mptc husband
-
ఎంపీటీసీ భర్త దౌర్జన్యాలు చేస్తున్నాడు
ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు అనంతపురం ఎడ్యుకేషన్ : బుక్కపట్నం మండలం కేంద్రంలో అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ ఈశ్వరమ్మ భర్త రామకృష్ణ దౌర్జన్యాలు చేస్తున్నాడని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కె.గోపి వాపోయారు. ఈ మేరకు సోమవారం ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బుక్కపట్నం శివాలయం వీధిలో నివాసం ఉంటున్న తన మేనకోడలు కె. భార్గవి, మేనల్లుడు కె.లోకేష్‌ను అదే గ్రామానికి చెందిన డి.హరిత, డి.సాయికరణ్, డి.లక్ష్మీదేవి చెప్పులతో దాడిచేసి, బట్టలు చించి అవమాన పరిచారని అతడు వాపోయారు. లోకేష్ తలపై రాయితో దాడి చేశారన్నారు. ఈ విషయమై అదేరోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. దాడికి పాల్పడిన వారి మేనమామ అయిన రామకృష్ణ, అత్త ఎంపీటీసీ ఈశ్వరమ్మ పలుకుబడితో తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ టీచరును కేసులో ఇరికిస్తే రాజీకి వస్తారనే దురుద్దేశంతో తనపై తప్పుడు కేసు పెట్టించారన్నారు. వాస్తవానికి ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని వివరించారు. రామకృష్ణ గతంలోనూ తన మాట వినని పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై తçప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
బోర్ విషయమై ఎంపీటీసీ భర్తపై దాడి
హైదరాబాద్: బోర్ వేసే విషయంలో తలెత్తిన వివాదంతో ఎంపీటీసీ భర్తపై దాడి జరిగిన ఘటన హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ షాహెదా భర్త హామెద్(40) ఆదివారం ఉదయం ఎర్రకుంటలో బోర్ వేయిస్తున్నాడు. బాసిత్‌ఖాన్, షేక్ మస్తాన్, మహ్మద్ షకీల్‌లు బోర్ వేయరాదంటూ ఆయనతో వాగ్వివాదానికి దిగారు. దీంతో 60 ఫీట్లు మాత్రమే బోర్ వేసి వెనుదిరిగారు. బాసిత్‌ఖాన్, మస్తాన్, షకీల్‌లు ఎంపీటీసీ భర్త హామేద్ ఖాన్‌పై సాయంత్రం ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. తీవ్ర గాయాలకు గురైన హామెద్‌ను స్థానికులు వెంటనే బాలాపూర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఎంపీటీసీ భర్త ఆత్మహత్య
వేములపల్లి : అప్పుల బాధతో ఓ ఎంపీటీసీ భర్త ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కుక్కడం గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కుక్కడం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కుప్ప పద్మ భర్త కుప్ప కృష్ణ(42) ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కృష్ణ తన ఐదు ఎకరాల భూమితో పాటు మరో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంటను పండించాడు. భారీగా అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడి రాలేదు. అంతేకాకుండా మరో వైపు గత ఏడాది జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ క్రమంలో సుమారు రూ. 6లక్షల అప్పులు ఉన్నట్లు సమాచారం. రోజురోజుకీ వడ్డీ పెరిగిపోతుండటంతో పాటు అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. ఈ క్రమంలోనే శనివారం భార్యను రాయినిగూడెంలో ఉన్న అమ్మగారింటికి పంపి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన పక్కింటి యువకుడు స్థానికులకు చెప్పడంతో హుటాహుటిన అతనిని మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని నిర్థారించారు. విషయం తెలిసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.