Shikar Dhawan
-
శిఖర్ ధావన్ ఊచకోత.. కేవలం 29 బంతుల్లోనే! అయినా
బిగ్ క్రికెట్ లీగ్ 2024లో టీమిండియా మాజీ ఓపెనర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ లీగ్‌లో నార్తరన్ ఛాలెంజర్స్‌కు సారథ్యం వహిస్తున్న ధావన్.. సోమవారం ఎంపీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.గబ్బర్ తనదైన స్టైల్లో షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 29 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ధావన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్తరన్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో 12 పరుగుల తేడాతో ధావన్ జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. నార్తరన్ బ్యాటర్లలో ధావన్‌తో పాటు గురుకీరత్ సింగ్ మాన్(32 బంతుల్లో 73, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.నమన్ ఓజా సూపర్ సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎంపీ టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఎంపీ టైగర్స్ బ్యాటర్లలో నమన్ ఓజా(55 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో మెరవగా.. సాకేత్ శర్మ(78) హాఫ్ సెంచరీతో రాణించాడు. నార్తరన్ బౌలర్లలో కుందన్ కుమార్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ బిగ్ క్రికెట్లో పాకిస్తాన్ మినహా అన్ని దేశాల మాజీ క్రికెటర్లు భాగమయ్యారు. -
మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న శిఖర్ ధావన్..
టీమిండియా మాజీ ఓపెనర్ మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది అగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు ధావన్ విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధావన్ భారత్ వేదికగా జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో గుజరాత్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. ఇప్పుడు మరో ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు గబ్బర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.నేపాల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్లో ఈ ఢిల్లీ ఆటగాడు భాగం కానున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్-2024లో కర్నాలీ యాక్స్ ఫ్రాంచైజీకి ధావన్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. కాగా ధావన్‌కు టీ20ల్లో మంచి రికార్డు ఉంది. టీ20ల్లో అతడు 9,797 పరుగులు చేశాడు. ఐపీఎల్లో కూడా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ధావన్(6769) రెండో స్ధానంలో ఉన్నాడు.ఇక ఎన్పీఎల్ విషయానికి వస్తే.. ఈ లీగ్‌లో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. కర్నాలీ యాక్స్‌తో పాటు బిరత్‌నగర్ కింగ్స్, చిత్వాన్ రైనోస్, జనక్‌పూర్ బోల్ట్స్, ఖాట్మండు గూర్ఖాస్, లుంబినీ లయన్స్, పోఖరా ఎవెంజర్స్, సుదుర్పాస్చిమ్ రాయల్స్ మిగితా ఏడు జట్లగా ఉన్నాయి. ఈ లీగ్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనుంది. ఈ టోర్నీకి సబంధించి పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.చదవండి: అతడి కోసం నా ప్లేస్‌ను త్యాగం చేశా.. చెప్పి మరీ సెంచరీ బాదాడు: సూర్య -
LLC 2024: క్రిస్ గేల్ ఊచకోత.. ధావన్ మెరుపులు (వీడియో)
విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి తమలో ఏమాత్రం జోరుతగ్గలేదని మరోసారి నిరూపించారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)2024లో గేల్, ధావన్ మెరుపులు మెరిపించారు.ఈ లీగ్‌లో గుజరాత్ గ్రేట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ లెజెండరీ క్రికెటర్లు.. శుక్రవారం కోనార్క్ సూర్యాస్ ఓడిశా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. కోనార్క్ జట్టు కెప్టెన్ టాస్ గెలిచి తొలుత గుజరాత్ టీమ్‌ను బ్యాటింగ్ ఆహ్హనించాడు.గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వ్యాన్ వాయక్(2)ను ఆదిలోనే పేసర్ వినయ్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గేల్..ధావన్‌తో కలిసి ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.గేల్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేయగా.. ధావన్ 24 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరితో ప్రసన్న(31) పరుగులతో రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ గ్రేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది.అనంతం 142 పరుగుల లక్ష్యంతో దిగిన కోనార్క్ కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోనార్క్ బ్యాటర్లలో మునివీరా(47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓబ్రియన్(43) పరుగులతో రాణించాడు.Chris Gayle 🤝 Shikhar Dhawan. 🔥- Gabbar and universe Boss together in the LLC. 🤯 pic.twitter.com/N8r4pbtQ3f— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2024 -
ముగిసిన లెజెండ్స్ లీగ్ వేలం.. భారీ ధర అతడికే
లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)-2024 సెప్టెంబర్ 20న ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ క్రికెట్ టోర్నీ.. ఇప్పుడు మూడో సీజన్‌కు సిద్దమవుతోంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గోనునున్నాయి. తొలి సీజన్(2022)లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా.. రెండువ సీజన్లో మణిపాల్ టైగార్స్ ఛాంపియన్‌గా అవతరించింది.ఇక ఇది ఇలా ఉండగా.. ఎల్ఎల్సీ మూడో సీజన్‌కు సంబంధించిన వేలం ముంబై వేదికగా గురువారం(ఆగస్టు 29)న జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్ ఈ ఏడాది ఎల్ఎల్సీ సీజన్లో భాగం కావడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. వేలానికి ముందే శిఖర్ ధావన్‌ను గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకోగా.. కార్తీక్‌తో సదరన్ సూపర్ స్టార్స్ ఒప్పందం కుదర్చుకుంది.అయితే ధావన్, కార్తీక్‌ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఎంత మొత్తం వెచ్చించియో వెల్లడించలేదు. వీరిద్దరూ మినహా మిగితా క్రికెటర్లందరూ వేలంలో పాల్గోనున్నారు. మొత్తం ఈ వేలంలో దాదాపు 300 మంది క్రికెటర్లు పాల్గోనగా.. 97 మంది మాత్రమే అమ్ముడు పోయారు. ఈ 97 మంది క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఆరు ఫ్రాంచైజీలు మొత్తం రూ. 39.63 కోట్లు వెచ్చించాయి. ఈ వేలంలో శ్రీలంకకు చెందిన ఇసురు ఉదానా అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ. అర్బనైజర్స్ హైదరాబాద్ అతడిని రూ. 62 లక్షలకు సొంతం చేసుకుంది.ఉదానా తర్వాత భారీ ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ నిలిచాడు. అతడిని కూడా అర్బన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కాగా బ్రెట్‌లీ, దిల్షాన్, షాన్ మార్ష్, ఫించ్, ఆమ్లా వంటి దిగ్గజ క్రికెటర్లు అమ్ముడుపోలేదు.వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..మణిపాల్ టైగర్స్హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, తిసర పెరీరా, షెల్డన్ కాట్రెల్, డాన్ క్రిస్టియన్, ఏంజెలో పెరీరా, మనోజ్ తివారీ, అసేలా గుణరత్నే, సోలమన్ మిరే, అనురీత్ సింగ్, అబు నెచిమ్, అమిత్ వర్మ, ఇమ్రాన్ ఖాన్, రాహుల్ శుక్లా, అమిటోజ్ సింగ్, ప్రవీణ్ గుప్తా, సౌరభ్ గుప్తా .ఇండియా క్యాపిటల్స్ యాష్లే నర్స్, బెన్ డంక్, డ్వేన్ స్మిత్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, నమన్ ఓజా, ధవల్ కులకర్ణి, క్రిస్ మ్ఫోఫు, ఫైజ్ ఫజల్, ఇక్బాల్ అబ్దుల్లా, కిర్క్ ఎడ్వర్డ్స్, రాహుల్ శర్మ, పంకజ్ సింగ్, జ్ఞానేశ్వరరావు, భరత్ చిప్లి, పర్వీందర్ అవానా, పవన్ సుయాల్, మురళీ సుయాల్ విజయ్, ఇయాన్ బెల్.గుజరాత్ జెయింట్స్క్రిస్ గేల్, లియామ్ ప్లంకెట్, మోర్నే వాన్ వైక్, లెండిల్ సిమన్స్, అసోహర్ అఫోహాన్, జెరోమ్ టేలర్, పరాస్ ఖాడా, సీక్కుగే ప్రసన్న, కమౌ లెవర్రాక్, సైబ్రాండ్ ఎనోయెల్బ్రెచ్ట్, షానన్ గాబ్రియేల్, సమర్ క్వాద్రీ, మహమ్మద్ కైఫ్, శ్రీసన్హవాన్, శ్రీసన్హవాన్.కోణార్క్ సూర్యస్ ఒడిశాఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, కెవిన్ ఓ బ్రియాన్, రాస్ టేలర్, వినయ్ కుమార్, రిచర్డ్ లెవీ, దిల్షన్ మునవీర, షాబాజ్ నదీమ్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, బెన్ లాఫ్లిన్, రాజేష్ బిష్ణోయ్, ప్రవీణ్ తాంబే, దివేష్ పఠానియా, కేపీ అప్పన్న, అంబటి రాయుడు, అంబటి రాయుడు.సదరన్ సూపర్ స్టార్స్దినేష్ కార్తీక్, ఎల్టన్ చిగుంబుర, హామిల్టన్ మసకద్జా, పవన్ నేగి, జీవన్ మెండిస్, సురంగ లక్మల్, శ్రీవత్స్ గోస్వామి, హమీద్ హసన్, నాథన్ కౌల్టర్ నైల్, చిరాగ్ గాంధీ, సుబోత్ భాటి, రాబిన్ బిస్ట్, జెసల్ కరీ, చతురంగ డి సిల్వా, మోను కుమార్అర్బన్రైజర్స్ హైదరాబాద్సురేష్ రైనా (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, డ్వేన్ స్మిత్, టినో బెస్ట్, స్టువర్ట్ బిన్నీ, క్రిస్టోఫర్ ఎంఫోఫు, అస్గర్ ఆఫ్ఘన్, చమర కపుగెదెరా, పీటర్ ట్రెగో, రిక్కీ క్లార్క్, పవన్ సుయాల్, ప్రజ్ఞాన్ ఓజా, శివ కాంత్ శుక్లా, సుదీప్ త్యాగి, తిరుమలశెట్టి సుమన్, యోగేష్ నగర్, షాదాబ్ జకాతి, జెరోమ్ టేలర్, గురుకీరత్ మాన్, అమిత్ పౌనికర్, దేవేంద్ర బిషూ. -
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ రిటైర్ మెంట్
-
శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
టీమిండియా సీనియర్ క్రికెటర్, ఓపెనర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధావన్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ క్రికెట్లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు తెలిపాడు.As I close this chapter of my cricketing journey, I carry with me countless memories and gratitude. Thank you for the love and support! Jai Hind! 🇮🇳 pic.twitter.com/QKxRH55Lgx— Shikhar Dhawan (@SDhawan25) August 24, 2024 ఇక, ఈ వీడియోలో శిఖర్ ధావన్.. దేశం తరఫున ఆడినందుకు చాలా గర్వంగా ఉందన్నాడు. ఇక తన ప్రయాణంలో తనకు ఎంతో మంది.. సహాయం చేశారని, వారి వల్ల ఈ స్థాయికి వచ్చానని కూడా తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఐ, డీడీసీఏ, తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. కాగా, టీమిండియా తరఫున శిఖర్ ధావన్.. 167 వన్డే మ్యాచ్‌లు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడాడు. టీమిండియాకు ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక, వన్డేల్లో శిఖర్ ధావన్ 17 సెంచరీలతో 6793 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఏడు సెంచరీలతో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 పరుగులు సాధించాడు. అయితే, ధావన్ ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
వారెవ్వా అభిషేక్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో
బెంగాల్ ప్రో టీ20-2024 సీజన్లో సంచలన క్యాచ్ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మేదినీపూర్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హౌరా వారియర్స్ ఆటగాడు అభిషేక్ దాస్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఊహకందని రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మేదినీపూర్ విజార్డ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మేదినీపూర్ ఇన్నింగ్స్ 19వ వేసిన ఫాస్ట్ బౌలర్ కనిష్క్ సేథ్.. దీపక్ కుమార్ మహతోకు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. దీంతో దీపక్ కుమార్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అందరూ సిక్స్ అని భావించారు. కానీ లాంగాన్‌లో ఉన్న అభిషేక్ దాస్ అద్బుతం చేశాడు. అభిషేక్ వెనక్కి వెళ్తూ జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో ఫ్లయింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అభిషేక్ కూడా క్యాచ్ పట్టిన వెంటనే టీమిండియా స్టార్ శిఖర్ ధావన్ స్టైల్లో సెలబ్రేషన్స్ జరుపునకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 🏏🔥 What a catch! Abhishek Das's incredible reflexes are absolutely breathtaking! 🤯👏 ..#BengalProT20 #FanCode @bengalprot20 pic.twitter.com/WuAUcMZren— FanCode (@FanCode) June 15, 2024 -
క్రికెటర్ కావాలన్నది మా నాన్న కల.. చాలా సంతోషంగా ఉంది: పంత్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి మైదానంలో అడగుపెట్టిన రిషబ్.. ఐపీఎల్-2024లో అదరగొట్టాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించిన పంత్.. ఆ జట్టు తరపున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ ఏడాది సీజన్లో ఓవరాల్‌గా 13 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. పునరాగమనంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పంత్‌కు టీ20 వరల్డ్‌కప్-2024 భారత జట్టులో సైతం సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న ఈ ఢిల్లీ డైనమెట్.. వరల్డ్‌కప్‌నకు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు శిఖర్ ధావన్ టాక్ షో 'ధావన్ కరేంగే'లో రిషబ్ పాల్గోనున్నాడు. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలను పంత్ పంచుకున్నాడు. తనను క్రికెటర్‌గా చూడాలన్న తన తండ్రి కలను నేరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని పంత్ చెప్పుకొచ్చాడు. నేను క్రికెటర్ కావాలనేది మా నాన్న కల. మా నాన్న కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు క్రికెటర్ని కావాలని నిర్ణయించుకున్నాను. మా నాన్న నాకు 14వేల విలువైన బ్యాట్‌ని బహుమతిగా ఇచ్చాడు. అయితే మా అమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది అంటూ నవ్వుతూ" పంత్ పేర్కొన్నాడు. -
స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు!
సినిమా హీరోలు అనగానే కాస్ట్ లీ బట్టలు, ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్.. చాలామందికి ఇవే గుర్తొస్తాయి. కానీ వీళ్లలో చాలా తక్కువ మంది మీడియా కంటికి కనిపించకుండా చాలా సాధారణంగా జీవిస్తుంటాడు. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఓ స్టార్ హీరో కొడుకు గురించి. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే స్టార్ హీరో తండ్రిగా ఉన్నాడు. కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ కొడుకు మాత్రం సెకండ్ హ్యాండ్ బట్టలే వాడుతున్నాడట.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. హిట్ ఫ్లాప్‌తో వరస మూవీస్ చేస్తూనే ఉంటాడు. రీసెంట్‌గానే 'బడే మియా చోటే మియా' సినిమాతో వచ్చాడు. కానీ ఘోరమైన ఫెయిల్యూర్ అందుకున్నాడు. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ హోస్టింగ్ చేస్తున్న 'ధావన్ కరేంగే' అనే టాక్ షోకు అక్షయ్.. గెస్ట్‌గా వచ్చాడు. తన కొడుకు ఆరవ్ గురించి ఎవరికీ తెలియని విషయాల్ని బయటపెట్టాడు.'నేను, ట్వింకిల్ (అక్షయ్ భార్య).. ఆరవ్‌ని పెంచిన విధానంపై నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే అతడు చాలా సాధారణమైన అబ్బాయి. ఇది చెయ్ అది చెయ్ అని అతడిని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. వాడికి సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు. కానీ ఫ్యాషన్‌పై ఆసక్తి ఉంది. ఆరవ్.. 15 ఏళ్లకే లండన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లాడు. అయితే అతడి వెళ్లాలని మేం కోరుకోలేదు. కానీ వెళ్తుంటే ఆపలేదు. ఎందుకంటే నేను కూడా 14 ఏళ్లప్పుడే ఇంటి నుంచి బయటకొచ్చాను. ఆరవ్.. ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటాడు. మంచి డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు కానీ ఖరీదైన బట్టలు కొనడు. సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే థ్రిప్టీ అనే షాప్‌కి వెళ్తాడు. అతడికి డబ్బు వేస్ట్ చేయడం ఇష్టం లేదు. అందుకే ఇలా చేస్తున్నాడు' అని అక్షయ్, తన కొడుకు గురించి సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు.(ఇదీ చదవండి: నటి, యాంకర్ శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న వార్నింగ్) -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జితేష్ శర్మ..
ఐపీఎల్-2024 సీజన్లో తమ చివరి మ్యాచ్ ఆడేందుకు పంజాబ్ కింగ్స్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్కమ్రించిన పంజాబ్.. కనీసం తమ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి సీజన్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది.ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ వ్యవహరించనున్నాడు. పంజాబ్ తత్కాలిక కెప్టెన్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కుర్రాన్ టీ20 వరల్డ్‌కప్-2024కు సన్నద్దమయ్యేందుకు తన స్వదేశానికి వెళ్లిపోయాడు.ఈ క్రమంలోనే చివరి మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు జితేష్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. పంజాబ్ ఫ్రాంచైజీకి జితేష్ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. కాగా పంజాబ్ రెగ్యూలర్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా సీజన్లో మధ్యలోనే వైదొలిగాడు. దీంతో సామ్కుర్రాన్కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను పంజాబ్ అప్పగించింది. అయితే ఇప్పుడు సామ్ కుర్రాన్ కూడా స్వదేశానికి వెళ్లిపోవడంతో జితేష్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఐదింట విజయం సాధించింది. -
గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా మెరుపు స్టంపింగ్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికి.. వికెట్ కీపింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. అద్బుతమైన స్టంపింగ్‌తో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను క్లాసెన్ పెవిలియన్‌కు పంపాడు. మెరుపు వేగంతో స్టంప్ చేసిన క్లాసెన్.. భారత లెజెండ్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలో తడబడింది. ఎస్ఆర్హెచ్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్‌ను ఎదుర్కోవడానికి పంజాబ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో భువీ స్వింగ్‌ను కట్ చేసేందుకు ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పంజాబ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన భువీ బౌలింగ్‌లో ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి అద్బుతమైన షాట్ ఆడాడు. ఇది చూసిన ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. వికెట్ కీపర్ క్లాసెన్‌ను స్టంప్స్‌కు దగ్గరగా తీసుకువచ్చాడు. సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు స్టంప్స్‌కు దగ్గరగా వికెట్ కీపింగ్ చేయడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ కమ్మిన్స్ తీసుకున్న నిర్ణయం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చింది. భువీ వేసిన అదే ఓవర్లో నాలుగో బంతిని అంచనా వేయడంలో విఫలమైన ధావన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి.. వికెట్ల వెనకు క్లాసెన్‌కు చిక్కాడు. గంటకు 140 కి.మీ వేగంతో వచ్చిన బంతిని అందుకున్న క్లాసెన్ మెరుపు వేగంతో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 𝗤𝘂𝗶𝗰𝗸 𝗛𝗮𝗻𝗱𝘀 𝘅 𝗦𝘂𝗽𝗲𝗿𝗯 𝗥𝗲𝗳𝗹𝗲𝘅𝗲𝘀 ⚡️ Relive Heinrich Klaasen's brilliant piece of stumping 😍👐 Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvSRH | @SunRisers pic.twitter.com/sRCc0zM9df — IndianPremierLeague (@IPL) April 9, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
PBKS vs SRH: ఉత్కంఠపోరులో ఎస్ఆర్హెచ్ గెలుపు..
IPL 2024 PBKS vs SRH Live Updates: పంజాబ్ కింగ్స్‌తో ఆఖరి వరకు జరిగిన ఉత్కంఠపోరులో 2 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఉనద్కట్ వేసిన ఆఖరి ఓవర్లో తమ విజయానికి 29 పరుగులు అవసరమవ్వగా పంజాబ్ బ్యాటర్లు అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ 26 పరుగులు సాధించారు. ఆఖరి వరకు పోరాడనప్పటికి తన జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్(46) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అశుతోష్ శర్మ(15 బంతుల్లో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమ్మిన్స్, నటరాజన్, నితీష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో నితీష్ కుమార్ 64 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 19 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 18 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ : 154/6. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు కావాలి. పంజాబ్ ఆరో వికెట్ డౌన్.. జితేష్ శర్మ రూపంలో పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది.19 పరుగులు చేసిన జితేష్.. నితీష్ రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 116/6 ఐదో వికెట్ డౌన్.. 91 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన సికిందర్ రజా.. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 97/5 నాలుగో వికెట్ డౌన్ 58 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శశాంక్ సింగ్ వచ్చాడు. 9 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 58/3 9 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో సామ్ కుర్రాన్(29), సికిందర్ రజా(10) పరుగులతో ఉన్నారు. కష్టాల్లో పంజాబ్.. 20 పరుగులకే 3 వికెట్లు 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శిఖర్ ధావన్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ధావన్ ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో డకౌటయ్యాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 2/1 పంజాబ్ టార్గెట్ 183 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. అతడితో పాటు అబ్దుల్ సమాద్(25), షాబాజ్ ఆహ్మద్(14) ఆఖరిలో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు సామ్ కుర్రాన్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ డౌన్.. నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 64 పరుగులు చేసిన నితీష్ కుమార్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 156/8 ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ డౌన్.. అబ్దుల్ సమాద్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన అబ్దుల్ సమాద్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16.4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 133/6 నితీష్ కుమార్ ఫిప్టీ.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందున్నాడు. 63 పరుగులతో నితీష్ కుమార్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 15 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 133/5 ఐదో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన క్లాసెన్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 111/5. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(41), సమాద్(9) పరుగులతో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్.. త్రిపాఠి ఔట్ 64 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ : 90/4. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(33), క్లాసెన్(6) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 61/3 10 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(11), రాహుల్ త్రిపాఠి(10) ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. 39 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 40/3 వారెవ్వా అర్ష్‌దీప్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఆర్ష్‌దీప్ సింగ్ బిగ్ షాకిచ్చాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లలో ఎస్ఆర్హెచ్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ట్రావిస్ హెడ్(21), తర్వాత మార్క్రమ్ డకౌటయ్యాడు. క్రీజులో అభిషేక్ శర్మ నితీష్ శర్మ ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఇటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. తుది జట్లు పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ -
టీమిండియా స్టార్ క్రికెటర్‌కు విడాకులు మంజూరు..
టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ దావన్, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి ధావన్ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో ధావన్ విడాకుల పిటిషన్ ధాఖలు చేశాడు. దీంతో ఈ కేసు కోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. తన భార్యపై ధావన్ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవమైనవని న్యాయమూర్తి హరీష్ కుమార్ విశ్వసించారు. కొన్నాళ్ల పాటు కుమారుడితో విడిగా ఉండాలని భార్య ఆయేషా ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. అదే విధంగా ఆస్ట్రేలియాలో తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో 99 శాతం తనని యజమానిగా చేయాలని ఆయేషా తనను ఒత్తిడి చేసిందన్న ధావన్ ఆరోపణను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. కాగా ధావన్, ఆయేషా దంపతుల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ధావన్‌కు భారత్ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా వీడియో కాల్ ద్వారా కూడా ధావన్ తన కుమారుడితో మాట్లాడవచచ్చని పేర్కొంది. కాగా వీరిద్దరికి 2012లో వివాహం కాగా... జొరావర్ అనే 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్బోర్న్కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత ధావన్-ఆయేషా వ్యక్తిగత కారణాల వల్ల ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2021లో ధావన్‌తో విడాకులు తీసుకుంటున్నాని ఆయేషానే స్వయంగా వెల్లడించింది. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్- కివీస్ తొలి పోరు.. ఎవరి బలాబలాలు ఎంత..? రికార్డులు ఎలా ఉన్నాయంటే?: -
వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కపోయినా.. ధావన్ మంచి మనసు! పోస్ట్ వైరల్
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లే. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో కూడా ధావన్‌కు స్ధానం దక్కలేదు. అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అతడికి రీఎంట్రీ ఇచ్చే అన్ని దారులు మూసుకు పోయాయి. ఇక జట్టులో చోటు దక్కకపోయినప్పటికీ ధావన్ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రపంచకప్‌కు ఎంపికైన తన సహచర ఆటగాళ్లకు గబ్బర్ అభినందనలు తెలిపాడు. "వరల్డ్‌కప్ 2023 టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైన నా తోటి సహచరులకు, స్నేహితులకు అభినందనలు. 1.5 బిలియన్ల ప్రజల ప్రార్థనలు మీకు మద్దతుగా ఉన్నాయి. మీరు ట్రోఫిని తిరిగి సాధించి, మమ్మల్ని గర్వించేలా చేయండి అంటూ ఎక్స్(ట్విటర్)లో ధావన్ రాసుకొచ్చాడు. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. అదే విధంగా ఆక్టోబర్ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో భారత్ తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్థూల్ ఠాకూర్. చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్.. యుజ్వేంద్ర చాహల్ కీలక నిర్ణయం! Congratulations to my fellow team mates & friends chosen to represent India in the WC 2023 tournament! With the prayers and support of 1.5 billion people, you carry our hopes and dreams. May you bring the cup back home 🏆 and make us proud! Go all out, Team India! 🇮🇳… https://t.co/WbVmD0Fsl5 — Shikhar Dhawan (@SDhawan25) September 6, 2023 -
స్పిన్నర్లంతా లెఫ్ట్ హ్యాండర్లే.. ధవన్, శాంసన్‌లను ఎంపిక చేసి ఉండాల్సింది..!
ఆసియా కప్-2023 కోసం 17 మంది సభ్యుల భారత జట్టును సెలెక్టర్లు ఇవాళ (ఆగస్ట్ 21) ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టు ఎంపికలో ఎలాంటి సంచనాలకు తావివ్వని సెలెక్టర్లు, ఒకరిద్దరికి మొండిచెయ్యి చూపించారన్నది కాదనలేని సత్యం. ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లే.. చహల్‌ను తీసుకోవాల్సింది..! స్పిన్నర్ల ఎంపికలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తుంది. ఎంపిక చేసిన స్పెషలిస్ట్ స్పిన్నర్లంతా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్లే (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) కావడం చర్చనీయంశంగా మారింది. రైట్ ఆర్మ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను ఎంపిక చేయాల్సిందని మెజార్టీ శాతం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శిఖర్ ధవన్‌కు ఆఖరి ఛాన్స్ ఇవ్వాల్సింది.. ఆసియా కప్‌కు ప్రకటించిన భారత జట్టులో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్‌కు అవకాశం ఇవ్వాల్సిందని సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ధవన్‌కు ఆసియా కప్‌లో (వన్డే) ఘనమైన ట్రాక్ రికార్డు (9 మ్యాచ్‌ల్లో 59.33 సగటున 91.43 స్ట్రయిక్‌రేట్‌తో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 534 పరుగులు) ఉండటం ఇందుకు ఓ కారణమైతే, వయసు పైబడిన రిత్యా అతనికి ప్రూవ్ చేసుకునేందుకు చివరి అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అంటున్నారు. ధవన్‌ను ఎంపిక చేసుంటే రోహిత్‌తో పాటు లైఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కూడా వర్కవుట్ అయ్యుండేదని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ధవన్ భారత్ తరఫున 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు, 2015 వన్డే వరల్డ్‌కప్, 2018 ఆసియా కప్‌లలో భారత లీడింగ్ రన్ స్కోరర్ అని గుర్తు చేస్తున్నారు. వన్డే ఫార్మాట్లో ధవన్ దిగ్గజమని, అతన్ని గౌరవించాల్సిన బాధ్యత సెలెక్టర్లపైన ఉండిందని అంటున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టు టాపార్డర్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు కేవలం ఇద్దరు మాత్రమే (ఇషాన్, తిలక్) ఉన్నారని, యువకులైన వారిద్దరిలో ఒకరి ప్రత్యామ్నాయంగా ధవన్ పేరును పరిశీలించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. సంజూ వర్సెస్ సూర్యకుమార్.. ఆసియా కప్ భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడంపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. స్కైకి బదులు సంజూ శాంసన్‌ను 17 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక చేసి ఉండాల్సిందని అంటున్నారు. జట్టులో ఇద్దరు వికెట్‌కీపింగ్ బ్యాటర్లను పెట్టుకుని సంజూని ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేయడం కేవలం కంటి తుడుపు ఎంపిక మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు. గడిచిన కొన్ని వన్డేల్లో సంజూ ప్రదర్శన స్కైతో పోలిస్తే చాలా రెట్లు మెరుగ్గా ఉందని, సంజూకు వికెట్‌కీపర్‌గానూ మంచి రికార్డు ఉంది కాబట్టి, అతన్ని స్కై స్థానంలో ఎంపిక చేసి ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. సంజూని ఎంపిక చేయడం వల్ల కేఎల్ రాహుల్‌పై భారం కాస్త తగ్గుతుందని, శాంసన్ ఎలాగూ స్కై లాగే విధ్వంసకర ఆటగాడు కాబట్టి, శాంసన్, రాహుల్‌లను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. యశస్విని తీసుకుని ఉండాల్సింది.. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల సంఖ్య చాలా తక్కువగా (ఇషాన్, తిలక్) ఉందని, ఇది జట్టు ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఎవరైనా రైట్ హ్యాండ్ బ్యాటర్ స్థానంలో సూపర్ ఫామ్‌లో యశస్వి జైస్వాల్‌ను తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. -
అతడేం తప్పు చేశాడు.. రికార్డులు చూడండి! జట్టులో ఉండాల్సింది
వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చేస్తున్న ప్రయోగాలపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. విండీస్‌తో రెండో వన్డేలో రోహిత్, విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చి ప్రయోగాలు చేసిన టీమిండియాకు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ సునీల్ జోషి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడంలో భారత జట్టు మెనెజ్‌మెంట్ విఫలమైందని జోషి అన్నారు. "విండీస్‌తో వన్డే సిరీస్‌లో యువ జట్టును ఆడించాలని సెలక్టర్లు భావించరా? అలా అయితే రోహిత్, కోహ్లి వంటి సీనియర్ ప్లేయర్స్‌ను ఎందుకు ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు అర్హత సాధించని విండీస్‌పై సీనియర్ జట్టు ఎందుకు? ఆ విషయం పక్కన పెడితే.. యువ ఆటగాళ్లను పరీక్షించడానికి ఇది సరైన సిరీస్. సెలక్టర్లు తప్పు చేశారు. ఈ సిరీస్‌ను సెలక్టర్లు సరిగ్గా ఉపయోగించలేకపోయారు. యువ జట్టును విండీస్‌కు పంపించి రుత్‌రాజ్ లేదా మరో ఆటగాడని కెప్టెన్‌గా నియమించాల్సింది. అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని యువ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సింది. మరో యంగ్ కెప్టెన్ తయారు చేయడానికి కూడా ఇదే సరైన సమయమని" అయన పేర్కొన్నారు. అదే విధంగా వెటరన్ ఓపెనర్ ధావన్ గురించి జోషి మాట్లాడుతూ.. శిఖర్ ధావన్‌ను విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయాల్సింది. వైట్‌బాల్ క్రికెట్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ధావన్ భారత్ ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అతడికి ఐసీసీ టోర్నీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. నేను జాతీయ సెలక్షన్ కమిటీలో భాగంగా ఉన్న సమయంలో ధావన్‌ను ఎప్పుడూ బ్యాకప్ ఓపెనర్‌గా మద్దతు ఇచ్చేవాడని. ఈ క్రమంలో 2021లో శ్రీలంకలో పర్యటనలో భారత జట్టు పగ్గాలు అప్పగించామని" అయన పేర్కొన్నారు. చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. 13 కోట్ల ఆటగాడికి గుడ్‌బై! అతడికి కూడా -
ఒకప్పుడు జట్టులో చోటే దిక్కు లేదు.. ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా!
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో భారత క్రికెట్ జట్లు తొలిసారి పాల్గొనబోతున్నాయి. ఈ క్రమంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఈ ఆసియాగేమ్స్‌లో భారత పురుషల జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సారథిగా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం అనూహ్యంగా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. దావన్కు కనీసం జట్టులో కూడా చోటు దక్కలేదు. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు. ఆగస్టు 31 నుంచి ఆసియాకప్ జరగనుండడంతో భారత ద్వితీయ శ్రీణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టులో ఐపీఎల్ హీరో రింకూ సింగ్‌తో పాటు తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్, ప్రభుసిమ్రాన్‌కు చోటు దక్కింది. వీరితోపాటు ఆల్‌రౌండర్ శివమ్ దుబే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఒకప్పుడు జట్టులో చోటుకే దిక్కులేదు.. ఇక ఆసియాకప్‌లో పాల్గోనే జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ధావన్ వంటి అనుభవం ఉన్న ఆటగాడని కాదని గైక్వాడ్‌ను సారధిగా ఎంపిక చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అయితే దేశవాళీ టోర్నీల్లో మాత్రం మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా రుత్‌రాజ్ వ్యవహరిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో కెప్టెన్‌గా రుత్‌రాజ్ విజయవంతం కావడంతో.. భారత జట్టు పగ్గాలను అప్పగించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే రుత్‌రాజ్ కెప్టెన్‌గా ఎంపికైనప్పటికి.. భారత్ సీనియర్ జట్టు తరపున ఆడిన అనుభవం మాత్రం పెద్దగా లేదు. అతడు ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు, కేవలం ఒక్క వన్డే మాత్రం ఆడాడు. 9 టీ20ల్లో 16.88 సగటుతో 135 పరుగులు చేయగా.. ఏకైక వన్డేలో 19 పరుగులు రుత్‌రాజ్ సాధించాడు. రుత్‌రాజ్ చివరగా టీమిండియా తరపున గతేడాది జూన్‌లో ఆడాడు. అప్పటినుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్-2023లో రుత్‌రాజ్ అదరగొట్టడంతో విండీస్ టూర్‌కు సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. విండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు రుత్‌రాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. కానీ విండీస్‌తో తొలి టెస్టుకు మాత్రం తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. అయితే ఒకప్పుడు జట్టులొ చోటు కోసం అతృతగా ఎదురుచూసిన రుత్‌రాజ్.. ఇప్పుడు ఏకంగా భారత జట్టును నడిపించే స్థాయికి చేరుకోవడం విశేషం. ఈ ఏడాది ఆసియా గేమ్స్ ఆక్టో 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరుగుతాయి. చదవండి: Rohit Sharma Serious On Ishan Kishan: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్‌పై రోహిత్ సీరియస్! వీడియో వైరల్ టీమిండియా పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, శివం మావి, శివం దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్ స్టాండ్‌బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ -
Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైశ్వాల్ డెబ్యూ సెంచరీతోనే రికార్డులు కొల్లగొట్టాడు. అరంగేట్రం టెస్టులోనే సెంచరీ చేసిన మూడో టీమిండియా ఓపెనర్‌గా రికార్డులకెక్కిన జైశ్వాల్ 143 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. మరో 45 పరుగులు చేస్తే భారత్ తరపున అరంగేట్రం చేసిన తొలి టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా నిలవనున్నాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్(187 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ(177 పరుగులు) ఉన్నాడు. ఇక జైశ్వాల్ మరో 57 పరుగులు చేస్తే అరంగేట్రం టెస్టులోనే డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కే అవకాశముంది. ఇక వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండోరోజు ఆట ముగిసేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. చిచ్చరపిడుగు యశస్వి జైశ్వాల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొడుతూ అజేయ సెంచరీతో మెరవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా శతకంతో అదరగొట్టాడు. ప్రస్తుతం జైశ్వాల్ (350 బంతుల్లో 143 పరుగులు నాటౌట్), విరాట్ కోహ్లి(96 బంతుల్లో 36 పరుగులు నాటౌట్) క్రీజులో ఉన్నారు. జైశ్వాల్ బద్దలుకొట్టిన రికార్డులివే.. ► టీమిండియా తరపున డెబ్యూ టెస్టులో సెంచరీ బాదిన 17వ ఆటగాడిగా.. మూడో ఓపెనర్‌గా నిలిచాడు. ఇంతకముందు శిఖర్ ధావన్(2016లో), పృథ్వీ షా(2018లో) ఈ ఘనత సాధించారు. విదేశాల్లో అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గానూ జైశ్వాల్ చరిత్రకెక్కాడు. ► ఇక విదేశాల్లో అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన ఐదో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు అబ్బాస్ అలీ 1959లో ఇంగ్లండ్ గడ్డపై, 1976లో సురిందర్ అమర్నాథ్ న్యూజిలాండ్‌పై ఆక్లాండ్ వేదికగా, 1992లో ప్రవీణ్ ఆమ్రే సౌతాఫ్రికాపై డర్బన్ వేదికగా, 1996లో సౌరవ్ గంగూలీ లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌పై, 2001లో సౌతాఫ్రికాపై వీరేంద్ర సెహ్వాగ్ ఈ ఘనత సాధించారు. ► అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన నాలుగో యంగెస్ట్ భారత క్రికెటర్‌గా జైశ్వాల్(21 ఏళ్ల 196 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో పృథ్వీ షా, అబ్బాస్ అలీ బేగ్, గుండప్ప విశ్వనాథ్‌లు ఉన్నారు. ► ఇక 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ గడ్డపై టీమిండియా తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. यशस्वी भवः 💯 . .#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/59Uq9ik1If — FanCode (@FanCode) July 13, 2023 చదవండి: అరంగేట్రంలోనే రికార్డుల మోత మోగించిన జైశ్వాల్ ఒక్క బౌండరీ.. 'నిన్ను చూస్తే హీరో నాని గుర్తొస్తున్నాడు కోహ్లి' విండీస్ ఆటగాడిపై జైశ్వాల్ దూషణల పర్వం; కోహ్లి సీరియస్ -
రోహిత్ శర్మ ఫెయిల్యూర్ కి కారణం శిఖర్ ధావన్
-
పంజాబ్ కొంపముంచిన ధావన్ చెత్త కెప్టెన్సీ.. అలా చేసి ఉంటే?
ఐపీఎల్-2023లో భాగంగా బుధవారం ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలను పంజాబ్ సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిలీ రోసో (37 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), పృథ్వీ షా (38 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్), వార్నర్ (31 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. పంజాబ్ బౌలర్లలో సామ్కర్రాన్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. ఆతర్వాత 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేయగల్గింది. పంజాబ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న లివింగ్ స్టోన్ 9 సిక్స్‌లు, 5 ఫోర్లుతో 94 పరుగులు చేశాడు. అతడితో పాటు తైడే 55 పరుగులు చేశాడు. ధావన్ చెత్తకెప్టెన్సీ ఈ మ్యాచ్‌లో పంజాబ్ సారధి శిఖర్ ధావన్ తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తమ బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోవడంలోధావన్ తేలిపోయాడు. ముఖ్యంగా క్రీజులో రిలీ రోసో వంటి విధ్వంసకర లెఫ్ట్ఆర్మ్ బ్యాటర్ ఉన్నప్పడు ధావన్ ఆఖరి ఓవర్ వేసేందుకు అర్ష్‌దీప్‌ను కాదని స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్‌ను తీసుకువచ్చాడు. ధావన్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇదే పంజాబ్ కొంపముంచింది. చివర్ వేసిన బ్రార్ ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. బ్రార్ స్థానంలో అర్ష్‌దీప్‌ను తీసుకువచ్చి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదాని పలువరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక ధావన్ చెత్త కెప్టెన్సీ వల్లే పంజాబ్ ఓడిపోయింది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ధావన్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. చదవండి: #ShikarDhawan: గోల్డెన్ డకౌట్.. ఓపెనర్‌గా 'గబ్బర్' అత్యంత చెత్త రికార్డు -
అద్బుత విన్యాసం.. వయసుతో పనేంటి!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. 37 ఏళ్ల వయసులోనూ పూర్తిస్థాయి ఫిట్నెస్తో అద్బుత విన్యాసం చేయడం ధావన్‌కే చెల్లింది. విషయంలోకి వెళితే.. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతి వార్నర్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచింది. కవర్స్‌లో ఉన్న ధావన్ ఎడమవైపుకు పరిగెత్తుకొచ్చి గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే తొలుత బంతి చేతి నుంచి జారిపోతుందేమో అనిపించింది. కానీ ధావన్ కిందపడినప్పటికి బంతిని ఒడిసి పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Stunning from Shikhar Dhawan 🙌 (via @IPL) #PBKSvDC #IPL2023 pic.twitter.com/px5hB5y1dH — ESPNcricinfo (@ESPNcricinfo) May 17, 2023 చదవండి: #ShikarDhawan: గోల్డెన్ డకౌట్.. ఓపెనర్‌గా 'గబ్బర్' అత్యంత చెత్త రికార్డు -
గోల్డెన్ డకౌట్.. ఓపెనర్‌గా 'గబ్బర్' అత్యంత చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. మధ్యలో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికి 9 మ్యాచ్‌లాడి 356 పరుగులు చేయడం విశేషం. ధావన్ ఖాతాలో మూడు ఫిఫ్టీలు ఉన్నాయి. అయితే బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మాత్రం గబ్బర్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే ధావన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో ఓపెనర్‌గా వచ్చి అత్యధికసార్లు డకౌట్ అయిన రెండో బ్యాటర్‌గా ధావన్ నిలిచాడు. ఇప్పటివరకు ఓపెనర్‌గా ధావన్(తాజా దానితో కలిపి) పదిసార్లు డకౌట్ కాగా.. తొలి స్థానంలో పార్థివ్ పటేల్ 11 సార్లు ఓపెనర్‌గా డకౌట్ అయ్యాడు. ధావన్‌తో కలిసి గౌతమ్ గంభీర్, అజింక్యా రహానేలు కూడా పదిసార్లు డకౌట్ కాగా.. డేవిడ్ వార్నర్ తొమ్మిదిసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. -
లివింగ్‌స్టోన్ మెరుపులు వృథా.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
లివింగ్‌స్టోన్ మెరుపులు వృథా.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్(48 బంతుల్లో 94, 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. అథర్వ టైడే 55, ప్రబ్‌సిమ్రన్ సింగ్ 22 పరుగులు చేశారు. ఆఖర్లో లివింగ్‌స్టోన్ చెలరేగి ఆడి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపినప్పటికి చేయాల్సిన స్కోరు ఎక్కువగ ఉండడంతో ఏం చేయలేకపోయాడు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్లయింది. టార్గెట్ 214.. పంజాబ్ కింగ్స్ 12 ఓవర్లలో 100/2 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అథర్వ టైడే 48, లివింగ్‌స్టోన్ 27 పరుగులతో ఆడుతున్నారు. ధావన్ గోల్డెన్ డక్.. 6 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 47/1 పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. అథర్వ టైడే 23, ప్రబ్‌సిమ్రన్ సింగ్ 21 పరుగులతో ఆడుతున్నారు. రొసౌ విధ్వంసం.. ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు, పంజాబ్ టార్గెట్ 214 ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. రిలీ రొసౌ 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 82 నాటౌట్ విధ్వంసం సృష్టించగా.. పృథ్వీ షా 38 బంతుల్లో 54 పరుగులు, డేవిడ్ వార్నర్ 31 బంతుల్లో 46 పరుగులతో రాణించారు. రిలీ రొసౌ హాఫ్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ 162/2 ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిలీ రొసౌ ఐపీఎల్లో తొలి అర్థశతకం సాధించాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆరంభం నుంచి దాటిగా ఆడిన రొసౌ 25 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 17 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దంచుతున్న పృథ్వీ షా, రొసౌ.. 14 ఓవర్లలో ఢిల్లీ 138/1 పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతుంది. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. పృథ్వీ షా 54, రిలీ రొసౌ 36 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 46 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ సామ్ కరన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. పృథ్వీ షా 46, రొసౌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 93/0 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 46, పృథ్వీ షా 45 పరుగులతో దాటిగా ఆడుతున్నారు. 6 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 61/0 ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. పృథ్వీ షా 35, డేవిడ్ వార్నర్ 34 పరుగులతో ఆడుతున్నారు. 4 ఓవరల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 35/0 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 25, పృథ్వీ షా 10 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం ధర్మశాల వేదికగా 64వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కుర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ Back in Dharamshala after 1️⃣0️⃣ years, #PBKS win the 🪙 & elect to field first! Will the hosts be able to keep their #IPL2023 hopes alive? 👀#IPLonJioCinema #TATAIPL #PBKSvDC #EveryGameMatters | @PunjabKingsIPL @DelhiCapitals pic.twitter.com/Ut2NBzlWsj — JioCinema (@JioCinema) May 17, 2023 ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ రేసు నుంచి వైదలగ్గా.. పంజాబ్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ కీలకం. అయితే మ్యాచ్‌లో గెలిచినప్పటికి ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
IPL 2023: పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్
IPL 2023: Delhi Capitals Vs Punjab Kings Live Updates పంజాబ్ కింగ్స్ ఘన విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్ ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు కీలక విజయం దక్కింది. ప్లేఆఫ్ అవకాశాలు ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ 31 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 54 మినహా మిగతావారంతా దారుణంగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ నాలుగు వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్, రాహుల్ చహర్‌లు తలా రెండు వికెట్లు తీశారు. ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రవీణ్ దూబే 15, కుల్దీప్ యాదవ్ ఒక పరుగుతో ఆడుతున్నారు. టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 91/6 టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 86/5 టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 86/4 టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 82/3 టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 80/2 టార్గెట్ 168.. ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 74/2 ప్రబ్‌సిమ్రన్ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 168 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 65 బంతుల్లో 103 పరుగులు సెంచరీతో మెరవగా.. సామ్‌కరన్ 20 పరుగుల చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్‌లు తలా ఒక వికెట్ తీశారు. 15 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 117/4 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 69, హర్‌ప్రీత్ బ్రార్ క్రీజులో ఉన్నారు. అంతకముందు 20 పరుగులు చేసిన సామ్ కరన్ ప్రవీణ్ దూబే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 12 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 93/3 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 49, సామ్ కరన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లలో పంజాబ్ స్కోరు 46/3 ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 21, సామ్ కరన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన ధావన్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రిలీ రొసౌకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 5, లివింగ్‌స్టోన్ నాలుగు పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 16వ సీజన్లో శనివారం ఢిల్లీ వేదికగా 59వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ మధ్యలో రెండు విజయాలతో గాడినపడ్డట్లే కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ పరాజయాల బాట పట్టింది.మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే ఢిల్లీతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ కాస్త నయంగా కనిపిస్తోంది. ఇరుజట్లు గతంలో 30సార్లు తలపడగా.. చెరో 15 మ్యాచ్‌లు గెలిచాయి. .@DelhiCapitals wins the 🪙 & elects to bowl in the northern derby of #TATAIPL ⚔️ Watch #DCvPBKS LIVE & FREE with #IPLonJioCinema across all telecom operators👈#IPL2023 #EveryGameMatters pic.twitter.com/k4EhNuzB84 — JioCinema (@JioCinema) May 13, 2023 -
అమ్మో మన ధోని, కోహ్లి, రిషభ్ ఇలా ఉంటారా?
-
చాలా బాధగా ఉంది.. కానీ క్రెడిట్ మొత్తం అతడికే: శిఖర్ ధావన్
ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్‌గార్డన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైంది. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడిన పంజాబ్ కింగ్స్.. చివరి బంతికి ఓటమి చవిచూడల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 6 పరుగులు అవసరమవ్వగా.. అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు కావల్సిన నేపథ్యంలో రింకూ సింగ్ ఫోర్ కోట్టి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లాడు. "ఈ మ్యాచ్‌లో ఓటమి చవిచూసినందుకు చాలా బాధగా ఉంది. ఈడెన్ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ కేకేఆర్ మా కంటే బాగా ఆడారు. అయితే అర్ష్‌దీప్ సింగ్ మాత్రం అద్భుతమైన ప్రయత్నం చేశాడు. మ్యాచ్‌ను ఆఖరి బంతివరకు తీసుకువెళ్లాడు. కాబట్టి మేము ఓడిపోయినా క్రెడిట్ మాత్రం అర్ష్‌దీప్‌కు ఇవ్వాలని అనుకుంటున్నాను. లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లను అడ్డుకునేందుకు మా జట్టులో మంచి హాఫ్ స్పిన్నర్లలు లేరు" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. చదవండి: KKR VS PBKS: విజయానందంలో ఉన్న నితీశ్ రాణాకు భారీ షాక్ -
ముంబై ప్రతీకారం.. పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇషాన్ కిషన్ 75, సూర్యకుమార్ 66 పరుగులతో ముంబై ఇండియన్స్‌ను పటిష్ట స్థితిలో నిలపగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్(10 బంతుల్లో 19 నాటౌట్), తిలక్ వర్మ(10 బంతుల్లో 26 నాటౌట్) ముంబైని విజయతీరాలకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, రిషి ధవన్ చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో ముంబై సీజన్ ఆరంభంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ► ఇషాన్ కిషన్ 75 పరుగులు చేసి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రిషి ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 178 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్కై సంచలన ఇన్నింగ్స్‌కు తెర.. మూడో వికెట్ డౌన్ 31 బంతుల్లో 66 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో సూర్య అర్ష్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. కాగా మూడో వికెట్‌కు ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌లు 116 పరుగులు జోడించారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 75, టిమ్ డేవిడ్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. సూర్య, ఇషాన్‌లు అర్థసెంచరీలు.. విజయం దిశగా ముంబై సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు ధాటిగా ఆడుతుండడంతో ముంబై లక్ష్యచేధనలో దూసుకెళ్తుంది. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సూర్యకుమార్ 52, ఇషాన్ కిషన్ 57 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 215.. 9 ఓవర్లలో ముంబై 80/2 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 30, సూర్యకుమార్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website ముంబై బౌలర్లు విఫలం.. పంజాబ్ 20 ఓవర్లలో 214/3 ముంబై బౌలర్ల వైఫల్యంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లయామ్ లివింగ్‌స్టోన్ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్, ఏడు ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసానికి తోడు జితేశ్ శర్మ(27 బంతుల్లో 49 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. శిఖర్ ధావన్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. Photo Credit : IPL Website దంచికొడుతున్న లివింగ్‌స్టోన్.. 16 ఓవర్లలో 152/3 పంజాబ్ కింగ్స్ బ్యాటర్ లివింగ్‌స్టోన్ తొలిసారి తన విధ్వంసం ప్రదర్శిస్తున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 49, జితేశ్ శర్మ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 13 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 120/2 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 28, జితేశ్ శర్మ 15 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website శిఖర్ ధావన్(30) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ శిఖర్ ధావన్(30 పరుగులు) పియూష్ చావ్లా బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. 9 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రన్ సింగ్ అర్షద్ ఖాన్ బౌలింగ్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 17/1గా ఉంది. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం మొహలీ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ గత మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కిన ముంబై అదే కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు బలమైన సీఎస్కేను ఓడించి పంజాబ్ కింగ్స్ కూడా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. గతంలో ఇరుజట్ల మధ్య 30 సార్ల తలపడగా.. చెరో 15 మ్యాచ్‌లు గెలిచాయి. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌నే విజయం వరించింది. -
56 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్ ఘన విజయం
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. అథర్వ తైదే 33 బంతుల్లో 66 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారిలో సికందర్ రజా 36, జితేశ్ శర్మ 24 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్ మూడు, రవి బిష్ణోయ్ రెండు, స్టోయినిస్ ఒక వికెట్ పడగొట్టాడు. 16 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 166/5 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. సామ్ కరన్ 15, జితేశ్ శర్మ 11 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 23 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్ రవిబిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. టార్గెట్ 258.. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ 258 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అథర్వ టైడే(33 బంతుల్లో 66 పరుగులు) రవి బిష్ణోయి బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 6 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 55/2 6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. అథర్వటైడ్ 32, సికిందర్ రజా 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. టార్గెట్ 258.. 3 ఓవర్లలో పంజాబ్ స్కోరెంతంటే? 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ ఒక్క పరుగు మాత్రమే చేసి స్టోయినిస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు.. పంజాబ్ టార్గెట్ 258 ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లను చీల్చిచెండాడిన లక్నో నిర్ణీత 20 ఓవర్ల ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్ చేసిన స్కోరు రెండో అత్యధిక కావడం విశేషం. ఇంతకముందు ఆర్సీబీ 263 పరుగుల స్కోరుతో టాప్‌లో ఉంది. లక్నో బ్యాటర్లలో స్టోయినిస్ 40 బంతుల్లో 72, కైల్ మేయర్స్ 24 బంతుల్లో 54, నికోలస్ పూరన్ 19 బంతుల్లో 45, ఆయుష్ బదోని 24 బంతుల్లో 43 పరుగులతో విధ్వంసం సృష్టించారు. పంజాబ్ బౌలర్లలో అందరు బారీగా పరుగులిచ్చుకోగా.. రబాడ ఒక్కడే 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, సామ్ కరన్, లివింగ్‌స్టోన్ తలా ఒక వికెట్ తీశారు. లక్నో బ్యాటర్ల దెబ్బకు ధావన్ మ్యాచ్‌లో ఏడుగురితో బౌలింగ్ చేయించడం గమనార్హం. స్టోయినిస్ ఫిఫ్టీ.. లక్నో 17 ఓవర్లలో 216/3 మార్కస్ స్టోయినిస్ అర్థసెంచరీతో చెలరేగాడు. అతనికి తోడు పూరన్ కూడా చెలరేగుతుండడంతో లక్నో 200 మార్క్‌ను అందుకుంది. ప్రస్తుతం 17 ఓవరల్లో మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. స్టోయినిస్ 61, పూరన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారీ స్కోరు దిశగా లక్నో.. 13 ఓవర్లలోనే 156/2 పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతుంది. 13 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. స్టోయినిస్ 26 బంతుల్లో 47 పరుగులు, ఆయుష్ బదోని 22 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లలో లక్నో 111/2 9 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. బదోని 23, స్టోయినిస్ 16 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 24 బంతుల్లో 54 పరుగులు చేసిన కైల్ మేయర్స్ రబాడ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్(12)ఔట్.. తొలి వికెట్ డౌన్ 12 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ రబాడ బౌలింగ్‌లో షారుక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. మేయర్స్ 27, ఆయుష్ బదోని 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లలో లక్నో 35/0 మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 27, కేఎల్ రాహుల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్లో మొహలీ వేదికగా 38వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, యశ్ ఠాకూర్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైదే, శిఖర్ ధావన్(కెప్టెన్), సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), షారుక్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్ Shikhar Dhawan wins the toss on his return & the @PunjabKingsIPL skipper opts to BOWL FIRST at 🏠 Watch #PBKSvLSG, LIVE & FREE on #JioCinema on any sim card.#TATAIPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/07IfTUciIi — JioCinema (@JioCinema) April 28, 2023 మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి రావడం పంజాబ్‌కు బలమని చెప్పొచ్చు. ఇక లక్నో ఆఖరి ఓవర్లో గుజరాత్ టైటన్స్ చేతిలో కంగుతిని ఓటమిపాలైంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ బలమైన ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఇరుజట్లు నాలుగు విజయాలు సాధించాయి. లక్నో ఆటగాళ్లు కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, స్టోయినిస్ నిలకడగా రాణిస్తున్నారు. ఇక పంజాబ్ ఓపెనర్ ప్రబ్సిమ్రాన్ సింగ్, సామ్ కరన్, అర్ష్‌దీప్ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దాంతో, ఈమ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో మరికొన్నిగంటల్లో తెలియనుంది. -
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం
150 పరుగులకే పంజాబ్ ఆలౌట్.. ఆర్సీబీ ఘన విజయం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ప్రబ్‌సిమ్రన్ సింగ్ 46, జితేశ్ శర్మ 41 మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. హసరంగా రెండు వికెట్లు, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్‌లు చెరొక వికెట్ తీశారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన పంజాబ్ 147 పరుగుల వద్ద పంజాబ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ క్లీన్ బౌల్డయ్యాడు. ఓటమి దిశగా పయనిస్తున్న పంజాబ్.. ఏడో వికెట్ డౌన్ 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఓటమి దిశగా పయనిస్తుంది. హసరంగ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ (7) స్టంపౌటయ్యాడు. 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్ పంజాబ్ రనౌట్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది. హసరంగ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో సామ్ కర్రన్ (10) ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. సిరాజ్ సూపర్ త్రో.. నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి జోరుమీదున్న సిరాజ్, మరో అద్భుతమైన డైరెక్ట్ త్రోతో హర్‌ప్రీత్ సింగ్ (13) పెవిలియన్‌కు పంపాడు. 6 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 49/4. సామ్ కర్రన్, ప్రభ్‌సిమ్రన్ (21) క్రీజ్‌లో ఉన్నారు. నిప్పులు చెరుగుతున్న సిరాజ్.. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్నాడు. తన స్పెల్‌లో వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. తొలుత రివ్యూవి వెళ్లే అథర్వ వికెట్ (ఎల్బీ)ను దక్కించుకున్న సిరాజ్.. ఆతర్వాత 4వ ఓవర్లో కూడా రివ్యూకి వెళ్లి లివింగ్‌స్టోన్‌ను ఔట్ (ఎల్బీ) చేశాడు. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ మూడో ఓవర్ తొలి బంతికి రెండో వికెట్ కోల్పోయింది. హసరంగ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్ (8) క్లీన్ బౌల్డయ్యాడు. టార్గెట్ 175.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ 175 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో అథర్వ టైడే (4) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాణించిన డుప్లెసిస్, కోహ్లి.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే..? టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. వరుస బంతుల్లో కోహ్లి (59), మ్యాక్స్‌వెల్ (0) ఔట్ కావడం.. స్కోర్ వేగం పెంచే క్రమంలో డుప్లెసిస్ (84) కూడా పెవిలియన్‌కు చేరడం.. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ (7), మహిపాల్ (7 నాటౌట్), షాబాజ్ అహ్మద్ (5 నాటౌట్) చెత్తగా బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల స్కోర్‌కే పరిమితమైంది. హర్‌ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. డుప్లెసిస్ (84) ఔట్ ఇల్లిస్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన మరుసటి బంతికే డుప్లెసిస్ (84) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 154/3. లోమ్రార్, కార్తీక్ (3) క్రీజ్‌లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ ఔట్ ఆర్సీబీకి వరుస షాక్‌లు తగిలాయి. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో విరాట్ కోహ్లి (59), మ్యాక్స్‌వెల్ (0) ఔటయ్యారు. 17 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 145/2. డుప్లెసిస్ (78), దినేశ్ కార్తీక్ (1) క్రీజ్‌లో ఉన్నారు. కోహ్లి హాఫ్ సెంచరీ.. 14 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..? 40 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 14 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 118/0. కోహ్లికు జతగా డుప్లెసిస్ (65) క్రీజ్‌లో ఉన్నాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన డుప్లెసిస్ ఆర్సీబీ ఓపెనర్ డుప్లెసిస్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్లో డుప్లెసిస్‌కు ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఓవరాల్‌గా 29వ ఐపీఎల్ ఫిఫ్టి. 11 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 98/0. డుప్లెసిస్‌కు జతగా కోహ్లి (39) క్రీజ్‌లో ఉన్నాడు. ధాటిగా ఆడుతున్న డుప్లెసిస్, కోహ్లి ఆర్సీబీ ఓపెనర్లు డుప్లెసిస్ (27), విరాట్ కోహ్లి (29) ధాటిగా ఆడుతున్నారు. వీరి ధాటికి ఆర్సీబీ 5.1 ఓవర్లలోనే 50 పరుగుల మార్కు దాటింది. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 59/0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు.. పంజాబ్ కింగ్స్: అథర్వ టైడే, మాథ్యూ షార్ట్, లివింగ్‌స్టోన్, హర్‌ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఇల్లీస్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్, విరాట్ కోహ్లి (కెప్టెన్), మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, సుయాష్ ప్రభుదేశాయ్, సిరాజ్ -
మొదట ముద్దుపెట్టాడు.. ఔటైతే సంబరపడ్డాడు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు మొదలైంది. అయితే టాస్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హార్ధిక్ పాండ్యాకు.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా పంజాబ్, గుజరాత్ మ్యాచ్ సందర్భంగా ఇద్దరు ప్రత్యర్థులుగా తలపడ్డారు. టాస్ వేయడానికి ముందు ఇద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో గబ్బర్ను హగ్ చేసుకున్న పాండ్యా అతని చెంపపై ముద్దుపెట్టడం అభిమానులకు ఆనందం కలిగించింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఇదే పాండ్యా ధావన్ ఔటైనప్పుడు తెగ సంబరపడిపోయాడు. ఇందుకు ఒక కారణం ఉంది. ధావన్ ఈ సీజన్లో భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 8 పరుగులకే వెనుదిరగడంతో పాండ్యాకు ఎక్కడిలేని సంతోషం కలిగింది. అందుకే ధావన్‌వైపు చూస్తూ రెండు చేతులను పైకి లేపి సాధించాం అన్నట్లుగా గట్టిగా అరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ''ఏంటో ఈ పాండ్యా సిత్రాలు.. మొదట ముద్దుపెట్టాడు.. ఔటైతే సంబరపడ్డాడు.'' అంటూ కామెంట్ చేశారు. Hardik Pandya with Shikhar Dhawan. What a lovely picture! pic.twitter.com/eb1jcVBTjb — Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2023: పంజాబ్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. శుబ్‌మన్ గిల్(49 బంతుల్లో 67, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో గిల్ ఔటైన తర్వాత కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికి రాహుల్ తెవాటియా బౌండరీ బాది జట్టును గెలిపించాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్, అర్ష్‌దీప్, హర్‌ప్రీత్ బార్, రబాడలు తలా ఒక వికెట్ తీశారు. 16 ఓవర్లలో గుజరాత్ 120/3 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. గిల్ 52, మిల్లర్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు పాండ్యా 8, సాయి సుదర్శన్ 19 పరుగులు చేసి వెనుదిరిగారు. 11 ఓవర్లలో గుజరాత్ 88/1 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. గిల్ 38, సాయి సుదర్శన్ 19 పరుగులతో ఆడుతున్నారు. 6 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 54/1 6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. గిల్ 20 పరుగులు, సాయి సుదర్శన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా సాహా 19 బంతుల్లో 30 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 154 గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో పెద్దగా ఎవరు రాణించలేదు. మాథ్యూ షార్ట్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షారుక్ ఖాన్ 9 బంతుల్లో 22 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ 25, సామ్ కరాన్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో జితేశ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, జాషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవర్లలో పంజాబ్ 109/4 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రాజపక్స 19 పరుగులు, సామ్ కరన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website ఆరు ఓవర్లలో పంజాబ్ 53/2 ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 35, బానుక రాజపక్స 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 8 పరుగులు చేసిన ధావన్ జోషువా లిటిల్ బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. Photo Credit : IPL Website 3 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 27/1 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 18, శిఖర్ ధావణ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు మహ్మద్ షమీ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్ సింగ్ డకౌట్ అయ్యాడు. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గురువారం 18వ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్ గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్ 𝙎𝙖𝙙𝙙𝙖 𝙠𝙞 𝙝𝙖𝙖𝙡? Hardik Pandya wins the toss at Mohali 📍 the Titans will field first!#TATAIPL #IPLonJioCinema #PBKSvGT pic.twitter.com/RRQnHnRvby — JioCinema (@JioCinema) April 13, 2023 వరుసగా రెండు విజయాలతో సత్తా చాటిన ఈ రెండు జట్లకు మూడో మ్యాచ్‌లో షాక్ తగిలింది. ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో గుజరాత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్ చివరి ఐదు బంతుల్లో రింకూ సింగ్ ఐదు సిక్స్‌లు బాదడంతో కేకేఆర్ సంచలన విజయం సాధించింది. సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ అర్ధ శతకంతో (99 నాటౌట్) చెలరేగాడు. మూడు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ లియం లివింగ్‌స్టోన్ రాకతో పంజాబ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరిని వరిస్తుంది అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఇరుజట్ల మధ్య గతంలో రెండు మ్యాచ్‌లు జరగ్గా పంజాబ్, గుజరాత్‌లు చెరొక మ్యాచ్‌ను గెలుచుకున్నాయి. -
హర్షా భోగ్లేకి ధావన్ సూపర్ పంచ్..
-
#KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా!
ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఆటగాళ్ల కంటే ఒకరిమీదే కెమెరాలు ఎక్కువ ఫోకస్‌గా ఉంటాయి. ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటా ఎవరనేది. అవునండీ ఆమె కావ్యా మారన్. ప్రతీ సీజన్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా అక్కడ టక్కున వాలిపోయి వారిని ఉత్సాహపరుస్తుంది. జట్టు ఓడిపోతే తాను బాధపడుతుంది.. గెలిస్తే ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటుంది. అలాంటి కావ్యా మారన్‌కు ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఒక కెమెరామన్ కోపం తెప్పించాడు. ఆ కోపానికి వేరే కారణం ఉంది లెండి. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ వంద పరుగులు కూడా చేయదని కావ్యా మారన్ తెగ సంతోషపడింది. కానీ కాసేపటికే సీన్ రివర్స్ అయింది. ధావన్ తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకుంటుడడంతో కావ్యా మారన్‌కు ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది. ఇదే సమయంలో ఆమె స్టాండ్స్‌లో కూర్చొని సీరియస్‌గా మ్యాచ్ చూస్తున్న సమయంలో ఒక కెమెరామెన్ ఆమె వైపు కెమెరా తిప్పాడు. అది గమనించిన కావ్యా మారన్.. నీకు నేనే దొరికానా అన్నట్లుగా కోపంతో'' చల్ ..హట్ రే '' అని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులతో అసమాన ఆటతీరు ప్రదర్శించి పంజాబ్‌కు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. Baby #kavyamaran 😂 To cameraman Hat rey 😹😹#SRHvPBKS pic.twitter.com/duImSUu5OZ — चयन चौधरी (@Chayanchaudhary) April 9, 2023 -
'థాంక్స్ హైదరాబాద్'.. కోహ్లి రికార్డు బద్దలు
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ హైదరాబాద్ అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒంటరిపోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఈ క్రమంలో ఒక్క పరుగు దూరంలో సెంచరీ మార్క్‌కు దూరమైనప్పటికి కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 88 పరుగుల వద్ద పంజాబ్ తొమ్మిదో వికెట్ కోల్పోయాకా ధావన్.. ఆఖరి నెంబర్ బ్యాటర్‌తో కలిసి పదో వికెట్‌కు 55 పరుగులు అజేయంగా జోడించి చరిత్ర సృష్టించాడు. ఇక ఎస్ఆర్హెచ్పై 99 పరుగుల ఇన్నింగ్స్‌తో ధావన్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లి ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు 50 సార్లు చేయగా.. తాజాగా ధావన్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టి 51వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు సాధించాడు. కాగా కోహ్లి 50- ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేయడానికి 216 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. ధావన్ మాత్రం 206 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ ఇప్పటివరకు ఐపీఎల్లో 60 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. ఇక తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం ధావన్ మాట్లాడుతూ.. ''హైదరాబాద్ ప్రజలు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటున్నా. ఒకవైపు వికెట్లు పడుతుండడంతో ఒకదశలో ఒత్తిడి అనిపించింది. కానీ ఏమైనా సరే చివరి వరకు నిలబడాలనుకున్నా.. అందుకే వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడాను. సెంచరీ మార్క్ మిస్ అవడం కంటే ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడానన్న సంతోషం ఎక్కువగా ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. Shikhar Dhawan said, "I'm glad that the Hyderabad crowd still remembers me". — Mufaddal Vohra (@mufaddal_vohra) April 9, 2023 -
Shikar Dhawan: టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్; పలు రికార్డులు బద్దలు
టీమిండియా గబ్బర్.. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఇక 88 పరుగుల వద్ద పంజాబ్ తొమ్మిదో వికెట్ కోల్పోయిన తర్వాత ఆఖరి బ్యాట్స్‌మన్‌తో కలిసి ధావన్ 55 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ► ఐపీఎల్లో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్ల జాబితాలో ధావన్ చోటు సంపాదించాడు. ఇంతకముందు సురేశ్‌రైనా (2013లో ఎస్ఆర్హెచ్పై), క్రిస్ గేల్(2019లో ఆర్సీబీపై), మయాంక్ అగర్వాల్(2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై) ఉండగా.. తాజాగా శిఖర్ ధావన్ వీరి సరసన చేరాడు. ► ఇక టి20 క్రికెట్లో పదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జంటగా ధావన్-మోహిత్ రాతే జోడి ఐదో స్థానంలో నిలిచారు. తొలి స్థానంలో గ్రాంట్ ఇలియట్, జుల్ఫికర్ బాబర్ జోడి 63 పరుగులు(పీఎస్ఎల్ 2016, క్వెటా గ్లాడియేటర్స్ వర్సెస్ పెషావర్ జాల్మీ) ఉన్నారు. 62* - కేబీ అహిర్ & ఎన్ అహిర్, పనామా v అర్జెంటీనా, నార్త్ సౌండ్, 2021 61* - DJ వోరాల్ & DR బ్రిగ్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ vs హోబర్ట్ హరికేన్స్, హోబర్ట్, 2020 59 - స్ట్రీక్ & జేయి ఎవరైనా, వార్విక్షైర్ vs వోర్సెస్టర్షైర్, బర్మింగ్‌హామ్, 2005 55* - ఆర్ ఫ్రైలింక్ & పి సుబ్రాయెన్, డాల్ఫిన్స్ vs లాహోర్ లయన్స్, బెంగళూరు, 2014 ► ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు నిల్చొని పదో నెంబర్ బ్యాటర్ వరకు అందరితో కలిసి ఆడిన రెండో ఆటగాడిగా ధావన్ అరుదైన రికార్డు సాధించాడు. ఇంతకముందు పార్థివ్ పటేల్ మాత్రమే 2019లో సీఎస్కే తరపున ఈ ఫీట్ సాధించాడు. Ek aur 𝐬𝐡𝐢𝐤𝐡𝐚𝐫 ki ore badhte hue 𝐆𝐚𝐛𝐛𝐚𝐫 💪 Shikhar Dhawan's 50 makes him the 🔝scoring batter of #TATAIPL2023 🙌 Keep watching #SRHvPBKS - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPLonJioCinema #IPL2023 #TATAIPL pic.twitter.com/kXyy1jPpMb — JioCinema (@JioCinema) April 9, 2023 -
IPL 2023 SRH Vs PBKS: ‘విన్’రైజర్స్...
Sunrisers Hyderabad vs Punjab Kings- సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్లో రెండు వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ చెలరేగింది. హైదరాబాద్ జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో కీలక విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (66 బంతుల్లో 99 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీకి దూరమయ్యాడు. మయాంక్ మర్కండే (4/15) కింగ్స్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సన్‌రైజర్స్ 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. రాహుల్ త్రిపాఠి (48 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెపె్టన్ మార్క్రమ్ (21 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 52 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. శిఖర్ మినహా... ఒక ఎండ్‌లో ధావన్ పట్టుదలగా చివరి వరకు నిలబడగా, మరో ఎండ్ నుంచి కనీసం సహకారం లేకపోవడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికి ప్రభ్‌సిమ్రన్ (0)ను అవుట్ చేసి భువనేశ్వర్ మొదటి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత జాన్సెన్ తన వరుస ఓవర్లలో మాథ్యూ షార్ట్ (1), జితేశ్ శర్మ (4)లను అవుట్ చేయడంతో జట్టు 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్యామ్ కరన్ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) కొద్దిసేపు ధావన్‌కు అండగా నిలిచాడు. అయితే ఆ తర్వాత పంజాబ్ టపటపా వికెట్లు కోల్పోయింది. 35 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. దాంతో స్కోరు 88/9 వద్ద నిలిచింది. పంజాబ్ 100 పరుగులు చేయడం కూడా సందేహంగానే అనిపించింది. అయితే ఈ దశలో ధావన్ తను అనుభవాన్నంతా రంగరించి బాధ్యతను తీసుకున్నాడు. ఈ సమయంలో ధావన్ 47 పరుగుల వద్ద (38 బంతుల్లో) ఉన్నాడు. ఆపై చెలరేగిపోయిన అతను తర్వాతి 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మరో 52 పరుగులు సాధించడం విశేషం. చివరి వికెట్‌కు ధావన్, మోహిత్ రాఠీ 55 పరుగులు జోడించగా, అందులో 52 ధావనే చేశాడు. భారీ భాగస్వామ్యం... ఛేదనలో రైజర్స్‌కు పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. ఓపెనర్లు బ్రూక్ (13), మయాంక్ అగర్వాల్ (21) ఫర్వాలేదనిపించడంతో పవర్‌ప్లేలో స్కోరు 34 పరుగులకు చేరింది. వీరిద్దరు తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... త్రిపాఠి, మార్క్రమ్ కలిసి సునాయాసంగా జట్టును విజయం దిశగా నడిపించారు. పంజాబ్ బౌలర్లు ఎంతగా శ్రమించినా ఈ జోడీని ఇబ్బంది పెట్టలేకపోయారు. వరుస ఫోర్లతో దూకుడు ప్రదర్శించిన త్రిపాఠి 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎలిస్ ఓవర్లో మార్క్రమ్ నాలుగు ఫోర్లు కొట్టడంతో హైదరాబాద్ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; ధావన్ (నాటౌట్) 99; షార్ట్ (ఎల్బీ) (బి) జాన్సెన్ 1; జితేశ్ (సి) మార్క్రమ్ (బి) జాన్సెన్ 4; కరన్ (సి) భువనేశ్వర్ (బి) మర్కండే 22; రజా (సి) మయాంక్ (బి) ఉమ్రాన్ 5; షారుఖ్ (ఎల్బీ) (బి) మర్కండే 4; హర్‌ప్రీత్ (బి) ఉమ్రాన్ 1; చహర్ (ఎల్బీ) (బి) మర్కండే 0; ఎలిస్ (బి) మర్కండే 0; రాఠీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు 143). వికెట్ల పతనం: 1–0, 2–10, 3–22, 4–63, 5–69, 6–74, 7–77, 8–78, 9–88. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–1, జాన్సెన్ 3–1–16–2, నటరాజన్ 4–0–40–0, సుందర్ 1–0–6–0, మర్కండే 4–0–15–4, ఉమ్రాన్ 4–0–32–2. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (బి) అర్ష్ దీప్ 13; మయాంక్ (సి) కరన్ (బి) చహర్ 21; త్రిపాఠి (నాటౌట్) 74; మార్క్రమ్ (నాటౌట్) 37; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (17.1 ఓవర్లలో 2 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–27, 2–45. బౌలింగ్: స్యామ్ కరన్ 3–0–14–0, అర్ష్ దీప్ 3–0–20–1, హర్‌ప్రీత్ 3.1–0–26–0, ఎలిస్ 3–0–28–0, రాహుల్ చహర్ 3–0–28–1, రాఠీ 2–0–29–0. 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
ధావన్ విషయంలో బీసీసీఐ పై హర్భజన్ ఫైర్
-
David Warner: అత్యంత వేగంగా.. కోహ్లి, ధావన్‌ల రికార్డు బద్దలు
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ ఐపీఎల్లో 6వేల పరుగులు మార్క్‌ను అందుకున్నాడు. 165 ఇన్నింగ్స్‌లోనే వార్నర్ ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. ఈ నేపథ్యంలోనే కోహ్లి, ధావన్‌ల రికార్డును బద్దలు కొట్టి ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదే ఆరువేల పరుగుల మార్క్ అందుకోవడానికి కోహ్లి 188 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కానీ వార్నర్‌కు మాత్రం 165 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. ఇక ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో వార్నర్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కోహ్లి 6727 పరుగులు(225 మ్యాచ్‌లు), శిఖర్ ధావన్ 6370 పరుగులు(208 మ్యాచ్‌లు) రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఐపీఎల్లో 4వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లలో వార్నర్ బ్యాటింగ్ యావరేజ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. వార్నర్ సగటు 42.28 కాగా.. స్ట్రైక్ రేట్ 140.08గా ఉంది. ఇక స్ట్రైక్‌రేట్ విషయంలో ఏబీ డివిలియర్స్(151.68), క్రిస్ గేల్(148.96) తర్వాత వార్నర్‌కు మాత్రమే 140 స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్నాడు. 6️⃣0️⃣0️⃣0️⃣ runs & counting in #TATAIPL for the #DC skipper #TATAIPL #IPL2023 | @delhicapitals @davidwarner31 pic.twitter.com/m7aM1GFGwe — JioCinema (@JioCinema) April 8, 2023 6000 runs for David Warner in IPL. One of the GOAT in this league. pic.twitter.com/UqtPFcsPA0 — Johns. (@CricCrazyJohns) April 8, 2023 David Warner - the IPL GOAT. pic.twitter.com/1yEHi9lCUZ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2023 చదవండి: సంజూ స్టన్నింగ్ క్యాచ్.. పృథ్వీ షా చెత్త రికార్డు -
రోహిత్, కోహ్లి, రాహుల్‌కే ఛాన్స్‌లు ఇస్తారా.. అతడు ఏం పాపం చేశాడు మరి?
టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్-2023లో దుమ్మురేపుతున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్.. అనంతరం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 86 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఐపీఎల్లో అదరగొడుతున్న ధావన్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హర్భజన్ సింగ్ కీలక వాఖ్యలు చేశాడు. ధావన్‌ను వన్డే జట్టు నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పాలని భారత సెలక్టర్లను భజ్జీ ప్రశ్నించాడు. కాగా ధావన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 2018 నుంచి టెస్ట్‌లకు, 2021 నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న గబ్బర్.. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్‌ల్లో టీమిండియాకు సారధ్యం వహించాడు. ఆ మూడు సిరీస్‌ల్లో గబ్బర్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో సెలక్టర్లు అతడని పక్కన పెట్టి, యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చారు. ఇదే విషయంపై భజ్జీ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.."ధావన్ చాలా సిరీస్‌లలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సిరీస్‌లో సారథిగా ధావన్ విజయవంతమయ్యాడు. అయితే ధావన్ కెప్టెన్సీ పాత్ర ముగిశాక.. ఇకపై అతడు అవసరం లేనట్లుగా జట్టు నుంచి పక్కన పెట్టడం మనం చూశాం. ఇది నన్ను చాలా బాధించింది. ఎందుకంటే అందరి ఆటగాళ్ల విషయంలోను సెలక్టర్లు ఒకే తీరు కనబరిచాలి. ధావన్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.అటువంటి వ్యక్తి పట్ల సెలక్టర్లు వ్యవహరించిన తీరు సరికాదు. ధావన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు చాలా మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. అయినప్పటికీ వారికి చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ ధావన్ ఒక్కడి విషయంలో పక్షపాతం ఎందుకు. ధావన్‌కు పూర్తిగా భారత జట్టులోనే చోటు లేదు. అతడు ఎప్పుడూ తన వంతు సహకారం జట్టుకు అందించడానికే ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాజస్తాన్ మ్యాచ్‌లో 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అటువంటి ధావన్‌కు భారత జట్టులో చోటు ఇవ్వడానికి ఏంటి సమస్య? ఫిట్నెస్ పరంగా గబ్బర్ కూడా కోహ్లిలా 100 శాతం ఫిట్‌గా ఉన్నాడని" పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.. కార్తీక్కే చుక్కలు! ఎవరీ సుయాష్ శర్మ? -
అశ్విన్ ఔట్.. తొడ గొట్టిన గబ్బర్; కావాలనే చేశాడా!
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ జోరుమీద ఉంది. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 198 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్ చేధనలో తడబడుతుంది. ఇప్పటికే ప్రధానమైన నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఈ విషయం పక్కనబెడితే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన అశ్విన్ అర్ష్‌దీప్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అశ్విన్ ఔట్ కాగానే గబ్బర్ ప్రేక్షకుల వైపు తిరిగి తొడ గొట్టి మీసం మెలేశాడు. ఇంతకముందు చాలాసార్లు అంతర్జాతీయం సహా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ధావన్ ఇలా తొడ గొట్టడం చూశాం. అయితే మళ్లీ చాన్నాళ్ల తర్వాత తనదైన సెలబ్రేషన్‌తో మెరిశాడు. అశ్విన్ ఔట్ కాగానే ధావన్ తొడ గొట్టడంతో ఇదంతా కావాలనే చేశాడని అభిమానులు పేర్కొన్నారు. ఎందుకంటే పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో అశ్విన్ ధావన్‌ను మన్కడింగ్ చేయబోయాడు. కానీ అలా చేయకుండా కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాడు. అయితే ధావన్ అది మనసులో పెట్టుకున్నాడని.. అందుకే అశ్విన్ ఔట్ కాగానే తొడగొట్టాడంటూ కామెంట్ చేశారు. Ash warning Gabbar and Jos going "I've seen this movie before" in his head - it's all happening at Barsapara 😅 Stream #RRvPBKS LIVE & FREE NOW with #IPLonJioCinema - across all telecom operators 📲#TATAIPL #IPL2023 | @ashwinravi99 @josbuttler pic.twitter.com/M5dChwgARd — JioCinema (@JioCinema) April 5, 2023 చదవండి: ధావన్‌కు అశ్విన్ వార్నింగ్.. వీడియో వైరల్ -
ఐపీఎల్లో ధావన్ చరిత్ర.. భారత్ తరపున తొలి క్రికెటర్‌గా
టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధావన్ సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ ఆఖరి వరకు నిలిచిన గబ్బర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 86 నాటౌట్ వింటేజ్ ధావన్‌ను తలపించాడు. తొలుత ప్రబ్‌సిమ్రన్ సింగ్ రెచ్చిపోతుంటే తాను యాంకర్పాత్ర పోషించాడు. Photo: IPL Website ప్రబ్‌సిమ్రన్ ఔటైన తర్వాత ధావన్ తన ఆట మొదలుపెట్టాడు. చహల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతిని బౌండరీ బాదడం ద్వారా ధావన్ అర్థసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ధావన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో ధావన్‌కు ఇది 48వ అర్థసెంచరీ కాగా ఓవరాల్‌గా అతనికి ఇది 50వ 50ప్లస్ స్కోరు కావడం విశేషం. ఐపీఎల్లో డేవిడ్ వార్నర్(54 అర్థసెంచరీలు) తర్వాత అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా.. టీమిండియా తరపున తొలి బ్యాటర్‌గా ధావన్ నిలిచాడు. ఇక కింగ్ కోహ్లి 45 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌పై ధావన్‌కు ఇది ఏడో హాఫ్ సెంచరీ. Photo: IPL Website అయితే సీఎస్కేపై ధావన్ ఎనిమిది అర్థసెంచరీలు సాధించాడు. ఆ తర్వాత తాను ప్రస్తుతం ఆడుతున్న పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌పై ఏడు అర్థసెంచరీలు, ముంబై, కేకేఆర్, ఆర్సీబీలపై ఆరు అర్థసెంచరీలు సాధించాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌పై ధావన్ 22 మ్యాచ్‌ల్లో 126 స్ట్రైక్‌రేట్‌తో 576 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 85 పరుగుల ఇన్నింగ్స్ ధావన్‌కు అత్యధిక స్కోరుగా ఉంది. చదవండి: ధావన్‌కు అశ్విన్ వార్నింగ్.. వీడియో వైరల్ ధావన్ దెబ్బకు రిటైర్డ్‌హర్ట్.. ఐపీఎల్‌కు దూరమయ్యే చాన్స్! That's that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs. Scorecard - https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C — IndianPremierLeague (@IPL) April 5, 2023 -
ధావన్‌కు అశ్విన్ వార్నింగ్.. వీడియో వైరల్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను రాజస్తాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హెచ్చరించాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో నాలుగో బంతిని విడవడానికి ముందే ధావన్ క్రీజు దాటాడు. ఇది గమనించిన అశ్విన్ బంతిని వేయడం ఆపేసి మన్కడింగ్ చేయడానికి ప్రయత్నించాడు. Photo: Jio Cinema Twitter కానీ బంతిని బెయిల్స్‌కు తగిలించకుండా ధావన్‌కు వార్నింగ్‌తోనే సరిపెట్టాడు. ఆ సమయంలో ధావన్ పూర్తిగా క్రీజు బయట ఉన్నాడు. కానీ అశ్విన్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. అయితే వెంటనే వెనక్కి వచ్చిన ధావన్ అశ్విన్‌ను చూస్తూ చేసేయాల్సింది అన్న తరహాలో చిన్న స్మైల్ ఇచ్చాడు. ఇదే సమయంలో కెమెరా జాస్ బట్లర్‌వైపు తిరగడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెమెరా బట్లర్‌వైపు ఎందుకు తిరిగిందో కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇదే ఐపీఎల్లో అశ్విన్ పంజాబ్‌కు ఆడుతున్న సమయంలో బట్లర్‌ను మన్కడింగ్ చేసి పెవిలియన్ చేర్చాడు. ఒకరకంగా అశ్విన్ మన్కడింగ్‌ను మరోసారి తెరపైకి తెచ్చిన క్రికెటర్‌గా నిలిచాడు. అయితే అశ్విన్ చర్యను కొందరు తప్పుబడితే మరికొందరు సమర్థించారు. కొన్నాళ్ల పాటు మన్కడింగ్‌పై చర్చ జరిగింది. అయితే ఇటీవలే మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ ఐసీసీ చట్టబద్దం చేసింది. Ash warning Gabbar and Jos going "I've seen this movie before" in his head - it's all happening at Barsapara 😅 Stream #RRvPBKS LIVE & FREE NOW with #IPLonJioCinema - across all telecom operators 📲#TATAIPL #IPL2023 | @ashwinravi99 @josbuttler pic.twitter.com/M5dChwgARd — JioCinema (@JioCinema) April 5, 2023 చదవండి: ధావన్ దెబ్బకు రాజపక్స రిటైర్డ్‌హర్ట్.. ఐపీఎల్‌కు దూరమయ్యే చాన్స్! -
ధావన్ దెబ్బకు రిటైర్డ్‌హర్ట్.. ఐపీఎల్‌కు దూరమయ్యే చాన్స్!
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసక ఆటగాడు బానుక రాజపక్స్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అశ్విన్ బౌలింగ్‌లో కెప్టెన్ శిఖర్ ధావన్ కొట్టిన స్ట్రెయిట్ షాట్ రాజపక్స మోచేతికి బలంగా తాకింది. దీంతో నొప్పితో రాజపక్స విలవిల్లాడిపోయాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతికి ఇది చోటుచేసుకుంది. ఫిజియో వచ్చి రాజపక్సను పరిశీలించగా.. చేయి వాచిపోయింది. దీంతో బ్యాట్ పట్టుకోవడం కష్టమవడంతో రాజపక్స రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. బంతి చేతికి బలంగా తాకడంతో గాయం తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ముందుగా రాజపక్సకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రిపోర్ట్‌లో పాజిటివ్ వస్తే రాజపక్స ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే పంజాబ్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అంతకముందు ప్రబ్‌సిమ్రన్ సింగ్ 34 బంతుల్లోనే 60 పరుగులు సాధించి పంజాబ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. రాజస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడిన ప్రబ్‌సిమ్రన్ మైదానం నలువైపులా షాట్లు ఆడి తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కాగా ప్రబ్‌సిమ్రన్‌కు ఐపీఎల్లో ఇదే తొలి అర్థశతకం కావడం విశేషం. Shikhar Dhawan's shot straight went to hit Bhanuka Rajapaksa on his forearm on the right hand. Not a great sign for Punjab Kings. 📸: Jio Cinema#CricTracker #RRvPBKS #BhanukaRajapaksa pic.twitter.com/gpDxOMj3vl — CricTracker (@Cricketracker) April 5, 2023 చదవండి: రాజస్తాన్ బౌలర్లను ఉతికారేశాడు.. ఎవరీ ప్రబ్‌సిమ్రన్ సింగ్ -
పంజాబ్ కింగ్స్‌కు రెండో విజయం.. పోరాడి ఓడిన రాజస్తాన్
పంజాబ్ కింగ్స్‌కు రెండో విజయం.. పోరాడి ఓడిన రాజస్తాన్ 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఐదు పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయింది. ఆరంభం నుంచి వికెట్లు కోల్పోయినప్పటికి సంజూ శాంసన్ 42 పరుగులు చేశాడు. ఆ తర్వాత షిమ్రోన్ హెట్‌మైర్ (18 బంతుల్లో 36), ద్రువ్ జురెల్(15 బంతుల్లో 32 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడడంతో ఒక దశలో రాజస్తాన్ గెలుస్తుందని భావించారు. అయితే హెట్‌మైర్ రనౌట్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖరి రెండు బంతుల్లో 11 పరుగులు కావాల్సిన దశలో ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 15 ఓవర్లలో రాజస్తాన్ 124/6 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరగడంతో రాజస్తాన్ ఓటమి నుంచి బయటపడడం కష్టమే. నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లతో రాజస్తాన్ వెన్ను విరిచాడు. 9 ఓవర్లలో రాజస్తాన్ 81/3 9 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 35, దేవదత్ పడిక్కల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. విధ్వంసక బట్లర్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తోంది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఇన్ఫాం బ్యాటర్ బట్లర్ అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. శాంసన్ 25 పరుగులతో ఆడుతున్నాడు. Photo Credit : IPL Website ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ భారీ స్కోరు; రాజస్తాన్ టార్గెట్ 198 రాజస్తాన్ రాయల్స్‌కు పంజాబ్ కింగ్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శిఖర్ ధావన్(56 బంతుల్లో 86 నాటౌట్, 9 ఫోర్లు, మూడు సిక్సర్లు) వింటేజ్ గబ్బర్ను చూపించగా.. ప్రబ్‌సిమ్రన్ సింగ్(34 బంతుల్లో 60 పరుగులు) రాణించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. జితేశ్ శర్మ 27 పరుగులు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో హోల్డర్ రెండు వికెట్లు తీయగా.. అశ్విన్, చహల్ చెరొక వికెట్ పడగొట్టారు. Photo Credit : IPL Website ధావన్ అర్థసెంచరీ.. భారీ స్కోరు దిశగా పంజాబ్ పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఐపీఎల్ 50వ అర్థశతకం సాధించాడు. అతని ధాటికి పంజాబ్ స్కోరు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జితేశ్ శర్మ 27 పరుగులు చేసి చహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. Photo Credit : IPL Website ప్రబ్‌సిమ్రన్(60) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ 60 పరుగులు చేసిన ప్రబ్‌సిమ్రన్ వెనుదిరగడంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 బంతుల్లోనే 60 పరుగులతో ధాటిగా ఆడుతున్న ప్రబ్‌సిమ్రన్ జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. ధావన్ 26, రాజపక్స్ 1 పరుగుతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website దాటిగా ఆడుతున్న ప్రబ్‌సిమ్రన్.. 4 ఓవర్లలో 45/0 రాజస్తాన్‌తో మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ సింగ్ 30 పరుగులతో వేగంగా ఆడుతున్నాడు. ధావన్ 13 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచుకున్న రాజస్తాన్ మూడేండ్ల (2020లో చివరి మ్యాచ్) తర్వాత ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న అసోం లోని గువహతి స్టేడియంలో నేడు రాజస్తాన్ రాయల్స్ - పంజాబ్ కింగ్స్ లు ఈ సీజన్ లో తొలిసారి తలపడుతున్నాయి. గువహతిలోని బర్సపర స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్ .@IamSanjuSamson wins the toss & @rajasthanroyals will field first in the first ever #TATAIPL match at the Barsapara 🏟️ Tune in to #IPLonJioCinema NOW to watch #RRvPBKS - streaming LIVE and FREE for all telecom operators! #IPL2023 #TATAIPL #JioCinema | @PunjabKingsIPL pic.twitter.com/RMtDInT0iD — JioCinema (@JioCinema) April 5, 2023 గత మ్యాచ్‌లో హైదరాబాద్ ను చిత్తుగా ఓడించిన రాజస్తాన్ రాయల్స్ అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నది. ఆ జట్టు నిండా మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో కళ్లు చెదిరే ఆరంభం ఇచ్చిన జోస్ బట్లర్ - యశస్వి జైస్వాల్ లు మరోసారి అలాంటి ప్రారంభాన్ని ఇవ్వాలని రాజస్తాన్ కోరుకుంటున్నది. వన్ డౌన్ లో సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగా ఉంది. బౌలింగ్ లో కూడా ట్రెంట్ బౌల్ట్ నాయకత్వంలో పేస్ బాధ్యతలు పంచుకుంటున్న కెఎం ఆసిఫ్ సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లలో అశ్విన్, చహల్ రూపంలో రాజస్తాన్ కు ప్రపంచ స్థాయి బౌలింగ్ యూనిట్ ఉంది. పంజాబ్ కూడా బ్యాటింగ్ లో శిఖర్ ధావన్, భానుక రాజపక్స వంటి అనుభవజ్ఞులతో పాటు ఏ స్థానంలో వచ్చినా రెచ్చిపోయే ఆడే జితేశ్ శర్మ, సామ్ కరన్, సికిందర్ రజలతో బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది. కోల్‌కతా తో మ్యాచ్ లో ఆడింది తక్కువ బంతులే అయినా ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆకట్టుకున్నాడు. ఇక బౌలింగ్ లో అర్ష్‌దీప్ సింగ్, సామ్ కరన్, నాథన్ ఎల్లీస్ లపైనే పంజాబ్ ఆశలు పెట్టుకుంది. -
అరుదైన రికార్డు.. కోహ్లిని సమం చేసిన గబ్బర్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో శిఖర్ ధావన్ తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పెద్దగా మెరుపులు లేకపోయినప్పటికి 40 పరుగులతో ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ 191 పరుగుల భారీ స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. బానుక రాజపక్సతో కలిసి రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ తన పేరిట అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు 50 ప్లస్ భాగస్వామ్యాలు సాధించిన క్రికెటర్‌గా ధావన్ నిలిచాడు. ఐపీఎల్లో ధావన్‌కు ఇది 94వ అర్థశతక భాగస్వామ్యం కావడం విశేషం. ఈ విషయంలో కోహ్లి రికార్డును సమం చేశాడు. ఆర్సీబీ తరపున కోహ్లి కూడా 94 అర్థశతక భాగస్వామ్యాలు అందించాడు. ఇక అత్యధిక 50 ప్లస్ భాగస్వామ్యాలతో ఈ ఇద్దరు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మూడో స్థానంలో సురేశ్ రైనా(83 అర్థశతక భాగస్వామ్యాలు), డేవిడ్ వార్నర్ 82 50ప్లస్ భాగస్వామ్యాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక 29 బంతుల్లో 40 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు ఉన్నాయి. చదవండి: ఎందరు వచ్చినా ధోనికే సాధ్యమైన వేళ.. సీఎస్కే తరపున -
'వయసుతో పాటు మతిమరుపు'
టీమిండియా సీనియర్ ఆటగాడు.. ముద్దుగా గబ్బర్ అని పిలుచుకునే శిఖర్ ధావన్ పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్ ద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. శనివారం పంజాబ్ కింగ్స్ కేకేఆర్‌తో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ అనంతరం జట్టులో ఎవరు ఉన్నారనే దానిపై కెప్టెన్ మాట్లాడడం ఆనవాయితీ. మురళీ కార్తిక్ ధావన్‌ను తుది జట్టు గురించి అడిగాడు. ధావన్ తుదిజట్టు గురించి మాట్లాడుతూ విదేశీ ఆటగాళ్ల పేర్లు చెబుతున్న సమయంలో ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పాడు. బానుక రాజపక్స, నాథన్ ఎల్లిస్, సామ్ కరన్ ఇంకా.. అంటూ ఆగిపోయాడు. ఆ తర్వాత..'' నాలుగో ఆటగాడి పేరు మరిచిపోయా.. క్షమించండి'' అని పేర్కొన్నాడు. దీంతో అక్కడ నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇంతకు ధావన్ మరిచిపోయిన నాలుగో విదేశీ క్రికెటర్ ఎవరో తెలుసా.. జింబాబ్వే సంచలనం సికందర్ రజా. అయితే ధావన్ చర్యను క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.. 37 ఏళ్లు వచ్చాయి.. వయసు పెరుగుతోంది.. అందుకే మతిమరుపు కూడా అంటూ కామెంట్ చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టానికి 100 పరుగులు దాటింది. రాజపక్స అర్థసెంచరీతో దాటిగా ఆడుతుండగా.. ధావన్ అతనికి సహకరిస్తున్నాడు. .@KKRiders call it right with the 🪙! Who are you backing in #PBKSvKKR?#IPLonJioCinema is streaming LIVE & FREE across all telecom operators #IPL2023 #TATAIPL pic.twitter.com/xavY31Af5V — JioCinema (@JioCinema) April 1, 2023 చదవండి: 16 కోట్లు! ఇంతకీ ఏం చేశాడు? దండుగ అంటూ ట్రోల్స్! కానీ.. -
డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ విజయం
PBKS Vs KKR Playing XI Updates And Highlights: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ వర్షం పడే సమయానికి 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి అమలు చేశారు. ఈ లెక్కన కేకేఆర్ ఏడు పరుగులు వెనుకబడి ఉంది. దీంతో పంజాబ్ మ్యాచ్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్ ధావన్ 40 రాణించాడు. చివర్లో సామ్ కరన్ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్, షారుక్ ఖాన్ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్ దాటిగా ఆడారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్‌లు తలా క వికెట్ తీశారు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ప్రస్తుతం కేకేఆర్ 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం కేకేఆర్ ఏడు పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే పంజాబ్‌దే విజయం ఎదురీదుతున్న కేకేఆర్.. ► 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌ను రసెల్, వెంకటేశ్ అయ్యర్లు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఐదు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 32, రసెల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేకేఆర్ విజయానికి 36 బంతుల్లో 74 పరుగులు కావాలి. 80 పరుగులకే ఐదు వికెట్లు ► పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తోంది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 4 పరుగులు చేసిన రింకూ సింగ్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెంకటేశ్ అయ్యర్ 21 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 29కే మూడు వికెట్లు.. కష్టాల్లో కేకేఆర్ ► 192 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ కష్టాల్లో పడింది. 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ ఆరు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. నితీష్ రాణా 7 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 10 పరుగులు క్రీజులో ఉన్నారు. కేకేఆర్ టార్గెట్ 192 ► కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్ ధావన్ 40 రాణించాడు. చివర్లో సామ్ కరన్ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్, షారుక్ ఖాన్ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్ దాటిగా ఆడారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్‌లు తలా క వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవర్లలో పంజాబ్ 153/4 ► కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ధాటిగా ఆడుతుంది. 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సికందర్ రజా 13, సామ్ కరన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రాజపక్స 50, ధావన్ 40 పరుగులతో రాణించారు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ ► కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జితేశ్(21) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు రాజపక్స 50 పరుగులు చేసిన వెంటనే ఔటయ్యాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది, ధావన్ 40, సికందర్ రజా ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 10 ఓవర్లలోనే వంద మార్క్ దాటిన పంజాబ్ ►కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ధాటిగా ఆడుతుంది. 10 ఓవర్లలోనే జట్టు స్కోరు వికెట్ నష్టానికి వంద పరుగుల మార్క్ దాటింది. రాజపక్స 46 పరుగులు, ధావన్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website ధాటిగా ఆడుతున్న రాజపక్స.. ఏడు ఓవర్లలో పంజాబ్ 69/1 ► ఏడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. బానుక రాజపక్స 18 బంతుల్లో 31 పరుగులతో ధాటిగా ఆడుతుండగా.. శిఖర్ ధావన్ 15 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ ►టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్.. సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 23/1 ఐపీఎల్-2023లో మరో ఆసక్తికర పోరుకు సమయం అసన్నమైంది. మొహాలీ వేదికగా రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా తొలిసారి కేకేఆర్‌కు నితీష్ రాణా సారథ్యం వహిస్తుండగా.. శిఖర్ ధావన్‌కు పంజాబ్ కెప్టెన్సీ ఇదే మొదటి సారి. తుది జట్లు కోల్‌కతా నైట్ రైడర్స్: మన్దీప్ సింగ్, రహమానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ చదవండి: IPL 2023: ప్లీజ్.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు! ఆ ‘మహానుభావుడేమో’.. -
'ప్రేమించండి.. పెళ్లి మాత్రం చేసుకోకండి'
టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ టీమిండియా ఓపెనర్‌గా శిఖర్ ధావన్ ఒక దశాబ్దం పాటు వెలుగొందాడు. వయసు పెరగడంతో పాటు ఫామ్ కోల్పోవడంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికి ఇప్పుడున్న పోటీలో ధావన్ మళ్లీ జట్టులో రావడం అసాధ్యమే. ఇక వ్యక్తిగత జీవితంలో తనకంటే పదేళ్ల పెద్దదైన అయేషా ముఖర్జీని 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అయేషాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2014లో ఈ దంపతులకు జొరావర్ పుట్టాడు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం అనంతరం సెప్టెంబర్ 2021లో ఈ ఇద్దరు విడిపోయారు. అప్పటినుంచి తన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మాట్లాడని గబ్బర్ తొలిసారి తాను, అయేషా విడిపోడంపై స్పందించాడు. ''పెళ్లి అనే పరీక్షలో నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే అది ఓ ఒక్క వ్యక్తి చేతుల్లో ఉండదు, రెండు వ్యక్తులు కలిసి రాయాల్సిన పరీక్ష. తను తప్పు చేసిందని అనను.. అలాగని నాది తప్పని ఒప్పుకోను. నాకు పెళ్లి అనే ఫీల్డ్ కొత్త. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో తెలీదు. నేను 20 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా కాబట్టి ఆ ఆట గురించి నాకు తెలుసు. ఆట గురించి చెప్పమంటే అనర్గళంగా చెబుతా... అది అనుభవంతో వచ్చింది. విడాకుల గురించి చెప్పాలంటే ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, చాలా ఎక్కువ జాగ్రత్త పడతాను. ఎలాంటి అమ్మాయి కావాలనే విషయంలో బుర్ర బద్ధలు కొట్టుకున్నా పర్లేదు, తొందర మాత్రం పడను. నేను 26-27 ఏళ్ల వరకూ ఒంటరిగా ఉన్నా. ఎలాంటి రిలేషన్‌లోనూ లేను. బయటికి వెళ్లేవాడిని, స్నేహితులతో తిరిగేవాడిని. ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఎవ్వరితో రిలేషన్ మాత్రం పెట్టుకోలేదు. అయితే నేను ప్రేమలో పడిన తర్వాత నాకు అన్నీ మధురంగానే కనిపించాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ చేసుకుంటూ పోయా. కానీ కళ్లకు అలుముకున్న ప్రేమ తెర తొలిగిపోతే అన్నీ ఇబ్బందిగానే అనిపిస్తాయి. కుర్రాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. రిలేషన్లో ఉంటే, అన్నింటినీ అనుభవించండి. కోపాలు, తాపాలు, బాధలు, బ్రేకప్స్ కూడా. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి, పెళ్లి మాత్రం చేసుకోకండి. కొన్నేళ్ల పాటు కలిసి ఉండి, తన గురించి నీకు, నీ గురించి తనకు తెలిసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. ఇది కూడా క్రికెట్ మ్యాచ్ లాంటిదే. కొందరికి సెటిల్ అవ్వడానికి నాలుగు ఐదు మ్యాచుల సమయం పడుతుంది. మరికొందరికి ఒక్క మ్యాచ్‌లోనే దొరకవచ్చు, ఇంకొందరికి ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు.. అయితే పెళ్లికి ముందు కాస్త అనుభవం మాత్రం చాలా ముఖ్యం.'' అని పేర్కొన్నాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధావన్ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు శిఖర్ ధావన్. టీమిండియాలో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2023 సీజన్లో అదరగొట్టి తన ప్లేస్‌ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు. Ek hi to Dil hai kitni baar jeetoge Shikhar Dhawan 😭❤️ pic.twitter.com/VfZ4P3FPZi — Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) March 26, 2023 చదవండి: 'ఓపెనర్‌గా నాకంటే శుబ్‌మన్ గిల్ బెటర్' చెత్త రికార్డు సమం చేసిన డికాక్ -
'ఓపెనర్‌గా నాకంటే శుబ్‌మన్ గిల్ బెటర్'
టీమిండియా ఓపెనర్‌గా శిఖర్ ధావన్ ఒక దశాబ్దం పాటు వెలుగొందాడు. వయసు పెరగడంతో పాటు ఫామ్ కోల్పోవడంతో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనప్పటికి ఇప్పుడున్న పోటీలో ధావన్ మళ్లీ జట్టులో రావడం అసాధ్యమే. అయితే ధావన్ జట్టుకు దూరమైన తర్వాత ఓపెనింగ్ విషయంలో టీమిండియా సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ శుబ్‌మన్ గిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ కొరత కనిపిస్తుంది.. రోహిత్‌కు సరైన జోడి లేదు.. ఒకవేళ ఆ స్థానంలో శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్లో ఒకరికి చోటు ఇవ్వాల్సి వస్తే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారని ధావన్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై స్పందించిన ధావన్.. తన పేరు చెప్పకుండా ఆ స్థానానికి శుభ్‌మన్ గిల్ బెటర్ అని చెప్పాడు. తాను సెలెక్టర్ ప్లేస్‌లో ఉంటే శుభ్‌మన్‌గిల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేస్తానన్నాడు. టెస్ట్‌లతో పాటు టి20ల్లో గిల్ చక్కగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. కానీ అతడికి సరైన అవకాశాలు రావడం లేదని తెలిపాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తగినన్ని అవకాశాలు లభిస్తే ఆటగాడిగా శుభ్‌మన్ మరింత రాటుదేలుతాడని శిఖర్ ధావన్ అన్నాడు. ఓపెనర్‌గా తనకంటే శుభ్‌మన్ బెస్ట్‌గా భావిస్తోన్నట్లు పేర్కొన్నాడు. జట్టుకు దూరమయ్యాననే బాధ తనలో లేదని పేర్కొన్నాడు. కాగా గిల్‌పై ధావన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ధావన్ టీమిండియా తరపున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టి20 మ్యాచ్‌లు ఆడాడు. Ek hi to Dil hai kitni baar jeetoge Shikhar Dhawan 😭❤️ pic.twitter.com/VfZ4P3FPZi — Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) March 26, 2023 చదవండి: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి ఆర్సీబీ గుండె బద్దలయ్యే వార్త.. గాయాల కారణంగా ఇద్దరు స్టార్లు ఔట్..! -
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్.. సెలబ్రిటీల సందడి
సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా- ఈ రేస్ ఛాంపియన్‌షిప్‌లో శనివారం పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. ఫార్ములా వన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన ఫార్ములా-ఈ కావడంతో భాగ్యనగరం పూర్తి సందడిగా మారింది. హీరో రామ్‌చరణ్‌తో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, దీపక్ చహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా రేసును వీక్షించడానికి వచ్చాడు. ప్రధాన రేసుకు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ రేసులను తిలకించిన క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్డులో రయ్యుమని దూసుకెళ్తున్న రేసింగ్ కార్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేసు ప్రారంభమైంది. మొత్తం 2.8 కిమీ స్ట్రీట్ సర్క్యూట్లో 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన 22 రేసర్లు పోటీల్లో పాల్గొంటున్నారు. ఫార్ములా-ఈలో ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తోంది. ఇందులో ఇప్పటికే మూడు రేస్‌లు పూర్తయ్యాయి. మెక్సికో సిటీ మొదటి రేస్‌కు ఆతిథ్యం ఇవ్వగా, సౌదీ అరేబియాలోని దిరియాలో తర్వాతి రెండు రేస్‌లు జరిగాయి. హైదరాబాద్‌లో జరగబోతోంది ఈ సీజన్లో నాలుగో రేస్. ప్రస్తుతం మూడు రేస్‌ల తర్వాత మొత్తం 76 పాయింట్లతో ఆండ్రెటీ టీమ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పోర్‡్ష (74) రెండో స్థానంలో ఉంది. Master Blaster #SachinTendulkar at #HyderabadEPrix venue pic.twitter.com/EpqSOt1xML — Sarita Avula (@SaritaTNews) February 11, 2023 He was there for the inaugural Formula 1 race 12 years ago. He is here for the first Formula E race in India @sachin_rt pic.twitter.com/ygDYTNpwuT — Bharat Sharma (@sharmabharat45) February 11, 2023 -
మూడేళ్ల క్రితమే పంత్‌ను హెచ్చరించిన ధావన్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం అభిమానులను ఆందోళన పరిచింది. శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో పంత్ కారు ప్రమాదానికి గురయ్యింది. ఢిల్లీవైపు నుంచి వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టి 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. ఆపై కారుకు మంటలు అంటుకోవడం.. పంత్ కారు నుంచి బయటపడడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీసీసీఐ తమ ప్రకటనలో తెలిపింది. గాయాల తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికి పంత్ కోలుకుంటాడని పేర్కొంది. ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితమే క్రికెటర్ శిఖర్ ధావన్.. పంత్‌ను డ్రైవింగ్ విషయంలో హెచ్చరించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2019 సమయంలో పంత్, ధావన్‌లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు సరదాగా ఒకరినొకరు ఇంటర్య్వూ చేసుకున్నారు. ఆ సమయంలో తనకంటే సీనియర్ అయిన ధావన్‌ను.. భయ్యా ఒక సీనియర్‌గా నువ్వు నాకు ఏమి అడ్వైజ్ ఇస్తావు అని అడిగాడు. దీనికి బదులుగా ధావన్.. ''డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించు'' అని పేర్కొన్నాడు. తాజాగా పంత్ కారు ప్రమాదం బారిన పడడంతో ధావన్-పంత్‌ల పాత వీడియో మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. Shikhar Dhawan gave Rishabh Pant right advice about driving. pic.twitter.com/XxFRE5K74j — Ami ✨ (@kohlifanAmi) December 30, 2022 చదవండి: పంత్‌ను కాపాడిన బస్ డ్రైవర్ ఆసక్తికర వ్యాఖ్యలు రిషభ్ పంత్‌కు ప్రమాదం.. ప్రార్థిస్తున్నా అంటూ ఊర్వశీ రౌతేలా పోస్ట్ -
ధావన్ పని అయిపోయింది? గబ్బర్‌పై దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన ధావన్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అయితే బంగ్లాతో ఆఖరి వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. కిషన్ సంచలన ఇన్నింగ్స్‌తో ధావన్ కెరీర్‌కు తెరపడినట్లే అని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ధావన్ కెరీర్‌పై టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. యువ ఆటగాళ్లు కిషన్, గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నందున ధావన్ వన్డే కెరీర్ ముగిసినట్లే అని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. "స్వదేశంలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు ధావన్‌కు చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే ఓపెనింగ్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టే సాహసం సెలక్టర్లు చేయరు అనుకుంటున్నా. మరోవైపు శుబ్మాన్ గిల్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తే వీరి ముగ్గురిలో ఎవరైనా తప్పుకోవాల్సి వస్తుంది. నా అంచనా ప్రకారం అది ధావన్ కావచ్చు. ఇది అద్భుతమైన శిఖర్ కెరీర్‌కు విషాదకరమైన ముగింపు కావచ్చు. ఒక వేళ ధావన్ జట్టుకు ఎంపిక అయినా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టం. అయితే ఈ ప్రశ్నలన్నింటికి కొత్తగా వచ్చే సెలక్టర్లే సమాధానం చెప్పాల్సి ఉంటుంది" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. చదవండి: టీమిండియా అత్యుత్తమ వన్డే జట్టు.. సూర్యకుమార్ యాదవ్‌కు నో ఛాన్స్! -
చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం అంటే ఇదే!
బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను 2-0తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. బంగ్లాదేశ్ గడ్డపై టీమిండియా వన్డే సిరీస్ ఓడిపోవడం ఇది వరుసగా రెండోసారి. ఇక చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది టీమిండియా పరిస్థితి. వన్డే సిరీస్ కోల్పోయాకా టీమిండియాకు జ్ఞానోదయం అయినట్లుంది. వరుసగా విఫలమవుతున్నప్పటికి ధావన్‌కు అవకాశాలిస్తూనే వచ్చారు తప్ప ఇషాన్ కిషన్‌ను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఇషాన్‌కు తొలి రెండు వన్డేల్లో అసలు అవకాశమే దక్కలేదు. అయితే రోహిత్ గాయం ఇషాన్ కిషన్‌కు కలిసి వచ్చింది. హిట్‌మ్యాన్ గాయంతో మూడో వన్డేకు దూరం కావడంతో అతని స్థానంలో ఇషాన్ తుది జట్టులోకి వచ్చాడు. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న ఇషాన్ వచ్చీ రావడంతోనే డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి క్రికెటర్‌గా ఇషాన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకవేళ ఇషాన్ కిషన్‌ను తొలి రెండు వన్డేల్లో ఆడించి ఉంటే పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇక మూడో వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఓవరాల్‌గా 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా కిషన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించారు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన జాబితాలో కిషాన్ ఏడో స్థానంలో నిలిచాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. తొలి భారత బ్యాటర్‌గా
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 1500 పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 82 పరుగులు సాధించిన అయ్యర్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ 36 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా.. అయ్యర్ 34 ఇన్నింగ్స్‌లలో నే ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అయ్యర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్లో 38 వన్డేలు ఆడిన అయ్యర్.. 1534 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలతో పాటు 14 అర్ధ శతకాలు ఉన్నాయి. ధావన్ రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్.. ఇక ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ మరో రికార్డును కూడా సాధించాడు. 2022 ఏడాది వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అయ్యర్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్(685) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ధావన్ రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాదిలో 14 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 721 పరుగులు సాధించాడు. చదవండి: IND vs BAN: వరుసగా రెండు సెంచరీలు.. రోహిత్ స్థానంలో జట్టులోకి! ఎవరీ ఈశ్వరన్? -
మూడో వన్డే కూడా రద్దు.. వన్డే సిరీస్ న్యూజిలాండ్‌దే
క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగుతున్న భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. కాగా 220 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 18 ఓవర్లలో వికెట్ నష్టపోయి 104 పరుగులు చేసింది. ఈ క్రమంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఆఖరికి అంపైర్లు రద్దు చేశారు. కాగా వరుసగా రెండు వన్డేలు కూడా వర్షం కారణంగానే రద్దయ్యాయి. అంతకుముందు టీ20 సిరీస్‌లో కూడా ఆఖరి టీ20 వర్షం కారణంగానే ఎటువంటి ఫలితం తేలలేదు. ఇక తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన టామ్ లాథమ్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. రాణించిన వాషింగ్టన్ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో కేవలం 219 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(49) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, మిచెల్ తలా మూడు వికెట్లు సాధించగా.. సౌథీ రెండు, శాంట్నర్ ఒక్క వికెట్ సాధించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Ind Vs NZ: అతడు వెలకట్టలేని ఆస్తి! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! -
ధవన్ లాగే రోహిత్‌నూ వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తారా..?
గడిచిన 9 ఏళ్లలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోడం అభిమానులు, ఆటగాళ్లను ఎంత బాధిస్తుందో బీసీసీఐని కూడా అంతే ఆవేదనకు గురి చేస్తుంది. ఈ విషయంలో భారత్ ఓ మోస్తరు జట్ల కంటే హీనంగా ఉండటాన్ని టీమిండియా ఫ్యాన్స్, బీసీసీఐ చిన్నతనంగా భావిస్తుంది. వెస్టిండీస్, శ్రీలంక లాంటి జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు గెలవడంతో మెగా ఈవెంట్ల సందర్భంగా భారత అభిమానులు తలెత్తుకోలేకపోతున్నారు. భారత్ చివరి సారిగా 2013 ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. నాడు ధోని సారధ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2022 వరకు టీమిండియా ఆడిన ప్రతి ఐసీసీ టోర్నీలో రిక్త హస్తాలతో ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఇందులో భాగంగా ఇప్పటినుంచే ప్రక్షాళనను మొదలుపెట్టింది. ఇప్పటికే సెలెక్షన్ కమిటీపై వేటు వేసిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. అతి త్వరలో టీ20 జట్టు నుంచి సీనియర్లను పూర్తిగా తప్పించి.. వన్డేలు, టెస్ట్‌లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను టీ20 జట్టు నుంచి తప్పించి వన్డే, టెస్ట్‌లకు మాత్రమే పరిమితం చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం శిఖర్ ధవన్‌ను వన్డేలకు మాత్రమే ఎలా వాడుకుంటున్నారో, రోహిత్‌ను కూడా మున్ముందు వన్డేల్లో మాత్రమే ఆడించాలని బీసీసీఐ యోచినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రోహిత్.. టీ20ల్లో, టెస్ట్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడం, వయసు మీదపడటం, ఫిట్నెస్ కారణంగా చూపి కెప్టెన్‌పై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. రోహిత్‌ను వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తే.. ఈ ఫార్మాట్‌పై అతను ఎక్కువ ఫోకస్ పెట్టి వరల్డ్‌కప్‌ను సాధించి పెట్టగలడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బీసీసీఐ ప్లాన్లు ఎలా ఉన్నా అతి త్వరలో రోహిత్ విధుల్లో కోత పడటంతో పాటు ఏదో ఒకటి లేదా రెండు ఫార్మాట్లకు మాత్రమే పరిమతం కావడం ఖాయమని తెలుస్తోంది. -
IND VS NZ 3rd ODI: టీమిండియాకు షాకింగ్ న్యూస్
న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు ముందు టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే పార్క్ వేదికగా రేపు (నవంబర్ 30) జరుగబోయే మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెదర్ ఫోర్‌కాస్ట్‌లో పేర్కొంది. క్రైస్ట్‌చర్చ్‌లో రేపు ఉదయం నుంచే అకాశం మేఘావృతమై ఉంటుందని, మ్యాచ్ సమయానికి (భారతకాలమానం ప్రకారం ఉదయం 7 గంటకు) భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ప్రెడిక్షన్‌లో వెల్లడించింది. ఈ వార్త తెలిసి భారత క్రికెటర్లు, అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ మ్యాచ్ సాధ్యపడకపోతే సిరీస్ కోల్పోవాల్సి వస్తుందని బాధ పడుతున్నారు. కనీసం 10 ఓవర్ల పాటైన మ్యాచ్ జరిగితే, సిరీస్ సమం చేసుకునే అవకాశం అయినా ఉంటుందని అనుకుంటున్నారు. కాగా, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి వన్డేలో విజయం సాధించగా (7 వికెట్ల తేడాతో).. రెండో వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇక మూడో వన్డే కూడా రద్దైతే న్యూజిలాండ్ 1-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే, వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచిన హార్ధిక్ సేన.. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. -
IND VS NZ 3rd ODI: హార్ధిక్‌ను ఆదుకున్న వరుణుడు ధవన్‌ను కరుణిస్తాడా..?
మాంచి వర్షాకాలంలో న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. వరుణుడి పుణ్యమా అని టీ20 సిరీస్‌ను గెలుచుకోగలిగింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచిన హార్ధిక్ సేన.. వరుణుడు సహకారంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ టీ20 సిరీస్ తరహాలోనే సమీకరణాలు మారిపోయాయి. అయితే టీ20 సిరీస్‌లో వరుణుడు టీమిండియా పక్షాన నిలబడగా.. వన్డే సిరీస్‌లో ఆతిధ్య జట్టుకు అనుకూలంగా నిలిచాడు. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలుపుతో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లగా, ఇవాళ (నవంబర్ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణమైంది. ఈ మ్యాచ్ రద్దుతో టీమిండియా సిరీస్ గెలుచుకునే అవకాశం కోల్పోయింది. వరుణుడు కరుణించి, ఆట సాధ్యపడి, ఈనెల 30న (బుధవారం) జరిగే మూడో వన్డేలో గెలిస్తే, సిరీస్ డ్రా చేసుకునే అవకాశం మాత్రమే టీమిండియా ముందు ఉంది. అయితే, మూడో వన్డేకు వేదిక అయిన క్రైస్ట్‌చర్చ్‌లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో టీమిండియా సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వరుణుడు కటాక్షించక, మూడో వన్డే రద్దైతే.. తొలి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌లో హార్ధిక్‌ను ఆదుకున్న వరుణుడు.. ధవన్‌కు వన్డే సిరీస్‌ను కనీసం డ్రా చేసుకునే అవకాశాన్నైనా కల్పిస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. -
అందుకే సంజూ శాంసన్‌ను పక్కకు పెట్టాం: టీమిండియా కెప్టెన్
హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్(3) విఫలం కాగా, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (42 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(25 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నారు. 4.5 ఓవర్ల తర్వాత తొలిసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వర్షం, మళ్లీ 12.5 ఓవర్ల తర్వాత అడ్డుతగిలింది. ఈ దశలో ప్రారంభమైన భారీ వర్షం, ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ఆధిక్యం 1-0తో కొనసాగుతుంది. తొలి వన్డేలో టామ్ లాథమ్ భారీ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పుపై పెద్ద దూమారమే రేగింది. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడం, గత కొన్ని మ్యాచ్‌లుగా దారుణంగా విఫలమవుతున్న రిషబ్ పంత్‌ను జట్టులో కొనసాగిండచడంపై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నందుకు సోషల్‌మీడియా వేదికగా కెప్టెన్ శిఖర్ ధవన్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌లను ఎండగట్టారు. సంజూ శాంసన్ దక్షిణాది రాష్ట్రానికి చెందిన వాడు కాబట్టే ఇలా చేస్తున్నారని కొందరు, కుల వివక్ష కారణంగానే శాంసన్‌కు అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని మరికొందరు పరుష పదజాలం ఉపయోగించి బీసీసీఐ, కెప్టెన్, కోచ్, సెలెక్టర్లను టార్గెట్ చేశారు. శాంసన్‌ను జట్టు నుంచి ఎందుకు తప్పించారో టాస్ సమయంలో కెప్టెన్ ధవన్ ఎలాంటి కారణం చెప్పకపోవడంతో అభిమానులు మరింత రెచ్చిపోయారు. జట్టు నుంచి ఎందుకు తప్పించారో చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్‌పైన ఉంటుంది, అలాంటిది శాంసన్‌ను తప్పించడంపై కెప్టెన్ ధవన్ కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అయితే, ఈ విషయం వివాదాస్పదంగా మారడం, నెట్టింట భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటంతో మ్యాచ్ రద్దైన అనంతరం కెప్టెన్ ధవన్ స్పందించాడు. రెండో వన్డేలో శాంసన్‌ను పక్కకు పెట్టడానికి గల కారణాలను వివరించాడు. జట్టుకు ఆరో బౌలర్ అవసరమని, తప్పనిసరి పరిస్ధితుల్లో శాంసన్‌కు బదులు దీపక్ హుడాను తుది జట్టులో తీసుకున్నామని తెలిపాడు. పిచ్ స్వింగ్‌కు అనుకూలిస్తుందని భావించి శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్‌కు అవకాశం కల్పించామని పేర్కొన్నాడు. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే శాంసన్‌ను పక్కకు పెట్టాల్సి వచ్చిందని, దీనిపై రాద్దాంతం అనవసరమని ట్రోలింగ్‌కు దిగిన వారికి పరోక్షంగా చురకలంటించాడు. -
మరోసారి విలన్‌గా మారిన వర్షం.. న్యూజిలాండ్- భారత్ రెండో వన్డే రద్దు
భారత్-న్యూజిలాండ్ సిరీస్‌లో వరుణుడు మరోసారి విలన్‌గా మారాడు. హామిల్టన్ వేదికగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ల వద్ద మ్యాచ్‌కు తొలుత వర్షం అంతరాయం కలిగించింది. దాదాపు మూడు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. అయితే మళ్లీ భారత ఇన్నింగ్స్ 12.5 (89-1) వద్ద వర్షం తిరుగుముఖం పట్టింది. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇక వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో ఆఖరికి అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. భారత ఇన్నింగ్స్‌లో శుబ్మాన్ గిల్(45), సూర్యకుమార్ యాదవ్(34) పరుగులతో క్రీజులో ఉండగా మ్యాచ్ రద్దైంది. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం(నవంబర్ 30)న క్రైస్ట్ చర్చ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతోంది. ఒక వేళ న్యూజిలాండ్ గెలుపొందితే 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. చదవండి: IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
ఒక్క మ్యాచ్‌కే పక్కనబెట్టారు.. సౌత్ ప్లేయర్ అనేగా వివక్ష
టాలెంటెడ్ ఆటగాడు సంజూ శాంసన్‌కు మరోసారి అన్యాయం జరిగింది. ఆదివారం కివీస్‌తో మొదలైన రెండో వన్డేలో శాంసన్‌ను ఎంపిక చేయలేదు. దీంతో శాంసన్‌ను కేవలం ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేశారా అంటూ అభిమానులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజూ శాంసన్‌పై ఎందుకంత వివక్ష చూపిస్తున్నారు.. సౌత్ ప్లేయర్ అనేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శాంసన్ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడన్న మాటే కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టి20 జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు. మరి ఆ విమర్శలకు భయపడ్డారేమో తెలియదు కానీ ఉన్నపళంగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేకు సంజూకు అవకాశం ఇచ్చారు. మ్యాచ్‌లో భారీ స్కోరు చేయకపోయినప్పటికి మరి తీసిపారేసేంత చెత్తగా మత్రం ఆడలేదు. దారుణంగా విఫలమవుతున్న పంత్‌తో పోలిస్తే సంజూ శాంసన్ చాలా బెటర్‌గా కనిపించాడు. పంత్ 15 పరుగులు చేసి ఔటవ్వగా.. సంజూ శాంసన్ 38 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే సుందర్(37 నాటౌట్)తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరి ఇన్నింగ్స్‌తోనే ఆ మ్యాచ్‌లో టీమిండియా 300 పరుగులు మార్క్‌ను దాటింది. అయితే పేలవమైన బౌలింగ్ కారణంగా టీమిండియా ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇదిలా ఉంటే రెండో వన్డేలో సంజూ శాంసన్‌పై మరోసారి వేటు పడింది . తొలి వన్డేలో భారత బౌలర్లు వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆల్‌రౌండర్ దీపక్ హుడాకి తుదిజట్టులో చోటు దక్కింది. హుడాని జట్టులోకి తీసుకురావాలనుకుంటే పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ని తప్పించొచ్చు. అలాగే సూర్యకుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో దుమ్మురేపుతున్నా.. వన్డేల్లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. విఫలం అవుతున్న ఈ ఇద్దరినీ కొనసాగించిన టీమిండియా.. సంజూ శాంసన్‌ను మాత్రం పక్కనబెట్టేసింది. సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై ధావన్ సహా జట్టు మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో రెచ్చిపోయారు అభిమానులు. ''సంజూ శాంసన్.. దక్షిణ భారతదేశానికి చెందిన వాడు కావడం వల్లే అతనికి తుదిజట్టులో చోటు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారు.. శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, యజ్వేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్... ఇలా భారత జట్టులో ఉన్న ప్లేయర్లు అందరూ నార్త్ ఇండియాకి చెందినవాళ్లే... ఒక్క వాషింగ్టన్ సుందర్ తప్ప!''.. ''సంజూ శాంసన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దీపక్ హుడా కూడా నార్త్ ఇండియనే'' అంటూ ధ్వజమెత్తారు. ''సంజూ ఇండియాలో ఉంటూ అవకాశాల కోసం ఎదురుచూసే కంటే వేరే దేశానికి వెళ్తే స్టార్ ప్లేయర్ అవ్వడం ఖాయం''..''ఇంతకముందు త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా కరణ్ నాయర్.. ఆస్ట్రేలియాలో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చిన టి.నటరాజన్.. ఆ తర్వాత కనిపించకపోవడానికి కూడా ఈ వివక్షే కారణమని'' కొంతమంది అభిమానులు పేర్కొన్నారు. Cricket craze gonna end here. Thanks to BCCI. from viru, yuvi to msd to sanju samson. Sanju is a victim of favourism running in bcci. Until it is stopped, I won't be watching any matches of team india. Replacing inform batsman is ridiculous. No more tweets🤐🤐🤐 #SanjuSamson pic.twitter.com/cCfxMz8uMX — ADARSH J S (@never_give_u_p_) November 27, 2022 Doesn't make any sense. SKY has a poor ODI record, Pant hasn't performed in white ball cricket, Samson played a good knock in last match. But you*****ing drop samson! Wow BCCI. #justiceforsamson #SanjuSamson https://t.co/jER4ZulT8o — Karthikeyan (@IamKarthi1818) November 27, 2022 Once Again #justiceforsanjusamson Sanju fans please Show your Power.#SanjuSamson #ShameOnYou #BCCI 😑 pic.twitter.com/BdV4s3LaRK — Sachin Gandhi (@SachinG25184819) November 27, 2022 చదవండి: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? FIFA WC: నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి! -
భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డే కష్టమే!
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఓటమిపాలైన భారత జట్టు.. ఇప్పుడు హామిల్టన్ వేదికగా రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలాని ధావన్ సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం హామిల్టన్‌లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. "హామిల్టన్‌లో 91 శాతం వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని" అక్యూవెదర్ తమ నివేదికలో పేర్కొంది. అదేసమయంలో అక్కడ పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 18 డిగ్రీలు, కనిష్టంగా 16 డిగ్రీల వరకు ఉండవచ్చు. ఇక ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యహ్నాం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. ఒక వేళ ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసి నట్లయితే మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశం ఉంది. కాగా టీ20 సిరీస్‌లో కూడా వరుణుడు విలన్‌గా మారిన సంగతి తెలిసిందే. తొలి టీ20 వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా.. మూడో టీ20కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. ఈ మ్యాచ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం డ్రా ముగిసింది. చదవండి: IPL 2023: 'వచ్చే ప్రపంచకప్ టోర్నీలోనైనా గెలవాలంటే ఐపీఎల్ ఆడడం మానేయండి'.. లేకుంటే -
శిఖర్ ధావన్ అరుదైన రికార్డు.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ లిస్ట్-ఏ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 12,000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఏడో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనతను ధావన్ సాధించాడు. కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ధావన్ బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు లిస్ట్-ఏ క్రికెట్లో 297 మ్యాచ్‌లు ఆడిన ధావన్ 12,025 పరుగులు చేశాడు. వీటిలో 162 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(21,999) పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక పరుగులు వీరే సచిన్ టెండూల్కర్(551 మ్యాచ్‌లు) - 21,999 పరుగులు సౌరవ్ గంగూలీ(437 మ్యాచ్‌లు) -15, 622 పరుగులు రాహుల్ ద్రవిడ్ (449 మ్యాచ్‌లు)- 15,271 పరుగులు విరాట్ కోహ్లీ(296 మ్యాచ్‌లు)- 13,786 పరుగులు ఎంఎస్ ధోని(423 మ్యాచ్‌లు)- 13,353 పరుగులు యువరాజ్ సింగ్(423 మ్యాచ్‌లు)-12,633 పరుగులు శిఖర్ ధావన్(297 మ్యాచ్‌లు)-12,025 పరుగులు రాణించిన ధావన్, అయ్యర్ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(72), శ్రేయస్ అయ్యర్(80), గిల్(50) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
కేన్ మామతో ధావన్ పరాచకాలు.. వీడియో వైరల్
కివీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే టి20 సిరీస్‌ను పూర్తి చేసుకుంది. హార్దిక్ పాండ్యా సారధ్యంలోని టీమిండియా 1-0 తేడాతో సిరీస్‌ను గెలిచింది. ఇక నవంబర్ 25 నుంచి శిఖర్ ధావన్ నేతృత్వంలో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు దూరంగా ఉండడంతో ధావన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ధావన్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటికే పలు సిరీస్‌లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ సంగతి పక్కనబెడితే.. టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ ధావన్ తన చర్యతో మరోసారి వైరల్‌గా మారాడు. సాధారణంగా మంచి హ్యూమర్ కనబరిచే ధావన్ మరోసారి తన మ్యాజిక్‌తో మెరిశాడు. వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫోజులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఇక్కడ ధావన్ స్వయంగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూంకి వెళ్లి అతన్ని ట్రోఫీ పెట్టిన ప్లేస్‌కు తీసుకురావడం విశేషం. ఈ గ్యాప్‌లోనే ఒకరినొకరు హగ్ చేసుకొని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ట్రోఫీని ఆవిష్కరించడానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్లో పంచుకుంది. ఇక టి20 సిరీస్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో భారత్ 65 పరుగుల తేడాతో నెగ్గింది. ఇక మూడో టి20లో వర్షం అంతరాయంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్‌ను టైగా నిర్ణయించడంతో సిరీస్‌ను టీమిండియా చేజెక్కించుకుంది. Smiles, friendly banter & the trophy 🏆 unveil! #TeamIndia | #NZvIND pic.twitter.com/3R2zh0znZ3 — BCCI (@BCCI) November 24, 2022 చదవండి: కెప్టెన్‌గా కఠిన నిర్ణయాలు తీసుకుంటా! లోకాన్ని వీడేటపుడు ఏం పట్టుకుపోతాం -
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. ఎక్స్‌ప్రెస్ పేసర్ ఎంట్రీ! సంజూ కూడా
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఆక్లాండ్ వేదికగా శుక్రవారం(నవంబర్25) న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో తలపడేందుకు భారత్ సిద్దమైంది. కాగా ఈ సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యారు. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్‌గా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. ఇక కివీస్‌తో జరగనున్న తొలి వన్డేలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ భారత్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఉమ్రాన్ మాలిక్ ఎంపికైనప్పటికీ కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తొలి వన్డేలో అతడిని ఆడించాలని జట్టు మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా దీపక్ హుడా స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు పేసర్ దీపక్ చాహర్ తొలి వన్డేకు దూరమమ్యే ఛాన్స్ ఉంది. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ భారత తరపున వన్డే అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆక్లాండ్‌కు చేరుకున్న ధావన్ సేన ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. తుది జట్టు(అంచనా) శిఖర్ ధావన్(కెప్టెన్),శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్,సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చదవండి: Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో! -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. మయాంక్‌పై వేటు
ఐపీఎల్-2023కు ముందు పంజాబ్ కింగ్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ నియమించింది. బుధవారం(నవంబర్ 2) జరిగిన బోర్డు మీటింగ్‌లో కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని పంజాబ్ ఫ్రాంచైజీ తీసుకుంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో మయాంక్‌ను తప్పించి జట్టు పగ్గాలను ధావన్‌కు అప్పజెప్పాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయించింది. అదే విధంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో అనిల్ కుంబ్లేను తప్పించి ట్రెవర్ బేలిస్‌ను జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా పంజాబ్ నియమించిన సంగతి తెలిసిందే. మరోవైపు తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్‌తో కూడా పంజాబ్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వచ్చే ఏడాది సీజన్లో కొత్త కోచింగ్ స్టాప్, కొత్త కెప్టెన్లతో పంజాబ్ బరిలోకి దిగనుంది. చదవండి: T20 WC 2022: మళ్లీ మాది పాత కథే.. వర్షం రాక పోయింటే విజయం మాదే: షకీబ్ -
మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
IND vs SA 3rd ODI: మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం
సౌతాఫ్రికాతో స్వదేశంలో మూడో వన్డేలో ధావన్ సేన ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మ్యాచ్ స్కోర్లు: సౌతాఫ్రికా 99 (27.1 ఓవర్లు) భారత్ 105/3 (19.1) పాపం గిల్.. హాఫ్ సెంచరీ మిస్ విజయానికి మూడు పరుగుల దూరంలో ఉండగా టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పెవిలియన్ చేరాడు. 49 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ అవుట్ ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఫోర్టుయిన్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్ నిష్క్రమించాడు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 42 పరగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధవన్ 8 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. గిల్‌కు (30)కు జతగా ఇషాన్ కిషన్ క్రీజ్‌లోకి వచ్చాడు. విజృంభించిన భారత బౌలర్లు.. 99 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా మూడో వన్డేలో భారత స్పిన్నర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా 99 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా.. వాషింగ్టన్ సుందర్, షబాజ్ ఆహ్మద్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. ప్రోటీస్ బ్యాటర్లలో క్లాసన్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 94 పరుగులకే ఏడు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో దక్షిణాప్రికా 94 పరుగులకే దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయింది. 34 పరుగులు చేసిన క్లాసన్.. షబాజ్ ఆహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 73 పరుగుల వద్ద దక్షిణాప్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఫెహ్లుక్వాయో.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 66 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన మిల్లర్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి ఫెహ్లుక్వాయో వచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 43 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మార్క్రమ్.. షబాజ్ ఆహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి మిల్లర్ వచ్చాడు. 26 పరుగులకే మూడు వికెట్లు 26 పరుగులకే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. 3 పరుగులు చేసిన హెండ్రిక్స్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 25 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మలాన్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 7 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాప్రికా వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో మలాన్(11), హెండ్రిక్స్(2) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా 7 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన డికాక్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రెజా హెండ్రిక్స్ వచ్చాడు. సిరీస్‌ను డిసైడ్ చేసే మూడో వన్డేలో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం మూడు మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌కు డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తుది జట్లు: భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, జోర్న్ ఫోర్టుయిన్, లుంగి ఎంగిడీ, అన్రిచ్ నోర్ట్జే ఢిల్లీ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే ఆలస్యంగా ప్రారంభం కానుంది. అరుణ్‌జైట్లీ స్టేడియం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో.. మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో మధ్యాహ్నం 1:00 గంటకు పడాల్సిన టాస్ ఇప్పుడు వాయిదా పడింది. కాగా 1:30 గంటలకు అంపైర్లు పిచ్‌ను పరీశీలించాక ఓ నిర్ణంయం తీసుకోనున్నారని" బీసీసీఐ ట్వీట్ చేసింది. UPDATE from Delhi 🚨 - Toss has been delayed. There will be an official inspection at 1:30 PM IST.#TeamIndia | #INDvSA — BCCI (@BCCI) October 11, 2022 -
ఢిల్లీలో భారీ వర్షాలు.. మూడో వన్డే జరిగేనా?
న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం మధ్యహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా మూడో వన్డే సిరీస్ డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్నారు. అయితే ఈ కీలక పోరుకు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. కాగా గత మూడు రోజుల నుంచి దేశ రాజధాని న్యూ ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్యూ వెదర్ పేర్కొంది. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, 40 శాతం వర్షంపడే అవకాశం ఉంది. అదే విధంగా ఉష్ణోగ్రత కూడా 21 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే ఛాన్స్ ఉంది అని అక్యూ వెదర్ తెలిపింది. ఇక రాంఛీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ప్రోటీస్ జట్టుపై ఘన విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌ను1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తుది జట్లు(అంచనా): భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. డిన్నర్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు -
దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. డిన్నర్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో వన్డేలో దక్షిణాప్రికాతో తాడో పేడో తేల్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ మంగళవారం (ఆక్టోబర్11) ఢిల్లీ వేదికగా జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు రోజు(సోమవారం) టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ డిన్నర్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ధావన్ తన సోషల్ మీడియా ఖతాలో షేర్ చేశాడు. ఇక రాంఛీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. ఇక మూడో వన్డేలో జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా): భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) చదవండి: Shahbaz Ahmed: 'ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా..' -
'వన్డే ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లు వారిద్దరే'
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20 కెరీర్‌కు దాదాపు ఎండ్ కార్డ్ పడినట్లే. గతేడాది జూలైలో భారత్ తరపున ధావన్ తన అఖరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతడిని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. కాగా ధావన్ టీ20లకు దూరంగా ఉన్నప్పటికీ.. వన్డేల్లో మాత్రం చోటు దక్కించుకుంటున్నాడు. ధావన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడంతో ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత్ వేదికగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టులో ధావన్‌కు ఖచ్చితంగా చోటు దక్కుతుందని టీమిండియా మాజీ సెలెక్టర్ సబా కరీం థీమా వ్యక్తం చేశాడు. అదే విధంగా రోహిత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను శిఖర్ ప్రారంభిస్తాడని కరీం జోస్యం చెప్పాడు. ఇండియా న్యూస్‌తో కరీం మాట్లాడుతూ.. "వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో శిఖర్ ధావన్‌కు స్థానం దాదాపు ఖారారైంది. అతడు అద్భుతమైన ఆటగాడు. అతడు విఫలమైన మ్యాచ్‌లు ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి. ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, ధావన్‌ను ఓపెనర్లుగా ఉండాలని సెలక్టర్లు ఇప్పటికే నిర్ణయించారని నేను భావిస్తున్నాను" పేర్కొన్నాడు. చదవండి: Ravindra Jadeja: తన క్రష్ ఏంటో చెప్పిన జడేజా.. షాకైన అభిమానులు -
శివాలెత్తిన శ్రేయస్, ఇషాన్.. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
శివాలెత్తిన శ్రేయస్, ఇషాన్.. సౌతాఫ్రికాపై టీమిండియా ఘన విజయం దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్) శతకంలో, ఇషాన్ కిషన్ (93) భారీ అర్ధశతకంతో చెలరేగడంతో 45.5 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. శతక్కొట్టిన అయ్యర్ 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రేయస్ అయ్యర్ శతకం బాదాడు. సహచరుడు ఇషాన్ కిషన్ 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ శ్రేయస్ మాత్రం ఆ తప్పు చేయకుండా నిలకడగా ఆడి కెరీర్లో రెండో శతకాన్ని నమోదు చేశాడు. అయ్యర్ 103 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 43 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 263/3. అయ్యర్‌కు జతగా శాంసన్ (21) క్రీజ్‌లో ఉన్నాడు. సెంచరీ చేజార్చుకున్న ఇషాన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్ కిషన్ 7 పరుగుల తేడాతో సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారు. హాఫ్ సెంచరీ చేశాక ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇషాన్.. ఫోర్టున్ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇషాన్ తన ఇన్నింగ్స్‌లో 84 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. 35 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 210/3. క్రీజ్‌లో శ్రేయస్ (71)కు జతగా సంజూ శాంసన్ వచ్చాడు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఇషాన్, శ్రేయస్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయాక టీమిండియా ఆచితూచి ఆడుతుంది. ఇషాన్ కిషన్ (60 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 50; 7 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 144/2. 100 దాటిన టీమిండియా స్కోర్ 48 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతూ 100 పరుగుల మార్కును దాటింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది ఇషాన్ కిషన్ 100 పరుగుల స్కోర్‌ను దాటించాడు. అదే ఓవర్లో ఇషాన్ మరో సిక్సర్ కూడా బాది గేర్ మార్చాడు. 21 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 111/2. క్రీజ్‌లో ఇషాన్ (42), శ్రేయస్ అయ్యర్ (26) ఉన్నారు. 48 పరుగులకే ఓపెనర్లిద్దరూ ఔట్ భారీ లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే తడబడుతుంది. 48 పరుగులకే ఓపెనర్లిద్దరూ ఔటయ్యారు. ధవన్ 13 పరుగులు చేసి ఔట్ కాగా.. 9వ ఓవర్లో రబాడ బౌలింగ్‌లో గిల్ (28) క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 49/2 కాగా.. క్రీజ్‌లో ఇషాన్ (5), శ్రేయస్ (1) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఆఖరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ధవన్ (13)ను వేన్ పార్నెల్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 28/1. క్రీజ్‌లో గిల్ (13), ఇషాన్ కిషన్ ఉన్నారు. రాణించిన మార్క్రమ్, హెండ్రిక్స్.. టీమిండియా టార్గెట్ 279 టీమిండియా బౌలర్లు ఇన్నింగ్స్‌లో మధ్యలో వరుస వికెట్లు తీసి ప్రెషర్ పెట్టడంతో భారీ స్కోర్ దిశగా సాగిన దక్షిణాఫ్రికా 278 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమతమైంది. రీజా హెండ్రిక్స్ (74), ఎయిడెన్ మార్క్రమ్ (79) అర్ధసెంచరీలతో రాణించగా.. క్లాసెన్ (30), డేవిడ్ మిల్లర్ (35 నాటౌట్) పర్వాలేదనిపించారు. ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా 300 స్కోర్ చేరుకోలేకపోయింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్ (3/38) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. సుందర్, షాబాజ్ అహ్మద్, శార్ధూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 256 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన పార్నెల్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఐదో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా వరుస క్రమంలో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. 79 పరుగులు చేసిన మార్క్రమ్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 40 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 221/5 నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 215 పరుగుల వద్ద ప్రోటీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన క్లాసన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 36 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 197/3 36 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(76), క్లాసన్(15) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాప్రికా 169 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 74 పరుగులు చేసిన హెండ్రిక్స్.. సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 25 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్ 122/2 25 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లు హెండ్రిక్స్(49), మార్క్రమ్(41) పరుగులతో ఉన్నారు. 18 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 77/2 18 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(18), హెండ్రిక్స్(29) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 40 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన మలాన్.. షబాజ్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో షబాజ్కు ఇది తొలి వికెట్. 6 ఓవర్లకు దక్షిణాప్రికా స్కోర్: 24/1 6 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. క్రీజులో మలాన్(13), హెండ్రిక్స్(3) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 7 పరుగుల వద్ద దక్షిణాప్రికా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన డికాక్.. సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి హెండ్రిక్స్ వచ్చాడు. రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. రుత్‌రాజ్ గైక్వాడ్, బిష్ణోయ్ స్థానంలో సుందర్, షాబాజ్ ఆహ్మద్ జట్టులోకి వచ్చారు. మరో వైపు ఈ మ్యాచ్‌కు ప్రోటీస్ రెగ్యూలర్ కెప్టెన్ టెంబా బావుమా, స్పిన్నర్ షమ్సీ దూరమయ్యారు. వారి స్థానంలో హెండ్రిక్స్, బెజార్న్ ఫోర్టుయిన్ జట్టులోకి వచ్చారు. తుది జట్లు దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్(కెప్టెన్), జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబడ, అన్రిచ్ నార్టే భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ -
దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. రుత్‌రాజ్‌కు నో ఛాన్స్! పటిదార్ అరంగేట్రం!
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రోటీస్‌తో తొలి వన్డేలో పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు రెండో వన్డేలో తలపడేందకు సిద్దమైంది. రాంఛీ వేదికగా ఆక్టోబర్9 భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఏలగైనా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని ధావన్ సేన భావిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా మాత్రం ఈ మ్యాచ్‌లో కూడా తొలి వన్డే జోరును కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలి అని అనుకుంటుంది. ప్రస్తుతం మూడు సిరీస్‌లో ప్రోటీస్ జట్టు 1-0తో ముందంజలో ఉంది. ఇక ఇప్పటికే రాంఛీకి చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డేలో విఫలమైన రుత్‌రాజ్ గైక్వాడ్ స్థానంలో యువ ఆటగాడు రజిత్ పటిదార్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. లక్నో వేదికగా జరిగిన మొదటి వన్డేలో 42 బంతులు ఎదర్కొన్న రుత్‌రాజ్ కేవలం 19 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. మరో వైపు దక్షిణాఫ్రికా మాత్రం తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డేలో కూడా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రజిత్ పటిదార్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ చదవండి: T20 World Cup 2022: టీ20 క్రికెట్ చరిత్రలో.. ఆఫ్గానిస్తాన్- ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ -
'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్'
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్‌లో చేయడంలో విఫలమం కావడం జట్టు ఓటమికి దారితీసిందని ధావన్ తెలిపాడు. కాగా ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు అఖరి ఓవర్లలో మాత్రం తెలిపోయారు. ప్రోటీస్ బ్యాటర్లు క్లసన్, మిల్లర్ బౌండరీల వర్షం కురిపించారు. అఖరి 5 ఓవర్లలో టీమిండియా బౌలర్లు ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నారు. అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా భారత్ పేలవ ప్రదర్శన కనబరిచింది. మిల్లర్, క్లసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారివిడిచారు. ఇందుకు భారత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. ఇక బ్యాటింగ్‌లో కూడా టీమిండియా అంతగా రాణించలేకపోయింది. ధావన్, గిల్, కిషన్, గైక్వాడ్ తీవ్రంగా నిరాశపరిచారు. అయితే సంజూ శాంసన్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న సంజూ 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ధావన్ మాట్లాడుతూ.. "40 ఓవర్లకు 250 పరుగులు చిన్న లక్ష్యమేమి కాదు. స్వింగ్, స్పిన్ అయ్యే వికెట్‌పై మేము చాలా పరుగులు ఇచ్చాము. ఫీల్డింగ్‌లో కూడా అంతగా రాణించలేకపోయాం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాము. ఇక బ్యాటింగ్‌లో కూడా ఆరంభం మంచిగా లేదు. కానీ సంజూ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అద్భుతమైనది. అఖరిలో శార్థూల్, సంజూ జట్టును గెలిపిస్తారని భావించాము. ఈ మ్యాచ్ నుంచి మేము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తాం" అని పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA: 'దటీజ్ సంజూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి' -
IND vs SA 1st ODI: చివరి వరకు పోరాడి ఓడిన భారత్!
తొలి వన్డేలో పోరాడి ఓడిన భారత్! సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైంది. చివరి వరకు పోరాడినా నాలుగు ఓవర్లలో పరుగులు రాబట్టకపోవడంతో పాటు వికెట్లను కోల్పోయింది భారత్. దీంతో తొలి మ్యాచ్ సౌతాఫ్రికా విజయం సాధించింది. సంజు శాంసన్(86) నాటౌట్ వీరోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 177/5 35 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 177/5. క్రీజులో శార్ధూల్(19), సంజు శాంసన్(48) ఉన్నారు. 30 ఓవర్లకు భారత్ స్కోర్: 145/5 30 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 145/5. క్రీజులో శార్ధూల్(12), సంజు శాంసన్(25) ఉన్నారు. భారత్ విజయం కోసం చివరి 10 ఓవర్లో 105 పరుగులు అవసరం. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. గెలుపు కష్టమే! అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్(50), ఎంగిడి ఓవర్లో భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ వికెట్‌తో భారత్ గెలుపు కష్టంగా మరిందనే చెప్పాలి. క్రీజులో సంజు శాంసన్(15), శార్ధూల్ ఠాకూర్ (0) ఉన్నారు. 25 ఓవర్లకు భారత్ స్కోర్:112/4 25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 112/4. క్రీజులో శ్రేయస్ అయ్యర్(45), సంజు శాంసన్(14) ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో భారత్.. నాలుగో వికెట్ డౌన్ 51 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన ఇషాన్ కిషాన్.. మహరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. క్రీజులో శ్రేయస్ అయ్యర్(1), సంజు శాంసన్(0) ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్ 48 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన గైక్వాడ్.. షమ్సీ బౌలింగ్‌లో స్టంప్ ఔటయ్యి వెనుదిరిగాడు. క్రీజులో ఇషాన్ కిషన్(19), శ్రేయస్ అయ్యర్(0) ఉన్నారు. 15 ఓవర్లకు భారత్ స్కోర్:45/2 15 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 45/2. క్రీజులో ఇషాన్ కిషన్(18), గైక్వాడ్(17) ఉన్నారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్:24/2 ఆరంభంలోనే భారత్ శిఖర్, గిల్ రూపంలో ఓపనర్లను కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసమయానికి భారత్ స్కోరు 24/2. క్రీజులో క్రీజులో ఇషాన్ కిషన్(10), గైక్వాడ్(6) ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 8 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన ధావన్.. పార్నెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో ఇషాన్ కిషన్(0), గైక్వాడ్(1) ఉన్నారు తొలి వికెట్ కోల్పోయిన భారత్: 8/1 3 ఓవర్లు ముగిసే సరికి భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. రబాడా బౌలింగ్‌లో గిల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. క్రీజులో శిఖర్ ధావన్(4), గైక్వాడ్(0) ఉన్నారు భారత్ టార్గెట్- 250 మొదట్లో తడబడ్డ దక్షిణాఫ్రికా బ్యాటర్లు, చివరికి భారత్ ముందు గౌరవప్రదమైన స్కోరునే ఉంచారు. వర్షం కారణంగా మ్యాచ్‌ని 40 ఓవర్లకు కుదించగా.. మ్యాచ్ ముగిసే సమయానికి సౌతాఫ్రికా 249 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.(40 ఓవర్లు- 249/4) ..క్లాసెన్(74), మిల్లర్(75 )పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 35 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 195/4 35 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(48), మిల్లర్(49 )పరుగులతో ఉన్నారు. 30 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 164/4 30 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెన్(39), మిల్లర్(28 )పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 108 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా డికాక్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో నిలదొక్కుకున్న డికాక్ అర్థసెంచరీ దగ్గర్లో తన వికెట్‌ని రవి బిష్ణోయ్‌కు సమర్పించుకున్నాడు. క్రీజులో క్లాసెన్(19), డేవిడ్ మిల్లర్(0) ఉన్నారు 21 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 105/3 21 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(46), క్లాసెన్(18) పరుగులతో ఉన్నారు. కష్టాల్లో దక్షిణాఫ్రికా.. మూడో వికెట్ డౌన్ 71 పరుగుల వద్ద దక్షిణిఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. బావుమా అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన మార్క్రామ్(0) కుల్దీప్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లకు స్కోరు: 71/3 రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 70 పరుగుల వద్ద దక్షిణిఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బావుమా.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి మార్క్రామ్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన మలాన్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 28/0 8 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(10), మలాన్(17) పరుగులతో ఉన్నారు. 2 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 8/0 2 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(6),మలాన్(2) పరుగులతో ఉన్నారు. ఎట్టకేలకు భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. మరోవైపు రుత్‌రాజ్ గైక్వాడ్ టీమిండియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. తుది జట్లు దక్షిణాఫ్రికా: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, తబ్రైజ్ షమ్సీ టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా తలపడేందుకు సిద్దమైంది. అయితే మ్యాచ్ ఆరంభానికి వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ వేయాల్సి ఉండగా.. వర్షంతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంతరాయం కలిగింది. టాస్ 1: 30కు పడుతుంది అని బీసీసీఐ ట్విట్ చేసింది. అయితే టాస్ పడే సమయానికి మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ మరింత అలస్యంగా ప్రారంభం కానుంది. కాగా రోహిత్ సారథ్యంలోని సీనియర్ భారత జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు పయనం కాగా.. ధావన్ నేతృత్వంలో భారత ద్వితీయ శ్రేణి జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఈ సిరీస్‌కు దేశీవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్న ముఖేష్ కుమార్, పటిదార్‌కు భారత జట్టు తరపున చోటు దక్కింది. చదవండి: Womens Asia Cup 2022: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం -
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే .. రజత్ పటిదార్ అరంగేట్రం! భారత జట్టు ఇదే!
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. లక్నో వేదికగా ఆక్టోబర్6న తొలి వన్డేలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో భారత సీనియర్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లనుండడంతో.. భారత ద్వితీయ శ్రేణి జట్టు ఈ సిరీస్‌లో తలపడనుంది. ఈ జట్టుకు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా రజిత్ పాటిదార్, ముఖేష్ కుమార్‌కు తొలి సారిగా టీమిండియాలో చోటు దక్కింది. ఓపెనర్లగా ధావన్, శుబ్‌మన్ గిల్ తొలి వన్డేలో ఓపెనర్లగా ధావన్, శుబ్మాన్ గిల్ రానున్నారు. గిల్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్, జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టాడు. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 9 వన్డేలు ఆడిన గిల్.. 499 పరుగులు సాధించాడు. ఇక ధావన్ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. ధావన్ ఆడిన అఖరి ఆరు వన్డేల్లో 322 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠికి చోటు దక్కే అవకాశం కన్పిస్తుంది. మరోవైపు రజిత్ పాటిదార్ భారత్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఆల్ రౌండర్ల కోటాలో షబాజ్ ఆహ్మద్, శార్థూల్ ఠాకూర్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక చివరగా మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్‌కు బౌలర్ల కోటాలో ఎంపికయ్యే అవకాశం కన్పిస్తోంది. తొలి వన్డేకు భారత జట్టు (అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజిత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్ (వికెట్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్ చదవండి: T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసులో ఆ మూడు జట్లే నిలుస్తాయి' -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! కెప్టెన్‌గా ధావన్
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు వెళ్లనుండడంతో.. ఈ సిరీస్‌కు ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా యువ ఆటగాళ్లు రజిత్ పటిదార్, ముఖేష్ కుమార్‌కు తొలి సారి భారత జట్టులో చోటు దక్కింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇక దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే ఆక్టోబర్ 6న లక్నో వేదికగా జరగనుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్ , అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్. Shikhar Dhawan (C), Shreyas Iyer (VC), Ruturaj Gaikwad, Shubhman Gill, Rajat Patidar, Rahul Tripathi, Ishan Kishan (WK), Sanju Samson (WK), Shahbaz Ahmed, Shardul Thakur, Kuldeep Yadav, Ravi Bishnoi, Mukesh Kumar, Avesh Khan, Mohd. Siraj, Deepak Chahar.#TeamIndia | #INDvSA — BCCI (@BCCI) October 2, 2022 -
సూర్యకుమార్ యాదవ్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తిరువనంతపురం వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో టీమిండియా ముందంజ వేసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బౌలర్లు సఫారీల బ్యాటర్ల భరతం పట్టగా.. అనంతరం బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. కాగా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. చాహర్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(56 బంతుల్లో 51 నటౌట్), సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 50 పరుగులు నటౌట్) రాణించారు. మరోసారి అదరగొట్టిన సూర్య.. టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో సారి అదరగొట్టాడు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఆరంభంలో భారత్ తడబడింది. ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరగగా.. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మూడు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్య.. తన ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 33 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు సాధించాడు. అఖరి వరకు క్రీజులో నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిజ్వాన్ రికార్డు బద్దలు కొట్టిన సూర్య ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా సూర్య రికార్డులకెక్కాడు. 2022 ఏడాదిలో ఇప్పటి వరకు ఈ ముంబైకర్ మొత్తం 45 సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. 2021 ఏడాదిలో రిజ్వాన్ 42 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో రిజ్వాన్‌ను రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా స్కై నిలిచాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అతడు 732 పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ ఘనత భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. 2018 ఏడాదిలో ధావన్ 689 పరుగులు చేశాడు. చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న షమీ -
టీమిండియా గబ్బర్ను గుర్తుచేసిన అర్ష్‌దీప్ సింగ్..
సౌతాఫ్రికాతో తొలి టి20లో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. టీమిండియా పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చహర్‌లు చెలరేగడంతో సౌతాఫ్రికా జట్టు 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అందులో అర్ష్‌దీప్ మూడు వికెట్లు కాగా.. రెండు వికెట్లు దీపక్ చహర్వి ఉన్నాయి. కాగా సౌతాఫ్రికాకు టి20 క్రికెట్లో ఇదే అత్యంత చెత్త ఆరంభం. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం విశేషం. రొసో, మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్‌లు తాము ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగారు. ఇక అర్షదీప్ సింగ్.. టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్‌ను గుర్తుకు తెచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో దీపక్ చహర్ బౌలింగ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ భారీ షాట్‌కు యత్నించగా.. థర్డ్‌మన్‌లో ఉన్న అర్ష్‌దీప్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో అర్ష్‌దీప్ క్యాచ్ అందుకున్న సంతోషంలో తొడ కొట్టి మీసం మెలేశాడు. కాగా టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ క్యాచ్ పట్టిన ప్రతీసారి తొడగొట్టడం అలవాటు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా ధావన్.. వైస్ కెప్టెన్‌గా శాంసన్!
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టును బుధవారం(సెప్టెంబర్ 28) బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌కు టీ20 ప్రపంచకప్-2022 భారత జట్టులో భాగంగా ఉన్న ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ కోసం ఆక్టోబర్ 6వ తేదీన ఆస్ట్రేలియాకు పయనమవుతుంది. అదే రోజున భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే కూడా లక్నో వేదికగా జరగనుంది. ఇక ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టు సారథ్య బాధ్యతలు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేపట్టే అవకాశం ఉంది. ధావన్ డిప్యూటీగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ బాధ్యతలు నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సీనియర్ జట్టుతో ఆస్ట్రేలియాకు వెళ్లనుండడంతో అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో అదరగొట్టిన భారత ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా సిరీస్‌కు సెలక్టర్లు ఎంపికచేయనున్నట్లు సమాచారం. “రోహిత్, విరాట్‌తో సహా టీ20 ప్రపంచకప్‌లో ఉన్న ఆటగాళ్లందరికీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వబడుతుంది. శిఖర్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. భారత్-ఎ వర్సెస్ న్యూజిలాండ్-ఎ మధ్య జరిగే 3వ వన్డే తర్వాత ప్రోటీస్ సిరీస్‌కు జట్టును ప్రకటిస్తారు అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా భారత పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 28న తివేండ్రం వేదికగా జరగనున్న తొలి టీ20తో ప్రోటీస్ టూర్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత జట్టు(అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ప్రసిద్ద్ మాలిక్ , కుల్దీప్ సేన్ -
జడేజా ముందు డ్యాన్స్ చేసిన ధావన్.. వీడియో వైరల్!
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆన్ ఫీల్డ్‌లోనే కాకుండా ఆఫ్‌ది ఫీల్డ్‌లో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పడు ఫ్రాంక్ వీడియోలతో, తన డ్యాన్స్ రీల్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజగా మరోసారి ఓ ఫన్నీ వీడియోను తన సోషల్ మీడియాలో ఖాతాలో ధావన్ షేర్ చేశాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తాజాగా ధావన్ కలిశాడు. ఈ సందర్భంగా జడేజా ముందు ధావన్ డ్యాన్స్ చేశాడు. "ఇస్కీ షాదీ కర్వా డిజియే, జిమ్మెదారీ అయేగీ టు సుధర్ జయేజా"(అతడికి పెళ్లి చేయండి. బాధ్యత వస్తే, తిరిగి ట్రాక్‌లోకి వస్తాడు). అనే ఫేమస్ బాలీవుడ్ డైలాగ్‌కు జడేజా పెదవి సింక్ చేయగా.. ఆనందంతో ధావన్ డ్యాన్స్ చేశాడు. అదే విధంగా ఆ వీడియోకఉ " ఇప్పుడే కాదు ఇంకా సమయం ఉంది" అని క్యాప్షన్‌ను ధావన్ జోడించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తూ.. తన సహచర ఆటగాళ్లు అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశారు. కాగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్-2022కు జడేజా దూరం కాగా.. ధావన్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ధావన్ సారథిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) చదవండి: IND VS AUS: రోహిత్ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్ గవాస్కర్ -
కోహ్లి, ధావన్‌ల తర్వాత స్మృతి మందానకే సాధ్యమైంది..
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు అందుకుంది. వన్డేల్లో వేగంగా 3,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో ఆమె మూడో బ్యాటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో శిఖర్ ధావన్ ముందు వరుసలో ఉన్నాడు. అతను 72 ఇన్నింగ్స్‌ల్లో, కోహ్లి 75 ఇన్నింగ్స్‌ల్లో 3,000 క్లబ్లో చేరాడు. ఇతనికి ఒక్క ఇన్నింగ్స్ తేడాతో మందాన 76వ ఇన్నింగ్స్‌లో రికార్డు చేరుకుంది. గత నెలలో ఐసీసీ ప్రకటించిన ఐదుగురు ‘క్రికెట్ సూపర్‌స్టార్స్’లో మందాన ఉంది. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్‌ల తర్వాత భారత మహిళల్లో 3,000 పరుగుల మైలురాయిని దాటిన మూడో క్రికెటర్ మందాన. ప్రత్యేకించి మహిళల్లో 22 మంది క్రికెటర్లు ఈ ఘనత సాధించగా... వేగంగా చేరుకున్న జాబితాలోనూ ఆమెది మూడో స్థానం కావడం మరో విశేషం. బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా; 62 ఇన్నింగ్స్‌లు), మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా; 64 ఇన్నింగ్స్‌లు) భారత బ్యాటర్ కంటే చకచకా 3000 పరుగుల్ని పూర్తి చేశారు. చదవండి: 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్!
ఆసియాకప్-2022 సూపర్-4 దశలోనే నిష్క్రమించిన టీమిండియా.. ఇప్పడు హాం సిరీస్‌లతో బీజీ బీజీగా గడపనుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాకాలలో భాగంగా తొలుత ఆస్ట్రేలియాతో.. అనంతరం దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 20న మెహాలి వేదిగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అదే విధంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డే సిరీస్‌లను భారత్ ఆడనుంది. సెప్టెంబర్ 28న తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి టీ20తో దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభం కానుంది. కాగా టీ20 సిరీస్ ముగిసిన అనంతరం వన్డే సిరీస్ జరగనుంది. అయితే వన్డే సిరీస్‌కు టీ20 ప్రపంచకప్‌లో పాల్గోనే భారత ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెటరన్ ఆటగాడు శిఖర్ ధావన్‌కు భారత కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ సిరీస్‌కు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత మాజీ ఆటగాడు వీవీయస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే విండీస్, జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా ధావన్ వ్యవహరించాడు. "టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనున్నాం. కొన్ని సార్లు షెడ్యూల్ ఈ విధంగానే ఉంటుంది. అయితే కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లితో పాటు ఈ పొట్టి ప్రపంచకప్‌లో భాగమయ్యే ఆటగాళ్లందరికీ ప్రోటీస్ సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నాం. ఈ సిరీస్‌లో భారత జట్టుకు శిఖర్ సారథ్యం వహించనున్నాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్‌తో పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఆక్టోబర్ 16నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు ఆక్టోబర్ 10న ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: Asia Cup2022: ఇదేమి బౌలింగ్రా అయ్యా.. తొలి బంతికే 10 పరుగులు! -
సిరీస్ క్లీన్‌స్వీప్.. 'కాలా చష్మా' పాటకు చిందేసిన టీమిండియా
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా సంతోషంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ సహా మిగతా ఆటగాళ్లు బాలీవుడ్ పాపులర్ పాట.. 'కాలా చష్మా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ముఖ్యంగా ధావన్, మ్యాచ్ హీరో శుబ్‌మన్ గిల్లు కాలా చస్మా సిగ్నేచర్ స్టెప్పులతో దుమ్మురేపారు. ఈ వీడియోనూ ధావన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది. కాలా చస్మా ట్రెండ్ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసిన ధావన్.. సెలబ్రేషన్ మూడ్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సెంచరీ హీరో గిల్ అయితే సంతోషంలో మునిగిపోయి తనదైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఉర్రూతలూగించడం విశేషం. ఇక మూడో వన్డేలో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్ సికందర్ రజా వీరోచిత సెంచరీ వృథా అయినప్పటికి.. తన ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసు దోచుకున్నాడు. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) Winning celebration by team India. pic.twitter.com/ccVQEDppoc — Mufaddal Vohra (@mufaddal_vohra) August 22, 2022 చదవండి: Sikandar Raza: పాక్ మూలాలున్న బ్యాటర్.. అయినా సరే మనసు దోచుకున్నాడు Shubman Gill: 'డెబ్యూ సెంచరీ నాన్నకు అంకితం'.. గిల్ ఎమోషనల్ -
'ఓపెనర్‌గా శార్దూల్ వచ్చాడు అనుకున్నా.. ఆటగాళ్లకు సరైన జెర్సీలు లేకుండా పోయాయి'
ఇటీవల కాలంలో భారత ఆటగాళ్లు తరచూ తమ సహచరుల జెర్సీలను ధరించడం చూస్తూనే ఉన్నాం. గత నెలలో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దీపక్ హుడా ప్రసిద్ధ్ కృష్ణ జర్సీని ధరించగా.. మరో ఇద్దరు ఆటగాళ్లు పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ జర్సీ ధరించి కన్పించారు. తాజాగా ఈ జాబితాలోకి వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా చేరాడు. హరారే వేదికగా జింబాబ్వేతో మూడో వన్డేలో ధావన్.. ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ జెర్సీని ధరించి బ్యాటింగ్ వచ్చాడు. కాగా ఆ జెర్సీపై టేప్ అతికించబడి ఉంది. అయిన్పటికీ శార్దూల్ ఠాకూర్ జెర్సీ నంబర్ 54 మాత్రం సృష్టంగా కన్పిస్తోంది. కాగా ఠాకూర్ టీ షర్ట్‌ను ధావన్ ధరించడానికి గల కారణం ఏమిటో మాత్రం ఇప్పటి వరకు తెలియదు. కాగా ఇందుకు సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ధావన్ జర్సీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొంత మంది ఫన్నీ కామెట్లు చేస్తుండగా.. మరి కొంత మంది బీసీసీఐ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఓపెనర్‌గా శార్దూల్ వచ్చాడు అనుకున్నా.. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు సరైన జెర్సీలను ఎందుకు అందించలేక పోతుందో అర్ధం కావడం లేదంటూ" కామెంట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. Very happy to see shardul Dhawan opened for india . I don't know why million dollars @BCCI don't have Jersey for players. #MPL #mplsports worst kit sponsor ever.. — Ajay Krishnan (@_ajaykrishnan_) August 22, 2022 All the while we thought Shikar Dhawan was 'GABBAR' but came out wearing 'THAKUR' today! Aise kyu kia bhai @SDhawan25 #ZIMvIND #ShikharDhawan — Ravi Kalle (@rt_Kalle) August 22, 2022 చదవండి: ENG vs PAK: 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. షెడ్యూల్ విడుదల చేసిన పాకిస్తాన్! -
వన్డేల్లో ధావన్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 6500 పరుగుల మైలు రాయిని అందుకున్న పదో భారత బ్యాటర్‌గా ధావన్ రికార్డులకెక్కాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ధావన్ ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ 81 పరుగులతో అఖరి వరకు ఆజేయంగా నిలిచి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల ధాటికి 189 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ తీశాడు. అనంతరం 190 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్(82), ధావన్(81) పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు విజయాన్ని అందించారు. వన్డేల్లో 6500 పరుగులు సాధించిన భారత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్-18426 పరుగులు విరాట్ కోహ్లి-12344 పరుగులు సౌరవ్ గంగూలీ- 11363 పరుగులు రాహల్ ద్రవిడ్-10889 పరుగులు ఎంఎస్ ధోని-10773 పరగులు ఎం అజారుద్దీన్- 9378 పరుగులు రోహిత్ శర్మ-9378 పరుగులు యువరాజ్ సింగ్-8701 పరుగులు వీరేంద్ర సెహ్వాగ్-8273 పరుగులు శిఖర్ ధావన్-6508 పరుగులు 🚨 Milestone Alert 🚨 Shikhar Dhawan has reached 6️⃣5️⃣0️⃣0️⃣ ODI runs for India 👏🇮🇳 What a player 💪🏻#ShikharDhawan #India #ZIMvIND #CricketTwitter pic.twitter.com/IZ5YPM7cp5 — Sportskeeda (@Sportskeeda) August 18, 2022 చదవండి: IND vs ZIM 1st ODI: ధావన్, గిల్ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం -
జింబాబ్వేతో తొలి వన్డే.. టీమిండియా రికార్డుల మోత
జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా రికార్డుల మోత మోగించింది. గురువారం హరారే వేదికగా జరిగిన వన్డేలో కేఎల్ రాహుల్ సేన జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ►టీమిండియా ఓపెనర్లు ధావన్, శుబ్‌మన్ గిల్ కొత్త చరిత్ర సృష్టించారు. 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సందర్భాల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జాబితాలో వీరిద్దరు రెండో స్థానంలో ఉన్నారు. ఇక తొలి స్థానంలో జింబాబ్వేపైనే 1998లో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 197/0 పరుగులు తొలి స్థానం. ఆ తర్వాత మరోసారి జింబాబ్వేపై 2016లో 126/0.. మూడో స్థానంలో ఉంది. ►ఇక టీమిండియాకు వన్డేల్లో 200 కంటే లక్ష్య ఛేదనల్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం అందుకోవడం ఇది ఎనిమిదో సారి. ► జింబాబ్వేపై భారత్‌కు ఇది వరుసగా 13వ వన్డే విజయం(2013-22 మధ్య కాలంలో). ఇంతకముందు బంగ్లాదేశ్‌పై 12 విజయాలు(1998-2004), న్యూజిలాండ్‌పై 11 విజయాలు(1986-88), 10 విజయాలు(2002-05) మరోసారి జింబాబ్వేపైనే సాధించింది. That's that from the 1st ODI. An unbeaten 192 run stand between @SDhawan25 & @ShubmanGill as #TeamIndia win by 10 wickets. Scorecard - https://t.co/P3fZPWilGM #ZIMvIND pic.twitter.com/jcuGMG0oIG — BCCI (@BCCI) August 18, 2022 చదవండి: IND vs ZIM 1st ODI: ధావన్, గిల్ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం -
ధావన్, గిల్ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం
జింబాబ్వే పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్(113 బంతుల్లో 81 నాటౌట్), శుబ్‌మన్ గిల్( 71 బంతుల్లో 82 నాటౌట్).. జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మెరుపులు మెరిపించారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకముందు టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ నమ్మకాన్ని నిజం చేస్తూ దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. 50 ఓవర్లు ఆడడంలో విఫలమైన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ చకాబ్వా 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒక దశలో 107 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే కనీసం 150 పరుగుల మార్క్‌నైనా దాటుతుందా అన్న అనుమానం వచ్చింది. కానీ చివర్లో రిచర్డ్ నగర్వా 34, బ్రాడ్ ఎవన్స్ 33 పరుగులు నాటౌట్ ఆకట్టుకోవడంతో ఆ జట్టు 189 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు తీయగా,.. సిరాజ్ ఒక వికెట్ తీశాడు. #1stODI | RESULT: 🇮🇳 beat 🇿🇼 by 10 wickets in the first ODI to take a 1-0 lead in the three-match series#ZIMvIND | #KajariaODISeries | #VisitZimbabwe pic.twitter.com/b4i6XkAkCl — Zimbabwe Cricket (@ZimCricketv) August 18, 2022 చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో తొలి వన్డే.. ఇషాన్ కిషన్‌కు తప్పిన ప్రమాదం! -
శిఖర్ ధావన్‌ను భరించడమే కష్టం; మరో ధావన్ జతకలిస్తే..
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్.. బాలీవుడ్ స్టార్ శిఖర్ ధావన్‌తో కలిసి ఫోటో దిగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాములుగానే శిఖర్ ధావన్ అల్లరిని తట్టుకోవడం కష్టం.. అలాంటిది అతనికి మరో ధావన్ తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు చెప్పింది కేవలం సరదా కోసమే. వాస్తవానికి శిఖర్ ధావన్ సహా టీమిండియా సభ్యులు ఇవాళ ఉదయమే జింబాబ్వే పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం నాలుగు గంటల సమయంలో వరుణ్ ధావన్ టీమిండియా సభ్యులతో కలిసి ఫోటోకు ఫోజిచ్చాడు. ఈ సందర్భంగా ఫోటోలను ట్విటర్లో షేర్ చేస్తూ.. ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయంలో నేను చిన్నపిల్లాడిలా మారిపోయి క్యాండీ షాపులో తిరుగుతున్నా. ఆ సమయంలో టీమిండియా బృందం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుపడింది. అంతే ఒక్కసారిగా సంతోషంతో వారి దగ్గరికి వెళ్లిపోయాను. జింబాబ్వే టూర్ విజయవంతగా ముగించుకొని తిరిగి రావాలని కోరుకున్నా. ఈ సందర్భంగా ధావన్ భయ్యాతో ఫోటో దిగడం ఆనందంగా అనిపించింది. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్ ధావన్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్ తదితరులు విమానంలో బయల్దేరారు. వీరితో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో టీమిండియాను విజేతగా నిలిపిన శిఖర్ ధావన్‌ను తొలుతు జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు.అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకోవడంతో.. గబ్బర్ను తప్పించి అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి. At 4 in the morning I was like a boy in a candy shop. Got very excited to meet and chat with our men in blue About their upcoming tour. Also @SDhawan25 asked me a couple of riddles 😂 pic.twitter.com/DbknESJB0k — VarunDhawan (@Varun_dvn) August 13, 2022 చదవండి: వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఆడడమే నా టార్గెట్: ధావన్ -
వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఆడడమే నా టార్గెట్: ధావన్
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే తన కోరికను ధావన్ తాజాగా వ్యక్తం చేశాడు. ఇందుకోసం తన ఫిట్నెస్, ఆటపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ధావన్ తెలిపాడు. కాగా వచ్చే ఏడాది వన్డే వరల్ఢ్‌కప్ భారత్ వేదికగా జరగనుంది. ధావన్ టైమ్స్ ఇండియాతో మాట్లాడుతూ.. "ఐసీసీ టోర్నీల్లో ఆడటం నాకు చాలా ఇష్టం. మెగా టోర్నీల్లో ఆడితే నాకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. నేను గతంలో చాలా ఐసీసీ టోర్నమెంట్లలో భాగమయ్యాను. టీమిండియా జర్సీ ధరించిన ప్రతీ సారీ నా పై ఒత్తిడి ఉంటుంది. కానీ అనుభవజ్ఞుడైన ఆటగాడిగా, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. అదేవిధంగా జట్టు మేనేజ్మెంట్ కూడా నాకు చాలా సార్లు మద్దతుగా నిలిచింది. ఏ టోర్నమెంట్‌కైనా నా దృష్టి, సన్నద్దత ఒకే విధంగా ఉంటుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌పైనే ఉంది. అందుకోసం టీమిండియా తరపున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాను. రాబోయే మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాలి అనుకుంటున్నాను. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ టోర్నీ కూడా జరగనుంది. అదే విధంగా దేశీవాళీ టోర్నీలో కూడా ఆడి, పూర్తి ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నాను" అతడు పేర్కొన్నాడు. ధావన్ ఇటీవల ముగిసిన విండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అదే విధంగా త్వరలో జింబాబ్వేతో జరగునున్న వన్డే సిరీస్‌కు ధావన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ధావన్ తొలుత కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ.. రాహుల్ ఫిట్నెస్ సాధించడంతో తిరిగి అతడిని సారధిగా బీసీసీఐ నియమించింది. చదవండి: Shikhar Dhawan: టీ20లకు పక్కనపెట్టారు కదా! సెలక్టర్లు ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు! -
'ఆపండి రా నాయనా'.. మీ అతి ప్రేమతో చంపేటట్లున్నారు!
టీమిండియా వెటరన్ ఆటగాడు శిఖర్ ధావన్ ఫన్నీ వీడియోలు చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఆటలో ఎంత దూకుడు కనబరుస్తాడో.. బయట అంత ఫన్నీగా ఉంటాడు. తనదైన హ్యూమర్‌ను జత చేసి అభిమానులకు నవ్వు తెప్పించిన సందర్భాలు కొకొల్లలు. తండ్రితో ధావన్ చెంపదెబ్బలు తిన్న వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా అలాంటి ఫన్నీ వీడియోనే మరొకటి మన ముందుకు తీసుకొచ్చాడు. మనం ఎవరైనా తెలిసిన వాళ్ల ఇంటికి మొదటిసారి వెళితే.. వాళ్లు చేసి అతిథి మర్యాదలు మాములుగా ఉండవు. ముఖ్యంగా తిండి తినే సమయంలో ఇలాంటి ప్రేమలు ఎక్కువగా కనిపిస్తాయి. మనం వద్దన్నా సరే తినండి.. తినండి అంటూ వడ్డించేస్తారు. అలాంటి సందర్బంలో వారి అతి ప్రేమను తట్టుకోవడం కష్టమవుతుంది. ఏమైనా చెబుదామంటే మొహమాటం అడ్డు వస్తుంది. ఇలాంటి అనుభవాలు మీకు కూడా చాలానే ఎదురయ్యే ఉంటాయి. తాజాగా ధావన్ ఇదే అంశాన్ని తీసుకొని ఒక ఫన్నీ వీడియో తయారు చేశాడు. ధావన్ డైనింగ్టేబుల్పై కూర్చొని ఉంటాడు. అతని ప్లేట్లో అప్పటికే రోటీలు, కర్రీలు, అన్నం, కప్పు సలాడ్‌తో నింపేశారు. ధావన్ ఇంకా తినడం ప్రారంభించకముందే పక్కన ఉన్న ఇద్దరు సర్వర్లు వడ్డిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ధావన్.. ''అరె భయ్యా ప్లేట్ ఖాళీ లేదు.. కాసేపు ఆగండి'' అని అన్నాడు. కానీ ధావన్ మాటను లెక్కచేయని సర్వర్లు..''అరె మీ ప్లేట్లో చాలా ఖాళీ ఉంది.. ముందు మీరు తినండి'' అని పేర్కొన్నారు. దీంతో ధావన్ ''మీ ప్రేమ తగలయ్యా.. తిండి పెట్టి పెట్టి నన్ను చంపేటట్లున్నారు.'' అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ధావన్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే వీడియోకు రెండు మిలియన్ వ్యూస్ రాగా.. మూడు లక్షల లైకులు.. 2వేల కామెంట్లు వచ్చాయి. కాగా ధావన్(గబ్బర్)కు ఇన్‌స్టాగ్రామ్‌లో 11.1 మిలియన్ ఫాలోవర్లు ఉండడం విశేషం. ఇక పరిమిత ఓవర్ల(50 ఓవర్లు) ఆటకు మాత్రమే పరిమితమైన శిఖర్ ధావన్ తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటునే వస్తున్నాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అటు కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా గబ్బర్ అదరగొట్టాడు. విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి టీమిండియాకు సిరీస్ అందించడంతో పాటు మూడు వన్డేలు కలిపి 168 పరుగులు చేశాడు. తొలి వన్డేలో 97 పరుగుల వద్ద ఔటై తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) చదవండి: Ishan Kishan: ఎంపిక చేయలేదన్న కోపమా?.. పాట రూపంలో నిరసన Sachin-Yuvraj: కొత్త వేషంలో టీమిండియా దిగ్గజం.. టీజ్ చేసిన యువీ కాబోయే భార్యతో సాగర తీరంలో టీమిండియా ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ -
కరేబియన్ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర
కరేబియన్ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విండీస్‌ను వారి సొంత గడ్డపై వైట్‌వాష్ చేయడం ఇదే తొలిసారి. బుధవారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా విండీస్‌ను 119 పరుగుల భారీ తేడాతో ఓడించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శుబ్‌మన్ గిల్ సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో ఆగిపోయినప్పటికి అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో భారత జట్టు నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 137 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. ఈ క్రమంలో టీమిండియా పలు రికార్డులు బద్దలు కొట్టింది. ►119 పరుగులు- విండీస్ గడ్డపై వన్డేల్లో టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం ►ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో భాగంగా 2007 నుంచి 2022 వరకు చూసుకుంటే వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది 12వ సిరీస్ విజయం. అంతేకాదు వన్డేల్లో ఒక జట్టుపై అత్యధిక వన్డే సిరీస్‌లు గెలిచిన జాబితాలో టీమిండియా తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్(1996-2021 వరకు) జింబాబ్వేపై 11 సార్లు, వెస్టిండీస్‌పై(1999-2022 వరకు) పాకిస్తాన్ 10సార్లు, జింబాబ్వేపై(1995-2018 వరకు) సౌతాఫ్రికా 9సార్లు వన్డే సిరీస్‌లు నెగ్గగా.. ఇక శ్రీలంకపై భారత్(2007-2021) వరకు 9సార్లు వన్డే సిరీస్‌లు గెలిచింది. ►ఇక విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఒకే క్యాలండర్ ఇయర్లో ఒక జట్టును డబుల్ వైట్‌వాష్ చేసిన మూడో జట్టుగా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ పర్యటనకు వచ్చిన విండీస్ 3-0తో వైట్‌వాష్ అయింది. 2001లో జింబాబ్వే.. బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపైనే 4-0తో వైట్‌వాష్ చేయగా.. అదే ఏడాది కెన్యా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో డబుల్ వైట్‌వాష్ చేసింది.ఇక 2006లో బంగ్లాదేశ్ ఇంటా, బయటా రెండుసార్లు 3-0తో కెన్యాను క్లీన్‌స్వీప్ చేసింది. ►ఈ ఏడాది జూన్- జూలై మధ్యలో విండీస్ 9 వన్డే మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యింది. ఇంతకముందు 2005లో ఫిబ్రవరి-ఆగస్టు మధ్య 11 వన్డేలు, అక్టోబర్ 1999-జనవరి 2000 మధ్య 8 వన్డేలు, జూలై 2009-ఫిబ్రవరి 2010 మధ్య 8వన్డేల్లో పరాజయాలు చవిచూసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టార్గెట్ క్లీన్‌స్వీప్.. టీమిండియా ముంగిట అరుదైన రికార్డులు
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా ముంగిట అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఇంతకముందు జరిగిన రెండు వన్డేల్లోనూ 300 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. తొలి వన్డేలో 308 పరుగులను కాపాడుకునే క్రమంలో మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలో 312 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మిగిలి ఉండగా విజయం సాధించింది. ఇక బుధవారం జరగనున్న మూడో వన్డేలో గనుక టీమిండియా విజయం సాధిస్తే పలు రికార్డులు అందుకోనుంది. ఒకసారి వాటిని పరిశీలిద్దాం. ►మూడో వన్డేలో టీమిండియా గెలిస్తే.. విండీస్‌ను వారి సొంతగడ్డపైనే వైట్‌వాష్ చేసిన జట్టుగా రికార్డు సృష్టించనుంది. ►మూడో వన్డే విజయంతో కరీబియన్ గడ్డపై తొలిసారి టీమిండియా క్లీన్‌స్వీప్‌తో సిరీస్ గెలవనున్న జట్టుగా నిలవనుంది. ►ఒకవేళ విండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియాకు ఇది 13వ సిరీస్ క్లీన్‌స్వీప్ సిరీస్ విజయం కానుంది. ►విండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే విదేశీ గడ్డపై టీమిండియాకు ఇది మూడో క్లీన్‌స్వీప్ సిరీస్ అవుతుంది. ►ఇంతకముందు 2103, 2015, 2016లో జింబాబ్వేను.. 2017లో శ్రీలంకను టీమిండియా వైట్‌వాష్ చేసింది. ►ఇక విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే ఒకే క్యాలండర్ ఇయర్లో డబుల్ వైట్‌వాష్ చేసిన మూడో జట్టుగా టీమిండియా నిలవనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ పర్యటనకు వచ్చిన విండీస్ 3-0తో వైట్‌వాష్ అయింది. ►ఒక జట్టు ఒకే క్యాలండర్ ఇయర్లో తన ప్రత్యర్థిని డబుల్ వైట్‌వాష్ చేసిన సందర్భాలు రెండుసార్లు మాత్రమే. 2001లో జింబాబ్వే.. బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపైనే 4-0తో వైట్‌వాష్ చేయగా.. అదే ఏడాది కెన్యా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో డబుల్ వైట్‌వాష్ చేసింది.ఇక 2006లో బంగ్లాదేశ్ ఇంటా, బయటా రెండుసార్లు 3-0తో కెన్యాను క్లీన్‌స్వీప్ చేసింది. చదవండి: మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు? Ind Vs WI 3rd ODI: క్లీన్‌స్వీప్ లక్ష్యంగా... -
సిరీస్ సొంతం.. టీమిండియా సెలబ్రేషన్స్ అదుర్స్! వీడియో వైరల్
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో ధావన్ సారథ్యంలోని టీమిండియా కైవసం చేసుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విండీస్‌పై భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. ఇక మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రేజీ సెలబ్రేషన్స్‌కు సైతం ధావన్ నాయకత్వం వహించాడు మరి!.. ఇందుకు సంబంధించిన వీడియోను ధావన్ సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో జోసఫ్, మైర్స్ చెరో రెండు వికెట్లు, సీల్స్, హొసేన్, రొమారియో షెపర్డ్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్ షై హోప్(115) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (77 బంతుల్లో 74; 1 ఫోర్, 6 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టాస్: విండీస్- బ్యాటింగ్ వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు) సెంచరీతో చెలరేగిన షై హోప్(115 పరుగులు) భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు) విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (64 పరుగులు, ఒక్క వికెట్) అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) చదవండి: Shikhar Dhawan: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఆవేశ్ సైతం! Talent wins game but teamwork and intelligence wins championship! 🙌 Kudos to team for the amazing face-off! 😍👏 #IndvsWI pic.twitter.com/jMZOjWiTN6 — Shikhar Dhawan (@SDhawan25) July 25, 2022 -
శిఖర్ ధావన్ కి టీంలో ఏం పని
-
IND Vs WI 2nd ODI: రెండు వికెట్ల తేడాతో భారత్ గెలుపు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అవే జట్లు.. అదే ఉత్కంఠ.. వెస్టిండీస్-టీమిండియా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ విజయం కోసం ఆఖరి ఓవర్ వరకు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కాకపోతే మొదటి మ్యాచ్‌లో విండీస్ జట్టు పోరాడితే.. నేడు టీమిండియా పోరాడింది. అయితే ఫలితం మాత్రం మారలేదు. మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. టీమిండియా 2 బంతులు మిగిలుండగానే 8 వికెట్లు కోల్పోయి చేధించింది. 3 బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్ పటేల్ సిక్సర్ బాది భారత జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను దక్కించుకుంది. భారత బ్యాట్మన్లలో అక్షర్ పటేల్ 35 బంతుల్లో 64 నాటౌట్, శ్రేయస్ అయ్యర్ 63, సంజూ శామ్సన్ 54, శుభమన్ గిల్ 43, దీపక్ హుడా 33 పరుగులతో రాణించారు. టీమిండియా టార్గెట్ 312 ►టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చి అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న షెయ్ హోప్ 115 పరుగులతో టాప్ స్కోరర్ కాగా .. కెప్టెన్ నికోలస్ పూరన్ 74 పరుగులు, కేల్ మేయర్స్ 39 పరుగులు, బ్రూక్స్ 35 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ హుడా, అక్షర్ పటేల్, యజ్వేంద్ర చహల్ తలా ఒక వికెట్ తీశారు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన హోప్.. ►వెస్టిండీస్ ఓపెనర్ షెయ్ హోప్ రెండో వన్డేలో అద్భుత సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ వచ్చిన హోప్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 127 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం విండీస్ 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. నిలకడగా సాగుతున్న వెస్టిండీస్ ఇన్నింగ్స్.. ►టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. 36 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. షెయ్ హోప్ 82, పూరన్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్‌గా వచ్చిన హోప్ సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఇప్పటివరకు 65 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది 27 ఓవర్లలో వెస్టిండీస్ 148/3 ►27 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. హోప్ 64, పూరన్ 8 క్రీజులో ఉన్నారు. హోప్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ 141/3 ►వెస్టిండీస్ ఓపెనర్ షెయ్ హోప్ అర్థ సెంచరీతో మెరిశాడు. మరోపక్క చహల్ బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్ డకౌట్‌గా వెనుదిరగడంతో విండీస్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హోప్ 62, పూరన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ ►నిలకడగా సాగుతున్న విండీస్ ఇన్నింగ్స్‌కు అక్షర్ పటేల్ తెరదించాడు. 35 పరుగులు చేసిన షమ్రా బ్రూక్స్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం వెస్టిండీస్ 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. 19 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరెంతంటే? ►19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. ఓపెనర్ షెయ్ హోప్ 41 పరుగులతో నిలకడగా ఆడుతుండగా.. అతనికి బ్రూక్స్(28 పరుగులు) నుంచి చక్కని సహకారం అందుతుంది. కైల్ మేయర్స్(39) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్ ►రెండో వన్డేలో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన విండీస్‌కు దీపక్ హుడా షాక్ ఇచ్చాడు. 39 పరుగులు చేసిన కైల్ మేయర్స్ హుడా బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి విండీస్ వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. హోప్ 26, బ్రూక్స్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ధాటిగా ఆడుతున్న వెస్టిండీస్ ►టీమిండియాతో రెండో వన్డేలో వెస్టిండీస్ ధాటిగా ఆడుతుంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 39, షెయ్ హోప్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. 4 ఓవర్లలో వెస్టిండీస్ 24/0 ►4 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ 14, షెయ్ హోప్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ►టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి.. మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. విండీస్ మాత్రం గెలిచి నిలబడాలని ప్రయత్నిస్తోంది. ఇక టీమిండియా తరపున ఆవేశ్ ఖాన్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఐదుగురు స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... మరో వన్డే సిరీస్ విజయానికి భారత జట్టు బాటలు వేసుకుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై స్వల్ప తేడాతో నెగ్గిన టీమిండియా కరీబియన్ పర్యటనలో వరుసగా రెండో సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు సిరీస్ అప్పగించిన వెస్టిండీస్ మరో సిరీస్ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వెస్టిండీస్: షెయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్ భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ One change in the #TeamIndia Playing XI from the previous game. Avesh Khan makes his debut and Prasidh Krishna sits out for the game. Live - https://t.co/EbX5JUciYM #WIvIND pic.twitter.com/o3SGNrmQBd — BCCI (@BCCI) July 24, 2022 -
వెస్టిండీస్‌తో రెండో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో భారత్..!
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో విజయం సాధించిన భారత్‌కు మరో పోరుకు సిద్దమైంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో భారత్, విండీస్ తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఓ అరుదైన రికార్డు భారత్‌ను ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. 2-0తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. తద్వారా ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు విండీస్‌పై వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో భారత్ విజయం సాధించింది. మరో వైపు పాకిస్తాన్ కూడా జింబాబ్వేపై వరుసగా 11 వన్డే సిరీస్‌ల్లో విజయం సాధించి భారత్‌తో సమంగా ఉంది. ఈ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంటే 12 విజయాలతో పాక్‌ను అధిగమిస్తోంది. భారత తుది జట్టు (అంచనా).. శిఖర్ ధవన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ విండీస్ తుది జట్టు(అంచనా) నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్,రొమారియో షెపర్డ్ చదవండి: Team India Predicted XI: రెండో వన్డేకు టీమిండియా ఇదే..! -
India vs West Indies: మరో సిరీస్ సాధించేందుకు...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఐదుగురు స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... మరో వన్డే సిరీస్ విజయానికి భారత జట్టు బాటలు వేసుకుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై స్వల్ప తేడాతో నెగ్గిన టీమిండియా కరీబియన్ పర్యటనలో వరుసగా రెండో సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరిగే రెండో వన్డేలో భారత్, విండీస్ తలపడనున్నాయి. సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు సిరీస్ అప్పగించిన వెస్టిండీస్ మరో సిరీస్ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అంతా ఫామ్‌లోకి... శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటింగ్‌తో అర్ధసెంచరీ నమోదు చేశాడు. రుతురాజ్, ఇషాన్ కిషన్‌లను కాదని ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న శుబ్‌మన్ గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్‌కు చూపించగా... రాణిస్తే తప్ప జట్టులో చోటు దక్కే అవకాశం లేని స్థితిలో బరిలోకి దిగిన శ్రేయస్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు బౌలింగ్‌లో సిరాజ్ చక్కగా రాణించి వన్డేలకూ తాను తగినవాడినన్ని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా అతను తీసిన పూరన్ వికెట్ కీలక దశలో వరుస ఓవర్లలో శార్దుల్ తీసిన రెండు వికెట్లు ఆల్‌రౌండర్‌గా అతని బలాన్ని ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో మార్పులు లేకుండానే భారత జట్టు రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ టాప్–4 బ్యాటర్లలో ముగ్గురు రాణించారు. అయితే జట్టును గెలిపించడానికి అది సరిపోలేదు. కీలక దశలో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. కొన్ని చక్కటి షాట్లు ఆడి వెనుదిరుగుతూ టి20 శైలి బ్యాటింగ్ చేస్తున్న పూరన్.. కెప్టెన్‌గా జట్టుకు విజయం అందించే ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మేయర్స్, కింగ్స్‌లకు తోడు బ్రూక్స్ కూడా మెరుగ్గా ఆడితే విండీస్ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. గత ఆరు మ్యాచ్‌లలో షై హోప్స్ విఫలం కావడంతో టీమ్‌కు శుభారంభం లభించడం లేదు. దీనికి ఆ జట్టు సరిదిద్దుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లో మాత్రం విండీస్‌లో తడబాటు స్పష్టంగా కనిపించింది. ఉత్కంఠభరిత ముగింపు తొలి వన్డే చివరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు కావాలి. సిరాజ్ వేసిన తొలి 4 బంతుల్లో ఒక ఫోర్ సహా 7 పరుగులు వచ్చాయి. 2 బంతుల్లో 8 పరుగులు అవసరం. ఆ తర్వాత సిరాజ్ వేసిన బంతి లెగ్‌స్టంప్‌కు చాలా దూరంగా ‘వైడ్’గా వెళ్లింది. అది వేగంగా వెళ్లి బౌండరీని తాకి ఉంటే సమీకరణం వేరేలా ఉండేది. కానీ కీపర్ సంజు సామ్సన్ అద్భుతంగా ఎడమ వైపు డైవ్ చేస్తూ దానిని ఆపడంలో సఫలమయ్యాడు. దాంతో ఒక పరుగే వచ్చింది. అనంతరం చివరి 2 బంతుల్లో సిరాజ్ 3 పరుగులే ఇవ్వడంతో 3 పరుగుల తేడాతో విజయం భారత్ సొంతమైంది. భారత్ చేసిన 308 పరుగులకు బదులుగా వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులే చేయగలిగింది. కైల్ మేయర్స్ (68 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్), బ్రాండన్ కింగ్ (66 బంతుల్లో 54; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రూక్స్ (61 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... శార్దుల్, సిరాజ్, చహల్ తలా 2 వికెట్లు తీశారు. శిఖర్ ధావన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు..!
రెండేళ్ల తర్వాత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ అదరగొట్టాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో గిల్ అర్దసెంచరీతో మెరిశాడు. ధావన్‌తో కలిసి తొలి వికెట్‌కు 119 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని టీమిండియాకు అందించాడు. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో మంచి ఊపు మీద కనిపించిన గిల్ నిర్లక్ష్యంగా పరుగెత్తి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. ఇక గిల్ వన్డేల్లో చివరగా 2020లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ప్రస్తుతం జరుగుతోన్న విండీస్ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కావడంతో ఓపెరన్గా గిల్‌కు జట్టులో చోటు దక్కింది. అయితే గిల్ దొరికిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ క్రమంలో గిల్‌పై ట్విటర్లో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "అద్భుతంగా ఆడావు గిల్.. రైజింగ్ ఇండియన్ సూపర్ స్టార్ అంటూ" అంటూ ట్విటర్లో పోస్టులు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన తొలిపోరులో విండీస్‌పై భారత్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. విండీస్ జట్టులో కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్ (64) శ్రేయస్ అయ్యర్(54) పరుగులతో రాణించారు. వెస్టిండీస్‌తో అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం(జూలై24) జరగనుంది. చదవండి: Shikar Dhawan: సెంచరీ మిస్ అయినా రికార్డుల మోత Shubman Gill : The Rising Super Star 🔥🏏 #WIvsIND#IndvsWI #ShubmanGill pic.twitter.com/YuKFk9eMIO — Veer (@VeerUnfiltred) July 22, 2022 Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 -
IND Vs WI 1st ODI: ఉత్కంఠ పోరులో టీమిండియా ఘనవిజయం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: చివరి ఓవర్ వరకు నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మొదటి వన్డేలో విండీస్ జట్టుపై భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివర్లో అకేల్ హోసేన్ 33, రొమారియో షెపర్డ్ 39 నాటౌట్ కంగారు పెట్టించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. 309 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టులో కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు. గర్జించిన భారత్ బ్యాట్స్‌మెన్ సీనియర్లు లేని భారత టాపార్డర్ వెస్టిండీస్ బౌలింగ్‌పై గర్జించింది. ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (99 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మూడు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోగా... శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు తీశారు. ఓపెనర్ల శుభారంభం ధావన్, గిల్ జోడీ ఓపెనింగ్‌లో అదరగొట్టింది. ఇద్దరూ ఫోర్లు, సిక్స్‌లతో వేగంగా పరుగులు చేశారు. దీంతో తొలి 3 ఓవర్లయితే టి20ని తలపించింది. ఈ ధాటి కొనసాగడంతో 6.5 ఓవర్లలో భారత్ స్కోరు 50కి చేరింది. చూడచక్కని షాట్లతో గిల్ 36 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్లిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో 14 ఓవర్ల దాకా 7పైచిలుకు రన్‌రేట్‌తో భారత్ 100/0 స్కోరు చేసింది. తర్వాత 18వ ఓవర్లో ధావన్ 53 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ చేయగా, గిల్ నిర్లక్ష్యంగా పరుగెత్తి రనౌటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధావన్ సెంచరీ మిస్ అనంతరం శ్రేయస్ అయ్యర్‌తో రెండో వికెట్ భాగస్వామ్యం కూడా సాఫీగా సాగడంతో కరీబియన్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఈ క్రమంలో సెంచరీపై కన్నేసిన ధావన్... గుడకేశ్ మోతీ 34వ ఓవర్లో స్లాగ్‌స్వీప్ షాట్‌తో మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. కానీ తర్వాతి బంతికే అతను పెవిలియన్ చేరడంతో 94 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న అయ్యర్, సూర్యకుమార్ (13) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. సంజూ సామ్సన్ (12) కూడా విఫలమవడంతో ఆఖర్లో ఆశించినంత వేగంగా పరుగులు రాలేదు. 48వ ఓవర్లో అక్షర్ పటేల్ (21; ఫోర్, సిక్స్) 6, 4 కొట్టగా, దీపక్ హుడా (27; ఫోర్, సిక్స్) 6 బాదడంతో ఏకంగా 20 పరుగులొచ్చాయి. అల్జారీ జోసెఫ్ 49వ ఓవర్లో ఇద్దర్నీ పెవిలియన్ చేర్చగా, ఆఖరి ఓవర్లో భారత్ 300 మార్క్‌ను దాటింది. -
సెంచరీ మిస్ అయినా రికార్డుల మోత
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో స్టాండింగ్ కెప్టెన్ శిఖర్ ధావన్ మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వెస్టిండీస్ గడ్డపై శతకం అందుకోవాలన్న ధావన్ ఈ మ్యాచ్‌లో తీరకుండానే ఔటయ్యాడు. 97 పరుగుల వద్ద మోతీ బౌలింగ్‌లో షమ్రా బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే సెంచరీ మిస్ అయినప్పటికి ధావన్ తొలి వన్డేలో మాత్రం రికార్డుల మోత మోగించాడు. అవేంటనేవి ఒకసారి పరిశీలిద్దాం. ►అతి పెద్ద వయసులో వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు 1999లో కెప్టెన్‌గా చివరి హాఫ్ సెంచరీ చేసినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ వయసు 36 ఏళ్ల 120 రోజులు. ప్రస్తుతం ధావన్ వయసు 36 ఏళ్ల 229 రోజులు. ►వెస్టిండీస్ గడ్డపై అత్యధిక వన్డేలు ఆడిన టీమిండియా ఆటగాడిగా కోహ్లితో కలిసి ధావన్ సంయుక్తంగా ఉన్నాడు. ఇప్పటివరకు కోహ్లి, ధావన్‌లు విండీస్ గడ్డపై 15 మ్యాచ్‌లు ఆడారు. ►విండీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా టాప్-5 బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్ యువరాజ్, రోహిత్ శర్మలను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. ధావన్ 15 మ్యాచ్‌ల్లో 445 పరుగులు చేశాడు. ధావన్ కంటే ముందు ఎంఎస్ ధోని(15 మ్యాచ్‌ల్లో 458 పరుగులు), కోహ్లి (15 మ్యాచ్‌ల్లో 790 పరుగులు), ఉన్నారు. ►శిఖర్ ధావన్‌కి ఇది 150వ వన్డే. తొలి 150 వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. హషీమ్ ఆమ్లా 57, విరాట్ కోహ్లీ, వీవిన్ రిచర్డ్స్ 55 సార్లు 50+ స్కోర్లు చేయగా శిఖర్ ధావన్‌కి ఇది 53వ 50+ స్కోరు. ►వెస్టిండీస్‌లో శిఖర్ ధావన్‌కి ఇది ఐదో 50+ స్కోరు. విరాట్ కోహ్లీ 7 సార్లు 50+ స్కోరు చేసి టాప్‌లో ఉంటే, రోహిత్ శర్మ ఐదు సార్లు ఈ ఫీట్ సాధించి ధావన్‌తో సమానంగా ఉన్నాడు. ►వెస్టిండీస్‌లో వన్డేల్లో అతి పిన్న వయసులో 50+ స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు శుబ్‌మన్ గిల్. 22 ఏళ్ల 215 రోజుల వయసులో విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌లో వన్డేల్లో 50+ స్కోరు నమోదు చేయగా, శుబ్‌మన్ గిల్ వయసు ప్రస్తుతం 22 ఏళ్ల 317 రోజులు. చదవండి: హాట్ టాపిక్‌గా భారత్- విండీస్ వన్డే ట్రోపీ.. ఎక్తాకపూర్ తయారు చేసిందా? -
IND Vs WI 1st ODI: ఉత్కంఠ పోరులో టీమిండియా ఘనవిజయం
ఉత్కంఠ పోరులో టీమిండియా ఘనవిజయం చివరి ఓవర్ వరకు నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మొదటి వన్డేలో వెస్టిండీస్‌పై భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులు చేశారు. ఇక ఛేజింగ్‌లో విండీస్ బ్యాట్స్‌మన్ కైలే మేయర్స్ 75 పరుగులు, బ్రాండన్ కింగ్ 54 పరుగులు చేశారు. మ్యాచ్ చివర్లో అకేల్ హోసేన్ 33, రొమారియో షెపర్డ్ 39 నాటౌట్ పోరాడిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. విండీస్ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. వెస్టిండీస్ టార్గెట్ 309 ►వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 97 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్ 64, శ్రేయాస్ అయ్యర్ 54 పరుగులు చేశారు. ఒక దశలో 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులతో పటిష్టంగా కనిపించిన టీమిండియా ఆ తర్వాత 20 ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో మోతీ, అల్జారీ జోసెఫ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షెపర్డ్, హొసెన్ తలా ఒక వికెట్ తీశారు. 45 ఓవర్లలోటీమిండియా 264/5 ►టీమిండియా 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. దీపక్ హుడా 12, అక్షర్ పటేల్ 4 పరుగులతో ఆడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్(54) ఔట్.. మూడో వికెట్ డౌన్ ►శ్రేయాస్ అయ్యర్(54) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. మోతీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన అయ్యర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 2, సూర్యకుమార్ యాదవ్ 9 పరుగులతో ఆడుతున్నారు. ధావన్ సెంచరీ మిస్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా ►విండీస్‌తో తొలి వన్డేలో శిఖర్ ధావన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 97 పరుగుల వద్ద మోతీ బౌలింగ్‌లో షమ్రా బ్రూక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 34 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అయ్యర్ 45, సూర్యకుమార్ ఒక పరుగుతో ఆడుతున్నారు. సెంచరీ దిశగా ధావన్.. టీమిండియా 193/1 ►వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 87 పరుగులు.. సెంచరీ వైపు పరుగులు తీస్తుండగా.. శ్రేయాస్ అయ్యర్ 42 పరుగులతో ఆడుతున్నాడు. గిల్ రనౌట్.. టీమిండియా 20 ఓవర్లలో 127/1 ►టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 127 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 57, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు శుబ్‌మన్ గిల్(64) రనౌట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరెంతంటే? ►10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. గిల్ 41, ధావన్ 28 పరుగులతో ఆడుతున్నారు. దాటిగా ఆడుతున్న ఓపెనర్లు.. టీమిండియా 50/0 ►వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 24, శుబ్‌మన్ గిల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ►ఇంగ్లండ్‌తో సిరీస్‌ను విజయవంతంగా ముగించుకున్న టీమిండియా తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్దమైంది. ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ సహా సీనియర్ల గైర్హాజరీలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ భారత్ జట్టు విండీస్‌తో తలపడుతుండడంతో ఆసక్తిగా మారింది. ముందుగా అనుకున్నట్లే జడేజా గాయంతో ఈ వన్డేకు దూరం కాగా.. జాసన్ హోల్డర్ కరోనా కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉన్నాడు. A look at our Playing XI for the 1st ODI. Live - https://t.co/tE4PtTfY9d #WIvIND pic.twitter.com/WuwCljou75 — BCCI (@BCCI) July 22, 2022 భారత్: ధావన్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ,దీపక్ హుడా, సంజూ సామ్సన్, సూర్యకుమార్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్, చహల్, సిరాజ్. వెస్టిండీస్: పూరన్ (కెప్టెన్), షయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్ పిచ్, వాతావరణం వన్డేలకు తగిన వేదిక. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. గురువారం కొంత వర్షం కురిసి భారత జట్టు ప్రాక్టీస్ ఇండోర్‌కే పరిమితమైనా...మ్యాచ్ రోజు మాత్రం వర్ష సూచన లేదు. -
వెస్టిండీస్‌తో భారత్ తొలి పోరు.. ధావన్‌కు జోడీ ఎవరు?
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: సాంప్రదాయ టెస్టు క్రికెట్, ధనాధన్ టి20 క్రికెట్ మధ్య వన్డేల అస్తిత్వం కష్టంగా మారుతున్న తరుణమిది. పైగా ప్రపంచ కప్ లేని ఏడాదిలో 50 ఓవర్ల పోరుకు సహజంగానే ప్రాధాన్యత తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భారత్, వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. క్వీన్స్ పార్క్ ఓవల్‌లో నేడు జరిగే తొలి సమరంలో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే భారత యువ ఆటగాళ్ల కోణంలో ఈ సిరీస్‌ను కీలకంగా చెప్పవచ్చు. పలువురు సీనియర్ల గైర్హాజరులో తమ సత్తా చాటేందుకు వారికి ఇది సరైన వేదిక. మరో వైపు వెస్టిండీస్ కూడా వన్డేల్లో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి అందుకునే ప్రయత్నంలో ఉంది. ఆ జట్టూ సొంతగడ్డపై ఇది సరైన అవకాశం. భారత టాప్ ప్లేయర్ రోహిత్, కోహ్లి, బుమ్రా, పంత్, షమీ, హార్దిక్ ఈ సిరీస్‌లో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నారు. 2022లో భారత్‌కు శిఖర్ ధావన్ 7వ కెప్టెన్ కావడం విశేషం. ధావన్‌కు జోడీ ఎవరు? ఒకప్పుడు అద్భుత ఓపెనర్‌గా ఘనమైన రికార్డులు సాధించిన శిఖర్ ధావన్ కొంత కాలంగా తడబడుతున్నాడు. అతను ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఇబ్బంది పడటం కనిపించింది. అయితే అదృష్టవశాత్తూ కెప్టెన్సీ అవకాశం దక్కిన అతను ఈ సిరీస్‌లోనైనా రాణించాల్సి ఉంది. అతనికి ఓపెనర్ జోడీగా ఆడేందుకు తీవ్ర పోటీ నెలకొంది. దూకుడుగా ఆడగల ఇషాన్ కిషన్ ఉండగా...నిలకడగా ఆడగల రుతురాజ్, శుబ్‌మన్ గిల్ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కుడి, ఎడమ చేతివాటం ఓపెనింగ్ కావాలని కోరుకుంటే రుతురాజ్‌కు ప్రాధాన్యత లభించవచ్చు. టి20ల్లో ప్రదర్శించిన జోరుతో హుడా, సామ్సన్‌లు కూడా మిడిలార్డర్లో చోటు ఆశిస్తున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా శ్రేయస్ అయ్యర్‌కు ఈ సిరీస్ కీలకం కానుంది. వరుసగా విఫలమవుతున్నా అతని ఆటపై నమ్మకంతో మేనేజ్మెంట్ మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తోంది. పైగా వన్డేలకు అతని బ్యాటింగ్ శైలి సరిగ్గా సరిపోతుంది. ఇలాంటి స్థితిలో అతను తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. లేదంటే జట్టులో చోటు కోల్పోవచ్చు కూడా. సూర్యకుమార్ కూడా తన ధాటిని కొనసాగించగలడు. ఆల్రౌండర్లుగా జడేజా, శార్దుల్ ముద్ర ముఖ్యం. బుమ్రా లేకపోవడంతో ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్‌కు చోటు ఖాయం. చహల్‌ను విండీస్ ఏమాత్రం ఎదుర్కోగలదో చూడాలి. పూర్తి ఓవర్లు ఆడేనా... టి20 ఫార్మాట్‌కు బాగా అలవాటు పడిన వెస్టిండీస్ జట్టు వన్డే ఇన్నింగ్స్‌లను నడిపించడం దాదాపుగా మరచిపోయింది. టీమ్ లో ఎంత మంది హిట్టర్లు ఉన్నా వారంతా టి20 తరహాలోనే ఆడుతుండటంతో క్రీజ్‌లో నిలవడం అసాధ్యంగా మారింది. 2019 వన్డే వరల్డ్ కప్‌నుంచి విండీస్ 39 ఇన్నింగ్స్‌లు ఆడితే 6 సార్లు మాత్రమే పూర్తి కోటా 50 ఓవర్లు ఆడగలిగింది. జట్టు బ్యాటింగ్ ప్రధానంగా పూరన్, పావెల్, మేయర్స్లపై ఆధారపడి ఉంది. పేసర్ అల్జారీ జోసెఫ్ తన పదును చూపించగలడు. తన ప్రతిభను ప్రదర్శించేందుకు జేడెన్ సీల్స్కు ఇది మంచి అవకాశం కాగా స్పిన్నర్ అకీల్ హొసీన్ ఇటీవల ఫామ్‌లో ఉన్నాడు. అన్నింటికి మించి ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ టీమ్‌లోకి పునరాగమనం చేయడంతో జట్టు బలం పెరిగింది. పిచ్, వాతావరణం వన్డేలకు తగిన వేదిక. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. గురువారం కొంత వర్షం కురిసి భారత జట్టు ప్రాక్టీస్ ఇండోర్‌కే పరిమితమైనా...మ్యాచ్ రోజు మాత్రం వర్ష సూచన లేదు. జట్ల వివరాలు (అంచనా) భారత్: ధావన్ (కెప్టెన్), రుతురాజ్/ ఇషాన్ కిషన్, శ్రేయస్, హుడా, సామ్సన్, సూర్యకుమార్, జడేజా, శార్దుల్, ప్రసిధ్, చహల్, సిరాజ్. వెస్టిండీస్: పూరన్ (కెప్టెన్), కింగ్, బ్రూక్స్, మేయర్స్, హోప్, రావ్మన్ పావెల్, హోల్డర్, అకీల్ హొసీన్ , జోసెఫ్, మోతీ, సీల్స్, చదవండి: హైదరాబాద్‌లో భారత్–ఆస్ట్రేలియా టి20 -
విండీస్‌తో వన్డే సిరీస్.. అరుదైన రికార్డులపై కన్నేసిన ధావన్
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడనున్న నేపథ్యంలో శిఖర్ ధావన్ అరుదైన రికార్డులపై కన్నేశాడు. జూలై 22(శుక్రవారం) విండీస్, టీమిండియా మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ధావన్ స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్ సహా కోహ్లి, బుమ్రా, భువనేశ్వర్, పంత్, కేఎల్ రాహుల్, పాండ్యాలకు రెస్ట్ ఇవ్వడంతో శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్, రుతురాజ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్లకు సిరీస్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే విండీస్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న ధావన్ ముంగిట ఉన్న అరుదైన రికార్డులను పరిశీలిద్దాం. ►వెస్టిండీస్ గడ్డపై అత్యధిక వన్డేలు ఆడిన టీమిండియా ఆటగాడిగా ధావన్ నిలవనున్నాడు. ఇప్పటివరకు 14 వన్డేలు ఆడిన ధావన్ శుక్రవారం విండీస్‌తో ఆడబోయేది వన్డేతో 15వ మ్యాచ్. తద్వారా కోహ్లి 15 వన్డేలను ధావన్ అధిగమించనున్నాడు. ►వెస్టిండీస్ గడ్డపై ధావన్ 14 వన్డేల్లో 348 పరుగులు సాధించాడు. విండీస్ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా ఆటగాళ్లలో ధావన్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ మూడు వన్డేల సిరీస్‌లో ధావన్ 110 పరుగులు చేస్తే ధోని, రోహిత్, యువరాజ్‌లను అధిగమించి రెండో స్థానానికి చేరుకోనున్నాడు. విండీస్ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 టీమిండియా బ్యాటర్స్ ►కోహ్లి (15 మ్యాచ్‌ల్లో 790 పరుగులు) ►ఎంఎస్ ధోని(15 మ్యాచ్‌ల్లో 458 పరుగులు) ►యువరాజ్ సింగ్(14 మ్యాచ్‌ల్లో 419 పరుగులు) ►రోహిత్ శర్మ(14 మ్యాచ్‌ల్లో 408 పరుగులు) ►శిఖర్ ధావన్(14 మ్యాచ్‌ల్లో 348 పరుగులు) ►అయితే శిఖర్ ధావన్ ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు వన్డేలు కలిపి కేవలం 31 పరుగులు మాత్రమే చేసి తన పూర్ ఫామ్‌ను కొనసాగించాడు. మరి విండీస్ గడ్డపై స్టాండింగ్ కెప్టెన్‌గా ఉన్న శిఖర్ ధావన్ వన్డే సిరీస్‌లో మెరుస్తాడేమో వేచి చూడాలి చదవండి: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! -
విండీస్‌కు పయనమైన ధావన్ సేన..!
ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న భారత్ మరో పోరుకు సిద్దమవుతోంది. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌కు టీమిండియా పయనమైంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు మాంచెస్టర్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు మంగళవారం చేరుకోనుంది. అదే విధంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఇతర శిక్షణా సిబ్బంది బుధవారం అక్కడికి చేరుకోనున్నారు. ఇక వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం కావడంతో భారత జట్టు సారథిగా ధావన్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా ఈ సిరీస్‌కు కోహ్లి, బుమ్రా, షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా దూరమయ్యారు. ఇక జూలై 22న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦! Dressing room reactions & emotions after #TeamIndia's ODI series triumph against England at Manchester.👏 👏 - By @RajalArora Watch this special feature 🎥 👇 #ENGvIND https://t.co/D1Og2z9fOh pic.twitter.com/2P2X2WQTUV — BCCI (@BCCI) July 18, 2022 వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్ చదవండి: Ben Stokes: వన్డే క్రికెట్‌కు స్టోక్స్ గుడ్‌బై.. కారణాలు ఇవేనా..? India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! -
భారత్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. స్టార్ ఆల్‌రౌండర్ వచ్చేశాడు!
స్వదేశంలో టీమిండియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ ప్రకటించింది. ఇక గత కొన్ని నెలలగా జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా విండీస్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 22 న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ఆరంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్ చదవండి: Virat Kohli: మారని ఆటతీరు.. వన్డే కెరీర్లో అత్యంత చెత్త రికార్డు -
రికార్డుల కోసమే ఆడుతున్నట్లుంది.. రోహిత్-ధావన్ ద్వయం అరుదైన ఫీట్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల పంట పండిస్తున్నారు. ఇప్పటికే బుమ్రా, షమీలు బౌలింగ్‌లో అరుదైన ఫీట్లను అందుకోగా.. తాజాగా బ్యాటింగ్‌లో ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ ద్వయం పరుగులు విషయంలో కొత్త రికార్డును అందుకున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో వన్డే ద్వారా ఈ ఓపెనింగ్ జోడి 5వేల పరుగుల మార్క్‌ను క్రాస్ చేసింది. 5వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 114 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. కాగా సచిన్-గంగూలీ జోడి తర్వాత వన్డేల్లో తొలి వికెట్‌కు 5వేల పరుగులు జోడించిన రెండో ఓపెనింగ్ జోడిగా నిలిచి చరిత్రకెక్కింది. ఇంతకముందు వన్డే క్రికెట్లో సచిన్-గంగూలీ ద్వయం 136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ఆసీస్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్‌క్రిస్ట్ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472), విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ (102 ఇన్నింగ్స్‌ల్లో 5150) ఉన్నారు. తాజాగా వీరి సరసన రోహిత్ శర్మ- ధావన్ జోడి చోటు సంపాదించింది. 5⃣0⃣0⃣0⃣ ODI runs in partnership for this dynamic duo! 👏 👏#TeamIndia captain @ImRo45 & @SDhawan25 become only the 2⃣nd Indian pair after the legendary duo of @sachin_rt & @SGanguly99 to achieve this feat. 👍 👍 Follow the match ▶️ https://t.co/8E3nGmlNOh #ENGvIND pic.twitter.com/gU67Bx4SeE — BCCI (@BCCI) July 12, 2022 చదవండి: Jasprit Bumrah: ఇంగ్లండ్ గడ్డపై బుమ్రా కొత్త చరిత్ర.. Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా -
జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్..!
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ముగిసిన అనతంరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 18న హారారే వేదికగా జరనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆగస్ట్ 27 నుంచి శ్రీలంక వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుండడంతో జింబాబ్వే పర్యటనకు భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా దూరం కానున్నారు. ఈ క్రమంలో జింబాబ్వే టూర్‌కు వెళ్లే భారత జట్టుకు కెప్టెన్‌గా శిఖర్ ధావన్, హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే విండీస్ టూర్‌కు టీమిండియా కెప్టెన్‌గా దావన్ ఎంపికైన సంగతి తెలిసిందే. "టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండడంతో మా దృష్టి టీ20లపైనే ఉంది. యువ క్రికెటర్లు, సీనియర్ ఆటగాళ్ల కలయికతో మా జట్టును తాయారు చేస్తాం. జింబాబ్వేతో సిరీస్‌కు టీ20 రెగ్యులర్ ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సిరీస్‌లో భారత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. అదేవిదంగా జింబాబ్వే పర్యటనకు భారత జట్టుతో పాటు లక్ష్మణ్ కూడా వెళ్లనున్నాడు. ద్రవిడ్‌కు కూడా గత కొన్నాళ్లుగా విశ్రాంతి లేదు. కాబట్టి ఆసియా కప్‌కు ముందు ఆటగాళ్లతో పాటు ద్రవిడ్‌కు కూడా విశ్రాంతి ఇస్తున్నాం" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌కు స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: ENG Vs IND 2nd T20I: 'ఇంగ్లండ్‌తో రెండో టీ20.. దీపక్ హుడా స్థానంలో కోహ్లి రానున్నాడు' -
ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన భారత్.. ధావన్‌కు చోటు..!
ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై7న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టులో పాల్గొనున్న టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు సెలక్టర్లు తొలి టీ20కు విశ్రాంతి ఇచ్చారు. ఇంగ్లండ్‌తో తొలి టీ20కు ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టునే సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే కొవిడ్ కారణంగా ఈ కీలక టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ తొలి టీ20కు సారథ్యం వహించనున్నాడు. ఇక తొలి సారిగా భారత వన్డే జట్టుకు యువ పేసర్ ఆర్షదీప్ సింగ్ ఎంపికయ్యాడు. అదే విధంగా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో ధావన్‌కు జట్టులో చోటు దక్కింది. తొలి20కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణో పటేల్ , భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ రెండు,మూడు టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఆర్షదీప్ సింగ్ చదవండి: ENG Vs IND 5th Test: 'ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. ఆ ఆల్‌రౌండర్ భారత జట్టులో ఉండాల్సింది' -
ధావన్ ఎంపికలో అన్యాయం.. కేఎల్ రాహుల్ జోక్యంలో నిజమెంత?
టీమిండియా వెటరన్ ఆటగాడు శిఖర్ ధావన్‌కు టీమిండియా సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ధావన్‌ను సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. యువ ఆటగాళ్లకు చాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ధావన్‌కు రెస్ట్ ఇచ్చామని బీసీసీఐ చెప్పిన కారణంపై విమర్శలు వస్తున్నాయి. ఎంత యువ జట్టైనా ఒక సీనియర్ ఆటగాడు ఉంటే అతని అనుభవం జట్టుకు పనికి వస్తుందని చాలా మంది అభిఫ్రాయపడ్డారు. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ధావన్‌కు చెప్పి మరీ జట్టు నుంచి పక్కనబెట్టినట్లు తెలిసింది. టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా ధావన్‌తో మాట్లాడినట్లు తేలింది. రానున్న టి20 ప్రపంచకప్ 2022 దృష్టిలో పెట్టుకొని యంగస్టర్స్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు ధావన్ మొదట ఒప్పుకోకపోయినప్పటికి.. ద్రవిడ్ రంగ ప్రవేశంతో చివరికి ధావన్ అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ధావన్‌కు అన్యాయం జరిగినట్లేనని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఇంకో విషయమేంటంటే.. ప్రొటీస్‌తో టి20 సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో నిండిపోవాలని కోరుకున్నాడని.. అందుకే జట్టు ఎంపికకు ముందే కోచ్ ద్రవిడ్ ద్వారా ధావన్‌కు విషయాన్ని చేరవేశామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో కింగ్స్ పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ చేరడంలో విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. అయితే ఆ జట్టు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో మూడు అర్థశతకాలతో 460 పరుగులు సాధించాడు. బట్లర్, కేఎల్ రాహుల్, డికాక్ తర్వాతి స్థానం శిఖర్ ధావన్‌దే కావడం విశేషం. చదవండి: Cheteshwar Pujara On IPL 2022: 'ఐపీఎల్లో ఆడకపోవడం మంచిదైంది.. అందుకే మళ్లీ తిరిగి వచ్చా' IND Vs SA T20: డీకేను సెలక్ట్ చేసినపుడు ధావన్‌ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్లో ధావన్ అరుదైన ఫీట్.. కోహ్లి రికార్డు బద్దలు..!
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు 50 పైగా పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా ధావన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2022లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో మెరిసిన ధావన్ ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే 48 సార్లు 50 పరుగుల స్కోరు దాటిన విరాట్ కోహ్లిని ఈ మ్యాచ్‌లో ధావన్ వెనుక్కి నెట్టాడు. 217 మ్యాచ్‌ల్లో 48 సార్లు 50 పైగా పరుగులు కోహ్లి సాధించగా.. 202 ఇన్నింగ్స్‌లలోనే 49 సార్లు 50 పైగా పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా 57 సార్లు 50 పైగా పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. ధావన్ రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: IPL 2022: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. ఐపీఎల్ 2022లోనే భారీ సిక్సర్.. వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గుజరాత్ జోరుకు పంజాబ్ బ్రేక్.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
ముంబై: ఈ సీజన్లో నిలకడైన విజయాలతో దూసుకెళుతున్న గుజరాత్ టైటాన్స్‌కు పంజాబ్ కింగ్స్ షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ దెబ్బతో పంజాబ్ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ను కంగుతినిపించింది. తొలుత టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (50 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రబడ 4 వికెట్లతో గుజరాత్‌ను దెబ్బ తీశాడు. తర్వాత పంజాబ్ 16 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (53 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. లివింగ్‌స్టోన్ (10 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్ ‘పంజా’బ్ గుజరాత్ ఇన్నింగ్స్‌ను పంజాబ్ బౌలింగ్ శాసించింది. ఓపెనర్లు గిల్ (9), సాహా (21; 3 ఫోర్లు, 1 సిక్స్)లతో మొదలైన పతనం ఆఖరిదాకా అలాగే సాగిపోయింది. గిల్ లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. రబడ ఓవర్లో సిక్సర్ బాదిన సాహా మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. దీంతో పవర్ ప్లేలో టైటాన్స్ 42/2 స్కోరు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1) కూడా నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడంతో... మిల్లర్ (11), సాయి సుదర్శన్ వికెట్లు కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు. లివింగ్‌స్టోన్... మిల్లర్‌ను బోల్తా కొట్టించాడు. సుదర్శన్ పోరాటం వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సాయి సుదర్శన్ ఒంటరి పోరాటం చేశాడు. అయితే మరోవైపు రబడ వరుస బంతుల్లో తెవాటియా (11), రషీద్ ఖాన్ (0)లను అవుట్ చేశాడు. తర్వాత ప్రదీప్ సాంగ్వాన్ (2), ఫెర్గూసన్ (5) ఇలా వచ్చి అలా వెళ్లారు. అర్‡్షదీప్, లివింగ్‌స్టోన్, రిషి ధావన్ తలా ఒక వికెట్ తీయగా... సందీప్ శర్మ (4–0–17–0) వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్స్‌ను కట్టడి చేశాడు. ధావన్ దంచెన్ జోరు మీదున్న గుజరాత్ బ్యాటర్స్ విఫలమైన చోట పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ అవలీలగా షాట్లు బాదేశాడు. మూడో ఓవర్లో షమీ... బెయిర్‌స్టో (1) వికెట్ తీయగానే సంబరపడిపోయిన టైటాన్స్‌ను ధావన్ తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో డీలా పడేలా చేశాడు. రాజపక్సతో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతోనే గుజరాత్ పనైపోయింది. ప్రత్యర్థి బౌలర్లు ఏమాత్రం గతితప్పిన బంతులు వేసినా... వాటికి బౌండరీ దారి చూపాడు. రాజపక్స (28 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1సిక్స్) కూడా బ్యాట్ ఝుళిపించడంతో 6.2 ఓవర్లో 50 చేరిన పంజాబ్ స్కోరు అదేస్పీడ్తో 12.1 ఓవర్లో వందను దాటేసింది. శిఖర్ 38 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ సాధించాడు. 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 117/2 స్కోరు చేసింది. విజయ సమీకరణం 30 బంతుల్లో 27 పరుగులు కాగా... షమీ వేసిన 16వ ఓవర్‌ను లివింగ్‌స్టోన్ చితగ్గొట్టాడు. 6, 6, 6, 4, 2, 4లతో 28 పరుగులు పిండేయడంతో అనూహ్యంగా ఇంకా 4 ఓవర్లు మిగిలుండగానే పంజాబ్ జయభేరి మోగించింది. చదవండి: Rishi Dhawan Vs Hardik Pandya: గుజరాత్ కెప్టెన్‌కు రిషి ధవన్ ఫ్లైయింగ్ కిస్; నిరాశలో హార్దిక్ భార్య That's that from Match 48.@PunjabKingsIPL win by 8 wickets with four overs to spare. Scorecard - https://t.co/LcfJL3mlUQ #GTvPBKS #TATAIPL pic.twitter.com/qIgMxRhh0B — IndianPremierLeague (@IPL) May 3, 2022 That's that from Match 48.@PunjabKingsIPL win by 8 wickets with four overs to spare. Scorecard - https://t.co/LcfJL3mlUQ #GTvPBKS #TATAIPL pic.twitter.com/qIgMxRhh0B — IndianPremierLeague (@IPL) May 3, 2022 -
టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన శిఖర్ ధావన్
టీ20ల్లో టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్--2022లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ధావన్ 9 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. కాగా 10392 పరుగులతో విరాట్ కోహ్లి తొలి స్థానంలో కొనసాగుతుండగా.. 10048 పరుగులతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: IPL 2022: టీ20ల్లో చరిత్ర సృష్టించిన ధావన్.. తొలి భారత ఆటగాడిగా! -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆడకపోవడంపై ధావన్ క్లారిటీ
ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ మ్యాచ్‌కు ఎందుకు దూరమయ్యాడన్న సందేహం చాలా మంది అభిమానుల్లో మెదిలింది. అయితే టాస్ సమయంలో గ్రౌండ్‌కు వచ్చిన ధావన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ''మయాంక్ అగర్వాల్ కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు మాత్రమే దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో నేను జట్టును నడిపిస్తున్నా. అతని పరిస్థితి బాగానే ఉంది. బహుశా తర్వాతి మ్యాచ్‌కు మయాంక్ అగర్వాల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మయాంక్ అగర్వాల్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కెప్టెన్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్న మయాంక్ బ్యాటర్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. కాగా పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి.. రెండు ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. చదవండి: 'సాధారణ ఆటగాడిలా ఫీలవ్వు'.. కోహ్లికి మాజీ క్రికెటర్ సలహా -
'లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది.. కోహినూర్ డైమండ్‌ను మిస్సయ్యావు!'
టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ అభిమానులను సంతోషపరచడంలో ముందుంటాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే ధావన్ సినిమా డైలాగ్స్, డ్యాన్స్‌లతో ఎన్నోసార్లు అలరించాడు. ధావన్‌కు టీమిండియా గబ్బర్ అని ముద్దుపేరు ఉంది. టీమిండియా ఓపెనర్‌గా మంచి పేరు సంపాదించిన శిఖర్ ధావన్ 149 వన్డేల్లో 6284 పరుగులు, 34 టెస్టుల్లో 2315 పరుగులు, 68 టి20ల్లో 1759 పరుగులు సాధించి కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. Courtesy: IPL TWitter తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్ రెండు మ్యాచ్‌ల్లో 92 పరుగులు చేశాడు. ఏప్రిల్ 8న బ్రబౌర్న్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఆడేందుకు పంజాబ్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ క్యాండిడ్ కాన్వర్జేషన్ పేరిట శశి దిమన్కు ఇచ్చిన ఫన్నీ ఇంటర్య్వూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటర్య్వూలో ధావన్ తన వ్యక్తిగత విషయాలను చాలానే పంచుకున్నాడు. అయితే అందులో ఒకటి మాత్రం బాగా పేలింది. క్రికెట్ ఆడుతున్న కొత్తలో ఒక అమ్మాయి ధావన్ లవ్ ప్రపోజల్‌ను రిజెక్ట్ చేసిన విషయాన్ని పేర్కొన్నాడు. Courtesy: IPL TWitter ''అవి నేను క్రికెట్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులు. ఆ సమయంలో ఒక అమ్మాయి(పేరు చెప్పలేను) బాగా నచ్చి ప్రపోజ్ చేశాను. ఆమె నన్ను రిజెక్ట్ చేసింది. కారణం.. నేను అప్పట్లో కాస్త నల్లగా ఉండేవాడిని(ఇప్పుడు కూడా పెద్ద కలర్ కాదనుకోండి).. అంతే కాదు నా ముఖంపై మచ్చలు ఉండడంతో నా లవ్‌ను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెకు నేను ఇచ్చిన కౌంటర్ సమాధానం ఎప్పటికి గుర్తుండిపోతుంది. నువ్వు కోహినూర్ డైమండ్‌ను రిజెక్ట్ చేశావు.. ఇలాంటివాడు నీకు మళ్లీ దొరక్కపోవచ్చు..'' అంటూ ముసిముసిగా నవ్వాడు. ఈ వీడియోనూ పంజాబ్ కింగ్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. మీరు ఒక లుక్కేయండి. చదవండి: Kohli-Maxwell: మ్యాక్స్‌వెల్ టెన్షన్ పోగొట్టేందుకు కోహ్లి ఏం చేశాడంటే! IPL 2022 RR Vs RCB: కోహ్లి ఎందుకంత బద్దకం.. వీడియో వైరల్ Fun is bound when Shikhar is around! 😉 📹 | 𝗣𝘂𝗻𝗷𝗮𝗯𝗶 𝗽𝘂𝘁𝘁𝗮𝗿 𝗦𝗵𝗶𝗸𝗵𝗮𝗿 getting candid with Shashi is nothing but a laugh riot 🤩#PunjabKings #SaddaPunjab #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ @SDhawan25 pic.twitter.com/xdH3TZJXAD — Punjab Kings (@PunjabKingsIPL) April 6, 2022 -
CSK VS PBK: గబ్బర్ మరో 7 ఫోర్లు కొడితే..!
CSK VS PBK: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగనున్న కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధవన్‌ను ఓ ఆసక్తికర రికార్డు ఊరిస్తుంది. ఇప్పటికే ఐపీఎల్లో అత్యధిక ఫోర్ల రికార్డు (660) తన పేరిట లిఖించుకున్న గబ్బర్.. నేటి మ్యాచ్‌లో మరో 7 బౌండరీలు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 1000 ఫోర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. టీ20ల్లో అత్యధిక ఫోర్లు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో ధవన్ 993 ఫోర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లి 917 ఫోర్లతో రెండో ప్లేస్‌లో, రోహిత్ శర్మ 875 ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో యూనివర్సల్ బాస్..1132 ఫోర్లతో మొదటి స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (1054 ఫోర్లు), ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1005), ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (998) వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కింగ్స్ ఫైట్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. లీగ్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు ఆడగా, పంజాబ్ ఓ గెలుపు (ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో విజయం), మరో మ్యాచ్‌లో పరాజయం (కేకేఆర్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి) మూటగట్టుకోగా.. సీఎస్కే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ (కేకేఆర్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి, లక్నో చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం) ఓటమిపాలై బోణీ విజయం కోసం తహతహలాడుతుంది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 25 సార్లు తలపడగా, చెన్నై15, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. తుది జట్లు (అంచనా): చెన్నైసూపర్ కింగ్స్: రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), డ్వేన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ దేశ్ పాండే, రాజవర్ధన్ హంగర్గేకర్. పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, బెయిర్‌స్టో, భానుక రాజపక్స, రాజ్ బవా, షారూక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, ఓడియన్ స్మిత్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: IPL 2022: 'కింగ్స్' ఫైట్.. ధోనిని ఊరిస్తున్న సిక్సర్ల రికార్డు -
'అతడి కెప్టెన్సీలో ఆడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నా'
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి సారి పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.. ఐపీఎల్-2022 మెగా వేలంలో ధావన్‌ని రూ.8.25 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. కాగా పంజాబ్ కింగ్స్‌కు సారథిగా ధావన్ ఎంపిక అవుతాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో యంగ్ ఎండ్ డైనిమిక్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నేతృత్వంలో ఆడేందకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని ధావన్ తెలిపాడు. "మయాంక్ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నాను. అతడి కెప్టెన్సీలో ఆడడం నాకు బాగా ఉపయోగపడుతుంది. మాకు బలమైన జట్టు ఉంది. జట్టులో చాలా మంది ప్రతిభావంతులైన యువకులు ఉన్నారు. ఈ సారి మేము అద్భుతాలు సృష్టిస్తాం. అదే విధంగా మయాంక్‌తో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నాను. ఓపెనింగ్ ఆనేది పెద్ద బాధ్యతతో కూడుకున్న పని, దానిని స్వీకరించడానికి నేను సిద్దంగా ఉన్నాను. నేను ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నాను. త్వరలోనే జట్టులో చేరుతాను. ఇక్కడ నెట్స్‌లో నేను తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఇకపై నా ఆటపై మాత్రమే దృష్టి సారిస్తాను. టీమిండియా నుంచి పిలుపు వస్తే వెంటనే జట్టులో చేరడానికి సిద్దంగా ఉన్నాను. దాని కోసమే ఎదరుచూస్తున్నాను" అని ధావన్ పేర్కొన్నాడు. కాగా గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన ధావన్ 587 పరుగులు సాధించి అద్భుతంగా రాణించాడు. చదవండి: WI Vs Eng 2nd Test- Joe Root: జో రూట్ అరుదైన సెంచరీ.. దిగ్గజాలను వెనక్కి నెట్టి.. Sound 🔛 👏 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐏𝐮𝐧𝐣𝐚𝐛 𝐤𝐞 𝐥𝐢𝐲𝐞 𝐭𝐚𝐚𝐥𝐢𝐲𝐚𝐧 𝐛𝐚𝐣𝐭𝐢 𝐫𝐞𝐡𝐧𝐢 𝐜𝐡𝐚𝐡𝐢𝐲𝐞 👏 #SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @mayankcricket pic.twitter.com/GFWuCZZRHp — Punjab Kings (@PunjabKingsIPL) March 16, 2022 -
హార్ధిక్, గబ్బర్లకు భారీ షాక్.. రహానే, పుజారాలకు డిమోషన్
BCCI Contracts: 2021-22 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌లలో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు చుక్కెదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు 'ఎ ప్లస్' గ్రేడ్‌ను నిలబెట్టుకోగా.. టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లు పుజారా, రహానే, ఇషాంత్ శర్మలు తమ ‘ఎ’ గ్రేడ్‌ను కోల్పోయి ‘బి’ గ్రేడ్‌లోకి పడిపోయారు. గాయాల కారణంగా గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డేలు మాత్రమే పరిమితమైన శిఖర్ ధవన్లు ఏకంగా ‘ఎ’ నుంచి ‘సి’ గ్రేడ్‌కు దిగజారగా.. మయాంక్ అగర్వాల్, సాహాలు ‘బి’ నుంచి ‘సి’ గ్రేడ్‌కు పడిపోయారు. ఇప్పటివరకు ‘సి’ గ్రేడ్‌లో ఉన్న హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ‘బి’ గ్రేడ్ దక్కగా.. కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలు ఏకంగా కాంట్రక్ట్నే కోల్పోయారు. బీసీసీఐ ఈ ఏడాదికి గాను 27 మందితో సెంట్రల్ కాంట్రాక్ట్ కుదుర్చుకోగా.. రోహిత్, కోహ్లి, బుమ్రాలు 'ఎ ప్లస్' గ్రేడ్‌లో.. అశ్విన్, జడేజా, పంత్, రాహుల్, షమీలు ‘ఎ’ గ్రేడ్‌లో.. పుజారా, రహానే, అక్షర్, శార్ధూల్, శ్రేయస్, సిరాజ్, ఇషాంత్‌లు ‘బి’ గ్రేడ్‌లో.. ధవన్, ఉమేశ్, భువనేశ్వర్, హార్ధిక్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శుభ్‌మన్ గిల్, విహారి, చహల్, సూర్యకుమార్ యాదవ్, సాహా, మయాంక్‌లు ‘సి’ గ్రేడ్‌లో ఉన్నారు. వీరిలో 'ఎ ప్లస్' కేటగిరీలో ఉన్నవాళ్లకు ఏటా రూ.7 కోట్లు, ‘ఎ’ కేటగిరీ ప్లేయర్లకు రూ.5 కోట్లు, ‘బి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, ‘సి’ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు రూ.1కోటి పారితోషికంగా లభించనుంది. చదవండి: కోహ్లి వందో టెస్టు.. వాట్సాప్ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు -
'ధావన్‌తో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం'
ఐపీఎల్-2022 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్యాచ్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు అగర్వాల్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఈ సీజన్లో శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నానని మయాంక్ తెలిపాడు. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు అగర్వాల్‌ను పంజాబ్ రీటైన్ చేసుకోగా.. ధావన్‌ను వేలంలో రూ. 8.2 కోట్లకు కొనుగోలు చేసింది. "పంజాబ్ జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ లాంటి అద్భుతమైన ఆటగాడితో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం నా ఆదృష్టం. ఇక ఈ సీజన్లో అండర్-19 ప్రపంచకప్ హీరో రాజ్ బావాను సొంతం చేసుకున్నాము. అతడికి ఇది తొలి సీజన్ కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అదే విధంగా అతడితో ఆడటానికి నేను ఎదురు చూస్తున్నాను. ఈ ఇద్దరే కాదు.. అందరి ఆటగాళ్లతో ఆడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మయాంక్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ మెగా వేలానికి ముందు మయాంక్‌ను రూ.12 కోట్లకు పంజాబ్ రీటైన్ చేసుకుంది. ఐపీఎల్లో 100 మ్యాచ్‌లు ఆడిన అగర్వాల్ 2135 పరుగులు సాధించాడు. ఇక గతేడాది సీజన్లో కూడా మయాంక్ అద్భుతంగా రాణించాడు. గత సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన అతడు 441 పరుగులు చేశాడు. ఐపీఎల్-2022 మార్చి 26న ప్రారంభం కానుంది. చదవండి: Icc women's world cup 2022: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన -
ధావన్ కాదంట.. మయాంక్‌కే అవకాశం
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్ అని ఊహాగానాలు వస్తున్నప్పటికి.. మయాంక్ అగర్వాల్‌వైపే ఫ్రాంచైజీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. వేలానికి ముందే మయాంక్ అగర్వాల్‌తో(రూ.12 కోట్లు) పాటు అర్ష్‌దీప్ సింగ్(రూ. 4 కోట్లు)ను రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీ మిగతా జట్టును మొత్తం రిలీజ్ చేసింది. గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈసారి వేలంలో లక్నో సూపర్‌జెయింట్స్‌కు వెళ్లిపోవడంతో కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ నడిచింది. ఇటీవలే ముగిసిన మెగావేలంలో శిఖర్ ధావన్‌ను రూ. 9.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ధావన్‌తో పాటు కగిసో రబాడ, జానీ బెయిర్ స్టో, రాహుల్ చహర్, లియామ్ లివింగ్ స్టోన్, షారుక్ ఖాన్ లాంటి పేరున్న ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కాగా కెప్టెన్‌గా శిఖర్ ధావన్ పేరు తప్ప మరో ఆటగాడు కనిపించలేదు. అయితే రిటైన్ చేసుకున్న మయాంక్‌కు కెప్టెన్సీ అప్పగించి వైస్ కెప్టెన్ బాధ్యతలు ధావన్‌కు అప్పగిస్తే ఎలా ఉంటుందనే యోచన చేసింది. ఈ విషయంలో ఫ్రాంచైజీలో మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపడంతో మయాంక్‌కు కెప్టెన్సీ కట్టబెట్టనున్నారు. ఈ విషయాన్ని ఈ వారాంతంలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో 2014లో ఫైనల్ మినహా మళ్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది లేదు. గత మూడు సీజన్ల నుంచి చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కాగా ఈసారి సీజన్‌ను మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ తొలి వారం నుంచి ప్రారంభించేలా బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. చదవండి: 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది? IND W- NZ W: హమ్మయ్య.. మొత్తానికి గెలిచింది -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్!
ఐపీఎల్ మెగావేలం ముగిసింది. మెగావేలంలో తమకు ఇష్టమైన ఆటగాళ్లను దక్కించుకున్న ఫ్రాంచైజీలు ఇక కెప్టెన్ల వేట మొదలుపెట్టనున్నాయి. కాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్‌ను ఎంపికచేయనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల్లో ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ ప్రకటించనుంది. కాగా వేలంలో ధావన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 8.25 కోట్లకు దక్కించుకుంది. ''జట్టు కెప్టెన్‌గా ధావన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. టీమిండియాలో ఒక సీనియర్ ఆటగాడిగా ఉన్న ధావన్ పంజాబ్ కెప్టెన్‌గా జట్టును తన భుజాలపై మోస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో పాటు కోచ్ కూడా ధావన్‌వైపు మొగ్గుచూపుతున్నారు. తొందర్లోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుంది.'' అంటూ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఒక కీలక వ్యక్తి తెలిపారు. చదవండి: IPL 2022 Auction: ఎవరు కొనరేమో అనుకున్నాం.. చివర్లో అదృష్టం కాగా 12 కోట్లతో పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే సీనియారిటీ ప్రకారం ధావన్ కెప్టెన్ అయితేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో కెప్టెన్ ఎవరనే దానిపై క్లారిటీ రానుంది. ఇక ఈసారి కచ్చితంగా కప్ సాధించాలాని అనుకుంటున్న పంజాబ్ వేలంలో నిఖార్సైన ఆటగాళ్లను దక్కించుకుంది. లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబాడ, ఓడియన్ స్మిత్, షారుక్ ఖాన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లు వేలంలో కొనుగోలు చేసింది. మరి ఈసారైనా పంజాబ్ రాత మారుతుందో లేదో చూడాలి. ఇక పంజాబ్ కింగ్స్ మొత్తం ఆటగాళ్ల సంఖ్య 25 కాగా.. అందులో భారత క్రికెటర్లు 18 మంది ఉండగా.. ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఆటగాళ్లపై పంజాబ్ రూ. 86 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది. చదవండి: IPL 2022 Auction: వేలంలో వారికి పంట పండింది.. వీళ్లను అసలు పట్టించుకోలేదు -
IPL 2022 Mega Auction: మెగా వేలం
-
14 బంతుల తర్వాత ఎట్టకేలకు..
కరోనా నుంచి కోలుకొని వెస్టిండీస్‌తో మూడో వన్డేలో ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్ అంతగా ఆకట్టుకోలేదు. 26 బంతులెదుర్కొని కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో ఓపెనర్‌గా విశేషంగా రాణించిన ధావన్ అదే ఫామ్‌ను విండీస్‌తో మ్యాచ్‌లో కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే మ్యాచ్‌లో శిఖర్ ధావన్ బ్యాటింగ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. 10 పరుగులు చేసిన ధావన్ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క సిక్సర్ ఉంది. అయితే ధావన్ 14 డాట్ బంతులు ఆడిన తర్వాత గానీ ఆ సిక్సర్ రావడం విశేషం. కీమర్ రోచ్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ దిశగా స్టన్నింగ్ సిక్స్ ఆడాడు. అయితే ఆ కాసేపటికే ఓడియన్ స్మిత్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక మ్యాచ్‌లో టీమిండియా 50 ఓవర్లలో 265 పరుగులుకు ఆలౌట్ అయింది. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. రిషబ్ పంత్ 56 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో దీపక్ చహర్ 38, వాషింగ్టన్ సుందర్ 33 పరుగులు చేయడంతో టీమిండియా 250 ప్లస్ స్కోరు దాటింది. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4, అల్జారీ జోసెఫ్, హెడెన్ వాల్ష్ చెరో రెండు వికెట్లు, ఓడియన్ స్మిత్, ఫాబియెన్ అలెన్ తలా ఒక వికెట తీశారు. -
కోవిడ్ నుంచి కోలుకున్న టీమిండియా ఆటగాళ్లు.. రెండో వన్డేకు అతడు దూరమేనా..!
విండీస్‌తో తొలి వన్డేకు ముందు కరోనా బారిన పడిన నలుగురు టీమిండియా ఆటగాళ్లలో ముగ్గురు కోలుకున్నారు. నిన్న జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రిజర్వ్ ఆటగాడు నవ్‌దీప్ సైనీలకు నెగిటివ్ వచ్చిందని, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌లో మాత్రం ఇంకా స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. కోవిడ్ నుంచి కోలుకున్న ముగ్గురు తొలి వన్డేకు దూరమైన కేఎల్ రాహుల్‌తో కలిసి ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. అయితే, వీరిలో రాహుల్‌ను మినహాయించి మిగతా ముగ్గురు రెండో వన్డే ఆడటం అనుమానమేనని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ వీరు వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాహుల్ గైర్హాజరీలో తొలి వన్డేలో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన యువ ఆటగాడు ఇషాన్ కిషన్ రెండో వన్డేకు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. టీమిండియాలో ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డే బరిలో దిగే జట్టే యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది. తొలి వన్డేలో మిడిలార్డర్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, దీపక్ హూడాలు పర్వాలేదనిపించడంతో ఇషాన్ కిషన్‌తో పాటు షారూక్ ఖాన్, మయాంక్ అగర్వాల్‌లు మరో అవకాశం కోసం వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), ప్రసిద్ద్ కృష్ణ(2/29), సిరాజ్(1/26) చెలరేగడంతో విండీస్ 176 పరుగుల స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించి టీమిండియా గెలుపుకు పునాది వేయగా, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. కోహ్లి(8), పంత్(11) మరోసారి నిరుత్సాహపరిచారు. చదవండి: కోహ్లిని మరోసారి అవమానించిన బీసీసీఐ.. 100వ టెస్ట్ యధాతథంగా..! -
"నాపై ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు.. నేను బాగానే ఉన్నా"
Shikhar Dhawan Latest Health Updates In Telugu: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌కు ముందు భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ధావన్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్,నవదీప్ సైనీకి కూడా పాజిటివ్‌గా నిర్ధణైంది. దీంతో వన్డే జట్టులోకి మయాంక్ అగర్వాల్, ఇషన్ కిషన్‌కు పిలుపునిచ్చారు. కాగా కరోనా బారిన పడిన తర్వాత తొలి సారి ధావన్ స్పందించాడు. తను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అభిమానులకు ధావన్ ధన్యవాదాలు తెలిపాడు. "నాపై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను. త్వరలోనే మీ ముందుకు వస్తాను" అని ధావన్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో వన్డేల్లో పునరాగమనం చేసిన ధావన్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక స్వదేశంలో వెస్టిండీస్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 లు ఆడనుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. చదవండి: U-19 World Cup 2022: వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు భారత్.. ఇంగ్లండ్‌తో తుది పోరు -
2020లో చివరగా ఆస్ట్రేలియాతో.. టీమిండియా ఆటగాడికి బంపర్ ఆఫర్!
వెస్టిండీస్‌తో తొలి వన్డే ముందు ముగ్గురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. జట్టులోని స్టార్ క్రికెటర్లు శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్‌తో సహా మరో 5 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధాణైంది. ఈ నేపథ్యంలో సీనియర్ సెలక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్‌ను విండీస్‌తో తలపడే భారత వన్డే జట్టులో చేర్చింది. మయాంక్ చివరగా వన్డేల్లో 2020లో ఆస్ట్రేలియాతో ఆడాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్-వెస్టిండీస్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 9న జరగనుంది. కాగా మూడో మ్యాచ్ ఫిబ్రవరి 11న జరగనుంది. వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి. కాగా ఇప్పటికే ఇరు జట్లు అహ్మదాబాద్ చేరుకున్నాయి. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా, మయాంక్ అగర్వాల్ చదవండి: IND Vs WI: టీమిండియాలో కరోనా కలకలం.. ముగ్గురు స్టార్ క్రికెటర్లకు పాజిటివ్ -
పని అయిపోయింది అన్నారు.. దుమ్ము రేపుతున్నాడు.. వేలంలో భారీ ధర పక్కా!
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పని అయిపోయింది, ఇక భారత జట్టులో చోటు కష్టమే, అతడి స్ధానంలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వండి. ఇవన్నీ దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వినిపించిన మాటలు ఇవి. అయితే పడి లేచిన కెరటంలా ధావన్ దక్షిణాఫ్రికా టూర్లో అద్భుతంగా రాణించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 169 పరుగులు సాధించాడు. దీంట్లో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సిరీస్‌లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్ నిలిచాడు. కాగా గత ఏడాది శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించాడు. టీ20 ప్రపంచకప్-2021, స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ధావన్‌కు చోటు దక్క లేదన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ధావన్‌ని రీటైన్ చేసుకోలేదు. ఆ క్రమంలో రానున్న మెగా వేలంలో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన గబ్బర్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు తప్పక పోటీ పడతాయనడంలో సందేహం లేదు.. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనుంది. చదవండి: Virat Kohli- Vamika: వామిక ఫొటోలు వైరల్.. స్పందించిన కోహ్లి... -
సంచలనం సృష్టించిన రాజ్ బావా.. ధావన్ రికార్డు బ్రేక్
Raj Bawa breaks Shikhar Dhawan's record: అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కోనసాగుతోంది. ఉగాండాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 326 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీస్కోరు చేసింది. కాగా 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగండా కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంలో మిడిలార్డర్ బ్యాటర్ రాజ్ బావా (162 నాటౌట్), ఓపెనర్ అంగ్కృష్ రఘువంశీ (144) కీలక పాత్ర పోషించారు. కాగా అండర్-19 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ చేసిన తొలి భారత ఆటగాడిగా రాజ్ బావా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ (155) పేరిట ఉన్న రికార్డును రాజ్ బావా అధిగమించాడు. అదే విధంగా ఈ ప్రపంచకప్‌లో బ్యాట్‌తోను బాల్‌తోను రాజ్ బావా అద్భుతంగా రాణిస్తున్నాడు. అంతేకాకుండా ఈ ఆల్‌రౌండర్ అండర్-19 ఆసియా కప్‌ను భారత్ గెలవడంలోను కీలకపాత్ర పోషించాడు. చదవండి: SA vs IND: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. విరాట్ కోహ్లి దూరం! -
మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం.. వాళ్లు బాగా ఆడారు!
పెర్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆదిలోనే కెప్టెన్ రాహుల్ వికెట్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక భారత జట్టు మిడిలార్డర్ కూప్పకూలింది. చివర్లో శార్ధుల్ ఠాకూర్ మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించింది. కాగా భారత మిడిలార్డర్ విఫలంపై ఓపెనర్ శిఖర్ ధావన్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. బోలాండ్ పార్క్‌లో వికెట్ చాలా నెమ్మదిగా ఉందని ధావన్ తెలిపాడు. 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం భారత మిడిలార్డర్‌కు అంత సులభం కాదని అతడు అభిప్రాయపడ్డాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా బ్యాటర్లు టెంబా బావుమా, వాన్ డెర్ డుస్సేన్పై ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘మాకు మంచి ఆరంభం లభించింది. రాహుల్ వికెట్ కోల్పోయినా నేను, విరాట్.. స్కోర్ బోర్డును ముందుకు నడిపించాము. కానీ వికెట్ వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు భారీ షాట్లు ఆడడం అంత సులభం కాదు. మేము ఈ మ్యాచ్‌లో సెంచరీ భాగస్వామ్యం కూడా నమోదు చేయలేకపోయాం. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అది మా బ్యాటింగ్ యూనిట్‌పై ప్రభావం చూపింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు టెంబా బావుమా, వాన్ డెర్ డుస్సేన్ అద్భుతంగా ఆడార’ని శిఖర్ ధావన్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ధావన్ 79 పరుగులు సాధించాడు. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే బోలాండ్ పార్క్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: ఒక వైపు కెప్టెన్, వైస్ కెప్టెన్‌కి పాజిటివ్.. అయినా టీమిండియా ఘన విజయం.. -
తొలి వన్డేలో టీమిండియా ఓటమి... నిరాశపర్చిన రాహుల్ కెప్టెన్సీ..
దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిన భారత్‌కు వన్డే సిరీస్‌లోనూ ఊరట లభించలేదు. దానికి కొనసాగింపుగానా అన్నట్లు తొలి మ్యాచ్‌లో ఓటమితో సిరీస్‌ను మొదలు పెట్టింది. పెద్దగా ప్రభావం చూపని బౌలింగ్‌తో సఫారీకి భారీ స్కోరు చేసే అవకాశం ఇచ్చిన టీమిండియా... ఆ తర్వాత బ్యాటర్ల వైఫల్యంతో సునాయాసంగా పరాజయాన్ని ఆహ్వానించింది. IND vs SA, 1st ODI: భారత్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. వాన్ డర్ డసెన్ (96 బంతుల్లో 129 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ తెంబా బవుమా (143 బంతుల్లో 110; 8 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 30.4 ఓవర్లలో 204 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు సాధించి ఓడిపోయింది. శిఖర్ ధావన్ (84 బంతుల్లో 79; 10 ఫోర్లు), విరాట్ కోహ్లి (63 బంతుల్లో 51; 3 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (43 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇదే మైదానంలో రేపు రెండో వన్డే జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో ఆరంభంలోనే జేన్‌మన్ మలాన్ (6) వికెట్ తీసి భారత్‌కు శుభారంభం అందించాడు. తొలి పది ఓవర్లు ముగిసేసరికి సఫారీ స్కోరు 39 పరుగులకు చేరింది. ఆ తర్వాత డి కాక్ (27), మార్క్రమ్ (4)లను పది పరుగుల వ్యవధిలో అవుట్ చేసి భారత్ మళ్లీ దెబ్బ కొట్టింది. అయితే ఈ దశలో బవుమా, డసెన్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. బవుమా నెమ్మదిగా ఆడినా, డసెన్ తన దూకుడుతో లెక్క సరి చేశాడు. ఆపై భారత బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొన్న వీరు భారీ స్కోరుకు బాటలు వేశారు. శార్దుల్ ఓవర్లో సింగిల్ తీసి 133 బంతుల్లో బవుమా కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 83 బంతుల్లో డసెన్ కూడా తన రెండో శతకాన్ని అందుకున్నాడు. ఎట్టకేలకు 49వ ఓవర్లో బవుమాను అవుట్ చేసి బుమ్రా ఈ భారీ భాగస్వామ్యానికి తెర దించాడు. మిడిలార్డర్ విఫలం... కెప్టెన్ రాహుల్ (12) పార్ట్‌టైమర్ మార్క్రమ్కు వికెట్ అప్పగించినా... ధావన్, కోహ్లి భాగస్వామ్యంలో జట్టు ఇన్నింగ్స్ చక్కగా సాగింది. ముఖ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లో కోహ్లి ఎప్పటిలాగే తన స్థాయి ఆటను ప్రదర్శించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 17 ఓవర్లలో 92 పరుగులు జత చేశారు. అయితే ధావన్ అవుట్‌తో ఒక్కసారిగా జట్టు పతనం ప్రారంభమైంది. 50 పరుగుల వ్యవధిలో 5 ప్రధాన వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమి దిశగా సాగింది. రిషభ్ పంత్ (16), శ్రేయస్ అయ్యర్ (17), వెంకటేశ్ అయ్యర్ (2) విఫలం కావడంతో లక్ష్య ఛేదన అసాధ్యంగా మారిపోయింది. చివర్లో శార్దుల్ ఠాకూర్ మెరుపు ఇన్నింగ్స్‌తో పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. వెంకటేశ్ @242 మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ రాజశేఖరన్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 242వ ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు. సచిన్‌ను దాటిన కోహ్లి... ఈ ఇన్నింగ్స్‌లో వ్యక్తిగత స్కోరు తొమ్మిది పరుగుల వద్ద విరాట్ కోహ్లి (5,108) విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా సచిన్ టెండూల్కర్ (5,065) పేరిట ఉన్న ఈ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు -
ధావన్: 'జట్టుకు దూరమయ్యావు! ఎంటర్టైన్మెంట్తో బతికేస్తున్నావా'
టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఫామ్‌ను కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుత పరిస్థితులు దృష్యా ధావన్ జట్టులోకి రావడం కష్టమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇవేవి పట్టించుకోకుండా టీమిండియాలోకి రావాలని గబ్బర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగాడు. అయితే ఐదు మ్యాచ్‌లు కలిపి (12,8,14,12,0).. 56 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో ధావన్ రీఎంట్రీపై నీలీనీడలు కమ్ముకున్నాయి. చదవండి: 10 ఫోర్లు, 4సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్! ఆటకు దూరంగా ఉన్నప్పటికి ధావన్ తన అభిమానులను అలరించాలనుకున్నాడు. అందుకు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఫన్నీ వీడియోనూ షేర్ చేశాడు. బాలీవుడ్ బ్లాక్బాస్టర్ షోలే సినిమాలో విలన్ గబ్బర్‌సింగ్ పాపులర్ డైలాగ్ ''కిత్నే ఆద్మీ తే''ను తన స్టైల్లో అనుకరించాడు. ప్రస్తుతం ధావన్ చెప్పిన డైలాగ్ వైరల్‌గా మారింది. అయితే ధావన్ వీడియో చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.'' టీమిండియాకు ఎలాగో దూరమయ్యావు.. ఎంటర్టైన్మెంట్ మీద పడ్డావు. ఇలాంటివి మానేసి ఆటపై దృష్టి పెడితే బాగుంటుంది..'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ధావన్ టీమిండియా తరపున టి20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంకతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లో ఆఖరిసారిగా పాల్గొన్నాడు. లంక పర్యటనకు వెళ్లిన రెండో టీమిండియా జట్టుకు ధావన్ కెప్టెన్సీ చేశాడు. టి20 సిరీస్‌ను లంక గెలుచుకోగా.. వన్డే సిరీస్‌ను మాత్రం టీమిండియా 2-1 తేడాతో దక్కించుకుంది. ఇక అప్పటినుంచి ధావన్ మళ్లీ టీమిండియాకు ఆడలేదు. చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే! View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
దేశవాళీ వన్డే విజేతను తేల్చేందుకు...
ముంబై: భారత క్రికెట్ దేశవాళీ సీజన్ 2021–22లో మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమైంది. ఇటీవలే ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టి20ల్లో సత్తా చాటిన ఆటగాళ్లు ఇప్పుడు వన్డే క్రికెట్లో తమ విలువేంటో చూపించేందుకు సన్నద్ధమయ్యారు. నేటి నుంచి జరిగే వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం 38 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. దేశంలోనే ఏడు వేదికల్లో (ముంబై, జైపూర్, రాంచీ, చండీగఢ్, రాజ్‌కోట్, తిరువనంతపురం, గువహటి)లలో మ్యాచ్‌లు జరుగుతాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై, మరో పెద్ద జట్టు తమిళనాడు మధ్య జరిగే తొలి పోరుతో టోర్నీ మొదలవుతుంది. కొన్నాళ్ల క్రితమే ముస్తాక్ అలీ టి20 టోర్నీని నెగ్గిన తమిళనాడు అమితోత్సాహంతో ఉంది. భారత సీనియర్ జట్టులో సభ్యులుగా ఉన్నవారు కాకుండా పలువురు గుర్తింపు పొందిన క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీలో ఆయా జట్ల తరఫున కీలకపాత్ర పోషించనున్నారు. హర్షల్ పటేల్, రాహుల్ చహర్, దీపక్ చహర్, యశస్వి జైస్వాల్, దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, అంబటి తిరుపతి రాయుడు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 38 జట్లను ఎలైట్.. ప్లేట్ గ్రూప్‌లుగా విభజించారు. ఎలైట్ ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’, ‘ఇ’ గ్రూప్‌లలో ఆరు జట్లు చొప్పున ఉన్నాయి. మరో ఎనిమిది జట్లతో ప్లేట్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఐదు ఎలైట్ గ్రూప్‌ల నుంచి ‘టాప్’లో నిలిచిన ఐదు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇవే గ్రూప్‌లలో రెండో స్థానంలో నిలిచిన ఐదు జట్లు... ప్లేట్ గ్రూప్ టాపర్ (మొత్తం ఆరు జట్లు) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. డిసెంబర్ 27న ఫైనల్ జరుగుతుంది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్‌లో ఆంధ్ర... ఎలైట్ ‘సి’ గ్రూప్‌లో హైదరాబాద్ ఉన్నాయి. హైదరాబాద్ జట్టు: తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హిమాలయ్, అలంకృత్, అతుల్ వ్యాస్, భవేశ్ సేథ్, మికిల్ జైస్వాల్, కవిన్ గుప్తా, త్రిషాంక్ గుప్తా, చందన్ సహాని, తనయ్ త్యాగరాజన్, అజయ్‌దేవ్ గౌడ్, గౌతమ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, టి. రవితేజ, అక్షత్ రెడ్డి, కొల్లా సుమంత్, తిలక్ వర్మ, సీవీ మిలింద్, రాహుల్ బుద్ధి, అబ్దుల్ ఖురేషీ, అద్నాన్ అహ్మద్, మొహమ్మద్ అఫ్రిది. -
ఆరంగేట్ర మ్యాచ్‌లో మరో రికార్డు సాధించిన శ్రేయస్ అయ్యర్..
Shreyas Iyer Registers Impressive Record On Kanpur Test: టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన ఆరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లో మరో రికార్డు సాధించాడు. భారత తరుపున ఆరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నిగ్స్‌లు కలిపి అయ్యర్ 170 పరుగులు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నిగ్స్‌లో 65 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు డెబ్యూ టెస్ట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ధావన్(187) ఉండగా, తరువాతి స్ధానంలో 177 పరుగులతో రోహిత్ శర్మ ఉన్నాడు. కాగా ఆరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. -
Shikhar Dhawan: శిఖర్ ధావన్‌కు బిగ్ షాక్.. ఇక ఆ జట్టులో నో ఛాన్స్!
Shikhar Dhawan will not be retained by Delhi Capitals: ఐపీఎల్ 15వ సీజన్ కోసం రిటైన్ ప్లేయర్స్ లిస్ట్‌ను సమర్పించడానికి గడువు దగ్గరపడతుండటంతో ఆయా జట్లు తుది జాబితా సిద్దం చేసుకుంటున్నాయి. ఈ జాబితాను ఆయా జట్లు నవంబర్ 30 లోపు అందజేయాలి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రతీ జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశముంది. అందులో ఒక విదేశీ ఆటగాడు తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలో ఏ జట్లు ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటారో అన్నదానిపై సర్వత్రా అసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఆ జట్టు తరుపున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన శిఖర్ ధావన్‌ను వదులుకోనేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. రాబోయే సీజన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ నాయకత్వం వహించునున్న సంగతి తెలిసిందే. అయితే శ్రేయాస్ అయ్యర్, అశ్విన్, శిఖర్ ధావన్, కగిసో రబాడాలను వదులుకోవాలని ఆజట్టు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అధేవిధంగా పృథ్వీ షా, అక్షర్ పటేల్ రిటైన్డ్ చేసుకోవాలి అని ఢిల్లీ భావిస్తోందంట. కాగా ఐపీఎల్-2022 కోసం మెగా వేలం డిసెంబర్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సారి రెండు కొత్త జట్లు రావడంతో వేలంపై ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: IPL 2022 Auction- KL Rahul: లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..! ఎంత మొత్తమైనా చెల్లించేందుకు సిద్ధం? -
నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న శిఖర్ ధావన్.. జట్టులో చోటు దక్కేనా
Shikhar Dhawan sweats it out in training session: భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడానికి ఓపెనర్ శిఖర్ ధావన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచకున్నాడు. ఇక ఈ ఏడాదిలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధావన్.. టీ20 ప్రపంచకప్‌తో పాటు, స్వదేశంలో న్యూజిలాండ్ పర్యటనకు కూడా ఎంపిక కాలేదు. రోహిత్ శర్మతో కలిసి టీమిండియాకు ఎన్నో అధ్బుత విజయాలు అందించిన ధావన్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీలు, క్రికెట్ నిపుణులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చివరగా ఐపీఎల్ 14వ సీజన్లో ఆడిన ధావన్.. 587 పరుగుల తో అధ్బుతంగా రాణించాడు. కాగా 2021 ఏడాదికుగాను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్‌తో ధావన్‌ను సత్కారించింది. కాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ధావన్.. "అర్జున అవార్డును అందుకోవడం నాకు గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కోచ్‌లు, వైద్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ, సహచరులు, అభిమానులు, నా స్నేహితులు నా కుటుంబ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని ధావన్ రాసుకొచ్చాడు. చదవండి: Mahela Jayawardene: శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే! -
‘ఖేల్ రత్నా’లకు పట్టాభిషేకం..
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో తమ ప్రతిభాపాటవాలతో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న భారత మేటి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్లో శనివారం కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా 2021 సంవత్సరానికిగాను క్రీడాకారులు ఈ అవార్డులు అందుకున్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’కు ఈసారి ఏకంగా 12 మందిని ఎంపిక చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), రవి దహియా (రెజ్లింగ్), లవ్లీనా (బాక్సింగ్)... 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్... పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అవనీ లేఖరా (పారా షూటింగ్), మనీశ్ నర్వాల్ (పారా షూటింగ్), సుమిత్ అంటిల్ (పారా అథ్లెటిక్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), కృష్ణ నాగర్ (పారా బ్యాడ్మింటన్)... 22 ఏళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్, 19 ఏళ్లుగా భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడుతున్న కెప్టెన్ సునీల్ ఛెత్రిలకు ‘ఖేల్ రత్న’తో గౌరవించారు. ‘ఖేల్ రత్న’ అవార్డీలకు రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్‌మనీతోపాటు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. ‘అర్జున అవార్డు’ను అత్యధికంగా 35 మందికి అందజేశారు. ఇందులో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు సభ్యులు 15 మంది, నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు నుంచి ఇద్దరు ఉన్నారు. స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌తోపాటు భారత మహిళల టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనా కూడా ‘అర్జున’ అందుకున్న వారిలో ఉన్నారు. ‘అర్జున’ అవార్డీలకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ, ప్రతిమ, ప్రశంసాపత్రం ఇచ్చారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ‘ద్రోణాచార్య’ అవార్డును లైఫ్‌టైమ్ కేటగిరీలో ఐదుగురికి... రెగ్యులర్ విభాగంలో ఐదుగురికి అందజేశారు. చదవండి: Matthew Wade: క్యాన్సర్ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు... -
రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు అందుకున్న శిఖర్ ధావన్.. వీడియో వైరల్
Shikhar Dhawan Honoured With Arjuna Award, Video: జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఆట్టహాసంగా జరిగింది. 2021లో మొత్తం 62 మందికి ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ రాష్ట్రపతి చేతుల మీదగా అర్జున అవార్డు అందుకున్నాడు. అధేవిధంగా భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్రత్నఅవార్డులను .. టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, భారత స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో పాటు పలువురు క్రీడాకారులకు ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. గణతంత్ర్య దినోత్సవం సందర్బంగా జనవరి 26న ఈ అవార్డులను ప్రకటిస్తారు. చదవండి: రిజ్వాన్ కోలుకోవడంలో భారత డాక్టర్ కీలక పాత్ర... కృతజ్ఞతగా ఏమి ఇచ్చాడంటే.. #WATCH | Cricketer Shikhar Dhawan receives Arjuna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/X7G45x9lzn — ANI (@ANI) November 13, 2021 -
రిషబ్ పంత్, ధావన్ క్రికెట్ గురువు కన్నుమూత
cricket coach Tarak Sinha Lost Life Battle With Cancer.. టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ గురువు, క్రికెట్ కోచ్ తారక్ సిన్హా(71) క్యాన్సర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం కన్నుమూశారు. తారక్ సిన్హా ఢిల్లీలో సోనెట్ క్రికెట్ క్లబ్‌ను నడిపేవాడు. ఈ సందర్భంగా ఆయన ఎందరో క్రికెటర్లను తీర్చిదిద్దారు. అతని పర్యవేక్షణలో రాటుదేలిన ఆటగాళ్లలో 12 మంది అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఆశిష్ నెహ్రా, ఆకాశ్ చోప్రా, శిఖర్ ధావన్, అంజుమ్ చోప్రా, రిషబ్ పంత్, మనోజ్‌ప్రభాకర్, అజయ్ శర్మ, కె.పి. భాస్కర్, సంజీవ్ శర్మ, రామన్ లంబా, అతుల్ వాసన్, సురేందర్ ఖన్నా, రణ్‌దీర్ సింగ్ లాంటివారు ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ధావన్, పంత్‌లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా క్రీడా పురస్కారాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ద్రోణాచార్య అవార్డు అందుకున్న ఐదో క్రికెట్ కోచ్‌గా తారక్ సిన్హా నిలిచాడు. క్రికెట్ భాషలో అతన్ని అందరూ ''ఉస్తాద్ జీ'' అని ముద్దుగా పిలుచుకుంటారు. కాగా తారక్ సిన్హా కంటే ముందు రమాకాంత్ అచ్రేకర్, దేశ్ ప్రేమ్ ఆజాద్, గురుచరన్ సింగ్, సునీత శర్మలు ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. చదవండి: Syed Mushtaq Ali Trophy 2021: కెప్టెన్ సెంచరీ మిస్.. అయితేనేం హైదరాబాద్ భారీ విజయం -
టీమిండియా మహిళా క్రికెటర్ తో శిఖర్ ధావన్ పెళ్లి..?
Rumours On Dhawan Second Marriage: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం హైలెట్ అవుతుందో తెలియదు. కొన్ని రూమర్స్గా మిగిలిపోతాయి.. కొన్ని నిజాలుగా తేలుతాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకుంటే టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌పై ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే కొద్ది రోజులు కిందట శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్, ఓ భారత మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. శిఖర్ ధావన్, సదరు మహిళా క్రికెటర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయేషాతో విడిపోవడానకి ఇదే కారణమంటూ కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఇందులో నిజం ఉందా లేదంటే.. గాసిప్స్ రాయుళ్ల పనేనా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. చదవండి: CSK VS RR: ఫిలిప్స్ ఫన్నీ బ్యాటింగ్ వీడియో.. ‘నోరెళ్లబెట్టిన సామ్’ -
పొలార్డ్ కళ్లు చెదిరే త్రో.. ధావన్ పేరిట చెత్త రికార్డు
Shikar Dhawan Run Out By Pollard Stunning Throw.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ కళ్లు చెదిరే త్రోతో మెరిశాడు. దీంతో శిఖర్ ధావన్ రనౌట్ కావడంతో పాటు ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశాడు. జయంత్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఆఖరి బంతిని ధావన్ మిడాన్ దిశగా షాట్ ఆడాడు. అయితే రిస్క్ అని తెలిసినా ధవన్ అనవసర సింగిల్‌కు ప్రయత్నించాడు. ఇంకేముంది అక్కడే ఉన్న పొలార్డ్ బంతిని అందుకొని డైరెక్ట్ త్రో విసిరాడు. ధవన్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేయడంతో రనౌట్ అయ్యాడు. కాగా ధవన్ రనౌట్ల విషయంలో ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 16 సార్లు రనౌట్ అయిన ధావన్.. గంభీర్‌తో సమానంగా తొలిస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సురేశ్ రైనా 15 సార్లు రనౌట్‌తో రెండో స్థానంలో.. అంబటి రాయుడు, డివిలియర్స్‌లు 13 సార్లు రనౌట్ అయి మూడవ స్థానంలో నిలిచారు. ఇక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. That was an Amazing Direct hit from Polly🔥#MIvsDC #MI #IPL2021 pic.twitter.com/BCFbwbSsou — MaHi 💔 (@MaHi_Shreyasian) October 2, 2021 -
IPL 2021 2nd Phase: ఓపెనర్లిద్దరు ఇరగదీశారు
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ తొలి అంచె పోటీల్లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. కరోనాతో లీగ్ వాయిదా పడే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఢిల్లీ ఓపెనర్స్ శిఖర్ ధావన్, పృథ్వీ షాలు మంచి ఫామ్‌లో ఉన్నారు. పృథ్వీ షా ఆరంభంలోనే ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేయగా.. ఇక శిఖర్ ధావన్ తన క్లాస్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. చదవండి: MS Dhoni: జోరు మీదున్న తలైవా.. ఫోర్లు, సిక్సర్ల వర్షం తాజాగా శిఖర్ ధావన్, పృథ్వీ షాలు ఒక హిందీ టీవీ షోలోని డైలాగ్‌లను తమ స్టైల్లో అనుకరించారు. పృథ్వీ తన హావభావాలతో ఆకట్టుకోగా.. ధవన్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సీజన్ రెండో అంచె మరికొద్ది గంటల్లో మొదలవనుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. చదవండి: IPL 2021: ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. View this post on Instagram A post shared by PRITHVI SHAW (@prithvishaw) -
నెట్స్‌లో ఇరగదీసిన శిఖర్ ధావన్.. వీడియో వైరల్
దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సంబంధించి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేయలేదు. ఫామ్‌లో ఉన్న ధావన్‌ను పరిగణలోకి తీసుకోకపోవడంపై అభిమానుల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. స్థిరత్వ ప్రదర్శన ఉంటే సరిపోదని.. ఆటలో వేగం ఉండాలనే కారణంతో ధావన్ స్థానంలో మూడో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెప్పుకొచ్చారు. చదవండి: T20 World Cup 2021: శిఖర్ ధావన్‌ను అందుకే ఎంపిక చేయలేదా! ఈ విషయం పక్కనపెడితే శిఖర్ ధావన్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీల్లో పాల్గొనేందుకు ధావన్ ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాడు. తాజాగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్యాడ్స్ కట్టుకోవడం దగ్గర్నుంచి బ్యాటింగ్ చేసేవరకు ప్రతీది వీడియోలో పొందుపరిచాడు. వీడియో కింద 'సూర్మా' అని క్యాప్షన్ జత చేశాడు. సూర్మా అంటే పంజాబీ భాషలో ''డేరింగ్ అండ్ డాషింగ్'' అని అర్థం. ఇక శిఖర్ ధావన్ ఐపీఎల్ 14వ సీజన్లో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌లాడిన ధావన్ 134.27 స్ట్రైక్ రేట్‌తో 380 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రదర్శనతో దుమ్మురేపి టేబుల్ టాపర్‌గా నిలిచింది. 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చదవండి: T20 World Cup: వారిద్దరికి దక్కని చోటు.. గావస్కర్ టీ 20 ప్రపంచకప్ జట్టు ఇదే! Shane Warne: టీమిండియా అద్భుతం; ఆటతీరుతో నా టోపీని ఎత్తుకెళ్లారు View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
Shikar Dhawan: ధావన్‌ను అందుకే ఎంపిక చేయలేదా!
ముంబై: అక్టోబర్‌లో యూఏఈ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సంబంధించి బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన టీమిండియా ప్రాబబుల్స్ చూసి కొంతమంది అభిమానులు షాక్‌కు గురయ్యారు. సూపర్ ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్‌ను ఎంపికచేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఓపెనింగ్ స్లాట్‌లో ఖాళీ లేకపోవడంతోనే ధావన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని సెలక్టర్లు పేర్కొన్నారు. కానీ అభిమానులు ఈ కారణాన్ని ఏకీభవించడం లేదు. రెగ్యులర్ ఓపెనర్లకు తోడుగా మూడో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారని.. అనుభవంలో ధావన్ ఎంతో ముందున్నాడని.. అసలు కారణం అది కాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చదవండి: టీమిండియా జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని అయితే ధావన్‌ను పక్కన పెట్టడానికి మరో కారణం కూడా ఉందని సమాచారం. శిఖర్ ధావన్ బ్యాటింగ్‌లో నిలకడ ఉంటుందని.. కానీ ఆరంభంలో అతని బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతుంది. క్రీజులో నిలుదొక్కుకున్న తర్వాత తనదైన శైలిలో వేగంగా ఆడడం ధావన్ స్టైల్. కానీ టీ20లు అంటేనే మెరుపులకు పెట్టింది పేరు. ధావన్ మంచి ఆటగాడే అయినప్పటికీ బంతులు ఎక్కువగా తీసుకుంటాడని.. అది ఆటకు సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ధావన్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను మూడో ఓపెనర్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ధావన్ లాంటి స్థిరమైన ఆటగాడి అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అతని అవసరం జట్టుకు ఉపయోగపడదని సెలక్టర్లు పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా ధావన్ వ్యక్తిగత జీవితం కూడా అతని ఎంపికపై ప్రభావం చూపినట్లు ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ధావన్, అయేషా ముఖర్జీలు తొమ్మిదేళ్ల వైవాహిక జీవితం అనంతరం విడాకులు తీసుకోవడం అతని కెరీర్‌పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. చదవండి: Ayesha Mukherjee: అసలు ఎవరీ అయేషా..? శిఖర్‌తో విడిపోవడం వెనుక.. Shikhar Dhawan-Ayesha Mukherjee Divorce: శిఖర్ ధావన్ విడాకులు వాస్తవానికి 35 ఏళ్ల శిఖర్ ధావన్ లంక పర్యటనతో పాటు ఐపీఎల్ 2021 సీజన్లో మంచి ప్రదర్శనను కనబరిచాడు. ముఖ్యంగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న శిఖర్ ధావన్ 8 మ్యాచ్‌ల్లో 380 పరుగులతో లీడింగ్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అంతేకాదు లంక పర్యటనలోనూ అటు కెప్టెన్సీలోనూ.. ఇటు బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శనను కనబరిచాడు. ఇవీ గాక ధావన్‌కు ఐసీసీ టోర్నమెంట్లో మంచి రికార్డు ఉంది. 2013 చాంపియన్స్ ట్రోపీని భారత్ గెలవడంలో శిఖర్ ధావన్ పాత్ర కీలకం. ఆ టోర్నీలో టీమిండియా ఓపెనర్‌గా రాణించిన ధావన్ టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇక బ్యాకప్ ఓపెనర్‌గా శిఖర్ ధావన్ సరిపోతాడనేది చాలా మంది అభిప్రాయం. ఇషాన్ కిషన్‌కు మంచి స్ట్రైక్ రేట్ ఉండొచ్చు.. కానీ అనుభవంలో మాత్రం ధావన్‌కు పోటీగా రాలేడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. -
శిఖర్ కంటే పదేళ్లు పెద్ద.. మొదటి భర్త నుంచి విడిపోయినప్పటికీ..
-
వారిద్దరికి దక్కని చోటు.. గావస్కర్ టీ 20 ప్రపంచకప్ జట్టు ఇదే!
ముంబై: వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం దాదాపు అన్ని దేశాలు తమ జట్లును ప్రకటించే పనిలో ఉన్నాయి. బీసీసీఐ బుధవారం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో తన జట్టును ప్రకటించాడు. ఆశ్చర్యకరంగా ఓపెనర్ శిఖర్ ధావన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌ని తన టీంలో ఎంపిక చేయలేదు. ఇక తన జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికు ఓపెనర్లుగా ఆవకాశం ఇచ్చాడు. అదే విధంగా.. తన జట్టులో ముగ్గురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను గవాస్కర్ ఎంపిక చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానాన్ని దక్కించుకోగా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు మిడిలార్డర్లో స్దానం దక్కింది. గవాస్కర్ జట్టులో ఇద్దరు ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే... సన్నీ తన జట్టులో 5 పేసర్లను ఎంపిక చేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ షమీలకు అవకాశం ఇచ్చాడు. తన జట్టులో ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను గావస్కర్ ఎంచుకున్నాడు. చదవండి: Ayesha Mukherjee: అసలు ఎవరీ అయేషా..? శిఖర్‌తో విడిపోవడం వెనుక. -
ఐదేళ్ల తర్వాత టీ20ల్లో టీమిండియా చెత్త రికార్డు
కొలంబో: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైన టీమిండియా పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటింగ్ వైఫల్యంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఆడుతూ పాడుతూ చేధించింది. ఈ సంగతి పక్కనపెడితే.. భారత్ ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా జట్టుగా, వ్యక్తిగతంగా పలు చెత్త రికార్డులను నమోదు చేసింది. లంకతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగులు చేయడం ద్వారా ఐదేళ్ల తర్వాత అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 2016లో నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో 79 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ టీ 20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం మళ్లీ ఇదే. ఇక భారత్‌కు టీ20ల్లో అత్యల్ప స్కోరు 74.. 2008లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ స్కోరు చేసింది. ఇక టీ20ల్లో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లుగా చూస్తే భారత్ రెండో స్థానంలో ఉంది. 2010లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 79 పరుగులతో తొలి స్థానంలో ఉంది. ఇక భువనేశ్వర్ బ్యాట్స్‌మన్‌గా ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. 32 బంతులాడిన భువీ తన ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కొట్టకుండానే ఔటయ్యాడు. ఇంతకముందు ఇర్ఫాన్ పఠాన్ 30 బంతులు, ఎంఎస్ ధోని 27 బంతుల పాటు బౌండరీలు కొట్టలేకపోయారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటింగ్‌లో కుల్దీప్ యాదవ్ 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఏడుగురు బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో ధావన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. మిగతా ఇద్దరు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. లంక బౌలర్ వినిందు హసరంగ 4 వికెట్లతో దుమ్మురేపాడు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 82 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (20 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు), హసరంగ (9 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్) జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. -
Shikar Dhawan: మా ఓటమికి కారణం అదే
కొలంబో: శ్రీలంకతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు విజయాలతో జోరు మీద కనిపించిన టీమిండియా మూడో వన్డేకు భారీ మార్పులతో బరిలోకి దిగింది. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు వన్డే డెబ్యూ ఇచ్చారు. కాగా భారత్ జట్టు ఓటమిపై మ్యాచ్ తర్వాత శిఖర్ ధావన్ మాట్లాడుతూ ‘‘మ్యాచ్‌లో మాకు మెరుగైన ఆరంభం లభించింది. కానీ.. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు చేజార్చుకున్నాం. దాంతో.. చివరికి ఆశించిన దానికంటే ఓ 50 పరుగులు తక్కువగా చేశాం. వన్డే సిరీస్ అప్పటికే దక్కడంతో.. కొత్త ఆటగాళ్లకి అవకాశం ఇచ్చాం. కానీ.. మేము ఆశించిన విధంగా ఫలితం రాలేదు. తప్పిదాల్ని దిద్దుకుని.. టీ20 సిరీస్‌లో సత్తాచాటుతాం’’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగా ఆదివారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సొంతగడ్డపై భారత్ చేతిలో 10 మ్యాచ్‌ల పరాజయాల పరంపరకు తెరదించుతూ ఎట్టకేలకు శ్రీలంక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పృథ్వీ షా (49 బంతుల్లో 49; 8 ఫోర్లు), అరంగేట్రం చేసిన సంజూ సామ్సన్ (46 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 40; 7 ఫోర్లు) రాణించారు. అకిల ధనంజయ, ప్రవీణ్ జయవిక్రమ చెరో మూడు వికెట్లు సాధించి భారత్‌ను తక్కువ స్కోరుకే కట్డడి చేశారు. ఛేజింగ్‌లో శ్రీలంక 39 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 227 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవిష్క ఫెర్నాండో (98 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్), భానుక రాజపక్స (56 బంతుల్లో 65; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టుకు గెలుపు బాటలు వేశారు. సూర్యకుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. -
Ind Vs SL ఆడుతూ పాడుతూ... భారత్ ఘనవిజయం
కొలంబో: పేరుకు ద్వితీయ శ్రేణి జట్టయినా ఊహించినట్టుగానే భారత జట్టు పూర్తి ఆధిపత్యం చలాయించింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. చమిక కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కెప్టెన్ దసున్ షనక (50 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లక్ష్యఛేదనలో భారత్ 36.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ శిఖర్ ధావన్ అజేయ అర్ధ సెంచరీ (95 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్)తో చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ‘బర్త్‌డే బాయ్’ వన్డేల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పృథ్వీ షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. అవిష్క ఫెర్నాండో (35 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), మినోద్ భానుక (44 బంతుల్లో 27; 3 ఫోర్లు) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 10వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన చహల్ భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. దాంతో 49 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్‌ను కోల్పోయింది. స్పిన్నర్ల రాకతో శ్రీలంక స్కోరు బోర్డు వేగం మందగించింది. ఒకదశలో 205/7గా నిలిచిన శ్రీలంక 250 మార్కును దాటడం కష్టంగా అనిపించింది. అయితే 8వ స్థానంలో వచ్చిన కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి లంకకు గౌరవప్రద స్కోరు అందించాడు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక 32 పరుగులు రాబట్టింది. పృథ్వీ... ధావన్... మధ్యలో ఇషాన్ ఛేదనలో భారత ఇన్నింగ్స్ మూడు దశలుగా సాగింది. పృథ్వీ షా మెరుపు ఆరంభాన్నిస్తే... చివర్లో ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ మధ్యలో ఇషాన్ కిషన్ ‘బర్త్‌డే స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. చమీర వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన పృథ్వీ... ఆ తర్వాతి ఓవర్లోనూ మరో రెండు ఫోర్లు బాదాడు. ఇక ఉదాన వేసిన నాలుగో ఓవర్లో మరింత రెచ్చిపోయిన అతను కవర్స్ దిశగా హ్యాట్రిక్ ఫోర్లు సాధించాడు. దాంతో భారత స్కోరు 4.5 ఓవర్లలో 50 పరుగుల మార్కును దాటింది. మరో ఎండ్‌లో ఉన్న ధావన్ మాత్రం సింగిల్స్‌కే ప్రాధాన్య ఇస్తూ పృథ్వీకే ఎక్కువగా స్ట్రయికింగ్ వచ్చేలా చేశాడు. హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన పృథ్వీ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో అవిష్క ఫెర్నాండో చేతికి చిక్కాడు. వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడుతోన్న ఇషాన్... తాను ఎదుర్కొన్న తొలి బంతినే లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టి ఖాతా తెరిచాడు. పృథ్వీ ఇన్నింగ్స్‌కు కొనసాగింపుగా ఇషాన్ బ్యాటింగ్ సాగింది. ధనంజయ వేసిన 8వ ఓవర్లో ఇషాన్ ‘హ్యాట్రిక్’ ఫోర్స్ కొట్టాడు. దాంతో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ 91/1గా నిలిచింది. హిట్టింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చిన ఇషాన్ 33 బంతుల్లో తొలి అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ఆ కాసేపటికే సందకన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఇషాన్ వెనుదిరిగాడు. ధావన్, ఇషాన్ రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ధావన్... ఇప్పుడు నా వంతు అంటూ తన బ్యాట్‌కు పని చెప్పాడు. కరుణరత్నే బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ధావన్... ఆ తర్వాతి ఓవర్లో సింగిల్ తీసి 61 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మనీశ్ పాండే (26; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. పాండే అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (20 బంతుల్లో 31; 5 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో మ్యాచ్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (సి) పాండే (బి) చహల్ 32; మినోద్ భానుక (సి) పృథ్వీ షా (బి) కుల్దీప్ యాదవ్ 27; రాజపక్స (సి) ధావన్ (బి) కుల్దీప్ యాదవ్ 24; ధనంజయ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ పాండ్యా 14; అసలంక (సి) ఇషాన్ కిషన్ (బి) దీపక్ చహర్ 38; షనక (సి) హార్దిక్ (బి) చహల్ 39; హసరంగ (సి) ధావన్ (బి) దీపక్ చహర్ 8; కరుణరత్నే (నాటౌట్) 43; ఉదాన (సి) దీపక్ చహర్ (బి) హార్దిక్ 8; చమీర (రనౌట్) 13; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–49, 2–85, 3–89, 4–117, 5–166, 6–186, 7–205, 8–222, 9–262. బౌలింగ్: భువనేశ్వర్ 9–0–63–0, దీపక్ చహర్ 7–1–37–2, హార్దిక్ పాండ్యా 5–0–33–1, చహల్ 10–0–52–2, కుల్దీప్ యాదవ్ 9–1–48–2, కృనాల్ పాండ్యా 10–1–26–1. భారత ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) అవిష్క ఫెర్నాండో (బి) ధనంజయ 43; ధావన్ (నాటౌట్) 86; ఇషాన్ కిషన్ (సి) భానుక (సి) సందకన్ 59; పాండే (సి) షనక (బి) ధనంజయ 26; సూర్యకుమార్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (36.4 ఓవర్లలో 3 వికెట్లకు) 263. వికెట్ల పతనం: 1–58, 2–143, 3–215. బౌలింగ్: చమీర 7–0–42–0, ఉదాన 2–0–27–0, ధనంజయ 5–0–49–2, సందకన్ 8.4–0–53–1, అసలంక 3–0–26–0, హసరంగ 9–1–45–0, కరుణరత్నే 2–0–16–0. -
IND Vs SL: ఓపెనర్లు వారిద్దరే.. ఐపీఎల్ హీరోలకు మొండిచెయ్యే..?
కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న యువ భారత జట్టు కూర్పుపై ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా కెప్టెన్ శిఖర్ ధవన్, యువ ఆటగాడు పృథ్వీ షా పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. దీంతో టీమిండియాకు తొలిసారి ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్‌లకు మొండిచెయ్యి తప్పేట్లు లేదు. ఈ ఇద్దరికీ తుది జట్టులో స్థానం దక్కేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో పృథ్వీ షా పరుగుల వరద పారించాడు. భారీ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ 2021లో సైతం అదరగొట్టాడు. దీంతో సీనియర్ ఓపెనర్ ధవన్‌కు జతగా పృథ్వీ షా అయితే బాగుంటుందని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లోనూ వీరిద్దరు ఒకే జట్టుకు (ఢిల్లీ క్యాపిటల్స్) ఓపెనింగ్ చేయడం అదనంగా కలిసొచ్చే అంశం. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పడిక్కల్, చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున రుతురాజ్ ఓపెనర్లుగా అదరగొట్టారు. అయినప్పటికీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా వీరిద్దరు మరికొంత సమయం వేచి చూడక తప్పేట్టు లేదు. ఇక మూడో స్థానం కోసం కూడా భారీ పోటీనే(నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్) నెలకొన్నప్పటికీ.. యాజమాన్యం సూర్యకుమార్‌వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, చహల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్‌లకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్ రేసులో ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఉన్నారు. అయితే, సంజుకు సరైన అవకాశాలు ఇవ్వలేదన్న అపవాదు బీసీసీఐపై ఉంది కాబట్టి.. అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. స్పిన్నర్ల కోటాలో చహల్‌కు తోడుగా కృనాల్ పాండ్యాను తీసుకుంటే బ్యాటింగ్‌లో కూడా పనికొస్తాడని జట్టు యాజమాన్యం భావిస్తుంది. ఇక పేసర్ల విభాగంలో మిగిలిన ఖాళీ కోసం నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియాలు పోటీపడుతున్నారు. అయితే, ఐపీఎల్లో అంచనాలకు మించి రాణించిన సకారియాకే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీసీసీఐ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్లో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత యువ జట్టు లంక పర్యటనకు వచ్చింది. దేశవాళీ, ఐపీఎల్ టోర్నీలో సత్తాచాటిన యువ ఆటగాళ్లు ఈ పర్యటనలో ఉన్నారు. జులై 18 నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా. -
'బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. నా గుండె పగిలింది'
ముంబై: జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గురువారం బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్ ఆడనుంది. ఐపీఎల్, ఇతర దేశవాలీ టోర్నీలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా జట్టులో చోటు కల్పించారు. రుతురాజ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా వంటి యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఇటీవలే రంజీ ట్రోపీలో దుమ్మురేపిన సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ లంకతో పర్యటనకు కచ్చితంగా ఎంపికవుతానని భావించాడు. కానీ అతని ఆశలు తలకిందులయ్యాయి. ఈ సందర్భంగా తాను ఎంపికకాకపోవడంపై స్పందించిన షెల్డన్ జాక్సన్.. '' ఎంత బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. నా గుండె పగిలింది'' అంటూ ఎమోజీ షేర్ చేశాడు. ''ఇప్పుడు నా వయసు 34 ఏళ్లు.. కానీ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాను. ఒక 22-23 ఏళ్ల కుర్రాడిలో దూకుడైన ఆటతీరు ఎలా ఉంటుందో అలా సాగుతుంది నా ఆటతీరు. ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేను ఏం చేయలేను.. లేటు వయసులో జాతీయ జట్టులోకి ఎంట్రీ లేదని క్రికెట్ పుస్తకాల్లో ఎక్కడా లేదు. ఒక ఆటగాడిని ఎంపిక చేయలాంటే అతని ఆటతీరు చూడాలని నేను నమ్ముతా. వరుసగా మూడు సీజన్ల పాటు రంజీ ట్రోపీలో 800-900 పరుగులు చేశానంటే ఫిట్‌గా ఉండడమే కదా అర్థం. అతని వయస్సు 30 కంటే ఎక్కువ.. అందుకే సెలక్ట్ కాలేదు..ఈ పదం నేను చాలాసార్లు విన్నా'' అంటూ ఆవేదన చెందాడు. ఇక షెల్డన్ జాక్సన్ రంజీ ట్రోపీలో వరుసగా మూడుసార్లు 700కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 76 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 5634 పరుగులు, 60 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 2096 పరుగులు, 59 దేశవాలీ టీ20ల్లో 1240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు.. 44 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న టీమిండియా జూలై 13న తొలి వన్డే ఆడనుంది. చదవండి: కెప్టెన్‌గా గబ్బర్.. వైస్‌కెప్టెన్‌గా భువీ దంచికొట్టిన రషీద్ ఖాన్.. ఆఖరి బంతికి విజయం 💔 — Sheldon Jackson (@ShelJackson27) June 10, 2021