maheshbabu
-
రెడ్ శారీలో మెరిసిపోతున్న మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.. (ఫోటోలు)
-
మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్
మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే, ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా.భారీ రెమ్యునరేషన్బాలీవుడ్కు మించిన రెమ్యునరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది. టాలీవుడ్లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు రూ. 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి. అయితే, SSMB29 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. కానీ, హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు రూ. 40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.అంత మొత్తం ఇవ్వడానికి కారణం ఇదేప్రియాంక చోప్రా మార్కెట్ బాలీవుడ్లో భారీగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తుండటంతో హిందీ బెల్ట్‌లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఆపై హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రియాంక అప్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. SSMB29 ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న ప్లాన్ చేశాడు. దీంతో సులువుగా అక్కడి మార్కెట్‌కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వస్తే.. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ లెక్కలు మారిపోతాయి. ఏదేమైనా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.హాలీవుడ్లో ఫుల్ బిజీబాలీవుడ్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలలో నటించిన ప్రియాంక 'క్వాంటికో' అనే టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి అక్కడి వారిని మెప్పించారు. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు అదనపు గుర్తింపు లభించింది. -
కలిసొచ్చిన మహేశ్ బాబు వాయిస్.. కోట్లు కొల్లగొట్టిన 'ముఫాసా'
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఒక పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా మొదటివారం రూ.74 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు.ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది ఈ చిత్రం. మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఇంగ్లిష్ వర్షన్లో రూ.26.75 కోట్లు, హిందీ రూ.11.2కోట్లు, తెలుగు, రూ.11.3 కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే, ప్రపంవ్యాప్తంగా రూ. 74 కోట్లు రాబట్టింది. ఇందులో టైటిల్ రోల్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఆపై హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. ఈ చిత్రంలోని సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇవ్వడం విశేషం.ముఫాసా చిత్రానికి ఇతర దేశాల్లో కాస్త ఆదరణ తక్కువగా ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రం అదరగొడుతుంది. ఈ సినిమా కోసం దాదాపు రూ. 1750 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. అయితే, మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. రూ. 1700 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. -
2024లో ప్రముఖ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన సినిమా స్టార్స్
-
మహేష్‌బాబును కట్టిపడేసిన హీరోయిన్ చీర లుక్ అదిరింది (ఫోటోలు)
-
దుబాయ్‌లో చిల్ అవుతోన్న సితార, నమ్రత.. ఫోటోలు వైరల్!
-
'పుష్ప'లో ఈ పాత్రలను వదులుకున్న స్టార్స్ ఎవరెవరో తెలుసా..?
-
ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు
-
మహేష్ వాయిస్ నాకు నచ్చలేదు...
-
Mahesh Babu Rare Photos: టాలీవుడ్ ప్రిన్స్.. బాల్యంలో ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా? (ఫోటోలు)
-
'గుంటూరు కారం' విషయంలో ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్‌గా చెప్పిన నాగవంశీ
ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. సుమారు 8 సినిమాలు రేసులో ఉన్నాయి. ఇందులో కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎన్ని సినిమాలు రేసులో ఉన్నా.. మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రంపైనే ప్రేక్షకుల గురి ఎక్కువగా ఉంది. మహేశ్ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో త్రవిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్- త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 12న గుంటూరు కారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ‘గుంటూరు కారం’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రతి ఏరియాలో రాజమోళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తామని ఆ ఇంటర్వ్యూ ద్వారా నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం సినిమా కంటెంట్ విషయంలో తాను ఎంతో నమ్మకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అంటే RRR కలెక్షన్స్‌ను బీట్ చేయలేకపోయిన వాటికి దగ్గరగా గుంటూరు కారం కలెక్షన్స్ ఉంటాయని పరోక్షంగా ఆయన ఇలా చెప్పారు. ఆ వీడియోతో పాటు ఆయన ఇలా తెలిపారు. 'డియర్ సూపర్ ఫ్యాన్స్.. మీకు మళ్లీ చెబుతున్నా.. మేము అదే మాట మీద ఉన్నాం. 'గుంటూరు కారం' చిత్రాన్ని భారీగా విడుదల చేస్తాం. అంతేకాకుండా ఎక్కువ థియేటర్స్‌లలో రికార్డ్ రేంజ్లో విడుదల ఉంటుంది. రిలీజ్ విషయం మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే' అని వంశీ తెలిపారు. తాజాగా 'కుర్చీ మడతపెట్టి' అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాలో ఈ పాట భారీగా వైరల్ అవుతుంది. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉన్న ఈ సాంగ్‌లో మహేశ్, శ్రీలీల డ్యాన్స్‌తో దుమ్ములేపారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పలువురు అభిమానులు వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో #WeDemandRecordReleaseForGK అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ తాజాగా ఈ ట్వీట్ చేయడం విశేషం. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. Dear superfans... Meeku Malli strong ga chebutunna, Memu adhe maata meeda unnamu.. #GunturKaaram ki record release in record number of theatres lo untundhi. Release maaku odileyandi, Celebrations ye mathram thaggakunda chuskune badhyata meedi 😎🔥 pic.twitter.com/YnATOeMZh1 — Naga Vamsi (@vamsi84) December 31, 2023 -
రాజమౌళి- మహేశ్‌బాబు సినిమాపై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది
భారత దిగ్గజ దర్శకుడు రాజమౌళి- ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్లో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చిన రోజు నుంచి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఇదే. అంతేకాకుండా ఈ సినిమాకు కథను కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారనే విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇదీ చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్) తాజాగ SSMB29 ప్రాజెక్ట్‌పై విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. యాక్షన్ అడ్వంచర్ సినిమాగా మహేశ్‌బాబుతో కథ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యాక్షన్ సీన్స్ ఇండియానా జోన్స్ సినిమా టైపులో ఉంటాయని ఉదాహరణగా తెలిపారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ సైతం భాగం కానున్నారని ప్రకటించారు. దీంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో విడుదల కానున్నట్లు ఆయన చెప్పకనే చెప్పారని తెలుస్తోంది. ఆఫ్రికా అడువుల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన గతంలోనే ఆయన తెలిపారు. (ఇదీ చదవండి: రేణు దేశాయ్ వీడియో.. ఇంత పెద్ద స్టోరీ నడిచిందా?) సీక్వెల్స్‌లో కథలు మారుతుండొచ్చు. కానీ, ప్రధాన పాత్రలు మాత్రం అవే ఉంటాయని అప్పట్లో చెప్పుకొచ్చారు. 2024లో షూటింగ్ ప్రారంభిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమాతో మహేష్‌బాబు బిజీగా ఉన్నారు. నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 13న వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. "There is a possibility to rope in Hollywood actor for superstar #MaheshBabu's #SSMB29 with SS Rajamouli." This will be an African adventure film." - Vijayendra Prasad pic.twitter.com/uZKr2kmfiC — Manobala Vijayabalan (@ManobalaV) August 23, 2023 -
రిస్కీ యాక్షన్ మూడ్‌లో రఫ్ఫాడిస్తున్న స్టార్స్
మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల తాజా చిత్రాల సెట్స్‌లో ‘డిష్యుం.. .. డిష్యుం’ సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్టార్స్ విలన్లను రఫ్ఫాడిస్తున్నారు... రిస్కీ ఫైట్ చేస్తున్నారు. ఆ డిష్యుం.. డిష్యుం... విశేషాలు తెలుసుకుందాం. గుంటూరు కారం.. నాటు ఫైటు ‘గుంటూరు కారం’ ఎంత ఘాటుగా ఉంటుందో ఆ రేంజ్లో నాటు ఫైటు చేస్తున్నారు మహేశ్‌బాబు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘గుంటూరు కారం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ఆరంభమైంది. తొలుత మహేశ్‌బాబు పాల్గొనగా కాలేజీ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. నాటు ఫైట్స్‌తో విలన్ల తుక్కు రేగ్గొడుతున్నారు మహేశ్. మరి.. ఈ ఫైట్‌ను విజువల్‌గా ఎంజాయ్ చేయాలంటే సంక్రాంతి వరకూ ఎదురు చూడక తప్పదు. ఎందుకంటే ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుంది. ఎస్. చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ దేవర ‘దేవర’ షూటింగ్ ఎప్పట్నుంచి మొదలైందో అప్పట్నుంచే ఎన్టీఆర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పటివరకు జరిగిన ఈ సినిమా ప్రతి షెడ్యూల్లోనూ ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించడమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ నెల మొదటివారంలో ‘దేవర’ తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకోలపై ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారని టాలీవుడ్ టాక్. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేశారట. అంతేకాదు.. ఈ ఫైట్ పూర్తి కాగానే మరో ఫైట్ మాస్టర్ సాల్మోన్ డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ఈ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీఖాన్ ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఎన్టీఆర్ – సైఫ్‌ల మధ్య హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇక ‘జనతా గ్యారేజ్’ (2016) చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూమహేశ్బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ దుతున్న ఈ ‘దేవర’లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ యాక్షన్ ‘గేమ్ ఛేంజర్’గా ఫైట్ చేస్తున్నారు రామ్‌చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూమహేశ్బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ దుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రదర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2’తో బిజీగా ఉండటం, హీరో రామ్‌చరణ్ హాలిడేస్ వంటి కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌కు కాస్త గ్యాప్ వచ్చింది. తాజాగా ఈ వారంలో షూటింగ్‌ను తిరిగి ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది యూనిట్. ఈ కొత్త షెడ్యూల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారని తెలిసింది. స్టంట్ మాస్టర్స్ అన్బు–అరివు ఈ ఫైట్‌ని డిజైన్ చేయనున్నారట. ఆల్రెడీ సినిమా క్లయిమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తయింది. తాజా యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరణతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించిన యాక్షన్ పోర్షన్స్ పూర్తవుతాయనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. -
గుంటూరు కారం నుండి థమన్ అవుట్.. అరటిపండు పోస్ట్ క్లారిటీ
-
నా బిగ్గెస్ట్ చీర్లీడర్ అంటూ ఫోటో షేర్ చేసిన సితార
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని పరిచయమే. కానీ తనకంటూ సొంతగుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అందుకేనేమో సోషల్‌మీడియాలో తనకు ఫ్యాన్స్ ఎక్కువే. తాజాగా మహేష్‌బాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా షేర్ చేసింది. (ఇదీ చదవండి: Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?) 'మా సూపర్ డాడ్, నా బిగ్గెస్ట్ చీర్లీడర్కి హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా... లవ్ యూ టు ది మూన్ ' అంటూ తెలిపింది. సితార షేర్ చేసిన ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మహేష్ బాబు తన పిల్లల కోసం ఎక్కువగానే సమయం కేటాయిస్తాడు. అందుకే ఆయనకు పిల్లలతో ప్రత్యేకమైన బాండింగ్ ఉంటుంది. దీంతో టాలీవుడ్లో మహేష్‌కు ఫ్యామిలీ మ్యాన్‌గా గుర్తింపు ఉంది. సినిమా విషయానికి వస్తే గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా గ్లామర్ క్లిక్ అవుతుందా?) -
మహాభారతం పై రాజమౌళి కామెంట్స్ వైరల్
-
అమ్మాయిలకు హీట్ వేవ్ అలర్ట్.. కొత్త గ్రీకువీరుడు వస్తున్నాడు
-
శాకుంతలం సినిమాలో మహేష్ బాబు కూతురిని కాకుండా అల్లు అర్జున్ కూతురిని ఎందుకు తీసుకున్నామంటే..
-
ఏటా 40 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల విభాగం వచ్చే పదేళ్లలో ఏటా సుమారు 40% మేర వృద్ధి చెందవచ్చని అంచనా వేస్తున్నట్లు స్విచ్ మొబిలిటీ సీఈవో మహేశ్ బాబు తెలిపారు. గతేడాది 1,200 ఎలక్ట్రిక్ బస్సులు రిజిస్టర్ కాగా, ఈసారి 2,000 దాటేయొచ్చని చెప్పారు. వచ్చే ఏడాది ఇది 6,000కు చేరవచ్చని సాక్షి బిజినెస్ బ్యూరోకు వివరించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సు తయారీ వ్యయం సగటున రూ. 1.5 కోట్ల స్థాయిలో ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సానుకూల పాలసీలు ఇందుకు తోడ్పడగలవని ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకోవడంపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని మహేష్ బాబు చెప్పారు. తమ సంస్థ విషయానికొస్తే.. ఇప్పటికే 500 పైచిలుకు బస్సులు సరఫరా చేశామని, వచ్చే 12–18 నెలల్లో సుమారు 2,600 బస్సులు అందించనున్నామన్నారు. తెలంగాణకు దాదాపు 1,000 బస్సులు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తయారు చేస్తున్నది తమ కంపెనీ మాత్రమేనని, హెచ్ఎండీఏకి 6 అందిస్తున్నామని తెలిపారు. -
వెబ్సైట్ ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాం: సితార
మహేశ్ బాబు గారాల కూతురు సితార టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో చురుక్కుగా ఉంటున్నారు సితార. అయితే చిన్నపిల్లల కోసం మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభిస్తున్నట్లు సితార సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. తన వంతుగా నా పాకెట్ మనీ డొనేట్ చేస్తున్నట్లు సితార ప్రకటించింది. ఈ నూతన సంవత్సరంలో మా అధికారిక వెబ్సైట్ http://maheshbabufoundation.org ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాం అని సితార వెల్లడించింది. ఫౌండేషన్ తరఫున అందరికీ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది సితార. In our endeavour to create a world where children survive and thrive, we are happy to be launching our official website this New Year! https://t.co/jY6B4gXMPd For the children...to the children ❤️#MBFoundation wishes you all a happy new year 2023!@urstrulymahesh pic.twitter.com/MdOhnee1sr — Mahesh Babu Foundation (@MBfoundationorg) January 1, 2023 -
SVP Success Meet Kurnool: కర్నూలులో ‘సర్కారు వారి పాట’ విజయోత్సవ సభ
-
Keerthi Suresh: నా దృష్టిలో ఆ రెండూ కష్టం!
కీర్తీ సురేష్ అంటే సంప్రదాయబద్ధమైన పాత్రలకు చిరునామా అన్నట్లు ఉంటారు. కానీ ఆర్టిస్ట్ అంటే అన్ని రకాల పాత్రలు చేయాలన్నది కీర్తి అభిప్రాయం. అందుకే ‘సర్కారువారి పాట’లో కళావతి పాత్ర అంగీకరించారు. ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై కనిపించనంత గ్లామరస్‌గా, మాస్‌గా ఈ సినిమాలో కనిపిస్తా’’ అంటున్నారు కీర్తి. పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదల సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు. ► ‘గుడ్ లక్ సఖి’, తమిళ చిత్రం ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’), మధ్యలో ‘పెద్దన్న’లో రజనీకాంత్ చెల్లెలి పాత్ర. వీటికి భిన్నంగా ‘సర్కారువారి పాట’లో కనిపించడం గురించి? ‘సర్కారువారి పాట’లో మాస్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తాను. కాస్ట్యూమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. హెయిర్ స్టయిల్ కూడా భిన్నంగా ఉంటుంది. మేకప్ కొత్తగా ఉంటుంది. ఈ తేడా నాకు చాలా నచ్చింది. నాది సరదా పాత్ర. ఇప్పటివరకూ తెలుగులో చేసిన పాత్రలన్నింటికన్నా భిన్నంగా ఉంటుంది. ► అందుకేనేమో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ‘కళావతి..’ (‘సర్కారువారి పాట’లో కీర్తి పాత్ర) నాకు మంచి గిఫ్ట్ అన్నారు. అవును. రేపు సినిమా చూశాక నాకు ఈ పాత్ర మంచి బహుమతి అని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. తమిళంలో చేశాను కానీ తెలుగులో ఇప్పటివరకూ ఇలాంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. ► మరి.. ‘మహానటి’ లాంటి భారీ పాత్ర చేసిన మీకు ‘కళావతి’లాంటి మాస్ క్యారెక్టర్ చేయడం ఈజీ అయ్యుంటుందనుకోవచ్చా? లేదు. కళావతి కూడా చాలెంజింగ్ రోలే. ఈ పాత్రలో ఫన్ ఉంది. నా దృష్టిలో ఏడిపించడం, నవ్వించడం చాలా కష్టం. ఈ రెండూ పెద్ద సవాల్. పైగా డైలాగ్ డెలివరీ డిఫరెంట్‌గా ఉంటుంది. పరశురాంగారి హెల్ప్‌తో డబ్బింగ్ చెప్పాను. ఏ పాత్ర సవాల్ దానికి ఉంటుంది. ‘మహానటి’ సవాల్ ‘మహానటి’ది.. కళావతి సవాల్ కళావతిది. అంతే.. ► ‘లవ్ ట్రాక్’ కోసమే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ సినిమా చూస్తారని మహేశ్‌బాబు అన్నారు... సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. కథతో పాటు ఈ ట్రాక్ ఉంటుంది. ఇలా లవ్ ట్రాక్ చేయడం నాకు ఫ్రెష్‌గా అనిపించింది. ► ఈ మధ్యే ‘చిన్ని’లో డీ గ్లామరస్‌గా కనిపించి, వారం తిరిగే సరికల్లా గ్లామరస్‌గా కనిపించడం గురించి.. ‘చిన్ని’లో సాదా సీదా బట్టలు, చింపిరి జుట్టుతో, చెవికి పోగులు కూడా లేకుండా కనిపిస్తాను. ఆ సినిమా విడుదలై వారం అయింది. వెంటనే ‘సర్కారువారి పాట’లో ఆ పాత్రకు భిన్నంగా గ్లామరస్‌గా కనిపించనున్నాను. ఇలా వెంట వెంటనే రెండు పూర్తి భిన్నమైన పాత్రల్లో కనిపించడం అనేది పెద్ద సవాల్. ఇలాంటి చాలెంజ్‌లు నాకిష్టం. ► తమిళంలో మాస్ సాంగ్స్‌కి డాన్స్ చేశారు.. ఇప్పుడు ‘మ..మ.. మహేశా..’ పాటకు మాస్ స్టెప్స్ వేయడం ఎలా అనిపించింది? ఈ పాట చాలా ఇష్టపడి చేశాను. ‘మ..మ.. మహేశా..’ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ సాంగ్. థియేటర్ అదిరిపోతుంది. సీట్లలోంచి లేచి మరీ ఫ్యాన్స్ డాన్స్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి మాస్ సాంగ్స్ తమిళ్లో చేశాను. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. ► ‘మహానటి’తో అందరూ మిమ్మల్ని మహానటి అన్నారు. ‘సర్కారు వారి..’తో మాస్ హీరోయిన్ అంటారా? ఏమో.. నిజానికి ‘మహానటి’కి చాన్స్ వచ్చినప్పుడు నేనలాంటి సినిమా చేయగలనని అనుకోలేదు... చేసేశా. ఇప్పుడు ‘సర్కారువారి..’లో మంచి మాస్ పాత్ర చేశాను. ఒక ఆర్టిస్ట్‌గా ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలి. అప్పుడే పరిపూర్ణత ఉంటుంది. ► ‘పెద్దన్న’లో రజనీకాంత్ చెల్లెలిగా, ఇప్పుడు ‘బోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలిగా చేశారు. చెల్లెలి పాత్రలు చేస్తే అలాంటివే వస్తాయేమో అనే టెన్షన్ లేదా? అలా ఆలోచించలేదు. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం సరి కాదనిపించింది. పైగా రజనీ సార్‌తో చాన్స్ దొరకడం కష్టం. అలాగే చిరంజీవి సార్‌తో. ఈ పాత్రలను ఇష్టపడి చేశాను. -
వైఎస్ఆర్గారిని చూస్తే హీరో ఫీలింగ్
‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిగారి అభిమానిని నేను. ఆయన్ని చూస్తే ఒక హీరో అనే అనుభూతి కలుగుతుంది. ఆయన వద్దకు ఏదైనా సమస్యని తీసుకెళితే ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ భరోసా ఇచ్చేవారు. ‘సర్కారువారి పాట’లో అలాంటి ఒక సందర్భంలో మహేశ్‌గారు ఆ డైలాగ్ చెబుతున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు’’ అని పరశురాం అన్నారు. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పరశురాం మీడియాతో పంచుకున్న విశేషాలు. ‘గీత గోవిందం’ నిర్మాణంలో ఉన్నప్పుడే ‘సర్కారువారి పాట’ ఐడియా వచ్చింది. ‘గీత గోవిందం’ హిట్ నాకు గొప్ప ఎనర్జీ ఇచ్చింది. పరశురాం అనే దర్శకుడు రూ. 150కోట్ల సినిమా తీయగలడనే నమ్మకాన్ని ఇండస్ట్రీకి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇక ‘గీత గోవిందం’ విడుదలయ్యాక మహేశ్‌గారిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్ చేశాను. ఈ చిత్రంలో బ్యాంక్ టాపిక్ ఉంటుంది కానీ మహేశ్‌గారు బ్యాంక్ ఉద్యోగి కాదు. ఈ సినిమాలో ఒక వ్యక్తి గురించి కానీ, వ్యవస్థని ప్రశ్నించడం కానీ ఉండవు. నా కల తీరింది మహేశ్‌గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ‘సర్కారువారి పాట’ ఆయన కోసం రాసిన కథ. దేవుడి దయ వల్ల ఆయనే చేయడంతో నా కల తీరింది. ఈ కథని అల్లు అర్జున్‌గారికి చెప్పలేదు. ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఉన్నప్పటికీ నాలాంటి ఒక మీడియమ్ రేంజ్ దర్శకుడికి మహేశ్‌గారు చాన్స్ ఎలా ఇచ్చారనే ప్రశ్న కొందరిలో ఉండొచ్చు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీలవుతారు. నేను చెప్పిన కథ నచ్చే మహేశ్‌గారు ‘సర్కారువారి పాట’కి పచ్చజెండా ఉపారు.‘పోకిరి’ ఒక అండర్ కాప్ బిహేవియర్. ‘సర్కారువారి పాట’ ఒక కామన్‌మేన్ బిహేవియర్. ఇందులో మహేశ్‌గారి మ్యానరిజమ్స్, లుక్స్, బాడీ లాంగ్వేజ్, డాన్స్‌లు చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతారు. కీర్తి పాత్ర లవ్లీగా ఉంటుంది ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి కీర్తీ సురేష్ తప్ప మరో ఆలోచన రాలేదు. తనది బలమైన పాత్ర. లవ్లీగా, లైవ్లీగా ఉంటుంది. ఆమె పాత్రకు కూడా మంచి పేరొస్తుంది. సముద్ర ఖని పాత్ర అద్భుతంగా ఉంటుంది. పూరీగారు అభినందించారు మా గురువు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్‌గార్ల సినిమాలన్నీ చూస్తాను. అందుకేనేమో డైలాగులు బాగా రాయగలుగుతున్నాను. ‘సర్కారువారి..’ ట్రైలర్ చూసి పూరీగారు అభినందించారు. నెక్ట్స్ నాగచైతన్యతో... ‘పెన్నీ...’ సాంగ్ ప్రమోషన్లో సితార డాన్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘సర్కారువారి పాట’ని పాన్ ఇండియాగా చేయాలనే ఆలోచన నాకు కానీ, మహేశ్‌గారికి కానీ లేదు. ముందు అనుకున్నట్లే చేశాం. అన్ని చోట్లా తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతుంది. నా తర్వాతి సినిమా నాగచైతన్య హీరోగా 14 రీల్స్ నిర్మాణంలో ఉంటుంది. -
కళావతి పాట రచయిత అనంత శ్రీరామ్ సర్కారు వారి పాట గురించి..
-
మహేష్ బాబుకు సడన్ సర్ప్రైజ్
విమానాశ్రయం(గన్నవరం): సినీ నటుడు మహేష్‌బాబుకు గురువారం చిరంజీవి, ప్రభాస్, దర్శక, నిర్మాతలు ఎస్ఎస్.రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్‌రెడ్డి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. 17వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మహేష్‌బాబుకు వీరంతా శుభాకాంక్షలు తెలియజేశారు. రొటీన్‌కు భిన్నంగా ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో వారు మహేష్‌బాబుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ నిమిత్తం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సమయంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. వీరి సడన్ సర్ప్రైజ్తో మహేష్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. -
సరికొత్త వీడియోతో.. రాకింగ్ స్టార్ డాటర్స్..
సాక్షి, హైదరాబాద్: ‘ఏ అండ్ ఎస్' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న లిటిల్ రాక్ స్టార్స్ తాజా వీడియోతో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నారు. ఇటీవల గోవా హాలిడే ట్రిప్‌లో ఎంజాయ్ చేసిన ఈ పిడుగులిద్దరూ తమదైన శైలిలో ఒక వీడియోను తీసుకొచ్చారు. ఇంతకీ ఆ పిడుగులు మరెవ్వరో కాదు స్టార్ డాటర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార, స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య. ఈ తాజా వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విటర్లో షేర్ చేశారు. To how it all began! My favourite duo is back.. taking us through Goa this time! Loved the video as always! Rock on my girls 🤗🤗🤗 #AadyaAndSitara pic.twitter.com/XS4MELMEbU — Mahesh Babu (@urstrulyMahesh) August 28, 2021 -
‘సర్కారువారి పాట’..షూటింగ్ ఎప్పుడంటే..
కోవిడ్ బ్రేక్ తర్వాత సినిమా షూటింగ్‌లు మొదలయ్యాయి. మరి.. మహేశ్‌బాబు సెట్స్‌లోకి అడుగుపెట్టేది ఎప్పుడు? అంటే.. ఈ నెల 12న. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కోవిడ్ బ్రేక్‌కి ముందు ఈ సినిమా షూటింగ్ జోరుగా జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే స్పీడ్‌తో షూటింగ్‌కి రెడీ అవుతోంది ఈ చిత్రబృందం. 12 నుంచి నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరపడానికి ప్లాన్ చేశారు. సోమవారం నుంచి మహేశ్‌బాబుతో పాటు సినిమాలోని కీలక తారాగణం చిత్రీకరణలో పాల్గొంటారు. టాకీ సీన్స్‌తో పాటు ఒక ఫైట్‌ని కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. కాగా, విదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. ఈ ఫారిన్ షెడ్యూల్ సెప్టెంబర్‌లో ఆరంభమయ్యే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. -
పచ్చందనమే పచ్చదనమే... తారలు ఏమంటున్నారంటే?
పర్యావరణాన్ని పరిరక్షించేది చెట్లే... చుట్టూ పచ్చని చెట్లు ఉంటే ఆహ్లాదానికి ఆహ్లాదం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పచ్చందమనే పచ్చదనమే.. అంటూ ఉల్లాసంగా ఉండొచ్చు. శనివారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు ప్రముఖ తారలు. ‘‘పర్యావరణం రోజు రోజుకు మరింత నాశనం అవుతోంది. ఈ సందర్భంగా పర్యావరణ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించడానికి ఈరోజు అందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన భూ గ్రహాన్ని పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం’’ అని పేర్కొన్నారు మహేశ్‌బాబు. హీరో అల్లు అర్జున్ తన ఇంటి వద్ద మొక్కను నాటి, నీళ్లు పోస్తున్న ఫొటోని ట్విట్టర్లో షేర్ చేసి, ‘‘భూమిని రక్షించుకునేందుకు మనందరం మొక్కలు నాటుదామని, పర్యావరణాన్ని కలుషితం చేయని అలవాట్లను అలవరుచుకుంటామని, భవిష్యత్తు తరాల కోసం మన భూమిని పచ్చదనంగా మార్చుదామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం’’ అన్నారు. ‘‘మనకు ఉన్న ఏకైక ఇల్లు భూమి. అలాంటి భూమిని నాశనం చేయడం ఆపేసి బాగు చేయడానికి సమయం కేటాయిద్దాం.. మనందరం చేతులు కలిపి మన ఇంటిని రక్షించుకుందాం’’ అని పోస్ట్ చేశారు సాయి తేజ్. ‘‘ప్రకృతి చేతుల్లోనే మనందరి ఆనందం, శాంతి దాగి ఉన్నాయి. అందుకే ప్రకృతిని సంరక్షించుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి చాలా మాట్లాడుకుంటాం. అయితే ఆ ఒక్కరోజే కాదు.. ప్రకృతి పట్ల ప్రతిరోజూ మనందరం బాధ్యతగా ఉందాం’’ అన్నారు రాశీ ఖన్నా. -
మహేష్‌కి విలన్‌గా కన్నడ సూపర్ స్టార్?
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో విలన్ పాత్రకు ఇప్పటికే ఉపేంద్ర, సుదీప్ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యాక్టర్ అర్జున్ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రకు అర్జున్ను చిత్రయూనిట్ సంప్రదించిందని, అది విలన్ పాత్రే అని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. మరి.. ‘సర్కారువారి పాట’ చిత్రంలో విలన్‌గా అర్జున్ ఖరారవుతారా? వేచి చూడాల్సిందే. -
జక్కన్న-మహేశ్ మూవీ.. ఆ వార్తల్లో నిజం లేదు!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ ప్రతిష్టాత్మక మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత జక్కన్న, మహేశ్‌తో చేయబోయే ఈ ప్రాజెక్టుపై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి స్టోరీ లైన్‌కు సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ దక్షిణాప్రికా నేపథ్యంలో సాగే ఫారెస్ట్ అడ్వంచర్‌గా ఉండోబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం రాజమౌళి టీం ఈ మూవీ స్టోరీలైన్‌పై తీవ్ర కసరత్తులు చేస్తొందని, అనంతరం కథను ప్రకటించనున్నట్లు నిర్మాత కేఎల్ నారాయణ వెల్లడించారు. అంతేగాక ఎస్ఎస్ఎమ్బీ29 స్టోరీలైన్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంగా లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. Rajamouli & team working on a story line for #SSMB29. But, it has nothing to do with African forest backdrop or any other rumours which are being speculated in media and on social media, confirmed by Producer KL Narayana. pic.twitter.com/xIItriNnK8 — Aakashavaani (@TheAakashavaani) May 30, 2021 -
మహేశ్ 'పార్థు' మూవీ! ఫారిన్లో షూట్?
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను విదేశాల్లో జరపాలని ప్లాన్ చేస్తోందట చిత్రబృందం. కథ రీత్యా హీరో క్యారెక్టర్‌కు ఫారిన్ టచ్ ఉంటుందని సమాచారం. ఇందుకోసం యూకేలో కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట త్రివిక్రమ్. ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందు ఫారిన్ షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీకరణను మొదలు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ చేసిన ‘అతడు’లో ఆయన పాత్ర పేరు పార్థు అని గుర్తుండే ఉంటుంది. -
వేసవి రేసుకు రెడీ అంటున్న స్టార్స్ వీళ్లే..
2020, 2021... ఈ రెండేళ్లు వేసవిలో సినిమా సంబరం లేకుండాపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా గతేడాది, సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది వేసవికి సినిమాలు థియేటర్లకు రాలేదు. కానీ వచ్చే ఏడాది వేసవిలో వసూళ్ల సందడి ఉంటుందని చెప్పొచ్చు. స్టార్ హీరోల సినిమాల విడుదల ప్రకటనలు సమ్మర్‌ను టార్గెట్ చేస్తుండడమే ఇందుకు ఓ నిదర్శనం. ఇప్పటివరకూ ప్రకటించిన ప్రకారం వచ్చే వేసవి రేసుకి రెడీ అయిన స్టార్స్ ఎవరంటే... ‘బాహుబలి’ అద్భుత విజయం ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేస్తే, ‘కేజీఎఫ్’ సూపర్ హిట్టయి, అగ్ర హీరోలతో సినిమాలు చేసే దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ పేరును చేర్చింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక 11 ఏళ్ల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి చేయనున్న సినిమా ప్రకటన ఇటీవల అధికారికంగా వచ్చింది. వచ్చే ఏడాది వేసవికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇంతకుముందు మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తామని కొరటాల ఇప్పటికే వెల్లడించారు. వీరితో పాటు ఇతర స్టార్స్ కూడా సమ్మర్ రేసులో నిలవడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. మరి... ఈ కరోనా మహమ్మారి ఇంకెన్నాళ్లు ఉంటుంది? అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. -
దిల్ ఖుష్... ఫుల్ జోష్
‘అతడు’ (2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ దిల్ ఖుష్‌తో... ఫుల్ జోష్‌లో ఉన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబు తండ్రి బర్త్ డే (మే 31) సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. -
సర్కారు వారితో పాట
మహేశ్‌బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్టెప్ వేయబోతున్నారని తెలిసింది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా రూపొందనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుబాయ్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌కు ఊర్వశీ రౌటేలాను సంప్రదించారట. తమన్ అందించిన ఈ మ్యాస్ ట్యూన్‌కి మహేశ్, ఊర్వశి స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయని టాక్. -
క్లాప్ క్లాప్... సితార
తండ్రి మహేశ్‌బాబు సినిమాకి సితార క్లాప్ కొట్టింది. భర్త మహేశ్ కోసం నమ్రత కెమెరా స్విచాన్ చేశారు. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్న ‘సర్కారు వారి పాట’ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా చిత్రీకరించిన ముహూర్తం షాట్‌కి నమ్రత కెమెరా స్విచాన్ చేయగా, సితార క్లాప్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఓ గుడిలో జరిగిన ఈ వేడుకలో సితార సెంటరాఫ్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. జనవరి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించుకోనున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్. ఎస్.ఎస్, కెమెరా: మది, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట. -
డ్రగ్స్ కేసులో తెరపైకి నమ్రత పేరు
-
ముంబై డ్రగ్స్ కేసు: తెరపైకి నమ్రత పేరు
సాక్షి, హైదరాబాద్: ముంబై డ్రగ్స్ కేసులో స్టార్ హీరో మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసులో నమ్రత పేరును జాతీయ మీడియా ప్రస్తావించింది. టాలెంట్ మేనేజర్ జయ సాహాతో డ్రగ్స్ విషయమై నమ్రత చాట్ చేసినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ‘బాంబేలో మంచి ఎండీ ఇస్తావని ప్రామిస్ చేశావ్. ఎండీ ఇచ్చాక మనం కలిసి పార్టీ చేసుకుందాం’అని నమ్రత చాటింగ్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కొందరు సినీ నటులు, డ్రగ్స్ పెడ్లర్లను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారిస్తోంది. తాజాగా జయ సాహాని ఎన్సీబీ విచారిస్తుండగా నమ్రత పేరు బయటికొచ్చినట్టు సమాచారం. కొందరు సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు సాహా వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. జయసాహా సుశాంత్‌కు గతంలో టాలెంట్ మేనేజర్‌గా పని చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇదిలాఉండగా.. ముంబై డ్రగ్స్ కేసులో నటి దియా మీర్జా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్సీబీ అధికారులు దియాను, ఆమె మేనేజర్‌ను విచారణకు పిలిచే అవకాశముంది. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. దియాకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించిన డ్రగ్ డీలర్స్ ఎన్సీబీ అధికారుల విచారణలో వెల్లడించారు. (చదవండి: అక్టోబర్ 6 వరకు రియా జైల్లోనే) -
షూట్ స్టార్ట్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఆరు నెల్లల కోవిడ్ బ్రేక్ తర్వాత తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. షూటింగ్ ప్రారంభించారు. అయితే ఇది సినిమా కోసం కాదు. ఓ కమర్షియల్ యాడ్ కోసం. సినిమాలతో పాటు బ్రాండ్ అడ్వటైజ్మెంట్లు ఎక్కువగా చేస్తుంటారు మహేశ్. రెండు రోజుల పాటు జరిగే ఈ యాడ్ చిత్రీకరణలో బుధవారం పాల్గొన్నారాయన. అలాగే మహేశ్ నటించనున్న ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. -
అన్ని జీవజాతుల్ని సమానంగా చూడాలి
మెడపై రూపాయి కాయిన్ ట్యాటూ, చేతికి కట్టుకున్న తాడులో ఓమ్ లాకెట్, ఇయర్ రింగ్.. ఇలా ‘సర్కారువారి పాట’లో మహేశ్‌బాబు చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఆదివారం ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన సినిమా మోషన్ పోస్టర్ టీజర్ అంచనాలు పెంచే విధంగా ఉంది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్, 14రీల్స్ ఎంటర్టైన్మెంట్, జి. మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. అలాVó యన్టీఆర్, విజయ్, శ్రుతీహాసన్‌లకు గ్రీన్ఇండియా చాలెంజ్‌ను విసిరారు మహేశ్‌బాబు. -
ఐదు నిమిషాల్లో 346 సినిమా పేర్లు
సాక్షి, గాంధీగనర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరానికి చెందిన మున్నంగి హాసిని వయస్సు పదేళ్లు. ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో అందరినీ అబ్బురపరుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 346 చిత్రాల పేర్లను కేవలం 5 నిమిషాల వ్యవధిలో వరుస క్రమంలో చెబుతోంది చిన్నారి హాసిని. కృష్ణ తొలిచిత్రం ‘తేనె మనుసులు’ నుంచి చివరిచిత్రం వరకు నాన్ స్టాప్‌గా పేర్లు చెప్పి తన ప్రతిభను చాటుకుంది. సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయోత్సవం సందర్భంగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి 350 చిత్రాల్లో నటించారని, ఆ చిత్రాల పేర్లు వరుసగా ఎవరైనా చెప్పగలరా? అనే మహేష్ మాటలతో స్ఫూర్తి పొందిన హాసిని వారం రోజుల వ్యవధిలో సినిమా పేర్లను కంఠస్తం చేసింది. అలంకార్ థియేటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా పేర్లు చెబుతున్న చిన్నారి హాసిని పలువురి ప్రశంసలు.. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చిత్రాలను 5 నిమిషాల వ్యవధిలో చెప్పిన చిన్నారి హాసినిని పలువురు అభినందించారు. సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళి, ఆల్ ఇండియా సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాస్వామి, తాడి శివ, ఏ1 రెడ్డి, టైలర్బాబు చిన్నారిని అభినందించారు. మహేష్‌బాబుకు పుట్టినరోజు కానుకగా ఇవ్వాలనే.. : హాసిని ప్రిన్స్ మహేబాబు వెయ్యిమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. చిన్నారుల తరపున మహేష్‌బాబుకు పుట్టిన రోజు కానుకగా ఏదైనా కానుక ఇవ్వాలని భావించాను. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చిత్రాల మాలికను ఆయనకు అందిస్తున్నాను. -
సరోజ్ ఖాన్ మృతి తీరని లోటు: గుణశేఖర్
‘‘ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి భారతీయ సినిమాకే తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘చూడాలని ఉంది’ సినిమాలోని ‘ఓ మారియా.. ఓ మారియా..., అబ్బబ్బా ముద్దు..’ పాటలకు సరోజ్ ఖాన్ నృత్యరీతులు సమకూర్చారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుణశేఖర్ గుర్తు చేసుకుంటూ– ‘‘1998లో వచ్చిన ‘చూడాలని ఉంది’ సినిమా కోసం సరోజ్ ఖాన్‌గారితో కలిసి పనిచేశా. ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటను సరోజ్ ఖాన్‌గారితో చేద్దామనుకుంటున్నానని నిర్మాత అశ్వినీదత్ గారికి చెప్పగానే, నేను వెళ్లి మాట్లాడతానని చెప్పారు. అప్పటికి ఇండియాలోనే బిజీ కొరియోగ్రాఫర్ అయినప్పటికీ చిరంజీవిగారి సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యి ఒప్పుకున్నారామె. ఎందుకంటే చిరంజీవిగారు కొరియోగ్రాఫర్స్ తాలూకు ఎఫర్ట్‌ని తన డ్యాన్స్ మూమెంట్స్‌తో వందరెట్లు ఎక్కువ చేస్తారు. నేను, మణిశర్మ సినీ కెరీర్ ప్రారంభించిన తొలి రోజులు అవి. పాట వినగానే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అని సరోజ్ ఖాన్‌గారు అడిగారు. మణిశర్మ అనే అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నాను. ఆ రిథమ్స్ నచ్చి, తను భవిష్యత్తులో పెద్ద సంగీత దర్శకుడు అవుతాడన్నారు. పాటల కోసం తోట తరణిగారు వేసిన సెట్‌ని బాగా లైక్ చేశారు. ‘చూడాలని ఉంది’ నా నాలుగో సినిమా. కెరీర్ తొలినాళ్లలోనే మెగాస్టార్‌గారితో సినిమా అంటే అదొక అచీవ్మెంట్. క్యాస్టింగ్, కెమెరా, ఆర్ట్ మీద నేను పెట్టిన శ్రద్ధని ఆమె మెచ్చుకొని నన్ను చాలా ప్రోత్సహించారు. ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటని మా టీమ్ ఎంజాయ్ చేస్తూ చేశాం. ఆ పాటను ప్రేక్షకులు మాకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఆ పాటకి సరోజ్ ఖాన్‌గారికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్‌ని ఎంత బాగా కంపోజ్ చేస్తారో ఎక్స్‌ప్రెషన్స్‌ని కూడా అంతే బాగా క్యాప్చర్ చేస్తారు. దాంతో ‘అబ్బబ్బా ముద్దు..’ పాటను కూడా ఆమెతోనే కొరియోగ్రఫీ చేయించాం. ఆ పాటలో సౌందర్యగారి ఎక్స్‌ప్రెషన్స్‌కి, చిరంజీవిగారి గ్రేస్ మూమెంట్స్‌కి ప్రేక్షకులు మరోసారి అంతే గొప్ప అనుభూతికి లోనయ్యారు. ఆ పాట అప్పటికి ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది.. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పటికే లెజెండరీ కొరియోగ్రాఫర్ అయిన సరోజ్ ఖాన్‌గారు కొత్తవారికి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది’’ అన్నారు. ప్రముఖ నృత్యదర్శకురాలు సరోజ్ ఖాన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తపరిచారు ► ఒక శకం ముగిసింది. ఇండస్ట్రీలోకి రాబోతున్న కొత్తతరం వారికి ఆమె ప్రతిభ ఓ ప్రేరణలా ఉంటుంది. – మహేశ్‌బాబు ► ఒక లెజెండరీ కొరియోగ్రాఫర్ ఇక లేరు. ఆమె నా తొలి కొరియోగ్రాఫర్ (చిరంజీవి ‘డాడీ’లో అల్లు అర్జున్ ఓ డ్యాన్స్ సీక్వెన్స్‌లో కనిపిస్తారు). ఎంతో విలువైన ఓ వజ్రంలాంటి వ్యక్తిని భారతీయ సినీ పరిశ్రమ కోల్పోయింది. – అల్లు అర్జున్ ► ఎంతో సునాయాసంగా డ్యాన్స్ చేయగల గొప్ప ప్రతిభావంతురాలు సరోజ్ ఖాన్‌గారు. ‘మేరా పతీ సిర్ఫ్ మేరా హై’ చిత్రంలో ఆమెతో కలిసి పని చేశాను. తన ఊహల్లోని విజువల్స్‌లోకి యాక్టర్స్‌ను తీసుకెళ్లగల ఆమె శైలి గొప్పది. – రాధికా శరత్‌కుమార్ ► సరోజ్ ఖాన్‌గారి మరణవార్త నా హృదయాన్ని ముక్కలు చేసింది. నేను చేసిన, నాకు నచ్చిన, నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన ఎన్నో పాటల వెనక దాగి ఉన్న ఓ లెజెండ్ సరోజ్ మేడమ్. ఇండస్ట్రీకి ఆమె చేసిన కృషి ఎప్పటికీ నిలిచిపోతుంది. – వేదిక ► సరోజ్ ఖాన్‌గారి మరణవార్త విని నా హృదయం బద్దలైంది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ నాకెంతో స్ఫూర్తినిచ్చాయి. – తమన్నా ► సరోజ్‌ఖాన్ జీతో కలిసి పనిచేయడాన్ని ఓ అదృష్టంగా భావిస్తున్నాను. – ప్రియమణి ► సినిమాలోని పాత్ర కోసం ఒక డ్యాన్సర్‌గా డ్యాన్స్‌లో మునిగి ఎలా మైమరచిపోవాలో నాకు గంటలకొద్దీ పాఠాలు చెప్పారామె. సినిమా పరిశ్రమలో నా తొలి గురువు సరోజ్ ఖాన్. నన్నెంతో ప్రేమగా చూసుకున్న ఆమె నాకెంతో ప్రత్యేకం. ఆమె ఆత్మకు అల్లా దీవెనలు ఉండాలి. – షారుక్ ఖాన్ ► సరోజ్ ఖాన్ మనతో లేరనే చేదు వార్తతో శుక్రవారం నిద్రలేచాను. ఆమె శిక్షణలో చాలా ఈజీగా ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చని నిరూపించారు. సరోజ్ ఖాన్ మరణం బాలీవుడ్ చిత్రపరిశ్రమకు తీరని లోటు. – అక్షయ్‌కుమార్ ► ఒక చరిత్ర అంతరించిపోయింది. సరోజ్ ఖాన్ మరణం వ్యక్తిగతంగా నాకు చాలా పెద్ద నష్టం. మన ముక్తా ఆర్ట్స్ (సుభాష్ నిర్మాణ సంస్థ) ఫ్యామిలీ అంతా నువ్వే ఉన్నావు. మాధురీ దీక్షిత్, మీనాక్షీ శేషాద్రి, మనీషా కొయిరాల, ఐశ్వర్యా రాయ్‌లు స్టార్స్‌గా ఎదగటానికి నాతో పాటు నువ్వు ఎప్పుడూ ఉన్నావు. డ్యాన్స్ ఉన్నంతకాలం భారతీయ చిత్ర పరిశ్రమలో బతికే ఉంటావు. – సుభాష్ ఘాయ్ ► సరోజ్‌జీ.. నాతో పాటు ఎంతోమంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పరిశ్రమలోకి వచ్చాం. మీ డ్యాన్స్ నైపుణ్యానికి అభినందనలు. – ఫరాఖాన్ ► నిద్ర లేవటంతోనే ఇంతటి హృదయవిదారకమైన బాధను మోయాల్సి వస్తుందనుకోలేదు. మీ మరణవార్త విని తట్టుకోలేకపోయాను. మీకు మీరే ఒక శిక్షణాలయం లాంటివారు. మన డ్యాన్సర్స్ అందరికీ మీ మరణం చాలా పెద్ద లాస్. మీ శిష్యుల్లో ఒకడిగా, మీతోపాటు డ్యాన్సర్‌గా, మీతో కొరియోగ్రాఫర్‌గా, మీరు కొరియోగ్రాఫర్‌గా నేను డైరెక్టర్‌గా మిమ్మల్ని డైరెక్ట్ చేయటం.. ఇవన్నీ నా జీవితంలో జరిగిన అద్భుతాలు. డ్యాన్స్ చేసేటప్పుడు మీ కళ్లల్లో కనబడిన మెరుపు వృత్తిపట్ల మీకున్న ప్రేమను తెలియజేసేది. మీ దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. అందుకే మిమ్మల్ని, మీ జ్ఞాపకాలను నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. – రెమో డిసౌజా ► డ్యాన్స్‌లో నా ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించటానికి నాకెంతో సాయం చేసిన సరోజ్ ఖాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఓ అగ్రశ్రేణి ప్రతిభాశాలిని భారతీయ సినిమా పరిశ్రమ కోల్పోయింది. – మాధురీ దీక్షిత్ ► మీతో పనిచేసే అవకాశం నాకు దక్కినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు. అది నా అదృష్టం. మీరు లేని లోటుని భర్తీ చేసే బలాన్ని మీ కుటుంబానికి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. – జెనీలియా ► మీ డ్యాన్స్ డైరెక్షన్లో డ్యాన్స్ చేయటం ప్రతి ఒక్క నటి కల. వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాను సరోజ్‌జీ. – కాజల్ అగర్వాల్ ► ‘చూడమ్మా.. నీకేం కావాలో అది సాధించాలంటే దాని మీద దృష్టి సారించి నీ ప్రతిభను మొత్తం ప్రదర్శించు’’ అని ఓ సందర్భంలో మీరు (సరోజ్ ఖాన్) నాతో అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. – హన్సిక ► దేవుడా.. ఈ ఏడాది ఇక ఏ విషాద వార్తనూ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను. మీ కొరియోగ్రఫీలో ఒక్క పాట అయినా చెయ్యాలని కలలు కనేదాన్ని. అది నెరవేరనందుకు బాధగా ఉంది. – రకుల్‌ప్రీత్ సింగ్ -
‘సరిలేరు నీకెవ్వరు’ గురించి కృష్ణ..
తన కుమారుడు మహేష్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గురించి సూపర్ కృష్ణ స్పందించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దర్శక, నిర్మాతలు ‘ బ్లాక్ బస్టర్ కా బాప్’ అని హెడ్డింగ్ పెట్టి ప్రచారం చేయడం బాగుందన్నారు. ఈ సినిమా ఇంకా మరికొన్ని రోజులు ఆడుతుందని, మరిన్ని వసూళ్లు సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చాలా బాగుందని, నిర్మాతలు రాజీలేకుంగా నిర్మించారని మెచ్చుకున్నారు. ఎక్కడా బోరు కొట్టకుండా సినిమాను దర్శకుడు అనిల్ రవిపూడి తెరకెక్కించారని కృష్ణ ప్రశంసించారు. తన తండ్రి మాటలపై మహేష్‌బాబు స్పందిస్తూ.. ‘థ్యాంక్యూ మై సూపర్‌స్టార్.. సరిలేరు నీకెవ్వరు’ అంటూ ట్వీట్ చేశారు. తమ సినిమాను సూపర్ స్టార్ మెచ్చుకోవడం పట్ల నిర్మాత అనిల్ సుంకర సంతోషం వ్యక్తం చేశారు. మూడు తరాలు కలిసి నటించే సినిమా కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు. జనవరి 11న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలబడి మంచి వసూళ్లు రాబట్టింది. (చదవండి: సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ) Superstar Krishna Garu About#SarileruNeekevvaru #BlockBusterKaBAAP @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP @RathnaveluDop#AllTimeBlockBusterSLN 💥💥 pic.twitter.com/va6S19rZPq — Team Mahesh Babu (@MBofficialTeam) January 31, 2020 -
పార్టీ టైమ్
టాలీవుడ్‌లోని కొందరు అగ్రతారలు దర్శకుడు వంశీ పైడిపల్లి సతీమణి మాలిని బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సందడి చేశారు. ఈ వేడుకల్లో మహేశ్‌బాబు, ఎన్టీఆర్ తదితర తారలు పొల్గొ న్నారు. ‘‘మై డియర్ ఫ్రెండ్ మాలిని పైడిపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు. క్లోజ్ ఫ్రెండ్స్’’ అంటూ ఇక్కడున్న ఫొటోను షేర్ చేశారు మహేశ్ సతీమణి నమ్రత. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌కి కాస్త బ్రేక్ వచ్చి పదిరోజుల హాలిడే ట్రిప్‌ను ప్లాన్ చేశారట మహేశ్. ఇక ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘బృందావనం’ చిత్రానికి వంశీపైడిపల్లే దర్శకుడు అనే విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ విధంగా ఎన్టీఆర్‌తోనూ వంశీకి మంచి అనుబంధం ఉంది. ‘మున్నా, ఎవడు, ఊపిరి’ వంశీ దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు. -
సరదాగా.. సందడిగా
ఏ పండగైనా మాకు పండగే అన్నట్లు కొందరు సినిమా స్టార్స్ క్రిస్మస్ పండగ చేసుకున్నారు. ఆ ఆనందాన్ని కెమెరాలో క్లిక్‌మనిపించి, ఆ ఫొటోలను షేర్ చేశారు. క్రిస్మస్ తాత గుబురు గడ్డాన్ని సరదాగా నిమురుతున్న మహేశ్‌బాబు ఫొటోను ఆయన సతీమణి నమ్రత షేర్ చేశారు. భార్యాపిల్లలు విరానికా, అరియానా, వివియానా, అవ్రామ్ భక్త మంచులతో విష్ణు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. సమంత, నాగచైతన్య పండగ వేళ ఒక ఫొటోను బయటపెట్టారు. ఇక శ్రుతీహాసన్ అయితే తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. ‘మహానటి’ కీర్తి సురేశ్‌ని చూశారా.. క్రిస్మస్ ట్రీ పక్కన కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నారు. పండగ సందర్భంగా సుశాంత్ కూడా ఓ ఫొటో పంచుకున్నారు. అమలా పాల్ని చూశారుగా.. పండగ సందడి తనలో బాగా కనిపిస్తోంది కదూ. అలాగే నాగార్జున, రామ్‌చరణ్, సుధీర్‌బాబు, ఈషా రెబ్బా, కాజల్ అగర్వాల్, త్రిష వంటి తారలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అటు ఉత్తరాదిన అమితాబ్, షారుక్ ఖాన్, అర్జున్ కపూర్, ఆలియా భట్ తదితరులు కూడా ‘హ్యాపీ క్రిస్మస్’ అన్నారు. పెళ్లయ్యాక ప్రియాంకా చోప్రా చేసుకున్న తొలి పండగ క్రిస్మస్. భర్త నిక్ జోనస్‌తో కలసి క్రిస్మస్ కోసం భారీగానే షాపింగ్ చేశారామె. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నెక్ట్స్ షెడ్యూల్ జనవరిలో ప్రారంభం కానుంది. పొల్లొచ్చిలో స్టార్ట్ అవుతుందని సమాచారం. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. చిరంజీవి కుటుంబానికి ఈ క్రిస్మస్ పండగ ఎప్పటికీ స్పెషల్‌గా ఉండిపోతుంది. ఎందుకంటే, ఆయన చిన్న కుమార్తె శ్రీజ మంగళవారం ఓ పాపకు జన్మనిచ్చారు. శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. పాప పుట్టిన విషయాన్ని కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. -
సితార, గౌతమ్‌ల చర్చలు ఫలించేనా..?
సూపర్ స్టార్ మహేష్‌బాబుకు తన కుటుంబం ముఖ్యంగా పిల్లలతో గడపడం చాలా సరదా అనే సంగతి తెలిసిందే. షూటింగ్‌ల నుంచి ఏ మాత్రం విరామం దొరికిన పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు ఈ రాజకుమారుడు. గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ ఆయన సతీమణి నమ్రతనే పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని.. తనకు అవకాశం వస్తే పిల్లలను స్కూల్‌కి కూడా పంపించనని చెప్పిన సంగతి తెలిసింది. అంతేకాక మహేష్ తన పిల్లలను బాగా గారాబం చేస్తుంటారు. ఈ విషయాన్ని నిరూపించే ఫోటో ఒకదాన్ని నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దానితో పాటు ‘ఘర్ ఘర్ కి కహానీ(ప్రతి ఇంటిలో జరిగేదే).. పిల్లలు అడిగిన దానికి తల్లి ఒప్పుకోకపోతే వెంటనే జరిగే పని వెళ్లి వాళ్ల నాన్నను కాకా పట్టడం’ అనే సందేశాన్ని కూడా జత చేశారు. Striking deals with the dad !! As mom said NO🤣🤣 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Aug 15, 2018 at 6:02am PDT నమ్రత షేర్ చేసిన ఫోటోలో సితార, గౌతమ్‌లు మహేష్‌బాబుతో ఏదో విషయం గురించి సీరియస్‌గా చర్చిస్తోన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో తీసిన ఈ ఫోటోలో మహేష్ తన కుటుంబంతో కలిసి మళ్లీ ఎక్కడికో విహారానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారు ఎక్కడికి వెళ్తున్నారు.. ఇంతకు సితారా, గౌతమ్ ఏ విషయం గురించి వాళ్ల నాన్నతో చర్చిస్తున్నారనే విషయాల గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు. అలానే మహేష్ బాబు, ఆయన పిల్లలకు మధ్య డీల్ కుదిరిందా లేదా అనే విషయం గురించి కూడా తెలియలేదు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటిస్తోన్న 25వ చిత్రం మహర్షి. 2019 సమ్మర్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. -
'ఆ అమ్మాయి అంతగా నటించాల్సిన అవసరం లేదు'
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి టీజర్ అభిమానులనే కాదు సినీ తారలనూ సర్ప్రైజ్కు గురిచేసింది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా గత రాత్రి టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. గురువారం టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీట్ రిషి అన్న కాప్షన్‌తో.. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్న మహేష్.. అమ్మాయిలును ఓరకంటగా చూస్తూ వెళ్తున్న టీజర్ ఆకట్టుకునేలా ఉంది. మహర్షి టీజర్ చూసిన సుధీర్ ట్విట్టర్లో స్పందించారు. 'సినిమాకు తగ్గట్టుగా ప్రతి క్యారెక్టర్లో మహేష్ పరకాయ ప్రవేశం చేస్తూ కొత్తగా కనిపిస్తారు. అంతకుమించి ఈ టీజర్లో మహేష్ ఫ్రెష్‌గా, ఫ్లర్టేషియస్‌గా కనిపించి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇదే టీజర్లో నన్ను సర్ప్రైజ్ చేయని మరో విషయం కూడా ఉంది. అదేంటంటే టీజర్లో కనిపించిన అమ్మాయి నటించకుండా ఉండాల్సింది. ఎందుకంటే మహేశ్‌ను చూడగానే ఏ అమ్మాయికైనా ఆ ఎక్స్ప్రెషన్స్ సహజంగానే వచ్చేస్తాయి' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పటివరకు ఏ దర్శకుడు చూపించలేని విధంగా సూపర్‌స్టార్ లుక్‌ను కొత్తగా చూపించారని దర్శకుడు వంశీపైడిపల్లిని సుధీర్ అభినందిస్తూ, చిత్రం ఘనవిజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. సుధీర్ బాబు నటిస్తున్న'నన్ను దోచుకుందువటే' టీమ్ తరపున మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహర్షి టీజర్లో దేవీ మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్‌గా ఉంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
మళ్లీ కలిశారు
మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ మళ్లీ కలిశారు. రీసెంట్గా మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం ‘భరత్ బహిరంగ సభ’ సందర్భంగా ఈ ముగ్గురు స్టార్లు కలిసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ దర్శకుడు వంశీ పైడిపల్లి బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఇలా టాప్ హీరోలందరూ విభిన్న సందర్భాలలో ఒకే ఫ్రేమ్‌లోకి రావడం ఇండస్ట్రీలోని మంచి వాతావరణానికి సంకేతమని ఇండస్ట్రీ వాసులు అనుకుంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో ఎన్టీఆర్, ‘ఎవడు’ సినిమాలో రామ్‌చరణ్ ఇప్పుడు తాజా సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బృందావనం, ఎవడు, ఊపిరి’ వంటి విజయాలతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ పూజా హెగ్డేలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
స్పెషల్ సాంగ్!
మహేశ్‌బాబు సినిమాల్లో ఉన్న స్పెషల్ సాంగ్స్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండటమే కాదు ఫుల్ ఫేమస్ కూడా. ఆయన హీరోగా నటించిన ‘పోకిరి’ సినిమాలో ‘ఇప్పటికింకా నా వయసు...’, ‘దూకుడు’ సినిమాలో ‘ఆటో అప్పారావు...’, ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో ‘లండన్ బాబులు’, ‘ఆగడు’లో ‘జంక్షన్లో..’ పాటలే అందుకు ఉదాహరణ. తాజాగా మహేశ్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్’ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘అల్లరి’ నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఓన్లీ కాలేజ్‌లోనే మహేశ్ గడ్డం లుక్‌లో కనిపిస్తారట. ఆఫ్టర్ కాలేజీ సీన్స్ రెగ్యులర్ లుక్‌లోనే మహేశ్ కనిపిస్తారని టాక్. ఈ సినిమా సెకండాఫ్‌లోనే ఐటమ్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ ఐటమ్‌సాంగ్ ట్రాక్‌ను ఫైనలైజ్ చేశారని టాక్. ఇందుకోసం టాప్ కథానాయికల లిస్ట్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. మరి.. ఈ స్పెషల్ సాంగ్ చేయబోయే స్పెషల్ గాళ్ ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం కాస్త టైమ్ పడుతుంది. అంతేకాక ‘ఆగడు’ సినిమా తర్వాత మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను’ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లేవు. మళ్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగేళ్ల తర్వాత స్పెషల్ సాంగ్ అనగానే అది ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి ఇప్పటి నుంచే ఫ్యాన్స్‌లో మొదలైంది. ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. -
స్క్రీన్ ప్లే 22nd June 2018
-
సినిమా కష్టాలు
-
‘భరత్’ రికార్డుల వేట!
సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా అంటే రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. శ్రీమంతుడు సినిమా నాన్ బాహుబలి రికార్డులను సాధిస్తే... తరువాత రిలీజైన రెండు సినిమాలు ఆశించినంతగా విజయం సాధించలేదు. అయితే ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో మళ్లీ కొరటాల శివతో కలిసి భరత్ అనే నేను సినిమాను చేశారు. ఈ సినిమా విడుదలైన తొలిరోజు నుంచే రికార్డుల వేటను కొనసాగించింది. తొలిరోజే రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని నిర్మాత ప్రకటించారు. మొదటి వారంలో రూ.161 కోట్లు, రెండు వారాలకు రూ. 190 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు ఈ చిత్రం మరో మైలురాయిని చేరుకుంది. మూడు వారాల్లో రూ.205 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. మహేశ్ ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ తన తదుపరి (25వ) చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారు. -
తమిళనాడు వెళ్లనున్న ‘భరత్’...?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం మంచి కలెక్షన్సతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక చెన్నైలోను విడుదలై, అక్కడ కూడా మంచి వసూల్లు సాధించింది. దాంతో ఈ చిత్నాన్ని తమిళంలోను అనువాదించాలని చిత్న నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని, అయితే విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి చిత్ర యూనిట్‌నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా కైరా అద్వానీ కథానాయకిగా నటించారు. -
మహేశ్ అన్న అరుదైన నటుడు.
‘‘మహేశ్, శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఎంత హిట్టో తెలిసిందే. ఆ చిత్రం అన్ని రికార్డులు తిరగరాసింది. ‘భరత్ అనే నేను’ డైలాగ్స్, ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే ఈ సినిమా ‘శ్రీమంతుడు’ని క్రాస్ చేసి, పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నా. మహేశ్ లైఫ్‌లోనే ఈ సినిమా నంబర్ వన్ అవుతుందనే నా నమ్మకాన్ని మీ అందరి ఆశీస్సులతో నిజం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు సూపర్‌స్టార్ కృష్ణ. మహేశ్‌బాబు, కియారా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజవుతోంది. ‘భరత్ అనే నేను బహిరంగ సభ’లో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన 23ఏళ్లలో హైదరాబాద్‌లో ఇలాంటి ఫంక్షన్ చూడలేదు. ఓ స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో ముఖ్యఅతిథిగా రావడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ఒరవడి. థ్యాంక్యూ తారక్(ఎన్టీఆర్). ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయి టాప్ 5లో నిలవాలి’’ అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మా ఇద్దర్నీ (మహేశ్‌బాబు, ఎన్టీఆర్) ఇలా చూస్తే మీకు (ఫ్యాన్స్)కు కొత్తగా ఉందేమో కానీ మాకు కాదు. మీరందరూ ఆయన్ని ప్రిన్స్, సూపర్‌స్టార్ అంటారు. నేను మహేశ్ అన్నా అంటాను. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలనీ, రికార్డులు తిరగ రాయాలని కోరుకుంటున్నా. ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి కూడా మహేశ్ అన్న చేసినటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఎవరూ చేయలేదు. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తున్నారు. మేం ఇప్పుడిప్పుడు చేస్తున్నాం. దానికి స్ఫూర్తి ఆయనే. ఆయన చాలా అరుదైన నటుడు. అలాగే ఉండనిద్దాం. ‘భరత్ అనే నేను’ ఆయన కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోవాలి. నాది, శివగారి జర్నీ ‘బృందావనం’తో మొదలైంది. సమాజం పట్ల బాధ్యత కలిగిన దర్శకుడు ఆయన’’ అన్నారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘కృష్ణగారి అబ్బాయి అనే నేను... తమ్ముడు తారక్ నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ (నవ్వుతూ). ఇక్కడ ప్రీ–రిలీజ్ ఫంక్షన్ చూస్తున్నట్లు లేదు. 100 డేస్ ఫంక్షన్‌కు వచ్చినట్లు ఉంది. తారక్ ‘ఆది’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు నేను వెళ్లాను. ఇప్పుడు తను నా సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఐ థింక్ ఇక ఫంక్షన్ల ట్రెండ్ మారుద్ది. అందరు హీరోలు వెళతారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉంది ఐదారుగురు పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఏడాదికి ఒక్కో సినిమానే చేస్తాం. అందరి సినిమాలూ ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేం మేం బాగానే ఉంటాం. మీరూ మీరే (ఫ్యాన్స్) ఇంకా బాగుండాలి. సీయం క్యారెక్టర్ అనగానే కాస్త భయం వేసింది. ఎందుకంటే రాజకీయాలు నాకు అసలు సంబంధం లేదు. కానీ శివగారు కథ చెప్పినప్పుడు ఇన్స్పైర్ అయ్యాను. ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాను. ‘శ్రీమంతుడు’ సినిమా నా కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. మళ్లీ అదే టర్నింగ్ పాయింట్ రాబోతోంది. దానయ్యగారు సినిమా గ్రాండ్‌గా ఉండాలంటారు. సినిమా అలానే ఉంటుంది. దేవికి నేను పెద్ద ఫ్యాన్. మొన్న ‘రంగస్థలం’ చూశాను. మా సినిమాకు, ‘రంగస్థలం’కు ఫుల్ డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు.‘భరత్ అనే నేను’ థీమ్ సాంగ్, ‘వచ్చాడయ్యో సామి..’ సాంగ్స్ నా కెరీర్లోనే ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సినిమాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్. ఎంతమందికి తెలుసో కానీ.. ఏప్రిల్ 20న మా అమ్మ ఇందిరమ్మగారి పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు, దీవెనలకు మించింది ఇంకేమీ లేదంటారు. సో.. ఆ రోజు రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘మహేశ్‌గారికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ఫస్టాఫ్ 2:30 గంటలు, సెకండాఫ్ 2:30 గంటలు చెప్పా.ఐదు గంటలు కథ చెబుతారా? అంటారనుకున్నా. కానీ, ఆయన సినిమా కూడా ఐదు గంటలు ఉంటుందా? అని అడిగారు. మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి పాత్రలో నటించారాయన. నాకొక గ్రాండ్ సినిమా ఇవ్వండన్నారు దానయ్యగారు. అందుకు తగ్గట్టే ఖర్చుకు వెనకాడకుండా తీశారు. నాకంటే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి మంచి పాటలిచ్చారు దేవిశ్రీ. రామజోగయ్యశాస్త్రిగారు ప్రాణం పెట్టి మంచి లిరిక్స్ ఇచ్చారు. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి పిచ్చి ఫ్యాన్ అయిపోతా. నాతో పోలిస్తే మీరు (అభిమానులు) నథింగ్. మహేశ్, తారక్, రామ్‌చరణ్ అంతా స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. అభిమానులు కూడా ఇలాగే కలిసుండాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో ఇంత పెద్ద సినిమా చేసినందుకు కొరటాల శివగారికి రుణపడి ఉంటా. మహేశ్‌గారితో సినిమా చేయాలనే కోరిక ఇంత మంచి సినిమాతో తీరినందుకు ఆనందంగా ఉంది. ‘భరత్ అనే నేను’ సినిమా ఎంత గొప్పగా ఉంటుందని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారో అంతకంటే గొప్పగా ఉంటుందని హామీ ఇస్తున్నా. ఈ నెల 20న సినిమా చూస్తే మీరే ఈ మాట అంటారు’’ అన్నారు డీవీవీ దానయ్య. ‘‘కొరటాలగారి నాలుగు సినిమాలకూ నేనే సంగీతం అందించా. డీవీవీగారి బ్యానర్లో చేసే అవకాశం ఇచ్చిన దానయ్యగారికి థ్యాంక్స్. మహేశ్ సూపర్‌స్టారే కాదు. ఆయన హార్ట్ కూడా సూపర్‌స్టారే’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. -
నినదిస్తా నిత్యం జనహితం
‘‘పాలించే ప్రభువును కానని, సేవించే బంటును నేనని.. అధికారం అర్థం ఇదని తెలిసేలా.. చేస్తా నా పని’’ అని ప్రజాప్రతినిధిగా హామీ ఇస్తున్నాడు భరత్ రామ్. అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి అని ప్రశ్నిస్తున్నాడు. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. ఇందులో కియారాఅద్వాని కథానాయిక. సీయం భరత్ రామ్ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఫారిన్ వెళ్లనుంది చిత్రబృందం. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ను ఆదివారం రిలీజ్ చేశారు.‘‘విరచిస్తా నేడే నవశకం, నినదిస్తా నిత్యం జనహితం.. దిస్ ఈజ్ మీ’’ అంటూ సాగే ఈ సాంగ్ శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన చిత్రం ఫస్ట్ లుక్, ఫస్ట్ ఓత్ అండ్ విజన్ ఆఫ్ భరత్‌కు మంచి స్పందన లభించింది. ఆదివారం రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్‌కు ఆడియన్స్ రెస్పాన్స్ సూపర్. రామజోగయ్యశాస్త్రి రాసిన అద్భుతమైన సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ వీనుల విందైన సంగీతం తోడైంది. డేవిడ్ సిమన్ అంతే అద్భుతంగా పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఏప్రిల్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మహేశ్ సినిమాతో ఎంట్రీ షురూ
ఒక్కొక్కరుగా టీమ్‌లో యాడ్ అవుతున్నారు. ఎవరి టీమ్‌లో అంటే.. మహేశ్‌బాబు టీమ్‌లో. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్ పతాకాలపై ‘దిల్’ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్, లొకేషన్స్ హంట్ కంప్లీట్ చేసిన చిత్రబృందం ఇప్పుడు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్గా కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసిన చిత్రబృందం, ఇప్పుడు లేటెస్ట్గా బాలీవుడ్ కెమెరామేన్ కేయు మోహనన్‌ను టీమ్‌లోకి తీసుకున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసింది. ‘డాన్, తలాష్, రాయీస్’ వంటి హిందీ చిత్రాలకు కెమెరామేన్‌గా వర్క్ చేశారు మోహనన్. తెలుగు సినిమాకి ఆయన వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ఏప్రిల్‌లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. -
27న గుమ్మడికాయ పాలాభిషేకం
అవును.. 27న ‘భరత్ అనే నేను’కి గుమ్మడికాయ కొట్టేస్తారట. ఏ 27న అంటే వచ్చే నెల అన్నమాట. ఆ రోజుకల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసి, గమ్మడికాయ కొట్టేయనున్నారు. ఇక సినిమా రిలీజ్ రోజున అభిమాన హీరో కటౌట్స్‌కి ఫ్యాన్స్ ఎలానూ పాలాభిషేం చేస్తారు కదా. ఏప్రిల్ 27కి మహేశ్‌బాబు అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అయిపోవచ్చు. సీయం భరత్‌గా మహేశ్‌బాబు నటిస్తోన్న చిత్రం ‘భరత్ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను మార్చి 27కల్లా కంప్లీట్ చేసి, ఏప్రిల్ 27న విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేసినట్లు సమాచారం. శ్రీమంతుడు’ వంటి హిట్ సినిమా తర్వాత మహేశ్–కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ‘ఫస్ట్ ఓత్’ కు విశేష స్పందన లభించింది. మహేశ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తిరు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. -
భరత్ అనే నేను
... శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని...’’ ఆంధ్రప్రదేశ్ సీయంగా శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు మహేశ్‌బాబు. కొరటాల శివ దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఇందులో కియారా అద్వాని కథానాయిక. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు మహేశ్‌బాబు వాయిస్ ఫస్ట్ ఓత్‌ను, ఎనిమిది గంటలకు లోగో, తొమ్మిది గంటలకు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. కాగా, మహేశ్ ప్రమాణ స్వీకారం విన్నవాళ్లు అచ్చు ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గొంతులానే ఉందంటున్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు జరిగే ఫిక్షనల్ పొలిటికల్ డ్రామా ఇది. సినిమా ప్రమోషన్‌కు రిపబ్లిక్ డే మంచి సందర్భమని భావించి ప్రమోషన్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు కొరటాల శివ. ‘‘ఫస్ట్ లుక్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రామ్–లక్ష్మణ్ నేతృత్వంలో క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ కాంబినేషన్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దానయ్య. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఏప్రిల్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సంచలన విషయం చెప్పిన కొరటాల
-
మహేష్ సినిమా.. సంచలన విషయం చెప్పిన కొరటాల
సాక్షి, హైదరాబాద్ : మహేష్‌బాబుతో తాజాగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ చేస్తున్న చిత్రానికి సంబంధించి సంచలన విషయం చెప్పారు. దాదాపు సినిమా కథను ఆయన ముందే ప్రకటించారు. మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కథగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్నే తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై కథను అల్లుకొని, రాజకీయ అంశాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఓత్ అనే పేరిట శుక్రవారం ఉదయం 7గంటలకు (రిపబ్లిక్ డే) సందర్భంగా వీడియోకు బదులు ఓ ఆడియోను విడుదల చేస్తున్నట్లు కూడా చెప్పారు. వీడియోగా కాకుండా ఆడియోగా విడుదల చేస్తే ఇంపాక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు తెలిపారు . -
పుంజుకోవడానికే..
సంక్రాంతికి మన పందెం కోళ్లు ఫెస్టివల్ బ్రేక్ తీసుకున్నాయి. డ్యూయెట్లు పాడి, ఫైట్లు చేసి, సెంటిమెంట్లు పండించి, పంచ్ డైలాగ్‌లు కొట్టి, అలసి సొలసి పుంజుకోవడానికి బ్రేక్ తీసుకున్నారు. సంక్రాంతికి సైరా ఫుల్ ఫెస్టివల్ మూడ్. ‘సైరా’ టీమ్ ఫుల్ ఫెస్టివల్ మూడ్‌లో ఉంది. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను కంప్లీట్ చేశారు. ఫిబ్రవరిలో నెక్ట్స్ షెడ్యూల్‌ను పొలాచ్చిలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే.. ‘సైరా’ టీమ్ హ్యాపీగా పండగ చేసుకోవచ్చు. బ్రేక్‌కి గురిపెట్టారు పోలీసాఫీసర్‌గా నాగార్జున మరో హిట్‌పై గురిపెట్టి బుధవారం నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. నాగార్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌వర్మ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి రెండు రోజులు బ్రేక్ వచ్చేలా చిత్రబృందం షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించనున్నారని సమాచారం. నాన్‌స్టాప్ షూట్ గురూ... ‘గురు’ రిలీజై పది నెలలైంది. నెక్ట్స్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అని వెంకటేశ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వెంకీ స్లో అయ్యారనుకుంటున్నారేమో? ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తేజతో ఒక సినిమా, త్రివిక్రమ్‌తో ఒక సినిమా, అనిల్ రావిపూడి సినిమా లైన్లో ఉన్నాయి. వీటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుంది? అన్నది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న. ప్రస్తుతానికి బ్రేక్‌లో ఉన్న వెంకీ వన్స్ షూట్ లోకి ఎంటరైతే ఏడాదంతా నాన్‌స్టాప్‌గా చేస్తారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి.. మూడు సినిమాలంటే అంతే కదా. బ్రేక్ తీసుకునే వీలు ఎక్కడుంటుంది? పండగ బ్రేక్ తర్వాత గురు సెట్లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది. బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు మహేశ్‌బాబు. అలాంటిది పెద్ద పండగ సంక్రాంతికి ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయించకుండా ఉంటారా? ఆల్రెడీ కేటాయించారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు 13న ప్యాకప్ చెబుతారట. సో.. పండగకు సెలవు దొరికేసినట్లే. ఆల్రెడీ ఇప్పుడు మహేశ్‌బాబు బ్రేక్‌లో ఉన్నారు. ఇలా షూటింగ్లో పాల్గొని, అలా ఐదు రోజులు చేసి బ్రేక్ తీసుకుంటారు. బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ అన్నమాట. స్టార్ట్ చేస్తే ఆగేది లేదు కెరీర్లో ఎప్పుడూ తీసుకోనన్ని రోజులు ఎన్టీఆర్ బ్రేక్ తీసుకున్నారు. ‘జై లవ కుశ’ రిలీజై మూడు నెలలకు పైగా అయింది. ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ కాలేదు. త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ మేకోవర్కి దాదాపు రెండు నెలలు పడుతుంది. లాంగ్ బ్రేక్‌కి ఇదే కారణం అయ్యుంటుంది. ఈ గ్యాప్‌లో మేకోవర్‌పై దృష్టి పెడుతూనే ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్ వెళ్లారు. సో... పండక్కి సెలవే. బహుశా వచ్చే నెల షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగేది లేదు. చిట్టిబాబుకు సెలవు రీసెంట్గా రామ్‌చరణ్ ఎక్కువగా గడుపుతున్నది పల్లెటూరిలోనే. ఈపాటికే మీకు అర్థం అయ్యుంటుంది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘రంగస్థలం’ సినిమా గురించి మాట్లాడు తున్నామని. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు. ప్రజెంట్ హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌కు 12వ తేదీ తర్వాత సంక్రాంతి సెలవులు ఇస్తారట. పండగ తర్వాత రాజమండ్రిలో స్టార్టయ్యే కొత్త షెడ్యూల్లో రామ్‌చరణ్ పాల్గొంటారు. బ్రేక్ ఉందోయ్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ షూటింగ్‌తో అల్లు అర్జున్ బిజీ. ఈ చిత్రం ‘ఫస్ట్ ఇంపాక్ట్’కి వచ్చిన రెస్పాన్స్ సూపర్బ్. సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా చేసినందుకు యూనిట్ ఫుల్ హ్యాపీ. మామూలుగా బన్నీ ఎనర్జిటిక్. ఇక హ్యాపీ మూమెంట్స్ అంటే జోరు పెరుగుతుంది కదా. మరి.. పండగ రోజు కూడా షూటింగ్ చేస్తారా? అంటే.. గమ్మునుండవోయ్. బ్రేక్ ఉందోయ్. పండగకి ముందు రోజు వరకూ షూటింగ్లో పాల్గొని, ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటారు. ఇలా స్టార్ట్ చేసి.. అలా బ్రేక్ ఒకవైపు ‘టచ్ చేసి చూడు’ సినిమా చేస్తున్నారు రవితేజ. మరోవైపు ఈరోజు నుంచి కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూట్లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. ఇలా స్టార్ట్ చేసి.. అలా బ్రేక్ తీసుకోవాలను కుంటున్నారు. నేటి నుంచి మరో వారం రోజుల పాటు జోరుగా షూటింగ్ చేస్తారు. ఆ తర్వాత పండగకు స్మాల్ బ్రేక్. జస్ట్ రెండు మూడు రోజులంతే. ఆ తర్వాత మళ్లీ షూటింగ్‌తో బిజీ అయిపోతారు. యుద్ధానికి బ్రేక్ ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. అర్జున్‌కి, కృష్ణాకి. ఒకరిది ప్యారిస్ అయితే.. మరొకరిది తిరుపతి అట. అయితే... వీరిద్దరూ యు« ద్ధం చేయడానికి రెడీ అయ్యారు. అసలు ఎవరీ ఇద్దరు అంటే.. ఇద్దరూ నానీనే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. రీసెంట్గా పాతబస్తీమే సవాల్ అంటూ విలన్స్‌ను ఇరగదీశాడు నాని. సంక్రాంతి పండక్కి జస్ట్ టు డేస్ బ్రేక్ తీసుకుని మళ్లీ షూట్లో జాయిన్ అవుతారు. అంటే.. యుద్ధానికి టు డేస్ బ్రేక్ అన్నమాట. మరోవైపు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మిస్తున్న ‘అ’ సినిమా టీజర్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫెస్టివల్... లాంగ్ బ్రేక్ కొత్త పెళ్లికొడుకు నాగచైతన్య పెళ్లి తర్వాత జస్ట్ కొన్ని రోజులే బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత ‘సవ్యసాచి’ షూటింగ్‌తో బిజీ. చైతూ–సమంత పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్. ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ హిందూ ఫెస్టివల్ సంక్రాంతి. క్రిస్మస్ పండగను ఈ జంట బాగానే జరుపుకున్నారు. ప్రస్తుతం ‘సవ్యసాచి’ షూటింగ్‌తో బిజీగా ఉన్న చైతూ 11, 12తేదీల వరకూ ఈ సెట్స్‌లోనే ఉంటారు. ఆ తర్వాత పండగకి బ్రేక్ ఇస్తారు. ఇది రెండు మూడు రోజుల బ్రేక్ కాదు. నెలాఖరు వరకూ ఈ యూనిట్ బ్రేక్ తీసుకుంటారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో మళ్లీ షెడ్యూల్ మొదలవుతుంది. ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి.. ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి పండగ చేసుకోబోతున్నారు వరుణ్ తేజ్. ప్రేమకు ఫుల్స్టాప్ పడితే ఎవరైనా పండగ చేసుకుంటారా అనుకుంటున్నారా? వరుణ్ ముగింపు పలికింది సినిమా లవ్‌కి. ప్రస్తుతం ‘తొలి ప్రేమ’ అనే లవ్‌స్టోరీ మూవీలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సాంగ్ షూట్ జరుగుతోంది. పండగకి ముందే ఇది పూర్తయిపోతుంది. దీంతో సినిమా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో.. పండగ షురూ. ‘అల్లరి’ నరేశ్, శర్వానంద్, సాయిధరమ్ తేజ్‌తో పాటు మరికొందరు హీరోలు సంక్రాంతికి బ్రేక్ తీసుకోబోతున్నారు. -
లైక్ డాడ్ లైక్ సన్
ప్యారాగ్లైడింగ్ చేయాలంటే గుండెలో దమ్ముండాలి. మరి.. ఆకాశంలో అంత ఎత్తున ఎగరడమంటే మాటలా? మహేశ్‌బాబుకి ఆ దమ్ముంది. అందుకే రివ్వున ఎగిరారు. డాడీకి తగ్గ సన్ గౌతమ్. ‘నేను కూడా చేయగలను’ అంటూ ధైర్యంగా ప్యారాగ్లైడింగ్కి రెడీ అయ్యాడు. న్యూ ఇయర్ సందర్భంగా మహేశ్ తన భార్యపిల్లలు నమ్రత, గౌతమ్, సితారలతో కలసి హాలిడే ట్రిప్ వెళ్లారు. ఒమన్‌లో భర్త, కొడుకు చేసిన సందడిని నమ్రత సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. అంతకుముందు మహేశ్ చాలాసార్లు ప్యారాగ్లైడింగ్ చేశారు. ఈసారి గౌతమ్ కూడా ఉత్సాహపడ్డాడు. తండ్రీ కొడుకులిద్దరూ గాల్లో కొద్ది సేపు చక్కర్లు కొట్టారు. ‘‘గౌతమ్ తొలిసారిగా ప్యారాగ్లైడింగ్ చేశాడు. అప్పుడే పిల్లలు పెద్దవాళ్లు అయిపోతున్నారు’’ అని ఈ సందర్భంగా నమ్రత పేర్కొన్నారు. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత మహేశ్‌బాబు తిరిగి ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. -
అచ్చ తెలుగుకట్టులో...
ప్యాంటు–షర్టు.. సూటూ బూటు.. ఇలా ఎన్ని వేసుకున్నా పంచె కట్టులో ఉండే అందమే వేరు. అందుకే హీరోలు పంచె కట్టుకుని కనిపిస్తే అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతారు. హీరోలు కూడా ఫ్యాన్స్‌ని ఆనందపరచడానికి సీన్ డిమాండ్ మేరకు పంచె కట్టుకుంటారు. మహేశ్‌బాబు తన ఫ్యాన్స్‌కి పంచె కట్టులో కనిపించి, కనువిందు చేయనున్నారని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం (‘భరత్ అనే నేను’ టైటిల్ పరిశీలనలో ఉంది) రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ పాటలో మహేశ్ పంచెకట్టులో కనిపిస్తారట. ‘శ్రీమంతుడు’లో మహేశ్‌తో గళ్ల లుంగీ కట్టించారు కొరటాల. ఇప్పుడు పంచె కట్టుకోవడానికి మహేశ్‌ని ఒప్పించారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తమిళనాడులోని కారైకుడిలో జరుగుతోంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలసి చిన్న ఫారిన్ ట్రిప్‌కు వెళతారట. -
న్యూ ఇయర్‌కి నయా లుక్
ఈ ఇయర్ ఎండింగ్ ఎంతో దూరంలో లేదు. 2017కి గుడ్ బై చెప్పి న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పడానికి ఎవరి ప్లానులు వాళ్లు వేసుకుంటున్నారు. మహేశ్‌బాబు మాత్రం ఇంకా ప్లాన్ చేసుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ 13 నుంచి 26 వరకూ మహేశ్ బిజీ. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న (‘భరత్ అనే నేను’ టైటిల్ పరిశీలనలో ఉంది) చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇది. త్వరలో మహేశ్ లుక్‌ని విడుదల చేయాలనుకుంటున్నారు. బహుశా న్యూ ఇయర్ కానుకగా నయా లుక్‌ని రిలీజ్ చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించడం, అదే తేదీని ముందుగానే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ బృందం ప్రకటించడంతో డేట్ క్లాష్ ఇష్యూ సీన్లోకొచ్చిన విషయం తెలిసిందే. ‘బన్నీ’ వాసు, దానయ్య ఈ విషయంలో ఓ అండర్‌స్టాండింగ్‌కి రావాలనుకుంటుండగా ఏప్రిల్ 27న ‘2.0’ని రిలీజ్ చేస్తామనే ప్రకటన వచ్చింది. దాంతో మరో ఇష్యూ మొదలైంది. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమాని ఏప్రిల్ 13న విడుదల చేస్తారని రెండు మూడు రోజులుగా ఓ వార్త హల్చల్ చేస్తోంది. ‘‘ఇంకా ఏమీ అనుకోలేదు. ‘బన్నీ’ వాసు గోవాలో ఉన్నారు. ఆయన హైదరాబాద్ రాగానే మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తాం’’ అని ‘సాక్షి’తో దానయ్య అన్నారు. సో.. ప్రస్తుతానికి ముందు ప్రకటించిన రిలీజ్ డేట్ ఏప్రిల్ 27 అలానే ఉంది. ఏది ఏమైనా ఇటు ‘భరత్ అనే నేను’ అటు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ నిర్మాతలిద్దరూ విడుదల తేదీ విషయంలో వివాదం చేయకుండా సామరస్యంగానే పరిష్కరించుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. -
నో కన్ఫ్యూజన్... ఫుల్ క్లారిటీ!
‘రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. ఎందుకంటే... కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను’ – ‘బిజినెస్‌మేన్’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్ ఇది! జస్ట్... పూరి జగన్నాథ్ సినిమాలో, పూరి రాసిన హీరో క్యారెక్టర్‌కు తగ్గట్టు చెప్పిన డైలాగ్ మాత్రమే. రియల్ లైఫ్‌లో మహేశ్ కన్ఫ్యూజ్ కావడమనే క్వశ్చనే లేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నారు. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సి. అశ్వనీదత్, ‘దిల్’ రాజు నిర్మించనున్న సినిమా ప్రీ–ప్రొడక్షన్ పనులు, కథపై కాన్సంట్రేట్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి సినిమా తర్వాత చేయబోయే సినిమా కోసం కథలు కూడా వింటున్నారు. చుట్టూ ఎంత మంది దర్శకులున్నా... ఎన్ని పనులున్నా... నో కన్ఫ్యూజన్! ఫుల్ క్లారిటీతో ఓ పని పూరై్తన తర్వాత మరో పని మీద దృష్టి పెడుతున్నారు. కొరటాల శివ సినిమాకు ‘భరత్ అనే నేను’ టైటిల్ పరిశీలనలో ఉందనే సంగతి తెలిసిందే. ఆ సినిమా చిత్రీకరణ పూరై్తన వెంటనే వంశీ పైడిపల్లి సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారట.మధ్యలో విశ్రాంతి కూడా తీసుకోరని సమాచారమ్. వచ్చే ఏడాది మార్చికి ‘భరత్ అనే నేను’ చిత్రీకరణ అంతా పూర్తవుతుందట! నెక్ట్స్... వంశీ పైడిపల్లి సినిమాలో మహేశ్‌బాబుకు జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్‌ను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారట!! ఆల్రెడీ అమెరికాలో దర్శక–నిర్మాతలు ఈ సినిమా కోసం లొకేషన్లు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో మూడు పాటలు ఫైనలైజ్ చేశారు. మహేశ్ రెడీ అనగానే షూటింగ్ స్టార్ట్ చేసేయడమే!! -
మహేశ్ ఫ్యామిలీ@డిస్నీల్యాండ్!
డిస్నీల్యాండ్ మాత్రమే కాదు... టుమారోల్యాండ్, హాలీవుడ్ స్టూడియో వంటివి ఎన్నో... పిల్లలు ఎంజాయ్ చేసే ఎమ్యూజ్మెంట్ పార్కులు, మంచి మంచి ప్లేసులను హాలిడే ట్రిప్‌లో మహేశ్‌బాబు ఫ్యామిలీ కవర్ చేస్తున్నారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు తిరుగుతున్నారట! స్పెషాలిటీ ఏంటంటే... కొన్ని ప్లేసులకు బై రోడ్ వెళ్లారట! మహేశ్ ఫ్యామిలీతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఫ్యామిలీ ఈ ట్రిప్‌కి వెళ్లారని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు గౌతమ్‌కృష్ణ, కుమార్తె సితారలు నవీన్ ఎర్నేని పిల్లలతో బాగా కలసిపోయారు. ఇక్కడున్న ఫొటోలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓ యాడ్ షూటింగ్ కోసం మహేశ్ అమెరికా వెళ్లారు. ఆయనతో పాటు నమ్రత, గౌతమ్, సితారలు కూడా వెళ్లారు. నవీన్ ఎర్నేని ఫ్యామిలీ కూడా వెళ్లడం, అక్కడ రెండు కుటుంబాలూ ఎంజాయ్ చేయడం జరిగింది. మరో రెండు రోజుల్లో ఇండియా వచ్చేస్తారట! వచ్చీ రాగానే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న షూటింగ్‌తో మహేశ్ బిజీ అవుతారు. -
రంగు పడుద్ది!
అవును... రంగుల పండుగ ముసుగులో భరత్ మీద ఎటాక్ చేయాలనుకున్న రౌడీలందరి నోటి నుంచి రంగు పడుతుందట! హోలీ సందడిలో సంతోషంగా ఉన్న సామాన్యులకు ఇబ్బంది లేకుండా... సీయం భరత్ రౌడీల బెండు తీస్తాడట! కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమాలో మహేశ్‌బాబు ముఖ్యమంత్రి భరత్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా కోసం హోలీ నేపథ్యంలో ఓ ఫైట్ తీశారని ‘సాక్షి’ పాఠకులకు తెలియజేసింది. మహేశ్, కొరటాల కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’లో మామిడి తోట ఫైట్ ఎంత హైలైట్ అయ్యిందో... అంతకు మించి ఈ హోలీ ఫైట్ హైలైట్ అవుతుందని సినిమా యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారమ్. హీరోయిజమ్ అండ్ స్టైల్ ఏమాత్రం తగ్గకుండా ఈ ఫైట్‌ను డిజైన్ చేశారట! స్క్రీన్ మీద విలన్స్ రంగు పడుతుంటే... థియేటర్లో స్క్రీన్ ముందు అభిమానులు ఎగరేసే రంగు రంగుల పేపర్లు పడతాయేమో! ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత ఫ్యామిలీతో కలసి మహేశ్ ఫారిన్ వెళ్లారు. ఈ నెల 20వ తేదీ తర్వాత తిరిగొస్తారని తెలుస్తోంది. 26 నుంచి పొల్లాచ్చిలో కొరటాల సినిమా కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. బీటౌన్ బ్యూటీ కియారా అలీ అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే! -
ట్రింగ్.. ట్రింగ్... త్రీ ట్యూన్స్ రెడీ
యాక్షనా? ఫ్యాక్షనా? ఫ్యామిలీయా?... ఏంటి? మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న స్టోరీ బ్యాక్‌డ్రాప్ ఏంటి? అనే చర్చలు మొదలయ్యాయి. అప్పుడే చెప్పేస్తామా? టూ ఎర్లీ అమ్మా అన్నట్లు చిత్రబృందం సైలెంట్‌గా ఉంటోంది. అయితే, మ్యూజిక్ సిట్టింగ్స్ మాత్రం జరుగుతున్నాయి. ఆ విషయం మాత్రం చెప్పారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. న్యూయార్క్‌లో వంశీ పైడిపల్లి–దేవిశ్రీ–చిత్రనిర్మాత ‘దిల్’ రాజు పాటల పని మీద ఉన్న విషయం తెలిసిందే. ఆల్రెడీ మూడు పాటలకు ట్యూన్స్ ఫైనలైజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌కి స్టోరీ తెలుస్తుంది కదా. అందుకే ‘అమేజింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్క్రిప్ట్. అందరికీ నచ్చేలా ఉంది’ అని హింట్ ఇచ్చారు దేవిశ్రీ. జనవరిలో ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. కాగా, ఈ చిత్రానికి ‘హరేరామ హరేకృష’్ణ, ‘కృష్ణాముకుందా మురారి’ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయనే వార్త వచ్చింది. ఆ వార్త నిజం కాదని వంశీ పైడిపల్లి స్పష్టం చేశారు. -
కోటలో మహేశ్!
అవునా... కోట ఎక్కడ ఉందేంటి? హైదరాబాద్‌లో! నిజమా... పేరేంటో? చిరాన్ ఫోర్ట్! ఊరుకోండి... ఈ రోజుల్లో రాజులు, కోటలు ఎక్కడున్నాయ్? అనుకుంటున్నారా! ఇప్పుడు మన దేశంలో రాజులు లేరు గానీ, వారసత్వ సంపదగా కోటలను మాత్రం మనకు వదిలారు... వాళ్ల పరిపాలనకు గుర్తుగా! అలాంటి కోటల్లో చిరాన్ ఫోర్ట్ ఒకటి. ఇప్పుడీ కోటలో మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా చిత్రీకరిణ జరిగింది. జూన్‌లో ఓసారి, ఇప్పుడోసారి (గత వారంలో) మూడేసి రోజులు మహేశ్, ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సిన్మాలో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు. మహేశ్‌కి జోడీగా బీటౌన్ బేబీ కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల కానున్న ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరకర్త. -
రాముడా... కృష్ణుడా..!
రాముడిలా యుద్ధనీతి పాటించి శత్రువులను గెలుస్తాడా? లేక కృష్ణుడిలా మాయ చేసి విజయం సాధిస్తాడా? ఇంతకీ మహేశ్‌బాబు రాముడా..! కృష్ణుడా..! ఇదిగో... ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో మహేశ్ సినిమా టైటిల్ గురించి ఇలాంటి చర్చే జరుగుతోంది. ‘బృందావనం’, ‘ఊపిరి’ వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘కృష్ణాముకుందా మురారి’, ‘హరేరామ హరేకృష్ణ’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారట. అయితే మహేశ్‌బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా రిలీజ్ కాకముందు నుంచే మహేశ్‌బాబు–వంశీ కాంబోకి ‘కృష్ణాముకుందా మురారి’ టైటిల్ రిజిస్టర్ అయ్యిందన్న వార్తలు ఉన్నాయి. అంతేకాకుండా ‘మురారి’ సినిమా మహేశ్ కెరీర్లో హిట్ చిత్రంగా నిలిచింది. సో... ఈ రెండింటి ప్రకారం ‘కృష్ణాముకుందా మురారి’ టైటిల్‌నే ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు. అధికారిక ప్రకటన వచ్చే లోపు ఇంకెన్ని టైటిల్స్ సీన్లోకొస్తాయో చూడాలి. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్లను సెట్ చేసేందుకు డైరెక్టర్ వంశీ యూఎస్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. లొకేషన్స్‌ని ఫైనలైజ్ చేసిన తర్వాత డైరెక్టర్ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్, నిర్మాత ‘దిల్’రాజు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెడతారట.. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. -
అమెరికాలో రెక్కీ!
నహీ చోడేంగే భాయ్... న్యూయార్క్‌లో హర్ గల్లీకో గుమాంగే – మహేశ్‌బాబుది కాదీ డైలాగ్! దర్శకుడు వంశీ పైడిపల్లిది! న్యూయార్క్‌లో గల్లీ గల్లీ తిరుగుతున్నారాయన. ఏదీ వదలడం లేదు. గ్యాంగ్‌తో కలసి గల్లీలన్నిటిలో చక్కర్లు కొడుతున్నారు. వాట్ ఈజ్ దిస్? వాట్ హ్యాపెన్డ్ టు వంశీ? అని ఆరా తీస్తే... నెక్ట్స్ ఇయర్లో కొన్నాళ్లు మహేశ్ అడ్డాగా అమెరికానే ఫిక్స్ చేశారీ దర్శకుడు! మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్’ రాజు ఓ సిన్మా నిర్మించనున్న సంగతి తెలిసిందే. అమెరికా బేస్డ్ స్టోరీతో ఈ సినిమా రూపొందనుంది. మహేశ్ అడ్డాగా ఏయే లోకేషన్లు బాగుంటాయోనని వంశీ అండ్ కో అమెరికాలో రెక్కీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ చేస్తున్నారు మహేశ్. ఇది పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది వంశీ పైడిపల్లి సినిమా మొదలు కానుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఇప్పుడు లోకేషన్స్, ఇతర ఆర్టిస్టుల్ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. రొమాన్స్ విత్ రకుల్... ఎగైన్!? ‘స్పైడర్’లో సూపర్‌స్టార్ మహేశ్‌తో రొమాన్స్ చేశారు రకుల్. మళ్లీ ఆన్‌స్క్రీన్ మహేశ్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ ఆమెకు వచ్చిందని ఫిల్మ్‌నగర్ టాక్! అంతకు ముందు ఎప్పుడో ఓసారి మహేశ్–వంశీ పైడిపల్లి సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే అనే వార్తలొచ్చాయి. కానీ, అది నిజం కాదట! ముంబయ్ భామలతో పాటు పలువుర్ని స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత మహేశ్‌కి జోడీగా రకుల్ అయితే బెటరనే అభిప్రాయానికి వచ్చారట! -
'తొలగించకపోతే ఆందోళనలకు దిగుతాం..'
హైదరాబాద్ (రామాంతపూర్): ఇటీవల విడుదలైన స్పైడర్ చిత్రంలో శ్మశానంలో పని చేసే కాటికాపర్లను కించపరుస్తూ ఉన్న సన్నివేశాలను తొలగించాలని రాష్ట్ర కాపర్ల సంఘం అధ్యక్షులు శీలం సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం రామంతాపూర్‌లోని హిందూశ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది దళితులు ఎండక, వానకు శ్మశానంలోకష్టపడుతూ కాటికాపర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, వారిని ఈ చిత్రంలో కించపర్చడం తగదని ఆయన పేర్కొన్నారు. వెంటనే సన్నివేశాలు తొలగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. సమావేశంలో స్థానిక కాటికాపర్ల సంఘం ప్రతినిధులు జంగయ్య, పరుశురాం, సత్యనారాయణ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
మౌత్ టాక్ బాగుంది... ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగారు
‘‘హీరో మహేశ్‌గారు, దర్శకుడు మురుగదాస్‌గారితో పాటు మా టీమంతా ఏ సినిమాకీ పడనంత కష్టం ఈ ‘స్పైడర్’కి పడ్డాం. ప్రేక్షకులకు మంచి సందేశంతో పాటు కొత్త కథను, కొత్తదనంతో కూడిన సినిమాను ఇవ్వాలనుకున్నాం. కొత్తదనమంటే కొంత రిస్క్ తప్పదు. ఆ రిస్క్ తీసుకునే సినిమా చేశాం. ఫస్ట్ రెండు మూడు షోలకు కాస్త మిక్డ్స్ టాక్ వచ్చినా... మెజారిటీ ఆడియన్స్‌కి సినిమా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగారు’’ అన్నారు ‘ఠాగూర్’ మధు. మహేశ్‌బాబు హీరోగా ఆయన సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ‘స్పైడర్’ బుధవారం విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ‘స్పైడర్’కి మంచి స్పందన లభిస్తోందంటున్న ‘ఠాగూర్’ మధు చెప్పిన విశేషాలు... ► తమిళంలో మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ వచ్చింది. బహుశా... అక్కడ కొంచెం అంచనాలు తక్కువ ఉండడం కారణమనుకుంటున్నా. కేరళలోనూ మంచి టాక్ వచ్చింది. ‘స్టార్ హీరో అయ్యిండి కథకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇటువంటి సినిమా చేయడం మహేశ్ గొప్పతనం’ అని రజనీకాంత్‌గారు అన్నారు. తెలుగులోనూ పలువురు ప్రముఖులు సినిమా బాగుందని చెప్పారు. దర్శకుడు సురేందర్‌రెడ్డిగారు మొదటి రోజే రెండుసార్లు సినిమా చూశానన్నారు. ‘హీరో ఇమేజ్, స్టార్డమ్ పక్కన పెట్టినప్పుడు ఇటువంటి మంచి కథలొస్తాయి. సినిమా అద్భుతంగా ఉంది’ అని సురేందర్‌రెడ్డి అన్నారు. ప్రేక్షకులు చాలా క్లియర్‌గా ఉన్నారు. 90 శాతం మంచి మౌత్‌టాక్‌ను బట్టి వెళ్తున్నారు. మెజారిటీ ప్రేక్షకులు సినిమా బాగుందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు రోజుల్లో 72 కోట్ల రూపాయలు (గ్రాస్) ‘స్పైడర్’ కలెక్ట్ చేసింది. ► తెలుగు సినిమా పరిధి పెరగాలన్నా, ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నా... భారీ బడ్జెట్‌తో మంచి క్వాలిటీ సినిమాలు తీయక తప్పదు. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. 20, 30 భాషల్లో తెలుగు సినిమాను విడుదల చేయగల కెపాసిటీ ఉంది. తెలుగు సినిమా మార్కెట్ పెంచాలనే ఉద్దేశంతోనే అరబిక్‌లోనూ ‘స్పైడర్’ను రిలీజ్ చేశాం. అక్కడ కూడా మంచి స్పందన వస్తోంది. ఆస్ట్రేలియాలో ప్రీమియర్ షో కలెక్షన్స్ బాగున్నాయి. -
సినిమాను 150సార్లు చూశా : మహేశ్
‘‘సిన్మాలో చాలా ఎగ్జయిటింగ్ అంశాలున్నాయి. హైలైట్స్ ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని దాచిపెట్టాం!’’ అన్నారు మహేశ్‌బాబు. ఆయన హీరోగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘స్పైడర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. రేపు రిలీజవుతున్న ఈ సిన్మా గురించి మహేశ్ చెప్పిన ముచ్చట్లు... ► సిన్మాలో ఇంటిలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఆఫీసర్‌గా నటించా. టీజర్లో చూపించిన ‘స్పైడర్’ సిన్మాలో ఉండదు. హీరో క్యారెక్టర్ని పరిచయం చేయడం కోసం కాన్సెప్ట్ బేస్డ్గా టీజర్‌ను షూట్ చేశాం. ∙ ► ‘స్పైడర్’ తెలుగు, తమిళ్ వెర్షన్స్ వేర్వేరుగా ఉంటాయి. తెలుగుకి, తమిళ్‌కి కొందరు నటీనటులు మారతారు. అలాగే రెండు భాషలకు సంబంధించిన సీన్స్‌ని వెంట వెంటనే షూట్ చేయడంతో తెలుగు, తమిళ్ డైలాగ్స్ మాట్లాడేవాణ్ణి. అదో కొత్త ఎక్స్పీరియన్స్! అందుకే.. కొరటాల శివగారితో ప్రస్తుతం చేస్తున్న ‘భరత్ అనే నేను’ చాలా ఈజీగా ఉంది. జస్ట్ తెలుగులో డైలాగులు చెబితే చాలు.. సీన్ కంప్లీట్ అయిపోతోంది. ఇంతేనా అనిపిస్తోంది. ‘స్పైడర్’ అనేది హీరో–విలన్ కథ. సిన్మాకు విలన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మురుగదాస్‌గారు కథ చెప్పిన రెండు నెలల తర్వాత ‘మన సినిమాలో ఎస్.జె. సూర్య విలన్’ అన్నారు. ఫస్ట్... నాకేం అర్థం కాలేదు. దర్శకుడిగా అతను నాకు బాగా తెలుసు. రెండు రోజులు ఆలోచించాక అతనే విలన్‌గా పర్ఫెక్ట్ అనుకున్నా. ఎస్.జె. సూర్య నటించిన తమిళ సినిమాలు చూశా. బ్రిలియంట్ యాక్టర్! మురుగదాస్‌గారిపై గౌరవంతో తమిళ నటుడు భరత్ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ► ‘స్పైడర్’లో డ్యూయల్ రోల్ చేశారట? అనడిగితే... అదే నిజమైతే ప్రోమో లో వేసేవాళ్లమన్నారు. మీరు, నమ్రతగారు ఈ సిన్మా చూశారా? అనడిగితే... ‘‘నమ్రత చూడలేదు. నేనిప్పటివరకూ 150సార్లు చూశా’’ అని మహేశ్ చమత్కరించారు. -
ఆయన దర్శకత్వంలో నటించడం మోస్ట్ మెమొరబుల్
తమిళసినిమా: ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడం అన్నది నా కెరీర్లోనే మోస్ట్ మెమొరబుల్‌గా భావిస్తున్నానని స్పైడర్ చిత్రంతో నేరుగా కోలీవుడ్‌కు రంగప్రవేశం చేస్తున్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పేర్కొన్నారు. టాగూర్ మధు సమర్పణలో ఎన్వీ.ప్రసాద్ నిర్మించిన భారీ ద్విభాషా చిత్రం స్పైడర్. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హారీష్‌జయరాజ్ సంగీతం అందించారు. మహేశ్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన ఇందులో ఎస్జే.సూర్య, భరత్ ప్రతినాయకులుగా నటించడం విశేషం. ఈ చిత్రాన్ని తమిళంలో లైకా సంస్థ విడుదల చేయనుంది. టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ భారీ అంచనాలు సంతరించు కున్న స్పైడర్ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం మద్యాహ్నం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మహేశ్‌బాబు సహకారంతోనే.. చిత్ర దర్శకుడు ఏఆర్.మురగదాస్ మాట్లాడుతూ తమిళం, తెలుగు అంటూ ద్విభాషా చిత్రం చేయడం తనకు పెద్ద సవాల్‌గా మారిందన్నారు. అలాంటిది ఈ చిత్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన పూర్తి సహకారంతో చాలా సులభం చేశారని పేర్కొన్నారు. మరో నాలుగేళ్ల తరువాత కూడా చూసేలా చిత్రం ఉండాలని ఆయన తనతో అన్నారన్నారు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు రీఎంట్రీ అవుతున్నారని అన్నారు. 10 రెట్లు అధికంగా గుండె కొట్టుకుంటోంది: మహేశ్‌బాబు మాట్లాడుతూ స్పైడర్ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోందని, అయితే ఇప్పటి నుంచే తన గుండె 10 రెట్లు అధికంగా కొట్టుకుంటోందని అన్నారు. తమిళంలో చిత్రం చేయాలన్న కోరిక చాలా కాలంగా ఉందని, దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కలిసి స్పైడర్ కథ చెప్పడంతో దీన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ చేస్తే బాగుంటుందని భావించామని చెప్పా రు. మంచి కథ లభిస్తే మళ్లీ తమిళంలో నటిస్తానని మహేశ్‌బాబు అన్నారు. స్పైడర్ చిత్రం తనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ చిత్రంలో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ అన్నారు. స్పైడర్ చిత్రం మహేశ్‌బాబు కెరీర్లోనే దిబెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని నిర్మాత ఎన్వీ.ప్రసాద్ పేర్కొన్నారు. -
ఆర్టీఏ కార్యాలయంలో మహేష్‌బాబు
హైదరాబాద్: సినీ హీరో మహేష్‌బాబు శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. తన కారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్వయంగా వచ్చిన మహేష్ బాబు వేలిముద్ర పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అరగంట అనంతరం తిరిగి వెళ్లిపోయారు. -
శిల్పా మోహన్‌రెడ్డికి మహేష్ ఫ్యాన్స్ మద్దతు
-
శిల్పా మోహన్‌రెడ్డికి మహేష్ అభిమానుల మద్దతు
నంద్యాల: సూపర్ స్టార్ కృష్ణ, హీరో మహేష్‌బాబు అభిమానులతో సోమవారం వైఎస్ఆర్సీపీ నేత ఆదిశేషగిరిరావు భేటీ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. తాము సోమవారం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటారని అభిమాన సంఘం ప్రతినిధులు చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. -
హీరో మహేశ్ కు కోర్టు నోటీసు
హైదరాబాద్: మహేశ్ బాబు సినిమా ‘శ్రీమంతుడు’పై వివాదం ముదురుతోంది. హీరో మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత ఎర్నేని నవీన్ లకు కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 3న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవలను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారని శరత్ చంద్ర అనే నవలాకారుడు ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు చిత్ర నిర్మాణ బృందంలో కొందరికి ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఎంబీ క్రియేషన్, మైత్రిమూవీస్ పతాకంపై తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ మహేశ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘శ్రీమంతుడు’ స్ఫూర్తితో పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మహేశ్ కూడా రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. -
’శ్రీమంతుడు’కి కోర్టు సమన్లు
హైదరాబాద్: హిట్ చిత్రంగా పేరొంది.. మహేశ్ బాబు కెరీర్లోనే గొప్ప చిత్రంగా నిలిచిన ‘శ్రీమంతుడు’కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. తాను రాసిన నవలను ఆధారంగా శ్రీమంతుడు చిత్రంగా మలిచారని శరత్ చంద్ర అనే నవలాకారుడు వేసిన పిటిషన్‌ను ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సువర్ణ రాజు చిత్ర నిర్మాణ బృందంలో కొందరికి సమన్లు జారీ చేశారు. ఎంబీ క్రియేషన్ అధినేత, మైత్రిమూవీస్ అధినేత ఎర్నేని నవీన్, దర్శకుడు కొరటాల శివకు మంగళవారం కోర్టుల సమన్లు పంపించింది. గతంలో ఇదే కేసు విషయంలో సివిల్ కోర్టులో కూడా కేసు నమోదు చేశారు. హిందీలో ఇదే చిత్రాన్ని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తీయబోతున్న విషయం తెలిసి ఇంజక్షన్ ఆర్డర్ కోసం సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఇదిలా ఉండగానే తాజాగా క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది. స్వాతి మాస పత్రికలో తాను ‘చచ్చేంత ప్రేమ’ అనే శీర్షికతో రాసిన నవలను శ్రీమంతుడు చిత్రంగా మలిచారని ఆరోపిస్తూ కుట్రపూరిత నేరం ఐపీసీ 120బి కింద కేసు నమోదు చేయాలని కోరుతూ క్రిమినల్ కోర్టులో శరత్చంద్ర కేసు వేశారు. దీని ప్రకారమే తాజాగా సమన్లు జారీ చేశారు. -
చిరు, బాలకృష్ణ మూవీలపై ప్రిన్స్ ఏమన్నారంటే...
హైదరాబాద్: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సంక్రాంతి బిగ్ సినిమా సంబరాలపై స్పందించారు. ట్విట్టర్ ద్వారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మహేష్ ' ఖైదీ నెం.150, 'గౌతమి పుత్రి శాతకర్ణి' సినిమాలపై వరస ట్వీట్లలో ప్రశంసల జల్లు కురిపించారు. సాధారణంగా సినిమాలపై చాలా తక్కువగా స్పందించే ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ , మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సెన్సేషనల్ మూవీలపై ట్విట్టర్ ద్వారా స్పందిండం విశేషం. తన బీజీ షెడ్యూల్ లో ఈ రెండు సినిమాలను చూడటానికి సమయం కుదుర్చుకున్న మహేష్ .. ఖైదీ150,గౌతమి పుత్రి శాతకర్ణి విజయాలపై హర్షం వ్యక్తం చేశారు. రెండు సినిమాల టీములకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ బిగ్ మూవీలతో సంక్రాంతి సంబరాల వర్షం కురుస్తోందంటూ అభినందనలు తెలిపారు. అలాగే 150 వ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మిస్.. అయ్యాం..వెల్ కం బ్యాక్ అన్నారు. ఆయన లుక్స్ అద్భుతమనీ, తన మ్యాజిక్ తో అత్యంత ఉన్నతంగా నిలిచారని మహేష్ ట్వీట్ చేశారు. మరోవైపు మీ విజన్ కు, కన్విక్షన్ కు హ్యట్స్ ఆఫ్ అంటూ నందమూరి బాలకృష్ణ ను ఉద్దేశించి కమెంట్ చేశారు. గౌతమి పుత్ర శాతకర్ణిలో ఆయన నటన టాలీవుడ్ లో ఉత్తమమైన ప్రదర్శనగా నిలుస్తుందని కొనియాడారు. It's raining hits in TFI !! Got some time off to watch both the Sankranthi biggies .. — Mahesh Babu (@urstrulyMahesh) January 14, 2017 Hats off to #NBK for the portrayal of #GPSK! It will remain as one of the finest performances of TFI. — Mahesh Babu (@urstrulyMahesh) January 14, 2017 Missed u all these years sir..welcome back .. Congrats to the entire team of #KhaidiNo150. — Mahesh Babu (@urstrulyMahesh) January 14, 2017 -
నేను ప్రేమిస్తున్నదెవరినో తెలుసా?
ప్రతి మనిషి జీవితంలోనూ ఒక భాగమైన ప్రేమ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.నటి ప్రణీతను తన అభిప్రాయాన్ని తెలపమన్నప్పుడు ప్రేమ అన్నది ఏదో ఒక దశలో ప్రతిఒక్కరికి కలుగుతుందన్నారు.అయితే తనకు మాత్రం ఇంకా ఆ దశ రాలేదన్నారు.తమిళంలో ఉదయన్ చిత్రంతో పరిచయం అయిన ఈ భామ ఆ తరువాత శకుని,మాస్ తదితర చిత్రాలలో నటించారు.అయితే ఇప్పటికీ మంచి విజయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారన్నది గమనార్హం.తమిళంలో ఎక్కువగా నటించడం లేదే అన్న ప్రశ్నకు ప్రణీత బదులిస్తూ మంచి అవకాశాలు లభిస్తే తానెందుకు నటించనూ,అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాననీ అన్నారు. అయితే తాను తెలుగు,కన్నడం భాషా చిత్రాలతో బిజీగానే ఉన్నాననీ చెప్పారు.ముఖ్యంగా తెలుగులో తను హోమ్లీ ఇమేజ్ ఉందని అన్నారు.జూనియర్ ఎన్గీఆర్,పవన్‌కల్యాణ్,మహేశ్‌బాబు లాంటి ప్రముఖ హీరోలతో నటించాననీ,ఇప్పుడు కూడా నటిస్తున్నాననీ తెలిపారు.కోలీవుడ్‌లో ఎక్కువగా నటించక పోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అయితే ప్రస్తుతం తమిళంలో జయ్‌కి జంటగా ఎనక్కు వాయ్Oద అడిమైగళ్,అధర్వతో కలిసి జెమినీగణేశనుమ్ సురళిరాజానుమ్ చిత్రాల్లో నటిస్తున్నానీ తెలిపారు. ఈ చిత్రలు విడుదలనంతరం తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని అన్నారు.సరే మీతో కలిసి నటించిన నటి సమంత లాంటి వాళ్లు ప్రేమించి పెళ్లికి సిద్ధం అవుతున్నారు.మీరు ఎవరినైనా ప్రేమించారా?అన్న ప్రశ్నకు తాను ప్రేమిస్తున్నాను.ఎవరినో తెలుసా సినిమాని అని తెలివిగా బదులిచ్చారు.ప్రస్తుతానికి సినిమాను తప్ప వేరెవరినీ తాను ప్రేమిచండం లేదని ప్రణీత పేర్కొన్నారు. -
జనవరిలో సెట్స్ పైకి మహేష్,కొరటాల సినిమా
మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న కొరటాల శివ.. తాజాగా 'జనతా గ్యారేజ్' హిట్‌తో టాప్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. 'జనతా గ్యారేజ్' తో తారక్ కెరీర్లోనే పెద్ద హిట్ అందించిన కొరటాల తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడనేది అంతటా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్‌తో తన నెక్స్ట్ ఫిల్మ్ ఉంటుందని కొరటాల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మరో సినిమాపై అప్పుడే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా గురించి కొరటాల శివ మాట్లాడుతూ.. మహేష్‌తో చేయబోయే రెండవ సినిమా కూడా శ్రీమంతుడులానే మంచి కథతో ఉంటుందన్నారు. అలాగే జనవరి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని, మహేష్ ఇమేజ్‌కు సరిపడేలా ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని కొరటాల తెలిపారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. -
సినీనటుడు మహేష్‌బాబు జన్మదిన వేడుకలు
షాద్‌నగర్‌రూరల్ : సినీనటుడు ప్రిన్స్ మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా ఆల్ఇండియా కష్ణమహేష్ ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌ఘోరీ ఆధ్వర్యంలో మంగళవారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఖాదర్‌ఘోరీ మాట్లాడుతూ తెలుగు అభిమానుల గుండెల్లో మహేష్ బాబు చెరగని ముద్ర వేసుకున్నారని భవిష్యత్‌లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాహంగీర్, కిరణ్, మల్లికార్జున్, ప్రవీన్, హర్షద్, తయ్యబ్ తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వర థియేటర్లో.. మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా పట్టణంలోని పరమేశ్వరి థియేటర్లో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి.కష్ణారెడ్డి హాజరై కేక్ కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో అభిమానులు ప్రవీణ్, అంజి, అక్బర్, నాగేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. సిద్ధాపూర్(కొత్తూరు): మండలంలోని సిద్ధాపూర్లో మంగళవారం శివాజీయూత్ ఆధ్వర్యంలో మహేష్‌బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ దత్తత గ్రామంలో అభిమానులు, యువజన సంఘం సభ్యులు కేక్‌కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. త్వరలో రక్తదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం మణివర్ధన్‌రెడ్డి, నర్సింహ, నరేందర్‌రెడ్డి, మహేందర్, గోపాల్, ప్రశాంత్, కిరన్, ప్రభాకర్‌రెడ్డి, అయోధ్యరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
మహేశ్‌తో అక్షయ్‌కుమార్ ఢీ?
రజనీకి విలన్‌గా ‘2.0’లో ఓ భయంకరమైన విలన్ పాత్రలో అక్షయ్‌కుమార్ లుక్ చాలా కాలం క్రితం వరకూ నెట్టింట్లో హల్చల్ చేసింది. సౌత్‌లోకి ‘రోబో’ సీక్వెల్లాంటి ఓ భారీ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇస్తున్న అక్షయ్‌కుమార్ మరో క్రేజీ మూవీలో నటించనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తారని సమాచారం. ఆ మధ్య ఈ చిత్రంలో విలన్‌గా తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్యను అనుకున్నారట. కానీ, అనుకోని కారణాలతో ఆయన తప్పుకున్నారని బోగట్టా. మురుగదాస్‌కు అక్షయ్‌కుమార్‌తో మంచి అనుబంధమే ఉంది. అక్షయ్‌కుమార్ హీరోగా తమిళ చిత్రం ‘తుపాకీ’ని మురుగదాస్ హిందీలో రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు మహేశ్‌కు విలన్‌గా అక్షయ్‌కుమార్ అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. -
ఉత్సవం లాంటి చిత్రం
‘‘‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. కుటుంబం, బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు అన్నీ కలగలసిన చిత్రం ఇది. సినిమాలాగా కాకుండా ఓ ఉత్సవంలా ఉంటుంది’’ అని కాజల్ అగర్వాల్, సమంత అన్నారు. మహేశ్‌బాబు హీరోగా కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా, ఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె నిర్మించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ నెల 20న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా కాజల్, సమంత తమ అనుభూతులను ఈ విధంగా పంచుకున్నారు. సింపుల్‌గా.. హోమ్లీగా... - కాజల్ * ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలిసి, ‘నటించాలా? వద్దా?’ అని మొదట ఆలోచించా. కానీ, శ్రీకాంత్ అడ్డాలగారు చెప్పిన కథ, అందులో నా పాత్ర నచ్చడంతో నటించేందుకు ఒప్పేసుకున్నా. ఒక హీరో, ముగ్గురు హీరోయిన్లు, చాలామంది నటులతో సినిమా తీయడమంటే మామూలు విషయం కాదు. శ్రీకాంత్‌గారు అన్ని క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇస్తూ చక్కగా హ్యాండిల్ చేశారు. * ఇందులో నా పాత్ర పేరు కాశి. ఎన్ఆర్ఐ గర్ల్‌గా నటించా. ఎన్ఆర్ఐ అంటే మోడ్రన్ అమ్మాయిలా ఉండను. వెరీ సింపుల్‌గా, హోమ్లీ గర్ల్‌లా ఉంటా. నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్ర ఇది. ‘డార్లింగ్’ చిత్రంలోనూ ఎన్ఆర్ఐ అమ్మాయి పాత్రయినా, బబ్లీ గర్ల్‌గా చేశా. ‘బ్రహ్మోత్సవం’లో ప్రాక్టికల్‌గా ఆలోచించే పాత్ర. * మహేశ్‌బాబుగారితో మొదట ‘బిజినెస్ మేన్’ చేశా. రెండో చిత్రం ‘బ్రహ్మోత్సవం’. అప్పటికీ ఇప్పటికీ ఆయన అంతే అందంగా ఉన్నారు. మహేశ్ వెరీ స్పాంటేనియస్ యాక్టర్. పోటీ ఉన్నా కూడా చాలా పాజిటివ్ మైండ్‌తో ఆలోచిస్తారాయన. దట్స్ వెరీ గ్రేట్. * ఈ చిత్రంలో రేవతి, జయసుధ వంటి సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయడం వల్ల నటనలో కొత్త విషయాలు చాలా నేర్చుకున్నా. ఆనందంగా... సందడిగా... - సమంత * మానవతా విలువలు దృష్టిలో ఉంచుకుని శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. ‘బ్రహ్మోత్సవం’ కూడా ఆ కోవలోకే వస్తుంది. అటువంటి చిత్రాలు ఆయన బాగా తీయగలరు. ఎక్కడెక్కడో ఉండే కుటుంబ సభ్యులు, బంధువులంతా ఓ చోట కలిస్తే ఎంత ఆనం దంగా, సందడిగా ఉంటుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్.. ఇలా అన్నీ ఉంటాయి. నేను ఆంగ్లో-ఇండియన్ని. నా మూలాలు ప్రపంచం అంతా ఉంటాయి. మా బంధువులందర్నీ కలుసుకోవాలంటే ప్రపంచం మొత్తం చుట్టేయాలి (నవ్వుతూ). * మహేశ్‌బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘దూకుడు’ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చేశా. ఈ సినిమాలో ఆయన్ను చూస్తే వయస్సు వెనక్కి వెళ్లిపోయినట్లు కనిపి స్తుంది. అంత అందంగా ఉన్నారు. ప్రత్యేకించి టైటిల్ సాంగ్‌లో చాలా అందంగా కనిపిస్తారు. * నా ఫేవరేట్ నటి రేవతితో కలిసి ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉంది. అంత సీనియర్ అయినా కూడా సెట్లో ‘ఇది నా ఫస్ట్ సినిమా.. నేను నటిస్తున్న మొదటి రోజు ఇదే’ అనే భావనలో ఉంటారు. * ఈ చిత్రంలో ఫ్యామిలీ మెంబర్స్‌తో నాకు సన్నివేశాలు తక్కువ. మహేశ్, ‘వెన్నెల’ కిశోర్‌తో ఎక్కువ ఉంటాయి. * పీవీపీగారు మంచి నిర్మాత. రత్నవేలు కెమేరా, తోట తరణి గారి ఆర్ట్ చాలా ప్లస్. హరిద్వార్, ఉదయ్‌పూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎండ, దుమ్ము బాగా ఉండేది. అయినా రత్నవేలుగారు నన్ను అందంగా చూపించారు. * ‘బ్రహ్మోత్సవం’ లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నా. ప్రేక్షకులకు ఇటువంటి సినిమాలు అవసరం. సమంత మంచి నటి అనిపించుకోవాలన్నదే ప్రస్తుతానికి నా లక్ష్యం. -
సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేసిన మహేష్
హైదరాబాద్: వరుస హిట్లతో దూసుకుపోతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చాడు. తన అప్ కమింగ్ మూవీ ఆడియో మరికొద్ది గంటల్లో విడుదల కానుండగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కోసం ఓ సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ప్రిన్స్ కు జతగా సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత సుభాష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన బ్రహ్మోత్సవం సినిమాలోని 'వచ్చింది కదా అవకాశం' సాంగ్ మేకింగ్ వీడియోను మహేష్ బాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బ్రహ్మోత్సవం మ్యూజిక్ బిగిన్స్ అంటూ కమెంట్ చేశారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీనటులతోపాటు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అంతా ఈ సాంగ్ మేకింగ్‌పై తమ అభిప్రాయాన్ని పంచుకోవడంవిశేషం.అభిమానులందరూ పండగ చేసుకుంటున్న ఆ వీడియో మీ కోసం. కాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియో వేడుక శనివారం సాయంత్రం జరగనుండగా మే 27న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మణిశర్మ సహకారం అందిస్తున్నాడట. మరోవైపు ఆడియో వేడుకలో రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. #VacchindiKadaAvakasamMaking #BrahmotsavamMusicBegins!!https://t.co/0XIwmNkoks — Mahesh Babu (@urstrulyMahesh) 7 May 2016 -
ఎవరికో చెప్పులు తొడిగే స్టిల్‌తో మహేశ్ అదుర్స్
హైదరాబాద్: మొన్నటికి మొన్న శ్రీమంతుడిగా వచ్చి తన అభిమానుల నోటితోనే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా టన్నుల కొద్ది మూటగట్టుకున్న టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. బ్రహ్మోత్సవం చిత్రంతో కూడా అలాంటి ప్రశంసలే అందుకోనున్నారా అంటే అవుననే అనిపిస్తుంది తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర యూనిట్ తెలుగువారి లోగిళ్లలో ఉగాది సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఉగాది శుభాకాంక్షలు పేరిట విడుదల చేసింది. ఈ పోస్టర్ ఎంత అద్భుతంగా ఉందంటే.. చూడగానే సినిమా నిండా తెలుగుదనం ఉట్టిపడనుందా అన్నట్లుగా ఉంది. ఈ పోస్టర్లో మహేశ్ బాబు చక్కగా వైట్ కోట్, బ్లూ జీన్స్ వేసి ఒక కాలు మడిచి మరో కాలు మొకాలిని నేలకు తాకించి ఎంతో వినయంగా ఓ వ్యక్తి పాదాలకు చెప్పులు తొడుగుతున్నాడు. వినయం, విధేయత, బంధాలు,బంధుత్వాలు, సంప్రదాయం అన్ని కలిపితేనే ఈ బ్రహ్మోత్సవం అని ఒక నిర్ణయానికి రావొచ్చేమో అనిపిస్తుంది. నిజంగా ఈ ప్రచార చిత్రంలో మహేశ్ బాబు పదహారేళ్ల కుర్రాడి అంత అందంగా మెరిసిపోయాడు. -
మేకింగ్ ఆఫ్ 'భలే మంచి రోజు'
-
ప్యారిస్ లో ప్రిన్స్
హైదరాబాద్ : అటు సినిమాలు, ఇటు యాడ్స్ అంటూ బిజీబిజీగా గడిపే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రస్తుతం తన భార్యాబిడ్డలతో ప్యారిస్ పర్యటనలో హ్యాపీగా ఉన్నాడు. కేవలం కెరీర్ కాకుండా కుటుంబం కూడా తనకు చాలా ముఖ్యమని ఎపుడూ చెప్పే ఈ టాలీవుడ్ ప్రిన్స్ పిల్లా పాపలతో దసరా సెలవులను ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను మహేష్ భార్య, నటి నమ్రతా శిరోద్కర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ తన పిల్లలతో ఎంజాయ్ చేస్తూ సమయం గడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గౌతమ్ కృష్ణ, సితార కూడా ఎంతో క్యూట్ గా ఈ టూర్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ఫొటోలు ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. నవ్వుతూ.. తుళ్లుతూ.. మహేష్ బాబు తన పిల్లలు ఇద్దరిని దగ్గరకు హత్తుకుని మురిసిపోతున్న వైనం ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. వరుస విజయాలతో మహేష్ బాబు ఈ మధ్య కాలంలో తన జోరు పెంచారు. శ్రీమంతుడు సినిమా సాధించిన ఘనవిజయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని గ్రామాలను దత్తతకు తీసుకుని అభిమానులను, ప్రజలను మరింత చేరువయ్యాడు. కెరియర్ లో ఎపుడూ తలమునకలై ఉండే ఈ హీరో ఇఫ్పుడు బ్రహ్మోత్సవం చిత్ర నిర్మాణంలో కొంత గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్ చెక్కేశాడు. -
ఇంతకీ ఆ సినిమాలో ఏముంది?
-
ఇంతకీ ఆ సినిమాలో ఏముంది?
'తనీఒరువన్' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దక్షిణాదినే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడు ఎం రాజా తెరకెక్కించిన ఈ క్రైం థ్రిల్లర్ స్టార్ హీరోలను కూడా ఆకర్షిస్తుంది. అందుకే దాదాపు అన్ని భాషల్లో ఈ సినిమా రీమేక్ కు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అసలు అంతగా టాప్ స్టార్స్‌ను ఆకర్షించడానికి ఈ సినిమాలో ఏముంది. 'తనీఒరువన్' ఓ థ్రిల్లర్ కథాంశం. ఐపీఎస్ పాసైన హీరో మిత్రన్ ( జయం రవి ) ప్రొబేషన్‌లో ఉండగా తన మిత్రులతో కలిసి నగరంలో జరుతున్న నేరాల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో తమతో కలిసిన మహిమ ( నయనతార ) తో ప్రేమలో పడతాడు. నగరంలో జరుగుతున్న చిన్న చిన్న నేరాల వివరాలను సేకరించిన మిత్రన్ ఈ నేరాలన్నింటి వెనకాల ఉన్న వ్యక్తి ఒకడే అని గ్రహిస్తాడు. పద్మశ్రీ అవార్డ్ గ్రహిత అయిన ఫేమస్ సైంటిస్ట్ సిద్దార్ధ్ అభిమన్యు ( అరవింద్ స్వామి ) తన వ్యక్తిగత అవసరాల కోసం సైన్స్‌ను, పాలిటిక్స్‌ను తప్పుదారిలో ఉపయోగిస్తున్నాడని తెలుసుకొని అతని ఆటకట్టిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఇన్విస్టిగేషన్ డ్రామాలా సాగే తనీఒరువన్.., సెకండ్ హాఫ్ అంతా మైండ్ గేమ్‌లా నడుస్తుంది. కేవలం స్క్రిప్ట్ మీద 9 నెలల పాటు వర్క్ చేసిన దర్శకుడు రాజా ప్రతీ సీన్లోనూ క్లారిటీ చూపించాడు. థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో ఒక్క ఫ్రేమ్ కూడా ఆడియన్ బోర్ ఫీలవ్వకుండా తెరకెక్కించాడు. జయం రవి, అరవింద్ స్వామి, నయనతారల నటన, ఎం రాజా డైరెక్షన్ ఇలా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అవ్వటంతో 'తనీఒరువన్' టాక్ ఆఫ్ ద ఇండియన్ సినిమాగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు మరో నాలుగు పరిశ్రమలు 'తనీఒరువన్' రీమేక్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఒరిజినల్ వర్షన్ దర్శకుడు ఎం రాజా తెలుగులో మహేష్ బాబు హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే మహేష్ ఇంత వరకు రీమేక్ సినిమా చేయలేదు. దీంతో మహేష్ కాకపోతే రామ్ చరణ్ తో అయినా రీమేక్ చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే హిందీలో సల్మాన్ హీరోగా తనీ ఒరువన్‌ను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. హిందీ వర్షన్ ను తానే డైరెక్ట్ చేయాలని భావిస్తున్నాడు దర్శకుడు రాజా. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ చూసిన సల్మాన్ టీం రీమేక్‌కు సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇక కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఈ సినిమా రీమేక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. సౌత్ లో మంచి పరిచయాలు ఉన్న జెనీలియా కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మరాఠీలో ఈ సినిమాను నిర్మించాలని ట్రై చేస్తుంది హాసిని. బెంగాలీ భాషలోనూ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం గట్టిపోటి నెలకొంది. దృశ్యం సినిమా తరువాత అదే స్ధాయిలో అన్ని భాషల్లో ఈ 'తనీఒరువన్' రీమేక్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
పాలమూరు పల్లెను దత్తత తీసుకుంటా
ట్వీటర్లో హీరో మహేశ్‌బాబు ప్రకటన సాక్షి, హైదరాబాద్: శ్రీమంతుడులో సొంత గ్రామాన్ని దత్తత తీసుకునే యువకుడి పాత్ర పోషించి సినీ ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరో మహేశ్‌బాబు నిజ జీవితంలోనూ అదే పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే తన తండ్రి కృష్ణ స్వస్థలమైన ఏపీలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్‌బాబు తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు ట్వీటర్లో ప్రకటించారు. ఈ చిత్రం విజయవంతం కావడంపై మహేశ్‌బాబుకు బుధవారం ఫోన్ చేసి శుభాకాంక్ష లు తెలిపిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. తాము చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమానికి చేయూతనివ్వాల్సిందిగా మహేశ్‌ను కోరారు. కరువు, వలసలతో అత్యంత వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా సూచిం చారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మహేశ్... గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ట్వీటర్లో ట్వీట్ చేశారు. మరోవైపు మహేశ్ నిర్ణయంపై ట్వీటర్లో కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్...ఆయన నిర్ణయం మరింత మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నట్లు రీట్వీట్ చేశారు. -
మహేశ్ కోసం పాడే అవకాశం రాలేదు: నమ్రత
హైదరాబాద్: తాను పిల్లల కోసం పాటలు పాడుతుంటానని, కానీ, తన భర్త ప్రముఖ నటుడు మహేశ్ బాబు కోసం పాట పాడే అవకాశం మాత్రం ఇంకా రాలేదని నటి, మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ అన్నారు. మహేశ్‌ను పరిణయమాడిన తర్వాత వ్యక్తిగత కుటుంబ జీవితానికే పరిమితమైన ఆమె త్వరలో విడుదల కానున్న శ్రీమంతుడు చిత్రానికి సంబంధించి కొన్ని అనుభూతులు పంచుకున్నారు. శ్రీమంతుడు చిత్రం ద్వారా మహేశ్ దంపతులు కో-ప్రొడ్యూసర్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ప్రశ్నించగా బాలీవుడ్లో చాలామంది హీరోలకు స్వంత ప్రొడక్షన్ సంస్థలు ఉన్నాయని, అలాగే, తమ బడ్జెట్ తగినట్లుగా కో-ప్రొడ్యూసర్‌గా మారడం వల్ల అసలైన ప్రొడ్యూసర్స్‌కు కొంత భారం తగ్గినట్లవుతుందని చెప్పారు. అమలలాగా రెండో ఇన్నింగ్స్ మొదలు పెడతారా అని ప్రశ్నించగా, అమల పిల్లలు పెద్దవారయ్యారని, తన పిల్లలు ఇంకా చిన్న పిల్లలే అయినందున ఇంకా అలాంటి ఆలోచన చేయలేదని అన్నారు. అయినా, మహేశ్‌తో ఇలాంటి జీవితం చాలా బాగుందని, లోటనే విషయమే గుర్తురావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల గురించి మాట్లాడుతూ 'మా కుమారుడు గౌతమ్ కోసం మహేశ్ చిత్రంలోని పాటలు పాడి వినిపిస్తానని, అలాగే కూతురు సితార కోసం ప్రాజెన్ చిత్రంలోని 'లెట్ ఇట్ గో' అనే పాట పాడి వినిపిస్తానని తెలిపారు. ఇక వ్యక్తిగతంగా తనకు ప్రస్తుతం శ్రీమంతుడు చిత్రంలోని రామా రామా అనే పాట ఇష్టమని తెలిపారు. మీ వారి కోసం పాటపాడలేదా అని ప్రశ్నించగా ఒక్కసారిగా నవ్వులు పూయిస్తూ.. మహేశ్కోసం పాడే అవకాశం ఇంకా రాలేదంటూ మురిసిపోయారు. -
'బాహుబలి' ప్రభంజనం ఊహించలేదు:మహేష్
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి... వసూళ్లలో సంచలనాలు నమోదు చేస్తున్న'బాహుబలి' సినిమా విజయంపై టాలీవుడ్ సూపర్ హీరో మహేష్ బాబు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతుందని అస్సలు ఊహించలేదని ప్రిన్స్ ఉప్పొంగిపోతున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు తెలుగు సినీ పరిశ్రమకు లభించడం గర్వకారణమన్నాడు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన తరువాత బాహుబలి సృష్టించిన ప్రభంజనాన్నిచూస్తే తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని ట్విట్ చేశాడు. ఈ ఘనవిజయానికి కారణమైన సినిమా యూనిట్ అందరికీ మహేష్ ప్రత్యేక అభినందనలు తెలిపాడు. కాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కలలపంట 'బాహుబలి' రూ. 300 కోట్లు వసూళ్లవైపు పరుగులు పెడుతోందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. మొదటి భాగం 'బాహుబలి-ది బిగినింగ్' పేరుతో రిలీజ్ కాగా, రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. Proud that SS Rajamouli is from our Telugu film industry:) — Mahesh Babu (@urstrulyMahesh) July 16, 2015 Never did I imagine that a Telugu film would smash all BO records in our country and across the globe ..real proud :) — Mahesh Babu (@urstrulyMahesh) July 16, 2015 Just got back from Switzerland and caught the phenomenon Bahubali..goosebumps.. — Mahesh Babu (@urstrulyMahesh) July 16, 2015 -
అదో మధుర జ్ఞాపకం: మహేష్ బాబు
హైదరాబాద్ : తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, జీవితంలో తండ్రి కావడం మధురమైన జ్ఞాపకమని ప్రముఖ సినీహీరో, ప్రిన్స్ మహేష్‌బాబు అన్నారు. తాను తండ్రినైన క్షణంలో మరచిపోలేని అనుభూతులు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సందర్భంగా బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గౌతమ్ పుట్టినప్పుడు చేతుల్లోకి వాడిని తీసుకున్న క్షణాలను మాటల్లో వర్ణించలేనన్నారు. మన చేతుల్లో చిన్నారులు కేరింతలు కొడుతుంటే ఆ ఆనందానికి వెల కట్టలేమన్నారు. రెయిన్బో ఆస్పత్రిలో గౌతం, కూతురు సితార పుట్టినప్పుడు తాను పది రోజుల వరకు అక్కడి నుంచి ఇంటికి వెళ్లలేకపోయానన్నారు. సినిమా జీవితాన్ని కాసేపు పక్కనబెట్టి పిల్లలే లోకంగా ఆ సమయాన్ని ఆస్వాదిస్తుంటానని చెప్పారు. తాను పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇంట్లోని పిల్లలతో గడుపుతానని, ఆ క్షణంలో తాను కూడా పిల్లాడినైపోతానని మహేష్‌బాబు అన్నారు. ఆ క్షణంలో మానసిక, శారీరక ఒత్తిడి ఒక్కసారిగా పోతుందన్నారు. పిల్లలతో గడిపేందుకు తండ్రికి ప్రత్యేకంగా తండ్రుల దినోత్సవం అవసరం లేదన్నారు. 'శ్రీమంతుడు' చిత్రం బాగా వచ్చిందని, ఇందులో శృతిహాసన్ చాలా బాగా నటించిందని ప్రశంసించారు. తన కొత్త సినిమా మరో మూడు నెలల్లో ప్రారంభమవుతుందని, తనకు బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదన్నారు. -
మహేష్‌పై మనసు పారేసుకున్న శ్రద్దాకపూర్
-
మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన సమన్శెట్టీ
-
గల్లా కుటుంబానికి ఘట్టమనేని షాక్!
గల్లా కుటుంబానికి ఘట్టమనేని వారు షాక్ యిచ్చారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఇంటల్లుడిని ఊరించి ఉస్సూరనిపించారు. స్టార్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకున్న గల్లా జయదేవ్ ఆశలపై ఆయన మామ సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్‌బాబు నీళ్లు చల్లారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన జయదేవ్ సినిమా గ్లామర్‌పై ఎక్కువగా ఆధారపడ్డారు. తన అత్తింటివారు చిత్రసీమకు చెందినవారు కావడంతో ఆయన ఆశలు పెట్టుకున్నారు. తనకు మద్దతుగా కృష్ణ, మహేష్‌బాబు ప్రచారం చేస్తారని భావించారు. అయితే జయదేవ్‌కు వారు చేయిచ్చారు. ముఖ్యంగా తన బావమరిది మహేష్ తన తరపున ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జయదేవ్ భావించారు. యూత్‌లో మహేష్‌కు ఉన్న ఫాలోయింగ్ తనకు ప్లస్ అవుతుందనుకున్నారు. కానీ ప్రిన్స్ ప్రచారం ఊసే ఎత్తలేదు. తన బావకు ఓటు వేయమని ట్విటర్లో పోస్ట్ చేసి ఊరుకున్నాడు. ఇక కృష్ణ కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు. చివరి నిమిషంలో విలేకరుల సమావేశం పెట్టి తన అల్లుడికి ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రగిరి నుంచి పోటీ చేస్తున్న తన వియ్యపురాలు గల్లా అరుణకు ఓటేయమని ఆయన చెప్పకపోవడం గమనార్హం. ఇక దర్శకుడు కె. రాఘవేంద్రరావు, మరో సినిమా రచయిత తెర వెనుకుండి గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. సొంతవారు రాకపోయినా సినిమావాళ్ల సహకారంతోనే జయదేవ్ ప్రచారం చేసుకున్నారు. -
వివాదంరేపిన పోస్టర్ ఇదే!
హైదరాబాద్: మహేష్ బాబు తాజా చిత్రం ‘1-నేనొక్కడినే' పోస్టర్ విడుదల చేశారు. అది పెద్ద వివాదం రేపింది. ఇక సినిమా ఎంత సంచలనం సృష్టిస్తోందోనని సినీవర్గాల చర్చ. పైన పోస్టర్లో హీరో మహేష్ బాబు బీచ్‌లో నడుస్తుంటే హీరోయిన్ కృతి సనన్ అతని కాలి అడుగులను మోకాళ్లు, చేతులతో పాకుతూ అనుసరిస్తూ ఉంది. ఈ పోస్టర్‌ను దృష్టిలోపెట్టుకొనే హీరోయిన్ సమంత సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చేసిన వ్యాఖ్యలపై ట్విట్ల యుద్ధం జరుగుతోంది. సమంతకు సంఘీభావంగా హీరో సిద్ధార్ధ కూడా ట్వీట్ చేశారు. ఈ పోస్టర్‌పై సమంత పరోక్షంగా విమర్శలు చేయడంపట్ల ప్రిన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి సమంత హీరో పేరుగానీ, సినిమా పేరుగాని తన ట్విట్లో ప్రస్తావించలేదు. 'విడుదలకు సిద్ధమవుతున్న ఓ సినిమా పోస్టర్‌ను ఈ మధ్య నేను చూశాను. ఆ పోస్టర్లో హీరో, హీరోయిన్ని చూస్తుంటే మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది' అంటూ ట్వీట్ చేసింది. ఈ కామెంట్ '1-నేనొక్కడినే' సినిమా పోస్టర్పైనేనని ప్రిన్స్ అభిమానుల అభిప్రాయం. ఇక అభిమానుల యుద్దం ఎలా ఉంటుందో అదరికీ తెలిసిందే. వారి స్టైల్లో కొందరు నిరసన తెలుపుతుంటే, మరి కొందరు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా యుద్ధం చేస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కొందరు మహేష్ బాబుకు మద్దతు పలుకుతుంటే, మరికొందరు సమంతను సమర్ధిస్తున్నారు. సినిమాల విషయంలో ఇవన్నీ పట్టించుకోవలసిన అవసరంలేదని కొందరంటుంటే, కొంత మందికి మాత్రం ఈ పోస్టర్ అగ్రహాన్ని తెప్పించిన మాట వాస్తవం. ఈ పోస్టర్ ఆడవాళ్లను కించపరిచే విధంగా వుందని విమర్శిస్తున్నారు.