లెజెండ్‌ జట్టుకు టైటిల్‌ | legend team got IT BNA cricket title | Sakshi
Sakshi News home page

లెజెండ్‌ జట్టుకు టైటిల్‌

Published Tue, Feb 28 2017 10:33 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

లెజెండ్‌ జట్టుకు టైటిల్‌

లెజెండ్‌ జట్టుకు టైటిల్‌

సాక్షి, హైదరాబాద్‌: కాప్రస్‌ ఐటీ బీఎన్‌ఐ క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో లెజెండ్‌ జట్టు విజేతగా నిలిచింది. కొంపల్లిలో డైమండ్‌ జట్టుతో సోమవారం జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న డైమండ్‌ జట్టు 18.4 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది.

 

శరద్‌ చంద్ర (20) టాప్‌ స్కోరర్‌. కేఆర్‌కే రెడ్డి 3 వికెట్లతో చెలరేగగా... రథన్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 94 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన లెజెండ్‌ జట్టు 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసి గెలిచింది. సుధీర్‌ (36) ధాటిగా ఆడాడు. డైమండ్‌ బౌలర్లలో జార్జ్‌ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement