ఓవరాల్‌ చాంపియన్‌ విజేత బుక్కపట్నం | Overall Champion bukkapatnam | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంపియన్‌ విజేత బుక్కపట్నం

Published Mon, Jan 9 2017 11:18 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Overall Champion bukkapatnam

  • అట్టహాసంగా ముగిసిన డీఎడ్‌ క్రీడా పోటీలు 
  •  

    బుక్కపట్నం :    ప్రభుత్వ డైట్‌, ప్రయివేట్‌ డీఎడ్‌ కళాశాలల ఆధ్యర్యంలో స్థానిక చౌడేశ్వరీ ఆలయం వద్ద డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రీడా పోటీలు సోమవారం అట్టహాసంగా ముగిశాయి. బుక్కపట్నం డైట్‌ కళాశాలతోపాటు జిల్లాలోని 30 డీఎడ్‌ కళాశాలల్లో  శిక్షణ పొందుతున్న ఛాత్రోపా«ధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. బుక్కపట్నం డైట్‌ కళాశాల విద్యార్థినీవిద్యార్థులు ఒవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.

    విజేత జట్ల వివరాలు :   కబడ్డీ బాల,బాలికల విభాగాల్లో బుక్కపట్నం డైట్‌ కళాశాల విద్యార్థులు ఫైనల్లో విజేతలుగా నిలిచారు. రన్నర్స్‌గా జ్ఞాన భారతి (కళ్యాణద్గుం), ఎస్‌వీ డీఎడ్‌ కళాశాల (ఓడీసీ) విద్యార్థులు నిలిచారు. వాలీబాల్‌లోనూ బుక్కపట్నం డైట్‌ క్రీడాకారులు విజేతలుగా నిలిచి సత్తాచాటారు. బాలాజీ కళాశాల (నల్లమాడ) క్రీడాకారులు రన్నర్స్‌గా నిలిచారు.

    చెస్‌ పోటీలో : ధర్మవరం హైందవి కళాశాల విద్యార్థులు విజేతలుగా,  బుక్కపట్నం డైట్‌ కళాశాల క్రీడా కారులు రన్నర్స్‌గా నిలిచారు.  టెన్నిస్‌లో ఎస్‌వీ డీఎడ్‌ కళాశాల  జట్టు విజయం సాధించగా, టెన్నికాయిట్‌లో సెయింట్‌ జోషఫ్‌ (అనంతపురం) క్రీడాకారులు విజయం సాధించారు. 

    జిల్లా అథ్లెటిక్స్‌లో :  400 మీటర్ల పరుగు పందెం బాలుర విభాగంలో ధర్మవరం హైందవి కళాశాల విద్యార్థి అనిల్‌కుమార్‌ మొదటి స్థానం, నల్లమాడ బాలాజీ కళాశాల విద్యార్థి మన్సూర్‌ ద్వితీయ స్థానం, సెయింట్‌ జోసఫ్‌ (అనంతపుం) కళాశాల విద్యార్థి మారుతీ తృతీయ స్థానంలో నిలిచారు.

    బాలికల విభాగంలో : బుక్కపట్నం డైట్‌ కళాశాల విద్యార్థిని శివమ్మ ప్రథమ స్థానం, పెనుకొండ రాణా కళాశాల విద్యార్థిని గీత ద్వితీయ, అనంతపురం బాలాజీ కళాశాల విద్యార్థిని వనజాక్షి తృతీయ స్థానంలో నిలిచారు. 

    లాంగ్‌ జంప్‌లో బాలికల విభాగం  :  బుక్కపట్నం డైట్‌ కళాశాల విద్యార్థిని మేఘన మొదటి స్థానం, అనంతపురం జెయింట్‌ జోసఫ్‌ కళాశాల విద్యార్థిని ఉమాదేవి ద్వితీయ,   అనంతపురం లిటిల్‌ ఫ్లవర్‌ కళాశాల విద్యార్థిని మౌనిక తృతీయ స్థానంలో నిలిచారు.

    బాలుర విభాగంలో : ధర్మవరం హైందవి కళాశాలకు చెందిన అశోక్‌ ప్రథమ స్థానం, ఓడీసీ విజ్ఞాన్‌ కళాశాల విద్యార్థి గౌస్‌ ద్వితీయ స్థానం, పెనుకొండ రాణా కళాశాల విద్యార్థి అశోక్‌కుమార్‌ తృతీయ స్థానంలో నిలిచారు.

    800 మీటర్ల పరుగు పందెం బాలుర విభాగంలో : బుక్కపట్నం డైట్‌ కళాశాల విద్యార్థి సురేష్‌కుమార్‌ మొదటి స్థానం, గుంతకల్‌ డీఎడ్‌ కళాశాలకు చెందిన లక్ష్మన్న రెండో స్థానం, అనంతపురం సెయింట్‌ జోసఫ్‌ విద్యార్థి గోపి తృతీయ స్థానంలో నిలిచారు.

    800 మీటర్ల పరుగు పందెం విభాగంలో : బుక్కపట్నం డైట్‌ కళాశాల విద్యార్థిని శివమ్మ ప్రథమ స్థానం, అనంతపురం సుశీల కళాశాల విద్యార్థిని వనజాక్షి ద్వితీయ స్థానం, ఓడీసీ ఎస్‌వీ కళాశాల విద్యార్థిని జయదీపిక తృతీయ స్థానంలో నిలిచారు.

    4  మీటర్ల రిలే పోటీల్లో బాలుర విభాగంలో :   బుక్కపట్నం డైట్, సెయింట్‌ జోసఫ్‌, రాణా పెనుకొండ కళాశాలల క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు.

    బాలికల విభాగంలో : బుక్కపట్నం డైట్, రాణా పెనుకొండ, సెయింట్‌ జోసఫ్‌ కళాశాలల విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

    200 మీటర్ల బాలుర విభాగంలో : అనంతపురం భారతి కళాశాల విద్యార్థి గంగాధర్‌ ప్రథమ,  బుక్కపట్నం డైట్‌ కళాశాల విద్యార్థి ఏకాంత్‌ ద్వితీయ ,పెనుకొండ రాణా కళాశాల విద్యార్థి అశోక్‌కుమార్‌ తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.

    బాలికల విభాగంలో : బుక్కపట్నం డైట్‌ విద్యార్థిని మేఘన ప్రథమ,  బాలాజీ (నల్లమాడ) కళాశాల విద్యార్థిని లత ద్వితీయ, రాణా (పెనుకొండ) కళాశాల విద్యార్థిని గీత తృతీయ స్థానాల్లో నిలిచారు.

    షాట్‌ ఫుట్‌ బాలికల విభాగంలో : అనంతపురం సెయింట్‌ జోసఫ్‌  కళాశాల విద్యార్థిని   ఉమాదేవి ప్రథమ, అనంతపురం లిటిల్‌ ఫ్లవర్‌ విద్యార్థిని త్రివేణి ద్వితీయ, ఓడీసీ ఎస్‌వీ కళావాల విద్యార్థిని జయదీపిక తృతీయ స్థానాల్లో నిలిచారు.

     బాలుర విభాగంలో :  అనంతపురం రైసర్‌ కళాశాలకు చెందిన దేవేంద్ర ప్రథమ, అనంతపురం సుశీల కళాశాల విద్యార్థి రాజేష్‌ ద్వితీయ,  ఓడీసీ ఎస్‌వీ కళాశాల విద్యార్థి రామాంజి తృతీయ స్థానాల్లో నిలిచారు.

    పాటల పోటీల్లో :  కళ్యాణదుర్గం వివేకానంద కళాశాల విద్యార్థిని సంధ్య ప్రథమ, ఇదే పట్టణానికి చెందిన శ్రీదేవి కళాశాల విద్యార్థిని అఖిలబాను ద్వితీయ, అనంతపురం బాలాజీ డీఎడ్‌ కళాశాల విద్యార్థి సాంబశివుడు తృతీయ స్థానం లో నిలిచారు.

    వక్తృత్వపు పోటీల్లో విజేతల వివరాలు : బుక్కపట్నం డైట్‌ కళాశాల విద్యార్థి అనిల్‌కుమార్, అనంతపురం బాలాజీ కళాశాల విద్యార్థిని అశ్విని,    సుశీల కళాశాలకు చెందిన శ్రీనివాసులు వరుసగా  ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

    చిత్రలేఖనంలో పోటీల్లో :   కళ్యాణదుర్గం శ్రీదేవి కళాశాలకు చెందిన వాణి, గోరంట్ల కళాశాలకు చెందిన దీపిక, ధర్మవరం హైందవి కళాశాలకు చెందిన మణిప్రియ వరుసగా 1,2,3వ స్థానాలు దక్కించుకున్నారు.

    క్విజ్‌ పోటీల్లో :  పెనుకొండ సత్యసాయి డీఎడ్‌ కళాశాల విద్యార్థులు  రమేశ్, బాలయ్య, బుక్కపట్నం డైట్‌కళాశాలకు చెందిన లోకేశ్, శివకేశవ, నల్లమాడ బాలాజీ కళాశాలకు చెందిన హరిబాబు, స్వర్ణలతలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినట్లు వ్యాయామ అధ్యాపకుడు రామకష్ణ, నాగరాజులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement