ఎంపీటీసీ భర్త దౌర్జన్యాలు చేస్తున్నాడు | Complaint on mptc husband | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ భర్త దౌర్జన్యాలు చేస్తున్నాడు

Published Tue, May 2 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

బుక్కపట్నం మండలం కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ ఈశ్వరమ్మ భర్త రామకృష్ణ దౌర్జన్యాలు చేస్తున్నాడని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కె.గోపి వాపోయారు. ఈ మేరకు సోమవారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

  •  ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు
  • అనంతపురం ఎడ్యుకేషన్‌ : బుక్కపట్నం మండలం కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ ఈశ్వరమ్మ భర్త రామకృష్ణ దౌర్జన్యాలు చేస్తున్నాడని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కె.గోపి వాపోయారు. ఈ మేరకు సోమవారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బుక్కపట్నం శివాలయం వీధిలో నివాసం ఉంటున్న తన మేనకోడలు కె. భార్గవి, మేనల్లుడు కె.లోకేష్‌ను అదే గ్రామానికి చెందిన డి.హరిత, డి.సాయికరణ్, డి.లక్ష్మీదేవి చెప్పులతో దాడిచేసి, బట్టలు చించి అవమాన పరిచారని అతడు వాపోయారు. లోకేష్‌ తలపై రాయితో దాడి చేశారన్నారు. ఈ విషయమై అదేరోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. దాడికి పాల్పడిన వారి మేనమామ అయిన రామకృష్ణ, అత్త ఎంపీటీసీ ఈశ్వరమ్మ పలుకుబడితో తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ టీచరును కేసులో ఇరికిస్తే రాజీకి వస్తారనే దురుద్దేశంతో తనపై తప్పుడు కేసు పెట్టించారన్నారు. వాస్తవానికి ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని వివరించారు. రామకృష్ణ గతంలోనూ తన మాట వినని పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై తçప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement