cricket tourny
-
శిఖర్ ధావన్ ఊచకోత.. కేవలం 29 బంతుల్లోనే! అయినా
బిగ్ క్రికెట్ లీగ్ 2024లో టీమిండియా మాజీ ఓపెనర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ లీగ్‌లో నార్తరన్ ఛాలెంజర్స్‌కు సారథ్యం వహిస్తున్న ధావన్.. సోమవారం ఎంపీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.గబ్బర్ తనదైన స్టైల్లో షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 29 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ధావన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్తరన్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో 12 పరుగుల తేడాతో ధావన్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నార్తరన్ బ్యాటర్లలో ధావన్‌తో పాటు గురుకీరత్ సింగ్ మాన్(32 బంతుల్లో 73, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.నమన్ ఓజా సూపర్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎంపీ టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఎంపీ టైగర్స్ బ్యాటర్లలో నమన్ ఓజా(55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో మెరవగా.. సాకేత్ శర్మ(78) హాఫ్ సెంచరీతో రాణించాడు. నార్తరన్ బౌలర్లలో కుందన్ కుమార్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ బిగ్ క్రికెట్లో పాకిస్తాన్ మినహా అన్ని దేశాల మాజీ క్రికెటర్లు భాగమయ్యారు. -
బ్యాట్‌తో బాలయ్య హల్చల్
సాక్షి, హిందూపురం : టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో సందడి చేశారు. బ్యాట్ పట్టి కాసేపు మైమరిపించారు. శనివారం స్థానిక ఎంజీఎం గ్రౌండ్లో బసవతారకం మెమోరియల్ క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను పరిచయం చేసుకున్న బాలయ్య.. అనంతరం బ్యాట్‌తో ఢిఫెన్స్ షాట్స్ ఆడుతూ అభిమానులను అలరించారు. ఎప్పుడూ సినిమాల్లో డైలాగ్‌లతో మెప్పించే బాలకృష్ణ తమ వద్ద బ్యాట్ పట్టుకునే సరికి అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ ప్రాంగణమంతా ఆహ్లాదకరమైన దావాతావరణం నెలకొంది. -
అనంతపురం, చిత్తూరు జట్ల విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా ఆర్డీటీ సహకారంతో నిర్వహిస్తున్న అండర్–19 అంతర్ జిల్లాల బాలికల క్రికెట్ టోర్నీలో అనంతపురం, చిత్తూరు జట్లు విజయం సాధించాయి. మంగళవారం అనంత క్రీడా గ్రామంలో నిర్వహించిన టోర్నీలో అనంతపురం - కడప, చిత్తూరు - కర్నూలు జట్లు తలపడ్డాయి. - విన్సెంట్ క్రీడా మైదానంలో కర్నూలు, చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి కర్నూలు జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కర్నూలు జట్టు 60 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అనంతరం జట్టులో పావని 38, ఎన్ అనూష 21 పరుగులతో రాణించడంతో కర్నూలు జట్టు 140 పరుగులకు కుప్పకూలింది. చిత్తూరు జట్టు బౌలర్లు ఇ.పద్మజ 3, కె.హంస 3, ప్రవల్లిక 2 వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చిత్తూరు జట్టు 31.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో పద్మజ 41, ప్రవల్లిక 41 పరుగులతో రాణించారు. కర్నూలు జట్టులో కేపీ సురేఖ 3 వికెట్లు సాధించింది. దీంతో చిత్తూరు జట్టు 5 వికెట్లతో విజయం సాధించింది. - బీ మైదానంలో అనంతపురం - కడప జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కడప జట్టు 35.2 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది. అనంత బౌలర్లలో హర్షవర్ధిని 4, బి.అనూష 3 వికెట్లు తీసి కడప జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. మరో బౌలర్ హిమజ 1 వికెట్ తీసి వారికి తన వంతు తోడ్పాటందించింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు లక్ష్యఛేదనలో మొదట తడబడింది. 80 పరుగులతో పటిష్టంగా ఉన్న తరుణంలో మిడిలార్డర్ అనూష, ఓపెనర్ పల్లవి వికెట్లను వెంటవెంటనే కోల్పోయి కష్టాల్లో పడింది. హర్షవర్ధిని తన 16 పరుగులతో జట్టుకు విజయాన్నందించింది. ఓపెనర్ పల్లవి 41 పరుగులతో జట్టును ఆదుకుంది. అనంతపురం జట్టు 25.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో అనంతపురం జట్టు 4 వికెట్లతో విజయం సాధించింది. టోర్నీలో నేడు : బుధవారం విన్సెంట్ క్రీడా మైదానంలో నెల్లూరు - కర్నూలు జట్లు, చిత్తూరు - కడప జట్లు బీ క్రీడా మైదానంలో తలపడతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. -
లెజెండ్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: కాప్రస్ ఐటీ బీఎన్ఐ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో లెజెండ్ జట్టు విజేతగా నిలిచింది. కొంపల్లిలో డైమండ్ జట్టుతో సోమవారం జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న డైమండ్ జట్టు 18.4 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. శరద్ చంద్ర (20) టాప్ స్కోరర్. కేఆర్కే రెడ్డి 3 వికెట్లతో చెలరేగగా... రథన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 94 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన లెజెండ్ జట్టు 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసి గెలిచింది. సుధీర్ (36) ధాటిగా ఆడాడు. డైమండ్ బౌలర్లలో జార్జ్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. -
23 నుంచి ఫాదర్ క్రికెట్ టోర్నీ
అనంతపురం సప్తగిరిసర్కిల్ : రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్మారకార్థం 23వ తేదీ నుంచి జిల్లాలోని జర్నలిస్టులకు క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐపీఎల్ తరహాలో జేపీఎల్ టోర్నీ ఉంటుందన్నారు. జిల్లాకు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేసిన సేవలకు గుర్తింపుగా టోర్నీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టు క్రీడాకారులు నియోజకవర్గాల వారీగా జట్లుగా ఏర్పడి తమ పేర్లను 18వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 90597 57771 నంబరు సంప్రదించాలని కోరారు. -
నేడు రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్ టోర్నీ
అనంతపురం అర్బన్ : రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ఆదివారం నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మొదట క్రికెట్ టోర్నీని కలెక్టర్ కోన శశిధర్ ప్రారంభిస్తారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆ వివరాలను శనివారం వారు కలెక్టరేట్లో విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు పని ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమన్నారు. అందులో భాగంగానే రెండు సంఘాలు సంయుక్తంగా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే సమయాభావం వల్ల నిర్ణయించిన తేదీ కన్నా ముందే క్రికెట్ పోటీలు మొదలుపెడుతున్నట్లు తెలిపారు. స్థానిక ఆర్డీటీ స్టేడియంలో ఆదివాకరం ఉదయం 8 గంటలకు క్రికెట్ టోర్నీని కలెక్టర్ ప్రారంభిస్తారన్నారు. క్రికెట్ మ్యాచ్‌లు ఇలా... ఆర్డీటీ స్టేడియంలో ఆదివారం ఉదయం 8 గంటలకు పెనుకొండ, అనంతపురం రెవెన్యూ జట్ల మధ్య, ధర్మవరం, కదిరి రెవెన్యూ జట్ల మధ్య పోటీ ఉంటుంది. విజేతలైన జట్లతో మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్, కళ్యాణదుర్గం రెవెన్యూ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 9 గంటలకు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. -
విజృంభించిన ప్రతీక్, గౌరవ్
సాక్షి, హైదరాబాద్: శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ బ్యాట్స్‌మెన్ ప్రతీక్ (132 బంతుల్లో 192; 24 ఫోర్లు, 1 సిక్సర్), గౌరవ్ రెడ్డి (109 బంతుల్లో 178 నాటౌట్; 29 ఫోర్లు) విజృంభించారు. బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నీరజ్ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో 290 పరుగుల తేడాతో ఆజట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీచైతన్య కాలేజ్ జట్టు 45 ఓవర్లలో 3 వికెట్లకు 438 పరుగులు చేసింది. ప్రతీక్ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకోగా... గౌరవ్ రెడ్డి అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం 439 పరుగుల భారీ లక్ష్యఛేదనలో నీరజ్ పబ్లిక్ స్కూల్ తడబడింది. 45 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. శశాంక్ లోకేశ్ (62నాటౌట్), మొహమ్మద్ ఇస్మారుుల్ (32) పోరాడారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు సెయింట్ మేరీస్ (యూసఫ్‌గూడ): 275 ( గోపీ 157, శ్రీకాంత్ 57; మొహమ్మద్ ఫహాద్ 4/47, దుర్గేశ్ యాదవ్ 5/51), సుప్రీమ్ హైస్కూల్: 149 (తరుణ్ 35; శ్రీకాంత్ 5/32, నిహాంత్ 4/78). గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్: 217 (రుత్విక్ 49 నాటౌట్, జ్ఞాన ప్రకాశ్ 79; ప్రణయ్ అగర్వాల్ 3/31, సహేంద్ర మల్లు 5/47), ఓక్రిడ్‌జ: 126 (సహేంద్ర 50, జ్ఞాన ప్రకాశ్ 4/38). -
ఖమ్మం గెలుపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రి కెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లా బాలికల క్రికెట్ టోర్నమెంట్లో ఖమ్మం జట్టు, కంైబె న్డ్ డిస్ట్రిక్ ఎలెవన్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కంబైన్డ్ ఎలెవన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లకు 66 పరుగులు చేసింది. అనంతరం ఖమ్మం జట్టు 9 ఓవర్లలో 2 వికెట్లకు 67 పరుగులు చేసి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో నిజామాబాద్ జట్టు 27 పరుగుల తేడాతో నల్గొండ జట్టుపై విజయం సాధించింది. తొలుత నిజామాబాద్ 10 ఓవర్లలో 2 వికెట్లకు 93 పరుగులు చేయగా... నల్గొండ జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లకు 66 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టు 10 వికెట్ల తేడాతో కరీంనగర్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కరీంనగర్ 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేయగా... ఆదిలాబాద్ జట్టు 8.3 ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా 76 పరుగులు చేసింది. -
హైదరాబాద్ పరాజయం
హైదరాబాద్: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు 164 పరుగుల తేడాతో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) చేతిలో ఓడింది. చెన్నైలో శనివారం ముగిసిన ఈ రెండు రోజుల మ్యాచ్‌లో చివరి రోజు ఆటలో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ బి. సందీప్ (127 బంతుల్లో 115 నాటౌట్; 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించాడు. డానీ డెరిక్ ప్రిన్స్ 49 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ 77 ఓవర్లలో 255 పరుగులు చేసి ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో విఘ్నేష్, ఎం. అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు. సిద్ధార్థ్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలిరోజు ఆటలో తమిళనాడు జట్టు 3 వికెట్ల నష్టానికి 419 పరుగుల భారీస్కోరు చేసింది.