బ్యాట్‌తో బాలయ్య హల్‌చల్‌ | Tdp Mla Balayya plays cricket in hindupur | Sakshi
Sakshi News home page

బ్యాట్‌తో బాలయ్య హల్‌చల్‌

Published Sat, Dec 30 2017 12:27 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

 Tdp Mla Balayya plays cricket in hindupur - Sakshi

సాక్షి, హిందూపురం : టాలీవుడ్‌ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సందడి చేశారు. బ్యాట్‌ పట్టి కాసేపు మైమరిపించారు. శనివారం స్థానిక ఎంజీఎం గ్రౌండ్‌లో బసవతారకం మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను పరిచయం చేసుకున్న బాలయ్య.. అనంతరం బ్యాట్‌తో ఢిఫెన్స్‌ షాట్స్‌ ఆడుతూ అభిమానులను అలరించారు. ఎప్పుడూ సినిమాల్లో డైలాగ్‌లతో మెప్పించే బాలకృష్ణ తమ వద్ద బ్యాట్‌ పట్టుకునే సరికి అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ ప్రాంగణమంతా ఆహ్లాదకరమైన దావాతావరణం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement