మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్‌ | Priyanka Chopra Remuneration Details For SSMB29 Project | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్‌

Published Sun, Jan 26 2025 11:04 AM | Last Updated on Sun, Jan 26 2025 11:33 AM

Priyanka Chopra Remuneration Details For SSMB29 Project

మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. అయితే, ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్‌ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగారు. అదే సమయంలో ఆమె  హాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు.  ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్‌ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్‌లో ఇదే ఆమె చివరి సినిమా.

భారీ రెమ్యునరేషన్‌
బాలీవుడ్‌కు మించిన రెమ్యునరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకోన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు రూ. 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి. అయితే, SSMB29 ప్రాజెక్ట్‌ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది.  కానీ, హాలీవుడ్‌ మీడియా మాత్రం సుమారు రూ. 40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట.

అంత మొత్తం ఇవ్వడానికి కారణం ఇదే
ప్రియాంక చోప్రా మార్కెట్‌ బాలీవుడ్‌లో భారీగానే ఉంది. చాలా గ్యాప్‌ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తుండటంతో హిందీ బెల్ట్‌లో మంచి బిజినెస్‌ చేసే ఛాన్స్‌ ఉంది. ఆపై హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద కూడా ప్రియాంక అప్పీయరెన్స్ సినిమాకు ప్లస్‌ అవుతుంది. SSMB29 ప్రాజెక్ట్‌ను హాలీవుడ్‌ రేంజ్‌లో జక్కన్న ప్లాన్‌ చేశాడు. దీంతో సులువుగా అక్కడి మార్కెట్‌కు సినిమా రీచ్‌ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్‌ చేసినట్లు టాక్‌. ఒకవేళ ఈ ప్రాజెక్ట్‌ రెండు భాగాలుగా వస్తే.. అప్పుడు ఆమె రెమ్యునరేషన్‌ లెక్కలు మారిపోతాయి. ఏదేమైనా అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా రికార్డ్‌ క్రియేట్‌ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.

హాలీవుడ్‌లో ఫుల్‌ బిజీ
బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలలో నటించిన  ప్రియాంక 'క్వాంటికో' అనే టెలివిజన్‌ సిరీస్‌తో హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బేవాచ్‌, ఏ కిడ్‌ లైక్‌ జాక్,లవ్‌ అగైన్‌,టైగర్‌, వుయ్‌ కెన్‌ బీ హీరోస్‌, ది వైట్‌ టైగర్‌ తదితర చిత్రాలలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి అక్కడి వారిని మెప్పించారు. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు అదనపు గుర్తింపు లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement