శిఖర్‌ ధావన్‌ ఊచకోత.. కేవలం 29 బంతుల్లోనే! అయినా | Shikhar Dhawan smashes 66 off 29 balls in Big Cricket League 2024 | Sakshi
Sakshi News home page

BCL 2024: శిఖర్‌ ధావన్‌ ఊచకోత.. కేవలం 29 బంతుల్లోనే! అయినా

Published Mon, Dec 16 2024 8:01 PM | Last Updated on Mon, Dec 16 2024 8:06 PM

Shikhar Dhawan smashes 66 off 29 balls in Big Cricket League 2024

బిగ్‌ క్రికెట్‌ లీగ్‌ 2024లో టీమిండియా మాజీ ఓపెనర్‌ విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఈ లీగ్‌లో నార్తరన్‌ ఛాలెంజర్స్‌కు సారథ్యం వహిస్తున్న ధావన్‌.. సోమవారం ఎంపీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

గబ్బర్‌ తనదైన స్టైల్లో షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 29 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ధావన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్తరన్‌ ఛాలెంజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో 12 పరుగుల తేడాతో ధావన్‌ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నార్తరన్‌ బ్యాటర్లలో ధావన్‌తో పాటు గురుకీరత్ సింగ్ మాన్(32 బంతుల్లో 73, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు.

నమన్‌ ఓజా సూపర్‌ సెంచరీ..
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఎంపీ టైగర్స్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఎంపీ టైగర్స్ బ్యాటర్లలో నమన్‌ ఓజా(55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో మెరవగా.. సాకేత్‌ శర్మ(78) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. నార్తరన్‌ బౌలర్లలో కుందన్‌ కుమార్‌ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ బిగ్‌ క్రికెట్‌లో పాకిస్తాన్‌ మినహా అన్ని దేశాల మాజీ క్రికెటర్లు భాగమయ్యారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement