IPL 2023, SRH Vs PBKS: Shikhar Dhawan Career Best Innings Against SRH - Sakshi
Sakshi News home page

Shikar Dhawan: టి20 కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌; పలు రికార్డులు బద్దలు

Published Sun, Apr 9 2023 10:20 PM | Last Updated on Mon, Apr 10 2023 8:55 AM

Shikar DHawan Career Best Innings Vs SRH Match IPL 2023 - Sakshi

Photo: IPL Twitter

టీమిండియా గబ్బర్‌.. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌​ తన టి20 కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేసిన ధావన్‌ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. 

ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఇక 88 పరుగుల వద్ద పంజాబ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన తర్వాత  ఆఖరి బ్యాట్స్‌మన్‌తో కలిసి  ధావన్‌ 55 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే శిఖర్‌ ధావన్‌ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

► ఐపీఎల్‌లో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్ల జాబితాలో ధావన్‌ చోటు సంపాదించాడు. ఇంతకముందు సురేశ్‌రైనా (2013లో ఎస్‌ఆర్‌హెచ్‌పై), క్రిస్‌ గేల్‌(2019లో ఆర్‌సీబీపై), మయాంక్‌ అగర్వాల్‌(2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై) ఉండగా.. తాజాగా శిఖర్‌ ధావన్‌ వీరి సరసన చేరాడు.

► ఇక టి20 క్రికెట్‌లో పదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జంటగా ధావన్‌-మోహిత్‌ రాతే జోడి ఐదో స్థానంలో నిలిచారు. 
తొలి స్థానంలో గ్రాంట్‌ ఇలియట్‌, జుల్ఫికర్‌ బాబర్‌ జోడి 63 పరుగులు(పీఎస్‌ఎల్‌ 2016, క్వెటా గ్లాడియేటర్స్‌ వర్సెస్‌ పెషావర్‌ జాల్మీ) ఉ‍న్నారు.  
62* - కేబీ అహిర్ & ఎన్‌ అహిర్, పనామా v అర్జెంటీనా, నార్త్ సౌండ్, 2021
61* - DJ వోరాల్ & DR బ్రిగ్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ vs హోబర్ట్ హరికేన్స్, హోబర్ట్, 2020
59 - స్ట్రీక్ & జేయి ఎవరైనా, వార్విక్షైర్ vs వోర్సెస్టర్‌షైర్, బర్మింగ్‌హామ్, 2005
55* - ఆర్ ఫ్రైలింక్ & పి సుబ్రాయెన్, డాల్ఫిన్స్ vs లాహోర్ లయన్స్, బెంగళూరు, 2014

► ఐపీఎల్‌ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఆఖరి వరకు నిల్చొని పదో నెంబర్‌ బ్యాటర్‌ వరకు అందరితో కలిసి ఆడిన రెండో ఆటగాడిగా ధావన్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఇంతకముందు పార్థివ్‌ పటేల్‌ మాత్రమే 2019లో సీఎస్‌కే తరపున ఈ ఫీట్‌ సాధించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement