు పందెం బాలుర విభాగంలో : బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థి సురేష్‌కుమార్ మొదటి స్థానం, గుంతకల్ డీఎడ్ కళాశాలకు చెందిన లక్ష్మన్న రెండో స్థానం, అనంతపురం సెయింట్ జోసఫ్ విద్యార్థి గోపి తృతీయ స్థానంలో నిలిచారు. 800 మీటర్ల పరుగు పందెం విభాగంలో : బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థిని శివమ్మ ప్రథమ స్థానం, అనంతపురం సుశీల కళాశాల విద్యార్థిని వనజాక్షి ద్వితీయ స్థానం, ఓడీసీ ఎస్వీ కళాశాల విద్యార్థిని జయదీపిక తృతీయ స్థానంలో నిలిచారు. 4 మీటర్ల రిలే పోటీల్లో బాలుర విభాగంలో : బుక్కపట్నం డైట్, సెయింట్ జోసఫ్, రాణా పెనుకొండ కళాశాలల క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. బాలికల విభాగంలో : బుక్కపట్నం డైట్, రాణా పెనుకొండ, సెయింట్ జోసఫ్ కళాశాలల విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 200 మీటర్ల బాలుర విభాగంలో : అనంతపురం భారతి కళాశాల విద్యార్థి గంగాధర్ ప్రథమ, బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థి ఏకాంత్ ద్వితీయ ,పెనుకొండ రాణా కళాశాల విద్యార్థి అశోక్‌కుమార్ తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. బాలికల విభాగంలో : బుక్కపట్నం డైట్ విద్యార్థిని మేఘన ప్రథమ, బాలాజీ (నల్లమాడ) కళాశాల విద్యార్థిని లత ద్వితీయ, రాణా (పెనుకొండ) కళాశాల విద్యార్థిని గీత తృతీయ స్థానాల్లో నిలిచారు. షాట్ ఫుట్ బాలికల విభాగంలో : అనంతపురం సెయింట్ జోసఫ్ కళాశాల విద్యార్థిని ఉమాదేవి ప్రథమ, అనంతపురం లిటిల్ ఫ్లవర్ విద్యార్థిని త్రివేణి ద్వితీయ, ఓడీసీ ఎస్వీ కళావాల విద్యార్థిని జయదీపిక తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో : అనంతపురం రైసర్ కళాశాలకు చెందిన దేవేంద్ర ప్రథమ, అనంతపురం సుశీల కళాశాల విద్యార్థి రాజేష్ ద్వితీయ, ఓడీసీ ఎస్వీ కళాశాల విద్యార్థి రామాంజి తృతీయ స్థానాల్లో నిలిచారు. పాటల పోటీల్లో : కళ్యాణదుర్గం వివేకానంద కళాశాల విద్యార్థిని సంధ్య ప్రథమ, ఇదే పట్టణానికి చెందిన శ్రీదేవి కళాశాల విద్యార్థిని అఖిలబాను ద్వితీయ, అనంతపురం బాలాజీ డీఎడ్ కళాశాల విద్యార్థి సాంబశివుడు తృతీయ స్థానం లో నిలిచారు. వక్తృత్వపు పోటీల్లో విజేతల వివరాలు : బుక్కపట్నం డైట్ కళాశాల విద్యార్థి అనిల్‌కుమార్, అనంతపురం బాలాజీ కళాశాల విద్యార్థిని అశ్విని, సుశీల కళాశాలకు చెందిన శ్రీనివాసులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. చిత్రలేఖనంలో పోటీల్లో : కళ్యాణదుర్గం శ్రీదేవి కళాశాలకు చెందిన వాణి, గోరంట్ల కళాశాలకు చెందిన దీపిక, ధర్మవరం హైందవి కళాశాలకు చెందిన మణిప్రియ వరుసగా 1,2,3వ స్థానాలు దక్కించుకున్నారు. క్విజ్ పోటీల్లో : పెనుకొండ సత్యసాయి డీఎడ్ కళాశాల విద్యార్థులు రమేశ్, బాలయ్య, బుక్కపట్నం డైట్కళాశాలకు చెందిన లోకేశ్, శివకేశవ, నల్లమాడ బాలాజీ కళాశాలకు చెందిన హరిబాబు, స్వర్ణలతలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినట్లు వ్యాయామ అధ్యాపకుడు రామకష్ణ, నాగరాజులు తెలిపారు. -
నేటి నుంచి డీఎడ్ స్పోర్ట్స్ మీట్
బుక్కపట్నం : స్థానిక చౌడేశ్వరీ ఆలయం వద్దనున్న మైదానంలో శనివారం జిల్లా డీఎడ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్, స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ జనార్దన్‌రెడి, డైట్ వ్యాయామ అధ్యాపకుడు రామక్రిష్ణ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలు 7, 8, 9 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 49 ప్రైవేట్ డీఎడ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారన్నారు. వారికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. -
మళ్లీ ఉత్తుత్తి హామీలేనా?
ప్రారంభానికి నోచుకోని డిగ్రీ కళాశాల పక్కాభవన నిర్మాణం ప్రకటించి ఏడాది దాటినా మంజూరు కాని నిధులు బుక్కపట్నం చెరువుకు నీటి విడుదల హుళక్కేనా? బుక్కపట్నం : హామీ... భరోసా... పూచీ... పదమేదైనా సామాన్యుడిలో మనోధైర్యం పెంచేందుకు దోహదపడుతుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరితో ఈ పదాలపై నేడు ప్రజలు విశ్వాసం కోల్పోయారు. పూటకో హామీని ఇస్తూ... దానిని నెరవేర్చకుండా మభ్య పెట్టేందుకు మరెన్నో పొంతన లేని మాటలతో ప్రజలను దగా చేస్తుండడంతో చంద్రబాబు మాటలకు విలువలేకుండా పోతోంది. ఇందులో భాగంగానే పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకూ గతంలో చంద్రబాబు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. వాటిలో ఏ ఒక్కటీ నెరవేరకపోవడం గమనార్హం. బుధవారం(నేడు) ఆయన బుక్కపట్నం మండలానికి రానున్న నేపథ్యంలో మళ్లీ ఎలాంటి హామీలతో మభ్య పెడతారో అన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలన్నీ నీటిమూటలయ్యాయి. గతంలో ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తిరిగి వాటి ఊసే లేకుండా పోయింది. గత ఏడాది సెప్టెంబర్ 30న కొత్తచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన ‘రైతు కోసం చంద్రన్న’ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆరు నెలల్లోపు బుక్కపట్నం చెరువును నీటితో నింపుతామని ప్రకటించారు. నేటికీ చుక్క నీరు కూడా వదల్లేక పోయారు. బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాలను కలుపుతూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామంటూ హామీనిచ్చిన ముఖ్యమంత్రి చివరకు ఈ ప్రతిపాదనకు సున్నా చేట్టేశారు. బుక్కపట్నం డిగ్రీ కళాశాలకు పక్కా భవనాల నిర్మాణం చేస్తామంటూ విజయవాడలో ఆర్భాటంగా ప్రకటించారు. నేటికీ ఈ హామీకి దిక్కుమొక్కులేకుండా పోయింది. పలుమార్లు విన్నవించుకున్నా... బుక్కపట్నంలో 1984లో భగవాన్ సత్యసాయిబాబా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ కళాశాలను బాలుర ఉన్నత పాఠశాలలోనే ప్రారంభించారు. పక్కా భవనం నిర్మించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను కళాశాల సిబ్బంది, పుర ప్రజలు పలుమార్లు విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రకటనకే పరిమితమైన నిధుల మంజూరు గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్‌ల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉన్నత విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆనాటి ఈ సమావేశంలో వారు సీఎం మాట్లాడుతూ.. బుక్కపట్నంలో కళాశాల పక్కా భవనాల నిర్మాణం కోసం తక్షణమే రూ. 50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రతికలు సైతం ప్రముఖంగా ప్రచురించాయి. ఆ తర్వాత నిధుల మంజూరు విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఇప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో పనులు మొదలు పెట్టలేకపోయారు. కళాశాల నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చి ఐదు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. వారి దాతృత్వం కూడా సీఎం వైఖరితో నిష్ర్పయోజనమైపోయింది. -
కడుపు ఉబ్బుతోంది..
= బాధతో విలవిలలాడుతున్న బాలుడు = తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు = వైద్య సాయం కోసం వేడుకోలు కడుపు నిండా తిండి తినలేక.. కంటినిండా నిద్రపోలేక.. క్షణక్షణం భరించలేని బాధతో విలవిలలాడుతున్న తనయుడిని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చూపించినా జబ్బు నయం కాకపోవడంతో కుమిలిపోతున్నారు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన దళిత ఆదెప్ప, శ్రీలతలు దంపతులు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు లోకేశ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఎంతో చలాకీగా ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లివచ్చేవాడు. అలాంటి ఈ చిన్నారికి ఆరు నెలల క్రితం కడుపునొప్పి వచ్చింది. క్రమేణా కడుపు ఉబ్బుతుండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఆర్డీటీ ఆస్పత్రిలోను, కర్నూలు ప్రభుత్వాస్పత్రిలోనూ చికిత్స చేయించారు. కడుపు ఉబ్బరం వచ్చి కాలేయం దెబ్బతిందంటూ కొందరు వైద్యులు, టీబీ లక్షణాలు ఉన్నాయని మరికొందరు వైద్యులు తెలిపి మందులిచ్చారు. అయినా జబ్బు నయం కాలేదు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తోంది. విపరీతమైన బాధ ఉంటుండటంతో రాత్రిపూట నిద్రకూడా పట్టడం లేదు. అసలు ఇంతకూ ఇది ఏ జబ్బో తెలుసుకుని, బాగు చేయించుకోవడానికి పెద్ద ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ కుమారుడికి వైద్యం అందించాలని ప్రాధేయపడుతున్నారు. . దాతలు సంప్రదించవలసిన చిరునామా సాకే ఆదెప్ప బ్యాంకు ఖాతా నంబరు : 32697931879 స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, బుక్కపట్నం ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్ 4412 సెల్ నంబరు : 99632 10389 -
సర్టిఫికెట్ల పరిశీలన తేదీ మార్పు
బుక్కపట్నం : 2016 ఎల్పీ సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తేదీలో ప్రభుత్వం మార్పు చేసిందని డైట్ ప్రిన్సిపాల్ జనార్దన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఈనెల 26,27 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. అభ్యర్థులు ప్రొవిజనల్ అలాంట్మెంట్లోని ఒరిజి నల్, జిరాక్స్ సర్టిఫికెట్లు తీసుకురావాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. వచ్చే నెల 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. -
చంద్రబాబుతోనే రుణాలు కట్టించుకోండి
బుక్కపట్నం: ‘ఎన్నికల ముందు బ్యాంకుల్లో ఎంత మొత్తం అప్పులున్నా, ఏ ఒక్క మహిళా రుణాలను చెల్లించవద్దని, అధికారంలోకి వస్తే అన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.. ఆ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించాం.. అందుకే ఆయన వద్దే రుణాలు కట్టించుకోండి.. మేము మాత్రం పైసా కూడా చెల్లించం..’ అంటూ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన డ్వాక్రా మహిళలు బ్యాంకర్లకు తేల్చిచెప్పారు. బుక్కపట్నం ఎస్బీఐలో మహిళలు తీసుకున్న అప్పుల వసూలుకు స్థానిక పాఠశాలలో శనివారం బ్యాంకు మేనేజర్ నారాయణమూర్తి సమావేశం నిర్వహించారు. గ్రామంలోని 30 మహిళా సంఘాలకు రూ.1.50 కోట్ల రుణాలిచ్చినట్లు ఆయన చెప్పారు. బకాయిలు సక్రమంగా చెల్లించకపోవటంతో వడ్డీ పెరుగుతోందని, తరువాత అది భారమవుతుందని పేర్కొన్నారు. అప్పులను వెంటనే తీర్చాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు తాము రుణాలు కట్టేదిలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రకటించిన గ్రూపునకు లక్ష రూపాయలు బ్యాంకులో తమ ఖాతాలకు జమ చేయాలని, అంతవరకు కట్టవలసిన మొత్తాలకు అదనపు వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, అప్పుడే బకాయిలను చెల్లిస్తామని చెప్పారు. గతంలో తమ ప్రమేయం లేకుండా తమ ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసుకున్నారని, ఆ సొమ్మును మొదట జమ చేయాలని డిమాండ్ చేశారు. -
పోలింగ్ నిలిపివేయాలంటూ 'పల్లె' హల్చల్
అనంతపురం జిల్లా బుక్కపట్నంలోని 64వ నెంబరు పోలింగ్ బూత్‌లో టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి హల్చల్ చేశారు. పోలింగ్ నిలిపివేయాలంటూ ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. కారణం లేకుండా పోలింగ్ నిలిపివేయడానికి కుదరదని ఎన్నికల అధికారులు ఎంత చెప్పినా పల్లె రఘునాథ రెడ్డి మాత్రం వినిపించుకోలేదు. జరిగిన సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతపురం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఎన్నికలను కొనసాగించాలని ఆదేశాంచారు. ఆయన ఆదేశాల మేరకు బుక్కపట్నంలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటమి ఎదురవుతుందన్న భయంతోనే రఘునాథరెడ్డి ఇలా చేశారని అంటున్నారు. -
హైనాను కొట్టి చంపిన 'అనంత' వాసులు
పుట్టపర్తి: అనంతపురం జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అడవి జంతువు హైనాను స్థానికులు కొట్టి చంపారు. పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల్లో 25 మందిపై దాడి చేసి గాయపరిచిన హైనాను పట్టుకుని కొట్టి చంపారు. పొలానికి వెళ్లిన పలువురు రైతులపై హైనా దాడి చేసింది. హైనా దాడిలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే రైతులపై దాడిచేసింది చిరుతపులి అని ముందు అనుకున్నారు. చివరకు హైనాగా గుర్తించి పట్టుకున్నారు. హైనాను కొట్టి చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.