హైదరాబాద్ పరాజయం | hyderabad defeated by tnca | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ పరాజయం

Published Sun, Aug 7 2016 11:13 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

hyderabad defeated by tnca

హైదరాబాద్: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు 164 పరుగుల తేడాతో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) చేతిలో ఓడింది. చెన్నైలో శనివారం ముగిసిన ఈ రెండు రోజుల మ్యాచ్‌లో చివరి రోజు ఆటలో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ బి. సందీప్ (127 బంతుల్లో 115 నాటౌట్; 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించాడు.

 

డానీ డెరిక్ ప్రిన్స్ 49 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ 77 ఓవర్లలో 255 పరుగులు చేసి ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో విఘ్నేష్, ఎం. అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు. సిద్ధార్థ్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలిరోజు ఆటలో తమిళనాడు జట్టు 3 వికెట్ల నష్టానికి 419 పరుగుల భారీస్కోరు చేసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement