‘సర్కారువారి పాట’..షూటింగ్‌ ఎప్పుడంటే.. | mahesh babu sarkaru vaari paata shootings begins june 12 | Sakshi
Sakshi News home page

‘సర్కారువారి పాట’..షూటింగ్‌ ఎప్పుడంటే..

Published Fri, Jul 9 2021 2:25 AM | Last Updated on Fri, Jul 9 2021 7:53 AM

mahesh babu sarkaru vaari paata shootings begins june 12 - Sakshi

కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత సినిమా షూటింగ్‌లు మొదలయ్యాయి. మరి.. మహేశ్‌బాబు సెట్స్‌లోకి అడుగుపెట్టేది ఎప్పుడు? అంటే.. ఈ నెల 12న. పరశురామ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కోవిడ్‌ బ్రేక్‌కి ముందు ఈ సినిమా షూటింగ్‌ జోరుగా జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే స్పీడ్‌తో షూటింగ్‌కి రెడీ అవుతోంది ఈ చిత్రబృందం. 12 నుంచి నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరపడానికి ప్లాన్‌ చేశారు.

సోమవారం నుంచి మహేశ్‌బాబుతో పాటు సినిమాలోని కీలక తారాగణం చిత్రీకరణలో పాల్గొంటారు. టాకీ సీన్స్‌తో పాటు ఒక ఫైట్‌ని కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. కాగా, విదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. ఈ ఫారిన్‌ షెడ్యూల్‌ సెప్టెంబర్‌లో ఆరంభమయ్యే అవకాశం ఉంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇందులో కీర్తీ సురేశ్‌ కథానాయిక.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement