
శ్రీ సత్యసాయి జిల్లా: మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అడ్డదార‍్లు తొక్కుతున్నారు. నోరు తెరిస్తే బ్లడ్డు...బ్రీడు అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే బాలకృష్ణ నీచ రాజకీయానికి తెరతీశారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి బెంగళూరులో క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రెండున్నర నెలలుగా ఖాళీగా ఉన్న హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ఎప్పటిలా తన కుటిల రాజకీయాలకు తెరతీసింది. ఇందుకోసం ఎమ్మెల్యే బాలకష్ణనే రంగంలో దిగారు. తనకు అనుకూలమైన వారిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఇందులో భాగంగా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్సార్‌సీపీ ఒక్కో కౌన్సిలర్‌కు రూ.10 లక్షలు చొప్పున కొనుగోలు చేశారు. అలా మొత్తంగా 12మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ను కొనుగోలు చేసింది. అనంతరం వారిని బస్సుల్లో బెంగళూరులో టీడీపీ ఏర్పాటు చేసిన క్యాంప్‌కు తరలించింది. మరింత మందిని ప్రలోభాలకు గురి చేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే బెదిరింపులతో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు.. తిరిగి సొంతగూటికి చేరారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న పెడుతున్న ప్రలోభాలు, బెదిరింపులకు భయపడి టీడీపీలో చేరితో భవిష్యత్తు నాశనం అవుతుందని భావిస్తున్న కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగేలా తీర్మానించారు.
కాగా, హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు ఉండగా.. గత ఎన్నికల్లో 30 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేయడం గమనార్హం.

Comments
Please login to add a commentAdd a comment