sub regestror office
-
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
బుక్కపట్నం: ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి మార్కెట్ ధరలు భారీగా పెరగనున్న నేపథ్యంలో బుధవారం బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం క్రయవిక్రయదారులతో రద్దీగా ఉంది. ఇదే సమయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇన్స్పెక్టర్లు ఖాదర్‌బాషా, ప్రతాప్‌రెడ్డి, చక్రవర్తి ఆకస్మిక దాడులు నిర్వహించారు. తొమ్మిదిమంది డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి రూ.1,65,995 నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ వెంకటరమణ వద్ద తనిఖీ చేయగా ప్రభుత్వానికి సంబంధించిన రూ.840 ఉందని, ఈ మొత్తం ప్రభుత్వానికి జమ చేయాలని సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు అక్రమమా, సక్రమమా అనే విషయం విచారణలో తేలాల్సి ఉందన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డీఐజీ
హిందూపురం అర్బన్ : హిందూపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సేవలు పునరుద్ధరణ చర్యలను స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ గిరికుమార్, జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ ఆంజినేయులు పర్యవేక్షించారు. గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొత్త కంప్యూటర్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. ఈ నెల 15న అర్ధరాత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో పోలీసులు రంగంలో దిగి విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా వన్‌టౌన్ సీఐ ఈదూర్‌బాషా కూడా తరలివచ్చి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు.