
సాక్షి, అనంతపురం: ఫేస్‌బుక్ ద్వారా అయిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, వారి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో పోలీసుస్టేషన్‌కు చేరిన వ్యవహారం.. చివరికి తహసీల్దార్ కార్యాలయంలో సుఖాంతమైంది. త్రీటౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక మరువకొమ్మ కాలనీకి చెందిన రామకృష్ణ కుమార్తె మంజుల ధరణికి రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో బుక్కపట్నంకు చెందిన విజయ్‌తో పరిచయం ఏర్పడింది.
కొన్నాళ్లకే ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. ఈ నెల 14న ఇంటి నుంచి వచ్చిన మంజులను విజయ్ బుక్కపట్నం తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకున్నాడు. కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి రామకృష్ణ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంజుల కాల్ డేటా లొకేషన్ ఆధారంగా బుక్కపట్నంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గురువారం ఇద్దరినీ అనంతపురం తీసుకొచ్చారు. ఇద్దరూ మేజర్లని, అడ్డు చెప్పే హక్కు ఎవరికీ ఉండదని కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. రూరల్ తహసీల్దార్ ముందు యువజంటను హాజరుపరిచి ఇంటికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment