హిందూపురం అర్బన్ : హిందూపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సేవలు పునరుద్ధరణ చర్యలను స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ గిరికుమార్, జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ ఆంజినేయులు పర్యవేక్షించారు. గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొత్త కంప్యూటర్ల ఏర్పాటు పనులను పరిశీలించారు.
ఈ నెల 15న అర్ధరాత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో పోలీసులు రంగంలో దిగి విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా వన్‌టౌన్ సీఐ ఈదూర్‌బాషా కూడా తరలివచ్చి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డీఐజీ
Published Thu, Aug 25 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
Advertisement
Advertisement