సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు | acb rides on sub regestror office | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

Published Wed, Jul 26 2017 11:02 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

acb rides on sub regestror office

బుక్కపట్నం: ఆగస్ట్‌ ఒకటో తేదీ నుంచి మార్కెట్‌ ధరలు భారీగా పెరగనున్న నేపథ్యంలో బుధవారం బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం క్రయవిక్రయదారులతో రద్దీగా ఉంది. ఇదే సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇన్‌స్పెక్టర్లు ఖాదర్‌బాషా, ప్రతాప్‌రెడ్డి, చక్రవర్తి ఆకస్మిక దాడులు నిర్వహించారు. తొమ్మిదిమంది డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద నుంచి రూ.1,65,995 నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటరమణ వద్ద తనిఖీ చేయగా ప్రభుత్వానికి సంబంధించిన రూ.840  ఉందని, ఈ మొత్తం ప్రభుత్వానికి జమ చేయాలని సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు. డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు అక్రమమా, సక్రమమా అనే విషయం విచారణలో తేలాల్సి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement