పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. శుబ్‌మన్ గిల్(49 బంతుల్లో 67, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో గిల్ ఔటైన తర్వాత కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికి రాహుల్ తెవాటియా బౌండరీ బాది జట్టును గెలిపించాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరన్, అర్ష్‌దీప్, హర్‌ప్రీత్ బార్, రబాడలు తలా ఒక వికెట్ తీశారు.
16 ఓవర్లలో గుజరాత్ 120/3
16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. గిల్ 52, మిల్లర్ ఐదు పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు పాండ్యా 8, సాయి సుదర్శన్ 19 పరుగులు చేసి వెనుదిరిగారు.
11 ఓవర్లలో గుజరాత్ 88/1
11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. గిల్ 38, సాయి సుదర్శన్ 19 పరుగులతో ఆడుతున్నారు.
6 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 54/1
6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. గిల్ 20 పరుగులు, సాయి సుదర్శన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా సాహా 19 బంతుల్లో 30 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Photo Credit : IPL Website
గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 154
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో పెద్దగా ఎవరు రాణించలేదు. మాథ్యూ షార్ట్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. షారుక్ ఖాన్ 9 బంతుల్లో 22 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ 25, సామ్ కరాన్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో జితేశ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. షమీ, జాషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్‌లు తలా ఒక వికెట్ తీశారు.
Photo Credit : IPL Website
16 ఓవర్లలో పంజాబ్ 109/4
16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రాజపక్స 19 పరుగులు, సామ్ కరన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
ఆరు ఓవర్లలో పంజాబ్ 53/2
ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 35, బానుక రాజపక్స 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 8 పరుగులు చేసిన ధావన్ జోషువా లిటిల్ బౌలింగ్‌లో అల్జారీ జోసెఫ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Photo Credit : IPL Website
3 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 27/1
3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 18, శిఖర్ ధావణ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు మహ్మద్ షమీ బౌలింగ్‌లో ప్రబ్‌సిమ్రన్ సింగ్ డకౌట్ అయ్యాడు.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గురువారం 18వ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
𝙎𝙖𝙙𝙙𝙖 𝙠𝙞 𝙝𝙖𝙖𝙡?
Hardik Pandya wins the toss at Mohali 📍 the Titans will field first!#TATAIPL #IPLonJioCinema #PBKSvGT pic.twitter.com/RRQnHnRvby
— JioCinema (@JioCinema) April 13, 2023
వరుసగా రెండు విజయాలతో సత్తా చాటిన ఈ రెండు జట్లకు మూడో మ్యాచ్‌లో షాక్ తగిలింది. ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో గుజరాత్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్ చివరి ఐదు బంతుల్లో రింకూ సింగ్ ఐదు సిక్స్‌లు బాదడంతో కేకేఆర్ సంచలన విజయం సాధించింది.
సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ అర్ధ శతకంతో (99 నాటౌట్) చెలరేగాడు. మూడు మ్యాచ్‌లకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ లియం లివింగ్‌స్టోన్ రాకతో పంజాబ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరిని వరిస్తుంది అనేది మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఇరుజట్ల మధ్య గతంలో రెండు మ్యాచ్‌లు జరగ్గా పంజాబ్, గుజరాత్‌లు చెరొక మ్యాచ్‌ను గెలుచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment