mla bala krishna
-
‘ఫొటో దిగారుగా వెళ్లిపోండి’.. గ్రామస్తులపై బాలకృష్ణ చిందులు
సాక్షి, కృష్ణా జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి అసహనానికి గురయ్యారు. మా ఊరిని అభివృద్ధి చేయరు అంటూ విజ్ఞప్తి చేసిన గ్రామస్థులపై కస్సుబుస్సుమన్నారు. 'ఫొటో దిగారుగా.. చాలు ఇక వెళ్లిపోండి' అంటూ ఫైరయ్యారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. అయితే, నిమ్మకూరుకు వచ్చిన బాలకృష్ణను కలిసేందుకు ఆయన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలు గ్రామస్తులు వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు.. బాలకృష్ణను పలకరించారు. ఫొటోలు సైతం దిగారు.అనంతరం, మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని కొమరవోలు గ్రామస్తులు బాలకృష్ణను కోరారు. అందుకు ఆయన ‘నేను పట్టించుకోను.. ఫొటోలు దిగారుగా వెళ్లండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరవోలు గ్రామమా? అదెక్కడ ఉంది? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో, తన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలును బాలకృష్ణ విస్మరించడం, అసహనం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
నీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
శ్రీ సత్యసాయి జిల్లా: మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అడ్డదార్లు తొక్కుతున్నారు. నోరు తెరిస్తే బ్లడ్డు...బ్రీడు అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకునే బాలకృష్ణ నీచ రాజకీయానికి తెరతీశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి బెంగళూరులో క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నర నెలలుగా ఖాళీగా ఉన్న హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ఎప్పటిలా తన కుటిల రాజకీయాలకు తెరతీసింది. ఇందుకోసం ఎమ్మెల్యే బాలకష్ణనే రంగంలో దిగారు. తనకు అనుకూలమైన వారిని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఇందులో భాగంగా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని ఎమ్మెల్యే బాలకృష్ణ వైఎస్సార్సీపీ ఒక్కో కౌన్సిలర్‌కు రూ.10 లక్షలు చొప్పున కొనుగోలు చేశారు. అలా మొత్తంగా 12మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ను కొనుగోలు చేసింది. అనంతరం వారిని బస్సుల్లో బెంగళూరులో టీడీపీ ఏర్పాటు చేసిన క్యాంప్‌కు తరలించింది. మరింత మందిని ప్రలోభాలకు గురి చేసేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే బెదిరింపులతో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు.. తిరిగి సొంతగూటికి చేరారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న పెడుతున్న ప్రలోభాలు, బెదిరింపులకు భయపడి టీడీపీలో చేరితో భవిష్యత్తు నాశనం అవుతుందని భావిస్తున్న కౌన్సిలర్లు వైఎస్సార్సీపీలోనే కొనసాగేలా తీర్మానించారు. కాగా, హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు ఉండగా.. గత ఎన్నికల్లో 30 వార్డుల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేయడం గమనార్హం. -
బ్యాట్‌తో బాలయ్య హల్చల్
సాక్షి, హిందూపురం : టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సందడి చేశారు. బ్యాట్ పట్టి కాసేపు మైమరిపించారు. శనివారం స్థానిక ఎంజీఎం గ్రౌండ్లో బసవతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను పరిచయం చేసుకున్న బాలయ్య.. అనంతరం బ్యాట్‌తో ఢిఫెన్స్ షాట్స్ ఆడుతూ అభిమానులను అలరించారు. ఎప్పుడూ సినిమాల్లో డైలాగ్‌లతో మెప్పించే బాలకృష్ణ తమ వద్ద బ్యాట్ పట్టుకునే సరికి అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ ప్రాంగణమంతా ఆహ్లాదకరమైన దావాతావరణం నెలకొంది. -
చండీ మహాయాగంలో పాల్గొన్న బాలకృష్ణ
హైదరాబాద్ : లోక కల్యాణార్థం, సకల సౌభాగ్యాలు కాంక్షిస్తూ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన చండీ మహాయాగంలో ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఆస్పత్రి ఆవరణలోని విజయగణపతి స్వామి ఆలయంలో ఈ నెల17వ తేదీన ప్రారంభమైన చండీయాగం శనివారంతో ముగిసింది. ఇందులో భాగంగా బాలకృష్ణ పాల్గొని మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి చండీ రుద్రహోమం, చంద్రమౌళీశ్వరస్వామికి అభిషేకం జరిగాయి. మహాపూర్ణాహుతి అనంతరం బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.