వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు దక్కపోయినా.. ధావన్‌ మంచి మనసు! పోస్ట్‌ వైరల్‌ | Shikhar Dhawan sends best wishes to Team India | Sakshi
Sakshi News home page

WC 2023: వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు దక్కపోయినా.. ధావన్‌ మంచి మనసు! పోస్ట్‌ వైరల్‌

Published Wed, Sep 6 2023 9:16 PM | Last Updated on Wed, Sep 6 2023 9:30 PM

 Shikhar Dhawan sends best wishes to Team India - Sakshi

టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లే. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు ప్రకటించిన  15 మంది సభ్యుల జట్టులో కూడా ధావన్‌కు స్ధానం దక్కలేదు. అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో అత‌డికి  రీఎంట్రీ ఇచ్చే అన్ని దారులు మూసుకు పోయాయి. ఇక జట్టులో చోటు దక్కకపోయినప్పటికీ ధావన్‌ తన మంచి మనసును చాటుకున్నాడు.

ప్రపంచకప్‌కు ఎంపికైన తన సహచర ఆటగాళ్లకు గబ్బర్‌ అభినందనలు తెలిపాడు. "వరల్డ్‌కప్‌ 2023 టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైన నా తోటి సహచరులకు, స్నేహితులకు అభినందనలు. 1.5 బిలియన్ల ప్రజల ప్రార్థనలు మీకు మద్దతుగా ఉన్నాయి.

మీరు ట్రోఫిని తిరిగి సాధించి, మమ్మల్ని గర్వించేలా చేయండి అంటూ  ఎక్స్‌(ట్విటర్‌)లో ధావన్‌ రాసుకొచ్చాడు.  ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌ షురూ కానుంది. అదే విధంగా ఆక్టోబర్‌ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో  భారత్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌,  ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్థూల్‌ ఠాకూర్‌.
చదవండిWorld Cup 2023: వరల్డ్‌కప్‌ జట్టులో నో ఛాన్స్‌.. యుజ్వేంద్ర చాహల్‌ కీలక నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement